25-11-2000 అవ్యక్త మురళి

               25-11-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాబా సమానంగా అయ్యేటందుకు రెండు విషయాలను దృఢంగా ఉంచుకోండి - స్వమానంలో ఉండాలి మరియు సర్వులకి గౌరవం ఇవ్వాలి.

ఈ రోజు బాప్ దాదా తన యొక్క ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దానినే చూస్తున్నారు. ఈ చిన్న ప్రపంచం ఎంత అతీతమైనది మరియు ప్రియమైనది కూడా! ఎందుకు ప్రియమైనది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచంలో ప్రతి ఆత్మ విశేషాత్మ. చూడడానికి అతి సాధారణ ఆత్మలుగా కనిపిస్తారు కానీ ప్రతి బ్రాహ్మణాత్మకి ఉన్న అన్నింటికంటే ఉన్నతోన్నతమైన విశేషత ఏమిటంటే పరమాత్మను తమ దివ్యబుద్ధి ద్వారా గ్రహించారు. 90 సంవత్సరాల వృద్ధులైనా, అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్యబుద్ధి, దివ్యనేత్రం బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధమైన అతి విశేష వ్యక్తులకు కూడా లేదు. ఈ మాతలందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కాళ్ళతో నడవగలిగినా, నడవలేకపోయినా వచ్చారు. బాబాని గ్రహించారు కనుకనే వచ్చారు. ఆ పరమాత్మను గ్రహించే నేత్రం, గ్రహించే బుద్ది మీకు తప్ప మరెవరికీ ప్రాప్తించలేదు. మేము చూసాము, మేము తెలుసుకున్నాము అని మాతలందరు పాట పాడుతున్నారు కదా! మాతలకు ఈ నషా ఉంది. చేతులు ఊపుతున్నారు, చాలా మంచిది. పాండవులకు నషా ఉందా? ఒకరికంటే ఒకరు ముందు కదా! శక్తులలో లోపం లేదు, పాండవులలో లోపం లేదు. ఈ చిన్న ప్రపంచం ఎంత ప్రియమైనది! అని బాప్ దాదాకి ఆనందంగా ఉంది. పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా ఎంత ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు! 

బాప్ దాదా దేశ - విదేశాల యొక్క సర్వాత్మల మనస్సుల నుండి బాబా! మధురమైన బాబా! మేము తెలుసుకున్నాము! మేము చూసాము! అనే పాటను వింటున్నారు. ఈ పాట పాడుతూ, పాడుతూ నలువైపుల పిల్లలు ఒకవైపు సంతోషంలో, రెండవవైపు స్నేహ సాగరంలో ఇమిడి ఉన్నారు. నలువైపుల ఉన్న పిల్లలు ఇక్కడ సాకారంలో లేరు కానీ మనస్సు ద్వారా, దృష్టి ద్వారా బాప్ దాదా ఎదురుగా ఉన్నారు మరియు బాప్ దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చన్న పిల్లలను సన్ముఖంగానే చూస్తున్నారు. దేశమైనా, విదేశమైనా చేరడానికి బాప్ దాదాకి ఎంత సమయం పడుతుంది? బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు జవాబుగా కోటానుకోట్లు, మిలియన్లు కంటే ఎక్కువ ప్రియస్మృతులు ఇస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలను చూసి అందరి మనస్సులో ఒకే సంకల్పాన్ని చూస్తున్నారు, నయనాలతో అందరూ చెప్పేది ఏమిటంటే మాకు పరమాత్మ 6 నెలలకి హోమ్ వర్క్ ఇచ్చారు అని స్మృతి ఉంది. మీ అందరికి కూడా గుర్తు ఉంది కదా? మర్చిపోలేదు కదా? పాండవులకు గుర్తు ఉందా? బాగా గుర్తు ఉందా? బాప్ దాదా మాటిమాటికి ఎందుకు గుర్తు చేస్తున్నారు? కారణం ఏమిటి? సమయాన్ని చూస్తున్నారు మరియు బ్రాహ్మణ ఆత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు. మనస్సు యవ్వనంగా అవుతూ ఉంది మరియు తనువు వృద్ధాప్యానికి చేరుతుంది. సమయం మరియు ఆత్మల యొక్క పిలుపు బాగా వినిపిస్తుందా! బాప్ దాదా చూస్తున్నారు - ఆత్మల యొక్క పిలుపు పెరిగిపోతూ ఉంది - ఓ సుఖదేవా! ఓ శాంతిదేవా! ఓ సచ్చిదానందా! మాకు కూడా కొద్దిగా సహాయం చేయండి అని పిలుస్తున్నారు. పిలిచేవారి లైన్ ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి, త్వరత్వరగా బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి అని మీరందరు కూడా అనుకుంటున్నారు కానీ ప్రత్యక్షత దేని కారణంగా ఆగి ఉంది? మేము బాబా సమానంగా అవ్వాలి అని మీరందరు కూడా ఇదే సంకల్పం చేస్తున్నారు మరియు మనస్సులో కోరుకుంటున్నారు, నోటితో చెప్తున్నారు కూడా. అవ్వాలి కదా? మంచిది, మరయితే ఎందుకు అవ్వటం లేదు? బాబా సమానంగా తయారవ్వమని బాప్ దాదా చెప్పారు. ఇక మరలా ఎలా తయారవ్వాలి, ఏమి తయారవ్వాలి అనే ఈ రెండు ప్రశ్నలు రాకూడదు. ఏమి తయారవ్వాలి అంటే సమాధానం ఉంది కదా - బాబా సమానంగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి అంటే దానికి సమాధానం తండ్రిని అనుసరించండి. తల్లితండ్రుల అడుగు జాడల్లో నడవాలి. తండ్రి నిరాకారుడు, సాకారంగా బ్రహ్మ తల్లి. మరయితే అనుసరించటం కూడా రావటం లేదా? అనుసరించటం అనేది అంధులు కూడా చేయగలరు. చూశారా వారిని! కర్ర పట్టుకుని ఆ శబ్దం ఆధారంగా, కర్రని అనుసరిస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, త్రినేత్రులు, త్రికాలదర్శిలు. అనుసరించటం మీకు ఏమి కష్టం! మీకు ఇది గొప్ప విషయమా చెప్పండి, గొప్ప విషయమా? గొప్ప విషయం కాదు కానీ గొప్ప విషయం అయిపోతుంది. బాప్ దాదా చుట్టు తిరిగి ప్రతి ప్రాంతానికి వస్తారు. సెంటర్ కి వస్తారు మరియు ప్రవృతికి వస్తారు. ప్రతి ఒక్క సెంటర్‌లో, ప్రతి ఒక్క ప్రవృతి స్థానంలో అక్కడ ఇక్కడ బ్రహ్మాబాబా చిత్రాలు చాలా పెట్టి ఉన్నాయి. అవ్యక్త బాబా యొక్క చిత్రాలైనా లేదా బ్రహ్మాబాబా యొక్క చిత్రాలైనా నలువైపుల చిత్రాలే చిత్రాలు కనిపిస్తున్నాయి. మంచి విషయం. కానీ చిత్రాన్ని చూసి చరిత్ర జ్ఞాపకం వస్తుంది కదా! అని బాప్ దాదా అనుకుంటున్నారు. లేక రావటం లేదా? కేవలం చిత్రాన్నే చూస్తున్నారా? చిత్రాన్ని చూసి ప్రేరణ అయితే వస్తుంది కదా! అయితే బాప్ దాదా మరేమీ చెప్పటం లేదు, కేవలం ఒకే మాట చెప్తున్నారు - అనుసరించండి చాలు. ఆలోచించకండి, ఇది కాదు అది చేద్దాం, ఇలా కాదు అలా చేద్దాం, అలా కాదు ఇలా చేద్దాం ఇలా ఎక్కువ ప్లాన్స్ తయారుచేయకండి. బాబా ఏదైతే చేసారో దానిని అనుసరించాలి అంతే. అనుసంచటం రావటం లేదా! ఈనాటి వైజ్ఞానికులు ఫోటోస్టాట్ మిషన్ ని తయారుచేశారు కదా! ఇక్కడ ఫోటోస్టాట్ మిషన్ ఉంది కదా? బ్రహ్మాబాబా యొక్క చిత్రం పెట్టుకుంటున్నారు. భలే పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, పెద్ద పెద్దవి పెట్టుకోండి కానీ ఆ ఫోటోని అనుసరించటం అయినా చేయండి. 

బాప్ దాదా నలువైపుల చుట్టు తిరుగుతూ చూస్తున్నారు - చిత్రంతో ప్రేమ ఉందా లేక చరిత్రతో ప్రేమ ఉందా? సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది ఇంకేమి కావాలి? ఏ వస్తువుని అయినా బాగా గట్టిగా చేయాలంటే నాలుగు వైపుల నుండి పక్కాగా చేస్తారు, మూడు మూలలు మంచిగా ఉన్నాయి కానీ ఒకమూల మరింత పక్కా చేయవలసి ఉన్నట్లుగా బాప్ దాదా చూశారు. అంటే సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది, ఏవిధంగా తయారవ్వాలి అని ఎవరిని అడిగినా బాబా సమానంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరు చెప్తారు. బాబా కంటే తక్కువగా అవ్వాలి అని ఎవరూ అనరు, సమానంగా అవ్వాలనే అంటారు. మంచి విషయం. ఒక మూల గట్టిగా చేసుకుంటున్నారు. కానీ నడుస్తూ నడుస్తూ అది ఢీలా అయిపోతుంది. అది ఏమిటంటే - ధృఢత. సంకల్పం ఉంది, లక్ష్యం ఉంది కానీ ఏదైనా పరిస్థితి వస్తే, దానినే మీరు సాధారణ మాటలలో విషయాలు వచ్చేస్తున్నాయి అంటారు కదా! అవి ధృఢత బలహీనం చేసేస్తున్నాయి. ధృఢత అంటే చనిపోయినా, తొలగిపోయినా కానీ సంకల్పం వదలకూడదు. ఒంగవలసి వచ్చినా, చనిపోవలసి వచ్చినా, జీవిస్తూ స్వయాన్ని మలుచుకోవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినవలసి వచ్చినా కానీ సంకల్పం మాత్రం వదలకూడదు. దీనినే ధృఢత అని అంటారు. చిన్న, చిన్న పిల్లలు ఓంనివాస్ కి వచ్చినప్పుడు బ్రహ్మాబాబా వారికి నవ్వుతూ, నవ్వుతూ స్మృతి ఇప్పించేవారు, పక్కాగా చేసేవారు - ఇన్ని నీళ్ళు త్రాగగలరా, ఇన్ని మిరపకాయలు తినగలరా? భయపడరు కదా! .... ఇలా అంటూ బ్రహ్మాబాబా చిన్న, చిన్న పిల్లలను పక్కా చేసేవారు ఇదేవిధంగా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సంకల్పం అనే నేత్రం చలించకూడదు. బాప్ దాదా ఈ రోజు కూడా పిల్లలను అడుగుతున్నారు - వారికయితే ఎండు మిరపకాయలు మరియు కుండతో నీళ్ళు ఇచ్చేవారు, ఎందుకంటే వారు చిన్న పిల్లలు కదా! ఇప్పుడైతే మీరందరు పెద్దవారు అయిపోయారు. కనుక బాప్ దాదా అడుగుతున్నారు - మీకు సంకల్పం ధృఢంగా ఉందా? బాబా సమానంగా అవ్వవలసిందే అని సంకల్పంలో ధృఢత ఉందా? తయారవ్వాలి అని కాదు, తయారవ్వవలసిందే. మంచిది, దీనికి చేతులు ఊపారు, టి.వి వారు వీడియో తీయండి, టి.వి. ఉపయోగపడాలి కదా! పెద్దపెద్దగా చేతులు ఎత్తండి! మంచిది! మాతలు కూడా ఎత్తుతున్నారు. వెనుక ఉన్నవారు ఇంకా పెద్దగా చేతులు ఎత్తండి! మంచిది. చాలా మంచిది. క్యాబిన్ లో ఉన్నవారు ఎత్తడం లేదు. క్యాబిన్ వారు అయితే నిమిత్తులు. మంచిది! కొద్ది సమయానికి చేతులు ఎత్తి బాప్ దాదాని సంతోషం చేసేసారు. 

ఇప్పుడు బాప్ దాదా ఒక విషయం పిల్లలచే చేయించాలనుకుంటున్నారు - చెప్పాలనుకోవటం లేదు, చేయించాలనుకుంటున్నారు. ఆ విషయం ఏమిటంటే మీ మనస్సులో కేవలం ధృఢత తీసుకురండి. చిన్న విషయానికి సంకల్పాన్ని బలహీనం చేసుకోకండి. ఎవరైనా అగౌరవపరిచినా, ఎవరైనా అసహ్యించుకున్నా, ఎవరైనా అవమానం చేసినా, నిందించినా, శుభభావన మాత్రం తొలగిపోకూడదు. ఎప్పుడైనా ఎవరైనా దు:ఖం ఇచ్చినా, మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా - మేము మాయని, ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులం అయితే మీ కర్తవ్యం స్మృతి ఉంది కదా? విశ్వపరివర్తకులు కదా! ఒకవేళ ఎవరైనా తమ సంస్కారానికి వశం అయ్యి, మీకు దు:ఖం ఇచ్చినా, దెబ్బతీసినా, చలింపచేసినా కానీ మీరు ఆ దు:ఖ విషయాలను సుఖంలోకి పరివర్తన చేసుకోలేరా? అగౌరవాన్ని సహించలేరా? గ్లానిని గులాబిగా చేసుకోలేరా? సమస్యని బాబా సమానంగా అవ్వాలనే సంకల్పంలోకి మార్చుకోలేరా? మీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది, ఎప్పుడైతే మీరు బ్రాహ్మణజన్మలోకి వచ్చారో, మరియు నిశ్చయం చేసుకున్నారో, ఒక సెకను పట్టినా, ఒక నెల పట్టినా కానీ ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడిందో, అప్పుడు మనస్సుతో అన్నారు - నేను బాబా వాడిని, బాబా నా వాడు అని సంకల్పం చేసారు, అనుభవం చేసుకున్నారు కదా! అప్పుడే మాయతో ప్రతిజ్ఞ చేసారు - నేను మాయాజీత్ గా అవుతాను అని. మాయతో ఈ ప్రతిజ్ఞ చేసారా? మాయాజీత్ గా అవ్వాలా, లేదా? మీరే మాయాజీతులా లేక వచ్చేవారు ఎవరైనానా? మాయకి ప్రతిజ్ఞ చేసారు. కనుక ఈ సమస్యలు, విషయాలు, అలజడి ... ఇవన్నీ మాయ యొక్క రాయల్ రూపాలు. మాయ మరోరూపంలో ఏమీ రాదు. ఈ రూపాలలోనే వస్తుంది కనుక మాయాజీత్ అవ్వాలి. విషయాలు మారవు, సెంటర్ మారదు, స్థానం మారదు, ఆత్మలు మారరు, మనమే మారాలి. మార్చటం కాదు మారి చూపించాలి అని ఇతరుల కోసం అయితే చాలా మంచి స్లోగన్స్ పెడతారు. కానీ ఇది పాత స్లోగన్. మాయ మరిన్ని క్రొత్త, క్రొత్త రూపాలలో మరియు రాయల్ రూపంలో రానున్నది, భయపడకండి. బాప్ దాదా అండర్‌లైన్ చేయిస్తున్నారు - మాయ ఇటువంటిది మరియు ఇలాంటి రూపాలలో రానున్నది మరియు వస్తున్నది కూడా! ఇది మాయ అని కూడా గుర్తించలేరు. దాదీ, మీకు అర్ధం కావటం లేదు, ఇది మాయ కాదు అని అంటారు. ఇది నిజమే, ఇంకా రాయల్ రూపంలో కూడా రానున్నది, భయపడకండి. ఎందుకు? శత్రువు ఓడిపోయి, మనం విజయం పొందే సమయంలో ఆ శత్రువు తన దగ్గర ఉన్న చిన్న, పెద్ద శస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తారా, ఉపయోగించరా! ఉపయోగిస్తారు కదా! అదేవిధంగా మాయ కూడా అంతం అవ్వవలసిందే కానీ అంతిమం ఎంత సమీపంగా వస్తుందో అంతగా అది క్రొత్త,క్రొత్త రూపాలతో, తన యొక్క అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ఉంది మరియు ఉపయోగిస్తుంది కూడా. ఆ తర్వాత మీ పాదాలపై పడుతుంది. మొదట మిమ్మల్ని ఒంగింపచేయడానికి ప్రయత్నిస్తుంది, తర్వాత స్వయం తల వంచుతుంది. దీని కొరకు ఈ రోజు బాప్ దాదా ఒక మాటను మాటిమాటికి అండర్‌లైన్ చేయిస్తున్నారు - బాబా సమానంగా అవ్వాలి అని మీ లక్ష్యం కనుక దీని కొరకు స్వమానంలో ఉండండి మరియు సన్మానం ( గౌరవం) ఇవ్వండి అంటే గౌరవం తీసుకోవటం. గౌరవం అనేది తీసుకోవటం ద్వారా లభించదు, ఇవ్వటం ద్వారా లభిస్తుంది. ఇవ్వటం అంటే తీసుకోవటం. ఇతరులు గౌరవం ఇవ్వాలి అనేది యదార్ధం కాదు. గౌరవం ఇవ్వటమే తీసుకోవటం, కనుక స్వమానంలో ఉండాలి, దేహాభిమానం యొక్క స్వమానం కాదు. బ్రాహ్మణజీవితం యొక్క స్వమానం, శ్రేష్ట ఆత్మ యొక్క స్వమానం, సంపన్నత యొక్క స్వమానంలో ఉండాలి. కనుక స్వమానం మరియు సన్మానం తీసుకోకూడదు, ఇవ్వాలి. ఇవ్వటమే తీసుకోవటం - ఈ రెండు విషయాలలో ధృఢత ఉంచుకోండి. మీ ధృఢతను ఎవరు ఎంత చలింపచేసినా కానీ ధృడతను బలహీనం చేసుకోండి. గట్టి చేసుకోండి, అచంచలంగా అవ్వండి. బాప్ దాదాతో 6 నెలలు గురించి ప్రమాణం చేసారు కదా! ప్రమాణం స్మృతి ఉంది కదా! 15 రోజులు అయిపోయాయి అని అనుకోకండి, ఇంకా ఐదున్నర నెలలు ఉన్నాయి. ఆత్మిక సంభాషణ చేస్తున్నారు కదా! అమృతవేళ అయితే చేస్తున్నారు, అప్పుడు బాప్ దాదాకి చాలా మంచి, మంచి విషయాలు చెప్తున్నారు. మీ విషయాలు గురించి మీకు తెలుసు కదా? ధృఢతను ధారణ చేయండి. వ్యతిరేక విషయాలలో దృఢత పెట్టుకోకూడదు. కోప్పడాల్సిందే, దీనిలో నాకు ధృఢనిశ్చయం ఉంది అని అనకండి, ఇలా చేయకండి, ఎందుకు? ఎందుకంటే ఈ రోజులలో బాప్ దాదా దగ్గరకి క్రోధం గురించి రకరకాల రిపోర్టు చేరుతున్నాయి. క్రోధం అనేది మహారూపంలో తక్కువగా ఉంది, కానీ అంశరూపంలో అయితే రకరకాలుగా ఎక్కువగా ఉంది. 

క్రోధానికి ఎన్ని రూపాలు? అనే విషయంపై క్లాస్ చేస్కోండి. ఇది నా భావం కాదు, నా భావంలో అలా లేదు. కానీ అనేసాను అని అంటున్నారు. దీని గురించి క్లాస్ చేసుకోవాలి. టీచర్స్ చాలామంది వచ్చారు కదా! (1200 మంది టీచర్స్ వచ్చారు) 1200 మంది ధృఢసంకల్పం చేస్తే రేపే పరివర్తన జరగవచ్చు. మరలా ఇన్ని ప్రమాదాలు జరగవు, అందరూ రక్షించబడతారు. టీచర్స్ అందరూ చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. టీచర్ అంటే నిమిత్త పునాది. ఒకవేళ పునాది గట్టిగా అంటే దృడంగా ఉంటే వృక్షం స్వతహాగానే సరి అయిపోతుంది. ఈ రోజులలో ప్రపంచంలో అయినా, బ్రాహ్మణ ప్రపంచంలో అయినా ప్రతి ఒక్కరికీ ధైర్యం మరియు సత్యమైన ప్రేమ అవసరం, పై, పై ప్రేమ, స్వార్థ ప్రేమ కాదు. 1. సత్యమైన ప్రేమ మరియు 2. ధైర్యం కావాలి. ఎవరైనా కానీ సంస్కారానికి వశమై, పరవశమై 95% పొరపాటు చేసి, 5% మంచి చేస్తే మీరు మీరు ఆ 5% మంచిని తీసుకుని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి. ఇది చాలా మంచిగా చేసారు అని ధైర్యం ఇవ్వండి. ఆ తర్వాత ఈ విషయం సరి చేస్కోండి అని చెప్తే వారు ఫీల్ అవ్వరు. అంతే కానీ మీరు ఇది ఎందుకు చేసారు, ఇలా ఎవరైనా చేస్తారా, ఇలా చేయకూడదు, ఇలా చెప్తే వారు మొదటే తెలియకుండానే సంస్కారానికి వశం అయ్యి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు కనుక నీరసం అయిపోతారు, ఉన్నతి చేసుకోలేరు. కనుక 5% మంచికి ధైర్యం ఇవ్వండి. ఈ విషయం మీలో మంచిగా ఉంది, ఇది మీరు చాలా మంచిగా చేయగలరు అని అనండి. ఆ తర్వాత వారి సమయం మరియు స్వరూపం తెలుసుకుని విషయం చెప్తే పరివర్తన అయిపోతారు. దైర్యం ఇవ్వండి ఎందుకంటే పరవశం అయిన ఆత్మలో ధైర్యం ఉండదు. బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేసారు? మీ యొక్క లోపాలు వినిపించారా, మీరు వికారీలు, మీరు మురికివారు.... అని అన్నారా? మీరు ఆత్మ అని స్మృతి ఇప్పించారు మరియు ఈ శ్రేష్టస్మృతితో మీలో సమర్థత వచ్చింది, పరివర్తన చేసుకున్నారు. ధైర్యంతో స్మృతి ఇప్పించండి. స్మృతి అనేది సమర్ధతను స్వతహాగానే ఇప్పిస్తుంది. అర్థమైందా! ఇప్పుడిక సమానంగా అయిపోతారు కదా? కేవలం ఒక పదాన్ని స్మ్మతి ఉంచుకోండి - తల్లి, తండ్రిని అనుసరించాలి. ఏదైతే బాబా చేసారో అదే చేయాలి అంతే. అడుగులో అడుగు వేయాలి. అప్పుడు సమానంగా అవ్వటం సహజంగా అనుభవం అవుతుంది. డ్రామా చిన్న, చిన్న ఆటలు చూపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యార్ధకం పెట్టడం లేదు కదా? మంచిది! 

చాలామంది పిల్లల యొక్క కార్డులు, ఉత్తరాలు, మనస్సు యొక్క పాట బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి. అందరు మా యొక్క ప్రియస్మృతులు చెప్పండి, మా యొక్క ప్రియస్మృతులు చెప్పండి అంటున్నారు. బాప్ దాదా కూడా అంటున్నారు నా యొక్క ప్రియస్మృతులు కూడా చెప్పండి. స్మృతి అయితే బాబా కూడా చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు, ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలోనే బాప్ దాదా మరియు పిల్లలు మరి ఇక ఏ విస్తారం లేనే లేదు. కనుక ఎవరు స్మృతి వస్తారు? పిల్లలకు బాబా మరియు బాబాకి పిల్లలు గుర్తు వస్తారు. దేశ, విదేశాలలో ఉన్న పిల్లలకు కూడా బాప్ దాదా చాలా, చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు ఇస్తున్నారు. 

మాతలు గుంపుగా చాలా మంచిగా వచ్చారు. వృద్ధ మాతలు అనుకుంటారు - ఇప్పుడు ఒకసారి కలుసుకుని వచ్చేద్దాము, తర్వాత మరలా చూద్దాము అని, ఇలా అనుకుంటూ, అనుకుంటూనే చాలాసార్లు వచ్చేసారు. మంచిగా చేస్తున్నారు. బాప్ దాదా మాతల యొక్క ధైర్యం చూసి సంతోషిస్తున్నారు. చప్పట్లు మ్రోగించగానే హాజరు అవుతాను. (అందరు బాగా చప్పట్లు కొట్టారు) మంచిది, చప్పట్లు కొట్టడంలో సంతోషం అయిపోతున్నారు. మంచి వెలుగు ఉంది. మాతల యొక్క వెలుగు చాలా మంచిగా ఉంది. చూడండి! డ్రామాలో మాతలంటే పరివారానికి, బాబాకి ప్రేమ ఉంది. అందువలనే మొదటి అవకాశం మాతలకే లభించింది. మాతల యొక్క టర్న్ లో నీరు కూడా వచ్చేసింది. ఏదైనా కష్టం అనిపించిందా! లేదు కదా! పొదుపు చేసారా, లేదా! అందరి మనస్సు విశాలమైనది కదా! ఎప్పుడైతే మనస్సు విశాలంగా ఉంటుందో అప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతాయి. చిన్న చిన్న గొడవలు అనేవి పెద్ద విషయం కాదు. మధువనం యొక్క శాంతివనం యొక్క పాండవులు మంచిగా ఉన్నారు కదా! గట్టిగా ఉన్నారు కదా! దాదీ! నీళ్ళు లేకపోతే మేము బకెట్స్ తెస్తాము అని అన్నారు. అప్పుడు నీరు హాజరు అవ్వకుండా ఎలా ఉంటుంది! ఇంతమంది పిల్లలు హాజరయినప్పుడు నీరు ఎందుకు హాజరవ్వదు! మంచిది!  

నలువైపుల ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రపంచం యొక్క విశేష ఆత్మలకు, సదా ధృఢత ద్వారా సఫలత పొందే సఫలతా సితారలకు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని సర్వ ఆత్మల పిలుపుని పూర్తి చేసే సంపన్న ఆత్మలకు, సదా నిర్భల ఆత్మలకు, పరవశం అయిన ఆత్మలకు ధైర్యం యొక్క వరదానం ద్వారా ధైర్యం ఇచ్చేవారికి, బాబా యొక్క సహాయానికి పాత్రులు అయ్యే ఆత్మలకు, సదా విశ్వ పరివర్తకులు అయ్యి స్వ పరివర్తన ద్వారా మాయ, ప్రకృతి మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, బాప్ దాదా యొక్క నలువైపుల ఉన్నటువంటి చిన్న ప్రపంచం యొక్క సర్వ ఆత్మలకు సన్ముఖంగా వచ్చిన శ్రేష్ట ఆత్మలకు కోటాను కోట్ల రెట్లు కంటే ఎక్కువ ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments