24-02-2002 అవ్యక్త మురళి

                24-02-2002         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాబాని ప్రత్యక్షం చేసేటందుకు మీ యొక్క లేదా ఇతరుల యొక్క వృత్తిని పాజిటివ్ (శుభం)గా తయారు చేస్కోండి. 

ఈరోజు విశ్వకళ్యాణకారి బాప్ దాదా నలువైపుల ఉన్న తన యొక్క పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క మనస్సులోని ఉల్లాసం బాప్ దాదా చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. త్వరత్వరగా బాబా సమానంగా అయిపోవాలి అని ఒకే ఒక లక్ష్యం అందరి మనస్సులో ఉంది. పిల్లల యొక్క లక్షాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ట సంకల్పాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. దానితో పాటు లక్ష్యం చాలా ఉన్నతోన్నతంగా ఉంది. కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నెంబరు వారీగా ఉన్నట్లు కూడా చూశారు. లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవ్వటం అంటే బాబా సమానంగా అవ్వటం. ఎవరైతే సేవ అనే వేదికపై నిమిత్తం అయ్యి ఉన్నారో వారు సదా ఒకే సంకల్పంలో ఉంటున్నారు - బాబాని ఏవిధంగా ప్రత్యక్షం చేయాలి? ఎప్పుడు ప్రత్యక్షం చేయాలి? అని. ఇటువంటి సంకల్పం వస్తుంది కదా! బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ! మీరందరూ సంపన్న, సంపూర్ణ స్వరూపంలో మీరు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు? దానికి తారీఖు ఏదైనా నిర్ణయించారా అని బాబా పిల్లలను అడుగుతున్నారు. ఇంకా నిర్ణయం కాలేదా? ఏదైనా కార్యక్రమానికి సంవత్సరం ముందే తారీఖు నిర్ణయం అవ్వాలి అని డబల్ విదేశీయులు అంటారు, అంటారు కదా! అయితే బాబా అంటున్నారు - స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునే తారీఖు నిర్ణయించారా? నిర్ణయించారా? మీటింగ్స్ అయితే చాలా చేశారు కదా! ఈ రోజు ఫలానా మీటింగు, రేపు ఫలానా మీటింగు అని చాలా చేశారు కదా! ఇప్పుడు కూడా ఎన్ని మీటింగ్ కొరకు వచ్చారు? మూడు మీటింగ్ కొరకు వచ్చిన వారు ఇక్కడ కూర్చున్నారు. ఇది అయితే చాలా బావుంది, కానీ ఈ మీటింగ్ కి తారీకు ఏమిటి? ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతారో అదే కర్మ ఉండాలి. సంకల్పం, మాట మరియు కర్మ మూడూ శ్రేష్ట లక్ష్యం ప్రమాణంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తం అయిన, సర్వాత్మల కళ్యాణ కారులైన పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో వేదిక పైకి ఎప్పుడు వస్తారు అని బాప్ దాదా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు గుప్త పురుషార్థంలో ఉన్నారు, సంలగ్నతలో ఉన్నారు. ఇది కూడా బాప్ దాదా చూస్తున్నారు. కానీ ఈ విశేష సంకల్పం యొక్క సంలగ్నతలో ఎప్పుడు నిమగ్నం అవుతారు? సంలగ్నత అయితే ఉంది కానీ ఈ సంకల్పాన్ని సంపన్నం చేసుకోవటంలో నిరంతరం నిమగ్నం అయి ఉండాలి అంటే నిరంతరం ఇదే సంకల్పాన్ని పూర్తి చేసే ప్రత్యక్ష స్వరూపంలో ఉండాలి. ఇప్పుడు సంకల్పం మరియు ప్రత్యక్ష కర్మలో తేడా ఉంది. తయారవ్వవలసిందే మరియు చేయాల్సింది కూడా పిల్లలే, బాబా అయితే వెన్నెముక.  

అన్నింటికంటే తీవ్ర వేగవంతమైన సేవ ఏమిటంటే వృత్తి ద్వారా తరంగాలను వ్యాపింపజేయాలి. రాకెట్ కంటే చాలా తీవ్రమైన వేగవంతమైనది వృత్తి. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎంతమంది ఆత్మల వద్దకు కావాలంటే అంతమంది దగ్గరకు ఇక్కడ కూర్చుని ఉండగానే చేరగలరు. వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయగలరు. కానీ వృత్తి ద్వారా సేవ చేయటంలో ఒక విషయం విఘ్నం వేస్తుంది. వృత్తి ద్వారా తరంగాలు వ్యాపిస్తాయి. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు, అంతిమ జన్మ వరకు తరంగాల ద్వారా సేవ చేస్తున్నాయి కదా! చూశారు కదా! మందిరం చూశారు కదా! డబల్ విదేశీయులు చూశారా? మందిరాన్ని చూశారా? చూడకపోతే చూడండి, ఎందుకంటే ఆ మందిరాలు మీవే కదా! కుమారీలూ మీకు మందిరాలు ఉన్నాయా, భారతవాసీయులకి మందిరాలు ఉన్నాయా? అందరికి మందిరాలు ఉన్నాయి మంచిది. శుభాకాంక్షలు. మందిరంలోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో తరంగాల ద్వారా సేవ చేస్తున్నారు అంటే మందిరంలోని మూర్తులు, ఆత్మలైన మీరు సేవ చేస్తున్నారు. అయితే ఎంతమంది భక్తులు తరంగాల ద్వారా తమ యొక్క సర్వ కోరికలను పూర్తి చేసుకుంటున్నారు. అందువలన ఓ చైతన్యమూర్తులూ! ఇప్పుడు మీ యొక్క శుభభావన యొక్క వృత్తి ద్వారా, శుభకామనల యొక్క వృత్తి ద్వారా వాయుమండలంలో తరంగాలను వ్యాపింపజేయండి. కానీ, కానీ అనే మాట మాట్లాడటం ఇష్టం అనిపించటం లేదు కానీ మాట్లాడవలసి వస్తుంది. పాండవులకి కానీ అనే మాట ఇష్టంగా అనిపిస్తుందా? ఇష్టం అనిపించటం లేదు. కానీ, కానీ అనే మాట ఉందా? లేక సమాప్తి అయిపోయిందా? దీని కొరకు అన్నింటికంటే సహజమైన విధి మొదట ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఒక్క సెకనులో పరిశీలించుకోగలుగుతున్నారా? ఇప్పుడిప్పుడే చూస్కోండి. ఒక్క సెకను ఇవ్వమంటారా లేక అనటంలోనే సెకను లభించిందా? ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నా వృత్తిలో ఏ ఆత్మపట్లనైనా ఏదైనా వ్యతిరేక తరంగాలు ఉన్నాయా? విశ్వంలోని వాయుమండలాన్ని పరివర్తన చేయాలి కానీ మీ మనసులో ఏ ఆత్మపట్లనైనా ఒకవేళ వ్యర్థ తరంగాలు లేదా అశుద్ధమైనవి ఉంటేవారు విశ్వపరివర్తన చేయలేరు. విఘ్నాలు వచ్చేస్తుంటాయి, సమయం పట్టేస్తుంది. కొంతమంది పిల్లలు అంటున్నారు - వారు ఉన్నదే అలా కదా అని. అలా ఉంటే అలాంటి తరంగాలే ఉంటాయి కదా అంటున్నారు. ఇలా బాబాకి కూడా జ్ఞానం ఇస్తున్నారు - బాబా నీకు తెలియదు, ఆ ఆత్మ ఉన్నదే అలా అని అంటున్నారు. కానీ బాబా అడుగుతున్నారు - వారు చెడ్డవారు, వారిది తప్పు, అలా జరగకూడదు సరే కానీ ఆ చెడుని మీ వృత్తిలో ఉంచుకోండి అని బాబా అనుమతి ఇచ్చారా? అనుమతి ఇవ్వలేదు అనేవారు చేయి ఎత్తండి, ఒక చేతిని ఎత్తండి కానీ రెండు చేతులతో చప్పట్లు వద్దు. వెనుక కూర్చున్నవారు చేతులు ఎత్తుతున్నారు. టీ.విలో చూపించండి. (దాదీని అడుగుతున్నారు) మీరు చూస్తున్నారు కదా! మంచిది. చేయి ఎత్తారు జ్ఞాపకం ఉంచుకోండి. డబల్ విదేశీయులు చేతులెత్తారు. బాప్ దాదా యొక్క టీ.విలో అయితే వస్తూనే ఉన్నారు. ఎప్పటివరకు ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క స్వయం యొక్క వృత్తిలో ఏ ఆత్మపట్లనైనా తరంగాలు నెగిటివ్ గా (వ్యతిరేకంగా) ఉన్నట్లైతే విశ్వకళ్యాణం కొరకు వృత్తి ద్వారా వాయుమండలంలో తరంగాలను వ్యాపింపజేయలేరు. దీనిని పక్కాగా అర్థం చేస్కోండి. ఎంతైనా సేవ చేయండి, రోజుకి ఏడెనిమిది ఉపన్యాసాలు చెప్పండి, యోగ శిబిరాలు పెట్టండి, ఎన్నో రకాల కోర్సులు చెప్పండి కానీ ఎవరి పట్లనైనా మీ వృత్తిలో పాత అశుద్ద తరంగాలను ఉంచుకోకండి. వారు చెడ్డవారు, చాలా పొరపాట్లు చేశారు, చాలా మందికి దు:ఖం ఇస్తున్నారు. అయితే మీరు వారికి దు:ఖం ఇవ్వటంలో బాధ్యత వహించడానికి బదులు వారిని పరివర్తన చేయటంలో సహాయకులుగా అవ్వలేరా? దు:ఖం ఇవ్వటంలో సహాయం చేయకూడదు వారిని పరివర్తన చేయటంలో మీరు సహాయకారిగా అవ్వండి. వీరు మారరు అని ఏ ఆత్మ గురించి అయినా మీరు అనుకుంటున్నారు, అంటే వారు మారేవారు కాదు అని మీరు నిర్ణయించారు కానీ నెంబరువారీగా ఉంటారు కదా! వీరు మారనే మారరు అని అసలు మీరెందుకు ఆలోచిస్తున్నారు? జడ్జి బాబా కదా! మరి మీరు ఎందుకు నిర్ణయిస్తున్నారు? పరస్పరంలో మీరు జడ్జి అయిపోయారా? బాబా కూడా చూస్తూ ఉంటారు. వీరు ఇలాంటి వారు, వారు ఇలాంటి వారు ...... ఇలా. బ్రహ్మాబాబాని ప్రత్యక్షంగా చూశారు కదా - మాటిమాటికి పొరపాట్లు చేసే ఆత్మలు కూడా ఉండేవారు. కానీ బాప్ దాదా, విశేషంగా సాకార రూపంలో బ్రహ్మాబాబా పిల్లలందరికీ ప్రియస్మృతులు ఇచ్చేవారు, పిల్లలందరినీ మధురాతి మధురమైన పిల్లలూ! అనేవారు. ఇద్దరు - నలుగురిని కఠినమైనవారు అని, మిగిలినవారు మధురమైనవారు అని అన్నారా? అటువంటి ఆత్మల పట్ల కూడా సదా దయాహృదయులు అయ్యారు. క్షమాసాగరునిగా అయ్యారు. మీరు మీ వృత్తిలో ఎవరి గురించి అయినా అశుద్ధ భావం పెట్టుకున్నారు అనుకోండి దాని ద్వారా మీకు వచ్చిన లాభం ఏమిటి? ఒకవేళ దీనిలో మీకు లాభం ఉంది అంటే ఉంచుకోండి, దీనికి అనుమతి ఇస్తున్నాను. దానిలో లాభం లేదు దాని ద్వారా అలజడి వస్తుంది. బాప్ దాదా చూస్తున్నారు ఆ సమయంలో వారికి అద్దం చూపించాలి. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకునే జ్ఞానవంతులుగా అవ్వటం వేరేవిషయం కానీ ఏ లాభం లేని విషయాలను వృత్తిలో భారం చేయటం తప్పు. ఎందుకంటే దీని ద్వారా మీరు మూడ్ ఆఫ్ అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి యొక్క శక్తి తక్కువ అయిపోతుంది అంటే నష్టం జరుగుతుంది. ప్రకృతిని కూడా పావనంగా చేసేవారు కదా! కానీ వీరు అయితే ఆత్మలు. వృత్తి, తరంగాలు మరియు వాయుమండలం మూడింటికీ సంబంధం ఉంది. వృత్తి ద్వారా తరంగాలు వ్యాపిస్తాయి, తరంగాల ద్వారా వాయుమండలం తయారవుతుంది. కానీ ముఖ్యమైనది వృత్తి. త్వరత్వరగా బాబా ప్రత్యక్షం అవ్వాలి అని మీరు భావిస్తున్నట్లైతే దానికి తీవ్ర వేగవంతమైన పద్దతి ఏమిటంటే మీ కొరకు మరియు ఇతరుల కొరకు మీ వృత్తిని శుద్ధంగా తయారుచేస్కోండి. జ్ఞానవంతంగా అయితే అవ్వండి కానీ మీ మనస్సులో నెగిటివ్ ని (వ్యతిరేకతను) ధారణ చేయకండి. నెగిటివ్ అంటే మురికి. ఇప్పుడిప్పుడే వృత్తిని శక్తిశాలిగా చేస్కోండి మరియు తరంగాలను శక్తివంతంగా తయారుచేయండి, వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేయండి. ఎందుకంటే వాచా ద్వారా పరివర్తన, శిక్షణ ద్వారా పరివర్తన అనేది చాలా తక్కువ వేగంతో జరుగుతుంది, ఇది మీ అందరికీ అనుభవమే కదా! పరివర్తన జరుగుతుంది కానీ చాలా తక్కువ వేగంతో జరుగుతుంది. ఒకవేళ మీరు వేగం తీవ్రం అవ్వాలనుకుంటే జ్ఞానవంతులుగా అయ్యి, క్షమా సాగరులుగా అయ్యి, దయాహృదయులుగా అయ్యి శుభభావన, శుభ కామన ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి! ఎవరు మధువనానికి వచ్చినా కానీ అన్నింటికంటే ఎక్కువ ఏ విషయం ప్రభావం పడుతుంది? వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది, ఇక్కడ కూడా అందరు నెంబరువారీగా ఉంటారు. బ్రహ్మాబాబా యొక్క కర్మభూమి, బాప్ దాదా యొక్క వరదానభూమి కనుక ఆ వాయుమండలం వారిని పరివర్తన చేస్తుంది. మీరందరు దీనిని ప్రత్యక్షంగా చూశారు కదా! అనుభవం ఉంది కదా! కనుక తరంగాల ద్వారా వాయుమండలాన్ని తయారుచేయటం ద్వారా తీవ్రగతితో మనస్సుపై ముద్ర పడుతుంది. వాయుమండలం మనస్సులో ముద్రింపబడుతుంది. విన్నటువంటి విషయాలు మరిచిపోగలరు కానీ వాయుమండలం అనేది మనస్సుపై ముద్ర పడిపోతుంది. దానిని మర్చిపోలేరు. అవును కదా? ప్రత్యక్షత ఎప్పుడు అవుతుంది అని పరస్పరం ఆత్మిక సంభాషణ చాలా మంచిగా చేసుకుంటున్నారు, బాప్ దాదా వింటున్నారు. మంచిది. చెప్పండి పాండవులు ఇప్పుడు ఏమి చేస్తారు? వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి. సేవాకేంద్రం అయినా, ఏ స్థానం అయినా, ప్రవృత్తిలో ఉంటున్నా వాయుమండలం శక్తివంతంగా ఉండాలి. నలువైపుల వాయుమండలం సంపూర్ణ నిర్విఘ్నంగా, దయాహృదయంగా, శుభభావన, శుభకామనలతో నిండిపోతే ప్రత్యక్షతలో ఏ ఆలశ్యం ఉండదు. ఇప్పుడు బాప్ దాదా ఏ తారీఖు ఇచ్చారో అది బాప్ దాదాకి జ్ఞాపకం ఉంటుంది. లెక్క అయితే అడుగుతారు. ప్రతి ఒక్కరు తమ తమ అకౌంట్ పెట్టుకున్నారు కదా! అయితే ఆ అకౌంట్ లో బాప్ దాదా ఇదే పరిశీలిస్తారు - వృత్తిలో, దృష్టిలో, మాటలో దయా హృదయంగా, శుభభావన, శుభ కామన ఎంత శాతం కలిగి ఉన్నారు? ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులు ఉన్నాయి కదా! ఎక్కువే. మంచిది, ఎవరైనా చేయకపోయినా కానీ ఈ 15 రోజులలో చేయవచ్చు అయినా పాస్ చేస్తారు. జరిగిపోయిన దానికి బిందువు పెట్టాలి మరియు దయాసింధువుగా అయిపోవాలి. క్షమా సాగరులుగా అయిపోవాలి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) 

ఈరోజు విదేశాలలో వింటున్నారు లేదా చూస్తున్నారు కదా లేక లేదా? (చూస్తున్నారు) మంచిది. మీ యజ్ఞం యొక్క స్థాపన తర్వాతే విజ్ఞానం వృద్ధి చెందింది. దాని యొక్క లాభం అయితే తీసుకోవాలి కదా! కానీ విధిపూర్వక లాభం తీసుకోవాలి. ఎవరైతే విజ్ఞాన సాధనాల ద్వారా చూస్తున్నారో లేదా వింటున్నారో ఆ పిల్లలందరినీ అందరి కంటే ముందు బాప్ దాదా సదా స్మృతి చేస్తూ ఉంటారు. ఎంతెంత స్మృతి బలం శక్తివంతంగా ఉంటుందో అంతంతగా బాప్ దాదా మాతోనే మాట్లాడుతున్నారు అని అనుభవం అవుతుంది. అయినా కానీ మధువనం మధువనమే. 

మంచిది, ఇప్పుడిప్పుడే మీ వృత్తిని ఏకాగ్రం చేయగలుగుతున్నారా? వృత్తి ఎక్కడా కూడా అలజడిలోకి రాకూడదు. అచంచలంగా, ఏకాగ్రంగా, శక్తిశాలిగా ఉండాలి. (డ్రిల్ చేయించారు) 

నలువైపుల ఉన్న సర్వీసబుల్ పిల్లలందరికీ, సదా తమ యొక్క శ్రేష్ట తరంగాల ద్వారా సేవ చేసే తీవ్రగతి యొక్క పురుషార్ధం చేసే పిల్లలకు, సదా మాస్టర్ క్షమా సాగరులకు, సదా శుభ భావన, శుభ కామన ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా తయారుచేసేవారికి, ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతమైన పిల్లలకు బాప్ దాదా యొక్క చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments