21-12-1989 అవ్యక్త మురళి

       21-12-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

‘‘త్రిదేవ్ (ముగ్గురు దేవతల) రచయిత ద్వారా వరదానాల ప్రాప్తి’’

ఈ రోజు త్రిదేవ్ రచయిత తమ సాకారీ మరియు ఆకారీ రచనను చూస్తున్నారు. రెండు రచనలు అతి ప్రియమైనవి అందుకే రచయిత, రచనను చూసి హర్షిస్తున్నారు. రచన సదా ‘‘వాహ్ రచయిత’’ అని సంతోషం యొక్క పాటను పాడుతుంది మరియు రచయిత సదా ‘‘వాహ్ నా రచన’’ అనే పాటను పాడుతారు. రచన ప్రియమైనది. ఎవరైతే ప్రియమైనవారు ఉంటారో, వారికి ఎల్లప్పుడూ అన్నీ ఇచ్చి సంపన్నంగా చేస్తారు. కనుక తండ్రి ప్రతి ఒక్క శ్రేష్ఠ రచనను విశేషంగా మూడు సంబంధాలతో ఎంత సంపన్నంగా చేసారు. తండ్రి సంబంధంతో దాతగా అయి జ్ఞాన ఖజానాలతో సంపన్నంగా చేసారు, శిక్షకుని రూపంలో భాగ్య విధాతగా అయి అనేక జన్మల కోసం భాగ్యవంతులుగా చేసారు, సద్గురువు రూపంలో వరదాతగా అయి వరదానాలతో జోలిని నింపుతారు. ఇది అవినాశీ స్నేహము లేక ప్రేమ. ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో, వారి లోపం మంచిగా అనిపించదు, లోపాన్ని అద్భుతంలోకి పరివర్తన చేస్తారు - ఇదే ప్రేమ యొక్క విశేషత. తండ్రికి పిల్లల లోపాలను అద్భుతంలోకి పరివర్తన చేయాలని సదా శుభ సంకల్పం ఉంటుంది. ప్రేమ కారణంగా తండ్రి పిల్లల శ్రమను చూడలేకపోతారు. ఏదైనా శ్రమ తప్పనిసరి అయితే చేయండి కానీ బ్రాహ్మణ జీవితంలో శ్రమ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దాత, విధాత మరియు వరదాత - మూడు సంబంధాలతో ఎంత సంపన్నంగా అయిపోతారంటే, శ్రమ చేయకుండానే ఆత్మిక ఆనందంలో ఉండగలరు. వారసత్వం కూడా ఉంది, చదువు కూడా ఉంది మరియు వరదానాలు కూడా ఉన్నాయి. ఎవరికైతే మూడు రూపాలతో ప్రాప్తి ఉంటుందో, అటువంటి సర్వ ప్రాప్తులు ఉన్న ఆత్మకు శ్రమ చేయాల్సిన అవసరం ఏముంటుంది! ఒక్కొసారి వారసత్వం రూపంలో లేక తండ్రిని దాత రూపంలో స్మృతి చేయండి, అప్పుడు ఆత్మిక అధికారీతనం యొక్క నషా ఉంటుంది. శిక్షకుని రూపంలో స్మృతి చేసినట్లయితే, గాడ్లీ స్టూడెంట్ అనగా భగవంతుని విద్యార్థిని అన్న భాగ్యం యొక్క నషా ఉంటుంది. సద్గురువు ప్రతి అడుగులో వరదానాలతో నడిపిస్తున్నారు. ప్రతి కర్మలో శ్రేష్ఠ మతం - వరదాత యొక్క వరదానము. ఎవరైతే ప్రతి అడుగు శ్రేష్ఠ మతంపై నడుస్తారో, వారికి ప్రతి అడుగులో కర్మలో సఫలత అనే వరదానం సహజంగా, స్వతహాగా మరియు తప్పకుండా ప్రాప్తిస్తుంది. సద్గురువు ఇచ్చే మతం శ్రేష్ఠమైన గతిని ప్రాప్తి చేయిస్తుంది. గతి-సద్గతిని ప్రాప్తి చేయిస్తుంది. శ్రేష్ఠ మతం మరియు శ్రేష్ఠ గతి. తమ మధురమైన ఇల్లు అనగా గతి, మధురమైన రాజ్యం మనగా సద్గతి. దీనినైతే ప్రాప్తి చేసుకుంటారు. కానీ బ్రాహ్మణాత్మలకు ఇంకా విశేషమైన గతి ప్రాప్తిస్తుంది. అది ఏమిటంటే, ఈ సమయంలో కూడా శ్రేష్ఠ మతం యొక్క శ్రేష్ఠ కర్మలకు సఫలత అనే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఈ శ్రేష్ఠ గతి కేవలం సంగమయుగంలోనే బ్రాహ్మణులైన మీకు ప్రాప్తిస్తుంది. అందుకే అంటారు - ఎలాంటి మతమో అలాంటి గతి అని. మరణించిన తర్వాత గతి లభిస్తుంది అని వారు భావిస్తారు. అందుకని అంతమతి సో గతి అని అంటారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీకు ఈ అంతిమ మరజీవా జన్మలో ప్రతి కర్మకు సఫలత అనే ఫలం అనగా ‘గతి’ ప్రాప్తి అయ్యేటువంటి వరదానం లభించి ఉంది. వర్తమానం మరియు భవిష్యత్తులో - సదా గతి-సద్గతి ఉండనే ఉంది. భవిష్యత్తు కోసం వేచి ఉండరు. సంగమయుగపు ప్రాప్తికి ఈ మహత్వం ఉంది. ఇప్పుడిప్పుడే కర్మ చేయండి మరియు ఇప్పుడిప్పుడే ప్రాప్తి యొక్క అధికారాన్ని తీసుకోండి. దీనిని అంటారు - ఒక చేతితో ఇవ్వడము, రెండవ చేతితో తీసుకోవడము. ఎప్పుడైనా లభిస్తుంది లేక భవిష్యత్తులో లభిస్తుంది, అని ఇలా ఓదార్చుకునే వ్యాపారం కాదు. ‘త్వరిత దానం మహాపుణ్యం’, ఇది అటువంటి ప్రాప్తి. దీనిని తక్షణ వ్యాపారం అని అంటారు. భక్తిలో, లభిస్తుంది, లభిస్తుంది... అని ఎదురుచూస్తూ ఉంటారు. భక్తిలో ఎప్పుడో అని ఉంటే, తండ్రి ఇప్పుడే తీసుకోండి’ అని అంటారు. ఆది స్థాపనలో కూడా మీ ప్రసిద్ధత ఉండేది, ఇక్కడ తక్షణమే సాక్షాత్కారం జరుగుతుంది అని మరియు అలా జరిగేది కూడా. కనుక ఆది నుండి తక్షణం యొక్క వ్యాపారం అయ్యింది. దీనినే అంటారు, రచయితకు రచన పైన గల సత్యమైన ప్రేమ. మొత్తం కల్పంలో ఇటువంటి ప్రేమ ఇంకేదీ ఉండనే ఉండదు. ఎంత ప్రసిద్ధి చెందిన ప్రేమికులున్నా కానీ ఇదైతే అవినాశీ ప్రేమ మరియు అవినాశీ ప్రాప్తి కనుక ఇటువంటి ప్రేమ ఇంకేదీ ఉండనే ఉండదు. అందుకే తండ్రికి పిల్లల శ్రమ పైన దయ కలుగుతుంది. వరదానులు సదా వారసత్వానికి అధికారులు. ఎప్పుడూ శ్రమ చేయజాలరు. భాగ్య విధాత శిక్షకుడి యొక్క భాగ్యవంతులైన పిల్లలు సదా పాస్ విత్ ఆనర్ గా అవుతారు. వారు ఫెయిల్ అవ్వరు, వ్యర్థమైన విషయాల కోసం ఫీల్ అవ్వరు.

శ్రమ చేయడానికి కారణాలు రెండే ఉంటాయి - అయితే మాయ విఘ్నాలతో ఫెయిల్ అయిపోతారు లేక సంబంధ-సంపర్కంలో, బ్రాహ్మణులతో కావచ్చు, అజ్ఞానులతో కావచ్చు - రెండు సంబంధాలలోనూ కర్మలలోకి వస్తూ చిన్న విషయాలలో వ్యర్థంగా ఫీల్ అవుతారు. దీనిని మీరు 'ఫ్లూ' యొక్క వ్యాధి అని అంటారు. ఫ్లూ ఏం చేస్తుంది? ఒకటైతే వణకడం (అలజడి) జరుగుతుంది, అక్కడ శరీరం కదులుతుంది మరియు ఇక్కడ ఆత్మ యొక్క స్థితి కదులుతుంది, మనసు కదులుతుంది మరియు ముఖం చేదుగా అయిపోతుంది. ఇక్కడ కూడా ముఖం ద్వారా చేదు మాటలు మాట్లాడడం మొదలుపెడతారు. ఇంకేం జరుగుతుంది. అప్పుడప్పుడు చలి, అప్పుడప్పుడు వేడి పెరుగుతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో, అప్పుడు లోపల ఆవేశం వస్తుంది, వేడి పెరుగుతుంది. వీరు ఇలా ఎందుకు అన్నారు, ఇది ఎందుకు చేసారు? ఇది ఆవేశము. అనుభవీలుగా ఉన్నారు కదా. ఇంకేం జరుగుతుంది? తినడం, తాగడం ఏమీ మంచిగా అనిపించదు. ఇక్కడ కూడా ఎవరైనా మంచి జ్ఞానం యొక్క విషయం వినిపించినా కూడా, అది వారికి మంచిగా అనిపించదు. చివరికి ఫలితం ఏమవుతుంది? బలహీనత వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కొంత సమయం వరకు బలహీనత నడుస్తుంది. అందుకని ఫెయిల్ అవ్వకండి, ఫీల్ అవ్వకండి. బాప్ దాదా శ్రేష్ఠమైన మతాన్ని ఇస్తారు. శుద్ధమైన ఫీలింగ్ లో ఉండండి - నేను సర్వ శ్రేష్ఠము అనగా కోటిలో ఒక్కరిగా ఉన్న ఆత్మను, నేను దేవాత్మను, మహాన్ ఆత్మను, బ్రాహ్మణాత్మను, విశేష పాత్ర ధారి ఆత్మను. ఈ ఫీలింగ్ లో ఉన్నవారికి వ్యర్థ ఫీలింగ్ యొక్క ‘ఫ్లూ’ ఉండదు. ఈ శుద్ధ ఫీలింగ్ లో ఉండండి. ఎక్కడైతే శుద్ధ ఫీలింగ్ ఉంటుందో, అక్కడ అశుద్ధ ఫీలింగ్ ఉండజాలదు. కనుక ‘ఫ్లూ’ యొక్క వ్యాధి నుండి అనగా శ్రమ నుండి రక్షింపబడతారు. మరియు సదా స్వయాన్ని ఎలా అనుభవం చేస్తారు అంటే, మేము వరదానాలతో పాలింపబడుతున్నాము, వరదానాలతో ముందుకు ఎగురుతున్నాము, వరదానాలతో సేవలో సఫలతను పొందుతున్నాము.

శ్రమ మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ చేసే అలవాటు పక్కా అయిపోయిందా? శ్రమ మంచిగా అనిపిస్తుందా లేక ఆనందంలో ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొంతమందికి శ్రమతో కూడిన పని తప్ప వేరే ఏ పని మంచిగా అనిపించదు. వారిని కుర్చీలో విశ్రాంతిగా కూర్చోబెట్టినా, మాకు కష్టపడే పని ఇవ్వండి అని అంటారు. ఇక్కడ ఇది ఆత్మ యొక్క శ్రమ. ఆత్మ 63 జన్మలు శ్రమ చేసి అలసిపోయింది. 63 జన్మలు వెతుకుతూనే ఉన్నారు కదా. ఎవరికైనా వెతకడం కష్టమనిపిస్తుంది కదా. కనుక ముందే అలసిపోయి ఉన్నారు. 63 జన్మలు కష్టపడ్డారు. ఇప్పుడీ ఒక్క జన్మ అయినా ఆనందంగా ఉండండి. 21 జన్మలంటే అది భవిష్యత్తు యొక్క విషయము. కానీ ఈ ఒక్క జన్మ విశేషమైనది. శ్రమ మరియు ఆనందము - రెండింటినీ అనుభవం చేయగలరు. భవిష్యత్తులో అయితే ఈ విషయాలన్నీ మర్చిపోతారు. మజా అయితే ఇప్పుడే ఉంది. ఇతరులు శ్రమ చేస్తున్నారు, మీరు ఆనందంలో (మజాగా) ఉన్నారు. అచ్ఛా.

టీచర్లు భక్తి చేసారా? ఎన్ని జన్మలు భక్తి చేసారు? ఈ జన్మలో అయితే చేయలేదు కదా! మీ భక్తి, ముందు జన్మలోనే పూర్తి అయింది. అయితే భక్తి ఎప్పుడు ప్రారంభం చేసారు? ఎవరి తో పాటు ప్రారంభం చేసారు? బ్రహ్మా తండ్రితో పాటు మీరు కూడా భక్తి చేసారు. ఏ మందిరంలో చేసారు? మరి భక్తిలో కూడా మీరు ఆది ఆత్మలే, జ్ఞాన మార్గంలో కూడా మీరు ఆది ఆత్మలే. భక్తి ఆదిలో అవ్యభిచారి భక్తి ఉన్న కారణంగా భక్తిలోని ఆనందము, సుఖము ఆ సమయమనుసారంగా తక్కువేమీ అవ్వలేదు. ఆ సుఖము మరియు ఆనందం కూడా తమ స్థానంలో శ్రేష్ఠంగా ఉండేవి.

మీరు భక్త మాలలో ఉన్నారా? భక్తి మీరే మొదలు పెట్టినప్పుడు భక్త మాలలో మీరు లేరా? డబల్ విదేశీయులు భక్త మాలలో ఉన్నారా? భక్తులుగా అయ్యారా లేక భక్త మాలలో ఉన్నారా? మేము ఉన్నామా లేదా, అని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు! విజయమాలలో కూడా ఉన్నారు, భక్త మాలలో కూడా ఉన్నారా? పూజారిగా అయితే అయ్యారు కానీ భక్త మాలలో ఉన్నారా? భక్త మాల వేరు. మీరైతే జ్ఞానుల నుండి భక్తులుగా అయ్యారు. వారైతే ఉన్నదే భక్తులు. కనుక భక్త మాలకు మరియు జ్ఞానుల యొక్క మాలకు తేడా ఉంది. జ్ఞానుల యొక్క మాలనే విజయమాల. మరియు ఎవరైతే కేవలం భక్తుల్లో, అమితమైన భక్తి చేసేవారో, భక్తి తప్ప మరే ఇతర విషయాలను వినాలని కూడా అనుకోరో, అటువంటివారు భక్తినే శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. కనుక భక్తుల మాల వేరు, జ్ఞానుల మాల వేరు. భక్తి తప్పకుండా చేసారు కానీ భక్త మాలలో ఉన్నారని అనరు ఎందుకంటే భక్తి పాత్ర పోషించిన తర్వాత మీ అందరూ జ్ఞానంలోకి వచ్చేది ఉంది. వారు అమితమైన భక్తి కలవారు, మీరు అమితమైన జ్ఞానులు. ఆత్మలో సంస్కారాల యొక్క తేడా ఉంది. భక్తులు అనగా సదా అడిగే సంస్కారం కలవారు. నేను నీచమైనవాడను, తండ్రి ఉన్నతమైనవారు - ఈ సంస్కారాలు ఉంటాయి. వారు రాయల్ బికారులు మరియు ఆత్మలైన మీరు అధికారీతనపు సంస్కారం ఉన్నవారు. అందుకే పరిచయం లభించడంతోనే అధికారిగా అయిపోయారు. అర్థమయిందా? భక్తులకు కూడా ఏదైనా స్థానమివ్వండి కదా. రెండింటిలో మీరే వస్తారా ఏమిటి? వారిది కూడా అర్ధకల్పం ఉంది, మీది కూడా అర్ధకల్పం ఉంది. వారు కూడా గాయన మాలలో వచ్చేదే ఉంది. వారు కూడా ప్రపంచంలోని వారి కంటే మంచివారు. వేరేవైపు బుద్ధి లేదు, తండ్రి వైపే ఉంటుంది. శుద్ధంగా అయితే ఉంటారు. పవిత్రత వలన - ‘‘గాయనయోగ్యులుగా’’ అయ్యేటువంటి ఫలితం లభిస్తుంది. మీకు పూజ జరుగుతుంది, వారికి పూజ జరగదు. కేవలం గాయనం కోసం విగ్రహాలు తయారుచేసి పెడతారు. మీరాకు ఎప్పుడూ మందిరం అన్నది ఉండదు. దేవతల వలె మీరాకు పూజ జరగదు, కేవలం గాయనం జరుగుతుంది. ఇప్పుడు చివరి జన్మలో ఎవరినైనా పూజించనివ్వండి, ధరణిని కూడా పూజించనివ్వండి, వృక్షాలను కూడా పూజించనివ్వండి కానీ నియమానుసారంగా వారికి కేవలం గాయనం జరుగుతుంది, పూజ కాదు. మీరు పూజ్యులుగా అవుతారు. కనుక మీరు పూజ్యనీయ ఆత్మలు - ఈ నషా సదా స్మృతిలో పెట్టుకోండి. పూజ్యాత్మలను ఎప్పుడూ ఏ అపవిత్ర సంకల్పమూ టచ్ కూడా చేయలేదు. అటువంటి పూజ్యులుగా అయ్యారా! అచ్ఛా.

నలువైపులా ఉన్న వారసత్వానికి అధికారి ఆత్మలకు, సదా చదువులో పాస్ విత్ ఆనర్ అయ్యేవారు, సదా వరదానాల ద్వారా వరదానులుగా అయి ఇతరులను కూడా వరదానులుగా తయారుచేసేవారు - ఇలా తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువుకు ప్రియమైనవారైనటువంటి, సదా ఆత్మిక ఆనందంలో ఉండేటటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పంజాబ్-రాజస్థాన్ గ్రూప్ - సదా స్వయాన్ని హోలీ హంసలుగా అనుభవం చేస్తున్నారా? హోలీ హంస అనగా సమర్థాన్ని మరియు వ్యర్థాన్ని పరిశీలించేవారు. ఆ హంసలైతే రాళ్ళను మరియు రత్నాలను వేరు చేస్తాయి, ముత్యాలను మరియు రాళ్ళను వేరు చేస్తాయి. కానీ హోలీ హంసలైన మీరు దేనిని పరిశీలించేవారు? సమర్థమేమిటి, వ్యర్థమేమిటి, శుద్ధమేమిటి మరియు అశుద్ధమేమిటి. ఎలాగైతే హంస ఎప్పుడూ రాళ్ళను తీసుకోదో, వేరు చేసి ఉంచేస్తుందో, విడిచిపెట్టేస్తుందో, గ్రహించదో, అలాగే హోలీ హంసలైన మీరు వ్యర్థాన్ని విడిచిపెడతారు మరియు సమర్థ సంకల్పాలను ధారణ చేస్తారు. ఒకవేళ వ్యర్థం వచ్చినా కూడా, ధారణ చేయరు. ఒకవేళ వ్యర్థాన్ని ధారణ చేసినట్లయితే, హోలీ హంసలు అని అనరు. దానినైతే కొంగ ధారణ చేస్తుంది. వ్యర్థమైతే చాలా విన్నారు, మాట్లాడారు, చేసారు. కాని దాని పరిణామం ఏం జరిగింది? పోగొట్టుకున్నారు, అంతా పోగొట్టుకున్నారు కదా. తనువును కూడా పోగొట్టుకున్నారు. దేవతల తనువును చూడండి మరియు ఇప్పటి తనువును చూడండి ఎలా ఉంది, ఎంత తేడా ఉంది! యువత కన్నా వృద్ధులు మంచిగా ఉన్నారు. కనుక తనువును కూడా పోగొట్టుకున్నారు, మనసు యొక్క సుఖ-శాంతులను కూడా పోగొట్టుకున్నారు, ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. మీ వద్ద ఎంత ధనం ఉండేది? అపారమైన ధనమంతా ఎక్కడికి వెళ్ళింది? వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు జమ చేసుకుంటున్నారా లేక పోగొట్టుకుంటున్నారా? హోలీ హంసలు పోగొట్టుకునేవారు కాదు, జమ చేసుకునేవారు. ఇప్పుడు 21 జన్మలు తనువు కూడా మంచిది లభిస్తుంది మరియు మనసు కూడా సదా సంతోషంగా ఉండేదిగా ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు మట్టి ఉంటుందో, అక్కడ ధనం అలా ఉంటుంది. ఇప్పుడు మట్టి కూడా విలువైనది అయిపోయింది కానీ అక్కడ రత్నాలతో ఆడుకుంటారు, రత్నాలతో ఇంటి యొక్క అలంకరణ ఉంటుంది. కనుక ఎంత జమ చేసుకుంటున్నారు! ఎవరి వద్దనైతే జమ అవుతుందో, వారికి సంతోషం ఉంటుంది. ఒకవేళ జమ లేనట్లయితే మనసు చిన్నది అయిపోతుంది. జమ ఉన్నట్లయితే, మనసు పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద మనసు అయిపోయింది! కనుక ప్రతి అడుగులో జమ యొక్క ఖాతా పెరుగుతూ ఉందా లేక అప్పుడప్పుడు జమ చేస్తున్నారా? తమ చార్టును మంచి రీతిలో చూసుకున్నారా? ఇటువంటి సమయంలో కూడా అప్పుడప్పుడు వ్యర్థం వైపు అయితే వెళ్ళడం లేదు కదా? ఇప్పుడైతే సమయం యొక్క విలువ తెలిసింది కదా. సంగమం యొక్క ఒక క్షణం ఎంత గొప్పది! ఒకటి, రెండు క్షణాలే పోయాయి అని అనడమైతే అంటారు కానీ ఒక్క క్షణం కూడా ఎంత గొప్పది. ఇది గుర్తున్నట్లయితే ఒక్క క్షణాన్ని కూడా పోగొట్టుకోరు. క్షణాన్ని పోగొట్టుకోవడం అనగా సంవత్సరాన్ని పోగొట్టుకోవడము. సంగమంలో ఒక్క క్షణానికి కూడా ఇంత మహత్వం ఉంటుంది! కనుక జమ చేసుకునేవారు, పోగొట్టుకునేవారు కాదు ఎందుకంటే అయితే పోగొట్టుకోవడమైనా జరుగుతుంది లేదా సంపాదించడమైన జరుగుతుంది. మొత్తం కల్పంలో సంపాదించే సమయం ఇప్పుడే. కనుక హోలీ హంసలు అనగా స్వప్నంలో, సంకల్పంలో కూడా ఎప్పుడూ వ్యర్థంగా పోగొట్టుకోరు.

హోలీ అనగా సదా పవిత్రతా శక్తి ద్వారా అపవిత్రతను ఒక క్షణంలో పారద్రోలేవారు. కేవలం స్వయం కోసమే కాదు, ఇతరుల కొరకు కూడా ఎందుకంటే మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేయాలి కదా. పవిత్రతా శక్తి ఎంత గొప్పది, ఇదైతే తెలుసు కదా. పవిత్రత ఎటువంటి అగ్ని అంటే అది సెకండులో విశ్వములోని మురికినంతా భస్మం చేయగలదు. సంపూర్ణ పవిత్రత ఇటువంటి శ్రేష్ఠమైన శక్తి. అంతిమంలో ఎప్పుడైతే అందరూ సంపూర్ణమైపోతారో, అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల లగ్నమనే అగ్నిలో ఈ చెత్త అంతా భస్మమైపోతుంది. యోగము జ్వాల వలె ఉండాలి. అంతిమంలో ఇలా నెమ్మది-నెమ్మదిగా సేవ జరగదు. ఆలోచించారు మరియు జరిగింది. దీనినే విహంగ మార్గపు సేవ అని అంటారు. ఇప్పుడు స్వయంలో నింపుకుంటున్నారు, తర్వాత కార్యంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు దేవీల స్మృతిచిహ్నంలో జ్వాలతో అసురులను భస్మం చేసినట్లు చూపిస్తారు. అసురులను కాదు, ఆసురీ శక్తులను సమాప్తం చేసేసారు. ఇది ఏ సమయం యొక్క స్మృతిచిహ్నము? ఇప్పటిదే కదా. కనుక ఇటువంటి జ్వాలా ముఖులుగా అవ్వండి. మీరు అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? కనుక ఇప్పుడు జ్వాలా ముఖులుగా అయి ఆసురీ సంస్కారాలను, ఆసురీ స్వభావాలను అన్నింటినీ భస్మం చేయండి. మీవైతే భస్మం చేసేసారు కదా లేక మీవి కూడా ఇప్పుడు చేస్తున్నారా? అచ్ఛా.

పంజాబ్ వారు నిర్భయులుగా అయిపోయారు. భయపడేవారైతే కాదు కదా? మీరు జ్వాలా ముఖులు, ఇక భయమెందుకు? మీరు మరణించే ఉన్నారు, ఇక ఎవరికి భయపడాలి? రాజస్థాన్‌ వారు అయితే ‘‘రాజ్య అధికారాన్ని’’ ఎప్పుడూ మర్చిపోకూడదు. రాజ్యాన్ని మర్చిపోయి రాజస్థాన్ లోని ఇసుక అయితే గుర్తు రాదు కదా. అక్కడ ఇసుక చాలా ఉంటుంది కదా. కనుక సదా కొత్త రాజ్యం యొక్క స్మృతి ఉండాలి. అందరూ నిర్భయంగా జ్వాలా ముఖులుగా అయి ప్రకృతి మరియు ఆత్మలలో ఉన్న తమోగుణాన్ని భస్మం చేసేవారిగా అవ్వండి. ఇది చాలా పెద్ద పని, వేగంగా చేసినప్పుడే పూర్తి అవుతుంది. ఇప్పుడైతే వ్యక్తులకు కూడా ఏ సందేశం చేరుకోలేదు. ఇక ప్రకృతి విషయం తర్వాత. కనుక వేగాన్ని తీవ్రతరం చేయండి. వీధి-వీధిలో సెంటరు ఉండాలి ఎందుకంటే పరిస్థితులు అనుసారంగా ఒక వీధి నుండి మరొక వీధిలోకి కూడా వెళ్ళలేకపోతారు. ఒకరినొకరు చూసుకోను కూడా చూసుకోలేరు. కనుక ఇంటింటిలో, వీధి వీధిలో సెంటరు ఉండాలి కదా. అచ్ఛా.

Comments