20-02-2001 అవ్యక్త మురళి

               20-02-2001         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శివజయంతి అంటే వ్రతం తీసుకోవటం మరియు సమర్పణ అయ్యేటువంటి స్మృతిచిహ్నం.

ఈ రోజు త్రిమూర్తి రచయిత శివబాబా తన యొక్క పూజ్య సాలిగ్రామాలను కలుసుకునేటందుకు వచ్చారు. ఈ రోజు కలుసుకోవాలి కూడా మరియు జరుపుకోవాలి కూడా! మీరందరూ విశ్వం యొక్క నలువైపుల నుండి బాప్ దాదా యొక్క జయంతి చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో జరుపుకోవటానికి వచ్చారు. పిల్లలు అంటున్నారు - బాబా యొక్క జయంతి జరుపుకోవడానికి వచ్చాము అని మరియు బాబా పిల్లల యొక్క జయంతి జరపడానికి వచ్చాను అని అంటున్నారు. మీరందరూ మీ యొక్క అలౌకిక పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు. మొత్తం కల్పంలో ఈ విధమైన అతీతమైన మరియు ప్రియమైన పుట్టినరోజు ఎప్పుడూ ఉండదు. . 

తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు ఒకటే. ఈవిధమైన పుట్టినరోజు మొత్తం కల్పంలో ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే విశ్వపరివర్తన యొక్క కార్యంలో శివబాబా మరియు బ్రహ్మాదాదా వెనువెంట బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సఫలం అవ్వదు. అందువలనే బాబా మరియు పిల్లల యొక్క జన్మదినం కలిసి ఉంటుంది అంటే జయంతి ఉంటుంది. కనుక పిల్లలు మనస్సులోనే బాబాకి శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు బాబా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు అలౌకిక జన్మ యొక్క కోటానుకోట్ల కంటే ఎక్కువ మనస్సు యొక్క ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. కనుక శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. చాలా మంచిది. ఒక చేతితో చప్పట్లు కొడితే (చేతులు ఊపటం) బావుంటుంది. రెండు చేతులతో వద్దు. చాలా సంతోషంగా ఉంది కదా! చేతులు ఊపటం అపటంలేదు, ఊపుతూనే ఉన్నారు. 

ప్రపంచంలో భక్తులు శివజయంతి చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నారు కానీ వారు ఒక రోజు యొక్క జాగరణ మరియు ఒక రోజు యొక్క వ్రతం పెట్టుకుంటారు. పిల్లలైన మీరు అజ్ఞాననిద్ర యొక్క జాగరణా సంకల్పం ఒక రోజు కోసం చేయలేదు, వారు కూడా జాగరణ చేస్తున్నారు కానీ మీరు సంగమయుగం యొక్క వజ్రతుల్యజన్మ యొక్క జాగరణ చేసారు మరియు చేస్తున్నారు. మేల్కొన్నారు కదా! ఇప్పుడు మరలా నిద్రపోరు కదా! లేక కొద్దికొద్దిగా నిద్రపోతారా! మంచిది, నిద్రపోకపోతే కొద్దిగా కునికిపాట్లు పడతారా? ఈ జాగరణ ఎటువంటి జాగరణ అంటే స్వయం కూడా మేల్కొంటారు మరియు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. జ్ఞాని జీవితంలో జాగరణ అంటే అంధకారం నుండి వెలుగులోకి రావటం. ఈ అలౌకిక జాగరణ అందరికీ ఇష్టమనిపిస్తుంది కదా! ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో, జయంతి జరుపుకున్నారో అప్పటినుండి ఏమి వ్రతం తీసుకున్నారు? జ్ఞాపకం ఉంది కదా! జ్ఞాపకం ఉండటమే కాదు మా జీవితమే పవిత్రంగా అయ్యింది అని పిల్లలు అంటున్నారు. పవిత్ర ఆహారం, పవిత్ర వ్యవహారం మరియు పవిత్ర ఆలోచన యొక్క జీవితం తయారయ్యింది. స్వతహాగా అయిపోయింది మరియు సంస్కారంగా అయిపోయింది. పవిత్రత అనేది సంస్కారంగా అయిపోయింది కదా! సంస్కారంగా అయిపోయిందా లేక అవ్వాలా? చేతులు ఊపండి చాలు. అపవిత్రత సంస్కారం నుండి సమాప్తి అయిపోయింది మరియు పవిత్రత అనేది జీవితంలోకి వచ్చింది. ఈ విధమైన వజ్రతుల్య శివజయంతి లేదా సాలిగ్రామజయంతి జరుపుకున్నారు. నలువైపుల ఉన్న దేశ, విదేశాల యొక్క పిల్లలు కూడా జరుపుకుంటున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, నలువైపుల బాబాతో పాటు, మీతో పాటు వారు కూడా ఎంతగా సంతోషిస్తున్నారు! 

ఈ రోజు విశేషంగా భక్తులు కూడా మీ యొక్క స్మృతిచిహ్నంగా బలి కూడా ఇస్తున్నారు. మీరు మనసా, వాచా, కర్మణా బాబా ముందు సమర్పణ అవుతున్నారు. దీనికి స్మృతిచిహ్నంగా భక్తులు స్వయం సమర్పణ అవ్వటంలేదు. కానీ మేకనే ఎందుకు బలి ఇస్తున్నారు? ఇంకేమీ దొరకలేదా? దీని యొక్క రహస్యం కూడా మీకు తెలుసు. ఎందుకంటే సర్వ దేహాభిమానాలకు కారణం - నేను అనే భావన. ఈ నేను అనేది అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. మేక కూడా ఏమి చేస్తుంది? మే, మే అంటుంది. (మై అంటే హిందిలో నేను అని అర్ధం) కనుక ఇది దేహాభిమానం యొక్క నేను అనే దానికి గుర్తు మరియు దేహాభిమానం యొక్క నేను అనేది చాలా సూక్ష్మమైనది కూడా మరియు రకరకాలుగా కూడా ఉంటుంది. అన్నింటికంటే మొట్టమొదటి నేను అంటే - నేను శరీరాన్ని, నేను ఫలానా అని. ఇంకా ముందుకు వెళ్తే సంబంధంలో చిక్కుకునేలాంటి రకరకాల నేను అనే భావం మరియు ఇంకా ముందుకి వెళ్తే రకరకాల పొజిషన్ (పదవి)కారణంగా నేను అనే భావం కూడా వస్తుంది. దీనికంటే సూక్ష్మమైనది, స్వయంలోని విశేషత కారణంగా నేను అనే భావం పై నుండి క్రిందికి తీసుకువచ్చేస్తుంది. విశేషత ప్రతి ఒక్కరిలో ఉంది, స్థూలంగా అయినా, సూక్ష్మంగా అయినా ఏ విశేషత లేకుండా ఏ మనుష్యాత్మ ఉండదు. జ్ఞాని జీవితంలో కూడా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో తక్కువలో తక్కువ ఒక విశేషత తప్పకుండా ఉంటుంది. కానీ జ్ఞాని జీవితంలో విశేషత పరమాత్మ ఇచ్చినది. పరమాత్మ యొక్క కానుక. పరమాత్మ ఇచ్చిన దానిని దేహాభిమానానికి వశమై నాది అనే దానిలోకి వస్తున్నారు. నేను ఈ విధంగా ఉంటాను, ఈ రాయల్ అభిమానంలో చాలా పెద్ద నేను అనే భావన ఉంటుంది. కనుక సమర్పణ అయితే అయిపోయారు. ఇక ముందు ఏమి చూసుకోవాలి? 

టీచర్స్ అందరు తమని తాము ఏమని పిలిపించుకుంటున్నారు? సమర్పణ అయిన వారు అని కదా! టీచర్స్ అందరూ సమర్పణ అయిపోయారా? మంచిది. కుటుంబంలో ఉండేవారు సమర్పణ అయిపోయారా? అవునా, కాదా! సమర్పణ అయిపోయారు. పాండవులు సమర్పణ అయిపోయారా? చాలా మంచిది. శుభాకాంక్షలు. ఇక ముందు ఏమి చేయాలి? మీరయితే సమర్పణ అయిపోయాము అంటున్నారు సర్వం అనే విషయంపై అండర్‌లైన్ చేసుకోవాలి. మనస్సు, బుద్ది, సంస్కార సహితంగా సమర్పణ అవ్వాలి. ఎందుకంటే ఎంత ముందుకి వెళ్తారో, పురుషార్థంలో తీవ్రంగా ముందుకి అడుగు వేస్తారో, మరియు వేయిస్తారో వర్తమాన వాయుమండలం అనుసరించి బ్రాహ్మణ జీవితంలో కూడా ఎందుకంటే ఎక్కువగా బ్రాహ్మణులే కూర్చున్నారు కనుక మనస్సుపై వ్యర్ధం ప్రభావం వేస్తుంది. చెడు లేదు. కానీ వ్యర్ధం మరియు వ్యతిరేకత యొక్క ప్రభావం వాయుమండలం అనుసరించి బుద్ధిపై ఉంటే బుద్ధికి యదార్ధంగా మరియు సత్యంగా నిర్ణయించే అనుభూతి శక్తి తక్కువ అయిపోతుంది. తెలివితో ఇది తప్పు, ఇది మంచిది కాదు అని అనుభవం అవుతుంది కానీ 1. వివేకంతో అనుభవం అవ్వటం మరియు 2.మనస్సుతో అనుభవం అవ్వటం. ఒకవేళ మనస్సులో ఏదైనా విషయం అనుభవం చేసుకుంటే ప్రపంచం మారినా స్వయం మాత్రం మారరు. కనుక మనస్సు,బుద్ధి గురించి చెప్పాను. అప్పుడు సంస్కారం, పాత సంస్కారాలు 63 జన్మల నుండి ఉన్న కారణంగా స్వతహాగా అయిపోయాయి. దీనినే మీరు ఇంకొక మాటలో అంటారు - ఇది పొరపాటు కానీ నా యొక్క సంస్కారం అని అంటారు. కనుక పాత సంస్కారాలు కొన్ని తొలగిపోతున్నాయి, కొన్ని దాగి ఉంటున్నాయి అవి మరలా బయటికి వస్తున్నాయి. కానీ సర్వ సమర్పణ అంటే మనస్సు యొక్క భావన మరియు భావం ప్రతి ఆత్మ పట్ల పరివర్తన అవ్వాలి. దీనికే బాప్ దాదా చెప్తారు, ఎటువంటి ఆత్మ అయినా, రకరకాలుగా ఉంటూనే ఉంటారు. కల్పవృక్షం కదా! కనుక వెరైటీ కాకపోతే శోభించదు. కానీ ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన ఉండాలి. అశుభభావనని కూడా సమాప్తి చేసి శుభభావన పెట్టుకోవాలి. వీరు తప్పకుండా మారతారు అనే శుభభావన ప్రతి ఆత్మ పట్ల ఉండాలి, వీరు ఇక మారరు అని వారి పట్ల న్యాయాధికారి అయ్యి నిర్ణయం చేయకండి. ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! తయారుచేయవలసిందే, తయారవుతుందా? లేదా అనే ప్రశ్నే లేదు. తయారుచేయవలసిందే అనే మాట అండర్‌లైన్ చేసుకున్నారు. ప్రకృతి మారుతున్నప్పుడు ఆత్మని మార్చలేరా? వర్తమాన సమయంలో మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క స్వయం పరివర్తన మరియు సర్వుల యొక్క పరివర్తన - ఇదే సేవ చేయాలి. 

అందరు అడుగుతున్నారు - ఈ సంవత్సరం ఏమేమి చేయాలి అని కనుక డబల్ సేవ చేయాలి. స్వయం యొక్క సర్వ సమర్పణ మరియు స్వయాన్ని ఎంతగా సమర్పణ చేయాలంటే మీ యొక్క వాయుమండలం, మీ యొక్క తరంగాలు, మీ యొక్క సాంగత్యం, మీ మనస్సు యొక్క సహయోగం, మీ మనస్సు యొక్క ఆశీర్వాదాలు ఇతరులను సహజంగా పరివర్తన చేయటంలో సహయోగిగా అవ్వాలి. ఇంతగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, సర్వ సమర్పితం చేయాలి. ఈవిధమైన సేవ మరియు విశ్వసేవా ఫలితంలో నలువైపుల దేశ, విదేశాలలో, గ్రామాలలో బ్రాహ్మణాత్మలు అందరు ఇప్పటి వరకు చేసిన సేవ ప్రేమతో చేసారు దానికి అయితే బాప్ దాదా చాలా చాలా చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక ముందు ఏమి చేయాలి? బాప్ దాదా చూసారు - ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో ఇంకా బ్రాహ్మణుల యొక్క వృద్ధి అనేది చాలా తీవ్రంగా అవుతుంది కానీ వెనువెంట ఏదైతే లోకానికి ప్రియమైన సేవ రకరకాల ప్రొజెక్టర్ల ద్వారా సేవ చేస్తున్నారో అది చాలా మంచిగా ఉంది. ఇప్పుడు రకరకాల స్థానాలలో సహయోగి ఆత్మలు మంచిగా నిమిత్తమయ్యారు. సహయోగులైతే చాలా మంచిగా ఉన్నారు ఒక అడుగు సహయోగం యొక్క అడుగు, ఒక అడుగు అయితే వేసారు కానీ రెండవ అడుగు - సహజయోగి, కర్మయోగి అవ్వాలి. కర్మయోగిగా, సహజయోగిగా కూడా కొంతమంది తయారయ్యారు. ఇది కూడా రెండవస్థితి. ఇప్పుడు ఈ విధమైన ఆత్మలు ప్రత్యక్షంగా వేదికపై పాత్ర అభినయించాలి. మైక్ వేదికపై ఉంటుంది కదా! కనుక మైక్ గా అయ్యి సేవ యొక్క వేదికపై తప్పకుండా ప్రత్యక్ష స్వరూపంలో వస్తారు. మీరు మైట్ (శక్తి)మరియు వారు మైక్. ఎలా అయితే బ్రహ్మాబాబా అవ్యక్త రూపంలో మైట్ కదా! అదేవిధంగా పిల్లలైన మీరు కూడా మైక్ తయారుచేసారు. అలాగే మీరు కూడా మైట్ అవ్వండి మరియు ఆవిధమైన మైక్ తయారుచేయండి. చాలా మంచి, మంచి నమ్మకమైన ఫస్ట్ వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కేవలం అటువంటి ఆత్మల కనక్షన్ పెంచే అవసరం ఉంది. వారు ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనుకుంటున్నారు. వారికి మీరు మైట్ అయ్యి వారికి ఎలాంటి విధి వినిపించాలంటే వారు లౌకికవృత్తి మరియు అలౌకిక సేవ రెండింటి సమానత ఉంచుకుంటూ లాస్ట్ సో ఫాస్ట్ (చివరిలో వచ్చినా కానీ తీవ్రంగా వెళ్ళటం) ఫాస్ట్ సో ఫస్ట్ (తీవ్రంగా వెళ్ళి మొదటి నెంబర్ లోకి రావటం ) లైన్లోకి రావాలి. కనుక కేవలం కనెక్షన్ మరియు కరెంట్ ఇవ్వండి. ఆత్మీయత యొక్క కరెంట్, తరంగాలు, వాయుమండలం యొక్క కరెంట్ మరియు విధి ఇవ్వండి. ఎవరైతే ఇలా సమానత కలిగిన జీవితం తయారుచేసుకోవటంలో నిమిత్తంగా అవుతారో వారి జీవితం చాలా మంచిగా మరియు సహజంగా అవుతుంది. మంచిది కదా! ఏమి చేయాలి? అనేది విన్నారు కదా! 

చిన్న,చిన్న పుష్పగుచ్చాలను తయారుచేయండి. పెద్ద పెద్ద పుష్పగుచ్చాలను కాదు. అయిదు పువ్వుల యొక్క పది పువ్వుల యొక్క గుచ్చాన్ని తయారుచేయండి. ప్రతి ఒక్క వైపు నుండి తయారు చేయాలి. విన్నారా? పాండవులు విన్నారా? చాలా మంచిది. డబల్ విదేశీయులు జంప్ చేయటం లేదు. కానీ ఎగురుతున్నారు, కనుక మొదటి పుష్పగుచ్చం విదేశీయులు తీసుకువస్తారా లేదా భారతవాసీయులు తీసుకువస్తారా? ఎవరు తీసుకువస్తారు? లేక ఇద్దరూ వెనువెంట తీసుకువస్తారా? ఒకవైపు విదేశం నుండి, ఒకవైపు భారతదేశం నుండి రెండు పుష్పగుచ్చాలు వేదిక పైకి తీసుకురావాలి. ఎలా అయితే ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నారు కదా! అదేవిధంగా దీనికి కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. భారతదేశం యొక్క విదేశం యొక్క రెండింటి పుష్పగుచ్చాలకు ఉంటుంది. మంచిదే కదా! తర్వాత సీజన్లో తీసుకువస్తారా? భారతవాసీయులు తీసుకువస్తారు కదా? లౌకికం మరియు అలౌకిక వృత్తి యొక్క సమానత కలిగినవారిగా కావాలి. మీ వలె కేవలం బ్రాహ్మణ జీవితం కలిగినవారిగా కాదు. లౌకికం మరియు అలౌకికం కూడా ఉండాలి. వారి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. మీ దగ్గరకు అయితే దృష్టి తీసుకోవడానికి వస్తారు. 

టీచర్స్ కూడా చాలా మంది వచ్చారు. టీచర్స్ కి శుభాకాంక్షలు. మీరే సేవ చేసారు కదా! కనుక సేవకి శుభాకాంక్షలు మంచిది. గుజరాత్ కి ఏమి పరిస్థితి వచ్చింది? గుజరాత్ నుండి అలజడి ప్రారంభమయ్యింది. ఎక్కువ అలజడి గుజరాత్ నుండి మరియు విదేశం నుండి కూడా కొద్ది కొద్దిగా ప్రారంభమయ్యింది, భయపడటంలేదు కదా? భూమి అయితే చలిస్తుంది కానీ మనస్సు చలించటం లేదు కదా! ఎక్కడైతే భూకంపం వచ్చిందో, నష్టం జరిగిందో అక్కడి నుండి వచ్చినవారు నిలబడండి! అహ్మదాబాద్ వారు కూడా నిలబడండి! మనస్సు కదిలిందా లేదా భూమి కదిలిందా? మనస్సులో కొద్ది కొద్దిగా అలా, ఇలా అయ్యిందా? అవ్వలేదు కదా? బలమైన వారు కదా! బాప్ దాదా చూసారు, పిల్లలు తమ యొక్క దైర్యం ద్వారా మరియు బాబా యొక్క ఛత్రఛాయ ద్వారా తమ యొక్క రికార్డ్ మంచిగా ఉంచుకున్నారు. ఎవరూ ఫెయిల్ అవ్వలేదు. అందరూ పాస్ అయ్యారు. కొంతమంది కొంచెం మరియు కొంతమంది ఎక్కువగా పాస్ అయ్యారు. ప్రతి స్థానంలో అందరూ నెంబర్ వారీగా ఉంటారు కదా! కానీ పాస్ అయ్యారు. అన్నింటికంటే ఎక్కువగా నాజుకు స్థానం నుండి ఎవరు వచ్చారు? (ఒకరు భుజ్ నుండి, ఒకరు బచావ్ నుండి వచ్చారు) మంచిది. భుజ్ లో మీరు సహస్ర భుజాల యొక్క తోడుతో ఉన్నారు కదా! మంచిది. పేపర్ లో పాస్ అయ్యారు చాలా మంచిగా చేసారు. ఇక ముందు కూడా చలించకూడదు. ఇప్పుడైతే ఇంకా జరుగుతూనే ఉంటాయి. భయపడకూడదు. (రోజూ భూకంపం వస్తుంది) జరగనివ్వండి. పరివర్తన అయితే అవ్వాలి కదా! 

ప్రకృతి కూడా తన పని చేస్తుంది కదా! ఎప్పుడైతే మనుష్యాత్మలు ప్రకృతిని తమోప్రధానంగా చేసారో అది కూడా తన యొక్క పని చేస్తుంది కదా! కానీ ప్రతీది ఆట. ఆటలో కూడా ఆట. ఆటని చూస్తూ మీ స్థితిని అలజడి చేసుకోకూడదు. పర స్థితి మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల యొక్క స్వస్థితిపై ప్రభావం వేయకూడదు. ఇంకా ఆత్మల యొక్క అలజడుల నుండి విడిపించడానికి నిమిత్తం అవ్వండి. ఎందుకంటే మనస్సు యొక్క అలజడి మీరు మెడిటేషన్ (యోగం) ద్వారానే తొలగించగలరు. వైద్యులు తమ యొక్క పని చేస్తారు, వైజ్ఞానికులు తమ పని చేస్తారు, గవర్నమెంట్ తన పని తాను చేస్తుంది కానీ మీ పని - మనస్సు యొక్క అలజడి మరియు భయాన్ని తొలగించటం. భయం యొక్క జీవితం నుండి విముక్తి అయ్యే విధంగా చేయాలి. ఆ జీవితాన్ని దానం చేయాలి. సహయోగం ఇవ్వాలి. 

వర్తమాన సమయంలో దేశ,విదేశాల వారు సహయోగం ఇస్తున్నారు కదా! (భూకంప బాధితులకు) ఇది బాగా చేస్తున్నారు. అంటే దేశం వారు అయినా, విదేశం వారైనా ఎవరైనా కానీ భారతదేశం అంటే అందరికీ చాలా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరి పని వారు చేస్తున్నారు, మీరు మీ పని చేయండి. ఎలా అయితే ఎక్కడ అయినా అగ్ని అంటుకుంటుంటే అగ్నిని ఆర్పేవారు భయపడరు, దానిని ఆర్పుతారు. కనుక మీరందరు కూడా మనస్సు యొక్క అలజడి యొక్క అగ్నిని ఆర్పేవారు. మంచిది. కనుక గుజరాత్ వారు గట్టిగా ఉన్నారు కదా! సహస్త్ర భుజాల యొక్క ఛత్రఛాయలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినా గుజరాత్ ని చూసి అందరూ అనుభవీ అయిపోయారు కదా! ప్రకృతిని ఎవరూ ఆపలేరు. గుజరాత్ లో రా, ఆబూలో రావద్దు, బొంబాయిలో రావద్దు అని. అది స్వతంత్రమైనది. కానీ అందరు మీ యొక్క స్వస్థితిని అచంచలంగా, స్థిరంగా మరియు మీ యొక్క బుద్ధిని, మనస్సు యొక్క లైన్ ని స్పష్టంగా ఉంచుకోండి. లైన్ స్పష్టంగా ఉంటే ప్రేరణ వస్తుంది. బాప్ దాదా ముందుగానే చెప్పారు - వారిది వైర్లెస్ మీది వైస్ లెస్ బుద్ధి (నిర్వికారి బుద్ది) కనుక ఏమి చేయాలి? ఏమి అవ్వాలి? ఈ యొక్క నిర్ణయం అనేది స్పష్టంగా మరియు వెంటనే ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండకండి, బయటికి వచ్చేస్తాం, లోపల కూర్చుంటాం, తలుపు దగ్గర కూర్చుంటాం, ఇంటి పైన కూర్చుంటాము అని. మీ యొక్క పాదాలు స్వతహాగానే రక్షణా స్థానం వైపుకి నడిచేస్తాయి. భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ బాగా భయం అనిపిస్తే మధువనం యొక్క ఇల్లు ఉంది. భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడైతే ఏమీ లేదు, ఇక ముందు అన్నీ జరగవలిందే. భయపడవద్దు. పరివర్తన అవ్వాలి కదా! వినాశనం కాదు, పరివర్తన అవ్వాలి. అందరిలో వైరాగ్యం రావాలి కదా! దయాహృదయులుగా అయ్యి సర్వశక్తుల ద్వారా శక్తినిచ్చే దయ చూపించండి. అర్థమైందా!  

నలువైపుల ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణాత్మలకు, నలువైపుల సదా ధృఢసంకల్పం యొక్క వ్రతం పెట్టుకునే అచంచలమైన ఆత్మలకు, నలువైపుల ధైర్యం మరియు ఉల్లాసం ద్వారా స్వసేవ మరియు లోక కళ్యాణం యొక్క సేవ చేసే మహాన్ సేవాధారి ఆత్మలకు శివజయంతి యొక్క అతీతమైన, ప్రియమైన జయంతి యొక్క శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలతో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే, 

65 వ త్రిమూర్తి శివజయంతికి బాప్ దాదా తన యొక్క హస్తాలతో శివుని యొక్క జెండా ఎగురవేసారు మరియు పిల్లలందరికీ శుభాకాంక్షలు ఇచ్చారు, క్రొవ్వొత్తులు వెలిగించారు, కేక్ కట్ చేసారు.
 
అందరు జెండా ఎగురవేసారు. చేతులు కొద్దిమందివే కానీ మీ అందరి చేతులు బాబా వెంట ఉన్నాయి. చివరిలో వెనుక కూర్చున్నవారి చేత కూడా జెండా ఎగురవేయించారు. ప్రతి ఒక్కరి మనస్సులో బాబా యొక్క జెండా ఎగురవేసారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి ముఖం కనిపిస్తుంది. కనుక మనస్సులో కూడా జెండా ఎగురవేసారు. మరియు స్థూల జెండా కూడా ప్రతి ప్రాంతంలో ఎగురవేసారు. ఇప్పుడు ప్రత్యక్షతా జెండా కూడా తొందరగా ఎగురవేయాల్సిందే. ఇప్పుడు దుఃఖం యొక్క ప్రపంచం నుండి ముక్తిధామానికి, జీవన్ముక్తి ధామానికి తీసుకువెళ్ళండి. చాలా దుఃఖిగా ఉన్నారు కదా! కనుక దయ చూపించండి, దు:ఖం నుండి విడిపించండి. ఇప్పుడు అందరికీ బాబా యొక్క వారసత్వం ముక్తి ఇప్పించండి, ఎందుకంటే చాలా అలజడిగా ఉన్నారు. మీరు మీ స్థితిలో ఉన్నారు, వారు అలజడిలో ఉన్నారు. ఇప్పుడు మీరు మీ మనసాసేవ నుండి వేరు అవ్వకూడదు. సదా సేవ చేస్తూ ఉండండి. వాయుమండలం వ్యాపింప చేస్తూ ఉండండి. ఇదే జరుపుకోవటం. శివరాత్రి జరుపుకున్నారు. ఇక్కడి వారి జరుపుకున్నారా? కుర్చీలో కూర్చున్నవారు కూడా జరుపుకున్నారా? వెనుక ఉన్నవారు జరుపుకున్నారా? ఇటువైపు ఉన్నవారు జరుపుకున్నారా? గ్యాలరీలో కూర్చున్నవారు జరుపుకున్నారా? అందరు కలిసి జరుపుకున్నారు, అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 

Comments