25-11-2001 అవ్యక్త మురళి

                25-11-2001         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీస్కోండి, కారణాన్ని నివారించి సమస్యలను పరిష్కరించండి.

ఈరోజు ప్రేమసాగరుడైన బాప్ దాదా తన యొక్క ప్రేమస్వరూప పిల్లలను ప్రేమ యొక్క బంధంలోకి ఆకర్షించి కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలు పిలిచారు. భగవంతుడు హాజరు అయిపోయారు. అవ్యక్త మిలనం అయితే సదా జరుపుకుంటూనే ఉంటారు, అయినా కానీ సాకార కలయిక కొరకు పిలిచారు అందువలన బాప్ దాదా పిల్లల యొక్క విశాలమేళాకి చేరుకున్నారు. పిల్లల యొక్క స్నేహం మరియు ప్రేమ చూసి బాప్ దాదాకి చాలా సంతోషంగా ఉంది. నలువైపుల ఉన్న అటువంటి పిల్లల గురించి మనస్సులోనే పాట పాడుకుంటున్నారు - ఓహో శ్రేష్టభాగ్యవంతమైన పిల్లలూ ఓహో! భగవంతుని ప్రేమకు పాత్రులైన పిల్లలూ ఓహో! ఇంత గొప్ప భాగ్యం అదీ ఇంత సాధారణరూపంలో సహజంగా ప్రాప్తిస్తుంది అని కలలోనైనా ఆలోచించారా? కానీ ఈ రోజు సాకార రూపంలో ఆ భాగ్యాన్ని చూస్తున్నారు. దూరంగా ఉన్నా కానీ పిల్లలు మిలనం జరుపుకోవటం బాప్ దాదా చూస్తున్నారు. బాప్ దాదా వారిని చూసి కూడా మిలనం జరుపుతున్నారు. ఎక్కువగా మాతలకి స్వర్ణిమ అవకాశం లభించింది మరియు విశేషంగా శక్తిసేనని చూసి బాప్ దాదాకి కూడా సంతోషంగా ఉంది - నాలుగు గోడల మధ్య ఉండే మాతలు బాబా ద్వారా విశ్వకళ్యాణకారిగా అయ్యి, విశ్వరాజ్యాధికారిగా అయ్యారు అని. అయిపోయారా లేదా అవుతూ ఉన్నారా? ఏమంటారు? తయారైపోయారు కదా! విశ్వరాజ్యం అనే వెన్న కల్గిన గోళం మీ అందరి చేతిలో ఉంది కదా! ఎవరైతే మధువనానికి వచ్చిన మాతలు ఉన్నారో వారికి ఒక విషయం గురించి చాలా సంతోషంగా ఉండటం బాప్ దాదా చూసారు. అది ఏ విషయం? బాప్ దాదా మాతలైన మమ్మల్ని విశేషంగా పిలిచారు అని వారికి చాలా సంతోషంగా ఉంది. అంటే బాబాకి మాతలంటే విశేష ప్రేమ కదా! బాప్ దాదా పిలిచారు, మమ్మల్ని పిలిచారంటే ఎందుకు రాము అని సంతోషంతో అంటున్నారు. అందరి ఆత్మికసంభాషణ బాప్ దాదా వింటూ ఉంటారు. సంతోషం యొక్క ఈ నషాని కూడా చూస్తుంటారు. అలాగైతే పాండవులు కూడా తక్కువైనవారు కాదు. విశ్వకార్యం యొక్క సమాప్తి పాడవులు లేకుండా జరుగదు. కానీ ఈ రోజు విశేషంగా పాండవులు కూడా మాతలను ముందు ఉంచారు. బాప్ దాదా పిల్లలందరికీ పురుషార్థం యొక్క చాలా సహజవిధి చెప్తున్నారు. మాతలకి సహజ విషయం కావాలి కదా! అయితే మాతలకి లేదా పిల్లలందరికీ బాప్ దాదా ఇదే సహజ విషయం చెప్తున్నారు - నడుస్తూ, తిరుగుతూ, సంబంధ, సంపర్కంలోకి వస్తూ ప్రతి ఒక్క ఆత్మకి మనస్సుతో శుభభావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా ఆశీర్వాదాలు తీస్కోండి. మీకు ఎవరు ఏది ఇచ్చినా, శాపం ఇచ్చినా, కానీ మీరు ఆ శాపాన్ని కూడా మీ యొక్క శుభభావన యొక్క శక్తి ద్వారా ఆశీర్వాదంగా పరివర్తన చేస్కోండి. మీ ద్వారా ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు అనుభవం అవ్వాలి. ఏ సమయంలోనైనా ఎవరైనా శాపం ఇస్తున్నారు అంటే ఆ సమయంలో వారు ఏదొక వికారానికి వశీభూతం అయ్యి ఉన్నారు అని భావించండి. వశీభూత ఆత్మ పట్ల లేదా పరవశ ఆత్మ పట్ల ఎప్పుడూ శాపం ఇవ్వరు కదా! సదా వారికి సహయోగం ఇవ్వాలనే ఆశీర్వాదం ఇవ్వాలి. కేవలం ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి - సంకల్పం ద్వారా, మాట ద్వారా, కర్మ ద్వారా, సంబంధ, సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. నిరంతరం ఇదే పని చేయాలి. ఒకవేళ ఏ ఆత్మ పట్ల అయినా ఏదైనా వ్యర్థ సంకల్పం లేదా అశుద్ధసంకల్పం వచ్చినా కానీ నా కర్తవ్యం ఏమిటి? అని జ్ఞాపకం చేస్కోండి. ఎక్కడైనా అగ్ని అంటుకుంటే అగ్నిని ఆర్పేవారు ఆ అగ్నిని చూస్తూ నీరు వేయాలి అనే తమ కార్యాన్ని మర్చిపోరు మేము నీటి ద్వారా అగ్నిని ఆర్పేవాళ్ళము అని వారికి జ్ఞాపకం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారం అనే అగ్నికి వశమై ఏదైనా పని చేస్తుంటే, అది మీకు మంచిగా అనిపించకపోతే, ఏ రకమైన అగ్నిని అయినా ఆర్పటం, ఆశీర్వాదాలు ఇవ్వటం, శుభభావన ద్వారా సహయోగం ఇవ్వటం నా పని అని మీ కర్తవ్యాన్ని మీరు జ్ఞాపకం చేస్కోండి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి - కేవలం ఈ ఒక్క మాట మాతలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మాతలు ఇది చేయగలరా? మాతలందరూ చేతులు ఎత్తుతున్నారు. చేయగలరా లేక చేయాల్సిందేనా? పాండవులు చేయలరా, పాండవులు అంటున్నారు - చేయాల్సిందే అని. పాండవులు సదా విజయీలు అని మహిమ చేయబడి ఉంది. శక్తులు విశ్వకళ్యాణకారులు అనే పేరుతో ప్రసిద్ధం అయ్యి ఉన్నారు. బాప్ దాదాకి నలువైపుల ఉన్న పిల్లల గురించి ఒక ఆశ మిగిలి ఉంది. అది ఏ ఆశయో చెప్పనా? తెలిసే ఉంటుంది. టీచర్ కి తెలుసు కదా! పిల్లలందరూ శక్తిననుసరించి పురుషార్ధం అయితే చేస్తున్నారు, పురుషార్థాన్ని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. కానీ ఒక్క ఆశ ఏమిటంటే ఇప్పుడు పురుషార్ధంలో తీవ్ర వేగం కావాలి. దీనికి విధి - కారణం అనే మాట సమాప్తి అయిపోయి సదా నివారణా స్వరూపంగా అయిపోవాలి. సమయానుసారం కారణాలు అయితే తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి కానీ మీరందరు నివారణాస్వరూపంగా అవ్వండి. ఎందుకంటే మీరందరూ విశ్వంలోని ఆత్మలందరినీ, మెజార్టీ ఆత్మలను నిర్వాణధామానికి పంపాలి. స్వయాన్ని నివారణాస్వరూపంగా తయారు చేసుకున్నప్పుడు ఆ నివారణా స్వరూపం ద్వారా, విశ్వంలోని సర్వాత్మల యొక్క సమస్యలన్నింటినీ నివారణ చేసి నిర్వాణధామానికి పంపగలరు. ఇప్పుడు విశ్వంలోని ఆత్మలు ముక్తిని కోరుకుంటున్నాయి అయితే బాబా ద్వారా ముక్తి యొక్క వారసత్వం ఇవ్వటానికి మీరే నిమిత్తమయ్యారు. అందువలన నిమిత్త ఆత్మలైన మీరు మొదట స్వయాన్ని భిన్నభిన్న సమస్యల యొక్క కారణాన్ని నివారణ చేసుకుని ముక్తులుగా తయారుచేసుకున్నప్పుడు విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వగలరు. అయితే ముక్తులేనా? ఈ కారణంగా, ఈ కారణంగా, ఈ కారణంగా.... ఇలా ఏ రకమైన సమస్య యొక్క కారణం ఎదురుగా రాకూడదు. 

ఎప్పుడైనా ఏ సమస్య అయినా ఎదురైతే సెకనులో నివారణ ఆలోచించండి. విశ్వాన్ని నివారణ చేసే నేను నా యొక్క చిన్న,చిన్న సమస్యలను నివారించాలేనా? చేయలేనా? ఇప్పుడైతే ఆత్మల యొక్క క్యూ మీ ముందు ఉంటుంది - ఓ ముక్తి దాతలు ముక్తి ఇవ్వండి అని. ఎందుకంటే ముక్తిదాత యొక్క డైరెక్ట్ పిల్లలు, అధికారి పిల్లలు మాస్టర్ ముక్తిదాతలు కదా! కానీ క్యూ ముందు మాస్టర్ ముక్తిదాతలైన మీ ముందు ఒక ఆటంకం తలుపు మూసేస్తుంది. క్యూ తయారుగా ఉంది కానీ ఏ తలుపు మూసి ఉంది? పురుషార్ధంలో బలహీనత యొక్క ఒక మాట తలుపు - ఎందుకు? ప్రశ్నార్ధకం అంటే ఇది ఎందుకు అనే మాట.ఇది ఇప్పుడు క్యూని ఎదురుగా రానివ్వటంలేదు. కనుక బాప్ దాదా ఇప్పుడు దేశ, విదేశ పిల్లలందరికీ ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు - మీరు సమస్యల యొక్క తలుపు అయిన ఎందుకు అనే విషయాన్ని సమాప్తి చేయండి. చేస్తారా? టీచర్స్ చేస్తారా? పాండవులు చేస్తారా? అందరు చేతులు ఎత్తుతున్నారా లేక కొంతమందే ఎత్తుతున్నారా? ఇక్కడ విదేశీయులు ఎత్తడం లేదు ఎందుకంటే వారికి అనువాదం తర్వాత అవుతుంది. విదేశీయులు ఎవరెడి కదా! ఎవరెడియేనా? అవునా లేక కాదా చెప్పండి? ఒకవేళ అవును అంటే చేతులు ఎత్తండి! కొంతమంది సరిగా చేతులు ఎత్తటం లేదు. ఇప్పుడు ఏ సేవాకేంద్రంలో సమస్య యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇలా అవుతుందా? (ఇక్కడ కూర్చున్న మోహిని బెహన్ మరియు మున్ని బెహన్ చెప్పండి, కూర్చున్న వారు చెప్పండి, ఇలా అవుతుందా?) అందరూ నిశ్చయించుకోవాలి కదా! నేను చేయాలి అని ప్రతి ఒక్కరు భావించండి. టీచర్స్ నేను చేయాలి అని భావించాలి, విద్యార్థులు నేను చేయాలి అనుకోవాలి, కుటుంబంలో ఉండేవారు. నేను చేయాలి అనుకోవాలి. మధువనం వారు మేము చేయాలి అనుకోవాలి. మధువనం వారు కూడా చేయాలి కదా? మధువనం వారు చేతులు ఎత్తండి! మీకైతే చాలా మంచి స్థానం లభించింది కదా! అధికారులు కదా! మంచిది, మధువనం వారు చేస్తారా? సమస్య అనే మాటే సమాప్తి అయిపోవాలి. కారణం సమాప్తి అయ్యి నివారణ కావాలి. ఇది అవుతుంది కదా! అవ్వలేనిది ఏమి ఉంది! స్థాపన యొక్క ఆదిలో వచ్చిన పిల్లలందరు ఏమి ప్రతిజ్ఞ చేసారు మరియు దానిని చేసి చూపించారు? అసంభవాన్ని సంభవం చేసి చూపించారు. చూపించారు కదా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? (65 సంవత్సరాలు) ఇన్ని సంవత్సరాలైతే అసంభవం సంభవం అవ్వదా? అవుతుందా? ముఖ్యమైన టీచర్స్ చేతులు ఎత్తండి! పంజాబ్ వారు చేతులు ఎత్తటం లేదు. అసలు సాధ్యమేనా? కొంచెం ఆలోచిస్తున్నారు, ఆలోచించకండి. చేయాల్సిందే. ఇతరుల గురించి ఆలోచించకండి. ప్రతి ఒక్కరు తమ గురించి తాము ఆలోచించుకోండి. ఎవరి గురించి వారు ఆలోచించుకోగలరు కదా? ఇతరుల గురించి వదిలేయండి. స్వయం గురించి ధైర్యం పెట్టుకోగలరు కదా? పెట్టుకోలేరా? విదేశీయులు పెట్టుకోగలరా? శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరైతే ధైర్యం పెట్టుకోగలము అంటున్నారో వారు మనస్సుతో చేతులు ఎత్తండి! చూపించడానికి కాదు. అందరూ ఎత్తుతున్నారు కదా! నేను కూడా ఎత్తుతాను అని ఎత్తకండి. మనస్సులో ధృఢసంకల్పం చేయండి - కారణాన్ని సమాప్తి చేసి నివారణా స్వరూపంగా అవ్వవలసిందే. ఏది ఏమైనా, సహించవలసి వచ్చినా, మాయని ఎదుర్కోవలసి వచ్చినా, ఒకరికొకరు సంబంధ, సంపర్కంలో సహించవలసి వచ్చినా సమస్యగా అవ్వకూడదు అని. ఇలా అవ్వగలరా? ఒకవేళ ధృఢసంకల్పం ఉంటే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులు ఎత్తండి! (బాప్ దాదా అందరిచే చేతులు ఎత్తించారు మరియు దృశ్యానంతటినీ టి.విలో చూసారు)బావుంది కదా! వ్యాయామం అయ్యింది కదా! చేతులు ఎందుకు ఎత్తిస్తారు అంటే ఒకరు ఎత్తడం చూసి ఇంకొకరికి చేతులు ఎత్తడంలో ఉత్సాహం వస్తుంది కదా! ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురుగా వస్తే బాప్ దాదాని ఎదురుగా చూడండి. మనస్సుతో బాబా అనండి అప్పుడు బాబా హాజరైపోతారు, సమస్య సమాప్తి అయిపోతుంది. సమస్య మీ ఎదురుగా ఉండదు, తొలగిపో తుంది మరియు బాప్ దాదా ఎదురుగా హాజరైపోతారు. మీ బిరుదు - మాస్టర్ సర్వశక్తివాన్, ఇది సదా స్మృతి ఉంచుకోండి. లేకపోతే ఇప్పుడు బాప్ దాదా ప్రియస్మృతులు చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులకి అనకుండా సర్వశక్తివంతులకి అని అనమంటారా? శక్తివాన్ పిల్లలకు ప్రియస్మృతులు అని అంటే బావుంటుందా? మాస్టర్ సర్వశక్తివంతులు కనుక ఏదైనా చేయగలరు. మీ యొక్క బిరుదు మరియు కర్తవ్యం స్మృతిలో ఉంచుకోండి. మీ యొక్క బిరుదు - మాస్టర్ సర్వశక్తివంతులు మరియు మీ యొక్క కర్తవ్యం - విశ్వకళ్యాణకారులు. కనుక సదా మీ యొక్క బిరుదుని మరియు కర్తవ్యాన్ని స్మృతి ఉంచుకోవటం ద్వారా శక్తులు ప్రత్యక్షం అవుతాయి. మాస్టర్‌గా అవ్వండి, శక్తులకు కూడా మాస్టర్‌గా అవ్వండి, ప్రతి శక్తిని సమయానికి ఆజ్ఞ ఇవ్వండి. శక్తులను ధారణ చేస్తున్నారు కానీ సమయానికి ఉపయోగించటం రావటం లేదు. సమయం అయిపోయిన తర్వాత ఇలా చేస్తే బావుండేది అని స్మృతి వస్తుంది. ఇప్పుడు మీలో నిండి ఉన్న శక్తులను సమయానికి ఉపయోగించే అభ్యాసం చేయండి. స్థూలమైన చేతులను, పాదాలను మీ ఆజ్ఞానుసారం నడిపించుకుంటున్నారు కదా! అదేవిధంగా ప్రతి శక్తిని ఆజ్ఞతో నడిపించండి. కార్యంలో ఉపయోగించండి. నింపుకుంటున్నారు కానీ కార్యంలో తక్కువగా ఉపయోగిస్తున్నారు. సమయానికి కార్యంలో ఉపయోగిస్తే శక్తులు తమ యొక్క పని తప్పకుండా చేస్తాయి మరియు సదా సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల యొక్క ముఖం బాగా ఆలోచనలలో ఉండి ఎక్కువగా గంభీరంగా కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి, నాట్యం చేయండి, పాడండి, మీ యొక్క బ్రాహ్మణ జీవితం సంతోషంలో నాట్యం చేయడానికి మరియు మీ యొక్క భాగ్యం మరియు భగవంతుని పాటలు పాడటానికి ఉన్నది. నాట్యం చేసేవారు, పాడేవారు అలా గంభీరంగా అయ్యి నాట్యం చేస్తే వీరికి నాట్యం చేయటం రాదు అంటారు. గంభీరత మంచిదే కానీ అతి గంభీరంగా ఉండకూడదు. బాప్ దాదా ఇప్పుడు విన్నారు - ఢిల్లీలో తయారుచేసిన హాల్ యొక్క ప్రారంభోత్సవం కానున్నది. కానీ ఇప్పుడు బాప్ దాదా ఒక ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు అది ఏమిటి? దాని యొక్క తారీఖు నిర్ణయించండి. ఈ చిన్నచిన్న ప్రారంభోత్సవాలు అయితే అవే అయిపోతాయి. విశ్వం అనే వేదికపై పిల్లలైన మీరందరూ బాబా సమానంగా, సాక్షాత్తు ఫరిస్తా వలె ఎదురుగా రావాలి మరియు పరదా తొలగిపోవాలి. ఇటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం మీ అందరికీ కూడా ఇష్టంగా ఉంటుంది కదా! అందరూ బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు మరియు బాబా కూడా వింటున్నారు, అందరికీ బాబాని ప్రత్యక్షం చేయాలనే కోరిక ఉంది మరియు బాబాకి ముందు పిల్లలు ప్రత్యక్షం కావాలనే కోరిక ఉంది. బాబా పిల్లలతో పాటు ప్రత్యక్షం అవుతారు. ఒంటరిగా అవ్వరు. బాప్ దాదా ఇటువంటి కార్యక్రమాన్ని చూడాలనుకుంటున్నారు. ఉల్లాసం కూడా బాగా ఉంది, ఆత్మిక సంభాషణ చేసే సమయంలో అందరికీ ఉల్లాసం చాలా బాగా ఉంటుంది కానీ కర్మయోగి అయ్యే సమయంలో కొద్దిగా తేడా వస్తుంది. అయితే మాతలు ఏమి చేస్తారు? మాతలది చాలా పెద్ద గుంపు ఉంది. మాతలను చూసి బాప్ దాదాకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరూ కూడా మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు. మాతలు ముందుకు వెళ్ళటం చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎవరూ చేసి చూపించనిది మాతలైన మేము బాబాని తోడు ఉంచుకుని చేసి చూపిస్తాము అని మాతలకు ఇదే విశేష సంకల్పం ఉంది. చేసి చూపిస్తారా? అయితే ఇప్పుడు చేతులు ఊపండి. మాతలు అన్నీ చేయగలరా? మాతలలో ఉల్లాసం బాగా ఉంది. ఏమీ అర్ధం కాకపోయినా నేను బాబా వాడిని, బాబా నా వాడు అనేది అయితే అర్ధం చేసుకున్నారు కదా! నా బాబా అని అందరు అంటున్నారు కదా! మనస్సుతో ఈ పాట పాడుకుంటూ ఉండండి. నా బాబా, నా బాబా, నా బాబా.... 

మంచిది, టీచర్స్ చేతులు ఎత్తండి! చాలా మంది టీచర్స్ వచ్చారు. (1300 మంది వచ్చారు) టీచర్స్ మాతలను మంచిగా తీసుకుని వచ్చారు కదా! మీకు లాభమే అయ్యింది కదా! వారిని తీసుకువచ్చారు అంటే మీ పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకున్నారు. మీకు లాభమే అయ్యింది కదా! మీ పుణ్యఖాతా పెరిగింది. మంచిది, డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి! డబల్ విదేశీయుల ఒక విశేషత బాప్ దాదా చూసారు. డబల్ విదేశీయులు లేని గ్రూప్ ఉండదు. సర్వవ్యాపి అయిపోయారు. మిమ్మల్ని చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తారు మంచిది భలే రండి, ఇక మధువనం నివాసీయులు. ఈ సభ మొత్తంలో కుమారీలు ఎవరైతే ఉన్నారో వారు చేతులు ఎత్తండి! కుమారీలు చాలా మంది ఉన్నారు. కుమారీలు అయితే అద్భుతం చేసి చూపించేవారు. చూపించేవారు కదా! కుమారీలకు విశేష అదృష్టం లభించింది. పాండవులు నవ్వుతున్నారు, నిందిస్తున్నారు - కుమారీలు సేవాకేంద్రంలో ఉంటే దీదీ అని పిలుస్తారు పాండవులను దాదా అని పిలవరు అని. అంటే చూడండి, కుమారీలకు విశేషంగా, మనస్సుతో సమర్పణ అవ్వగానే బాప్ దాదా మురళీ వినిపించే సింహాసనం లిఫ్ట్ గా లభిస్తుంది. ఈ సింహాసనం తక్కువైనది కాదు.పాండవులు కూడా మురళి చెప్తారు. కానీ ఎక్కువమంది అక్కయ్యలే అంటే ఇది కుమారీల అదృష్టం. ఈ బహుమతి ఎంత కావాలంటే అంత కుమారీలు తీసుకోవచ్చు. మంచిది. కుమారులు ఎంతమంది? కుమారులు కూడా తక్కువ కాదు. కుమారులు ఇప్పుడు మంచి కుమారులుగా అయిపోయారు. కుమారులు లేకుండా సేవాకేంద్రం నడవదు. టీచర్స్ చెప్పండి - కుమారులు లేకుండా సేవాకేంద్రం నడుస్తుందా? నడవదు. కుమారులలో ఒక మంచి విశేషత ఉంది. కుమారులు ఏదైతే ధృఢసంకల్పం చేస్తారో దానిని ప్రత్యక్షంలోకి తీసుకురాగలరు. కానీ మంచి కుమారులు వ్యతిరేక విషయాలు చేయరు. సరైనవే చేస్తారు. ఏది కావాలంటే అది చేయగల ధృఢసంకల్పం యొక్క బహుమతి కుమారులకు లభించింది. ఇది బహుమతి కానీ దీనిని ఉపయోగించటం మీ చేతుల్లోనే ఉంది. మంచి కుమారుల యొక్క అతి పెద్ద గ్రూప్ తయారవ్వాలి అని గవర్నమెంట్ వారు కూడా అనుకుంటున్నారు. మొత్తం విశ్వంలోని కుమారుల గ్రూప్ మధువనం రావాలి. ప్రధానమంత్రి, మంత్రులు ఇక్కడికి రావాలి. రాగలరా? మంచిది. కుమారులు తమ ఘనతను చూపించగలరు. అక్కడి వారు, ఇక్కడి వారు.... ఇలా అన్ని దేశాల వారు రావాలి. ఆహ్వానం పంపాలి. దీనికి తారీఖు నిర్ణయించండి. కుమారులపై బాప్ దాదాకి చాలా, చాలా, చాలా శుభ ఆశలు ఉన్నాయి మరియు ఆ ఆశలు పూర్తి అవ్వాల్సిందే. మంచిది. 

(రెండు నెలలు యాత్ర చేసినవారు వచ్చారు) అందుకే ఇంతమంది మాతలు వచ్చారు. మూడు వంతుల హాల్ మాతలతో నిండిపోయింది. 13 వేల మంది మాతలు వచ్చారు. మాతలు చేతులెత్తండి! మాతలు చాలా మంది ఉన్నారు. హాలంతటికీ మాతలే శోభ. యాత్రకు వెళ్ళిన మాతలు,కన్యలు నిల్చోండి. కొద్దిమంది వచ్చారు. మిగిలిన వారికి స్మృతి అందుతుంది. బాప్ దాదా వారిని టి.విలో చూస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రవృతిలో ఉండే అధర్ కుమారులు చేతులెత్తండి! మంచి యాత్ర చేసారు. నలువైపుల మంచి సేవ జరిగింది. అందువలన చాలా చాలా ధన్యవాదాలు. అధర్‌ కుమారుల విశేషత ఏమిటి? అధర్ కుమారులు విశ్వంలో ఆత్మల యొక్క ఒక భ్రాంతిని పోగొట్టారు. అది ఏమిటంటే, ప్రజలు అనుకునేవారు బ్రాహ్మణులుగా అవ్వటం అంటే ఇంటిని, గృహస్తాన్ని వదిలేయాలి అని కానీ అధర్ కుమారీ, కుమారులను చూసి వారు కూడా ప్రేరణ పొందుతున్నారు మేము కూడా బ్రాహ్మణులుగా కాగలం అని అనుకుంటున్నారు. మొదట్లో భ్రాంతులు ఉండేవి, బ్రహ్మకుమారీల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అనుకునేవారు వాటిని ఇప్పుడు మీరు పోగొట్టారు. అంటే అధర్ కుమారులు సేవావృద్ధి యొక్క ద్వారాన్ని తెరిచారు. (బాగా కొట్టండి చప్పట్లు) అందువలన అధర్ కుమారులు కూడా తక్కువ కాదు. బాప్ దాదా దగ్గర ప్రతి వర్గానికి బ్రాహ్మణ జీవితంలో గొప్పతనం ఉంది. మంచిది, చిన్న పిల్లలు ఎంతమంది వచ్చారు? చిన్న పిల్లలను చూసి అందరు సంతోషపడతారు. ఎందుకంటే చిన్నతనంలో ఎంత గొప్ప భాగ్యం పొందారు అని. నేను బ్రహ్మాకుమారుడను అని ప్రతి చిన్న పిల్లవాడు నషాగా చెప్తాడు. చిన్న పిల్లలు మంచి అనుభవాలు చెప్తారు. మేము భగవంతుడిని కలుసుకుంటున్నాము అని చెప్తుంటారు. అందుకే చిన్న పిల్లల యొక్క విషయాలు అందరికీ ఇష్టం అనిపిస్తాయి. అందువలన మీరు చిన్నవారు అయినా కానీ సేవకి నిమిత్తమైన చాలా మంచివారు. అందువలన బాప్ దాదా చిన్న పిల్లలందరికీ చాలా చాలా చాలా చాలా ప్రేమనిస్తున్నారు మంచిది, అందరూ అయిపోయారు కదా! సేవాధారులు మిగిలిపోయారు, చాలా మంచి పద్దతి తయారుచేసారు, సేవాఖాతాను జమ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుంది. సేవాకేంద్రంలో సేవ అయితే చేస్తూనే ఉంటారు కానీ యజ్ఞసేవకి విశేష గొప్పతనం ఉంటుంది. 

ఇప్పుడు బాప్ దాదా ఒక్క సెకను ఇస్తున్నారు అందరూ జాగ్రత్తగా (అలర్ట్ గా) కూర్చోండి. అందరికీ బాప్ దాదా అంటే 100 శాతం ప్రేమ ఉంది కదా! శాతంలో లోపం లేదు కదా! 100 శాతం ఉందా? అయితే 100 శాతం ప్రేమకి ఫలితం ఇవ్వడానికి తయారేనా? 100 శాతం ప్రేమ ఉంది కదా! కొద్దిగా తక్కువ ఉన్నవారు చేతులు ఎత్తండి! ప్రేమ అనే విషయం గురించి అడుగుతున్నాను. ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారా? లేదా ప్రేమ సరే అదే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తారు, ప్రేమించాల్సిందే. మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా కూర్చున్నారు కదా! ఇప్పుడు అందరూ బాబాపై ఉన్న ప్రేమకు ఫలితంగా ఒక్క సెకను బాబా ఎదురుగా అంతర్ముఖి అయ్యి కూర్చుని మీ మనస్సులో మీరే సంకల్పం చేయండి. ఇప్పుడు మేము స్వయం పట్ల లేదా ఇతరుల పట్ల సమస్యగా అవ్వము. ప్రేమకి ఫలితంగా ఈ ఈ ధృఢసంకల్పం చేయగలరా? చేయగలరా? ఏమైనా కానీ అంటే ఒకవేళ ఏమి జరిగినా కానీ స్వయాన్ని పరివర్తన చేసుకుంటాం అని మనస్సులో సంకల్పాన్ని ధృడంగా చేయండి. బాప్ దాదా సహాయం చేస్తారు కానీ సహాయాన్ని తీసుకునే విధి - ధృడసంకల్పం యొక్క స్మృతి. బాప్ దాదా ఎదురుగా సంకల్పం చేసారు, ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగం ఇస్తుంది. అయితే చేయగలరా? చేతులు ఊపండి! చూడండి, సంకల్పంతో చేయలేనిది ఏముంది! భయపడకండి. బాప్ దాదా యొక్క విశేష సహాయం తప్పక లభిస్తుంది. బాప్ దాదా కేవలం తన శుభసంకల్పం గురించి చెప్పారు. ఇక చేయటమనేది పిల్లల యొక్క కర్తవ్యం. ఎవరు ఎంతగా చేస్తారో వారికి అంతగా ఖాతా జమ అవుతుంది. బాప్ దాదా అనుకుంటున్నారు - పిల్లలందరి ఖాతా మొత్తం కల్పానికి ఎంతగా జమ అవ్వాలి అంటే రాజ్యం కూడా చేయాలి మరియు అర్ధకల్పం పూజ్యులుగా కూడా అవ్వాలి. పూజ్యులుగా అయ్యే ఖాతా మరియు రాజ్యాధికారిగా అయ్యే ఖాతా రెండూ జమ అవ్వాలి. ఏ ఒక్కరి ఖాతా తక్కువ అవ్వకూడదు. అందరూ నిండుగా అవ్వాలి. సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలి. మంచిది, ఈనాటి విజ్ఞాన సాధనాల ద్వారా దూర,దూరాలలోని పిల్లలందరూ కూడా మురళి వింటున్నారు, చూస్తున్నారు. (ఈరోజు బాప్ దాదా యొక్క మురళి భారతదేశంలో టి.వి ద్వారా, విదేశాల వారు ఇంటర్నెట్ ద్వారా అందరూ వింటున్నారు లేదా చూస్తున్నారు) ఆ పిల్లలందరినీ కూడా బాప్ దాదా చూస్తున్నారు. మంచిది, పిల్లలందరికీ బాప్ దాదా మిలనమేళా యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. కొందరు ఉత్తరాల ద్వారా, కొందరు గ్రీటింగ్ కార్డుల ద్వారా, కొందరు సన్ముఖంగా మిలనమేళా జరుపుకుంటున్నారు. తమ స్థానాలలో ఉంటూ కూడా మిలనమేళా జరుపుకుంటున్నారు. నలువైపుల ఉన్న ఒకొక్క పిల్లవాడు అంటే బాప్ దాదాకి అతి ప్రియమైనవారు. ఒకొక్కరినీ చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. పిల్లలు అంటున్నారు - బాబాపై లెక్కలేనంత ప్రేమ ఉంది అని. వర్ణన చేయలేనంత ప్రేమ ఉంది అని. అదేవిధంగా బాబా కూడా అంటున్నారు - గారాభమైన, ప్రియమైన,విశేషాత్మలైన పిల్లల యొక్క ప్రేమ కూడా వర్ణించలేనిది. ఇటువంటి పిల్లలు కూడా మొత్తం కల్పంలో ఇంకెవరికి లభించరు. 

ఈవిధంగా సర్వ తీవ్రపురుషార్ధి ఆత్మలకు, సదా బాబాపై ఉన్న ప్రేమకు ఫలితాన్ని ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు, సదా తమ విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేషాత్మలుగా తయారుచేసే పుణ్యాత్మలకు, సదా సమస్యకు బదులు సమాధాన స్వరూపంగా అయ్యి విశేషంగా ముందుకి ఎగిరే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments