18-01-2001 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
యదార్ధస్మృతి ద్వారా సమర్ధ స్వరూపంగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలన చేయండి.
ఈరోజు అందరి మనస్సులో స్మృతులు వస్తున్నాయి. నలువైపుల ఉన్న పిల్లల నుండి అమృతవేళ నుండి స్నేహం యొక్క రకరకాల మాలలు బాప్ దాదా మెడలో పడుతున్నాయి. వాటితో పాటూ స్మృతి మరియు ప్రేమతో కూడిన మనస్సు యొక్క పాటలు కూడా వింటున్నారు. వాటికి ఫలితంగా బాప్ దాదాలు ఇద్దరు పిల్లలకు భిన్న, భిన్న శక్తుల యొక్క వరదానాల మాలలను మెడలో వేస్తున్నారు. ఈ స్మృతిదివసం అంటే సమర్ధ స్వరూపం యొక్క వరదానం ద్వారా సాకార ప్రపంచం యొక్క వేదికపై తండ్రిని ప్రతక్ష్యం చేసే పిల్లల యొక్క విశేష స్మృతిదివసం. ఎందుకంటే సాకారంలో పిల్లలను సేవ కొరకు నిమిత్తం చేసి, సేవ అనే వేదికపై సింహాసనాధికారులుగా కూర్చోపెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపచేసిన రోజు. పిల్లలందరూ బాబాకి సహయోగి అయ్యి నిమిత్తం అయ్యారు మరియు అవుతారు కూడా! పిల్లలు సేవలో ఉత్సాహ, ఉల్లాసాలతో ముందుకు వెళ్ళటం చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు నెంబర్ వారీగా ధైర్యం మరియు ఉల్లాసంతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు స్మృతి మరియు సేవలో నిమగ్నమై ఉంటున్నారు. ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలందరూ ఏవిధంగా అయితే విశేషంగా బ్రహ్మాబాబా యొక్క ప్రేమలో లవలీనమై ఉంటారో అలాగే బ్రహ్మాబాబా కూడా పిల్లల యొక్క ప్రేమలో లవలీనమై ఉన్నారు.
ఈరోజు బ్రహ్మాబాబా పిల్లల యొక్క విశేషతలను చూస్తున్నారు. ప్రతి పిల్లవాని విశేషతలు ఎదురుగా వస్తుంటే బ్రహ్మాబాబా నోటి నుండి ఓహో పిల్లలు ఓహో, శభాష్ పిల్లలు శభాష్ అనే మాటలు వస్తున్నాయి. ఇంకా ఏమయ్యింది? ఎలాగైతే బ్రహ్మాబాబా ఓహో పిల్లలు, శభాష్ పిల్లలు అని అంటున్నారో అలాగే పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగా, యమునలు ప్రవహిస్తున్నాయి. ప్రతి బిడ్డ ప్రేమ అనే నదిలో లవలీనమై ఉన్నాడు. ఇది వతనం యొక్క దృశ్యం అలాగే సాకార ప్రపంచంలో కూడా ప్రతీ స్థానం యొక్క స్మృతి మరియు స్నేహం యొక్క దృశ్యాలను బాప్ దాదా చూసారు. ఇప్పుడిక ముందు ఏమి చేయాలి? స్మృతి అయితే ఉంటుంది కానీ యదార్ధస్మృతికి రుజువు స్మృతి ద్వారా సమర్ధంగా అవ్వాలి. స్మృతి అనేది అతి శ్రేష్టమైనది. బ్రాహ్మణులుగా అయిన తర్వాత బాప్ దాదా ద్వారా ఏదైతే జన్మసిద్ధ అధికారం లభించిందో అది ఒక్క సెకను స్మృతి ద్వారానే లభించింది. స్మృతి ద్వారానే అధికారాన్ని తెలుసుకున్నారు. నేను బాబా వాడిని, బాబా నావాడు అని హృదయంలో, మనస్సులో, బుద్ధిలో స్మృతి వచ్చింది. ఈ స్మృతి ద్వారా జన్మసిద్ధ అధికారానికి అధికారిగా అయ్యారు. ఈ స్మృతియే సర్వశక్తులకు తాళంచెవి. ఇది స్వర్ణిమ తాళంచెవి. బాబాకి పిల్లలుగా అయ్యారంటే నేను ఆత్మను అని స్మృతి వచ్చింది, నేను ఆత్మను, బాబా సంతానాన్ని అని ఎంత సమయంలో నిశ్చయం అయ్యింది నిశ్చయం అవ్వటానికి సమయం పట్టవచ్చు కానీ ఎంత సమయంలో నిశ్చయం అయ్యింది? సెకనులో వ్యాపారం జరిగిపోయింది కదా! సెకనులో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. అధికారిగా అయితే అందరూ అయ్యారు. అయ్యారు కదా, అందరూ అయిపోయారా లేక అవుతున్నారా? అధికారిగా అయిపోయారా? ఇది పక్కాయేనా? మంచిది. డబల్ విదేశీయులు అధికారి అయిపోయారా? పాండవులు అధికారిగా అయిపోయారు కదా! పక్కాయేనా? పక్కాయేనా? అయితే చాలా మంచిది. సర్వశక్తులను విశేషంగా బాబా నుండి వారసత్వంగా ప్రాప్తింప చేసుకున్నారా? ప్రాప్తింప చేసుకున్న వారు చేతులెత్తండి. మీరు సర్వశక్తులను పొందారా లేక కొందరు 8 శక్తులు, మరికొందరు 6 శక్తులు ఇలా పొందారా? మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా పిలుచుకుంటున్నారు కదా! శక్తివంతులు అని కాదు, సర్వశక్తివంతులు అని పిలుచుకుంటున్నారు. సర్వ అనే మాట గురించి బాప్ దాదా అడుగుతున్నారు. మీ అందరికీ సర్వశక్తులు ఉన్నాయా? లేక కొందరికి కొన్ని శక్తులు మాత్రమే ఉన్నాయా? ఎవరూ లేరా? ఎవరూ చేతులు ఎత్తటం లేదు. అంటే మీరందరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా, మంచిది. బాప్ దాదా అడుగుతున్నారు - ఓ మాస్టర్ సర్వశక్తివంతులూ! ప్రకృతి, మాయ, స్వభావ సంస్కారాలు మరియు వాయుమండలం ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిని సర్వశక్తుల ద్వారా ఎదుర్కోగలుగుతున్నారా? ప్రకృతి, మాయ, సంస్కారాలు, వాయుమండలం మరియు సాంగత్యదోషం ఈ అయిదింటినీ మీ శక్తితో ఆధీనం చేసుకున్నారా? చేసుకున్నారా? ఇది అయిదు ముఖాల సర్పం. ఈ అయిదు ముఖాలపై అధికారి అయ్యి నాట్యం చేస్తున్నారా? చేస్తున్నారా లేక సర్పం తల పైకెత్తి నృత్యం చేస్తుందా? సర్పం కూడా చాలా బాగా నృత్యం చేస్తుంది కదా! అలాగే ఏదైనా ఒక ముఖం మీకు నృత్యం చూపించటం లేదు కదా? ఎప్పుడైనా ఆ నృత్యం చూడాలనిపించటం లేదు కదా? ఈ అయిదు సర్పాలను మెడలో హారంగా చేసేసుకున్నారా? శేషశయ్యగా చేసేసుకున్నారా? మీ యొక్క అంతిమ మహాదేవ్, తపస్వీదేవ్, అశరీరీ స్థితి కలిగిన దేవాత్మకు, ఫరిస్తా ఆత్మకు స్మృతిచిహ్నంలో ఈ సర్పాలు కంఠహారంగా చూపించారు. ఎప్పుడైతే ఈ మాల ధరిస్తారో అప్పుడు బాబా యొక్క మాలలో మంచి నెంబర్ లో సమీప మణిగా అవుతారు. విజయీమాల యొక్క సమీపమణిగా అవుతారు.
బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, వర్తమాన సమాయానుసారంగా విశేషంగా సహనశక్తి మరియు పరిస్థితులను ఎదుర్కునేశక్తి కర్మలో చాలా అవసరం. కేవలం మనస్సు లేదా వాణీ వరకే కాదు కర్మలో కూడా అవసరం. బాప్ వాదా ఫలితం చూస్తే పిల్లల వద్ద శక్తులు ఉన్నాయి లేకుండా లేవు కానీ తేడా ఏమిటి? ఏ సమయానికి, ఏశక్తిని, ఏ విధితో కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో విధిపూర్వకంగా ఉపయోగించటంలో లేదా కార్యంలో ఉపయోగించటంలో తేడా వస్తుంది. స్మృతి ఉంటుంది కానీ స్మృతిని సమర్ధ స్వరూపంలోకి తీసుకురాలేకపోతున్నారు. స్మృతి మంచిగా ఉంది కానీ సమర్థత అప్పుడప్పుడు తక్కువగా, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. స్మృతియే వారసత్వానికి అధికారిగా చేసింది. కానీ ఈ స్మృతి యొక్క సమర్థత విజయీగా చేసి విజయీమాల యొక్క మణులుగా చేస్తుంది. సమర్ధతలను స్వరూపంలోకి తీసుకురండి. మనస్సులో ఉంది, బుద్ధిలో ఉంది కానీ మీ యొక్క స్వరూపంలో, ప్రతి కార్యంలో, ప్రతి శక్తిని ప్రత్యక్ష రూపంలోకి రావాలి. కనుక స్మృతిదినోత్సవం అయితే చాలా మంచిగా జరుపుకున్నారు కానీ ఇప్పుడు సమర్ధతలను అంటే శక్తులను స్వరూపంలోకి తీసుకురండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూసినా మీ నయనాల ద్వారా సమర్ధత యొక్క అనుభవం అవ్వాలి. ప్రతి మాట ద్వారా ఇతరులు కూడా సమర్థంగా అయిపోవాలి. సమర్థత యొక్క అనుభవం చేసుకోవాలి. సాధారణ మాటలు ఉండకూడదు, ప్రతి మాటలో ఏదైతే సమర్ధత యొక్క వరదానం లభించిందో అది అనుభవం చేయిచండి. మనస్సు, బుద్ధి ద్వారా శ్రేష్టసంకల్పం మరియు యదార్ధ నిర్ణయం, శక్తి యొక్క వాయు మండలాన్ని స్వరూపంలోకి తీసుకురండి. సాధారణ నడవడికలో కూడా ఫరిస్తాస్థితి యొక్క సమర్ధత కనిపించాలి. స్వయానికి మరియు ఇతరులకు కూడా డబల్ లైట్ యొక్క అనుభవం అవ్వాలి. ఈ విధంగా ఉన్నారా? కనుక నడుస్తూ, తిరుగుతూ సమర్ధస్వరూపంగా అవ్వండి మరియు ఇతరులకు సమర్థత ఇప్పించండి.
బాప్ దాదా ఈరోజు బ్రహ్మాబాబాని ఒక విహారం చేయించారు. (బాప్ దాదాలు ఇద్దరూ వెనువెంట ఉన్నారు) ఏమి విహారం చేయించారు? బ్రహ్మాబాబా అవ్యక్తమైన తర్వాత దేశ, విదేశాలలో అవ్యక్తజన్మ తీసుకున్నటువంటి బ్రాహ్మణులను చూపించారు. వారు ఎంతమంది ఉంటారు? సాకారరూపం కంటే అవ్యక్తరూపం యొక్క రచన చాలా పెద్దది. ప్రతి స్థానంలో అవ్యక్త రచన యొక్క ఆత్మలను బాబా ప్రత్యక్షం చేసారు. దానిలో మీరు కూడా ఉన్నారు కదా! మరియు ప్రతి ఒక్కరికీ బ్రహ్మాబాబా చాలా స్నేహం యొక్క సమీపదృష్టి ఇచ్చారు మరియు అవ్యక్త రచనకి ఒక విశేష బహుమతి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో సాకార బ్రహ్మ తర్వాత ఎవరైతే బ్రాహ్మణాత్మల రచనలోకి వచ్చారో వారు చేతులెత్తండి! చాలా మంది ఉన్నారు, మంచిది, చేతులు దించేయండి. ఎవరైతే సాకారరూపం యొక్క రచన ఉన్నారో వారు చేతులెత్తండి! చాలా కొద్ది మంది ఉన్నారు. ఇక్కడైతే కూర్చోలేరు కానీ వతనంలో అయితే అందరూ వస్తారు. అక్కడ (వతనంలో) ఎంత పెద్ద స్థానం కావాలంటే అంత పెద్ద స్థానం ఉంటుంది. కనుక బాప్ దాదా అందరినీ వతనంలో ప్రతక్ష్యం చేసారు మరియు అహ్వానం ఇచ్చి పిలిచారు. అందరూ చాలా సంతోషిస్తున్నారు మరియు వారి కంటే ఎక్కువగా బాప్ దాదా సంతోషిస్తున్నారు. అటువంటి రత్నాలకు బాప్ దాదా బహుమతి ఇచ్చారు. చాలా సుందరమైన, మచ్చలేని వజ్రం యొక్క కమలపుష్పం ఇచ్చారు. చాలా మెరుస్తూ ఉంది మరియు ఒక్కొక్క కమలం యొక్క ఆకులో రకరకాల శక్తులు ఉన్నాయి, రకరకాల రంగులతో మెరుస్తూ ఉన్నాయి. ఆవిధమైన మచ్చలేని వజ్రం యొక్క కమలపుష్పాన్ని మీ ఎదురుగా ప్రత్యక్షం చేసుకోండి. ఎంత శోభాయమానంగా ఉంటుందో! ప్రత్యక్షం అయ్యిందా? డబల్ విదేశీయులు ప్రత్యక్షం చేసుకున్నారా? టీచర్స్ ప్రత్యక్షం చేసుకున్నారా? పాండవులు ప్రత్యక్షం చేసుకున్నారా? మరియు మధురాతి మధురమైన మాతలు అయినందుకు శుభాకాంక్షలు. అధికారంలో విశేషంగా బాబా ద్వారా సర్వశక్తులు లభించాయా? లభించాయి అనేవారు చేతులెత్తండి! సర్వశక్తులు లభించాయి కదా? లేదా కొందరికి 7 శక్తులు, కొందరికి 6 శక్తులు ఇలా లభించాయా? మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని పిలుపించుకుంటున్నారు కదా, శక్తివంతులు అనటం లేదు, సర్వశక్తివంతులు అని అంటున్నారు. ముందు కూర్చున్నవారు సర్వశక్తివంతులేనా? బాప్ దాదా సర్వ అనే మాట గురించి అడుగుతున్నారు. అందరూ సర్వశక్తివంతులేనా లేదా కొందరు శక్తివంతులా? అలా ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరా? నేను సర్వశక్తివంతుడిని కాదు, శక్తివంతుడిని అనేవారు ఎవరైనా ఉన్నారా? లేరా? ఎవరూ చేతులు ఎత్తడం లేదు. అయితే అందరూ మాస్టర్ సర్వశక్తివంతులు మంచిది. అయితే బాప్ దాదా అడుగుతున్నారు - సర్వశక్తివంతులూ! ప్రకృతి యొక్క మాయ యొక్క మాయ యొక్క స్వభావ, సంస్కారాల యొక్క వాయుమండలం యొక్క పరిస్థితులలో సర్వశక్తివంతులేనా? ప్రకృతి, మాయ, సంస్కారాలు, వాయుమండలం - ప్రత్యక్షం చేసుకున్నారా? మాతలు ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేషాత్మలు. అందరికీ ఏ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది? ఇంతమంది మాతలు శక్తులు అయ్యారు. ఇంతమంది మాతలు పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసి దేవీల రూపంలో పరివర్తన అయ్యారు. ఎక్కువగా మాతలే కనిపిస్తున్నారు. కనుక బాప్ దాదా ఈ రోజు విశేషంగా అవ్యక్త రచనకి చాలా, చాలా ప్రేమ ఇచ్చారు మరియు వతనంలో పూలతోటను కూడా ప్రత్యక్షం చేసారు. పర్వతం కూడా ప్రత్యక్షం చేసారు వెనువెంట సాగరం కూడా ప్రత్యక్షం చేసారు మరియు చాలా ఎక్కువగా తిప్పించారు, ఆ సమయంలో బాబా తిరగడానికి ఫ్రీ ఇచ్చారు. బాల్, బ్యాట్ తో ఆడించలేదు కానీ బాగా తిప్పారు. కొంతమంది స్నేహం యొక్క అలలలో తేలియాడు తున్నారు, కొంతమంది పర్వతంపై కూర్చున్నారు, కొంతమంది తోటలో తిరుగుతున్నారు. ఇలా బాబా ఈ రోజు వతనంలో అవ్యక్త రచన యొక్క సభను ప్రత్యక్షం చేసారు. బాప్ దాదా పిల్లలందరికీ ఇదే వరదానం ఇచ్చారు, సదా సర్వశక్తులతో జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి అని.
ఈరోజు స్మృతిదినోత్సవంలో బాప్ దాదా యొక్క విశేషమంత్రం - స్మృతి స్వరూపంగా అయ్యి సమర్ధతలను స్వరూపంలోకి తీసుకురండి. ఖజానాను గుప్తంగా ఉంచకండి. ప్రతి కర్మ ద్వారా బయటికి ప్రత్యక్షం చేయండి. ఏ ఆత్మకి అయినా దృష్టి ద్వారా అయినా, మాట ద్వారా అయినా, కర్మలో, సంబంధ, సంపర్కంలో అయినా వారికి సమర్థంగా అయ్యే సహయోగం ఇవ్వండి. సమర్థ స్వరూపం యొక్క స్నేహం ఇవ్వండి. బాప్ దాదా ఇది కూడా చూస్తున్నారు, ఎవరైతే క్రొత్త,క్రొత్త పిల్లలు వస్తున్నారో వారిలో కొంతమంది ఏవిధంగా ఉంటారంటే వారికి బాప్ దాదా యొక్క సహయోగం వెనువెంట బ్రాహ్మణాత్మల ద్వారా ధైర్యం మరియు ఉత్సాహ, ఉల్లాసాల యొక్క సమాధానం లభించే అవసరం ఉంది. చిన్న, చిన్న వారు కదా! చిన్నవారైనా ధైర్యం పెట్టుకుని బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా! కనుక చిన్నవారిని శక్తులతో పాలన చేసే అవసరం ఉంది. ఇతర పాలన కాదు ఇప్పుడు శక్తినిచ్చే పాలన అవసరం. తొందర తొందరగా స్థాపనకి అవసరమైన బ్రాహ్మణాత్మలు తయారైపోవాలి. ఎందుకంటే తక్కువలో తక్కువ 9 లక్షల మంది తయారవ్వాలి కదా! కనుక శక్తుల యొక్క సహయోగం ఇవ్వండి. శక్తుల ద్వారా పాలన ఇవ్వండి. శక్తులను పెంచండి. ఎక్కువ వాదనలు చేసే శిక్షణ ఇవ్వకండి. శక్తి ఇవ్వండి. వారి యొక్క బలహీనతలు చూడకండి. వారిలో ఏ విశేషత లేదా ఏ శక్తి లోపంగా ఉందో అది నింపుతూ వెళ్ళండి. ఈ రోజుల్లో నిమిత్తమైన ఆత్మలు ఈ పాలనకు నిమిత్తమయ్యే అవసరం ఉంది. జిజ్ఞాసువులు పెరగటం, సేవాకేంద్రాలు పెరగటం ఇది సాధారణమైన విషయమే కానీ ప్రతి ఆత్మను బాబా యొక్క సహాయం ద్వారా శక్తిశాలిగా తయారుచేయాలి. ఇప్పుడు ఇది అవసరం. సేవ అయితే అందరూ చేస్తున్నారు. సేవ చేయకుండా ఉండలేకపోతున్నారు కానీ సేవలో శక్తిస్వరూపం యొక్క తరంగాలు ఆత్మలకు అనుభవం అవ్వాలి. శక్తిశాలి సేవ చేయాలి. సాధారణ సేవ అయితే ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది చేస్తున్నారు. కానీ మీ యొక్క విశేషత, శక్తిశాలి సేవ చేయాలి. బ్రాహ్మణాత్మలకు కూడా శక్తి యొక్క పాలన అవసరంగా ఉంది. బాప్ దాదా ఎదురుగా దేశ,విదేశాలలో పిల్లలు దూరంగా ఉన్నా కూడా ఎదురుగా ఉన్నారు. బాప్ దాదాకి తెలుసు, అందరూ ఒకే మాట చెప్తున్నారు - మా యొక్క ప్రియస్మృతులు చెప్పండి, మా యొక్క ప్రియస్మృతులు చెప్పండి అని. బాప్ దాదా దగ్గరికి అందరి యొక్క స్మృతి చేరుకుంటుంది. పత్రాల ద్వారా, నోటి ద్వారా, కార్డుల ద్వారా ఈరోజుల్లో అయితే ఈమైల్స్ ద్వారా కూడా పంపిస్తున్నారు. విజ్ఞాన సాధనాలు చాలా వచ్చేసాయి. బాప్ దాదా దగ్గరికి సాధనాల ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది మరియు మనస్సు యొక్క ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది కానీ మనస్సు యొక్క ధ్వని తొందరగా చేరుకుంటుంది. కనుక ఈ రోజు ఎవరైతే మనస్సు ద్వారా, సాధనాల ద్వారా స్మృతి పంపించారో వారందరికీ బాప్ దాదా ప్రియస్మృతులు చెప్తున్నారు. దానికి బదులుగా బాబా కోటానుకోట్ల ప్రియస్మృతులు ఇస్తున్నారు.
నలువైపుల మనస్సుతో సమీపంగా ఉండే సమర్ధ ఆత్మలకు, సదా సమయానికి ప్రతి శక్తిని స్వరూపం ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్టాత్మలకు, సదా శక్తుల ద్వారా ఆత్మల యొక్క పాలనకు నిమిత్తమైన బాబాకి సహయోగి ఆత్మలకు, సదా ప్రతి ఒక్కరికి ధైర్యం, ఉత్సాహం మరియు ఉల్లాసం ఇచ్చి ఎగిరేకళలో ఎగిరేవారికి, సదా సమస్యలను సమాధాన రూపంలో పరివర్తన చేసుకునే విశ్వపరివర్తన ఆత్మలకు, స్మృతి స్వరూపం నుండి సమర్ధ స్వరూపంగా అయ్యే ఆత్మలకు బాప్ దాదా యొక్క కోటానుకోట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment