19-03-2000 అవ్యక్త మురళి

              * 19-03-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిర్మాణత మరియు నిర్మానత యొక్క బ్యాలెన్స్ ద్వారా దీవెనల యొక్క ఖాతాను జమా చేసుకోండి.

ఈరోజు బాప్ దాదా తమ హోలీ మరియు హ్యాపీ హంసల యొక్క సభలోకి వచ్చారు. నలువైపులా హోలీ హంసలే కనిపిస్తున్నాయి. హోలీ హంసల యొక్క విశేషతను గూర్చి అందరికీ బాగా తెలుసు. సదా హోలీ, హ్యాపీ హంసలు అనగా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయము కలవారు. ఇటువంటి హోలీ హంసలకు స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయం ఉన్న కారణముగా ప్రతి శుభ ఆశా సహజముగా పూర్ణమవుతుంది. సదా తృప్త ఆత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పము చేయగానే పూర్ణమవుతుంది. కష్టపడవలసిన అవసరం ఉండదు. ఎందుకు? బాప్ దాదాకు అందరికన్నా ప్రియమైనవారు. అందరికన్నా సమీపమైనవారు స్వచ్ఛమైన హృదయం కలవారే. స్వచ్ఛమైన హృదయం కలవారు బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. సర్వశ్రేష్ఠ సంకల్పాలు పూర్ణమైన కారణముగా వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కాలలో సరళముగా మరియు స్పష్టముగా ఒకే విధముగా కనిపిస్తారు. సరళతకు గుర్తు - హృదయము. బుద్ధి మరియు మాటలు ఒకే విధంగా ఉండడం. మనస్సులో ఒకటి, మాటల్లో ఇంకొకటి ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణచిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థులుగా ఉంటారు. హోలీ హంసల యొక్క విశేషత - సరళచిత్తము, సరళవాణి, సరళ వృత్తి, సరళ దృష్టి కలిగి ఉండడం.

బాప్ దాదా ఈ సంవత్సరం రెండు విశేషతలను పిల్లలందరి నడవడికలో మరియు ముఖముపై చూడాలనుకుంటున్నారు. ఇక ముందు ఏమి చేయాలి అని అందరూ అడుగుతారు కదా! ఈ సీజన్ యొక్క విశేష సమాప్తి తర్వాత ఏమి చేయాలి? ఏమి చేయాలి అని అందరూ ఆలోచిస్తారు కదా! మరి ఇక ముందు ఏమి చేయాలి? సేవ యొక్క క్షేత్రములోనైతే మెజార్టీ యధాశక్తిగా చాలా మంచి ప్రగతిని చూపించారు. ఉన్నతిని పొందారు. బాప్ దాదా ఈ ఉన్నతికి అభినందనలు కూడా తెలుపుతారు. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. కానీ దానితో పాటు రిజల్టులో ఒక విషయం కనిపించింది. అదేమిటో వినిపించాలా? టీచర్లూ వినిపించాలా? డబుల్ విదేశీయులు పాండవులు వినిపించమంటారా? చేతులెత్తండి, అప్పుడే వినిపిస్తాము లేకపోతే వినిపించము (అందరూ చేతులెత్తారు). చాలా బాగుంది. ఏ ఒక్క విషయాన్ని చూసారు? ఎందుకంటే ఈరోజు వతనములో బాప్ దాదాల మధ్య పరస్పరం ఆత్మిక సంభాషణ జరిగింది. వీరిరువురూ ఎలా మాట్లాడుకుంటారు? ఇరువురూ ఒకరితో ఒకరు ఆత్మిక సంభాషణ ఎలా జరుపుతారు? ఇక్కడ ఈ ప్రపంచములో మీరు మోనో యాక్టింగ్ చేస్తారు కదా! చాలా మంచి, మంచివి చేస్తారు. మీ సాకార ప్రపంచములో ఒకే ఆత్మ రెండు పాత్రలను అభినయిస్తుంది మరియు బాప్ దాదాల ఇరువురి ఆత్మలు ఒకే శరీరముతో అభినయిస్తాయి. తేడా ఉంది కదా! కావున ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

కావున ఈ రోజు వతనములో బాప్ దాదాల ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ విషయముపై? బ్రహ్మాబాబాకు ఏ విషయములో ఉల్లాసము కలుగుతుందో మీ అందరికీ తెలుసు. అందరికీ బాగా తెలుసు కదా! బ్రహ్మాబాబాకు త్వరత్వరగా అయిపోవాలి అన్న ఆశ ఉంది. అప్పుడు శివబాబా బ్రహ్మాబాబాతో వినాశనాన్ని లేక పరివర్తనను జరిపేందుకైతే చప్పట్లు కూడా కాదు కేవలం చిటికె వేస్తే చాలు, కానీ మీరు ముందు 108 కూడా కాదు, సగం మాలనైనా తయారుచేసి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు బ్రహ్మాబాబా ఏమి జవాబు ఇచ్చి ఉంటారు? చెప్పండి? (తయారవుతున్నారు) అచ్చా - సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తి మాల యొక్క విషయాన్ని వదలండి. సగం మాల అయినా తయారయ్యిందా? (అందరూ నవ్వుతున్నారు). నవ్వుతున్నారంటే ఏదో ఉంది. సగం మాల తయారై ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి! తయారయ్యిందా? చాలా కొద్దిమందే ఉన్నారు. తయారవుతోంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. తయారవుతోంది అని మెజార్టీ అంటున్నారు మరియు అయిపోయింది అని మైనార్టీ అంటున్నారు. ఎవరైతే తయారయ్యింది అని అన్నారో వారితో తమ పేరు వ్రాసి ఇవ్వండి అని బాప్ దాదా అంటున్నారు. ఇది మంచి విషయమే కదా! బాప్ దాదాయే చూస్తారు. ఇంకెవరూ చూడరు, అది గుప్తముగానే ఉంటుంది. ఇటువంటి మంచి ఆశారత్నాలు ఎవరెవరో బాప్ దాదా కూడా చూస్తారు. అలా ఉండాలి అని బాప్ దాదా కూడా భావిస్తారు. కావున వీరి నుండి పేర్లు తీసుకోండి, వీరి ఫోటోలు తీయండి. 

మరి బ్రహ్మా బాబా ఏమి జవాబు చెప్పారు? మీరందరూ మంచి, మంచి జవాబులు చెప్పారు. అందుకు బ్రహ్మా బాబా మీరు చిటికె వేయండి, వారు వెంటనే తయారైపోతారు, అంతే ఆలస్యం ఉంది అని అన్నారు. అది మంచి విషయమే కదా! అప్పుడు, అచ్చా, మరి మాల అంతా తయారుగా ఉందా? అని శివబాబా అన్నారు. సగం మాల గూర్చి అయితే జవాబు లభించింది. కావున మొత్తం మాలను గూర్చి అడిగారు. అందుకు కాస్త సమయం కావాలి అని అన్నారు. కొద్ది సమయం ఎందుకు కావాలి? ఆత్మిక సంభాషణలో ప్రశ్నోత్తరాలు జరుగుతాయి కదా! కొద్ది సమయం ఎందుకు కావాలి? ఏ విశేషమైన లోపం ఉన్న కారణంగా సగం మాల ఇంకా ఆగి ఉంది? కావున నలువైపులా ఉన్న పిల్లలను, ప్రతి ఏరియాలోని పిల్లలను ఎమర్జ్ చేస్తూ వచ్చారు. మీ జోన్లు ఉన్నట్లుగా ఒక్కొక్క జోన్‌నే కాదు, జోన్లు అయితే చాలా పెద్ద, పెద్దగా ఉన్నాయి కదా! కావున ఒక్కొక్క విశేషమైన నగరాన్ని ఎమర్జ్ చేస్తూ వచ్చారు మరియు అందరి ముఖాలనూ చూస్తూ వచ్చారు. అలా చూస్తూ బ్రహ్మాబాబా ఒక్క విశేషతను ఇప్పుడు పిల్లలందరూ త్వరత్వరగా ధారణ చేసేస్తే మాల తయారైపోతుంది అని అన్నారు. అది ఏ విశేషత? సేవలో ఎంతో ఉన్నతిని పొందారు, సేవ చేస్తూ ముందుకు వెళ్ళారు, మంచిగా ముందుకు వెళ్ళారు కానీ ఒక్క విషయం యొక్క బ్యాలెన్స్ తక్కువగా ఉంది. నిర్మాణము చేయడంలో అయితే మంచిగా ముందుకు వెళ్ళారు కానీ నిర్మాణముతో పాటు నిర్మానతలో ఈ రెండింటి బ్యాలెన్స్ లో తేడా ఉంది. నిర్మాణము మరియు నిర్మానత కేవలం ఒక్క మాత్ర యొక్క తేడా, సేవ యొక్క ఉన్నతిలో నిర్మానతకు బదులుగా అక్కడక్కడా, అప్పుడప్పుడూ స్వాభిమానం కూడా కలిసిపోతుంది. ఎంతగా సేవలో ముందుకు వెళతారో అంతగానే వృత్తిలో, దృష్టిలో, మాటలలో, నడవడికలో నిర్మానత కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంతో అవసరం. ఇప్పటివరకూ సంబంధ సంపర్కం వారందరి నుండి ఏ దీవెనలు అయితే లభించాలో ఆ దీవెనలు లభించడం లేదు మరియు ఎవరు ఎంతగా పురుషార్ధం చేసినా అది మంచిదే కానీ పురుషార్ధంతో పాటు దీవెనల యొక్క ఖాతా జమా అవ్వకపోతే దాతా స్వరూపం యొక్క స్థితి, దయార్ద్ర హృదయులుగా అయ్యే స్థితి యొక్క అనుభూతి కలుగదు. స్వపురుషార్ధము మరియు దానితో పాటు బాప్ దాదా మరియు పరివారములోని చిన్నా, పెద్దా అందరి యొక్క దీవెనలు కూడా అవసరం. ఈ దీవెనలు పొందడం అంటే పుణ్యము యొక్క ఖాతాను జమా చేసుకోవడం. వీటి ద్వారా మార్కులలో ఎడిషన్ జరుగుతుంది. ఎంతైనా సేవ చేయండి, మీ సేవ యొక్క ధునిలో ముందుకు వెళుతూ ఉండండి కానీ బాప్ దాదా పిల్లలందరిలోనూ సేవతో పాటు నిర్మానత, అందరినీ కలుపుకోగలగడం చూడాలనుకుంటున్నారు. ఈ పుణ్యఖాతా జమా అవ్వడం చాలా, చాలా అవసరం. ఆ తర్వాత, నేనైతే ఎంతో సేవ చేసాను, నేను ఇది చేసాను, అది చేసాను అయినా నెంబర్ వెనుక ఎందుకు ఉంది? అని అనకండి, కావున బాప్ దాదా మొదటే వర్తమాన సమయంలో ఈ పుణ్యఖాతాను చాలా ఎక్కువగా జమా చేసుకోండి అని సూచనను ఇస్తున్నారు. వీరైతే ఇలాగే ఉన్నారు. వీరు మారరు అని ఆలోచించకండి. ప్రకృతినే మార్చగలిగినప్పుడు అనగా ప్రకృతిని ఎడ్జస్ట్ చేయగలుగుతారు కదా! మరి బ్రాహ్మణ ఆత్మలను ఎడ్జస్ట్ చేసుకోలేరా? ఎగైనెస్టు ఎడ్జస్ట్ చేయండి (వ్యతిరేకించేవారితో సదురుకుపోండి) ఇది నిర్మాణము మరియు నిర్మాన త యొక్క బ్యాలెన్స్ విన్నారా?

చివరిలో హోంవర్క్ అయితే ఇస్తారు కదా! ఎంతో కొంత హోంవర్క్ అయితే లభిస్తుంది కదా! బాప్ దాదా రానున్న సీజన్లో వస్తారు కానీ దానికి ఒక కండిషన్ పెడుతున్నారు. చూడండి, సాకారము యొక్క పాత్ర కూడా జరిగింది. అవ్యక్త పాత్ర కూడా జరిగింది, ఇంత సమయం అవ్యక్తపాత్ర జరుగుతుంది అని స్వప్నములో కూడా లేదు, కావున ఈ రెండు పాత్రలూ డ్రామానుసారముగా జరిగాయి. మరి ఇక ఇప్పుడు ఏదో ఒక కండిషన్ ను పెట్టాలా? అక్కరలేదా? మీ సలహా ఏమిటి? లేక అలాగే నడుస్తూ ఉంటుందా? ఏమిటి? ఈరోజు వతనములో ప్రోగ్రాం కూడా అడిగారు. బాప్ దాదాల ఆత్మిక సంభాషణలో ఈ డ్రామా యొక్క పాత్ర ఎప్పటివరకూ అన్న మాట కూడా వచ్చింది. దీనికి ఏదైనా తారీకు ఉందా? (డెహ్రాడూన్ యొక్క ప్రేమ్ బెహెన్స్). జన్మపత్రిని వినిపించు, ఎప్పటివరకూ? ఇప్పుడు ఇంకా ఎప్పటివరకు అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. కానీ... అందుకు ఇంకా 6 నెలలైతే ఉన్నాయి కదా! 6 నెలల తర్వాతే ఇంకొక సీజన్ ప్రారంభమవుతుంది. కావున బాప్ దాదా రిజల్టు చూడాలనుకుంటున్నారు. హృదయం స్వచ్ఛముగా ఉండాలి. హృదయంలో పాత సంస్కారాల యొక్క, అభిమానము, అవమానముల యొక్క అనుభూతి అనే మచ్చలు ఉండకూడదు.

బాప్ దాదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రమును తీసే మిషనరీ ఉంది. ఇక్కడ ఎక్స్ రేలో ఈ స్థూలమైన హృదయం కనిపిస్తుంది కదా! అలాగే వతనములో హృదయం యొక్క చిత్రము ఎంతో స్పష్టముగా కనిపిస్తుంది. అనేకరకాల చిన్నా పెద్దా మచ్చలు స్పష్టముగా కనిపిస్తాయి.

ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! ఇది చివరి టర్న్ అయిన కారణముగా ముందే హోంవర్క్ తెలియజేస్తున్నారు. కానీ హోలీ యొక్క అర్ధమును హోలీ జరుపుకోవడం అనగా గతించినదానిని వదిలేయడం అని, హోలీ జరుపుకోవడం అనగా హృదయంలో చిన్నా, పెద్దా మచ్చలేవీ ఉండకుండా ఉండడము అని, పూర్తిగా స్వచ్ఛమైన హృదయం సర్వ ప్రాప్తి సంపన్నముగా ఉండడం అని, ఈ అర్థాన్ని ఇతరులకు కూడా తెలియజేస్తారు కదా! బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ ఉన్న కారణముగా వారికి ఒక విషయం నచ్చదు అని ఇంతకుముందు కూడా బాగా వినిపించారు. అది హృదయం స్వచ్ఛముగా అయిపోతే శ్రమించేదే ఉండదు. మనోభిరాముడు హృదయంలో ఇమిడియుంటాడు, పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు. మరియు మీరు హృదయరాముని హృదయములో ఇమిడియుంటారు. హృదయంలో బాబా ఇమిడియుంటే ఎటువంటి మాయ, సూక్ష్మరూపమైనా లేక రాయ రూపమైనా లేక పెద్దరూపమైనా ఏ రూపముగానూ మాయ రాజాలదు. స్వప్నమాత్రము, సంకల్పమాత్రము కూడా మాయ రాజాలదు, తద్వారా శ్రమ నుండి ముక్తులైపోతారు కదా! బాప్ దాదా మనస్సులో కూడా శ్రమ నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. శ్రమ నుండి ముక్తులుగా అవ్వడమే జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని పొందగలరు. హోలీ జరుపుకోవడం అనగా శ్రమ నుండి ముక్తులవ్వడం, జీవన్ముక్తి అనుభూతిలో ఉండడం. ఇప్పుడు బాప్ దాదా మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా తయారుచేయాలనుకుంటున్నారు. వాణి ద్వారా సేవ జరుగుతూనే ఉంది మరియు జరుగుతూనే ఉంటుంది, కానీ అందులో సమయం పడుతుంది. సమయం తక్కువగా ఉంది, ఇంకా సేవ ఎంతగానో ఉంది. రిజల్టునైతే మీరందరూ వినిపించారు. ఇప్పటివరకూ ఇంకా 108 యొక్క మాలను కూడా తయారుచేయలేకపోతున్నారు. 10 వేలు, 9 లక్షలు ఇవైతే ఇంకా ఎంతో దూరమైపోయాయి, ఇందుకోసం చాలా తీవ్రమైన విధి కావాలి. మొదట మీ మనస్సును శ్రేష్ఠముగా, స్వచ్ఛముగా చేసుకోండి. ఒక్క క్షణము కూడా వ్యర్ధమవ్వకూడదు. ఇప్పటివరకూ మెజార్టీ యొక్క వ్యర్ధ సంకల్పముల శాతము ఉంది. అశుద్ధము కాదు కానీ వ్యర్ధము ఉంది. కావున మనసా సేవ తీవ్ర గతిలో జరుగలేకపోతోంది. ఇప్పుడు హోలీని జరుపుకోవడం అనగా మనస్సును వ్యర్ధము నుండి కూడా హోలీగా చేయడం.

హోలీని జరుపుకున్నారా? జరుపుకోవడం అనగా అలా అవ్వడం. ప్రపంచంలోని వారు అయితే భిన్న, భిన్న రంగులతో హోలీని జరుపుకుంటారు కానీ బాప్ దాదా పిల్లలందరి పైనా దివ్యగుణాల యొక్క, దివ్య శక్తుల యొక్క, జ్ఞాన గులాబి యొక్క రంగును వేస్తున్నారు.

ఈరోజు వతనములో ఇంకొక సమాచారం కూడా ఉంది. ఒకటైతే ఆత్మిక సంభాషణ యొక్క సమాచారం, అది వినిపించారు. ఇంకొకటి, మీ మంచి, మంచి సేవలోని తోటివారు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో వారంతా ఈ రోజు వతనములో హోలీని జరుపుకునే కార్యక్రమం జరిగింది. మీ అందరికీ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారు గుర్తుకు వస్తారు కదా! మీ దాదీల యొక్క, తోటివారి యొక్క, పాండవుల యొక్క స్మృతి అయితే వస్తుంది కదా! అడ్వాన్స్ పార్టీ యొక్క గ్రూప్ చాలా పెద్దదైపోయింది. పేర్లు చెప్పడం మొదలుపెడితే ఎందరో ఉన్నారు, కావున వతనములో ఈ రోజు అన్నిరకాల ఆత్మలు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. అందరూ తమ, తమ పురుషార్ధము యొక్క ప్రారబ్దానుసారముగా భిన్న, భిన్న పాత్రలను అభినయిస్తున్నారు. ఎడ్పాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇప్పటివరకూ గుప్తముగా ఉంది. వారేమి చేస్తున్నారు? అని మీరు ఆలోచిస్తారు కదా! వారు సంపూర్ణముగా అయి దివ్యజన్మ ద్వారా కొత్త సృష్టికి నిమిత్తముగా అవ్వండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తమ పాత్రలో సంతోషముగా ఉన్నారు. మేము సంగమయుగము నుండి వచ్చాము అన్న స్మృతి అయితే వారికి లేదు, దివ్యత ఉంది, పవిత్రత ఉంది, పరమాత్మ లగ్నము ఉంది కానీ జ్ఞానము స్పష్టముగా ఎమర్ట్ అయి లేదు. అతీత స్థితి ఉంది కానీ జ్ఞానము ఎమర్జ్ అయినట్లయితే అందరూ మధువనానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా! కానీ వీరి పాత్ర అతీతముగా ఉంది. జ్ఞానము యొక్క శక్తి ఉంది, శక్తి ఏమీ తగ్గలేదు. నిరంతరమూ మర్యాదాపూర్వకముగా ఇంటి వాతావరణములో ఉన్నారు. మాత, పితల యొక్క సంతుష్ఠత మరియు స్థూల సాధనాలు అన్నీ ప్రాప్తమైయున్నాయి. మర్యాదలలో చాలా పక్కాగా ఉన్నారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కానీ విశేష ఆత్మలైతే పక్కాగా ఉన్నారు. మా పూర్వజన్మ మరియు పునర్జన్మ చాలా గొప్పది మరియు గొప్పగానే ఉంటుంది అని కూడా అనుభవం చేసుకుంటున్నారు. రూపురేఖల్లో కూడా మెజార్టీ రాయల్ ఫ్యామిలీలోని తృప్త ఆత్మలుగా, సంపన్న ఆత్మలుగా, హర్షిత ఆత్మలుగా మరియు దివ్యగుణ సంపన్న ఆత్మలుగా కనిపిస్తున్నారు. ఇది వారి హిస్టరీ. కానీ వతనములో ఏమి జరిగింది? హోలీని ఎలా జరుపుకున్నారు? హోలీలో భిన్న, భిన్న రంగులు, పొడి రంగులు పళ్ళాలలో నింపి ఉంచుతారు కదా! కావున వతనములో కూడా పొడి రంగులు ఉన్నట్లుగా చాలా సూక్ష్మమైన మెరుస్తున్న వజ్రాలున్నాయి కానీ అవి బరువైనవి కావు. ఏ విధంగా రంగును చేతిలోకి తీసుకున్నప్పుడు తేలికగా ఉంటుందో అలా భిన్న, భిన్న రంగులు,  వజ్రాలు పళ్ళాలలో నింపబడియున్నాయి. కావున ఎప్పుడైతే అందరూ వచ్చేసారో అప్పుడు వతనములో ఏ స్వరూపము ఉంటుందో మీకు తెలుసా? లైట్ స్వరూపమే ఉంటుంది కదా! మీరు చూసారు కదా! కావున లైట్ యొక్క ప్రకాశమయమైన కాయమైతే ముందే ప్రకాశిస్తూ ఉంటుంది. కావున బాప్ దాదా అందరినీ తమ సంగమయుగ శరీరాలలో ఎమర్జ్ చేసారు. ఎప్పుడైతే సంగమయుగ శరీరాలలో ఎమర్జ్  అయ్యారో అప్పుడు ఒకరితో ఒకరు ఎంతగానో మిలనమును జరుపుకోవడం మొదలుపెట్టారు. ఎడ్యాన్స్ పార్టీ జన్మ యొక్క విషయాలను మరచిపోయారు మరియు సంగమయుగం యొక్క విషయాలు ఎమర్జ్ అయ్యాయి. సంగమయుగము యొక్క విషయాలను ఒకరితో ఒకరు చర్చించుకునేటప్పుడు ఎంతగా సంతోషములోకి వచ్చేస్తారో మీకు తెలుసు. ఎంతో సంతోషముగా ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వీరు ఎంతో ఆనందంగా ఉన్నారు కాబట్టి వీరిని కలుసుకోనిద్దాము అని బాప్ దాదా కూడా అలా చూస్తూ ఉండిపోయారు. పరస్పరం తమ జీవితంలోని ఎన్నో కథలను గూర్చి ఒకరికొకరు వినిపించుకుంటున్నారు. బాబా ఇలా అన్నారు, బాబా నన్ను ఇలా ప్రేమించారు. ఈ శిక్షణను ఇచ్చారు. బాబా ఇలా అంటారు... అంటూ బాబా, బాబా, బాబా అన్న పపదమే ఉంది. కొంత సమయం తర్వాత ఏమయ్యింది? అందరి సంస్కారాలను గూర్చి అయితే మీకు తెలిసిందే కదా! ఈ గ్రూపులో అందరికన్నా రమణీతమైనవారు ఎవరు? (దీదీ మరియు చంద్రమణి దాది) కావున మొదట వీరు లేచారు, చంద్రమణి దాది చేయి పట్టుకొని నాట్యం చేయడం ప్రారంభించారు. ఏ విధంగా దీదీ ఇక్కడ నషాగా వెళ్ళిపోయేదో అలా నషాలో ఎంతగానో రాస్ చేసారు. మమ్మాను మధ్యలో ఉంచారు మరియు అందరూ చుట్టూ తిరిగారు. ఒకరితో ఒకరు దాగుడు మూతలు ఆడారు. ఎంతో ఆడుకున్నారు మరియు బాప్ దాదా కూడా వీరందరినీ చూస్తూ ఎంతో హర్షించారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు మరియు ఆడుకున్నారు కూడా కొంత సమయం తర్వాత అందరూ బాప్ దాదా యొక్క బాహువులలో ఇమిడిపోయారు మరియు అందరూ ఒక్కసారిగా లవలీనమైపోయారు. ఆ తర్వాత బాప్ దాదా అందరిపైనా భిన్న, భిన్న రంగుల యొక్క వజ్రాలేవైతే ఉన్నాయో అవన్నీ వేసారు. అవి చాలా సూక్ష్మంగా ఉన్నాయి. ఏదైనా వస్తువు యొక్క చూర్ణము ఉన్నట్లుగా అలా ఉన్నాయి, కానీ చాలా మెరుస్తూ ఉన్నాయి. అందరి శరీరాలూ ప్రకాశ శరీరాలే కదా! వాటిపై భిన్న, భిన్న రంగుల యొక్క వజ్రాలు పడడంతో అలంకరింపబడినట్లుగా అయిపోయారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ... ఇలా ఏడు రంగులు ఉన్నాయి. అందరూ ఎంతగా ప్రకాశిస్తున్నారంటే, సత్యయుగములో కూడా అటువంటి వస్త్రాలు ఉండవు. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒకరిపై ఒకరు వేసుకోవడం మొదలుపెట్టారు. రమణీకమైన వారు కూడా ఎందరో ఉన్నారు కదా! ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అలా జరుపుకున్న తర్వాత ఏమి జరుగుతుంది? బాప్ దాదా అడ్వాన్స్ గా అందరికీ భోగ్  తినిపించారు. మీరైతే రేపు భోగ్ పెడతారు కదా! కానీ బాప్ దాదా మధువనము యొక్క, సంగమయుగము యొక్క భిన్న, భిన్న భోగ్లను అందరికీ తినిపించారు మరియు అందులో విశేషముగా హోలీ యొక్క భోగ్ ఏమిటి? (జిలేబి) మీరు గులాబీపువ్వును కూడా వేయిస్తారు కదా! కావున వెరైటీగా సంగమయుగము యొక్క భోగ్లనే తినిపించారు. మీకన్నా ముందే వారు భోగ్ తీసుకున్నారు. మీకు రేపు లభిస్తాయి, అచ్చా అనగా ఎంతగానో జరుపుకున్నారు. నాట్యమాడారు. గానం చేసారు. అందరూ కలిసి ఓహో, బాబా, నా బాబా, మధురమైన బాబా అనే గీతాలను గానం చేసారు. కావున నాట్యమాడారు, గానం చేసారు. తిన్నారు. ఆ తర్వాత చివరిలో ఏమి జరుగుతుంది? అభినందనలు మరియు వీడ్కోలు. మరి మీరు కూడా జరుపుకున్నారా లేక కేవలం విన్నారా? కానీ మొదట ఇప్పుడు ఫరిస్తాలుగా అయి ప్రకాశమయమైన శరీరధారులుగా అయిపోండి. అవ్వగలుగుతారా? లేదా? శరీరము లావుగా ఉందా? లేదా? క్షణములో ప్రకాశిస్తున్న డబుల్ లైట్ యొక్క స్వరూపులుగా అయిపోండి. అవ్వగలరా? పూర్తిగా ఫరిస్తాలుగా అయిపోండి (బాప్ దాదా అందరితో డ్రిల్ చేయించారు).

ఇప్పుడు మీ పైన భిన్న, భిన్న రంగుల యొక్క ప్రకాశిస్తున్న వజ్రాలను సూక్ష్మశరీరముపై వేసుకోండి మరియు సదా ఇలా దివ్యగుణాల యొక్క రంగు, శక్తుల యొక్క రంగు, జ్ఞానము యొక్క రంగుతో రంగరింపబడి ఉండండి మరియు అన్నింటికన్నా పెద్ద రంగు అయిన బాప్ దాదాల సాంగత్యము యొక్క రంగులో సదా రంగరింపబడి ఉండండి. ఈ విధంగా అమర భవ, అచ్ఛా!

ఇటువంటి దేశ, విదేశాల యొక్క ఫరిస్తా స్వరూపులైన పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయం గల ప్రాప్తి సంపన్నులైన పిల్లలకు, సత్యమైన హోలీని జరుపుకునే అనగా అర్ధసహితముగా చిత్రమును ప్రత్యక్ష రూపములోకి తీసుకువచ్చే పిల్లలకు, సదా నిర్మాణము మరియు నిర్మానత యొక్క బ్యాలెన్స్ ను ఉంచే పిల్లలకు, సదా దీవెనల యొక్క పుణ్యఖాతాను జమా చేసుకునే పిల్లలకు, చాలా, చాలా పదమా, పదమ ప్రియస్మృతులు మరియు నమస్తే.

వివిధ గ్రూపులతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:-

డబుల్ విదేశీయులతో:- ఇది మంచి గ్రూప్ మరియు బాప్ దాదాకు డబుల్ విదేశీయులను చూసి తమ పేరు ఒకటి గుర్తుకు వస్తుంది, అదేమిటి? విశ్వకళ్యాణకారి. మీరు లేకపోతే బాప్ దాదా భారత కళ్యాణకారిగానే ఉండేవారు. ఎప్పటినుండైతే మీరు వచ్చారో అప్పటినుండి బాప్ దాదా విశ్వకళ్యాణకారిగా అయ్యారు, మరి అద్భుతం ఎవ్వరిది? మీదే కదా! బాగా కష్టపడుతున్నారు కూడా! మీకు సాకారములో బాక్ బోన్ గా ఎవరైతే ఉన్నారో తాను చాలా తెలివైనది, ఎక్కడా కూర్చోనివ్వదు. ఏ మూలా వదిలిపోకూడదు అన్న సంకల్పం బాగుంది. కేవలం సేవలో నిర్విఘ్నతయే సేవ యొక్క సఫలత. ఏ సేవను ప్రారంభించినా దేశంలో అయినా, విదేశములో అయినా మొదట ఏకమతముగా ఒకే బలము, ఒకే విశ్వాసము మరియు ఐకమత్యము సేవా సహయోగులలో, సేవలో మరియు వాయుమండలంలో ఉండాలి అనే బాప్ దాదా అంటారు. ఏ విధంగా కొబ్బరికాయను పగులకొట్టి ప్రారంభిస్తారో, రిబ్బన్ కత్తిరించి ప్రారంభిస్తారో అలా మొదట ఈ నాలుగు (4) విషయాల యొక్క రిబ్బను కత్తిరించి ఆ తర్వాత మళ్ళీ సర్వుల సంతుష్టత, సంపన్నత యొక్క కొబ్బరికాయను పగులకొట్టండి. ఆ నీటిని ధరణిపై జల్లండి. కార్యము యొక్క ధరణి ఏదైనా, అందులో మొదట ఈ కొబ్బరినీటిని వేయండి ఆ తర్వాత సఫలత ఎంతగా జరుగుతుందో చూడండి. లేకపోతే ఏదో ఒక విఘ్నము తప్పకుండా వస్తుంది. సేవ అయితే అందరూ చేస్తారు కానీ ఎవరైతే నిర్విఘ్న సేవాధారులుగా ఉంటారో వారి నెంబరే బాప్ దాదా వద్ద రిజిష్టర్ లో నోట్ అవుతుంది. బాప్ దాదా వద్ద ఇటువంటి సేవాధారుల యొక్క లిస్ట్ ఉంది, కానీ ఇప్పుడు చాలా కొద్దిగా ఉంది, ఎక్కువగా అవ్వలేదు. భాషణ చేసేవారి యొక్క లిస్ట్ కూడా మీ వద్ద పెద్దగా ఉంది. బాప్ దాదా ఎవరైతే అనుభూతి చేయించి ఆ తర్వాత భాషణ చేస్తారో వారిని భాషణ చేసేవారు అని అంటారు. భాషణలైతే ఈరోజుల్లో స్కూల్, కాలేజీల్లోని పిల్లలు కూడా ఎంతో బాగా చేస్తారు, చప్పట్లు మ్రోగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే నిర్విఘ్నముగా అందరి యొక్క ప్రసన్నత, సంతుష్టత కలిగియుంటారో వారి యొక్క లిస్ట్ బాప్ దాదా వద్ద ఉంది, కావుననే మాలలో చేతులు ఎత్తలేదు. డబుల్ విదేశీయుల సేవలో పరస్పరం ఇంతటి విఘ్నాలేవీ రావు కానీ కొద్ది, కొద్దిగా మనస్సు యొక్క విఘ్నాలు వస్తాయి. మెజార్టీ అయితే బాగున్నారు. మనస్సు యొక్క సంకల్పాలు, మనస్సు యొక్క స్థితి అచలముగా, స్థిరముగా ఉండాలి. డబుల్ విదేశీయులు విన్నారా? మంచి సేవ చేస్తున్నారు. వృద్ధి పొందినందుకు అభినందనలు, అచ్ఛా!

ఢిల్లీలోని భవన నిర్మాణమును గూర్చి:- మీ అందరి శుద్ధ సంకల్పాల యొక్క ఆధారముపై మీ అందరి రాజధానిలో స్థానాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అందులో అనంతమైన స్థానాన్ని తయారుచేయాలి. ఏ విధంగా మధువనమును ప్రతి ఒక్కరూ మా మధువనము అని భావిస్తారో అలాగే ఎవరు చూసినా, ఎవరు వచ్చినా వారు ఇది మాది అని అనుభవం చేసుకోవాలి. ఢిల్లీ వారిది, ఫలానా వారిది, ఫలానా వారిది అని కాదు, అనంతమైన సేవ కొరకు. అనంతమైన వృత్తి, అనంతమైన భావన ఉండాలి మరియు కొబ్బరికాయను కొట్టడం మరియు రిబ్బను కత్తిరించడం యొక్క విధిని ఏదైతే తెలియజేసారో ఆ విధితో దానిని ప్రారంభించండి, సరేనా? (దానికి ఏమి పేరు పెట్టాలి?) ఇప్పుడు ఇంకా పునాది అయితే పడనివ్వండి, అనంతమైన సేవ, అనంతమైన ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అందరికీ సంతోషంగా ఉంది కదా! బాగుంది, అచ్చా ఓం శాంతి.

Comments