17-12-1989 అవ్యక్త మురళి

      17-12-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

‘‘సదా సమర్థంగా ఎలా అవ్వాలి’’

ఈరోజు సమర్థుడైన తండ్రి తమ నలువైపులా ఉన్న మాస్టర్ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. ఒకరేమో సదా సమర్థులు, మరియు రెండవవారు అప్పుడప్పుడు సమర్థులు, అప్పుడప్పుడు వ్యర్థం వైపు వద్దనుకున్నా ఆకర్షితులవుతారు. ఎందుకంటే ఎక్కడైతే సమర్థ స్థితి ఉంటుందో, అక్కడ వ్యర్థం ఉండలేదు. సంకల్పం కూడా వ్యర్థమైనది ఉత్పన్నమవ్వలేదు. బాప్ దాదా చూస్తున్నారు - చాలామంది పిల్లలకు ఇప్పటి వరకు కూడా తండ్రి ఎదురుగా ఫిర్యాదు ఉంది - అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు స్మృతిని ఫిర్యాదు లోకి మార్చేస్తున్నాయి, వద్దనుకున్నా కానీ వచ్చేస్తాయి. వికల్పాల స్టేజినైతే మెజారిటీ మంది మెజారిటీ సమయం వరకు సమాప్తం చేసేసారు. కానీ వ్యర్థం చూడడం, వ్యర్థం వినడం మరియు ఆలోచించడం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం - ఇందులో ఫుల్ పాస్ గా లేరు ఎందుకంటే అమృతవేళ నుండి రోజంతటి దినచర్యలో తమ మనసు మరియు బుద్ధిని సమర్థ స్థితిలో స్థితి చేసుకునే ప్రోగ్రామ్ ను సెట్ చేసుకోరు. అందుకే అప్ సెట్ అవుతారు. ఎలాగైతే తమ స్థూల కార్యాల ప్రోగ్రామ్ ను దినచర్య ప్రమాణంగా సెట్ చేసుకుంటారో, అలాగే తమ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ ను సెట్ చేసుకున్నట్లయితే స్వతహాగానే ఎప్పుడూ అప్ సెట్ అవ్వరు (కలత చెందరు). ఎంతైతే తమ మనసును సమర్థ సంకల్పాలలో బిజీగా పెట్టుకుంటారో, అప్పుడు మనసుకు అప్ సెట్ అయ్యేందుకు సమయమే లభించదు. నేటి ప్రపంచంలో పెద్ద హోదా కలవారు, ఎవరినైతే ఐ.పి లేదా వి.ఐ.పిలు అని అంటారో, వారు సదా తమ కార్యాల దినచర్యను సమయానుసారంగా సెట్ చేసుకుంటారు. మరి మీరెవరు? వారు వి.ఐ.పిలే అయినా కానీ, మొత్తం విశ్వంలో ఈశ్వరీయ సంతానం సంబంధంలో, బ్రాహ్మణ జీవిత సంబంధంలో, మీరు ఎన్ని వి. లు ముందు పెట్టుకున్నా, అది కూడా తక్కువే. ఎందుకంటే మీ ఆధారంతోనే విశ్వపరివర్తన జరుగుతుంది. మీరు విశ్వ నవ నిర్మాణానికి ఆధారమూర్తులు. అనంతమైన డ్రామాలో హీరో పాత్రధారులు మరియు వజ్రతుల్యమైన జీవితం కలవారు. కనుక ఎంత పెద్దవారయ్యారు! ఈ శుద్ధ నషా సమర్థంగా తయారుచేస్తుంది మరియు దేహాభిమానం యొక్క నషా కిందకు తీసుకొస్తుంది. మీది ఆత్మిక నషా. అందుకే కిందకు తీసుకురాదు. సదా ఉన్నతమైన ఎగిరే కళ వైపుకు తీసుకువెళ్తుంది. కనుక వ్యర్థం వైపు ఆకర్షితమయ్యేందుకు కారణం - తమ మనసు-బుద్ధి యొక్క దినచర్యను సెట్ చేసుకోరు. మనసును బిజీగా పెట్టుకునే కళను సంపూర్ణ రీతిలో సదా ఉపయోగించడం లేదు.

