31-12-2001 అవ్యక్త మురళి

                31-12-2001         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఈ క్రొత్త సంవత్సరంలో సఫలతభవ అనే వరదానం ద్వారా బాబా మరియు స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. 

ఈరోజు నవయుగ రచయిత, తన యొక్క మాస్టర్ రచయితలైన పిల్లలతో నవ సంవత్సరాన్ని జరుపుకునేటందుకు వచ్చారు. క్రొత్త సంవత్సరాన్ని అయితే ప్రపంచంలో అందరు జరుపుకుంటారు కానీ మీరందరూ నవయుగాన్ని తయారుచేస్తున్నారు. క్రొత్తయుగం రాబోతుంది అనే సంతోషం ప్రతి ఒక్కరిలో ఉంది. నవయుగం ఇప్పుడు రానే వచ్చింది అని తెలుసు. ప్రపంచంలోని వారు ఒక రోజు క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ మీ అందరికీ అయితే సంగమయుగం అంతా జరపుకోవచ్చు. క్రొత్త సంవత్సరం రోజున సంతోషంగా ఉంటారు, ఒకరికొకరు బహుమతులు పంచుకుంటారు అలాగే మీ బహుమతి ఏమిటి? ఆ బహుమతి అయితే కొంచెం సమయమే ఉంటుంది. నవయుగ రచయిత అయిన బాబా,  పిల్లలైన మీ అందరి కోసం ఏ బహుమతిని తీసుకువస్తున్నారు? స్వర్ణిమ బహుమతి అంటే స్వర్ణిమ ప్రపంచంలో అన్నీ స్వతహాగానే స్వర్ణిమంగా ఉంటాయి, క్రొత్తగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం సమయం తర్వాత క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కానీ అన్నీ క్రొత్తవిగా అవ్వవు. కానీ మీ యొక్క నవయుగంలో ప్రకృతి కూడా క్రొత్తదిగా అయిపోతుంది. ఆత్మ కూడా క్రొత్త దుస్తులు (శరీరం) ధరిస్తుంది. ప్రతి వస్తువు క్రొత్తగా అంటే సతోప్రధానంగా బంగారుతుల్యంగా ఉంటుంది. అయితే ఈ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ మీ అందరి మనస్సులో, బుద్దిలో నవయుగమే గుర్తు వస్తుంది కదా! లేక ఈరోజు క్రొత్త సంవత్సరం అనే జ్ఞాపకం ఉందా? 

బాప్ దాదా ముందుగా నవయుగం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. దానితో పాటుగా నవ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే మీరందరూ నవసంవత్సరాన్ని జరుపుకునేటందుకు వచ్చారు కదా! జరుపుకోండి, బాగా జరుపుకోండి. బాప్ దాదా ద్వారా లభించిన అవినాశి బహుమతి యొక్క అవినాశి శుభాకాంక్షలు ఇచ్చుకోండి. సదా పరస్పరం శుభభావన యొక్క శుభాకాంక్షలు ఇచ్చుకోండి. ఇవే సత్యమైన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు ఇచ్చేటప్పుడు స్వయం కూడా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతోషపడతారు. సంతోషపడతారు కదా! అయితే సత్యమైన మనస్సు యొక్క శుభాకాంక్షలు అంటే ఒకరి పట్ల ఒకరు మనస్సుతో శుభభావన, శుభకామన యొక్క శుభాకాంక్షలు ఇచ్చుకోవాలి. శుభభావన యొక్క శుభాకాంక్షలు ఎంత శ్రేష్టమైనవి అంటే ఎవరి భావన లేదా భావం అయినా మంచిగా లేకపోయినా కానీ మీ శుభభావన వారి భావాన్ని కూడా మార్చేయగలదు.వారి స్వభావాన్ని కూడా మార్చగలదు. వాస్తవానికి స్వభావం అంటే స్వ అనగా సు (మంచి) అంటే శుభభావం, ప్రతి సమయం, ప్రతి ఆత్మకి ఇవే అవినాశి శుభాకాంక్షలు ఇస్తూ వెళ్ళండి. ఎవరు మీకు ఏమి ఇచ్చినా కానీ మీరు అందరికీ శుభభావన ఇవ్వండి. అవినాశి ఆత్మ యొక్క అవినాశి ఆత్మికస్థితిలో స్థితులైతే ఆత్మ పరివర్తన అయిపోతుంది. అయితే ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి విశేషత చేస్తారు? స్వయంలోనైనా, ఇతరుల పట్లనైనా, సేవ పట్లనైనా కానీ క్రొత్త సంవత్సరం అని పేరు కదా! అయితే ఏదోక నవీనత చేస్తారు కదా! ప్రతి ఒక్కరు నవీనత యొక్క ప్లాన్ తయారుచేసుకున్నారా? లేక కేవలం ఇప్పుడు క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు అంతేనా? మిలనం జరుపుకున్నారు. క్రొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. అలాగే నవీనత యొక్క ప్రోగ్రామ్ తయారుచేసుకున్నారా? 

సమయ ప్రమాణంగా పిల్లలందరికీ ఈ సంవత్సరం కొరకు బాప్ దాదా విశేషంగా సైగ చేస్తున్నారు. ఎదురుగా కూర్చున్న పిల్లలైనా, దేశ, విదేశాలలో విజ్ఞాన సాధనాల ద్వారా వింటున్నారు, చూస్తున్నారు. అందరినీ కూడా బాప్ దాదా చూస్తున్నారు. చాలా విశ్రాంతిగా, మజాగా చూస్తున్నారు. ఇలా విశ్వంలో ఉన్న బాప్ దాదా యొక్క అతిప్రియమైన, మధురమైన పిల్లలందరికీ బాప్ దాదా ఇదే సైగను ఇస్తున్నారు - మీ యొక్క ఈ బ్రాహ్మణజీవితంలో అమృతవేళ నుండి రాత్రి వరకు పొదుపు యొక్క ఖాతాను పెంచుకోండి, జమాఖాతాను పెంచుకోండి. ప్రతి ఒక్కరు తమ కార్యాలను అనుసరించి ప్లాన్ తయారుచేసుకోండి. బ్రాహ్మణజీవితంలో ఏవైతే ఖజానాలు లభించాయో ఆ అన్ని ఖజానాల యొక్క పొదుపు యొక్క లేదా జమా ఖాతాను పెంచుకోండి. ఎందుకంటే బాప్ దాదా ఈ సంవత్సరాంతం వరకు ప్రతి పిల్లవాని యొక్క ఫలితం చూసారు. ఆ ఫలితంలో ఏమి చూసారు? తెలిసిపోయి ఉంటుంది. టీచర్స్ కి కూడా తెలుసు, డబల్ విదేశీయులకు కూడా తెలుసు, మహారథిలకు కూడా తెలుసు. జమాఖాతా ఎంత ఉండాలో అంత......ఏమి అనాలి? మిగిలినది మీరే చెప్పండి. ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు, సర్వఖజానాలను జమ చేసుకునే సమయం కేవలం ఈ సంగమయుగంలోనే. ఈ చిన్న యుగంలో ఎంత జమ చేసుకుంటారో దానిననుసరించి కల్పం అంతా ప్రాలబ్దాన్ని ప్రాప్తింపచేసుకుంటూ ఉంటారు. మీ సూక్తి (స్లోగన్) ఉంది కదా! ఏ స్లోగన్? ఇప్పుడు లేకున్నా...... తర్వాత ఏమిటి? ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఈ స్లోగన్ అయితే బుద్ధిలో జ్ఞాపకం ఉంది, కానీ ఈ బ్రాహ్మణజీవితంలో శ్రేష్టతకి ఆధారమైన అన్నింటికంటే పెద్ద ఖజానా - సంకల్పం, సమయం, శక్తులు, జ్ఞానం. ఇక స్థూలధనం యొక్క ఖజానా అయితే సాధారణ విషయమే. కనుక బాప్ దాదా చూసారు - ప్రతి ఒక్కరూ ఎంతగా శ్రేష్టసంకల్పం యొక్క ఖజానా ద్వారా స్వయాన్ని లేదా సేవని శ్రేష్టంగా చేయగలుగుతున్నారు అని. ఇప్పుడు ఈ విషయంపై మరింత అండర్‌లైన్ (ధ్యాస) చేసుకోవాలి. బ్రాహ్మణులైన మీ యొక్క ఒక శ్రేష్ట సంకల్పంలో లేదా శుభ సంకల్పంలో ఎంత శక్తి ఉంది అంటే దాని ద్వారా ఆత్మలకు చాలా సహయోగాన్ని ఇవ్వగలరు. సంకల్పశక్తి యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ఎంత కావాలంటే అంత పెంచుకోగలరు. విజ్ఞానసాధనమైన రాకెట్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థానానికి కావాలంటే ఆ స్థానానికి సెకనులో చేర్చగలుగుతున్నారు. కానీ మీ శుభ సంకల్పం ముందు రాకెట్ యొక్క వేగం కూడా తక్కువే. పరిశుద్ధమైన విధి ద్వారా కార్యంలో ఉపయోగించి చూడండి, మీ విధి యొక్క విధి చాలా శ్రేష్టమైనది కానీ ఇప్పుడు అంతర్ముఖత అనే బట్టీలో కూర్చోండి. ఈ క్రొత్త సంవత్సరంలో స్వయానికి స్వయం సర్వఖజానాల పొదుపు యొక్క స్కీమ్ తయారుచేస్కోండి. జమాఖాతాను పెంచుకోండి. అంతర్ముఖత యొక్క బట్టీ కొరకు మొత్తం రోజంతటిలో స్వయమే మీ కొరకు సమయాన్ని నిర్ణయించుకోండి. మీకు మీరే చేసుకోగలరు. ఇతరులు చేయలేరు. బాప్ దాదా ప్రత్యక్షత సంవత్సరం కంటే ముందు ఈ సంవత్సరాన్ని సఫలత భవ యొక్క సంవత్సరం అంటున్నారు. సఫలతకి ఆధారం - ప్రతి ఖజానాను సఫలం చేసుకోవటం. సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. సఫలత ప్రత్యక్షతను స్వతహాగానే ప్రత్యక్షం చేస్తుంది. వాచా సేవ అయితే చాలా బాగా చేసారు కానీ ఇప్పుడు సఫలత యొక్క వరదానం ద్వారా బాబా యొక్క స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ప్రతి ఒక్క బ్రాహ్మణుల జీవితంలో సర్వఖజానాల సంపన్నత ఆత్మలకు అనుభవం అవ్వాలి. ఈ రోజుల్లో ఆత్మలందరూ అనుభవీ ఆత్మలైన మీ ద్వారా అనుభూతి చేసుకోవాలనుకుంటున్నారు. వినటం తక్కువ, అనుభూతి ఎక్కువ కావాలనుకుంటున్నారు. 

అనుభూతికి ఆధారం - ఖజానాల యొక్క జమాఖాతా. ఇప్పుడు మొత్తం రోజంతటిలో మధ్యమధ్యలో మీ యొక్క ఈ చార్జ్ ని పరిశీలన చేసుకోండి. సర్వఖజానాలను ఎంత వరకు జమ చేసుకున్నాను? అని. జమాఖాతాను, లెక్కాచారాన్ని చూస్కోండి. ఒక్క నిమిషంలో ఎన్ని సంకల్పాలు నడుస్తున్నాయి? సంకల్పం యొక్క వేగం తీవ్రమైనది కదా! ఎన్ని సఫలం అయ్యాయి? ఎన్ని సాధారణంగా ఉన్నాయి? ఇలా పరిశీలించుకునే యంత్రం మీ దగ్గర ఉంది కదా! లేక లేదా? అందరి దగ్గర పరిశీలనా యంత్రం ఉందా? టీచర్స్ దగ్గర ఉందా? మీ సేవాకేంద్రాలలో కంప్యూటర్, ఈ మైల్స్ వంటివి ఉన్నాయి కదా! అలాగే ఈ చెకింగ్ మిషన్ (పరిశీలనా యంత్రం) ఉందా? డబల్ విదేశీయుల దగ్గర ఉందా? యంత్రం పని చేస్తుందా లేదా మూసి ఉందా? పాండవుల వద్ద చెకింగ్ మిషన్ ఉందా? అందరి దగ్గర ఉంది. ఎవరి దగ్గరైనా లేకపోతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎక్కడైనా ఆఫీస్ తెరుస్తున్నప్పుడు, తెరిచే ముందు కంప్యూటర్, ఈమైల్, టైప్ మిషన్, జిరాక్స్ మిషన్ వంటివి ఉన్నాయా లేదా అని చూసుకుంటారు కదా! ఈ రోజుల్లో ఇవన్నీ కావాలి కదా! అలాగే బ్రాహ్మణ జీవితంలో మీ హృదయమనే ఆఫీసులో ఈ అన్ని మిషన్లు ఉన్నాయా? లేవా? బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - బాబా దగ్గరికి ప్రకృతి కూడా వస్తుంది, నేను ఎవరెడీ అని చెప్పడానికి. సమయం కూడా బ్రాహ్మణులని మాటిమాటికీ చూస్తుంది - బ్రాహ్మణులు తయారేనా? అని. మాటిమాటికి బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతుంది. 

చేతులు అయితే బాగా ఎత్తుతున్నారు. దానికి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరెడిగా ఉండాలి. ప్రతి సంకల్పం, శ్వాస, సెకను ఏదైతే గడిచిందో అది ఓహో! ఓహో అనే విధంగా ఉండాలి. ఇప్పుడు కొద్ది సమయం ఓహో! ఓహో అనే విధంగా ఉంటుంది, కొద్ది సమయం ఓహో! ఓహో అనడానికి బదులు ఎందుకు, ఎందుకు అనే విధంగా అయిపోతుంది. కొన్ని సమయాలలో బిందువు పెడుతున్నారు, కొన్ని సమయాలలో ప్రశ్నార్ధకం మరియు ఆశ్చర్యార్ధకం పెడుతున్నారు. మీ అందరి మనస్సు కూడా ఓహో అనాలి, ఎవరి సంబంధ, సంపర్కంలోకి వచ్చినా అంటే బ్రాహ్మణుల ద్వారా లేదా సేవ చేసేవారి ద్వారా ఓహో, ఓహో అనే మాట రావాలి. 

ఈ సీజన్ యొక్క చివరి మిలనానికి ఎంత సమయం ఉంది? (మూడు నెలలు) మూడు నెలల తర్వాత బాప్  దాదా ప్రతి పిల్లవాని యొక్క పొదుపు ఖాతా యొక్క అకౌంట్ పరిశీలిస్తారు. సరేనా? మూడు నెలల తర్వాత పరిశీలించమని తయారయ్యేవారు చేతులు ఎత్తండి! తయారైపోతారా? ఎంత శాతంలో తయారవుతారు? ఉత్సాహం బావుంది. కొందరు ఎత్తడంలేదు. ఆలోచించుకుంటున్నారా? మూడు నెలల తర్వాత అకౌంట్ చెకింగ్ జరుగుతుంది. మీరు మీ అకౌంట్ ని పరిశీలించుకోండి. తర్వాత బాప్ దాదా పరిశీలిస్తారు పరిశీలించడానికి బాప్ దాదాకి సమయం పట్టదు. ఇక్కడ (మధువనం) అయితే అకౌంట్స్ కొరకు ఎంతగానో బుద్ధిఉపయోగించాల్సి ఉంటుంది. ఉపయోగించవలసి ఉంటుంది కదా! అలసిపోతారు. మధువనం వారు అకౌంట్స్ పెట్టుకోవటంలో తెలివైనవారు కదా? అన్నీ ఓహో, ఓహో అయిపోతాయి ఏమీ పర్వాలేదు. టీచర్స్ ని చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తారు. అందరూ చప్పట్లు కొట్టారు) చప్పట్లు అయితే చాలా బాగా కొట్టారు. ఒకవిధంగా మీరు కూడా టీచర్సే కదా! లేక టీచర్స్ మాత్రమే టీచర్సా? కోర్సు చెప్తున్నారు. లేదా బాబా సందేశం ఇస్తున్నారు అంటే ఏమి అవుతున్నారు? టీచర్ అవుతున్నారు కదా! ఈ సంవత్సరంలో బాప్ దాదా ఒక నవీనత చూడాలనుకుంటున్నారు. చెప్పమంటారా? చేస్తారా? పాండవులు చేస్తారా? పక్కాయేనా? పక్కాగా చేస్తారా? ఏమైపోయినా కానీ చేయాల్సిందే. తయారేనా? పాండవులందరూ తయారేనా? యువకులు కూడా తయారేనా? (యువకుల గ్రూప్ కూర్చున్నారు) బాప్ దాదా చెప్పింది చేస్తారా? మాతలు చేస్తారా? మంచిది. బాప్ దాదా పిల్లల యొక్క ధైర్యానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం వినండి, రెండు చేతులతో చప్పట్లు కొట్టకండి. ఒక చేయి ఊపండి. చాలు. చప్పట్లు కొడితే యుద్ధం అయిపోతుంది కదా! బాప్ దాదా ఈరోజు వంశానికి ఆది పురుషుడు అయిన (గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్) బ్రహ్మాబాబాకి ఒక శుభ ఆశ ఉంది. బ్రహ్మాబాబా అన్నారు - వంశోద్ధారకులైన నా పిల్లలకు విశేషంగా ఒక విషయం చెప్పాలి. అది ఏమిటంటే సదా ప్రతి పిల్లవాని ముఖంలో 1.సదా ఆత్మీయత యొక్క చిరునవ్వు కనిపించాలి. విన్నారా? చెవులు బాగా తెరుచుకుని వినండి. మరియు 2.నోటి ద్వారా వచ్చే మాటలు సదా మధురంగా ఉండాలి. ఒక మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖంలో ఆత్మీయత, నోటి ద్వారా మధురత మరియు మనస్సు, బుద్ధిలో సదా శుభభావన, దయాహృదయభావన, దాత యొక్క స్థితి కనిపించాలి. అయితే ఇది చేయగలరా? టీచర్స్ చేయగలరా? యువకులు చేయగలరా? బాప్ దాదా దగ్గరికి యువకుల గ్రూప్ యొక్క ఫలితం చాలా బాగా వచ్చింది. కోటానుకోట్ల శుభాకాంక్షలు. మంచి ఫలితం వచ్చింది. మంచి అనుభవాలు చేసుకున్నారు. బాప్ దాదా సంతోషించారు. బాప్ దాదా అనుభవం కూడా విన్నారు. ఇతరులు వినిపించగా విన్నది కాదు. స్వయంగా బాప్ దాదా మీ అందరి అనుభవాలు విన్నారు, కానీ ఇప్పుడు ఈ అనుభవాలను అమరభవ యొక్క వరదానం ద్వారా అవినాశిగా ఉంచుకోవాలి. మూడు నెలల తర్వాత మధువనానికి వచ్చినా, రాకపోయినా మీ అకౌంట్ ఉంచుకోవాలి. మూడు నెలల తర్వాత విదేశాల నుండి రారు కానీ మీ అకౌంట్ ఉంచుకోవాలి మరియు బాప్ దాదాకి పంపించాలి. బాప్ దాదా రైట్ పెడతారు లేదా ఎంత శాతం ఉందో ఫలితం చెప్తారు. అయితే చేతులు ఊపండి. మంచిది. 

ఈరోజు శుభాకాంక్షల యొక్క రోజు మరియు బాప్ వాదా శుభవార్త విన్నారు మరియు చూసారు కూడా! చిన్నచిన్న పిల్లలు కిరీటధారి అయ్యి కూర్చున్నారు. మీకయితే కిరీటం లభిస్తుంది కానీ వీరికి ఇప్పుడే లభించేసింది. నిల్చోండి, చూడండి. కిరీటధారుల గ్రూప్ ని చూడండి. పిల్లలంటే సదా సత్యమైన మనస్సు కలిగినవారే కదా!మంచిది. చిన్న పిల్లల యొక్క మంచి ఫలితం కూడా బాప్ దాదా చూసారు, శుభాకాంక్షలు. మంచిది. డబల్ విదేశీయులు నిల్చోండి. చాలా మంది ఉన్నారు. మంచిది. వీరి ఉత్తరాలను కూడా చూసారు. ఉత్సాహం యొక్క ఉత్తరాలు. కొంతమంది ఉత్సాహ, ఉల్లాసాలతో పరివర్తన అయినట్లు వ్రాసారు. వారిలో ఉన్న ఉల్లాసాన్ని వ్రాసారు. కానీ కొంతమంది కొంచెం సోమరితనాన్ని చూపించారు. ఎప్పుడూ సోమరిగా కాకూడదు. అలర్ట్ గా ఉండాలి. 

బాప్ దాదాకి 1.సోమరితనం 2. మనస్సుని బలహీనం చేసుకోవటం అనేవి ఇష్టం అనిపించవు. ఏమైపోయినా కానీ హృదయాన్ని విశాలంగా ఉంచుకోండి. బలహీనుల హృదయం చిన్నదిగా ఉంటుంది. అందువలన సోమరిగా మరియు బలహీనంగా కాకూడదు. ఉత్సాహ, ఉల్లాసాలతో ఎగురుతూ ఉండాలి. డబల్ విదేశీయులపై బాప్ దాదాకి ఎన్నో కోట్ల ఆశలు ఉన్నాయి. భారతదేశంలోని ఆత్మలు ఆశ్చర్యచకితులైపోయేవిధంగా విదేశీయులు తమ ప్రభావాన్ని చూపిస్తారు. రానే వచ్చింది, ఆ రోజు రాబోతుంది, త్వరగా రావాలి. రావాలి కదా? ఆ రోజు రానున్నది కదా? ఆ రోజు వస్తుందా? (త్వరత్వరగా వస్తుంది) అలాగే బాబా అని చెప్పండి. బాప్ దాదా ముందుగానే శుభాకాంక్షల యొక్క పళ్ళాలను నింపి ఇస్తున్నారు. ఇంత ధైర్యాన్ని డబల్ విదేశీయులలో బాప్ దాదా చూస్తున్నారు కదా? అలాంటి వారే కదా? విదేశీయులపై చాలా ఆశ ఉంది. మంచిది. 

యువకులు కూడా చాలా మంచిగా ఉన్నారు. ప్రవృతి వారు కూడా మంచిగా ఉన్నారు. కుమారీలు కూడా చాలా మంది ఉన్నారు. అద్భుతమే అద్భుతం. మంచిది.. సింధీ పరివారం వచ్చారు, మీరు ఏమి అద్భుతం చేస్తారు? సింధీ అని నిమిత్తమాత్రంగా అంటారు కానీ అందరూ బ్రాహ్మణులు. ఏమి చేస్తారో చెప్పండి? (బాబా పేరుని ప్రసిద్ది చేస్తాం) అందరూ కలిసి చెప్పండి, ఎప్పుడు చేస్తారు? (ఈ సంవత్సరంలోనే) మీ నోటిలో గులాబ్ జామ్. ధైర్యంగల వారు. (బాబా మీ వరదానం మా వెంట ఉంది) వరదాతయే వెంట ఉన్నప్పుడు ఇక వరదానం వెంట ఉండటం గొప్ప కాదు. మంచిది. 

ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి! మొదటిసారి వచ్చిన పిల్లలకు బాప్ దాదా చెప్తున్నారు - వెనుక వచ్చినా కానీ వెళ్ళాల్సింది ముందుకి. మిమ్మల్ని చూసి అందరూ సంతోషించేవిధంగా ముందుకి వెళ్ళిపోండి. అద్భుతం, అద్భుతం, అద్భుతం అనే మాట అందరి నోటి నుండి రావాలి. అంత ధైర్యం ఉందా? మొదటిసారిగా వచ్చిన వారిలో ధైర్యం ఉంది కదా? క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు అంటే క్రొత్త సంవత్సరంలో ఏదోక అద్భుతం చేస్తారు కదా? అయినా కానీ బాప్ దాదాకి పిల్లలందరూ అతి ప్రియమైనవారు. అయినా కానీ చాలా తెలివైన పని చేసారు. బాగా ఆలశ్యం అయ్యింది అనే దాని కంటే ముందే వచ్చారు. ఇప్పుడు ఈ హాల్ లో కూర్చోవడానికి అయితే సీట్ దొరికింది కదా? ఉండటానికి స్థలం దొరికింది కదా? బాగా ఆలశ్యం అయిపోయింది అని బోర్డ్ పెట్టినప్పుడు క్యూలో నిల్చోవలసి వస్తుంది. అందువలన ఇప్పుడైనా కానీ మంచి సమయానికి బాప్ దాదాని గుర్తించారు అంటే తెలివైన పనే చేసారు. మంచిది. పాత పాండవులు నిల్చోండి. మంచిది. 

పాండవుల యొక్క మహిమ కూడా తక్కువైనది కాదు. బాప్ దాదా యొక్క బిరుదు (టైటిల్) - పాండవపతి. ఇది పాండవుల యొక్క మహిమయే కదా! విజయీ పాండవులు అనే మహిమ కూడా ఉంది. శక్తులకు వరదాని అనే మహిమ ఉంది కానీ పాండవులకు విజయీ అనే మహిమ ఉంది. అయితే ప్రతి ఒక్క పాండవుని మస్తకంలో ఏ తిలకం పెట్టుబడి ఉంది? విజయీ తిలకం. అయితే మీరు మీ మస్తకంలో విజయీ తిలకాన్ని చూసుకుంటున్నారా లేదా మర్చిపోతున్నారా? సదా మిమ్మల్ని మీరు విజయీ పాండవులుగా మరియు విజయీ తిలకం మెరుస్తున్నట్లుగా చూస్కోండి. విజయం అనేది ప్రతి పాండవుని యొక్క జన్మసిద్ద అధికారం. మీరు అధికారులు కదా? అయితే బాప్ దాదా పాండవులకు విజయీ రత్నాల రూపంలో శుభాకాంక్షలు ఇస్తున్నారు. చాలా మంచివారు మరియు పాండవులు తక్కువైనవారు కాదు. ఆదిలో పాత మాతలు నిల్చోండి. మాతల యొక్క విశేషత ఏమిటి? ఉన్నతోన్నతమైన కర్తవ్యంలో ఉన్నవారు మీ చరణాలపై వంగుతారు.గురుమాత అని మహిమ ఏదైతే ఉందో అటువంటి సత్యమైన పాత్ర మాతలైన మీరు అభినయిస్తారు. ఏదైనా గొప్పరోజున భారతమాతకి జై అంటారు. ఇక ముందు ముందు మాతలైన మీకు జై జై కారాలు చెప్తారు. ఇంత ఉన్నతమైన కర్తవ్యం బాబా మాతలకి ఇచ్చారు. మాతలు జై జై కారాల ధ్వని వింటారా? గురుమాత యొక్క మహిమను ప్రత్యక్ష రూపంలో చూపిస్తారు. అటువంటి మాతలే కదా! నిద్రపోయే ఆత్మలను మేల్కొల్పుతారు. మాతలది చాలా మంచి పాత్ర. ఎవరైతే మిమ్మల్ని నిందించారో వారు మిమ్మల్ని కీర్తిస్తారు. ఎందుకంటే మీరు బాబా వారిగా అయిపోయారు కదా! ఉన్నతోన్నతమైన భగవంతునికి తోడుగా అయ్యారు. ఈ ఆత్మికనషా ఉంది కదా? అయితే అటువంటి మాతలకి బాప్ దాదా కూడా నమస్తే చెప్తున్నారు. మంచిది. 

కుమారీలు నిల్చోండి - కుమారీలు చేతులు ఊపండి. కుమారీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు సాధారణ కుమారీలు కాదు. ఇప్పుడు మీరందరూ సుకుమారీలుగా, శ్రేష్ఠ కుమారీలుగా అయిపోయారు. కుమారీల గురించి బాప్ దాదా యొక్క మనస్సులో ఒక ఉత్సాహం ఉంది చెప్పమంటారా? కుమారీలు వింటారా? కుమారీలకు మహిమ ఉంది - 21 వంశాలను ఉద్దరించేవారు అని. అయితే బాప్ దాదా చెప్తున్నారు - ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క కుమారి 21 వంశాలను వదిలేయండి కానీ ఒక్కొక్కరూ ఒక్కొక్క వారసులను తయారుచేయాలి, చేయగలరా? ధైర్యం ఉందా? కుమారీలు ఎంతమంది ఉంటారు? (1000 మంది) అంటే 1000 మంది వారసులు ఈ సంవత్సరంలో తయారవుతారు. ఇప్పుడు వారసుల మాల తయారు చేయాలి. కుమారీలు సరేనా? వారసులు అని ఎవరిని అంటారు? వారసులైన వారి లక్షణాలు ఏవిధంగా ఉంటాయి? అనే ట్రైనింగ్ క్లాస్ ముందుగా దాదీల నుండి తీస్కోండి. అర్థమైందా? ఇలా ఈ సంవత్సరం ఒక్కొక్కరూ ఒక్కొక్క వారసుడిని తయారుచేస్తే అప్పుడు బాప్ దాదా వారసుల మాలను తయారుచేస్తారు. సరేనా? ఈ సంవత్సరంలో ఏదోక నవీనత చేస్తారు కదా!  

మధువనం వారు లేవండి. మధువనం వారు చతురమైనవారు. మధువనం వారికి ముందు స్థానం లభిస్తుంది. మధువనం వారి యొక్క సేవా చమత్కారం కూడా అందరినీ మధువనానికి ఆకర్షితం చేస్తుంది. ఎవరిని అడిగినా అందరి నోటి నుండి మధువనం మధువనమే అనే మాట వస్తుంది. సేవలో నెంబర్ వన్ అని. ఈ విధంగా ఉన్నారా? నెంబర్‌ వన్‌గా ఉన్నారా లేదా నెంబర్ వారీగా ఉన్నారా? నెంబర్ వన్ గా ఉన్నారు. బాప్ దాదా సదా మధువనం నివాసీయులను నెంబర్ వన్ దృష్టితో చూస్తారు. నెంబర్ వారీగా ఉండకూడదు. నెంబర్‌ వన్‌గా ఉండాలి. నెంబర్ వన్ కదా! ఎవరు దాదీ దగ్గర ఫిర్యాదు చేయకూడదు. అందరు సంపూర్ణంగా అవుతున్నారు కనుక ఏవిధమైన ఫిర్యాదులు ఉండకూడదు. మంచిది. అయినప్పటికీ అందరు అలసిపోని సేవాధారులు. అందరు మధుబన్ సేవాధారులనే అడుగుతారు. మహా మండలేశ్వరులు కూడా మధువనం సేవాధారులను మాకు పంపించండి అని చెప్పి వెళ్తారు. నెంబర్ వన్ అయితే అయ్యారు కదా! మంచిది, పక్కాగా కూడా ఉన్నారు, మంచిగా కూడా ఉన్నారు. బాప్ దాదా అలానే చెప్తారు అని అనుకోకండి. బాప్ దాదాకి అయితే మంచిగా అనిపిస్తున్నారు. మరలా బాప్ దాదా చూస్తున్నారు అప్పుడప్పుడు ఎక్కువ పని అయినప్పుడు ఎక్కువ బరువు కూడా అవుతున్నారు కానీ అమరంగా ఉంటున్నారు. అమరభవ యొక్క వరదానం లభించింది. అమరంగా ఉన్నారా? మంచిది. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 

మంచిది, టీచర్స్ లేవండి, బాప్ దాదా టీచర్సును సదా ఇదే దృష్టితో చూస్తారు - ప్రతి టీచర్ యొక్క ముఖకవళికలలో బాప్ దాదా కనిపించాలి అని. ముఖంలో బ్రహ్మాబాబా యొక్క ముఖకవళికలు మరియు భృకిటిలో జ్యోతిర్బిందువు యొక్క రూపం కనిపించాలి. ఏ టీచర్ని చూసినా అందరి నోటి నుండి వీరు బాబా సమానమైనవారు అనే మాట రావాలి. వీరు బ్రహ్మాబాబాలా అనిపిస్తున్నారు, శివబాబాలా అనిపిస్తున్నారు అని రావాలి. బ్రహ్మాబాబా యొక్క స్లోగన్ ఇదే ఉండేది - నేను ఏ కర్మ చేస్తే నన్ను చూసి అందరు అదే చేస్తారు అని. అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్ కి ఇదే స్లోగన్ స్మృతి ఉండాలి - ఏ కర్మ, ఏ వృత్తి, ఏ మాట, ఏ విధితో మనం చేస్తామో అందరు అదే చేస్తారు అని. బ్రహ్మాబాబా యొక్క గద్దె టీచర్స్ అయిన మీకు కూర్చోవడానికి బాప్ దాదా ఇచ్చారు. మురళి వినిపించడానికి నిమిత్తులు టీచర్స్ కనుక బాబా యొక్క గద్దె లభించింది. డ్రామానుసారం టీచర్స్ అయిన మీకు చాలా, చాలా ఉన్నతమైన కర్తవ్యం లభించింది. బాప్ దాదా కూడా సదా టీచర్సుని ఇదే విశేషమైన మహత్వంతో చూసారు. మహానాత్మలు, మహత్వం కలిగినవారు. ఇలా ఉన్నారు కదా? ఎప్పుడైనా విద్యార్థి నుండి సర్టిఫికెట్ తీసుకున్నారా? బాప్ దాదా అయితే చూస్తూ ఉంటారు. ప్రేమతో పట్టుకున్నారు కనుకే టీచర్స్ గా అయ్యారు. బాబా అయితే ప్రేమతో పట్టుకున్నారు ఇప్పుడు దాదీలు మీ చెవి పట్టుకుంటారు. అయినప్పటికీ ధైర్యం పెట్టుకుని నిమిత్తంగా అయ్యారు కదా! (టీచర్స్ చాలా మంచివారు అని దాదీ చెప్తున్నారు) చాలా మంచిది, శుభాకాంక్షలు. ఒకవేళ టీచర్సే కనుక లేకపోతే ఇన్ని సేవాకేంద్రాలు ఎలా తెరవబడుతాయి. మీ అందరికీ శుభాకాంక్షలు. బాప్ దాదా అయితే చాలా, చాలా శ్రేష్టదృష్టితో చూస్తారు. టీచర్స్ కూడా చాలా మంది వచ్చారు. మంచిది, ధైర్యం మరియు శ్రమకి శుభాకాంక్షలు. 

హాస్పటల్ వారు మిగిలి ఉన్నారు. హాస్పటల్ వారు కూడా క్రొత్త సంవత్సరం యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు చాలా మంచిగా వ్రాసారు మరియు బాప్ దాదాకి సదా నిశ్చయం మరియు నిశ్చింత ఉంటుంది. ఈ హాస్పటల్ అనేకాత్మలను బ్రాహ్మణజీవితంలోకి తీసుకుస్తుంది అని. బ్రాహ్మణుల యొక్క సేవ కూడా చేస్తున్నారు మరియు బ్రాహ్మణులను కూడా తయారుచేస్తున్నారు. పెద్ద, పెద్ద వి.ఐ.పిలు కూడా హాస్పటల్ పేరు విని ప్రభావితం అవుతారు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. చార్ట్ కూడా మంచిగా వ్రాసారు మరియు ప్రతిజ్ఞ కూడా మంచిగా చేసారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. సంకల్పానికి నిమిత్తంగా మీరు అయ్యారు కానీ అందరు చాలా అభిరుచితో చేసారు. మంచిది. మీ అందరి యొక్క ప్రతిజ్ఞ పత్రం చదివి బాప్ దాదా సంతోషం అవుతున్నారు, అందువలన శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరైతే విజ్ఞాన సాధనాల ద్వారా వారు కూడా బాప్ దాదా మా యొక్క పేరు తీసుకోలేదు అని సంతోషం అవుతున్నారు కానీ బాప్ దాదా చూస్తున్నారు - ఎవరు ఎక్కడ చూస్తున్నా, వింటున్నా వారు కూడా లేవండి! సంతోషం అవుతున్నారు. విని సంతోషిస్తున్నారు మరియు నవ్వుకుంటున్నారు. బాప్ దాదాకి పిల్లలందరి యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు మరియు మనస్సు యొక్క ప్రేమ చాలా శ్రేష్టంగా అనిపిస్తుంది. మనస్సు యొక్క ప్రేమ ఉంటే సమయానికి చేరుకుంటారు. చాలా ఉత్సాహంతో వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా! కొంతమంది చూడటంలేదు కానీ వింటున్నారు. చాలా మంది వింటున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడికి పేరు, పేరున మరియు విశేషత అనుసరించి శుభాకాంక్షలు ఇస్తున్నారు. వారు కూడా చేతులు ఎత్తుతున్నారు మరియు చేతులు ఊపుతున్నారు. మంచిది. 

పిల్లలందరి యొక్క కార్డులు మరియు పత్రాలు, క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు చాలా, చాలా వచ్చాయి. బాప్ దాదా చెప్తున్నారు - పిల్లలూ! మీ యొక్క కార్డ్ కంటే ముందు మీ యొక్క హృదయం నా దగ్గరికి చేరుకుంది అని. బాప్ దాదా అందరి యొక్క హృదయం చూసి సంతోషిస్తున్నారు. ఖర్చు అయితే అవుతుంది మరలా రేపు ఈ కార్డులన్నీ స్మృతిచిహ్న రూపంలో ఉండిపోతాయి. కానీ బాప్ దాదా ఈ విషయానికి సంతోషం అవుతున్నారు, ఖర్చు చూడటం లేదు. పిల్లల మనస్సు యొక్క ధ్వని ఏమిటి అనేది బాప్ దాదా చూస్తున్నారు. మనస్సులోని ప్రేమ చేతుల ద్వారా కార్డులోకి వచ్చింది కనుకే ఒకరి కంటే ఒకరు మంచి, మంచిగా కార్డులు తయారుచేసారు. కార్డులు ఇక్కడ ఉన్నాయి కదా! మీరు చూడండి. మంచిది. 

విశ్వంలో నలువైపుల ఉన్నటువంటి సఫలతామూర్తి పిల్లలకు, అన్నీ సఫలం చేసుకునే తీవ్రపురుషార్ధి పిల్లలకు, సదా మీ యొక్క అకౌంట్ ని పరిశీలించుకునే పరిశీలకులకు మరియు భవిష్యత్తుని తయారుచేసే శ్రేష్టాత్మలకు, సదా మీ యొక్క ప్రతి అడుగులో బాబాని ప్రత్యక్షం చేసే గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ సన్స్ కు బాబా మరియు దాదా యొక్క చాలా, చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు, శుభాకాంక్షలు మరియు నమస్తే. 

Comments