18-01-1999 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకొని సాధన చేసే వాయుమండలాన్ని తయారుచేయండి.
ఈరోజు స్నేహసాగరుడు బాప్ దాదా తన యొక్క అతి స్నేహి పిల్లలను కలుసుకుంటున్నారు.
ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమృతవేళ నుండి నలువైపుల పిల్లలు స్నేహం యొక్క అలలలో తేలియాడుతున్నారు, ప్రతి ఒక్కరి మనస్సు యొక్క స్నేహం మనోభిరాముడైన బాబా దగ్గరికి చేరుకుంది. బాప్ దాదా కూడా పిల్లలందరికీ స్నేహానికి జవాబుగా స్నేహం మరియు సమర్ధత యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. బాప్ దాదా ఈరోజుని యజ్ఞ స్థాపనలో విశేష పరివర్తనారోజు అని అంటారు. ఈ రోజు విశేషంగా బ్రహ్మాబాబా వెన్నెముక అయ్యి తన పిల్లలను సాకార రూపంలో విశ్వవేదికపై ప్రత్యక్షం చేసారు. అందువలనే ఈ రోజుని పిల్లల ప్రత్యక్షతారోజు అని అంటారు. సమర్థ రోజు అని అంటారు. విల్ పవర్ ఇచ్చిన రోజు అని అంటారు. బ్రహ్మాబాబా గుప్త రూపంలో కార్యం చేయిస్తున్నారు. వేరు అవ్వలేదు, వెంటే ఉన్నారు కానీ గుప్త రూపంలో కార్యం చేయిస్తున్నారు. ఈ అవ్యక్త దినోత్సవం పిల్లల కార్యంలో తీవ్ర వేగాన్ని తీసుకువచ్చే రోజు. ఇప్పుడు కూడా ప్రతి ఒక బిడ్డకి ఛత్రఛాయ అయ్యి పాలనా కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఎలా అయితే తల్లి, పిల్లలకు ఛత్రఛాయ అవుతుందో అలాగే బ్రహ్మ తల్లి అమృతవేళ నుండి నలువైపుల పిల్లలను సంభాళిస్తారు. సాకారంలో పిల్లలే నిమిత్తులు కానీ భాగ్య విధాత బ్రహ్మ తల్లి ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి పిల్లలకు విశేష శక్తి, ధైర్యం, ఉత్సాహ, ఉల్లాసాలను ఇచ్చి పాలన చేస్తుంటారు. శివబాబా తోడుగా అయితే ఉంటారు కానీ విశేషంగా బ్రహ్మాబాబాకి పాలన యొక్క పాత్ర ఉంది.
ఈరోజు భాగ్య విధాత బ్రహ్మబాబా ప్రతి బిడ్డకి స్నేహానికి బదులుగా వరదానాల భండారాను పంచుతున్నారు. ఏ బిడ్డ అయితే అవ్యక్త స్థితిలో స్థితులై కలయిక జరుపుకుంటారో ఆ ప్రతి బిడ్డకి ఏ వరదానం కావాలంటే ఆ వరదానం సహజంగా ప్రాప్తిస్తుంది. వరదానాల భండారా తెరిచి ఉన్నది. ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు. స్నేహానికి బదులు ఏమిటంటే సహజ వరదానాల బహుమతి. బహుమతి కోసం శ్రమ చేయవలసిన అవసరం ఉండదు, సహజంగా లభిస్తుంది. బహుమతిని అడగరు, స్వతహాగా లభిస్తుంది. పురుషార్థం ద్వారా వరదానం యొక్క అనుభూతి అనేది వేరే విషయం. కానీ ఈ రోజు బ్రహ్మా తల్లి పిల్లల స్నేహానికి ఫలితంగా వరదానం ఇస్తున్నారు. అయితే ఈరోజు అందరూ సహజ వరదానం పొందిన అనుభూతి చేసుకున్నారా? ఇప్పుడు కూడా సత్యమైన మనస్సు యొక్క స్నేహానికి రిటర్న్ గా వరదానాన్ని పొందవచ్చు. వరదానం పొందడానికి