21-11-1998 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహిస్థితి యొక్క అనుభవం పెంచుకోండి.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న తన పిల్లలని చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాబాకి తెలుసు - చివరి పురుషార్థి అయినా కానీ నా యొక్క ప్రతి బిడ్డ విశ్వంలో అందరికంటే ఉన్నతోన్నత భాగ్యవంతులు అని. ఎందుకంటే భాగ్యవిధాత బాబాను తెలుసుకుని, గ్రహించి భాగ్య విధాతకి స్వయంగా పిల్లలు అయ్యారు. ఈ విధమైన భాగ్యం కల్పమంతటిలో ఏ ఆత్మకి లేదు మరియు ఉండదు. వెనువెంట విశ్వమంతటిలో మీ కంటే సంపత్తి వంతులు, ధనవంతులు ఎవరు ఉండరు. ఎంత కోట్లాధిపతులైనా కానీ పిల్లలైన మీ యొక్క ఖజానాలతో సమానం కాలేరు. ఎందుకంటే పిల్లలైన మీకు ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన ఉంది. ప్రతి రోజూ రోజంతటిలో ఒకటి, రెండు అడుగులు అయినా కానీ బాబా స్మృతిలో ఉండి వేస్తే ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన అవుతుంది. అంటే రోజంతటిలో ఎన్ని కోట్లు జమ అయ్యాయి? ఒక రోజులో కోటానుకోట్లు సంపాదించుకునేవారు ఎవరైనా ఉంటారా! అందువలన బాప్ దాదా చెప్తున్నారు - అందరికంటే భాగ్యవంతులను లేదా ప్రపంచంలోకెల్లా ధనవంతమైన ఆత్మని చూడాలంటే బాబా పిల్లలని చూడండి అని.
పిల్లలైన మీ దగ్గర కేవలం స్థూలధనం యొక్క ఖజానా ఒక్కటే కాదు, వారయితే కేవలం సూలధనంతో మాత్రమే ధనవంతులు. పిల్లలైన మీరు ఎన్ని ఖజానాలతో సంపన్నులు! ఖజానాల జాబితా తెలుసు కదా? స్థూలధనం అనేది గొప్ప విషయమేమి కాదు కానీ మీ దగ్గర జ్ఞానఖజానా, శక్తుల ఖజానా, సర్వ గుణాల ఖజానా, సంతోష ఖజానా, మరియు సర్వులకి సుఖం, శాంతి యొక్క మార్గం చెప్పటం ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా... ఈ అవినాశి ఖజానాలన్నీ పరమాత్మ పిల్లల దగ్గర తప్ప మరెవ్వరి దగ్గర ఉండవు. బాప్ దాదాకి ఇటువంటి ఖజానాలకి యజమానులైన పిల్లలంటే ఎంతో ఆత్మికగర్వంగా ఉంటుంది! బాప్ దాదా సదా పిల్లలను ఈవిధంగా సంపన్నంగా చూసి - ఓహో పిల్లలూ! ఓహో!! అని పాడుతున్నారు. మీకు కూడా మీ గురించి ఇంత ఆత్మికగర్వం అంటే నషా ఉంది కదా! చేతులతో చప్పట్లు కొట్టగలరా! (అందరూ చప్పట్లు కొట్టారు) రెండు చేతులను ఎందుకు కష్టపెడతారు, ఒక చేతితో కొట్టండి (చేయి ఊపటం). ఒక చేతితో చప్పట్లు కొట్టడం వస్తుందా. బ్రాహ్మణుల పద్దతులన్నీ ప్రత్యేకమైనవి. బ్రాహ్మణులు శాంతి ప్రియులు అందువలన చప్పట్లు కూడా శాంతిగా కొట్టడం సరైనది. కనుక నషా అయితే అందరికీ సదా ఉంది మరియు ఇక ముందు కూడా ఉంటుంది. నిశ్చితం అయిపోయింది. బాప్ దాదా సమయం పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల పురుషార్ధం యొక్క వేగాన్ని కూడా చూస్తున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డను సదా జీవన్ముక్తి స్థితిలో చూడాలనుకుంటున్నారు. తండ్రి నుండి ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి రండి అని మీరందరు శపధం చేస్తారు కదా! కానీ మీకు అయితే ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించింది కదా? లేక లభించలేదా? (లభించింది) సత్యయుగంలో లేదా ముక్తిధామంలో ముక్తి - జీవన్ముక్తి యొక్క అనుభవం చేసుకోలేరు. ముక్తి - జీవన్ముక్తి వారసత్వం యొక్క అనుభవం ఇప్పుడు సంగమయుగంలోనే చేసుకోవాలి. జీవితంలో ఉంటూ, సమయం ప్రమాదకరంగా ఉన్నా, పరిస్థితులు, సమస్యలు, వాయు మండలం రెండు రెట్లు కళంకితంగా ఉన్నా వీటన్నింటి ప్రభావాల నుండి ముక్తిగా, జీవితంలో ఉంటూ రకరకాల బంధనాలన్నింటి నుండి ముక్తులుగా ఉండాలి, ఒక సూక్ష్మబంధన కూడా ఉండకూడదు - ఈవిధంగా జీవన్ముక్తులు అయ్యారా? లేక అంతిమంలో అవుతారా? ఇప్పుడు అవుతారా లేక అంతిమంలో తయారవుతారా? తయారవ్వాల్సింది అంతిమంలో కాదు, ఇప్పుడే తయారవ్వాలి లేదా తయారయ్యాం లేదా తయారవ్వాల్సిందే అనేవారు చేతులు ఎత్తండి! (అందరు చేతులు ఎత్తారు). రెండింటిలో కలిసిపోయి చేతులు ఎత్తుతున్నారు, తెలివైనవారు. తెలివి చూపించండి కానీ బాప్ దాదా ఇప్పటినుండి స్పష్టంగా చెప్తున్నారు - దయచేసి ధ్యాస పెట్టండి. (అట్టెన్షన్ ప్లీజ్) బాబా ప్రతి ఒక బ్రాహ్మణ బిడ్డను బంధన్ముక్తులుగా, జీవన్ముక్తులుగా తయారు చేయవలసిందే. ఏ విధి ద్వారా అయినా కానీ తయారుచేయటం తప్పదు. ఆ విధులు ఏమిటో తెలుసు కదా! ఇంత తెలివైనవారే కదా! తయారవ్వవలసింది మీరే. మీరు కావాలనుకున్నా, వద్దనుకున్నా కానీ తయారవ్వవలసిందే. అప్పుడు ఏమి చేస్తారు? (ఇప్పటి నుండే తయారవుతాం) మీ నోట్లో గులాబ్ జామ్. అందరి నోట్లోకి గులాబ్ జామ్ వచ్చేసింది కదా! ఇప్పుడు బంధన్ముక్తులుగా అవ్వాలి దాని కోసం ఈ గులాబ్ జామ్. అంతేకానీ గులాబ్ జామ్ తినటం కాదు.
హాల్ చాలా అందంగా ఉంది. అందరూ ఒక మాల (హారం) వలె కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మాల వలె అనిపిస్తుంది. ఇక్కడ కుర్చీల వారి మాల తయారయ్యింది. మంచిది. కారణంగానో, అకారణంగానో ఇప్పుడు కుర్చీ తీసుకున్నారు కదా! అదేవిధంగా బాప్ దాదా అంతిమ సమయాన్ని అనుసరించి ఈల మ్రోగించగానే జీవన్ముక్తి యొక్క కుర్చీలో కూర్చోండి అంటే కూడా కూర్చుంటారా లేక ఇప్పుడే కుర్చీపై కూర్చుంటారా? అలాగని క్రింద కూర్చున్నవారు కుర్చీ తీసుకోరు అని అర్ధం కాదు, మొదట మీరే. క్రింద కూర్చోవటం - తపస్సుకి గుర్తు, ఆరోగ్యానికి గుర్తు. క్రింద కూర్చోవటం ఆరోగ్యం కూడా మరియు తపస్సు ద్వారా సర్వ ఖజానాల ధనం కూడా లభిస్తుంది. ఆరోగ్యం మరియు ధనం ఉన్నచోట సంతోషం ఉండనే ఉంటుంది. మంచిది, ఆరోగ్యవంతులు మరియు ధనవంతులు కూడా.
ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క మూడురకాల స్థితులను చూస్తున్నారు. 1. పురుషార్థీలు, వీరిలో పురుషార్థులు, మరియు తీవ్రపురుషార్థులు కూడా ఉన్నారు. 2. పురుషార్ధం యొక్క ప్రాలబ్దం అంటే జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకునేవారు. 3. అంతిమ సంపూర్ణస్థితి - దేహంలో ఉంటూ విదేహి స్థితి యొక్క అనుభవం. ఇలా మూడు రకాల స్థితులను చూశారు. పురుషార్థీ స్థితిలో ఎక్కుమందిని చూసారు. పురుషార్థానికి ప్రాలబ్దం - జీవన్ముక్తి, అంతే కానీ సెంటర్ కి నిమిత్తంగా అవ్వటం లేదా మంచి ఉపన్యాసకులుగా అవ్వటం లేదా డ్రామానుసారం వేర్వేరు విశేష సేవలకి నిమిత్తంగా అవ్వటం.... ఇవి ప్రాలబ్దం కాదు. ఇవి ముందుకి వెళ్ళడానికి, సర్వుల ద్వారా ఆశీర్వాదాలు పొందడానికి సహాయపడేవి. కానీ ప్రాలబ్దం అంటే జీవన్ముక్తి. ఏ బంధన ఉండకూడదు. మీరు ఒక చిత్రం చూపిస్తారు కదా - సాధారణ అజ్ఞాని ఆత్మను ఎన్ని రకాల త్రాళ్ళు బంధించినట్లు చూపిస్తారు. అవి అజ్ఞానీ ఆత్మలకు ఇనుప సంకెళ్ళు, పెద్ద పెద్ద బంధనాలు కానీ జ్ఞానీ ఆత్మలకు చాలా లోతైన, ఆకర్షణీయమైన దారాలు ఉన్నాయి. పైకి కనిపించే ఇనుప సంకెళ్ళు లేవు. చాలా లోతైన, సూక్ష్మమైన దారాలు ఉన్నాయి. వ్యక్తిత్వంగా అనిపించేవి కూడా ఉన్నాయి ఈ దారాలు పైకి కనిపించవు. మంచితనంగా అనిపిస్తాయి. మంచితనం ఉండదు. కానీ మేము చాలా మంచివాళ్ళం, మేము చాలా ముందుకి వెళ్తున్నాం అని అనుభూతి చేయిస్తాయి. ఇలా జీవన బంధన యొక్క దారాలు చాలామందికి ఉన్నట్లుగా బాప్ దాదా చూశారు. ఒకటి అయినా, సగం అయినా కానీ ఉన్నాయి. జీవన్ముక్తులు అయిన వారు చాలా చాలా తక్కువమందిని చూశారు. బాప్ దాదా చూస్తున్నారు - లెక్కప్రకారంగా ఈ జీవన్ముక్తి స్థితి అనేది రెండవ స్థితి, అంతిమ స్థితి ఏమిటంటే దేహానికి అతీతంగా విదేహి స్థితి. ఆ స్థితి కొరకు మరియు పైన చెప్పినటువంటి స్థితి కొరకు చాలా చాలా చాలా ధ్యాస అవసరం. 99వ సంవత్సరం రాబోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు? అని పిల్లలందరు అడుగుతున్నారు.
బాప్ దాదా చెప్తున్నారు - 99వ సంవత్సరము అనే విషయాన్ని వదిలేయండి ఇప్పటినుండి విదేహిస్థితి యొక్క అనుభవం చాలా కావాలి. ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో మరియు రానున్నాయో వాటి ప్రకారం విదేహిస్థితి యొక్క అభ్యాసం చాలా కావాలి. ఇలా అవ్వదు, అలా అవ్వదు కదా, ఏమవుతుందో ఈ ప్రశ్నలు, విషయాలు అన్నింటినీ వదిలేయండి. విదేహి అభ్యాసం ఉన్న పిల్లలపై ఏ పరిస్థితి లేదా ఏ అలజడి ప్రభావం వేయలేదు. ప్రకృతి యొక్క పంచతత్వాలు చలింపచేయడానికి ప్రయత్నించినా కానీ విదేహి స్థితి యొక్క అభ్యాసి ఆత్మ పూర్తిగా అచంచలంగా, స్థిరంగా ఉంటూ పాస్ విత్ ఆనరై అన్ని విషయాలలో పాస్ అయిపోతారు. మరియు బ్రహ్మాబాబా సమానంగా పాస్ విత్ ఆనర్ కి రుజువుగా ఉంటారు.
బాప్ దాదా సమయం అనుసరించి సైగ చేస్తున్నారు మరియు చేస్తుంటారు కూడా. మీరు ఆలోచిస్తున్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు తయారుచేయండి, ఆలోచించండి మంచిదే కానీ ఏమౌతుందో..... అని ఆశ్చర్యచకితులు అవ్వకండి. విదేహిగా, సాక్షిగా అయ్యి ఆలోచించండి. కానీ ఆలోచించారు మరియు ప్లాన్ తయారు చేశారు మరియు సెకనులో స్వచ్చమైనస్థితి తయారు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ స్థితి అవసరం. ఈ విదేహిస్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటిస్తుంది. మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా దాటేస్తారు. విదేహి అయిన వారు అచంచలంగా, స్థిరంగా అయ్యి ఆట చూస్తుంటారు. ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు. కానీ అంతిమస్థితి గురించి ఆలోచించండి.
నలువైపుల సేవాసమాచారం అంతా బాప్ దాదా వింటూ ఉంటారు. మరియు అలసిపోని సేవాధారులందరికీ మనస్సూర్వకంగా శుభాకాంక్షలు కూడా ఇస్తారు. చాలా మంచి ఉత్సాహ, ఉల్లాసాలతో సేవ చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తూ ఉండండి కానీ సేవ మరియు స్థితి యొక్క సమానతలో అప్పుడప్పుడు ఇటువైపుకి, అప్పుడప్పుడు అటువైపుకి వంగిపోతున్నారు. అందువలన సేవ బాగా చేయండి. సేవ చేయవద్దు అని బాప్ దాదా అనటం లేదు. ఇంకా అట్టహాసంగా చేయండి కానీ సదా సేవ మరియు స్థితి యొక్క సమానత ఉంచుకోండి. స్థితిని తయారు చేసుకోవటంలో కొంచెం శ్రమ అనిపిస్తుంది, సేవ అయితే సహజంగా అనిపిస్తుంది. అందువలన సేవాబలం, స్థితి కంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది. సమానత ఉంచుకోండి మరియు బాప్ దాదా యొక్క సేవ చేసే ఆత్మలందరి యొక్క మరియు సంబంధ - సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ నడవండి. ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోండి.
ఇప్పుడు ఆశీర్వాదాల యొక్క ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా ఉండాలంటే ద్వాపరయుగం నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభించాలి, అనేక జన్మలు ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ జమ ఒక జన్మలోనే చేసుకోవాలి. అందువలన ఏమి చేస్తారు? స్థితిని సదా ముందు ఉంచుకుని సదా సేవలో ముందుకు వెళ్ళండి. ఏమౌతుందో అని ఆలోచించకండి. బ్రాహ్మణాత్మలకు అంతా మంచిదే, మంచే జరగనున్నది. కానీ సమానత ఉంచుకునే వారికి సదా మంచే జరుగుతుంది. సమానత తక్కువైతే అప్పుడప్పుడు మంచి, అప్పుడప్పుడు కొద్దిగా మంచి జరుగుతుంది. ఏమి చేయాలో విన్నారా? ప్రశార్థకంగా, ఆశ్చర్యార్ధకంగా ఆలోచించడం సమాప్తి చేయండి. ఇలా అవ్వదు కదా! అలా అవ్వదు కదా!...... అనుకోకండి. ఇది స్థితిని అలజడి చేస్తుంది.
క్రొత్త, క్రొత్త వారు కూడా చాలామంది వచ్చారు. ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారిగా మధువనం వచ్చారో వారు చేతులు ఎత్తండి! చాలా మంచిది! బాప్ దాదా క్రొత్త, క్రొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు మరియు చాలా సంతోషంతో స్వాగతం పిల్లలూ! సుస్వాగతం!! అని అంటున్నారు. మంచిది. అంతిమానికి ముందుగానే చేరుకున్నారు. అయినా కానీ కలుసుకునే సమయానికి చేరుకున్నారు. అందువలన వెనుక వచ్చినవారికి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. కనుక మీరు స్వర్ణిమ అవకాశం తీసుకోండి.
(డబల్ విదేశీయులు చాలా మంది వచ్చారు) విదేశీ గ్రూప్ నిల్చోండి. విదేశాలలో కూడా ఒక విశేషత బాప్ దాదాకి చాలా ఇష్టం అనిపిస్తుంది. అది ఏమిటి? అందరికీ చాలా ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి - విదేశాల యొక్క మూలమూలల్లో బాబా యొక్క స్థానాలు తయారుచేయాలి అని. మరియు తయారుచేశారు కూడా! ఈ సంవత్సరంలో ఎన్ని స్థానాలు తయారుచేసారు? (12-15) నలువైపుల సందేశం లభించాలి అనే ఉత్సాహం ఉంది. ఈ లక్ష్యం చాలా మంచిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎవరొకరిని నిమిత్తంగా చేయాలనే సేవా లక్ష్యం బావుంది. ఇది విశేషత. ప్రతి ఒక్కరు ఎంత వీలైతే అంత తమనితాము సేవకి నిమిత్తంగా చేసుకునే ఆఫర్ ఇస్తారు మరియు ప్రత్యక్షంగా కూడా చేస్తారు. ఇల్లు, ఇల్లు బాబా ఇల్లు అవ్వాలి అని అనుకుంటారు. ఈ ఉత్సాహ, ఉల్లాసాలు చాలా మంచిగా ఉన్నాయి. అందువలన ఈ ఉత్సాహ, ఉల్లాసాలతో మరింత ముందుకు వెళ్ళాని బాప్ దాదా ముందుగానే శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్ దాదా విదేశీ అంటే విశ్వకళ్యాణానికి నిమిత్తమైన పిల్లలకు చెప్తున్నారు - ఇప్పుడు సేవ మరియు విదేహీ స్థితిలో నెంబర్ వన్ గా విదేశీ పిల్లలే అవ్వాలి అని. ఎప్పుడు తయారవ్వాలి? 99సం||లో తయారవుతారా లేక 2000సం||లో అవుతారా? ఎప్పుడో కాదు ఇప్పుడే తయారవ్వాలి. అవ్యక్త బాబా యొక్క పాలనకి ప్రత్యక్ష రుజువు ఇవ్వాలి. ఎలా అయితే బ్రహ్మాబాబా అవ్యక్తంగా అయ్యి విదేహిస్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారు. మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకి పాత్రులు. కనుక అవ్యక్త పాలనకి బదులు ఇవ్వటం అంటే విదేహిగా అవ్వాలి. సేవ మరియు స్థితిని సమానంగా ఉంచు కోవాలి. సరేనా, అంగీకారమేనా? చేయాల్సిందే. చేస్తాం, చూస్తాం అని అనాలని బాప్ దాదా అనుకోవటం లేదు. చేయాల్సిందే, చేయాల్సిందే. మీ భాషలో చెప్పండి - చేయాల్సిందే. టి.విలో చూసేవారు కూడా ఇలా చెప్తున్నారు కదా? బాప్ దాదా చూస్తున్నారు - భారతదేశంలో చూస్తున్నా, విదేశంలో చూస్తున్నా కానీ అందరికీ ఉత్సాహం వస్తుంది - మేము చేస్తాము, మేము చేస్తాము అని. మేము చేయాల్సిందే అనుకుంటున్నారు. కనుక ముందుగానే శుభాకాంక్షలు. మంచిది!
ఎవరైతే భారతవాసీయులు వచ్చారో భారతవాసీయులకు విశేష నషా ఉంటుంది. బాప్ దాదా యొక్క అవతరణ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. వెనువెంట కలుసుకోవడానికి కూడా భారతదేశంలోనే వస్తారు. డబల్ నషా ఉంటుంది కదా! భారతవాసీయులే విదేశాలలో సందేశం ఇచ్చారు. కనుక భారతవాసీయులే, విదేశాలలో కూడా తమ పరివారాన్ని వెతికి ఒకే పరివారంగా తయారు చేసారు. అందువలన భారతవాసీ పిల్లలకు సదా గొప్పతనం ఉండనే ఉంటుంది, భారతదేశ గొప్పతనం పెరగాలంటే భారతవాసీయులకు గొప్పతనం ఉండే ఉంటుంది. అందువలన ఎవరైతే క్రొత్తవారు, పాతవారు వచ్చారో అందరూ చాలా ప్రేమతో వచ్చారు. బాప్ దాదా పిల్లలందరి యొక్క స్నేహం మరియు నలువైపుల సేవా సహయోగాన్ని చూసి సంతోషిస్తున్నారు మరియు పిల్లలు కూడా సదా సంతోషిస్తున్నారు. సంతోషంగా ఉంటున్నారు కదా! ఎప్పుడూ కూడా సంతోషాన్ని తక్కువ చేసుకోకూడదు. ఇది బాబా యొక్క విశేష ఖజానా, అందువలన సంతోషాన్ని ఎప్పుడూ వదలకూడదు, సదా సంతోషంగా ఉండాలి. మంచిది!
నలువైపుల ఉన్న సర్వశ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు, సర్వశ్రేష్ట ఖజానాలకు యజమానులైన వారికి, సదా సేవ మరియు స్థితి యొక్క సమానత ఉంచుకునే జ్ఞాని ఆత్మలకు, సర్వశక్తి సంపన్న ఆత్మలకు, సదా బంధనముక్త, జీవన్ముక్త ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment