*22-10-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“దాత పిల్లలైన మీరు సదా దాతలుగా అవ్వండి."
ఈరోజు దయాసాగరుడు తమ మాస్టర్ దయాసాగరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. భక్తులు బాప్ దాదాలను మరియు శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని దయాద్రులూ, కృపారులు అనే పేర్లతోనే మహిమ చేస్తారు. బాప్ దాదా నుండి మరియు సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీ నుండి సర్వ ధర్మాల ఆత్మలూ ఒక్క ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా కోరుకుంటారు. జ్ఞానము మరియు యోగము యొక్క విషయాలు ప్రతి ధర్మములోనూ వేర్వేరుగా ఉన్నాయి. వాటిని మాన్యతలు అని అంటారు. కానీ ఒక్క విషయమైతే అన్ని ధర్మాలలోనూ ఒకే విధంగా ఉంది. ఆత్మలందరూ దయ లేక కృపను కోరుకుంటారు. దానినే వారు తమ భాషలో బ్లెస్సింగ్ అని అంటారు. ఆత్మలైన మీ అందరి నుండి ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ భక్తులు కాస్త కృపా దృష్టి చూపించండి, కాస్త మా పైన కూడా దయ చూపించండి అనే కోరుకుంటారు. అన్ని ధర్మాలలోనూ దయనే మూలాధారముగా భావిస్తారు. ఏ ధర్మాత్మలయినా దయార్ద్ర హృదయులుగా లేక దయా దృష్టి కలవారిగా లేకపోతే వారిని ధార్మికులు అని భావించరు. ధర్మము అనగా దయ, కావున ఈ రోజు బాప్ దాదా దయార్ద్ర హృదయులుగా మరియు కృపా దృష్టి కలవారిగా ఎంతవరకూ అయ్యారు అన్నది చూస్తున్నారు.
బ్రాహ్మణ ఆత్మలందరూ తమను ఆది సనాతన ప్రాచీన ధర్మము యొక్క శ్రేష్ఠ ఆత్మలుగా అనగా ధర్మాత్మలుగా భావిస్తారు. మీ అందరి యొక్క మొదటి ధర్మము అనగా ధారణ - స్వయం ప్రతి, బ్రాహ్మణ పరివారం ప్రతి మరియు విశ్వములోని సర్వాత్మల ప్రతి దయా భావము మరియు కృపా దృష్టి కలిగి ఉండడమే. కావున సదా స్మృతి యొక్క భావన మరియు కృపా దృష్టి సర్వుల ప్రతి ఉంటోందా లేక నెంబర్ వారీగా ఉంటోందా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దయా భావన లేక కృపా దృష్టి ఎవరిపై ఉంచవలసి ఉంటుంది? బలహీన ఆత్మలు, అప్రాప్త ఆత్మలు, ఏదో ఒక విషయానికి వశీభూతమై ఉన్న ఆత్మలు అటువంటి ఆత్మలు దయ లేక కృప యొక్క కోరికను ఉంచుతారు. వారికి కోరిక లేకపోయినా దాత పిల్లలైన మీరు ఆ ఆత్మలకు శుభమైన కామనతో ఇచ్చేవారిగా ఉంటారు. మొత్తం విశ్వంలో ఏ ఆత్మల యొక్క సంపర్కములోకి అయితే వస్తారో జ్ఞానులైనా, అజ్ఞానులైనా అందరిపైనా ఇదే దృష్టి ఉంటోందా లేక వేరే, వేరే భావనతో కూడుకున్న దృష్టి కూడా ఉంటోందా? ఎవరు ఎటువంటి సంస్కారము కలవారైనా కానీ ఈ దయ లేక కృప యొక్క భావన లేక దృష్టి రాయిని కూడా నీరుగా చేయగలదు, అపోజిషన్ వారిని తమ పాజీషన్లో సెట్ చేయగలుగుతారు. స్వభావాల యొక్క అవరోధాలను ఎదుర్కొనేవారు అధిపతులుగా అవ్వగలుగుతారు. క్రోధాగ్ని యోగజ్వాలగా అయిపోతుంది. అనేక జన్మల కఠిన లెక్కాచారాలు క్షణములో సమాప్తమైపోయి కొత్త సంబంధం జోడింపబడుతుంది. ఎంత విరోధులైనా వారు ఈ విధి ద్వారా కౌగిలించుకునేంత స్నేహులుగా అయిపోతారు కానీ వీటన్నింటికీ ఆధారము - 'దయాభావము'. దయాభావము యొక్క ఆవశ్యకత ఇటువంటి పరిస్థితిలో మరియు ఇటువంటి సమయంలో ఉంటుంది. సమయం వచ్చినప్పుడు చేయకపోతే మాస్టర్ దయాసాగరులుగా పిలువబడతారా? ఎవరిలోనైతే దయాభావన ఉంటుందో వారు సదా నిరాకారీ, నిర్వికారీ మరియు నిరహంకారిగా ఉంటారు. మనసా నిరాకారిగా, వాచా నిర్వికారిగా, కర్మణా నిరహంకారిగా ఉంటారు. వారినే దయార్థ హృదయ మరియు కృపా హృదయ ఆత్మలు అని అంటారు. కావున హే దయతో నిండిన భాండాగారాలుగా ఉన్న ఆత్మల్లారా! సమయం వచ్చినప్పుడు ఏ ఆత్మకైనా దయాభావము యొక్క దానమును చేయలేరా? నిండియున్న భండాగారము నుండి అంచలి ఇచ్చినట్లయితే బ్రాహ్మణ పరివారము యొక్క సమస్యలన్నీ సమాప్తమైపోతాయి, మీ అనాది, అది, అవినాశీ సంస్కారాలు దాతృత్వంతో కూడుకున్నవే. దేవతలు అనగా ఇచ్చేవారు. సంగమయుగములో మీరు మాస్టర్ దాతలు, అర్ధకల్పం దేవతలుగా, ఇచ్చేవారిగా ఉంటారు. ద్వాపరయుగము నుండి మీ జడచిత్రాలు ఇచ్చే దేవతలుగానే పిలువబడతాయి. కావున మొత్తం కల్పం యొక్క సంస్కారాలు దాతృత్వంతో కూడుకున్నవే. ఇటువంటి దాతృత్వపు సంస్కారాలుగల హే సంపన్న ఆత్మల్లారా! మరి సమయం వచ్చినప్పుడు మీరు దాతలుగా ఎందుకు అవ్వరు? దాత యొక్క పిల్లలు తీసుకొనే భావనను ఉంచజాలరు. వీరు ఇస్తే నేను ఇస్తాను అని భావించేవారు దేవతలు కాదు, తీసుకొనేవారే అవుతారు కదా! మరి మీరు ఏ ఆత్మలు? దేవతలా లేక తీసుకొనేవారా?
హే కోరిక అంటే ఏమిటో కూడా తెలియని ఆత్మల్లారా! అల్పకాలికమైన కోరికల కోసం దేవతలకు బదులుగా అడుక్కునేవారిగా అయిపోకండి. ఇస్తూ ఉండండి. అలా ఇస్తూ లెక్క చేయకండి. నేను ఇంత చేసాను కానీ ఇతడు చేయలేదు అని లెక్కించడము దైవ స్వరూపము యొక్క సంస్కారము కాదు, ఉదారచిత్తుడైన బాబా యొక్క పిల్లలు ఇలా లెక్కపెట్టజాలరు. భాండాగారము నిండుగా ఉంది, మీరు ఎందుకు లెక్కపెడతారు? సత్యయుగములో కూడా ఎటువంటి లెక్కాపత్రాలను ఉంచరు. రాయల్ ఫ్యామిలీ, రాజ్యవంశీయులు మాస్టర్ దాతలుగా ఉంటారు. అక్కడ ఇంత ఇచ్చాను. ఇంత చేసాను అనే ఈ లెక్కల బేరాలేవీ ఉండవు. ఎవరు ఎంతగా తీసుకొంటే అంతగా నిండుగా అయిపోవచ్చు. రాజ్యవంశము అనగా దాత యొక్క ఇల్లు కావున ఇప్పుడు ఈ సంస్కారాలను నింపుకోవాలి. ఎక్కడ నింపుకోవాలి? సత్యయుగములోనా? ఇప్పటినుండే నింపుకోవాలి కదా! ఇక్కడ కూడా బాబాతో బేరాలు చేస్తారు. బాబా మమ్మల్ని అడుగలేదు. బాబా మాతో చేయలేదు అని అంటారు. అలాగే పరస్పరం అయితే ఇలాంటి బేరాలు ఎన్నో చేస్తూ ఉంటారు. రాజాధిరాజులుగా అవ్వండి, దాత పిల్లలైన దాతలుగా అవ్వండి! తాను చేసాడు కాబట్టి నేను చేసాను, తాను రెండు అంటే నేను నాలుగు అన్నాను. ఇతడు రెండుసార్లు అన్నాడు లేక చేసాడు మరియు నేను ఒకసారి చేసాను. ఇలా ఈ లెక్కలను దాత యొక్క పిల్లలు వేయజాలరు. ఎవరైనా మీకు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు ఇస్తూ ఉండండి. దీనినే దయాభావము లేక కృపా దృష్టి అని అంటారు కావున దయార్ద్ర హృదయులుగా, కృపా దృష్టి కల ఆత్మలుగా ఇచ్చే వారిగా అవ్వండి, అర్ధమయ్యిందా!
బాప్ దాదా వద్ద పిల్లలందరి యొక్క ఖాతాలూ ఉన్నాయి. మొత్తం రోజంతటిలో ఎంత సమయం దయార్ద్ర హృదయులుగా లేక కృపా దృష్టి కలవారిగా అవుతున్నారో మరియు ఎంత సమయం ఇచ్చే భావనకు బదులుగా తీసుకునే భావనను ఉంచుతున్నారో ఈరోజంతటి లీలను బాప్ దాదా కూడా చూస్తూ ఉంటారు. ఏ విధముగా మీరు ఈ వీడియో సెట్‌ను పెట్టడం ద్వారా చూడగలుగుతున్నారో మరియు వినగలుగుతున్నారో అలాగే బాప్ దాదా వద్ద కూడా ప్రతి ఒక్కరి కొరకు టి.వి. సెట్ ఉంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్విచ్ ఆన్ చేయగలరు. ఇది సేవ యొక్క సాధనము మరియు అది తండ్రి మరియు పిల్లల యొక్క స్థితిగతులను తెలిపే సాధనము. అంతిమంలో ఈ సాధనాలన్నీ సమాప్తమైపోతాయి. ఈ వీడియో ఉపయోగపడదు కానీ విల్ పవర్ యొక్క సెట్ ఉపయోగపడుతుంది. కానీ వైజ్ఞానికులైన పిల్లలు ఎంతో సమయాన్ని శక్తిని, ధనాన్ని ఖర్చుచేసి సాధనాలను తయారుచేసారు. కావున ఆ పిల్లలయొక్క శ్రమ బాబా యొక్క సేవలో వినియోగపడుతుంది. కావున బాబా కూడా పిల్లల యొక్క శ్రమను చూసి, సేవ యొక్క ఎంతో మంచి సాధనాలను తయారుచేసారని సంతోషిస్తున్నారు. ఎంతైనా వారూ పిల్లలే కదా! తండ్రి పిల్లలు కనుక్కున్న దానిని చూసి సంతోషిస్తారు కదా! ఏ కార్యములో నిమగ్నమై ఉన్నా ఆ కార్యములో సఫలతను పొందుతున్నారు. ఇది అల్పకాలికమైనదే అయినా సఫలత ఉంది కదా! కావున బాప్ దాదా వీడియో సెట్ ను చూడడం లేదు. ఆ పిల్లలను చూస్తున్నారు, అచ్ఛా!
ఈ సాధనము ద్వారా దేశ, విదేశాలలోని పిల్లలు నలువైపులా చూస్తారు మరియు వింటారు. కావున బాప్ దాదా కూడా నలువైపులా ఉన్న సర్వ పిల్లలు ఎవరైతే ఈరోజు మధువనములో ఏమి జరుగుతోందో అన్న లగ్నములో నిమగ్నమై కూర్చున్నారో, శారీరికముగా విదేశాలలో లేక దేశములో ఉన్నా కానీ ఆకార రూపము ద్వారా మధుననివాసులుగా ఉన్న పిల్లలకు బాప్ దాదా ఆ ఆకారీ స్మృతిస్వరూపముగా ఉన్న పిల్లలందరికీ విశేషముగా ప్రియస్మృతులను తెలుపుతున్నారు. బాప్ దాదా డబుల్ సభను చూస్తారే కానీ సింగిల్ సభను కాదు. ఒకటేమో సాకారీ సభ, ఇంకొకటి ఆకారీ సభ. అందరి యొక్క స్మృతి చేరుకుంటోంది, అచ్చా! అందరి ఉత్తరాలకు ఒకే జవాబు - వారు బాబాను స్మృతి చేస్తారు మరియు బాబా కోటానురెట్లుగా ఆ పిల్లలందరినీ స్మృతి చేస్తారు. ఏ విధముగా వారు రోజులు లెక్కపెడుతున్నారో అలా బాబా పిల్లల ప్రతి ఒక్కరి యొక్క గుణాల యొక్క మాలను సదా స్మరిస్తూ ఉంటారు. పిల్లలందరికీ ఒకే మిలనము యొక్క సంకల్పము ఉంది మరియు బాప్ దాదా కూడా ఈ విధంగా మిలనమును జరుపుకునే వారికి, ఇటువంటి సంకల్పమును ఉంచే ఆత్మలకు విశేషముగా అమృతవేళ యొక్క మిలనములో మిలనమును జరిపి బదులు చెబుతారు మరియు సర్వులకూ సేవ కొరకు విశేషమైన సంకల్పాన్ని ఇస్తూ ఉంటారు, అచ్చా!
ఈ విధంగా సదా దయాభావము మరియు కృపా దృష్టిని ఉంచేవారికి, సదా ఇచ్చేవారికి, తీసుకోవాలి అనే కోరికను ఉంచనివారికి, కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉండే వారికి, ఇటువంటి రాజవంశీ సంస్కారము కలవారికి, శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు సమస్తే.
టీచర్లతో - అందరూ బాప్ దాదా యొక్క విశేష సహయోగి ఆత్మలే. ఎవరైతే స్నేహులుగా ఉంటారో వారే సహయోగులుగా అవ్వగలుగుతారు. ఎక్కడైతే స్నేహము ఉంటుందో అక్కడ సహయోగము ఇవ్వకుండా ఉండలేరు. కావున సేవాధారీ అనగా స్నేహీ మరియు సహయోగి, తోడుగా ఉండేవారు, తోడుగా చేసేవారు మరియు చివరిలో తోడుగా వెళ్ళేవారు.... కావున మూడింటిలోనూ ఎవర్రెడీగా ఉండాలి. తోడుగా ఉండడం మరియు తోడును ఇవ్వడం ఇప్పుడు జరుగుతుంది, మరియు తోడుగా వెళ్ళడం చివరిలో జరుగుతుంది. ఎప్పుడైతే రెండు విషయాలు సరి అవుతాయో అప్పుడు మూడవదాని యొక్క రోజు కూడా వచ్చేస్తుంది. మీరందరూ నిమిత్త ఆత్మలే కదా! ఎంతగా మీరు సహయోగమును ఇస్తారో మరియు తోడుగా ఉంటారో అంతగా మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా స్వతహాగా ఉల్లాస, ఉత్సాహాలు పెరుగుతాయి. మీరు ఒక్కరూ అనేకులకు నిమిత్తులు. నేను కాదు, బాబా నిమిత్తముగా చేసారు. నేను అనేది అయితే సమాప్తమయ్యింది కదా! నేను అనేందుకు బదులుగా నా బాబా. నేను చేసాను, నేను అన్నాను అన్నది కాదు. బాబా చేయించారు. బాబా చేసారు అని అనాలి. ఆ తర్వాత చూడండి, సఫలత సహజముగా లభిస్తుంది. మీ నోటి నుండి ఎంతగా బాబా, బాబా అని వెలువడుతుందో అంతగా అనేకులను బాబాకు చెందినవారిగా చేయగలుగుతారు. అందరి నోటి నుండి వీరి మాటలలో మరియు లగ్నములో బాబాయే ఉన్నారు అని వెలువడుతుంది. తద్వారా ఇతరులకు కూడా అదే లగ్నము అంటుకుంటుంది. ఏ విషయమైతే లగ్నములో ఉంటుందో అదే మాటలో ఉంటుంది. బాప్ దాదా చిన్న, చిన్న కుమారీల యొక్క ధైర్యము మరియు త్యాగమును చూసి హర్షితమవుతారు. పెద్దవారైతే పరిశీలించి ఆ తర్వాత త్యాగం చేసారు. అదేమంత పెద్ద విషయం కాదు, పరిశీలించి చూసారు. ఆ తర్వాత వదిలారు కానీ వీరైతే మొదటే వివేకపూర్ణమైన పనిని చేసారు. ఎంత చిన్నవారో అంత గొప్ప తెలివైనవారు!
పార్టీలతో మిలనము:-
గుజరాత్:- సదా స్వయాన్ని మహావీరులుగా అనగా మహాన్ ఆత్మలుగా భావిస్తూ నడుచుకుంటున్నారా? ఎవరికి చెందినవారిగా అయ్యారు మరియు ఎలా అయ్యారు? కేవలం ఇది ఆలోచించుకున్నా ఎప్పుడూ వ్యక్తభావములోకి రాజాలరు. వ్యక్తభావము నుండి అతీతముగా ఉండండి అనగా ఫరిస్తాలుగా అయి సదా పైకి ఎగురుతూ ఉండండి, ఫరిస్తాలు కిందకు రారు. భూమిపై పాదాలు మోపరు. ఈ వ్యక్త భావము కూడా దేహము యొక్క ధరణియే, కావున ఎప్పుడైతే ఫరిస్తాలుగా అయిపోయారో అప్పుడు దేహము యొక్క ధరణిలోకి ఎలా రాగలుగుతారు? ఫరిస్తాలు అనగా ఎగిరేవారు, కావున అందరూ ఎగిరే పక్షులే. పంజరంలో ఉండేవారైతే కారు కదా? అర్ధకల్పం పంజరంలో ఉన్నారు, ఇప్పుడు ఎగిరే పక్షులుగా అయిపోయారు. స్వతంత్రులుగా అయిపోయారు. కింది ఆకర్షణలు ఇప్పుడు కిందకు లాగలేవు. కింద ఉన్నట్లయితే వేటగాళ్ళు వేటాడేస్తారు, పైకి ఎగురుతూ ఉన్నట్లయితే ఎవరూ ఏమీ చేయలేరు. కావున అందరూ ఎగిరే పక్షులే కదా! పంజరాలు అంతమైపోయాయా? ఎంత సుందరమైన పంజరమైనా అది బంధనమే కదా! ఈ అలౌకిక సంబంధం కూడా బంగారు పంజరమే, ఇందులో కూడా చిక్కుకోకూడదు. స్వతంత్రత స్వతంత్రతయే. సదా బంధనముక్తులుగా ఉండేవారే జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు. అచ్ఛా!
ఢిల్లీ:- ఇప్పటికీ ఇంకా ఢిల్లీలో వ్యాపారవేత్తలు వెలువడలేదు. వ్యాపారవేత్తలు ఒక్కరు లక్షలమందిని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఒక్కొక్క వ్యాపారవేత్త అనేకుల యొక్క సంపర్కములోకి వస్తూ ఉంటారు. ఎంతమంది సంపర్కములోకి అయితే వస్తారో వారిలో సగం మంది సందేశం విన్నా ఎంతమంది అయిపోతారు! ఇది కూడా ఒక వ్యాపారమే. వ్యాపారవేత్తలకు ఎన్ని షేర్లు లభిస్తాయి. వ్యాపారవేత్తలకు సేవ యొక్క అవకాశం ఎంతో బాగుంది. ఇప్పుడు వ్యాపారవేత్తల యొక్క గ్రూపును తయారుచేసి తీసుకురండి.
సేవాధారులతో - యజ్ఞానికి ఎంత గొప్ప మహత్వముందో అంతే మహత్వము యజ్ఞసేవాధారులకు కూడా ఉంది. ఇదే సేవ యొక్క స్మృతిచిహ్నము. ఇప్పటివరకూ అనేక ధర్మస్థానాలలో నిలిచి ఉంది. చివరిలో తయారయ్యే ధర్మస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల యొక్క సేవను కూడా ఎంతో మహత్వపూర్ణమైనదిగా భావిస్తారు. కావున మరి చైతన్య మహాయజ్ఞము యొక్క సేవాధారులకు ఎంతటి మహత్వముంటుంది. మీరు ఇది సేవ చేయడం కాదు, కోటానురెట్ల ఫలాలను భుజిస్తున్నారు. సంపత్తివంతులు ఎవరైతే ఉంటారో వారిని, వీరు సదా ఫలాలు అనుభవిస్తున్నారు అని అంటారు. పేదవారిని, ఏదో పప్పన్నం తింటున్నారు అని అంటారు మరియు షావుకార్లను, ఫలాలు అనుభవిస్తున్నారు అని అంటారు. సేవాధారులు అనగా ఫలాలను అనుభవించేవారు. కావున మీరు ఎంత శ్రేష్ఠమైనవారు! ప్రతి అడుగులోనూ డబుల్ సంపాదన. మనసాలోనూ మరియు కర్మణాలోనూ, మనసా అనగా స్మృతిలో ఉంటూ సేవ చేసినట్లయితే అది డబుల్ సంపాదన అవుతుంది కదా! కావున ఎవరు ఎంత సంపాదనను చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరూ స్వయమే తెలుసుకోగలరు. సేవ యొక్క భండారము నిండుగా ఉంది. మహాయజ్ఞము అనగా సేవ యొక్క భండారము. సేవ యొక్క భండారము నిండుగా ఉంది. ఎవరు ఎంతగా చేస్తే అంతగా పొందవచ్చు. ఇందులో హద్దూ లేదు మరియు ఇది తరిగేది కూడా కాదు. ఈ పని పూర్తి అయిపోయింది. ఇప్పుడింకేమి చేయాలి అన్న హద్దు కూడా లేదు. భండారము నిండుగా ఉంది, ఇది అనంతమైన భండారము. కావున ఎంత చేయదలచుకుంటే అంతగా చేయవచ్చు. సుసంపన్నులుగా అయ్యే లాటరీ ఉంది. లాటరీ అయితే లభించింది. కానీ ఇప్పుడు ఈ లాటరీలలో ఏ లాటరీని తీసుకున్నారు? కోటానురెట్లదా? లక్షలదా, వేలదా లేక వందలదా? అన్నది మీపైనే ఆధారపడి ఉంది. లాటరీ ఎంతో గొప్పది. కోటానురెట్లది కూడా తీసుకోవచ్చు.
బాప్ దాదా కూడా సేవాధారిగా అయి వస్తారు. వరల్డ్ ఆల్మైటీ అథార్టీ యొక్క మొదటి స్వరూపము వరల్డ్ సర్వెంటే కదా! కావున ఏ విధంగా బాబా ఉన్నారో అలా పిల్లల యొక్క గాయనము కూడా ఉంది. మీరు నిర్విఘ్న సేవాధారులే కదా! సేవ మధ్యలో ఎటువంటి విఘ్నమూ రావడం లేదు కదా! వాయుమండలం యొక్క, సాంగత్యము యొక్క, బద్ధకము యొక్క భిన్న భిన్న విఘ్నాలు ఉంటాయి, కావున ఎటువంటి విఘ్నము వచ్చినా సేవ ఖండితమైపోతుంది కదా! అఖండ సేవను చేయండి. ఎప్పుడూ ఏ విధమైన విఘ్నములోకీ రాకండి. నిర్విఘ్న సేవకే మహత్వముంది. కొద్దిగా సంకల్పమాత్రము కూడా విఘ్నము ఉండకూడదు. ఇటువంటి అఖండ సేవాధారులు ఎప్పుడూ ఎటువంటి వలయములోకీ రారు. ఎప్పుడూ ఏ వ్యర్ధమైన వలయములోకీ రాకండి, అప్పుడు సేవ సఫలమవుతుంది లేకపోతే సేవ యొక్క సఫలత లభించదు.
Comments
Post a Comment