31-12-1999 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
క్రొత్త శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖం ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి.
ఈరోజు బాప్ దాదా పరమాత్మ పాలనకు అధికారులు అయిన తన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. స్వయంగా పరమాత్ముని పాలనలో పాలింప పడుతున్నారంటే ఎంత భాగ్యవంతులు! మమ్మల్ని పరమాత్మ పాలిస్తున్నారు అని ప్రపంచం వారు కూడా అంటారు. కానీ ప్రత్యక్షంలో మాత్రం కొద్దిమంది విశేష ఆత్మలైన మీరే పాలింపబడుతున్నారు. పరమాత్మ పాలన, మరియు పరమాత్మ శ్రీమతం లభించాయి, ఆ శ్రీమతం ఆధారంగా నడుస్తున్నారు, పాలింపబడుతున్నారు. స్వయాన్ని ఈ విధమైన విశేష ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? మీ మహానత గురించి తెలుసా? వర్తమాన సమయంలో బ్రాహ్మణాత్మలు మహానాత్మలే అంతేకాకుండా భవిష్యత్తులో కూడా సర్వ శ్రేష్ట మహానాత్మలు! ద్వాపరయుగంలో కూడా మీ జడచిత్రాలు ఎంత ఉన్నతంగా తయారవుతాయంటే మీ చిత్రాల ముందుకు వెళ్ళగానే నమస్కారం చేస్తారు. మీకు ఎంత గొప్పతనం అంటే ఈనాటి వరకు కూడా ఏ ఆత్మనైనా దేవతగా తయారుచేస్తే అంటే లక్ష్మీ నారాయణులు, సీతారాముల వేషం వేసి తయారు చేస్తే లేదా దేవత యొక్క పాత్రను అభినయిస్తే వీరు సాధారణ మనుష్యులు అని తెలిసినప్పటికీ కూడా దేవతా పాత్రను అభినయిస్తున్న ఆ సాధారణ ఆత్మకి కూడా నమస్కరించేస్తారు. మీ రూపానికి గొప్పతనం ఎలాగూ ఉంటుంది కానీ నామధారి ఆత్మలను కూడా మహాన్ గా భావిస్తారు. ఈ విధమైన మహానతను అనుభవం చేసుకుంటున్నారా? తెలుసా, అర్ధం చేసుకుంటున్నారా లేక ప్రత్యక్ష రూపంలో స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే అనుభవం చేసుకోవటమే ముఖ్య ఆధారం.
బాప్ దాదా పిల్లలందరినీ అనుభవీ మూర్తిగా తయారుచేస్తున్నారు. కేవలం వినేవారు లేదా తెలుసుకునేవారిగానే కాదు. అనుభవం అనేది ప్రతి ఒక్కరి ముఖం మరియు నడవడిక ద్వారా తెలుస్తుంది. నడవడిక ద్వారా వారి స్థితి తెలిసిపోతుంది. కనుక మా నడవడిక ఎలా ఉంది అని చూసుకోండి. బ్రాహ్మణ నడవడిక ఉందా? బ్రాహ్మణులు అంటే సదా సంపన్న ఆత్మ. శక్తులతో కూడా సంపన్నం, గుణాలతో కూడా సంపన్నం... మరయితే నడవడిక ఆవిధంగా ఉందా? వీరు సాధారణంగా ఉన్నా కానీ అలౌకికంగా ఉన్నారు అని మీ ముఖం ద్వారా కనిపిస్తుందా? మీ అందరి దృష్టి, వృత్తి, వైబ్రేషన్స్ అలౌకికంగా అనుభవం అవుతున్నాయా? అంతిమజన్మ వరకు మీ యొక్క దివ్యత, మహానత జడచిత్రాల ద్వారా అనుభవం చేసుకుంటుంటే మరి వర్తమాన సమయంలో చైతన్య శ్రేష్ట ఆత్మలైన మీ ద్వారా అనుభవం అవుతుందా? జడచిత్రాలు మీవే కదా? అమృతవేళ నుండి ప్రతి నడవడికను పరిశీలించుకోండి - మా దృష్టి అలౌకికంగా ఉందా? ముఖకవళికలు సదా హర్షితంగా ఉంటున్నాయా? ఏకరసంగా, అలౌకికంగా ఉన్నాయా లేక సమయానుసారం మారిపోతూ ఉన్నాయా? కేవలం యోగంలో కూర్చున్నప్పుడు లేదా ఏదో విశేష సేవా సమయంలోనే అలౌకిక స్మృతి, వృత్తి ఉంటు న్నాయా లేక సాధారణ కర్మ చేస్తూ కూడా ముఖం మరియు నడవడిక విశేషంగా ఉంటున్నాయా? మీరు ఏ పనిలోనో బిజీగా ఉన్నప్పుడు, ఏదో అలజడి విషయం ఎదురుగా వచ్చినప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే, మీరు అలౌకికంగా ఉంటున్నారా? సాధారణ కార్యంలో కూడా మాట, నడవడిక, ముఖల అతీతంగా, ప్రియంగా అనుభవం అవుతున్నాయా? అని పరిశీలించుకోండి. ఏ సమయంలోనైనా ఏ ఆత్మ అయినా అకస్మాత్తుగా మీ ఎదురుగా వస్తే మీ యొక్క వైబ్రేషన్స్ ద్వారా, మాట, నడవడిక ద్వారా వీరు అలౌకిక ఫరిస్తా అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ రోజు సంగమం యొక్క రోజు. పాత శతాబ్దం వెళ్ళిపోతుంది, క్రొత్తది వస్తుంది. కనుక విశ్వం ముందు ఏమి నవీనత కనిపించాలి? లోపల స్మృతి ఉంటుంది లేదా అర్థం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం. కానీ స్థాపనా సమయం గురించి ఆలోచించండి - స్థాపన జరిగి ఎంత సమయం గడిచిపోయింది? జరిగిపోయిన సమయం అనుసరించి ఇప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? మరయితే ఏమి అనుభవం అవ్వాలి? చాలా మంచి, మంచి పురుషార్థీలు మంచి పురుషార్థం కూడా చేస్తున్నారు, ఎగురుతున్నారు అని బాప్ దాదాకి తెలుసు. కానీ ఈ 21వ శతాబ్దంలో బాప్ దాదా కొత్తదనాన్ని చూడాలనుకుంటున్నారు. అందరు మంచివారు, విశేషమైనవారు, గొప్పవారు కూడా కానీ బాబా యొక్క ప్రత్యక్షతకి ఆధారం - సాధారణ కార్యంలో ఉంటూ కూడా ఫరిస్తా స్థితి మరియు నడవడిక ఉండాలి. విషయం అలాంటిది, పని అటువంటిది, పరిస్థితులు అటువంటివి, సమస్య ఆవిధంగా ఉంది అందువలనే సాధారణత వచ్చేసింది. ఇలా బాప్ దాదా చూడాలనుకోవటం లేదు. ఫరిస్తా స్వరూపం అంటే స్మృతి స్వరూపంలో ఉండాలి, సాకారరూపంలో ఉండాలి. కేవలం అర్థం చేసుకోవటం, స్మృతిలో ఉంచుకోవటం వరకు కాదు, స్వరూపంలో ఉండాలి. ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపం అనుభవం అవ్వాలి. ఈవిధంగా పరివర్తన కావాలి. ఇలా ఉన్నారా లేక కొద్దిగా మారుతున్నారా? విషయం ఎలాంటిదో అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోకండి. విషయం మిమ్మల్ని ఎందుకు మార్చాలి? మీరు విషయాన్ని మార్చండి. మాట మిమ్మల్ని మారుస్తుందా లేక మీరు మాటని మార్చుకోవాలా? పరివర్తన అని దేనిని అంటారు? ప్రత్యక్ష జీవితం యొక్క ఉదాహరణ అని దేనిని అంటారు? ఎటువంటి సమయం మరియు ఎటువంటి పరిస్థితియో అటువంటి స్వరూపంగా అవ్వటం అనేది సాధారణ ప్రజలకి కూడా ఉంటుంది. కానీ ఫరిస్తా అంటే పాత లేదా సాధారణ నడవడిక, మాట నుండి అతీతం.
