18-01-2002 అవ్యక్త మురళి

                18-01-2002         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్నేహం యొక్క శక్తి ద్వారా సమర్థంగా అవ్వండి, సర్వఆత్మలకు సుఖ, శాంతుల బిందువుని ఇవ్వండి.

ఈ రోజు సమర్థుడైన బాబా, తన యొక్క స్మృతిస్వరూప, సమర్ధ స్వరూప పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ఈ రోజు విశేషంగా నలువైపుల ఉన్న పిల్లలలో స్నేహం యొక్క అల తేలియాడుతూ ఉంది. విశేషంగా బ్రహ్మాబాబా యొక్క స్నేహ స్మృతులలో లీనమై ఉన్నారు. స్నేహం అనేది ప్రతి పిల్లవాడికి ఈ జీవితం యొక్క విశేష వరదానం. పరమాత్మ స్నేహమే మీ అందరికీ క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. స్నేహశక్తియే ప్రతి ఒక్క పిల్లవాడిని బాబా వారిగా చేసింది. ఈ స్నేహశక్తియే అన్నింటినీ సహజం చేస్తుంది. ఎప్పుడైతే స్నేహంలో ఇమిడిపోతారో అప్పుడు ఏ పరిస్థితినైనా సహజంగా అనుభవం చేసుకుంటారు. బాప్ దాదా కూడా చెప్తున్నారు - సదా స్నేహం యొక్క సాగరంలో ఇమిడి ఉండండి. స్నేహం అనేది ఛత్రచ్చాయ, ఈ ఛత్రచ్చాయలో మాయ యొక్క ఏ నీడ కూడా పడదు. సహజంగా మాయాజీతులుగా అవుతారు. ఎవరైతే నిరంతరం స్నేహంలో ఉంటారో వారికి ఏ విషయంలోను శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. స్నేహం సహజంగా బాబా సమానంగా చేస్తుంది. స్నేహంతో ఏది సమర్పణ చేయాలన్నా సహజం అయిపోతుంది. 

ఈరోజు కూడా ప్రతి ఒక్క పిల్లవాడు, బాబాకి స్నేహమాల వేసారు మరియు బాబా కూడా స్నేహి పిల్లలకు స్నేహమాలను చేసారు. ఏవిధంగా అయితే ఈ విశేష స్మృతిదినోత్సవమున అంటే స్నేహరోజున స్నేహంలో ఇమిడి ఉన్నారో అదేవిధంగా సదా ఇమిడి ఉండండి. అప్పుడు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. 1. స్నేహసాగరంలో ఇమిడి ఉండటం మరియు 2. స్నేహసాగరంలో కొంచెం సమయం మునకలు చేయటం. కొంతమంది పిల్లలు ఇమిడి ఉండటం లేదు, తొందరగా బయటికి వచ్చేస్తున్నారు. అందువలనే సహజం కష్టంగా అయిపోతుంది. కనుక ఇమిడి ఉండటం వస్తుందా? ఇమిడి ఉండటంలోనే మజా ఉంది. బ్రహ్మాబాబా, బాబా యొక్క స్నేహాన్ని మనస్సులో ఇముడ్చుకున్నారు. దీని యొక్క స్మృతిచిహ్నాన్ని కలకత్తాలో చూపించారు. 

ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరి నుండి ఇదే కోరుకుంటున్నారు - బాబాపై ఉన్న ప్రేమకి రుజువుగా, బాబా సమానంగా అయ్యి చూపించండి. సదా సంకల్పం సమర్థంగా ఉండాలి, వ్యర్ధం యొక్క సమాప్తి సమారోహం ఇప్పుడు జరుపుకోండి. వ్యర్ధం అనేది సమర్థంగా అవ్వనివ్వదు మరియు నిమిత్త ఆత్మలు ఎప్పటివరకు అయితే సమర్థంగా అవ్వరో విశ్వ ఆత్మలకు సమర్థతను ఎలా ఇస్తారు! సర్వ ఆత్మలు శక్తులతో పూర్తిగా ఖాళి అయిపోయారు, శక్తుల యొక్క బికారీగా అయిపోయారు. అటువంటి బికారీ ఆత్మలను, బికారీస్థితి నుండి సమర్ధ ఆత్మలైన మీరు ముక్తి చేయండి. ఆత్మలు సమర్ధ ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నారు - ముక్తిదాత యొక్క పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతలూ! మాకు ముక్తినివ్వండి అని అంటున్నారు. ఈ ధ్వని మీ చెవుల వరకు రావటం లేదా? వినిపించడంలేదా? ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ముక్తి చేసుకోవటంలోనే బిజీగా ఉన్నారా? విశ్వ ఆత్మలకు బేహద్ స్వరూపం ద్వారా మాస్టర్‌ ముక్తిదాత అవ్వటం ద్వారా స్వయం యొక్క చిన్న, చిన్న సమస్యల నుండి స్వతహాగానే ముక్తి అయిపోతారు. ఇప్పుడు సమయం ఏమిటంటే పిలుపు వినండి, ఆత్మల యొక్క పిలుపు వినండి. పిలుపు వినిపిస్తుందా లేక వినిపించడం లేదా? అలజడిలో ఉన్న ఆత్మలకు సుఖం, శాంతి యొక్క పిలుపు ఇవ్వండి. ఇదే బ్రహ్మాబాబాను అనుసరించడం. ఈ రోజు ఎక్కువగా బ్రహ్మాబాబాను స్మృతి చేసారు కదా! బ్రహ్మాబాబా కూడా పిల్లలందరినీ స్మృతి మరియు సమర్ధస్వరూపంతో స్మృతి చేసారు. కొంతమంది పిల్లలు బ్రహ్మాబాబాతో ఆత్మికసంభాషణ చేస్తూ మధురాతి మధురమైన నిందలు వేశారు - మీరు ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారు? మరియు రెండవ నింద - పిల్లలైన మాతో శెలవు తీసుకోకుండా (చెప్పకుండా) ఎందుకు వెళ్ళిపోయారు? అని. అప్పుడు బ్రహ్మాబాబా చెప్పారు - నన్ను అకస్మాత్తుగా ఎందుకు పిలిచావు? అని నేను కూడా శివబాబాని అడిగాను అని చెప్పారు. అప్పుడు బాబా అన్నారు - ఒకవేళ నేను నీకు శెలవు తీసుకుని రమ్మని చెప్తే నువ్వు పిల్లలను వదిలిపెడతావా లేక పిల్లలు నిన్ను వదిలి పెడతారా? అర్జునుడైన మీ స్మృతి చిహ్నంలో ఇదే ఉంది కదా - అంతిమంలో నష్టోమోహ స్మృతి స్వరూపంగా ఉన్నట్లు. అప్పుడు బ్రహ్మాబాబా నవ్వుకుంటూ అన్నారు - ఇది చాలా అద్భుతం! వెళ్ళిపోతున్నారు అని పిల్లలకు కూడా తెలియలేదు మరియు నాకు కూడా తెలియదు అని. ఎదురుగా ఉన్నా కానీ రెండువైపులా నిశ్శబ్దమే ఎందుకంటే సమయప్రమాణంగా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలుగా అయ్యే పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది. దీనినే ఓహో డ్రామా! ఓహో!! అంటారు. సేవ యొక్క పరివర్తన అనేది నిర్ణయించబడి ఉంది. బ్రహ్మబాబా, పిల్లలకు వెన్నెముకగా అవ్వవలసిందే. అవ్యక్తరూపంలో తీవ్ర సేవ యొక్క పాత్రను అభినయించవలసిందే. 

విశేషంగా ఈ రోజు డబల్ విదేశీయులు చాలా మధురాతి, మధురంగా నిందించారు. నిందించారా డబల్ విదేశీయులు? డబల్ విదేశీయులు బ్రహ్మాబాబాతో అన్నారు - రెండు, మూడు సంవత్సరాలు నువ్వు ఆగితే మేము కూడా నిన్ను చూసేవారము కదా! అప్పుడు బ్రహ్మాబాబా నవ్వుతూ అన్నారు - డ్రామాతో మాట్లాడండి, డ్రామా ఎందుకు ఇలా చేసిందో అడగండి. కానీ భారతదేశంలో అయినా, విదేశంలో అయినా లాస్ట్ నుండి పాస్ట్ యొక్క ఉదాహరణ తయారవ్వవలసిందే. అందువలనే ఇప్పుడు లాస్ట్ సో పాస్ట్ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ చూపించండి. ఏవిధంగా అయితే ఈ రోజు సమర్ధదినోత్సవం జరుపుకున్నారో అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు సమర్ధదినోత్సవంగా జరుపుకోవాలి. ఏవిధమైన అలజడి ఉండకూడదు. ఈరోజున బ్రహ్మాబాబా మూడు మాటలలో శిక్షణ ఇచ్చారు. (నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి) ఈ మూడు మాటల యొక్క స్వరూపంగా, శిక్షణా స్వరూపంగా అవ్వండి. మనస్సులో నిర్వికారి, వాచాలో నిరంహకారి, కర్మణాలో నిర్వికారి అవ్వండి. సెకనులో సాకార స్వరూపంలోకి రండి మరియు సెకనులో నిరాకారి స్వరూపంలో స్థితులవ్వండి. ఈ అభ్యాసం మొత్తం రోజంతటిలో మాటిమాటికి చేయండి. కేవలం యోగంలో కూర్చున్న సమయంలోనే నిరికారి స్థితిలో ఉండటం కాదు కానీ మధ్యమధ్యలో సమయం తీసి ఈ దేహాభిమానానికి అతీతంగా, నిరాకారి ఆత్మ స్వరూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయండి. ఏ కార్యం చేస్తున్నా కానీ నేను నిరాకారి ఆత్మను, ఈ సాకార కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తున్నాను అనే అభ్యాసం చేయండి. నిరాకారిస్థితి అంటే చేయించే స్థితి ఉందా? కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. నిరాకారి ఆత్మస్థితి ద్వారా, నిరాకారి బాబా స్వతహాగానే స్మృతి వస్తారు. ఏవిధంగా అయితే బాబా చేయించేవారో అదేవిధంగా ఆత్మనైన నేను చేయించేవాడిని అనే స్మృతి ఉండాలి. దీనిద్వారా కర్మబంధనలో చిక్కుకోరు, అతీతంగా ఉంటారు ఎందుకంటే కర్మబంధనలో చిక్కుకోవటం ద్వారానే సమస్యలు వస్తాయి. కనుక మొత్తం రోజంతటిలో పరిశీలన చేసుకోండి - చేయించే ఆత్మగా అయ్యి కర్మ చేస్తున్నానా? అని. మంచిది - ఇప్పుడు ముక్తినిచ్చే 'మిషనరీని (కార్యం) తీవ్రం చేయండి. మంచిది - ఈ కల్పంలో మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. క్రొత్తగా వచ్చినవారికి బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఎందుకంటే సమయానికి బాబాని గ్రహించి, తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా అయ్యారు. మేము బాబాని గ్రహించాము అనే మీ యొక్క ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. మంచిది - డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి! చాలా మంచిది. డబల్ విదేశీయులకు బాప్ దాదా చెప్తున్నారు మీరు బ్రహ్మాబాబా యొక్క సంకల్పం ద్వారా ఉద్భవించిన వారు. డైరెక్ట్ నోటి ద్వారా తయారైన వంశావళి మరియు సంకల్పం ద్వారా తయారైన వంశావళి. సంకల్పశక్తి చాలా గొప్పది. అందువలనే ఏవిధంగా అయితే మీ రచన అయిన సంకల్పశక్తి చాలా తీవ్రమైనదో అదే విధంగా డబల్ విదేశీయులు ఫాస్ట్ పురుషార్ధం మరియు ఫాస్ట్ ప్రాలబ్దాన్ని అనుభవం చేసుకునేవారు. అందువలనే మొత్తం బ్రాహ్మణ పరివారంలో డబల్ విదేశీయులు, డబల్ గారాభమైనవారు. భారతదేశం యొక్క సోదరీసోదరులు కూడా డబల్ విదేశీయులను చూసి ఓహో! డబల్ విదేశీయులూ ఓహో!! అని సంతోషపడతారు. డబల్ విదేశీయులకు సంతోషంగా ఉంది కదా? చాలా సంతోషం ఉందా? ఎంత సంతోషం ఉంది? చాలా ఉంది. ఈ సంతోషాన్ని పోల్చి చెప్పగల వస్తువే లేదు కదా! డబల్ విదేశాలలో కూడా బాబా యొక్క మురళీ వింటున్నారు, బాబాని చూస్తున్నారు మంచిది, ఈ సైన్స్ సాధనాలు కూడా బేహద్ సేవ చేయటంలో మీకు చాలా సహాయం ఇస్తాయి మరియు సహజంగా సేవ చేయిస్తాయి. ఈ సైన్స్ యొక్క తీవ్రతకు కూడా మీ యొక్క స్థాపనతో సంబంధం ఉంది. మంచిది - పాండవులు అందరు సమర్థంగా ఉన్నారు కదా? బలహీనంగా లేరు కదా, అందరు సమర్థంగా ఉన్నారు కదా? మరియు శక్తులు బాబా సమానంగా ఉన్నారా? శక్తి సేన కదా! శక్తుల యొక్క శక్తి మాయాజీత్ గా చేస్తుంది. మంచిది. 

ఈరోజు విశేషంగా అలంకరించేవారు కూడా వచ్చారు. (కలకత్తా నుండి పువ్వులు తీసుకువచ్చారు మరియు అన్నివైపులా పువ్వులతో చాలా మంచిగా అలంకరించారు) ఇది కూడా స్నేహానికి గుర్తు. మంచిది. మీ స్నేహం యొక్క ప్రత్యక్షత ఇచ్చారు. మంచిది - టీచర్స్ చేతులు ఎత్తండి! ప్రతి గ్రూప్లో టీచర్స్ చాలామంది వస్తున్నారు. టీచర్స్ కి అవకాశం లభిస్తుంది. సేవ యొక్క ప్రత్యక్షఫలం లభిస్తుంది. మంచిది ఇప్పుడు మీ యొక్క ముఖకవళికల ద్వారా అందరికీ భవిష్యత్తు యొక్క సాక్షాత్కారం చేయించండి. విన్నారు కదా ఏమి చేయాలో? మంచిది. 

మధువనం వారు చేతులు ఎత్తండి - మధువనం వారికి చాలా అవకాశం లభిస్తుంది. అందువలనే బాప్ దాదా మధువనం వారిని ఆత్మిక ఛాన్సలర్ అంటున్నారు. అవును కదా? సేవ చేయవలసి వస్తుంది. అయినప్పటికీ అందరినీ మధువననివాసీయులు రాజీ చేస్తున్నారు కదా! అందువలనే బాప్ దాదా మధువన నివాసీలను ఎప్పుడు మర్చిపోరు. మధువన నివాసీయులను విశేషంగా స్మృతి చేస్తారు. మధువనం వారిని ఎందుకు స్మృతి చేస్తున్నారు? ఎందుకంటే మధువనం వారు బాబా యొక్క ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. బాబాతో తెగిపోని ప్రేమ ఉంది. మధువనం వారు తక్కువైనవారు కాదు. చాలా మంచివారు. 

ఇండోర్ జోన్ యొక్క సేవాధారులు వచ్చారు - ఇండోర్ జోన్ వారు చేతులు ఎత్తండి! చాలా మంచిది. సేవ చేయటం అంటే సమీపంగా వచ్చే ఫలం తినటం. సేవ యొక్క అవకాశం తీసుకోవటం అంటే పుణ్యాన్ని జమ చేసుకోవటం. ఆశీర్వాదాలు జమ చేసుకోవటం. సేవాధారులందరు తమ యొక్క పుణ్యఖాతాని జమ చేసుకున్నారు. ఈ ఆశీర్వాదాలు మరియు పుణ్యం ఎగస్ట్రా లిఫ్ట్ గా పని చేస్తాయి. మంచిది - దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా, దూరంగా కూర్చున్నప్పటికీ సమీపంగా ఉన్నారు. కనుక పిల్లలందరికీ బాప్ దాదా స్నేహం యొక్క దినోత్సవానికి రిటర్నులో కోటిరెట్లు స్నేహం యొక్క ప్రియస్మృతులు ఇస్తున్నారు. బాప్ దాదా ఎక్కడెక్కడ, ఏ సమయం అవుతుంది అన్నీ చూస్తున్నారు కానీ జాగృతి జ్యోతులుగా, అలసిపోకుండా వింటున్నారు, సంతోషం అవుతున్నారు. బాప్ దాదా పిల్లల యొక్క సంతోషాన్ని చూస్తున్నారు. అందరు సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా? చెప్పండి! అందరు అవును బాబా! అని చేతులు ఊపుతున్నారు. జానకి బచ్చీ కూడా మధురాతి మధురంగా నవ్వుతుంది. ఇలా అందరు బాబాకి జ్ఞాపకం ఉన్నారు కానీ ఎంతమంది పేర్లు చెప్పను! చాలామంది పిల్లలు ఉన్నారు, అందువలన బాప్ దాదా చెప్తున్నారు - ప్రతి ఒక్కరికీ తమతమ పేరుతో వ్యక్తిగతంగా ప్రియస్మృతులు స్వీకరిస్తున్నారు మరియు స్వీకరిస్తూ ఉండాలి. మంచిది - ఇప్పుడు ఒక్క సెకనులో నిరికారి స్థితిలో స్థితులవ్వండి. (డ్రిల్ చేయించారు)  

మంచిది - ఈరోజు గుల్జార్ దాదీకి బాప్ దాదా ఒక విషయం చెప్తున్నారు మరియు విశేష శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు - బ్రహ్మ తనువు యొక్క సేవ మాదిరిగానే ఈ రథం కూడా 33 సంవత్సరాలను పూర్తి చేసింది. ఇది కూడా డ్రామాలో పాత్ర. బాబా యొక్క సహాయం మరియు పుత్రిక (దాదీ) యొక్క ధైర్యం. రెండూ కలిసి పాత్రను అభినయిస్తున్నాయి. 

మంచిది - సదా స్నేహం యొక్క సాగరంలో ఇమిడి ఉండే పిల్లలకు, సదా ప్రేమలో లీనమై ఉండే వారికి, సదా చేయించే ఆత్మను అనే స్వరూపంలో స్థితులయ్యే వారికి, సదా మూడు మాటల యొక్క శివమంత్రాన్ని ప్రత్యక్ష జీవితంలోకి తీసుకు వచ్చే వారికి, సదా బాబా సమానంగా మాస్టర్ ముక్తిదాతగా అయ్యి విశ్వంలోని ఆత్మలకు ముక్తినిచ్చేవారికి, ఈవిధమైన సర్వశ్రేష్ట ఆత్మలకు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments