30-03-1998 అవ్యక్త మురళి

           30-03-1998         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సర్వప్రాప్తుల యొక్క స్మృతిని ప్రత్యక్షం చేసి అచంచల స్థితిని అనుభవం చేసుకోండి మరియు జీవన్ముక్తులు అవ్వండి. 

ఈరోజు భాగ్య విధాత బాబా తన యొక్క విశ్వంలో కెల్లా సర్వ శ్రేష్టభాగ్యవంతులైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క భాగ్యం యొక్క మహిమ స్వయం భగవంతుడు పాడుతున్నారు. బాబా యొక్క మహిమ అయితే ఆత్మలు పాడతారు కానీ పిల్లలైన మీ యొక్క మహిమ స్వయం బాబా పాడుతున్నారు. మాకు ఇంత శ్రేష్ట భాగ్యం తయారై ఉంది అని ఎప్పుడైనా కలలోనైనా ఆలోచించారా! అయినా కానీ భాగ్యం తయారై ఉంది మరియు తయారైంది. ప్రపంచంలోని వారు అంటారు - మమ్మల్ని భగవంతుడు రచించారు అని. కానీ వారికి భగవంతుని గురించి తెలియదు, భగవంతుని రచన గురించి కూడా తెలియదు. భాగ్యవంత పిల్లలైన మీరు ప్రతి ఒక్కరు అనుభవం మరియు నషాతో చెప్తారు - మేము శివవంశీ బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులం అని. మనల్ని భగవంతుడు ఎలా రచించారు అనేది మీకు తెలుసు. చిన్న పిల్లవాడైనా, ముసలి అన్నయ్య అయినా, శక్తులైనా కానీ ఎవరిని అయినా కానీ మీ తండ్రి ఎవరు అని అడిగితే, ఏమి చెప్తారు? నిశ్చయంగా చెప్తారు కదా - మమ్మల్ని శివబాబా, బ్రహ్మాబాబా ద్వారా రచించారు. అందువలన మేము భగవంతుని పిల్లలం అని. స్వయం భగవంతునితో కలుసుకుంటున్నారు. పరమాత్మ లేదా భగవంతుడు మాకు తండ్రియే కాదు, టీచర్, సద్గురువు కూడా. అందరికీ ఈ నషా ఉందా? (చప్పట్లు కొట్టారు) ఒక చేతితో చప్పట్లు కొట్టండి. ఈ వ్యాయామాన్ని కూడా వృద్దులకు నేర్పించాలి. పిల్లలు సంతోషంగా ఉండటం చూసి బాప్ దాదా కూడా సంతోషంలో ఊగుతున్నారు మరియు ఓహో నా శ్రేష్ఠభాగ్యవాన్ విశేషాత్మలూ! అంటున్నారు. తండ్రి రూపంలో పరమాత్మ పాలనను అనుభవం చేసుకుంటున్నారు. పరమాత్ముని ఈ పాలన కల్పమంతటిలో ఈ బ్రాహ్మణ జన్మలో పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్ముని పాలనలో ఆత్మకు సర్వప్రాప్తి స్వరూపం అనభవం అవుతుంది. పరమాత్మ ప్రేమ సర్వసంబంధాలను అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ మీ దేహాన్ని కూడా మరిపిస్తుంది అంతేకాకుండా అనేక స్వార్ధ ప్రేమలను కూడా మరిపిస్తుంది. ఇటువంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యవాన్ ఆత్మలు. మీకు ఎంత భాగ్యం లభించిందంటే స్వయం బాబా తన వతనాన్ని వదిలి ఈశ్వరీయ విధ్యార్థులు అయిన మిమ్మల్ని చదివించడానికి వస్తున్నారు. రోజు ఉదయమే దూరదేశం నుండి చదివించడానికి వచ్చే టీచర్ ని చూసారా? ఇటువంటి టీచర్ ని ఎప్పుడైనా చూసారా? పిల్లలైన మీ కోసం బాబా శిక్షకుడు అయ్యి చదివించడానికి మీ దగ్గరకి వస్తున్నారు మరియు ఎంత సహజంగా చదివిస్తున్నారు! చదువు అంతా రెండు మాటల్లోనే - మీరు మరియు బాబా, ఈ రెండు మాటలలోనే సృష్టిచక్రం అనండి, డ్రామా అనండి, కల్పవృక్షం అనండి ఏదైనా కానీ మొత్తం జ్ఞానం అంతా నిండి ఉంది. ఇతర చదువులలో అయితే బుద్ధిపై ఎంత భారం పడుతుంది కానీ బాబా చదివించే చదువు ద్వారా బుద్ది తేలిక అయిపోతుంది. తేలికతనానికి గుర్తు - పైకి ఎగరటం. తేలికైన వస్తువు స్వతహాగానే ఉన్నతంగా ఉంటుంది. ఈ చదువు ద్వారా మనస్సు, బుద్ధి ఎగిరేకళను అనుభవం చేసుకుంటాయి. బుద్ధి తేలిక అయ్యింది కదా! మూడులోకాల జ్ఞానం లభిస్తుంది. ఇటువంటి చదువు మొత్తం కల్పంలో ఎవరైనా చదువుకున్నారా? ఇలా చదివించేవారు కూడా ఎవరైనా దొరికారా! అంటే ఇది భాగ్యం కదా! 