ఇప్పుడు మీ టాపిక్ ఒకటి ఉంది కదా - సమయం యొక్క పిలుపు. విశేష ఆత్మలైన మీ గురించి సమయం యొక్క పిలుపు ఏమిటంటే ఇప్పుడు ఫరిస్తాగా అంటే అలౌకిక జీవితం స్వరూపంలో కనిపించాలి. ఇలా జరుగుతుందా? టీచర్స్ చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది? జరుగుతుంది అనేది చాలా మంచి విషయం కానీ ఎప్పుడు జరుగుతుంది? ఒక సంవత్సరం కావాలా? 2000వ సంవత్సరం పూర్తి అవ్వాలా? ఎవరైతే కొద్ది సమయం కావాలంటారో వారు చేతులు ఎత్తండి? ఒక సంవత్సరం కాకపోతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే 3 నెలలు కావాలా చెప్పండి! దీనిలో చేతులు ఎత్తడం లేదు. మీ స్లోగన్ ఏమిటి? గుర్తు ఉందా? “ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు” ఈ స్లోగన్ ఎవరిది? బ్రాహ్మణులదా లేక దేవతలదా? బ్రాహ్మణులదే కదా! ఏమైనా కానీ అలౌకికత పోకూడదు, ఈ కొత్త శతాబ్దంలో బాప్ దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. దీని కొరకు నాలుగు మాటలపై ధ్యాస ఉంచు కోవాలి. అవి ఏవి? కొత్త విషయాలు కాదు పాత విషయాలే కానీ మరలా చెప్తున్నాను - 1. శుభచింతకులు 2. శుభ చింతన 3. శుభభావన, వీరు మారితే నేను మారతాను అనే భావన ఉండకూడదు. వారి పట్ల కూడా శుభభావన మరియు మీ పట్ల కూడా శుభభావన 4. శుభ శ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపం. శుభం అనే ఒక మాటను స్మృతి ఉంచుకోండి, దీనిలో నాలుగు విషయాలూ వచ్చేస్తాయి. అన్నింటిలో శుభం అనే ఒక మాటను గుర్తు పెట్టుకోవాలి. ఇది చాలాసార్లు విన్నారు, చాలాసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు స్వరూపంలోకి తీసుకురావటంపై ధ్యాస ఉంచుకోవాలి. వీరిని తయారు అవ్వవలసింది వీరే అని బాప్ దాదాకి తెలుసు మరియు రాబోయే వారు కూడా సాకార రూపంలో మిమ్మల్నే చూస్తారు.
ఈరోజు ఈ సంవత్సరం యొక్క చివరి రోజు కదా! బాప్ దాదా ఎక్కువమంది పిల్లల యొక్క సంవత్సరమంతటి లెక్కల ఖాతా చూశారు. ఏమి చూసి ఉంటారు? ముఖ్యంగా ఒక కారణాన్ని చూసారు. బాప్ దాదా ఏమి చూసారంటే తొలగించుకునే మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది. వ్యతిరేకంగా చూడటం, వినటం, ఆలోచించటం, జరిగిపోయిన విషయాలను తొలగించుకుంటున్నారు కూడా. తెలిసి ఉండి తొలగించుకోవటం ఒకటి, తెలియకుండా తొలగించుకోవటం మరొకటి. తొలగించుకుంటున్నారు కానీ మనస్సు అనే పళ్ళెం (ప్లేట్) లేదా పలక (ప్లేట్) లేదా కాగితం ఏదైనా అనండి కానీ పూర్తిగా తొలగించుకోవటం లేదు. ఎందుకు తొలగించుకోలేకపోతున్నారు? దానికి కారణం - ఇముడ్చుకునే శక్తి శక్తిశాలిగా లేదు. సమయం అనుసరించి ఇముడ్చుకుంటున్నారు మరలా సమయానికి బయటికి వచ్చేస్తున్నాయి. అందువలన బాప్ దాదా ఏవైతే నాలుగు మాటలు చెప్పారో అవి సదా ఉండటం లేదు. మనస్సు అనే పలక లేదా కాగితం పూర్తిగా స్వచ్చంగా కాకపోతే, పూర్తిగా చెరపకపోతే మరలా మంచిగా వ్రాసినా కానీ స్పష్టంగా ఉంటుందా? అంటే సర్వ గుణాలు, సర్వ శక్తులు ధారణ చేయాలనుకున్నా కానీ సదా మరియు పూర్తి శాతంలో చేయగలరా? అందువలన పూర్తిగా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా కూడా ఉండాలి. అప్పుడే ఈ శక్తులన్నింటినీ సహజంగా కార్యంలో ఉపయోగించగలరు. ఎక్కువ మంది ఆత్మల యొక్క పలక స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండటం లేదు. కారణం ఇదే. కొద్దికొద్దిగా జరిగిపోయిన విషయాలు లేదా జరిగిపోయిన నడవడిక, వ్యర్థవిషయాలు లేదా వ్యర్థనడవడిక సూక్ష్మంగా అణిగి ఉంటున్నాయి. అవి మరలా సమయానికి సాకార రూపంలోకి వచ్చేస్తున్నాయి. కనుక సమయానుసారం మొదట పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ఇతరులను పరిశీలన చేయటంలో నిమగ్నమవ్వకండి. ఎందుకంటే ఇతరులను పరిశీలించడం సహజం అనిపిస్తుంది. స్వయాన్ని పరిశీలించుకోవటం కష్టం అనిపిస్తుంది. నా మనస్సు అనే పలక వ్యర్ధం నుండి మరియు జరిగిపోయిన విషయాల నుండి పూర్తి స్వచ్చంగా ఉందా? అని పరిశీలించుకోండి. అన్నింటికంటే సూక్ష్మరూపం - తరంగాల రూపంలో ఉండి పోతుంది. ఫరిస్తా అంటే పూర్తిగా స్వచ్ఛం మరియు స్పష్టం. ఇముడ్చుకునే శక్తి ద్వారా అశుభాన్ని కూడా శుభంలోకి పరివర్తన చేసుకుని ఇముడ్చుకోండి. అశుభాన్ని అశుభంగా ఇముడ్చుకోకండి, శుభంలోకి మార్చుకుని ఇముడ్చుకోండి. అప్పుడే ఈ కొత్త శతాబ్దంలో నవీనత వస్తుంది.
రెండవ విషయం ఏమి చూసానో చెప్పనా? చెప్పనా లేక మోతాదు ఎక్కువ అయిపోయిందా? బాప్ దాదా ఇంతకు ముందు చెప్పారు - ఎలాగైనా కానీ మిమ్మల్ని నేను నాతోపాటు పరంధామానికి తీసుకువెళ్ళాల్సిందే. కొట్టి అయినా సరే, ప్రేమతో అయినా సరే తీసుకువెళ్ళాల్సిందే. అజ్ఞానులను అయితే కొట్టటం ద్వారా (శిక్షించటం) మరియు పిల్లలైన మిమ్మల్ని ప్రేమతో తీసుకువెళ్తాను. అదేవిధంగా బాప్ దాదా ఇప్పుడు కూడా చెప్తున్నారు - ఏమి చేసి అయినా కానీ మహానాత్మలను ఫరిస్తా రూపంలో ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయవలసిందే. తయారే కదా! బాప్ దాదా చెప్పారు కదా - ఏమి చేసి అయినా సరే తయారు చేయవలసిందే లేకపోతే కొత్త ప్రపంచం ఎలా వస్తుంది! మంచిది.
మరో విషయం ఏమి చూశారు? సంవత్సరం యొక్క అంతిమం కదా! బాప్ దాదా చాలామంది అనే మాట అంటున్నారు. అందరూ అని అనటం లేదు, ఎక్కువమందిలో ఏ విషయం చూశారు? ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే నవ నిర్మాణం జరుగుతుంది. రెండవ కారణం - రకరకాల రూపాలలో సోమరితనం చూసారు. కొంతమందిలో చాలా రాయల్ రూపం యొక్క సోమరితనం కూడా చూసారు.
సోమరితనానికి కారణం ఒకే మాట - "అన్నీ జరుగుతాయి” ఎందుకంటే సాకార రూపంలో అయితే ప్రతి ఒక్కరి ప్రతి కర్మను ఎవరూ చూడలేరు. సాకార బ్రహ్మా కూడా సాకారంలో ఉన్నప్పుడు చూడలేరు కానీ ఇప్పుడు అవ్యక్తరూపంలో ఎవరి యొక్క ఏ కర్మ అయినా చూడవచ్చు. పరమాత్మకి వేల, లక్షల కళ్ళు, లక్ష చెవులు ఉంటాయి అని మహిమ చేస్తారు కదా! ఇప్పుడు నిరాకారుడు మరియు సాకార బ్రహ్మా ఇద్దరు వెనువెంట చూడగలరు. ఎవరు ఎంత దాచినా కానీ కనిపిస్తుంది. దాచటంలో కూడా చాలా రాయల్టీగా (సూక్ష్మంగా) దాస్తున్నారు, సాధారణంగా కాదు. సోమరితనం 1.స్థూల రూపంలో ఉంటుంది, 2. లోతైన రూపంలో ఉంటుంది. కానీ రెండింటిలో ఒకే మాట - అన్నీ అవే జరుగుతాయి, ఏమౌతుందో చూస్తాము, ఏమి అవ్వదు ఇప్పుడయితే నడవండి తర్వాత చూద్దాము”.... ఇవన్నీ సోమరితనం యొక్క సంకల్పాలు. కావాలంటే బాప్ దాదా అందరికీ చెప్పగలరు కూడా. కానీ కొద్దిగా గౌరవం, పద్దతి కాపాడాలి అని మీరంటారు కదా! అందువలన బాప్ దాదా కూడా మీ గౌరవ మర్యాదలను కాపాడుతున్నారు. కానీ ఈ సోమరితనం పురుషార్థాన్ని తీవ్రం కానివ్వదు, పాస్ విత్ ఆనర్ కానివ్వదు. “అన్నీ అవే జరుగుతాయి” అని స్వయం అనుకుంటున్నారు కదా! అలాగే ఫలితంలో మీరు నడిచే వెళ్తారు కానీ ఎగరరు. కనుక ఏ రెండు విషయాలు చూసారో విన్నారా! పరివర్తనలో ఏదోక రూపంలో ప్రతి ఒక్కరిలో వేర్వేరు రూపాలలో సోమరితనం ఉంది. పిల్లలు ఏమౌతుందో చూస్తాంలే అంటుంటే ఆ సమయంలో బాబా నవ్వుకుంటున్నారు. బాప్ దాదా కూడా ఏమౌతుందో చూడండి! అని అంటున్నారు. ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మీరు కావాలనుకున్నా, వద్దనుకున్నా బలవంతంగానైనా మిమ్మల్ని తయారుచేయవలసిందే మరియు మీరు తయారవ్వవలసిందే. ఈ రోజు కొద్దిగా కఠినంగా చెప్పాను. ఎందుకంటే మీరు ఇది చేస్తాము, అది చేస్తాము.... అని మీరు ప్లాన్స్ తయారు చేస్తున్నారు కానీ కారణాన్ని నివారణ చేయకపోతే అది అల్పకాలికం అవుతుంది. మరలా ఏదైనా విషయం వస్తే విషయమే అలాంటిది కదా! కారణమే అలాంటిది! నా కర్మలఖాతా అలా ఉంది! అని అంటారు. అందువలన తయారవ్వవలసిందే, అంగీకారమే కదా! టీచర్స్ కి అంగీకారమేనా? విదేశీయులకి అంగీకారమేనా? బాప్ దాదా చెప్తున్నారు - తయారవ్వవలసిందే. మరలా క్రొత్త శతాబ్దంలో తయారైపోయాము అని చెప్తారు కదా! తక్కువలో తక్కువ సమయం తీసుకోవాలి కదా! కానీ బాప్ దాదా ఒక సంవత్సరము సమయం ఇస్తున్నారు. సహజమే కదా! విశ్రాంతిగా చేయండి. ఆరామ్ అంటే ఆ రామ్ అంటే బాబాని జ్ఞాపకం చేసిన తర్వాత చేయాలి. ఆరామ్ అంటే డన్ లప్ పరుపులపై విశ్రాంతి తీసుకోవటం కాదు. బాప్ దాదాకి మీపై ఎక్కువ ప్రేమ ఉందా? మీకు బాబాపై ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? బాబాకా లేక మీకా?
బాప్ దాదాకి మీ అందరిపై నిశ్చయం ఉంది - పిల్లలైన మీరందరు ప్రేమకి ఫలితంగా బ్రహ్మాబాబా సమానంగా తప్పక తయారవుతారు. తయారవుతారు కదా! బాప్ దాదా వదిలి పెట్టేది లేదు. ప్రేమ ఉంది కదా! ఎవరితో ప్రేమ ఉంటుందో వారి తోడు వదిలిపెట్టలేరు. బ్రహ్మాబాబాకి మీపై చాలా ప్రేమ ఉంది. కనుక నా పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తుంటారు. కనుక సమానంగా అయితే తయారవుతారు కదా!
బ్రహ్మాబాబా యొక్క ఒక ఆత్మికసంభాషణ వినిపిస్తున్నాను. ఇప్పుడు జనవరి 18 రానున్నది కదా! కనుక బ్రహ్మాబాబా శివబాబాతో చెప్తున్నారు. నీవు పిల్లలచే తారీఖు నిర్ణయం చేయించు, నేను ఎప్పటి వరకు ఎదురుచూడను? అని. ఈ తారీఖు నిర్ణయించండి అని చెప్తున్నారు. అయితే శివబాబా ఏమి చెప్తారు? నవ్వుకుంటున్నారు. అయినప్పటికీ మరలా బాప్ దాదా చెప్తున్నారు - పిల్లలే తారీఖు నిర్ణయిస్తారు కానీ బాప్ దాదా కాదు. బ్రహ్మాబాబా చాలా స్మృతి చేస్తున్నారు. అయితే తారీఖు నిర్ణయిస్తారా?
క్రొత్త సంవత్సరంలో సమానంగా అయ్యే ఈ ధృడసంకల్పం చేయండి. మేము ఫరిస్తాగా తయారవ్వవలసిందే అనే లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు పాత విషయాలను సమాప్తి చేయండి. మీ అనాది, ఆది సంస్కారాలను ప్రత్యక్షం చేయండి. నడుస్తూ, తిరుగుతూ నేను బాబా సమాన ఫరిస్తాను, నాకు పాత సంస్కారాలు, పాత విషయాలతో ఏ సంబంధం లేదు అని స్మృతి ఉంచుకోండి. అర్థమైందా? ఈ పరివర్తనా సంకల్పానికి నీరు ఇస్తూ ఉండాలి. ఎలాగైతే బీజానికి నీరు, ఎండ ఉన్నప్పుడే ఫలానిస్తుంది. అదేవిధంగా ఈ సంకల్పమనే బీజానికి స్మృతి అనే నీరు మరియు ఎండనిస్తూ ఉండాలి. బాప్ దాదాతో నేను చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? అనేది మాటిమాటికి పునరావృత్తం చేసుకోండి. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి మహాన్ ఆత్మలకు, స్వపరివర్తన శక్తిని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించేవారికి, విశ్వపరివర్తన ఆత్మలకు, సదా ధృడనిశ్చయం ద్వారా ప్రత్యక్ష స్వరూపం చూపించే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా స్వరూప ఆత్మలకు, సదా ఒక బాబా తప్ప ఇంకెవ్వరు లేరు ఇలా బాబా సమానంగా అయ్యే ఆత్మలకు, బాప్ దాదా ప్రేమకి రిటర్న్ ఇచ్చే మహావీర్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment