12-10-1981 అవ్యక్త మురళి

 * 12-10-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

                                                “వర్తమానమే భవిష్యత్తుకు ఆధారము'.

ఈ రోజు వృక్షపతి అయిన తండ్రి తమ వృక్షము యొక్క మొట్టమొదటి ఆకులను లేక వృక్షము యొక్క ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలే కొత్త వృక్షానికి అంటు వంటివారు. కొత్త వృక్షము యొక్క ఆధారము అంటు పైనే ఉంటుంది. ఆత్మలైన మీరందరూ కొత్త వృక్షానికి అంటు వంటివారు. కావున ప్రతి ఆత్మా అమూల్యమైనదే. సదా స్వయాన్ని ఈ విధంగా అమూల్యమైన ఆధారమూర్తులుగా వృక్షము యొక్క అంటుగా భావిస్తూ నడుస్తున్నారా? అంటులో ఏ బలహీనత అయితే ఉంటుందో మొత్తం వృక్షమంతటిలోనూ ఆ బలహీనత ఉంటుంది. ఇంతటి బాధ్యత తమపై ఉందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా?  మేమైతే చిన్నవాళ్ళము లేక తర్వాత వచ్చినవారము, బాధ్యత అంతా పెద్దవారి పైన ఉంది అని అయితే భావించడం లేదు కదా! వారసత్వాన్ని తీసుకోవడంలో కొత్తవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్తి అధికారులుగా భావిస్తారు, చంద్రవంశం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరూ తయారవ్వరు. ప్రతి ఒక్కరూ తాము సూర్యవంశీయులుగా అవుతాము అన్న అధికారమును ఉంచుతారు. అలాగే సంగమయుగము యొక్క ప్రాప్తి పైన, తండ్రి పైన మీ పూర్తి అధికారాలను ఉంచుతారు. మొదట బాబా చిన్నవాళ్ళమైన మాకు చెందినవారు అనే అంటారు. బాబాకు చిన్నవారి పైనే ఎక్కువ స్నేహము ఉంది కావున బాబా మా వారే. కావున మొదట మాకు అన్ని అధికారాలు ఉండాలి అని అంటారు. స్నేహముతో మీ అధికారాన్ని వర్ణన చేస్తారు కావున ఏ విధంగా బాబా పైన, ప్రాప్తి పైన మీ అధికారము ఉందని భావిస్తారో అలాగే బాధ్యతలో కూడా చిన్నవారు మరియు పెద్దవారు అందరూ అధికారులే, అందరూ తోటివారే కావున ఇంతటి బాధ్యతకు అధికారులుగా భావిస్తూ ముందుకు వెళ్ళండి. స్వపరివర్తన, విశ్వపరివర్తన ఈ రెండింటి బాధ్యత యొక్క కిరీటధారులే విశ్వరాజ్యము యొక్క అధికారులుగా అవుతారు. సంగమయుగ కిరీటధారులే భవిష్య కిరీటధారులు. వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. వర్తమానమే భవిష్యత్తుకు ఆధారము. పరిశీలించుకోండి మరియు జ్ఞానము యొక్క దర్పణములో సంగమయుగ బ్రాహ్మణ స్వరూపమును మరియు భవిష్య దేవ పదధారీ స్వరూపమును రెండు స్వరూపాలను చూడండి! రెండు రూపాలను చూడండి మరియు బ్రాహ్మణ జీవితములో డబుల్ కిరీటము ఉందా లేక సింగిల్ కిరీటము ఉందా? అని పరిశీలించండి. ఒకటేమో పవిత్రత యొక్క కిరీటము, ఇంకొకటి ప్రత్యక్ష జీవితములో చదువు మరియు సేవ యొక్క కిరీటము. రెండు కిరీటాలూ సమానముగా ఉన్నాయా? సంపూర్ణముగా ఉన్నాయా లేక కొంత తక్కువగా ఉన్నాయా? ఇక్కడ ఏదైనా కిరీటము తక్కువగా ఉంటే పవిత్రతదైనా, చదువుదైనా లేక సేవదైనా ఏ కిరీటము తక్కువగా ఉన్నా చిన్న కిరీటధారులుగా లేక ఏక కిరీటధారులుగా అనగా ప్రజా పదవిని పొందేవారిగా అవ్వవలసి వస్తుంది, ఎందుకంటే ప్రజలకు కూడా ప్రకాశ కిరీటము అయితే ఉంటుంది కదా! అనగా పవిత్ర ఆత్మలే ఉంటారు కానీ విశ్వరాజు లేక మహారాజు యొక్క కిరీటము ప్రాప్తమవ్వదు. కొందరు మహారాజులుగా, కొందరు రాజులుగా అవుతారు. మహారాజులుగా మరియు విశ్వమహారాజులుగా ఈ ఆధారము పైనే నెంబర్ వారీగా, కిరీటధారులుగా అవుతారు.

అదేవిధముగా సింహాసనాన్ని చూడండి - వర్తమాన సమయంలో బ్రాహ్మణ జీవితములో ఎంత సమయం అకాల సింహాసనాధికారులుగా మరియు హృదయసింహాసనాధికారులుగా ఈ రెండు సింహాసనాధికారులుగా ఎంత సమయం ఉంటున్నారు? అకాల సింహాసనాధికారులుగా నిరంతరముగా ఉన్నట్లయితే అనగా సదాకాలికముగా ఉన్నట్లయితే హృదయసింహాసనాధికారులుగా కూడా నిరంతరమూ ఉంటారు. ఈ రెండింటికీ సంబంధం ఉంది. బ్రాహ్మణ జీవితములో అప్పుడప్పుడూ సింహాసనాధికారులుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా పూర్తిగా అర్థకల్పం సింహాసనాధికారులుగా ఉండరు అనగా రాయల్ ఫ్యామిలీలోకి రాలేరు. ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ వారే సింహాసనాధికారులుగా మహిమ చేయబడతారు. కావున ఇక్కడ సదాకాలికముగా సింహాసనాధికారులుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా సదాకాలం రాజ్య అధికారులుగా అనగా సింహాసనాధికారులుగా అవుతారు. కావున వర్తమానము ఎలా ఉంది మరియు భవిష్యత్తు ఎలా ఉంది? అని అద్దంలో చూసుకోండి. అదేవిధంగా తిలకము అవినాశిగా ఉందా, అంటే చెరిగిపోని విధంగా ఉందా? అన్నది పరిశీలించుకోండి. సంగమయుగములోనే దేవదేవుని సౌభాగ్యము మరియు పరమాత్ముని ఈశ్వరీయ సంతానము యొక్క భాగ్యతిలకము ప్రాప్తమవుతుంది. కావున ఈ సౌభాగ్యము మరియు భాగ్యము యొక్క తిలకము అవినాశిగా ఉందా? మాయ సౌభాగ్యము లేక భాగ్యము యొక్క తిలకమును చెరిపివేయడం లేదు కదా? ఇక్కడి సౌభాగ్యము యొక్క, భాగ్యము యొక్క సదా తిలకధారులే భవిష్యత్తులో సదా రాజ్య తిలకధారులుగా ఉంటారు. ప్రతి జన్మలోనూ రాజ్య తిలకము యొక్క ఉత్సవము ఉంటుంది. రాజ్యముతో పాటు రాయల్ ఫ్యామిలీ యొక్క తిలకమును దిద్దే ఉత్సవం కూడా జరుపబడుతుంది. అక్కడి ప్రతి జన్మలోని రాజ్య తిలకము యొక్క ఉత్సవము ఉంటుంది మరియు ఇక్కడి బ్రాహ్మణ జీవితములో సదా బాబాతో మిలనమును జరుపుకోవడంలో, స్వయం యొక్క పైకి ఎక్కే కళలో అన్ని రకాల సేవల యొక్క అనగా తనువు, మనసు, ధనము, జనము అన్ని సేవలలో సదా ఉత్సాహము మరియు ఉల్లాసము ఉంటుంది.  కావున ఇప్పటి ఉత్సాహమే భవిష్యత్తులోని ఉత్సవముగా ఉంటుంది.

అదేవిధముగా తనువు, మనస్సు, ధనములకు సంబంధం ఉంది. ఇక్కడ ఆది నుండి ఇప్పటివరకు మరియు ఇప్పటినుండి అంతిమం వరకూ మీ తనువును ఎంత సమయం సేవలో అర్పణ చేసారు? మనసును ఎంత సమయం స్మృతి మరియు మనసా సేవలలో వినియోగించారు? మనసా సేవ శుభభావన మరియు శ్రేష్ఠ కామనలతో కూడుకున్నది. అందులో కూడా సేవ హద్దులోదిగా ఉందా లేక అనంతముగా ఉందా? సర్వులపై శుభభావన మరియు శ్రేష్ఠ కామన ఉందా లేక కొందరిపై ఉంటూ కొందరిపై లేకుండా ఉందా? అదేవిధముగా ధనమును స్వయం కొరకు వినియోగిస్తున్నారా, స్వార్ధముతో వినియోగిస్తున్నారా లేక నిస్వార్థ సేవలో వినియోగిస్తున్నారా? వారికి చెందిన దానిని మీదిగా భవించడం లేదు కదా! అనంతములో ఉపయోగించేందుకు బదులుగా హద్దులో ఉపయోగించడం లేదు కదా! ఈ చెకింగ్ యొక్క ఆధారముపై అక్కడ కూడా ప్రారబ్ధములో పర్సంటేజి యొక్క ఆధారము పైనే నెంబర్ వారీ పదవి యొక్క ప్రాప్తి కలుగుతుంది. అన్నింటిలోనూ పూర్తి శాతం ఉంటే పూర్తి సమయం మరియు పూర్తి ప్రారబ్ధము ఉంటుంది లేకపోతే పదవిలో మరియు సమయంలో తేడా ఏర్పడుతుంది. పూర్తి సమయం ఉండేవారు. పూర్తి ప్రారబ్ధమును పొందేవారు I - 1 - 1 శకం నుండి మొట్టమొదటి సంపూర్ణ పూర్తి సతో ప్రధాన ప్రకృతి, పూర్తి రాజ్యభాగ్యమును పొందుతారు. శకమూ నెంబర్ వన్నే ప్రారబ్ధమూ నెంబర్ వన్నే ప్రకృతి యొక్క సుఖము కూడా నెంబర్ వన్నే లేకపోతే 2-3లలోకి వచ్చేస్తారు. ఇప్పుడు రెండు రూపాలనూ అనగా బ్రాహ్మణ మరియు దేవతా స్వరూపములను పరిశీలించండి. సంగమయుగ మరియు సత్యయుగ స్వరూపాలను రెండింటినీ ముందుంచుకోండి.  సంగమయుగములో ఉన్నట్లయితే సత్యయుగములో కూడా తప్పకుండా ఉంటుంది. అది నిశ్చితమే. కావున బ్రాహ్మణ జీవితము యొక్క 16 ఆత్మక సింగారాలను చూడండి, 16 కళలను చూడండి. స్వయమే స్వయమును చూడండి. ఏ లోపాలనైతే గమనిస్తారో వాటిని ఇప్పుడిక నింపుతూ వెళ్ళండి. ఏమి చేయాలో అర్ధమయ్యిందా? స్వయమును దర్పణములో చూడండి, అచ్ఛా!

ఈ రోజు మహారాష్ట్ర వారి టర్న్ - కావున మహాన్ గా అయ్యే విషయాలను వినిపిస్తారు కదా! మహారాష్ట్ర అనగా ఇప్పుడూ మహానే మరియు భవిష్యత్తులో కూడా మహానే, అచ్చా!

ఇటువంటి అనంతమైన సేవాధారులకు, సర్వుల ప్రతి సదా శుభచింతన, సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహములో ఉండేవారికి సదాకాలికపు సౌభాగ్యము మరియు భాగ్యము యొక్క తిలకధారులకు ఇటువంటి వర్తమాన రాజ్య అలంకారీ, శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

ఈ రోజు మధ్యమధ్యలో కరెంట్ పోతూ వస్తూ ఉంది. బాబా ఇలా అన్నారు - ఈ కరెంట్ యొక్క అలజడిలో బుద్ధి యొక్క అలజడి అయితే లేదు కదా! మీ ఈ సాకార సృష్టిలో భక్తులు పాడే గీతము ఒకటి ఉంది - 'నీ ప్రపంచము యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు'... అని పాడతారు. కావున బాబా కూడా చూస్తున్నారు. భక్తుల యొక్క పిలుపు కూడా వినవస్తోంది మరియు చూస్తున్నారు కూడా. దీనికి నిస్సార ప్రపంచము అన్న పేరు ఉంది, కావున ఇందులోని ఏ సాధనాలలోనైనా సారమేముంటుంది? అచ్చా!

మహారాష్ట్ర జోన్ పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మధురమిలనము:-

1. సంగమయుగము యొక్క అతిపెద్ద ఖజానా ఏది? బాబాయే అందరికన్నా అతి పెద్ద ఖజానా. బాబా లభించడంతో సర్వస్వమూ లభించింది. బాబా లేకపోతే ఏమీ లేనట్లే. కావున సత్యయుగములో కూడా ఈ అతి పెద్ద ఖజానా ఉండదు. ప్రారబ్ధము ఉంటుంది, కానీ ఈ ఖజానా ఉండదు, కావున ఇటువంటి యుగములో అన్ని ఖజానాలు లభిస్తాయి. సంగమయుగములో సత్య యుగము కన్నా శ్రేష్ఠ ఖజానా లభిస్తుంది. ఇది అన్ని ఖజానాలూ ప్రాప్తమయ్యే యుగము మరియు ప్రాప్తించుకునే ఆత్మలు కూడా మీరే. కావున ఇటువంటి ఆత్మలు సంపన్నముగా అవుతారు కదా! బ్రాహ్మణుల జీవితములో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు. దేవతల జీవితములో తండ్రి యొక్క అప్రాప్తి ఉంటుంది కానీ బ్రాహ్మణుల జీవితములో ఎటువంటి అప్రాప్తి లేదు. కావున అప్రాప్తి అనే వస్తువేదీ బ్రాహ్మణులైన మా ఖజానాలో లేదు అన్న ఈ గీతమే మనసులో అవినాశిగా మోగుతూ ఉంటుంది. మీరు ఖజానాలకు అధిపతులుగా ఉన్నారా? లేక అలా అవ్వాలా? బాలకులుగా అవ్వడం అనగా అధిపతులుగా అవ్వడం. అధికారులుగా అయితే అయిపోయారు కానీ దీనిని సంభాళించుకోవడం ఎంతవరకూ వస్తోంది? ఇందులో ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా ఉన్నారు కావున నేను బాలకుడిని మరియు అధికారిని అన్న ఇదే సంతోషములో సదా నాట్యమాడుతూ ఉండండి.

2. అందరూ నిశ్చయబుద్ధి గల విజయులుగా ఉన్నారు కదా! నిశ్చయములో ఎప్పుడూ అటూ, ఇటూ అవ్వడం లేదు కదా! అచలముగా, స్థిరముగా మహావీరులుగా ఉన్నారు కదా! మహావీరుల విశేషత ఏమిటి? సదా అచలముగా, స్థిరముగా సంకల్పము లేక స్వప్నములో కూడా వ్యర్ధ సంకల్పము కూడా రాకుండా ఉండాలి. అటువంటి వారినే అచంచలమైన, స్థిరమైన మహావీరులు అని అంటారు. మరి మీరు అలాగే ఉన్నారు కదా? ఏది జరిగినా అందులో కళ్యాణమే నిండి ఉంటుంది, దానిని గూర్చి ఇప్పుడు తెలియదు కానీ ముందు ముందు తెలుసుకుంటూ ఉంటారు. ఏ విషయాన్నీ ఏక కాల దృష్టితో చూడకండి. త్రికాలదర్శులుగా అయి చూడండి. ఇప్పుడు ఇది ఎందుకు? ఇది ఏమిటి? అని అనకండి. త్రికాలదర్శులుగా అయి చూడడం ద్వారా ఏది జరుగుతున్నా అందులో కళ్యాణమే ఉంది అన్న సంకల్పము ఉంటుంది. అలా త్రికాలదర్శులుగా అయి నడుచుకుంటున్నారు కదా! సేవ యొక్క ఆధారమూర్తులు ఎంత దృఢముగా ఉంటారో అంతగా సేవ అనే భవనము కూడా దృఢముగా ఉంటుంది. బాబా ఏది చెబుతుంటే అది చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత అది బాబాకు వదిలివేయాలి. బాబా ఎలా నడిపించాలనుకుంటే అలా నడవండి. అప్పుడు అందులో కళ్యాణము నిండి ఉంటుంది. ఇలా నడవండి. ఇలా ఉండండి అని బాబా అంటే జీ హాజర్ అనండి. ఇలా ఎందుకు? అని అనకండి, అలాగే అనండి, అర్ధమయ్యిందా? జీ హుజూర్ లేక జీహాజర్ అని అనండి, తద్వారా సదా పైకి ఎక్కే కళలోకి వెళుతూ ఉంటారు. ఆగిపోరు, ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే తేలికగా అయిపోతారు కదా!

3. అందరూ స్వయాన్ని సదా విశ్వములో కోట్లాదిమందిలో ఏ ఒక్కరిగానో మరియు ఆ కొద్దిమందిలోనూ ఏ ఒక్కరిగానో అలా శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇది మా యొక్క గాయనమే అన్న అనుభవం కలుగుతోందా? ఒకటేమో జ్ఞానము యొక్క ఆధారముపై తెలుసుకోవడం. ఇంకొకటి ఇతరుల అనుభవాన్ని విని ఆ ఆధారముపై అంగీకరించడం మరియు మూడవది స్వయం అనుభూతి చేసుకొని తెలుసుకోవడం. మరి మేము కల్ప పూర్వపువారము, కోట్లాదిమందిలో ఏ ఒక్కరో, ఆ కొద్దిమందిలోని శ్రేష్ఠ ఆత్మలము, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మల యొక్క గుర్తులు ఏమిటి? ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలు సదా దీపమైన బాబాపై బలిహారమైపోతారు. చుట్టూ తిరిగేవారిగా ఉండరు. ఒకసారి చుట్టిరావడం, కొద్దిగా ప్రాప్తిని పొందడం అలా ఉండదు. కానీ బలిహారమైపోవడం అనగా మరణించడం. మీరు ఈ విధంగా బాబాపై బలిహారమయ్యే వారే కదా! కాలిపోవడమే బాబాకు చెందినవారిగా అవ్వడం. ఎవరైతే ఇందులో కాలిపోతారో వారే అలా అవుతారు. కాలడం అనగా పరివర్తన చెందడం, అచ్ఛా!

సదా ప్రతి పరిస్థితిలోనూ ఏకరస స్థితి ఉండాలి. దానికి సహజ సాధనము ఏమిటి? ఎందుకంటే అందరికీ ఒకే లక్ష్యము ఉంది. ఏ విధంగా ఒకే బాబా, ఒకే ఇల్లు, ఒకే రాజ్యము ఉంటుందో అలాగే ఇప్పుడు కూడా ఏకరస స్థితి ఉండాలి కానీ ఏకరస స్థితిలో ఉండేందుకు ఏ సహజమైన సాధనము లభించింది? ఒక్క పదము చెప్పండి. ఆ ఒక్క పదము - ట్రస్టీ. ట్రస్టీలుగా అయినట్లయితే అతీతముగా మరియు ప్రియమైనవారిగా ఉండడం ద్వారా ఏకరసముగా ఉంటారు. గృహస్థులుగా ఉన్నట్లయితే అనేక రసాలు ఉంటాయి. నాది, నాది అనేది ఎంతో ఉంటుంది. కాసేపు నా ఇల్లు, కాసేపు నా పరివారము... గృహస్థ స్వరూపము అనగా అనేక రసాలలో భ్రమించడం. ట్రస్టీ స్థితి అనగా ఏకరసముగా ఉండడం. ట్రస్టీలు సదా తేలికగా ఉంటారు మరియు సదా పైకి ఎక్కే కళలోకి వెళతారు. కావున ఈ గ్రూప్ అంతా ట్రస్టీ గ్రూపే కదా! నాది అనేది కొద్దిగా కూడా ఉన్నా అది గృహస్థ స్థితియే. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ మమకారము ఉంటుంది. మమకారము ఉన్నవారిని గృహస్థులు అని అంటారే కానీ ట్రస్టీలు అని అనరు. గృహస్థులుగా అయితే అర్ధకల్పం ఉన్నారు. గృహస్థ జీవితములో ఏమి ప్రాప్తించిందో దానిని కూడా అనుభవం చేసుకున్నారు. ఇప్పుడిక ట్రస్టీలుగా అవ్వండి. గృహస్థ స్థితి కొద్దిగా కూడా ఉన్నా దానిని మధువనములోనే వదిలి వెళ్ళండి. దుఃఖము యొక్క అలను వ్యాపింపజేసేది ఏదైతే ఉందో దానిని ఇక్కడే వదిలి వెళ్ళండి మరియు సుఖమునిచ్చేదానిని మీతో పాటు తీసుకొని వెళ్ళాలి, అచ్ఛా!

దాదీజీ అంబాలా మేళాకు వెళ్ళేందుకు బాప్ దాదా నుండి వీడ్కోలు తీసుకుంటున్నారు, బాప్ దాదా ఇలా అన్నారు -

బాప్ దాదా అనేకమంది పిల్లల యొక్క సంతోషమును చూసి తామూ సంతోషిస్తారు. సేవ కొరకు ఎక్కడకు వెళ్ళినా అనేక ఖజానాలు అనేకులకు లభిస్తాయి. కావుననే డ్రామాలో ఇప్పటివరకూ కూడా వెళ్ళే పాత్ర ఉంది. కావున అలా నడుస్తోంది. ట్రస్టీలుగా ఉంటే క్షణములో జరుగుతుంది. సాకారములో చూసారు కదా! వెళ్ళేందుకు తయారయ్యారు కూడా. కానీ పాత్ర సమాప్తమయ్యేది ఉంది కాబట్టి అన్నీ తయారై ఉంటూ కూడా వెళ్ళలేకపోయారు. అలాగే ఇది కూడా డ్రామాలో సమాప్తమయ్యేది ఉంటే క్షణములో అకస్మాత్తుగా జరుగుతుంది. ఇప్పటివరకూ వెళ్ళేదీ ఉంది, రిఫ్రెష్ చేయడం కూడా ఉంది. అందరి హృదయాలను సంతోషపరచడం కూడా అన్నింటికన్నా పెద్ద పుణ్యమే. అందరి యొక్క ఆహ్వానము ఉంది కదా! ఆహ్వానము ఉన్నప్పుడు ప్రత్యక్షమవ్వవలసి వస్తుంది. జడచిత్రాలను కూడా ఆహ్వానము చేసినప్పుడు వాటిలోనూ జీవం అనుభవమవుతుంది. కావున ఈ ఆహ్వానించడం కూడా ఇక్కడినుండే ప్రారంభమవుతుంది. కావున అందరికీ ప్రియస్మృతులను చెబుతూ ఇప్పుడిక వాచాతో పాటు అంతిమ శక్తిశాలీ సేవ అయిన సంకల్ప శక్తి యొక్క సేవ ఏదైతే ఉందో దానిని కూడా చేయండి అని చెప్పండి. సంకల్ప శక్తి మరియు వాణి యొక్క శక్తి మనసా సేవ మరియు వాణి యొక్క సేవ ఈ రెండూ ఎప్పుడైతే కంబైన్డ్‌ రూపములో ఉంటాయో అప్పుడు సహజముగా సఫలత లభిస్తుంది, ఒక్కటే చేస్తే ఒకే ఫలితము ఉంటుంది, కంబైన్డ్ గా ఉండడం ద్వారా ఫలము రెట్టింపవుతుంది. మొదట సంకల్ప శక్తి, ఆ తర్వాత వాణి యొక్క శక్తి, కావున మనసా మరియు వాచా రెండూ కలిసి ఉండాలి. వాణిలో మనసా సేవ జరుగకుండా ఉండకూడదు. అలాగే మనసా సేవలో మాట్లాడలేకపోవడం కూడా ఉండకూడదు. వాణితో సేవ చేసేవారు కొద్దిమందే ఉంటారు, అన్నింటినీ చూసుకునేవారు, ఇతర కార్యాలలో ఎవరైతే ఉంటారో వారు మనసా సేవను చేయాలి. దాని ద్వారా వాయుమండలము యోగయుక్తముగా అవుతుంది. సంఘటనలో మిలనము ఎక్కువగా జరుగుతుంది కానీ మిలనముతో పాటు సేవ యొక్క లక్ష్యము కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ మేము సేవ చేయాలి అని భావించాలి. అప్పుడు వాతావరణము శక్తిశాలిగా ఉంటుంది మరియు సేవ కూడా డబుల్ అవుతుంది. ఉల్లాస, ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇది చాలా బాగుంది కానీ ఉత్సాహ, ఉల్లాసాలతో పాటు ఈ లక్ష్యము కూడా ఎంతో అవసరం. అచ్చా, అందరికీ చాలా, చాలా ప్రియస్మృతులు చెప్పండి.

Comments