సద్గురువు ద్వారా శ్రీమతం ఎలా లభిస్తుందంటే - ఏమి చేయను? ఏవిధంగా నడవను? ఇలా చేయానా, వద్దా? ఇలా చేయనా లేక అలా చేయనా?.... ఇటువంటి ప్రశ్నలన్నీ సదాకాలికంగా సమాప్తి అయిపోతాయి. ఏమి చేయను, ఏవిధంగా చేయను, ఇలా చేయనా, అలా చేయనా.... ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే మాట - తండ్రిని అనుసరించండి. సాకార కర్మలో బ్రహ్మాబాబాని అనుసరించండి, నిరాకారి స్థితిలో, అశరీరి అవ్వటంలో శివబాబాను అనుసరించండి. బాబా మరియు దాదా ఇద్దరిని అనుసరించటం అంటే ప్రశ్నార్ధకం సమాప్తి అవ్వటం లేదా శ్రీమతంపై నడవటం. ఇది కష్టమా? ఏదైనా అడగవలసిన అవసరంఉంటుందా? కాపీ చేయాలి అంతే, మీ బుద్దిని ఉపయోగించనవసరం లేదు. బాబా సమానంగా అవ్వటం అంటే ఫాలోఫాదర్ చేయటం. కష్టమా, సహజమా? సహజం కదా? 30 సంవత్సరాల నుండి ఉన్న వారు చేతులు ఎత్తండి! మంచిది, 30 సంవత్సరాలలో కష్టం అనిపించిందా లేక సహజం అనిపించిందా? 30 సంవత్సరాల నుండి ఉన్నవారికి సహజం, అయితే తర్వాత వచ్చిన వారికి సహజమా లేక కష్టమా? సహజమే కదా? (వేడి కారణంగా అందరూ చేతులతో రంగురంగుల విసనకర్రలతో విసురుకుంటున్నారు) మంచిది, విసనకర్రల మెరుపు కూడా బావుంది, దృశ్యం వుంది. ఏదో నవీనత కావాలి కదా! ఈ గ్రూప్ కి ఇది కూడా నవీనత, ఇది కూడా టి.విలో వచ్చింది. మంచిది, అందరు పరుగుపరుగున వచ్చారు. బాప్ దాదా కూడా స్నేహానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. హద్దు గురువులు ఎన్ని వరదానాలు ఇస్తారు? ఒకటి లేదా పది ఇస్తారు అంతకంటే ఎక్కువ ఇవ్వరు కానీ మీకు రోజూ సద్గురువు ద్వారా వరదానం లభిస్తుంది. ఇలాంటి గురువుని ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా! మీరే చూసారు మరియు కల్పకల్పం చూస్తారు. ఈవిధంగా సదా మీ భాగ్యం యొక్క ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి. కేవలం బుద్దిలో గుప్తంగా ఉంచుకోవటం కాదు, ప్రత్యక్షం చేయండి. గుప్తంగా ఉంచుకునే సంస్కారాన్ని మార్చుకుని ప్రత్యక్షం చేయండి. మీ ప్రాప్తుల యొక్క జాబితాను సదా బుద్ధిలో ప్రత్యక్షం చేసుకోండి. ప్రాప్తుల యొక్క జాబితా ప్రత్యక్షంగా ఉంటే అప్పుడు ఏ రకమైన విఘ్నం యుద్ధం చేయదు. అది గుప్తం అయిపోతుంది మరియు ప్రాప్తులు ప్రత్యక్షంగా ఉంటాయి. 

కొంతమంది పిల్లలు శ్రమ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, యోగం చేయాలని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు, ఆత్మాభిమాని స్థితికి బదులు దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు అని విన్నప్పుడు అది బాబాకి ఇష్టం అనిపించటం లేదు. దీనికి కారణం ఏమిటి? మీ భాగ్యం యొక్క ప్రాప్తులు ప్రత్యక్షంగా ఉండటం లేదు, గుప్తంగా ఉంటున్నాయి మరలా ఎవరైనా స్మృతి ఇప్పిస్తే అప్పుడు ఇలా జరగాలి కదా అని ఆలోచిస్తున్నారు. అందువలన చాలా సహజమైన పురుషార్ధం ఏమిటంటే ప్రాప్తులను ప్రత్యక్షంగా ఉంచుకోండి. బ్రాహ్మణులుగా అయినప్పటి నుండి మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. అలజడిలోకి రాకండి, అచంచలంగా అవ్వండి, ఎందుకంటే ఆబూలో మీ స్మృతిచిహ్నం ఏమిటి? అచల్ లేక అలజడి ఘరా? అచల ఘర్ కదా? ఇది ఎవరి స్మృతిచిహ్నం? మీ స్మృతిచిహ్నమే కదా? ఎప్పుడైనా సూక్ష్మంగా పురుషార్ధం యొక్క మార్గం కష్టంగా అనిపించినప్పుడు, బుద్ది ఎక్కువ అలజడిలో ఉన్నప్పుడు మీ యొక్క ఈ స్మృతిచిహ్నాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. కొన్నిసార్లు పిల్లలు జ్ఞానం యొక్క విషయాలు మాట్లాడుతూ ఉంటారు - నేను ఆత్మ, ఇది డ్రామా, ఇది విఘ్నం , ఇది సైడ్ సీన్ అని ఇలా అంటూ ఉంటారు మరియు చలిస్తూ ఉంటారు కూడా. చలిస్తూ, చలిస్తూనే మాట్లాడుతూ ఉంటారు. ఇలా బుద్ది చంచలంగా ఉండి అచంచలం కానప్పుడు మధువనంలోని అచల్ ఘర్ యొక్క స్మృతిచిహ్నం స్మృతి తెచ్చుకోండి. ఇది స్థూలమైనది కదా! సూక్ష్మమైనది కాదు, కళ్ళతో చూడదగినది. నా యొక్క స్మృతిచిహ్నం అచల్ ఘర్ కానీ అలజడి ఘర్ కాదు అని స్మృతి ఉంచుకోండి. ఎందుకంటే బాప్ దాదా ఈ సంవత్సరాన్ని పిల్లలందరు ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నారు. చేతులు ఎత్తిస్తే కొంతమంది ఎత్తుతున్నారు, కొంతమంది ఎత్తడం లేదు. కనుక ఇలా కాదు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టండి (అందరు కొట్టడం మొదలు పెట్టారు) ఇప్పుడు కొట్టారు మంచిదే, కానీ ఇలాగే ఈ సంవత్సరం చివర్లో ఇంత గట్టిగా చప్పట్లు కొట్టడం బాబా చూడాలి. ఇప్పుడు కొట్టారు మంచిదే కానీ అప్పుడు కూడా కొట్టాలి, కొడతారా? చేతులతో చప్పట్లు కొట్టి సంతోషం అయితే చేసారు, జనవరి18వ తారీఖు విశేషంగా బ్రహ్మాబాబా శరీరం నుండి ముక్తి అయిన రోజు కనుక. కానీ బాప్ దాదా ఈ క్రొత్త సంవత్సరంలో మరలా చేతులు ఎత్తిస్తారు - ముక్తి సంవత్సరం జరుపుకున్నారా లేదా కేవలం ఆలోచించారా? జరుపుకోవాలి, జరుపుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోలేదు కదా! స్వరూపంలోకి తీసుకువచ్చారా, ఇలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ అంతిమంలో కూడా ఆలోచిస్తూనే ఉండిపోతారా! బాప్ దాదా ఈ ఫలితాన్ని చూడాలనుకుంటున్నారు. చూపిస్తారా? మంచిది, జ్ఞాపకం ఉంటుంది కదా! ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి. బాబా స్మృతితో పాటు బాబా ఏదైతే ఇచ్చారో ఆ స్మృతిని కూడా ప్రత్యక్షం చేయండి - ఏవిధంగా తయారుచేశారు మరియు ఏమి లభించింది! 

బాప్ దాదా ఈ సంవత్సరం తర్వాత ప్రతి ఒక బిడ్డను జీవన్ముక్తి స్థితిలో చూస్తారు. భవిష్యత్తులో జీవన్ముక్తులు అవుతారు కానీ ఆ జీవన్ముక్త సంస్కారాన్ని ఇప్పటి నుండే నింపుకోవాలి మరియు నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్తి ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటినుండే అనుభవంలోకి తీసుకురండి, ఎందుకు? బాప్ దాదా ఇంతకు ముందు కూడా సైగ చేశారు - సమయం యొక్క పరివర్తన అనేది విశ్వపరివర్తక ఆత్మలైన మీ కోసం ఎదురుచూస్తుంది అని. ప్రకృతి, ప్రకృతి పతులైన మీ కోసం విజయీమాల పట్టుకుని ఆహ్వానిస్తుంది. సమయం విజయీ గంట మ్రోగించడానికి భవిష్య రాజ్యాధికారులైన మీరు ఎప్పుడు వస్తారు, గంట ఎప్పుడు మ్రోగించాలి అని ఎదురుచూస్తుంది. భక్తాత్మలు, మా యొక్క పూజ్య దేవాత్మలు ఎప్పుడు ప్రసన్నమై మాకు ముక్తి యొక్క వరదానం ఇస్తారు అని ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు. దు:ఖీ ఆత్మలు, మా యొక్క దు:ఖహర్త, సుఖకర్త ఆత్మలు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు అని పిలుస్తున్నారు. వీరందరు మీ కోసం ఎదురుచూస్తున్నారు, ఆహ్వానం చేస్తున్నారు. అందువలన ఓ దయాహృదయ, విశ్వకళ్యాణకారి ఆత్మలూ! ఇప్పుడు వీరి నిరీక్షణను పూర్తి చేయండి. అందరూ మీ కోసం ఆగి ఉన్నారు. మీరందరు ముక్తి అయిపోతే సర్వాత్మలు, భక్తులు, ప్రకృతి అన్నీ ముక్తి అయిపోతాయి. కనుక ముక్తులుగా అవ్వండి, ముక్తి ఇచ్చే మాస్టర్‌ దాత అవ్వండి. ఇప్పుడు విశ్వపరివర్తన యొక్క బాధ్యతా కిరీటధారులుగా అవ్వండి. భాధ్యతాదారులు కదా! బాబాతో పాటు మీరు సహాయకారులు. మీకు దయ రావటంలేదా? మనస్సులో దు:ఖం యొక్క విలాపం అనుభవం అవ్వటం లేదా? ఓ విశ్వపరివర్తక ఆత్మలూ! ఇప్పుడు మీ భాధ్యతా కిరీటధారి అయ్యే మహోత్సవాన్ని జరుపుకోండి. ఇప్పుడు ఫంక్షన్స్ అయితే చాలా చేసారు, కానీ ఫంక్షన్స్ యొక్క ఫలితం ఏమిటి? గోల్డెన్ చున్నీ వేసుకున్నారు మరియు కిరీటం పెట్టుకున్నారు, జరుపుకున్నారు...... దీనికి బాప్ వాదా కూడా సంతోషిస్తున్నారు కానీ చున్నీ ధరించడం, మాల ధరించడం, గంధం పెట్టుకోవటం, పాండవులు కిరీటం వలె తలపాగా ధరించడం ఇలా జరుపుకోవడం అంటే బాధ్యతను సంభాళించడం. పిల్లలు సంతోషపడ్డారు మరియు బాబా ఇంకా సంతోషపడ్డారు. కానీ భవిష్యత్తు ఏమిటి? వీటన్నింటినీ బీరువాలో పెట్టుకోవటమే జరుపుకోవటం కాదు, ఈ చున్నీ స్వర్ణిమ స్థితికి గుర్తు. కేవలం అలమారులో పెట్టి ఉంచడం కాదు, మనస్సులో స్మృతి ఉంచుకోవాలి. జరుపుకోవటం అంటే బాబా యొక్క కార్యంలో బాధ్యతాధారి అవ్వటం. చున్నీ ధరిస్తే చాలా ఇష్టం కదా!, ఇది మంచిదే, బాప్ దాదా కూడా మంచిగా భావిస్తున్నారు, కానీ అవినాశి సహయోగిగా అవ్వాలి. 

ఈ సంవత్సరం కోసం బాప్ దాదా సైగ చేసారు - ఈ సంవత్సరం చివర్లో జనవరి 18 వ తారీఖుకి ముక్తి సంవత్సరం జరుపుకోవాలి అని. చప్పట్లు కొట్టేవారు మేము తయారవుతాము అని అనుకుంటున్నారా? ఇక మరలా బాబా మేము తయారవుదాము అనుకుంటున్నాము కానీ ఏమి చేయము, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పకండి. ఇలాంటి విషయాల నుండి కూడా ముక్తి అవ్వాలి, ఏమి చేయము అని అనటం కాదు, తయారవ్వవలసిందే. ఈ భాష నుండి కూడా ముక్తి అవ్వాలి. ఏది ఏమైనా జరగవలసిందే, తయారవ్వవలసిందే అని అనుకోవాలి. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - 100 హిమాలయ పర్వతాలతో సమానమైన పెద్ద పెద్ద విఘ్నాలు వచ్చినా కానీ తొలగిపోము, ఓడిపోము, కిరీటధారణా మహోత్సవాన్ని, ముక్తి సంవత్సరాన్ని తప్పక జరుపుకుంటాం అని అనాలి. బాప్ దాదా రోజూ చార్జ్ చూస్తారు. ఇక్కడి నుండి వెళ్ళగానే మరలా ట్రైన్లోనే ఏమయ్యిందో తెలియదు అనకండి, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో కొంగలు హంసలు ఇద్దరం ఉన్నాము కదా కనుక యుద్ధం జరిగి ఇది అయిపోయింది, అది అయిపోయింది.... ! ఇవన్నీ వినను. మీ ఉత్తరం వేస్ట్ పేపర్ బాక్స్ లో వేసేస్తారు, వినేది లేదు. కనుక తయారవ్వవలసిందే అనే ధృడసంకల్పం పెట్టుకోండి. ఎక్కడ ధృడత ఉంటుందో అక్కడ సఫలత లేకపోవటం అనేది అసంభవం. అందరూ ధృఢసంకల్పం గలవారే కదా! టీచర్స్ చేతులు ఎత్తండి? టీచర్స్ చాలామంది ఉన్నారు. మొత్తం సెంటర్స్ అన్నీ ఖాళీ చేసి వచ్చేసారా ఏమిటి? 

ఒక శుభవార్త చెప్తున్నాను - బాప్ దాదా ఇప్పుడు చూసారు మరియు విన్నారు, మధువనం వారందరూ తమ పరివర్తన యొక్క లక్ష్యం చాలా బాగా పెట్టుకున్నారు. లక్షణాలు అయితే చూస్తాను కానీ లక్ష్యం బాగా పెట్టుకున్నారు. తమలో వచ్చిన పరివర్తన గురించి కూడా వ్రాసారు. పరివర్తన రావటం అనేది మొదలైంది, ఇక ముందు కూడా వస్తుంది అని బాప్ దాదాకి సంతోషంగా ఉంది. అందరూ తమ ధృడసంకల్పం యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు బాగా చూపించారు. ఇప్పుడు కాగితంపై వ్రాసారు కానీ కాగితంపై వ్రాయడానికి ముందు మొదట అడుగు వేసారు. బాప్ దాదాకి ఆనందం అనిపించింది ఎందుకు? మొత్తం ప్రపంచానికి అర్జునులు మధువన నివాసీలు. మొదట నిమిత్తులు మధువననివాసీలు, రెండవ నెంబర్ నిమిత్తులు - దేశ, విదేశాలలోని నిమిత్త టీచర్స్ మరియు మొత్తం పరివారం యొక్క సర్వ సహయోగి బ్రాహ్మణాత్మలు. మధువనం యొక్క పటం చూస్తే చాలా మారిపోయినట్లు బాబాకి కనిపించాలి. మధువనం వారు తక్కువమంది వ్రాసారు. కొంతమంది అసలు వ్రాయలేదు కూడా! ముందు కూర్చున్నవారు చాలా తక్కువమంది వ్రాసారు. చాలా బిజీగా ఉన్నట్లున్నారు, కానీ బాబా చెప్పినప్పుడు వ్రాయటం వలన కూడా మార్కులు జమ అవుతాయి. ఒకవేళ వ్రాయకపోతే ఎగస్ట్రా మార్కులు తక్కువ అయిపోతాయి, నష్టపోతారు. స్వయంగా బాబా ద్వారా ఆజ్ఞ లభించినా, నిమిత్త ఆత్మలైన దాదీల ద్వారా లభించినా దానికి గౌరవం ఇవ్వటం చాలా అవసరం. దీనిలో సాకులు చెప్పకూడదు, సోమరితనంగా అవ్వకూడదు. మార్కులు జమ అవ్వవు. ఇక ముందు కోసం బాప్ దాదా చెప్తున్నారు. అందువలన దీనికి గొప్పతనం ఇవ్వటం అంటే మహాన్ గా అవ్వటం. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. పిల్లలు చాలా చతురులు, బాప్ దాదాకి తెలుసు కదా అంటారు, తెలుసు, అయినా కానీ ఎందుకు చెప్పారు? తెలిసి ఉండి కూడా చెప్పారు కదా! ఇలా చెప్పి తప్పించుకోకూడదు, కొన్ని పనులు చిన్నవి అయినా కానీ వాటిని చేయటంలో మరిన్ని మార్కులు జమ అవుతాయి. కొంతమంది విద్యార్థులు గత సంస్కారానికి వశమై చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకి వెళ్తున్నారు. కానీ ఏదొక బంగారు దారం, చాలా లోతైన దారం వారిని ముందుకి వెళ్ళనివ్వటం లేదు. ఈ లోతైన దారం మిగిలిపోయింది అని వారు అనుకుంటున్నారు కూడా కానీ.... కానీ.... అని అంటారు. చిన్న చిన్న విషయాలలో కూడా అలాగే అనటం ద్వారా మార్కులు జమ చేసుకునే పురుషార్థీలు కూడా ఉన్నారు. ఇలా కొన్ని కొన్ని మార్కులను కలుపుకుంటూ ముందుకి కూడా వెళ్ళిపోతారు. ఇలాంటి వారు ఉదాహరణగా కూడా బాప్ దాదా దగ్గర ఉన్నారు. అందువలన సహజ పద్దతి ఏమిటంటే చిన్న చిన్న విషయాలను అలాగే అని అనటం ద్వారా మార్కులు జమ చేసుకుంటూ వెళ్ళండి, కట్ చేయకండి, జమ చేసుకోండి చాలామంది మంచి ఉత్సాహ, ఉల్లాసాలను చూపించారు, ఇలా ధృడసంకల్పం పెట్టుకున్నవారికి విశేషంగా మధువన నివాసి పిల్లలకు అలాగే అని అనినందుకు బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రియస్మృతులు కూడా ఇస్తున్నారు. లక్షరెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే మధువనం అంటే బాప్ దాదా యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే అద్దాల మహల్. కాగితం వరకు వచ్చినందుకు సంతోషం, ఇక కర్మలోకి తీసుకురావాలి, సరేనా! మంచిది, శుభాకాంక్షలు.! 

30 సంవత్సారాల నుండి ఉన్నవారు చాలా ఆనందంలో ఉన్నారు కదా! (1000 మంది వచ్చారు) లేచి నిల్చోండి అని బాప్ దాదా అంటే మాతలు ముందుకు వచ్చేస్తారు. అందువలన లేవమని అనటం లేదు. ఉత్సవం జరుపుకునేవారు చేతులు ఎత్తండి! బాప్ దాదాకి ఈ గ్రూప్ అంటే చాలా, చాలా, చాలా హృదయపూర్వక గౌరవం, ఎందుకు? ఎందుకంటే ఈ పాండవులు, మరియు మాతలే సేవ యొక్క స్థాపనలో, ఆదిలో సేవాకేంద్రాలు తెరిచే సమయంలో, బీదజీవితం ఉన్నప్పుడు ఆ బీద జీవితంలో సేవాకేంద్రాలు తెరిచారు. అలాంటి అవసర సమయంలో ఈ సేన తమ తనువు, మనస్సు, ధనాలతో నిమిత్తమై సేవాస్థానాలను స్థాపించారు. అవసర సమయంలో ఎవరైతే సహయోగి అవుతారో వారి 8 అణాలు, 8 కోట్లు అయిపోతాయి. బాప్  దాదాకి జ్ఞాపకం ఉంది - వారు స్వయం బంధనాలలో ఉంటూ కూడా ఒక గిన్నెతో పిండి, ఒక గిన్నెతో పంచదార, ఒక గిన్నెతో నెయ్యి, ఇలా గిన్నెలు, గిన్నెలు తెచ్చేవారు. అంటే ఎంత సత్యమైన మనసో ఆలోచించండి! తమ ఇంటి ఖర్చుతో బాప్ దాదా యొక్క సేవాకేంద్రం నడిపించేవారు. తమ వ్యక్తిగత జమఖాతా నుండి తమ ఖర్చులు తగ్గించుకుని సేవాకేంద్రాలను స్థాపించారు. అంటే వీరికి ఎంత భాగ్యం! ఆవిధంగా సమయానికి సహయోగి అయిన ఆత్మలకు బాప్ దాదా కూడా నమస్తే చెప్తున్నారు. వీరి అనుభవం చాలా మంచిది, భాగవతం అంతా వీరిదే. అందువలన బాప్ దాదా సంతోషిస్తున్నారు - అందరు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో ప్రయత్నం చేసి చేరుకున్నారు. దీనికి కూడా బాప్ దాదా సంతోషిస్తున్నారు. కర్రలు పట్టుకుని నడుచుకుంటూ వచ్చారు. మీకు రెండు కాళ్ళే కానీ వీరికి మూడుకాళ్ళు. వారు నడుస్తుంటే దృశ్యం బావుంది కదా! వీరిని నడిపించి చూడండి! రేపు వీరిచే యాత్ర చేయించండి, క్లాస్ రూమ్ నుండి బండారీ వరకు నడిపించండి చాలు, ఎలా నడుస్తారో చూడండి, దృశ్యం చాలా బావుంటుంది. ఎవరూ పడిపోకూడదు. ఎవరైనా పడిపోయేవారుంటే కూర్చుండిపోండి, పడిపోకండి. బాప్ దాదా వీరిచేత నాట్యం చేయించాలి అనుకుంటున్నారు కానీ మీరందరు అలజడి అయిపోతారు. అందువలన కూర్చునే నాట్యం చేయండి. చేతులతో, పాదాలతో కాదు. మంచిది! మీకు కూడా బావుంది కదా! వృద్ధుల ఆశీర్వాదాలు చాలా మంచిగా ఉంటాయి. పాండవులు కూడా మంచివారు, పాండవుల సహయోగం కూడా తక్కువ కాదు. బయట తిరిగేది పాండవులే. అందువలన పాండవులకు కూడా బాప్ దాదా మరియు పరివారం అందరి నుండి చాలా, చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మంచిది! 

నలువైపుల ఉన్నటువంటి అతి శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు, పరమాత్మ పాలన యొక్క అధికారి ఆత్మలకు, పరమాత్మ చదువు యొక్క అధికారి ఆత్మలకు, పరమాత్మ సద్గురువు యొక్క వరదానాలకు అధికారి అయిన ఆత్మలకు, సదా దృఢత ద్వారా సఫలత పొందే అధికారులకు, సదా అఖండ యోగి, అచంచల యోగి, సదా విశ్వ పరివర్తన యొక్క బాధ్యతాకిరీటధారులకు, సదా సర్వ ప్రాప్తులను ప్రత్యక్షంగా అనుభవం చేసుకునే విశేషాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments