19-10-2011 అవ్యక్త మురళి

        19-10-2011         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“ఫాలో ఫాదర్ చేసి బ్రహ్మా బాబా సమానంగా వ్యర్ధ సమయము, వ్యర్థ సంకల్పాలపై విజయులుగా, కర్మాతీతులుగా అయ్యి ముక్తి ద్వారాలను తెరిచేందుకు నిమిత్తులుగా అవ్వండి. ఈ దీపావళికి అందరూ పరస్పరంలో కలుసుకుని సంస్కార మిలన
రాస్ ను చేయండి." 

ఈ రోజు బాప్ దాదా తమ నలువైపుల ఉన్న మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. అందరూ ఎంతో ప్రేమగా తమ స్మృతిని అందిస్తున్నారు. ఇంత ప్రేమను కేవలం బాబా మాత్రమే చేస్తారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ లవ్ లీన్ అయి ఉన్నారు. బాబా కూడా పిల్లల ప్రేమకు రెస్పాన్డ్ అవుతున్నారు. వాహ్ పిల్లలు వాహ్! సమ్ముఖంలో ఉన్నవారైనా, దూరంగా ఉన్నవారైనా కానీ పిల్లలందరూ తండ్రి హృదయంలో ఇమిడి ఉన్నారు. ఇంతటి ప్రేమ ఎవరు చేస్తారు అని అందరి మనసులలో పాట మ్రోగుతుంది. తండ్రి పిల్లల ఈ ఆత్మిక ప్రేమ పిల్లలందరినీ దేహము నుండి అతీతంగా మరియు బాబాకు ప్రియంగా చేసేటువంటిది. ఈ ప్రేమ ఈ సమయంలోనే పిల్లలకు ప్రాప్తిస్తుంది. ఈ ప్రేమ ఎలా ఉన్న పిల్లలను ఎలా చేసేస్తుంది! ఈ ప్రేమ కేవలం ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. బాబా కూడా పిల్లల స్నేహాన్ని చూసి పిల్లల స్నేహంలో ఇమిడిపోతున్నారు.

ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు భాగ్యములను చూస్తున్నారు. ఒకటి, తండ్రి స్వరూపంలో ప్రాప్తించిన వారసత్వపు భాగ్యము, రెండు, శిక్షకుని రూపంలో శ్రేష్ఠ శిక్షణ యొక్క భాగ్యము, మరియు మూడు, సద్గురువు రూపంలో వరదానాల భాగ్యము. ప్రతి ఒక్కరి మస్తకము ఈ మూడు భాగ్యములతో మెరుస్తూ ఉంది. బాప్ దాదా కూడా తమ భాగ్యశాలి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. సమ్ముఖంలో కూర్చుని ఉన్నాకానీ, దూరంగా ఉన్నాకానీ హృదయంలో సమీపంగా ఉన్నారు. ఇటువంటి తండ్రి పిల్లల ప్రేమ పూర్తి కల్పంలో ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది. ఈ ప్రేమ యొక్క అనుభవాన్ని ఇతరులకు కూడా కలిగిస్తున్నారు. ఈ బ్రాహ్మణ ఆత్మలకు ఏదో లభించింది అని కొందరు భావిస్తున్నారు. ఏమి లభించింది అన్న విషయము స్పష్టమవుతూ ఉంది. బాబా ఏమి చూసారంటే ప్లాటినమ్ జూబ్లీ ప్రభావము నలువైపులా ఉంది మరియు పిల్లలు కూడా మనస్పూర్తిగా సేవను చేసారు. భవిష్యత్తు కోసం కూడా ప్లాన్ చేసారు. కావున బాప్ దాదా కూడా నలువైపలా ఉన్న పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నారు వాహ్ పిల్లలు వాహ్! అందరూ తమ తమ పురుషార్థం అనుసారంగా నిర్విఘ్నులుగా అవుతూ, తయారు చేస్తూ 75 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏమి ఆశిస్తున్నారు? బాబాకు సదా పిల్లల పట్ల ఉన్న ఆశ - పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి. ఎలా అయితే బ్రహ్మా బాబా విజయులుగా అయ్యారో, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ సదా విజయులుగా అవ్వాలి. ఇందుకోసం బ్రహ్మా బాబా ఏమి చేసారు? ఫాలో ఫాదర్. కావున మీరు వేసే ప్రతి అడుగు ముందు ఈ అడుగు బ్రహ్మా బాబా వేసారా అని పరిశీలించుకోండి. పురుషార్థంలో కూడా మరియు సేవలో కూడా పిల్లలు బలహీనంగా ఉన్నారు అని బ్రహ్మా బాబాకు పిల్లల గురించి తెలిసినప్పటికీ బలహీనంగా ఉన్నవారిపై మరింత దయ మరియు కళ్యాణ భావన ఉండేది. అలాగే బాప్ దాదా పిల్లలందరికీ ఏమని చెప్తున్నారంటే మీ పరివారంలోని ప్రతి సోదర సోదరి పట్ల శుభ భావన, శుభ కామన, దయ మరియు కళ్యాణ దృష్టి ఉంచి వారికి కూడా సహయోగులుగా అవ్వండి. బాప్ దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, ప్రేమ సబ్జెక్టులో పిల్లలందరూ యథాశక్తి పాస్ అయి ఉన్నారు. ప్రేమ ఉన్న కారణంగానే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లల ప్రేమను చూసి సంతోషిస్తున్నారు. ప్రేమ సబ్జెక్టు కారణంగానే పిల్లలు నంబరు వారీగా నడుచుకుంటున్నారు. ప్రేమలో కొంత త్యాగం కూడా చెయ్యడం జరుగుతుంది. బాబాపై ప్రేమ ఉంది కనుక ఏ త్యాగము చేస్తారు? బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో అర్థమయింది కదా, అర్థమయింది కదా బాబా కోరుకుంటున్నది? అర్థమయిందా? తల ఊపండి. అర్థమయిందా? మరి అది చెయ్యాలి, ఇందుకు కూడా ధైర్యము కావాలి. ధైర్యముంటే చేతులెత్తండి. అచ్చా. అయితే పిల్లల ధైర్యము - తండ్రి సహాయము ఉండనే ఉంటుంది.

ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, రిజల్టు చూసిన ప్రకారంగా ఇప్పటివరకు సంపూర్ణ పవిత్రత అనుసారంగా వ్యర్థ సంకల్పము కూడా అపవిత్రతకు బీజమే. వ్యర్థ సంకల్పాలు చేసే సంస్కారము ఇప్పటికీ పిల్లలలో ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఒకటి వ్యర్థ సంకల్పము, రెండు వ్యర్థ సమయము - ఇది మెజారిటీ పిల్లలలో ఇప్పటికీ కనిపిస్తుంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారము మనసు. అది మన్మనాభవ స్థితిలో ఉండనివ్వదు. ఎందుకంటే బాప్ దాదా చాలాకాలం నుండి సూచన ఇస్తూనే ఉన్నారు - ఏమి జరుగనున్నా అది అకస్మాత్తుగా జరుగనుంది. అకస్మాత్తుగా జరిగే అనుసారంగా బాప్ దాదా చెక్ చేసారు. మెజారిటీ పిల్లలలో ఈ వ్యర్థ సంకల్పాల సంస్కారము ఉంది. బ్రహ్మా బాబా వ్యర్థ సమయము, వ్యర్థ సంకల్పాలపై విజయునిగా అయ్యి కర్మాతీతంగా అయ్యారు. కావున ఫాలో ఫాదర్.

బాప్ దాదా ఏమి చూసారంటే మనసు మీ రచన, మీరు మనసుకు రచయిత అంటే మీరు మనసును నడిపించేవారు. మనసు యొక్క కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కు మీరు యజమానులు, కానీ మనసు ఎక్కడో మోసగించేస్తుంది. అది మీ రచనే, నాది కదా! కానీ కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉన్న కారణంగా మనసు మోసగిస్తుంది. మనసును గుర్రమని కూడా అంటారు. కానీ మీ వద్ద శ్రీమతము అనే కళ్ళెము ఉంది. కళ్ళెము ఉంది కదా! కనుక, ఎప్పుడైనా మనసు వ్యర్థ సంకల్పాల వైపుకు తీసుకువెళితే వెంటనే కళ్ళెమును బిగించడం ద్వారా స్వయంలోని వ్యర్థ సంకల్పాల కొద్దిపాటి అపవిత్రతను కూడా సమాప్తం చేసుకోగలుగుతారు. ఎలా అయితే బ్రహ్మా బాబా రోజూ మనసును పరిశీలించుకునేవారో అలాగే మీరూ మనసుకు యజమానులుగా అయ్యి రోజూ పరిశీలించుకోండి మరియు వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసుకోండి. పిల్లలు వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యాలని ఈ రోజు బాప్ దాదా పిల్లల నుండి ఆశిస్తున్నారు. చెడు ఆలోచనలు తక్కువగానే ఉన్నాయి, వ్యరము ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇందులో సమయము చాలా వృథా అవుతుంది. మనసుకు యజమానులుగా అయ్యి మనసును ఎంతగా బిజీగా పెట్టండంటే అది ఇతర వైపులకు ఆకర్షితమై మీ కళ్ళెమును డీలా చెయ్యకూడదు. ఇది వీలవుతుందా? ఈ రోజు బాప్ దాదా వ్యర్థ సంకల్పాల సమాప్తి కోసం అందరికీ సంకల్పాన్ని ఇస్తున్నారు. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు సమాప్తం, సెరిమనీ చేసుకుందాము అని భావించేవారు చేతులెత్తండి. వ్యర్థ సమయాన్ని కూడా కాపాడాలి. సమయము మరియు సంకల్పాలు రెండింటినీ కాపాడాలి. బాప్ దాదా అందరి చార్టును చూస్తారు. చార్టులో మెజారిటీ పిల్లల్లో ఈ లోపము కనిపించింది. మనసుకు యజమానులే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎలా అయితే బ్రహ్మా బాబా పాస్ విత్ ఆనర్ గా అయ్యి విశ్వానికి యజమానులుగా అయ్యారో, ఇప్పుడైతే మీ కోసం, పిల్లల కోసం ఆహ్వానిస్తున్నారు, మీ అడ్వాన్స్ పార్టీ కూడా ఆహ్వానిస్తుంది. వినిపించాము కదా, ఉదయం నాలుగు గంటలకు అడ్వాన్స్ పార్టీవారు వతనంలోకి వస్తారు, ముక్తి ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయి అని అడుగుతారు? ఎవరు తెరవాలి? మీరందరూ ముక్తి ద్వారాలను తెరిచేవారు కదా. మీరు సంపూర్ణంగా అవ్వడము అంటే ముక్తి ద్వారాలు తెరుచుకున్నట్లే. అడ్వాన్స్ పార్టీవారు 'ఎప్పటి వరకు' అని బాప్ దాదాతో రూహ్ రుహాన్(ఆత్మిక సంభాషణ) చేస్తారు. బాబా మిమ్మల్ని అడుగుతున్నారు, 'ఎప్పటి వరకు'? ఏమని జవాబు ఇస్తారు? మొదటి లైన్ వారు చెప్పండి, ఎప్పటి వరకు? ప్రతి కార్యానికి డేట్ ను ఫిక్స్ చేస్తారు కదా! ఈ కార్యానికి డేట్ ఏమిటి? బ్రహ్మా బాబా అయితే ఫరిస్తా రూపంలో ఆహ్వానిస్తున్నారు. డేట్ ను చెప్పగలరా? చెప్పండి, డేట్ ను ఫిక్స్ చెయ్యగలరా? డేట్ ఫిక్స్ అయిందా? పాండవులు చేతులెత్తండి, డేట్ ఫిక్స్ అయ్యిందా లేదా. ఎందుకని? బాబా, మాకైతే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అన్న తపన ఉండేది అని దీదీ అంటారు. కర్మాతీతంగా అవ్వాలి, కర్మాతీతంగా అవ్వాలి అన్న తపన మాకు ఉండేది అని దాదీ అంటారు. మరి మీ అందరికీ దీదీ, దాదీలపై ప్రేమ ఉంది కదా. అందరిపై ప్రేమ ఉంది ఎందుకంటే ఎవరైతే అడ్వాన్స్ పార్టీలో వెళ్ళారో వారందరిపై మీకు ప్రేమ ఉంది. ఇప్పుడు వారి ప్రశ్నకు జవాబు ఇవ్వండి. పరస్పరంలో చర్చించుకుని జవాబును తయారు చెయ్యండి. చేస్తారా?

ఈరోజు డబుల్ విదేశీయుల మిలనము కదా. కనుక డబుల్ విదేశీయులు కూడా పరస్పరంలో చర్చించుకుని డేటు చెప్పండి. అలాగే భారతవాసులు కూడా దీనిపై చర్చించండి. జవాబు ఉన్నదా! చెప్పండి, చెప్పండి... (మోహినీ అక్కయ్య, న్యూ యార్క్ - బాబా, డేట్ ను మీరు ఫిక్స్ చెయ్యండి, మేము ఎవరెడీగా ఉన్నాము) లేదు, మీరు ఫిక్స్ చెయ్యండి. మీరు తయారు కావాలి కదా. బాబా అయితే ఈ దీపావళికి దీపావళి చేసెయ్యండి అని. ఎవరెడీ? ఎవరెడీ? ఈ డేట్ చాలా దగ్గరగా ఉంది అని అంటారా! అందుకే డేట్ మీరు ఫిక్స్ చెయ్యండి అని చెప్తున్నాము. (డా.నిర్మల అక్కయ్య - బాబా ఒక్క సంవత్సరం ఇవ్వండి) అచ్చా, ఇందులో చేరుతారా, వీరంటున్నారు ఒక్క సంవత్సరం కావాలని. ఒక్క సంవత్సరం కావాలి అని భావించేవారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. అచ్ఛా. ఒక్క సంవత్సరం అనేవారి పేర్లు నోట్ చేసుకోండి. మంచిది. మిగతావారు చిరునవ్వుతో ఉన్నారు. చెప్పండి, (నిర్వైర్ అన్నయ్య - నౌ ఆర్ నెవర్, ఈరోజే ఇప్పుడే జరగాలి) అయితే చప్పట్లు కొట్టండి. మంచిది, చాలా మంచిది. అయితే ఇప్పుడే అందరూ మనసులలో ఒక ప్రతిజ్ఞ చెయ్యండి - ఎప్పుడూ వ్యర్థ సంకల్పాలను రానివ్వము. ఇది వీలవుతుందా? నౌ ఆర్ నెవర్ (ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు) అని అన్నారు. అయితే కనీసం ఇప్పటి నుండి వ్యర్థ సంకల్పాలు ఉండవు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోము అని ప్రతిజ్ఞ చెయ్యగలరా? ఇందుకు ఎవరైతే తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. మెజారిటీ ఎత్తారు. ఇందుకు సమయం పడుతుంది అని భావించేవారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. కొద్ది మంది చెతులెత్తారు. అచ్చా, అయితే ఈ దీపావళికి ఈ ఒక్క దృఢ సంకల్పం చెయ్యండి, ఎవరైతే మెజారిటీ చేతులెత్తారో వారు స్వాహా చెయ్యండి. మీ అందరి దృఢ సంకల్పం సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేస్తాము. ఇష్టమేనా! ఈనాటి కేక్ ఈ దృఢ సంకల్పానికి సూచకము. ఇప్పుడు అందరూ, అజ్ఞానులు కూడా ఇప్పుడు ఏదైనా జరగాలి, ఏదైనా జరగాలి అని ఆశిస్తున్నారు. కానీ శక్తి లేదు. పిల్లలైన మీలో అయితే సంకల్పాన్ని పూర్తి చేసే శక్తి ఉంది. ఫాలో ఫాదర్ కదా. బ్రహ్మా బాబా జన్మయే దృఢ సంకల్పం ద్వారా జరిగింది. చేయ్యాల్సిందే, ఆలోచిద్దాము అని అనుకోలేదు. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు - చెయ్యాల్సిందే. ఆ ఒక్క దృఢ సంకల్పము ఇంతమంది పిల్లల భవిష్యత్తును తయారు చేసింది. ఒక్క బ్రహ్మా బాబా ఎంత ధైర్యమును ఉంచారు! అర్థ భాగము లభించగానే యజ్ఞాన్ని రచించారు. యజ్ఞములో బ్రాహ్మణులను రచించారు మరియు దేశవిదేశాల నుండి ఆత్మలు చేరుకున్నాయి - ఒక్క బ్రహ్మా బాబా దృఢ సంకల్పం కారణంగా. మరి దృఢ సంకల్పం ఏమి చెయ్యలేదు! మీ ముందు వీరు ఉదాహరణగా ఉన్నారు. మంచి మంచి సంకల్పాలు చేస్తారు, అవి బాబా వరకు చేరుకుంటాయి కానీ వాటిలో దృఢత్వము లోపిస్తుంది. ఏదైనా పరిస్థితి రాగానే దృఢత్వము తగ్గుతుంది. దృఢత్వము సఫలతకు తాళంచెవి.

చూడండి, ఢిల్లీవారు చెయ్యాల్సిందే అని దృఢ సంకల్పం చేసారు. జరిగింది కదా! ఆలోచిద్దాము, చూద్దాము అని అనుకోలేదు. అందరి దృఢ సంకల్పం ఉంది. ఇందుకు ఫలానావారు నిమిత్తమైనా కానీ అందరి సహయోగము మరియు దృఢ సంకల్పము దానిని ప్రాక్టికల్ గా సఫలం చేసాయి. ఇందులో అందరూ సహాయాన్ని అందించారు మరియు ఏకమతంతో ఉన్నారు. అవును - కాదు, అవును - కాదు అని లేకుండా ఒకే దృఢ మతంతో ఉన్నారు. దృఢత్వంలో ఇంతటి శక్తి ఉంది. ఏ కార్యాన్నయితే ప్రారంభిస్తారో అందులో ముందుగా దృఢ సంకల్పము అనే బీజాన్ని వేయండి, దానికి ఫలము రావలసిందే. ఈ 75 సంవత్సరాలు ఎలా గడిచాయి, బ్రహ్మా బాబా మరియు పిల్లల తోడు దృఢ సంకల్పంతో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ, ముందుకు తీసుకు వెళ్తూ ఉన్నారు, అప్పుడే కదా ఈ 75 సంవత్సరాలు పూర్తయ్యాయి! ఇప్పుడు ఈ సంకల్పం చెయ్యండి - ఈరోజు నుండి వ్యర్ధ సమయము, వ్యర్థ సంకల్పము సమాప్తము చెయ్యవలసిందే. ఎప్పుడైతే వ్యర్థము సమాప్తమవుతుందో అప్పుడు సదా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా అద్భుతాలను చేసి చూపిస్తుంది.

ఈ రోజు విశేషంగా డబుల్ విదేశీయుల మిలన దివసము. డబుల్ విదేశీ పిల్లలు నలువైపుల డబుల్ సేవను మంచిగా చేస్తున్నందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. ఒకటి, స్వ పురుషార్థము. రెండు, ఆత్మల సేవ. రెండు విషయాలలోనూ మంచి ధైర్యాన్ని ఉంచి ముందుకు వెళ్తున్నారు. ఈ డబుల్ సేవకు బాప్ దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. అభినందనలు, అభినందనలు. ఈ రోజు విశేషంగా వీరి రోజు. కావున వీరికి అభినందనలు. మీకు కూడా అభినందనలు, భారతవాసులకు కూడా అభినందనలు. ఢిల్లీలో బ్రిజ్ మోహన్, ఆషా నిమిత్తమయ్యారు కదా, వీరికి గుప్తరీతిలో సహయోగిగా గుల్జార్ ఉన్నారు. ఏకమతము, హా జీ, హా జీ చెయ్యడంలో పూర్తి ఢిల్లీలో ఉత్సాహం ఉంది మరియు దానిని ప్రాక్టికల్ లో చేసారు. అవును, కాదు అని అనలేదు. చెయ్యాల్సిందే. ఈ విధంగా ఏకమతముతో ఉండటమే సఫలత. సఫలత పిల్లల ప్రతి ఒక్కరి జన్మ సిద్ధ అధికారము. దానిని ఉపయోగించుకోండి. నిర్లక్ష్యంగా ఉండవద్దు. అవుతుందిలే, చేస్తాములే అని ఆలోచించకండి. చెయ్యాల్సిందే, ఇది బ్రాహ్మణుల భాష. బాప్ దాదా అయితే పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు కానీ ఈ రోజు ఢిల్లీవారు అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రభుత్వంలో నిమిత్తమైన విశేష వ్యక్తులకు మంచిగా సందేశం చేరుకోవడం బాప్ దాదా చూసారు. బ్రహ్మాకుమారీలు ఏం చేస్తారు అని అనుకునేవారు, అపోహలు ఉన్నవారికి 75 సంవత్సరాల కథ విని వీరు ఏం కావాలంటే అది చెయ్యగలరు అని అర్థమయింది. కావున ఎవరైతే నిమిత్తమయ్యారో, ప్రభుత్వంలోకి సందేశం చక్కగా చేరుకుంది, ఇది ఏకమతము చేసిన అద్భుతము.

బాప్ దాదా డబుల్ విదేశీయులను చూసి సంతోషిస్తున్నారు, వృద్ధి కూడా జరుగుతుంది మరియు డబుల్ సేవ వైపు అటెన్షన్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు బాప్ దాదా ఒక్క సూచనను మళ్ళీ ఇస్తున్నారు - పరస్పరంలో సంస్కార మిలన రాసను చెయ్యండి. సెంటర్ బాగానే నడుస్తుంది కదా, సేవ బాగా జరుగుతుంది కదా అని మాత్రమే ఆలోచించకండి. ఒక్క పరివారము, ప్రభు పరివారము, లౌకిక పరివారము కాదు ప్రభు పరివారము అని అన్నప్పుడు పరస్పరంలో శుభ భావన, కళ్యాణ భావన ఉండాలి. పరస్పరం ఈ విధమైన సంకల్పాలు ఉండాలి - మేమందరమూ కలిసిమెలసి ఒకరికొకరము ముందుకు తీసుకు వెళ్తూ ముక్తి ద్వారాలను తెరచి కలిసే వెళ్తాము. కావున ఇప్పుడు ప్రతి సెంటరులో ఎటువంటి వాతావరణం ఉండాలంటే వీరు 8మంది కాదు, 10మంది కాదు, ఈ 10మందీ ఒక్కరే అని అనిపించాలి. ఇప్పుడు సంస్కార మిలన రాస్ గురించి ప్రతి ఒక్కరూ మనసులో దీపావళికి సంకల్పం చెయ్యండి. ఒక్క ఆత్మ కూడా ఒకరికొకరితో దూరంగా ఉండకూడదు, అందరూ ఒకటిగా ఉండాలి. కావున ఈ దీపావళికి సంస్కార మిలన రాస్ ను చెయ్యండి. ఒక్కరు కూడా నా కారణంగా భారీగా అవ్వకూడదు, అందరూ తేలికగా ఉండాలి అని మనసులో దృఢ సంకల్పం చెయ్యండి. సంస్కారాలు కలవనప్పుడే భారీగా అవుతారు. ఈ సంకల్పం ద్వారా ద్వారాలు త్వరగా తెరుచుకుంటాయని బాబా భావిస్తున్నారు. పరిశీలించుకోండి, ఎవ్వరూ మన వలన అసంతుష్టంగా ఉండకూడదు, భారీగా కూడా ఉండకూడదు. ఇది వీలవుతుందా? వీలవుతుందా? వీలవుతుంది అని అంటే తల ఊపండి. వీలవుతుంది అంటే చేతులెత్తండి. అయితే ఈ దీపావళికి మంచి కళ వచ్చేస్తుంది.

డబుల్ విదేశీయులు, బాప్ దాదా ప్రతి రోజూ డబుల్ విదేశీయులను ఇమర్జ్ చేసుకుంటారు, ఎందుకని? ఎందుకని ఇమర్జ్ చేసుకుంటారు? ఎందుకంటే బాబా పేరును పూర్తి విశ్వంలో ప్రసిద్ది చెయ్యడంలో డబుల్ విదేశీయులు నిమిత్తమయ్యారు. ఏ విషయంలో? వీరు భారతవాసులు కాకపోయినా, విదేశీయులైనా కానీ తమ భాగ్యాన్ని తయారు చేసుకున్నప్పుడు మేమెందుకు ఉండిపోవాలి అని అందరూ భావిస్తారు. ఈ ప్రేరణ ఈ ఢిల్లీ కార్యక్రమం ద్వారా భారతదేశంలో మంచిగా వ్యాపించింది కావున బాప్ దాదా సేవకు నిమిత్తమైన మీ అందరినీ ఇమర్జ్ చేసుకుంటారు. భారతదేశాన్ని మేల్కొల్పుతాము, మేల్కొల్పుతున్నాము, ఇకముందు కూడా భారతదేశాన్ని మేల్కొలిపే వి.ఐ.పీలను తయారు చేస్తాము. వారి అనుభవము భారతవాసులను మేల్కొల్పుతుంది. ప్రారంభంలో ఎంతోమంది వి.ఐ.పీలను తీసుకురావడం బాప్ దాదాకు గుర్తుంది. ప్రోగ్రాములు చేసేవారు. ఇప్పుడు ఈ సేవ లేదు. ఎటువంటి వి.ఐ.పీలను తయారు చెయ్యండంటే వారు సెంటర్లలో తమ అనుభవాన్ని వినిపించగలగాలి. ఇప్పుడు ఎక్కువ కల్చరల్ చూపించారు, అనుభవం కూడా వినిపించారు, కానీ కొద్దిగా సమయం ఉంది. ఇప్పుడు భారతవాసుల అదృష్టాన్ని మేల్కొలిపేటువంటి వి.ఐ.పీలను తయారుచెయ్యండి. విదేశీయులు మరియు భారతవాసులు కలిసి చేసిన కార్యక్రమంలో కూడా మంచి ప్రభావము ఉంది. ఇప్పుడు కలిసి ఇటువంటి సేవలను ముందుకు తీసుకువెళ్ళండి. మరో ముఖ్య విషయము, ప్రతి ఒక్కరూ, భారతవాసి కావచ్చు, విదేశీ కావచ్చు త్వరత్వరగా ఎంత సంపన్నంగా అవ్వాలంటే మీ అందరి సంపన్నత ముక్తి ద్వారాలను తెరవాలి. అచ్ఛా.

(90 దేశాలనుండి 2400మంది డబుల్ విదేశీయులు వచ్చారు, అందులో 600మంది క్రొత్తవారు ఉన్నారు) అభినందనలు. దూరమైన
పిల్లలు ఈ రోజు తమ పరివారాన్ని, తండ్రిని కలుసుకున్నందుకు బాబాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు అందరూ తీవ్ర పురుషార్థీలుగా అవ్వాలి ఎందుకంటే కొద్ది సమయంలోనే ముందు నంబరును తీసుకోవాలి. కావున తీవ్ర పురుషార్థీగా అయ్యి మున్ముందుకు వెళ్తూ ఉండండి. చేరుకున్నందుకు అభినందనలు. బాప్ దాదా ఒక్కొక్కరిని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు సహజ స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని మున్ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. వెనుక వచ్చినవారు కూడా వెనుక ఉండవద్దు, ముందుకు వెళ్ళండి. అచ్ఛా..

(గ్లోబల్ హాస్పిటల్ తయారై 20 సంవత్సరాలు అయింది) హాస్పిటల్ అనేకమందిని పరివారంలోకి తీసుకువచ్చింది. వీరు ఏమి చేస్తారో అని అనుకునేవారు ఆబూలో హాస్పిటల్ తయారయిన తర్వాత వీరు డబుల్ సేవను చేస్తున్నారు అని అర్థం చేసుకున్నారు. శరీరం కోసం కూడా మరియు ఆత్మ కోసం కూడా డబుల్ పాత్రను వీరు పోషిస్తున్నారు. ఇందుకోసం ఎక్కడ సేవ చేస్తున్నాకానీ సేవకు అభినందనలు, అభినందనలు. డబుల్ డాక్టర్ అయ్యారు, డబుల్ సేవ అయినందుకు బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మరింత ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా. బాగుంది, సేవలో మంచిగా ఉన్నారు. అచ్ఛా!

నలువైపుల ఉన్నవారికి సమ్ముఖంలో ఉన్నవారైనా, ఎక్కడ కూర్చున్నవారైనా కానీ అందరి అటెన్షన్ ముధువనంలోనే ఉంది. బాప్ దాదాను చూస్తున్నారు. మోజీరిటీ చూస్తున్నారు. బాప్ దాదా కూడా పిల్లలందరికీ, నలువైపుల ఉన్న పిల్లలకు, సదా హర్షితంగా ఉండే పిల్లలకు, సదా డబుల్ పురుషార్థీ, డబుల్ పురుషార్థీ అనగా స్వ పురుషార్థంలో కూడా మరియు సేవా పురుషార్థంలో కూడా, ఇటువంటి డబుల్ పురుషార్థీ మరియు డబుల్ నిశ్చయము, నషాలో ఉండేవారికి, సదా బాబా తోడుగా ఉండేవారికి, సదా పరస్పరంలో కళ్యాణ మరియు దయతో కూడిన శుభకామనలు ఉంచేవారికి, పిల్లలు ఒక్కొక్కరికి పేరు సహితంగా బాప్ దాదా హృదయపూర్వక ప్రియస్మృతులను అందిస్తున్నారు.

కానీ ఈనాటి వ్యర్థ సంకల్పాల సమాప్తిని మర్చిపోకండి. బాప్ దాదా వద్దకైతే రికార్డు చేరుకుంటుంది. ఎంతమంది తీవ్ర పురుషార్థీ పిల్లలున్నారు, ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాలనిచ్చి ఎంతమందిని ముందుకు తీసుకు వెళ్తున్నారన్నది బాప్ దాదా చూస్తారు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసినా కూడా వారు తప్పు చేసారు అని మీరు వారి పట్ల మనసులో సంకల్పం చేస్తే, వీరు చేస్తారు, వీరు చేస్తారు. వీరు చేస్తారు... ఇది కూడా సమాప్తం చెయ్యండి. వారికి సహయోగాన్ని ఇవ్వండి, శ్రేష్ఠ భావనలను ఇవ్వండి. ఈ విధమైన సేవను చేస్తూ పూర్తి సంగఠనను శ్రేష్ఠ సంకల్పాలు కలిగినవారిగా చెయ్యాల్సిందే. సెంటరులో ఎప్పుడు కూడా ఒకరి పట్ల మరొకరికి మరో భావన ఉండకూడదు. శుభ భావన, శుభ కామన, సరేనా! చాలా మంచిది. ఇప్పుడు పిల్లలందరికీ బాప్ దాదా అభినందనలతో పాటు హృదయపూర్వక ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు.

దాదీ జానకితో:- దేశము మరియు విదేశము రెండింటినీ రిఫ్రెష్ చేసే పాత్రను మంచిగా చేస్తున్నారు. మీరు నిమిత్తం కదా. తయారు చేసేది బాబా.

మోహినీ అక్కయ్య:- ఆరోగ్యం మంచిగా ఉందా, నడిపిస్తూ ఉండండి. ఎందుకంటే చాలా గడిచిపోయింది, కొద్ది సమయం పడుతుంది. కానీ బాబా దృష్టి ఉంది. (మీ వరదానము ఉంది) వరదానము అంటే బాబా అయితే వరదాతయే కదా. బాగుంది, అందరినీ కలుపుకుని నడిపిస్తున్నారు. బాప్ దాదా ఒక్కొక్కరిపై సంతుష్టంగా ఉన్నారు. ఎక్కడైనా, ఎలాగున్నా నడిపిస్తున్నారు. మంచిది.

(గుల్జార్ దాదీ అన్నీ చేస్తూ కూడా గుప్తంగా ఉంటారు) వారిది కూడా గుప్త పాత్ర. గుప్తంగా ఉండే వారి నంబరు ముందు ఉంటుంది, తెలుసు కదా.

నిర్వైర్ అన్నయ్యతో :- బాప్ దాదా సంతోషిస్తున్నారు. బాబా అందరి పిల్లలకు తోడుగా ఉంటారు. సహాయము ఉంటుంది.

బ్రిజ్ మోహన్ అన్నయ్యతో: - మంచిగా చేసారు, ఢిల్లీ పేరును ప్రసిద్ది చేసింది. మంచిగా చేసారు, నిమిత్తంగా ఒకరు అవుతారు కానీ అందరి సహకారము, అందరి ఉత్సాహము కలిసినందువలన మంచి కళ వచ్చింది. ఎవ్వరూ లేదు అన్న మాట అనలేదు. (శాంతి అక్కయ్యతో) శరీరాన్ని నడిపించడము మంచిగా వచ్చింది. సమయానికి సహాయాన్ని పొంది మంచి పని చేసారు. కానీ సహాయాన్ని తీసుకునేవారు కూడా ఉండాలి కదా. బాబా సహాయమైతే ఉంది కానీ సమయానికి తీసుకోవాలి. మంచిగా చేసారు. ఇప్పుడు అందరిలో ఉత్సాహము వచ్చేస్తుంది.

ఢిల్లీవారు కలిసి చేసారు, అద్భుతమైతే చేయ్యాల్సిందే. ధైర్యమును ఉంచారు కదా. ధైర్యముతో అందరి సహాయము, బాబా సహాయము కూడా. అందరూ మంచిగా చేసారు. తమ తమ స్థానాలలో మంచిగా చేసారు. కావున ఢిల్లీకు అభినందనలు.

పర్ దాదీతో: - బ్రహ్మా బాబాను చూడాలంటే వీరిలో చూడండి. బాగుంది. చాలామంచి ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారు. అందుకే అనారోగ్యంగా అనిపించరు. (రుక్మిణి అక్కయ్యతో) మంచిగా సంభాళిస్తున్నారు. సంభాళించేవారికి కూడా అభినందనలు. 

విదేశీ ముఖ్య పెద్దక్కయ్యలతో: - (బాప్ దాదాకు అభినందనలు తెలిపారు) మీకు కూడా. మీరు లేకపోతే ఇది ఎలా ముందుకు వెళ్తుంది! ఇప్పుడు వి.ఐ.పీలను తీసుకురండి. ఒకప్పుడు మీరు వి.ఐ.పీలను తీసుకువచ్చేవారు. ఇప్పుడు అక్కడ సేవ చేసి వారిని తయారు చెయ్యండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలకు వార్తాపత్రికల్లో ఎంతో సమాచారము లభిస్తుంది. ఎదురుగా కొంతమందే వస్తారు కానీ వార్తాపత్రికలు ఎంతోమంది ఇళ్ళలోకి సమాచారాన్ని అందవేస్తాయి. వి.ఐ.పీల సమాచారాన్ని వార్తాపత్రికల్లో తప్పకుండా వేస్తారు. (విదేశాలలో 40 సంవత్సరాల సేవను జరుపుకున్నాము) అందరూ కలిసి జరుపుకుంటే ఇదేమీ చిన్న సంస్థ కాదు అని ప్రజలకు అర్థమవుతుంది. విదేశాలలో ఎక్కడెక్కడైతే ముస్లిం విద్యార్థులున్నారో అక్కడ సేవను ఎక్కువ చెయ్యండి. వారు వస్తే ముస్లిం కూడా వస్తారు అని అర్థమవుతుంది. సెంటర్లున్నాయి కానీ దాగి ఉన్నాయి. ఇప్పుడింకా బౌద్ధుల సేవ జరగలేదు, బౌద్ధుల సాంపుల్ ఇంకా తయారవ్వలేదు, అది కూడా జరుగనుంది. (శ్రీలంక, చైనాలో ఉన్నారు) ఇప్పుడింకా స్టేజీ పైకి రాలేదు. (వజీహా స్మృతిని అందించారు) వజీహాకు చాలా చాలా స్మృతులను అందించండి.

రమేష్ అన్నయ్యతో: - (కాలి ఆపరేషన్ మంచిగా జరిగింది) మీరు మంచిగా ఉంటే, నిమిత్తమైన ముఖ్యులు మంచిగా ఉంటారు. అప్పుడే అందరికీ సంతోషం ఉంటుంది. సమయం కంటే ముందే చేసుకున్నారు, మంచిది. అందరి పట్ల మీకు శుభ భావన చాలా ఉంది. నిమిత్తమైన ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి. (బాంబేలో కూడా ఇటువంటి సేవ జరగాలని ప్రేరణ ఇవ్వండి) తప్పకుండా జరుగుతుంది, అదేమంత పెద్ద విషయము కాదు. ఇప్పుడు ఒక సాంపుల్ (ఢిల్లీలో) జరిగినందుకు అందరికీ ప్రేరణ కలిగింది, చేస్తారు.

Comments