రెండవ విషయము, బాప్ దాదా అమృతవేళ నుండి రాత్రి నిద్రించేంత వరకు మనసా-వాచా-కర్మణా మరియు సంబంధ-సంపర్కాలలో ఎలా నడుచుకోవాలి లేక ఎలా ఉండాలి - అన్నింటి కోసం శ్రీమతం అనగా ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. మనసులో ఏ స్మృతి పెట్టుకోవాలి - దీని కోసం ప్రతి కర్మలో తమ మనసు యొక్క స్థితికి డైరెక్షన్, ఆజ్ఞ లభించింది, మరియు మీరందరూ ఆజ్ఞాకారీ పిల్లలే కదా లేక అలా అవుతున్నారా? ఆజ్ఞాకారి అనగా తండ్రి సంబంధంతో, తండ్రి యొక్క అడుగుజాడలు తీసుకునేవారు అనగా అడుగులో అడుగు వేసేవారు. మరియు రెండవ సంబంధం - ప్రేయసులది. మరి ప్రేయసి కూడా ఏం చేస్తుంది? ఆమెకు ఏ శిక్షణ లభిస్తుంది? ప్రియుని అడుగులో అడుగు వేస్తూ నడుచుకోండి అని. కనుక ఆజ్ఞాకారి అనగా బాప్ దాదా యొక్క ఆజ్ఞ రూపీ అడుగులో అడుగు వేయడము. ఇది సహజమా లేక కష్టమా? ఎక్కడ అడుగు పెట్టాలి - సరైనదా లేక కాదా, ఇది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇది సహజమైనదే. కానీ రోజంతటిలో నడుస్తూ-నడుస్తూ ఏవో కొన్ని ఆజ్ఞల ఉల్లంఘన అయిపోతుంది. విషయాలు చిన్న చిన్నవిగానే ఉంటాయి, కానీ అవజ్ఞ జరగడంతో కొద్ది కొద్దిగా భారం పోగవుతూ ఉంటుంది. ఆజ్ఞాకారికి సర్వ సంబంధాలతో పరమాత్మ దీవెనలు లభిస్తాయి. ఇది నియమము. సాధారణ రీతిలో కూడా ఎవరైనా ఏ మనుష్యాత్మ యొక్క డైరెక్షన్ అనుసారంగా ‘‘హా జీ’’ అని అంటూ కార్యం చేస్తే, ఎవరి కార్యమైతే చేస్తారో, వారి ద్వారా వారి మనసు నుండి వీరికి దీవెనలు తప్పకుండా లభిస్తాయి. ఇవైతే పరమాత్మ దీవెనలు. పరమాత్మ దీవెనల కారణంగా ఆజ్ఞాకారి ఆత్మ సదా డబల్ లైట్ గా, ఎగిరేకళ వారిగా ఉంటారు. దానితో పాటు ఆజ్ఞాకారి ఆత్మకు ఆజ్ఞను పాటించినందుకు రిటర్న్ లో తండ్రి ద్వారా విల్ పవర్ విశేష వరదానం రూపంలో, వారసత్వం రూపంలో లభిస్తుంది. తండ్రి అన్ని శక్తులను వీలునామా గా పిల్లలకు ఇస్తారు, అందుకనే అన్ని శక్తులు సహజంగానే ప్రాప్తిస్తాయి. కనుక అటువంటి విల్ పవర్ ను ప్రాప్తి చేసుకున్న ఆజ్ఞాకారి ఆత్మ వారసత్వం, వరదానాలు మరియు దీవెనలు ఇవన్నీ ప్రాప్తులను చేసుకుంటుంది. దీని కారణంగా సదా సంతోషంలో నాట్యం చేస్తూ, ‘‘వాహ్, వాహ్’’ అనే పాటను పాడుతూ ఎగురుతూ ఉంటారు ఎందుకంటే వారి ప్రతి కర్మ వారికి ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేయిస్తుంది. కర్మ బీజము. ఎప్పుడైతే బీజం శక్తిశాలిగా ఉంటుందో, అప్పుడు ఫలం కూడా అటువంటిదే లభిస్తుంది కదా. కనుక ప్రతి కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం శ్రమ లేకుండా స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఎలాగైతే ఫలాల యొక్క శక్తితో శరీరం శక్తిశాలిగా ఉంటుందో, అదే విధంగా కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం ప్రాప్తించిన కారణంగా ఆత్మ సదా సమర్థంగా ఉంటుంది. కనుక సదా సమర్థంగా ఉండడానికి రెండవ ఆధారము - సదా మరియు స్వతహాగా ఆజ్ఞాకారిగా అవ్వడము. ఇటువంటి సమర్థ ఆత్మ సదా సహజంగా ఎగురుతూ తమ సంపూర్ణ గమ్యము - ‘‘తండ్రి యొక్క సమీప స్థితిని’’ ప్రాప్తి చేసుకుంటుంది. కనుక వ్యర్థం వైపు ఆకర్షితమవ్వడానికి కారణం - అవజ్ఞ. పెద్ద పెద్ద అవజ్ఞలు చేయరు, చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే ముఖ్యమైన మొదటి ఆజ్ఞ ఉంది - పవిత్రంగా అవ్వండి, కామ జీతులగా అవ్వండి. ఈ ఆజ్ఞను పాటించడంలో మెజారిటీ మంది పాస్ అయిపోతారు. చాలా అమాయకంగా ఉండే మాతలు కూడా ఇందులో పాస్ అయిపోతారు. ఏ విషయాన్ని అయితే ప్రపంచం అసంభవమని భావిస్తుందో, దానిలో పాస్ అయిపోతారు. కానీ దాని రెండవ సోదరుడు క్రోధం - ఇందులో అప్పుడప్పుడు సగం మంది ఫెయిల్ అయిపోతారు. మళ్ళీ తెలివైనవారు కూడా చాలామంది ఉంటారు. చాలామంది పిల్లలు అంటారు - క్రోధం చేయలేదు కానీ కొద్దిగా ఆవేశం చూపించాల్సి వస్తుంది, క్రోధం రాదు కానీ ఆవేశం చూపిస్తాను. అసంభవాన్ని సంభవం చేసినప్పుడు, ఇదైతే దాని చిన్న తమ్ముడు కదా. మరి దీనిని ఆజ్ఞ అంటారా లేక అవజ్ఞ అంటారా?

ఇంతకన్నా చిన్న అవజ్ఞ - అమృతవేళ యొక్క నియమాన్ని సగం పాలన చేస్తారు. లేచి కూర్చోవడమైతే కూర్చుంటారు కానీ తండ్రి యొక్క ఆజ్ఞ ఏ విధంగా అయితే ఉందో ఆ విధితో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారా? శక్తిశాలి స్థితి ఉంటుందా? స్వీట్ సైలెన్స్ తో పాటు నిద్ర యొక్క సైలెన్స్ కూడా కలిసిపోతుంది. బాప్ దాదా ఒకవేళ ప్రతి ఒక్కరికీ తమ వారం యొక్క టి.వి ని చూపించినట్లయితే చూడడానికి చాలా మజా వస్తుంది! కనుక సగం ఆజ్ఞను అంగీకరిస్తారు - నేమీ నాథులుగా అవుతారు (నియమానుసారంగా ఉంటారు) కానీ ధారణ చేయరు. దీనినేమంటారు? ఇలాంటి చిన్న చిన్న ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాగైతే ఆజ్ఞ ఉందో - ఏ ఆత్మకు కూడా దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. ఇందులో కూడా దుఃఖాన్ని ఇవ్వడం లేదు, కానీ తీసుకోవడమైతే తీసుకుంటారు కదా. వ్యర్థ సంకల్పాలు నడవడవానికి కారణమే ఇది - వ్యర్థంగా దుఃఖాన్ని తీసుకున్నారు, వినేసారు కావున దుఃఖితులయ్యారు. విన్న మాటలు వద్దనుకున్నా కానీ మనసులో నడుస్తూ ఉంటాయి - ఇది ఎందుకు అన్నారు, ఇది సరిగ్గా అనలేదు, ఇది జరిగి ఉండకూడదు... వ్యర్థాన్ని వినడము, చూడడము అనే అలవాటు మనసుకు 63 జన్మల నుండి ఉంది అందుకే ఇప్పుడు కూడా దాని వైపు ఆకర్షితులైపోతారు. చిన్న చిన్న అవజ్ఞలు మనసును భారీగా చేసేస్తాయి మరియు భారీగా అయిన కారణంగా ఉన్నత స్థితి వైపు ఎగరలేరు. ఇది చాలా గుహ్యమైన గతి. ఎలాగైతే వెనుకటి జన్మల పాప కర్మలు, భారం కారణంగా ఆత్మను ఎగరనివ్వవో, అలాగే ఈ జన్మ యొక్క చిన్న చిన్న అవజ్ఞల భారం, ఎలాంటి స్థితి కావాలనుకుంటే, అలాంటి అనుభవం చేయనివ్వదు.

బ్రాహ్మణుల యొక్క నడత చాలా మంచిగా ఉంది. బాప్ దాదా అడుగుతారు - ఎలా ఉన్నారు? అప్పుడు అందరూ అంటారు - చాలా మంచిగా ఉన్నాము, బాగున్నాము. తర్వాత ఎలాంటి స్థితి ఉండాలో అలా ఉందా అని అడిగినప్పుడు మౌనంగా ఉండిపోతారు. ఈ కారణంగా ఈ అవజ్ఞల యొక్క భారం సదా సమర్థులుగా అవ్వనివ్వదు. కనుక ఈ రోజు, ఇదే స్లోగన్ ను గుర్తు పెట్టుకోండి - వ్యర్థాన్ని ఆలోచించకండి, చూడకండి, వ్యర్థాన్ని వినకండి, వ్యర్థాన్ని మాట్లాడకండి, వ్యర్థ కర్మలలో సమయాన్ని పోగొట్టుకోకండి. మీరు చెడునైతే దాటేసారు. ఇప్పుడు ఇటువంటి ఆజ్ఞాకారి చరిత్ర యొక్క చిత్రాన్ని తయారుచేయండి. వీరిని అంటారు సదా సమర్థ ఆత్మ అని. అచ్ఛా.

టీచర్లందరూ చిత్రకారులే కదా. చిత్రం తయారుచేయడం వస్తుందా? తమ శ్రేష్ఠ చరిత్ర యొక్క చిత్రాన్ని తయారుచేయడం వస్తుంది కదా! ఎవరైతే ప్రతి అడుగులో చరిత్ర యొక్క చిత్రాన్ని తయారుచేస్తూ ఉంటారో వారే అతి పెద్ద చిత్రకారులు. ఈ చరిత్ర యొక్క చిత్రాన్ని తయారుచేసిన కారణంగానే మీ జడచిత్రాలు అర్ధకల్పం నడుస్తాయి. కనుక టీచర్లు అనగా అతి పెద్ద చిత్రకారులు. స్వయం యొక్క చిత్రాలను కూడా తయారుచేస్తారు మరియు ఇతర ఆత్మలను కూడా చిత్రకారులుగా తయారుచేసేస్తారు. ఇతరుల శ్రేష్ఠ చరిత్రను కూడా తయారుచేయడానికి నిమిత్తులు టీచర్లు. దీనిలోనే బిజీగా ఉంటారు కదా. పూర్తి బిజీగా ఉండండి. ఒక్క సెకండు అయినా మనసు, బుద్ధిని ఖాళీ పెట్టినట్లయితే వ్యర్థ సంకల్పాలు తమవైపు ఆకర్షితం చేసేస్తాయి. వినిపించారు కదా - సేవ యొక్క ప్రత్యక్షఫలం సదా ప్రాప్తించాలి, ఇదే సదా ఆజ్ఞాకారి ఆత్మల గుర్తు. అప్పుడప్పుడు సేవ యొక్క ఫలం ప్రత్యక్షంగా లభిస్తుంది మరియు అప్పుడప్పుడు లభించదు. దీనికి కారణము? ఏదో ఒక అవజ్ఞ జరుగుతుంది. టీచర్లు అనగా అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి ఆజ్ఞ యొక్క అడుగులో అడుగు వేసేవారు. అటువంటి టీచర్లేనా లేక అప్పుడప్పుడు నిర్లక్ష్యం వచ్చేస్తుందా? నిర్లక్ష్యులుగా అవ్వకూడదు? బాధ్యత యొక్క కిరీటధారులు. ఎప్పుడైనా కిరీటం భారంగా అనిపిస్తే తీసేస్తారు, మీరు తీసేసేవారు కాదు కదా. సదా ఆజ్ఞాకారి అనగా సదా బాధ్యత యొక్క కిరీటధారులు. అందరూ టీచర్లే కానీ వీరిని అంటారు యోగ్యమైన టీచర్, యోగీ టీచర్ అని.

టీచర్లు ఎప్పుడూ కంప్లెయింట్ (ఫిర్యాదు) చేయలేరు. ఇతరులను కంప్లీట్ (సంపూర్ణులు) గా చేసేవారు, కంప్లెయింట్ చేసేవారు కాదు. ఎప్పుడూ ఇటువంటి ఉత్తరాలైతే రాయరు కదా - ఏం చేయాలి, జరిగిపోయింది, జరిగి ఉండకూడదు. అదైతే సమాప్తమైపోయింది కదా. వినిపించారు - ఉత్తరాలు తప్పకుండా రాయండి, మధుబన్ కు తప్పకుండా ఉత్తరాలు పంపించండి. కానీ ‘‘నేను సదా ఓ.కె గా ఉన్నాను’’ - అంతే, ఈ రెండు లైన్లు రాయండి. చదివేవారికి కూడా టైమ్ లేదు. మళ్ళీ కంప్లెయింట్ చేస్తారు ఉత్తరానికి జవాబు రాలేదు అని. వాస్తవానికి మీ అందరి ఉత్తరాలకి జవాబు బాప్ దాదా రోజు మురళీలో ఇస్తూనే ఉంటారు. మీరు ఓ.కె అని రాస్తారు మరియు బాప్ దాదా ఓ.కె కు రిటర్న్ లో అంటారు - ప్రియస్మృతులు మరియు నమస్తే. ఇది బదులివ్వడము అయ్యింది కదా. సమయాన్ని కూడా పొదుపు చేయాలి కదా. సేవా సమాచారాన్ని కూడా క్లుప్తంగా రాయండి. కనుక సమయం కూడా పొదుపు అవుతుంది, కాగితం కూడా పొదుపు అవుతుంది, పోస్టు కూడా పొదుపు అవుతుంది. పొదుపు అవ్వగలదు కదా. ఉత్తరం మూడు పేజీలలో కూడా రాయవచ్చు. ఎవరికైనా విస్తారంగా వ్రాయడానికి డైరక్షన్ లభించినట్లయితే రాయండి కానీ రెండు లైన్లలో కూడా తమ పొరపాటుకు క్షమాపణ తీసుకోవచ్చు. దాచిపెట్టకండి కానీ క్లుప్తంగా రాయండి. ఎటువంటి సారమూ లేని ఉత్తరాలు ఎన్ని రాస్తారు! తండ్రికి చెప్తారు - నా ఈ పని చేసి పెట్టండి, నన్ను సరి చేయండి, నా వ్యాపారాన్ని బాగు చేయండి, నా పత్నిని సరి చేయండి... ఇటువంటి ఉత్తరాలు ఒకసారి కాదు, 10 సార్లు పంపిస్తారు. కనుక ఇప్పుడు పొదుపు యొక్క అవతారముగా అవ్వండి మరియు తయారుచేయండి. అచ్ఛా.

అందరికీ ఈ మేళా మంచిగా అనిపిస్తుంది కదా. రెండు రోజుల యొక్క మేళా అని ప్రపంచం వారంటారు మరియు మీది 4 రోజుల మేళా. ఈ మేళా అందరికీ ఇష్టమే కదా. అచ్ఛా.

నలువైపులా ఉన్న సదా సమర్థ ఆత్మలకు, సదా ప్రతి అడుగులో ఆజ్ఞాకారిగా ఉండేటువంటి ఆజ్ఞాకారి పిల్లలకు, సదా వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసేటువంటి విశ్వ పరివర్తక ఆత్మలకు, సదా తమ చరిత్ర యొక్క చిత్రకారులైన పిల్లలకు, సమర్థులైన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

జోన్ వారీగా పిల్లలతో అవ్యక్త బాప్ దాదా కలయిక - బొంబాయి మరియు గుజరాత్ గ్రూప్ లు

అనంతమైన తండ్రికి అనగా అనంతమైన యజమానికి బాలకులము, ఇలా భావిస్తున్నారా? బాలకులే యజమానులుగా అవుతారు, అందుకని బాప్ దాదా పిల్లలకు ‘‘మాలేకం సలామ్’’ అని అంటారు. అనంతమైన తండ్రి యొక్క అనంతమైన వారసత్వానికి బాలకులు నుండి యజమానులు. కనుక అనంతమైన వారసత్వం యొక్క సంతోషం కూడా అనంతంగా ఉంటుంది కదా. తండ్రి పిల్లలను తమ కంటే కూడా ముందు పెడతారు. విశ్వ రాజ్యానికి అధికారులుగా పిల్లలనే చేస్తారు, స్వయం అయితే అవ్వరు. కనుక వర్తమానం మరియు భవిష్యత్తు కొరకు - రెండు అధికారాలు లభించాయి మరియు రెండూ అనంతమైనవే! సత్యయుగంలో కూడా భాష యొక్క, రంగు యొక్క, దేశం యొక్క హద్దులైతే ఏమీ ఉండవు కదా. ఇక్కడైతే చూడండి ఎన్ని హద్దులున్నాయో! అనంతమైన ఆకాశాన్ని కూడా హద్దులలో పంచుకున్నారు. అక్కడ ఏ హద్దు ఉండదు, కనుక అనంతమైన రాజ్య భాగ్యం అయ్యింది. కానీ అనంతమైన రాజ్యభాగ్యం ప్రాప్తి చేసుకునేవారికి, మొదట ఈ సమయంలో తమ దేహం యొక్క హద్దు నుండి అతీతంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ దేహభానం యొక్క హద్దు నుండి బయటపడినట్లయితే, ఇతర అన్ని హద్దుల నుండి బయట పడతారు, అందుకని బాప్ దాదా అంటారు - మొదట దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాల నుండి అతీతంగా అవ్వండి. మొదట దేహం, తర్వాత దేహం యొక్క సంబంధీకులు. మరి ఈ దేహభానం యొక్క హద్దు నుండి బయటపడ్డారా? ఎందుకంటే దేహం యొక్క హద్దు ఎప్పుడూ కూడా పైకి తీసుకువెళ్ళదు. దేహము మట్టి, మట్టి సదా భారీగా ఉంటుంది. మట్టితో చేసిన వస్తువు ఏదైనా భారీగా ఉంటుంది కదా. ఈ దేహమైతే పాత మట్టి, దీనిలో చిక్కుకుంటే ఏం లభిస్తుంది! ఏమీ లభించదు. కనుక సదా ఈ నషా ఉంచుకోండి - అనంతమైన తండ్రి మరియు అనంతమైన వారసత్వానికి బాలకుల నుండి యజమానులము. ఎప్పుడైతే బాలకులుగా అవ్వాలో ఆ సమయంలో యజమానిగా అవ్వకండి, ఎప్పుడైతే యజమానిగా అవ్వాలో ఆ సమయంలో బాలకులుగా అవ్వకండి. ఎప్పుడైతే ఏదైనా సలహా ఇవ్వాలి, ప్లాను ఆలోచించాలి, ఏదైనా కార్యం చేయాలి అన్నప్పుడు యజమానిగా అయి చేయండి. కానీ ఎప్పుడైతే మెజారిటీ ద్వారా లేక నిమిత్తంగా ఉన్న ఆత్మల ద్వారా ఏదైనా విషయం ఫైనల్ అయినట్లయితే, అప్పుడు ఆ సమయంలో బాలకులుగా అయిపోండి, ఆ సమయంలో యజమానిగా అవ్వకండి. నా ఆలోచనే సరైనది, నా ప్లానే సరైనది - ఇలా కాదు. ఆ సమయంలో యజమానిగా అవ్వకండి. ఏ సమయంలో సలహా ఇచ్చేవారిగా అవ్వాలి మరియు ఏ సమయంలో సలహా అంగీకరించేవారిగా అవ్వాలి - ఎవరికైతే ఈ విధానం వస్తుందో, వారెప్పుడూ కిందా-మీదా అవ్వరు. వారు పురుషార్థంలో మరియు సేవలో సఫలురుగా ఉంటారు. తమను తాము మల్చుకోగలరు, తమను తాము వంచుకోగలరు. వంగేవారికి ఎల్లప్పుడూ సేవ యొక్క ఫలం లభిస్తుంది. మరియు తమ అభిమానంలో ఉండేవారికి సేవ యొక్క ఫలం లభించదు. కనుక సఫలతకు విధి - బాలకుల నుండి యజమానిగా, సమయానికి బాలకులుగా అవ్వడము, సమయానికి యజమానిగా అవ్వడము. ఈ విధి వస్తుందా? ఒకవేళ చిన్న విషయాన్ని, బాలకులుగా అవ్వాల్సిన సమయంలో యజమానిగా అయి సిద్ధి చేసినట్లయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది మరియు ఫలం తక్కువగా లభిస్తుంది. మరియు ఎవరికైతే విధి తెలుసో, సమయానుసారంగా వారికి శ్రమ తక్కువగా ఉంటుంది మరియు ఫలం ఎక్కువగా లభిస్తుంది. వారు సదా చిరునవ్వుతో ఉంటారు. స్వయం కూడా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులను చూసి కూడా సంతోషిస్తారు. కేవలం నేను చాలా సంతోషంగా ఉంటాను - ఇలా కాదు. కానీ సంతోషపెట్టాలి కూడా, సంతోషంగా ఉండాలి కూడా. అప్పుడు రాజా అవుతారు. స్వయాన్ని మల్చుకున్నట్లయితే బంగారు యుగం యొక్క అధికారం తప్పకుండా లభిస్తుంది. అచ్ఛా.

Comments