సాధనం - మనస్సు యొక్క స్నేహం. ఎక్కడ మనస్సు యొక్క స్నేహం ఉంటుందో, స్నేహం ఎలాంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా, బాప్ దాదా ద్వారా ఏది కావాలంటే ఆ అవినాశి వరదానాన్ని పొందవచ్చు. అటువంటి స్నేహ ఖజానా ప్రతి ఒక్కరి దగ్గర ఉందా? స్నేహం యొక్క ఖజానా ఉంది కనుకనే వచ్చారు కదా! స్నేహం ఆకర్షించి తీసుకువచ్చింది. మరియు స్నేహంలో ఉండటం చాలా సహజం. పురుషార్ధం యొక్క శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. స్నేహం యొక్క అనుభూతి ప్రతి ఆత్మకి తప్పక ఉంటుంది. ఇప్పుడు స్నేహం చెల్లాచెదురు అయిపోయింది. కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ అలా చెల్లాచెదురు అయిపోయిన స్నేహాన్ని ఒకేవైపు జోడించారు. ఎందుకంటే మొదట వేర్వేరు సంబంధాలు ఉండేవి. ఇప్పుడు ఒకనితోనే సర్వసంబంధాలు ఉన్నాయి. కనుక స్నేహం అంతా ఒకనితోనే ఉంది. అందువలనే ప్రతి ఒక్కరు నా బాబా అని అంటారు. స్నేహం ఎవరితో ఉంటుంది? నా వారు అని అనుకున్నవారితో ఉంటుంది. అందరు నా బాబా అంటారు కదా లేక దాదీల బాబా అంటారా? మహారథీల బాబా అంటారా? అందరి బాబా కదా! ఈ రోజు ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు మనస్సుతో నా బాబా, నా బాబా అని అన్నారు! అందరూ నా బాబా, నా బాబా అంటూ ఆత్మిక సంభాషణ చేశారు కదా? మొత్తం రోజంతా ఏమి చేసారు? స్నేహ పుష్పాలను బాప్ దాదాకి అర్పించారు. బాప్ దాదా దగ్గరికి స్నేహ పుష్పాలు చాలా చాలా చేరుకున్నాయి. స్నేహం చాలా బాగా ఉంది, ఇప్పుడు బాబా చెప్తున్నారు - స్నేహ స్వరూపాన్ని సాకారంలో ప్రత్యక్షం చేయండి సమానంగా అవ్వటం అంటే ఇదే. సమానంగా అయ్యే లక్ష్యం అయితే అందరికీ ఉంది కానీ ఇప్పుడు సాకారంలో లక్షణాలు కనిపించాలి. ఏ పిల్లలను చూసినా, ఎవరు కలిసినా, సంబంధ, సంపర్కంలోకి వచ్చినా, వారికి ఈ లక్షణాలు కనిపించాలి - పరమాత్మ బాబా యొక్క, బ్రహ్మాబాబా యొక్క గుణాలు మీ ముఖం మరియు మూర్తి ద్వారా కనిపించాలి, వీరి నయనాలు, వీరి మాటలు, వీరి వృత్తి, వీరి వైబ్రేషన్స్ అతీతమైనవి అని అనిపించాలి. మధువనానికి వస్తే ఇక్కడ బ్రహ్మాబాబా యొక్క కర్మ సాకారంగా జరిగిన కారణంగా ఈ భూమిలో తపస్సు, కర్మ మరియు త్యాగం యొక్క తరంగాలు నిండి ఉన్న కారణంగా ఇక్కడ సహజంగా అనుభవం చేసుకుంటారు - ఇది ఒక అతీత ప్రపంచం అని, ఎందుకంటే బ్రహ్మాబాబా మరియు విశేష పిల్లల యొక్క వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలం అలౌకికంగా తయారై ఉంది. అలాగే ఏ పిల్లలు ఎక్కడ ఉంటున్నా కానీ, ఏ కర్మక్షేత్రమైనా, ప్రతి ఒక్క బిడ్డ ద్వారా బాబా సమానమైన గుణాలు, కర్మ మరియు శ్రేష్టవృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి. దీనినే బాబా సమానంగా అవ్వటం అని బాప్ దాదా అంటారు. ఇప్పటివరకు బాబా సమానంగా అవ్వాల్సిందే అని ఏదైతే సంకల్పంలో ఉందో అది ఇప్పుడు ముఖం మరియు నడవడిక ద్వారా కనిపించాలి. ఎవరు సంబంధ, సంపర్కంలోకి వచ్చినా కానీ వీరు బాబా సమాన ఆత్మలు అనే మాట రావాలి. (మధ్యమధ్యలో దగ్గు వస్తుంది) ఈరోజు మైక్ కరాబుగా ఉంది అయినా కలుసుకోవాలి కదా! ఇది కూడా మైక్ కదా! ఈ మైక్ పని చేయకపోతే ఈ స్థూలమైన మైక్ కి కూడా ఏమి పని ఉండదు. ఇది వాతావరణం యొక్క ఫలం, ఏమి ఫర్వాలేదు. బాప్ దాదా పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షత కోరుకుంటున్నారు. ఎలా అయితే వాణీ ద్వారా ప్రత్యక్షం చేసి ప్రభావితం చేస్తున్నారు కదా, అంటే వాణి యొక్క ప్రభావం పడుతుంది దాని కంటే గుణాలు మరియు కర్మ యొక్క ప్రభావం ఎక్కువ. వీరి నయనాలలో ఏదో విశేషత ఉంది అని ప్రతి ఒక్క బిడ్డ యొక్క నయనాల ద్వారా అనుభవం అవ్వాలి. సాధారణమైనవిగా అనుభవం చేసుకోకూడదు. అలౌకికమైనవి అనిపించాలి. వీరు ఈవిధంగా ఎలా తయారయ్యారు మరియు ఎక్కడి నుండి తయారయ్యారు అని వారి మనస్సులో ప్రశ్న రావాలి. వీరిని తయారుచేసిన వారు ఎవరు? అని వారికి వారే అనుకోవాలి లేదా అడగాలి. ఈ రోజులలో ఏదైనా గొప్ప వస్తువుని చూస్తే దీనిని తయారుచేసినవారు ఎవరు అని అడుగుతారు కదా! అదేవిధంగా బాబా సమానమైన మీ స్థితి ద్వారా బాబాని ప్రత్యక్షం చేయండి. ఈ రోజులలో చాలామంది ఆత్మలు అనుకుంటున్నారు - ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణంలో ఉంటూ ఇటువంటి ఆత్మలుగా ఎవరైనా తయారుకాగలరా అని! అలాంటి వారికి మీరు ప్రత్యక్షంగా చూపించండి - తయారవ్వవచ్చు మరియు మేము తయారుఅయ్యాము అని. ఈ రోజులలో ప్రత్యక్ష రుజువుని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. వినటం కంటే కూడా ఎక్కువగా చూడాలి అనుకుంటున్నారు. నలువైపుల ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది బాబా సమానంగా ప్రత్యక్ష రుజువుగా అయిపోతే అందరూ తెలుసుకోవటంలో మరియు అంగీకరించడంలో శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. అప్పుడు మీ ప్రజలు త్వరత్వరగా తయారయిపోతారు. శ్రమ, సమయం తక్కువ పడతాయి మరియు ప్రత్యక్ష రుజువుని అనుభవం చేసుకోవటం ద్వారా వారికి ప్రజలు అనే స్టాంప్ పడిపోతుంది. రాజా, రాణీగా అవ్వవలసింది మీరు కదా! |
బాప్ దాదా ఒక విషయం గురించి మరలా ధ్యాస ఇప్పిస్తున్నారు - వర్తమాన వాయుమండలం అనుసారంగా మనస్సులో, హృదయంతో ఇప్పుడు వైరాగ్యవృత్తిని ప్రత్యక్షం చేయండి. బాప్ దాదా ప్రతి ఒక్కరిని కుటుంబంలో ఉంటున్నా, సేవాకేంద్రంలో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా కానీ ప్రతి ఒక్కరికి స్థూలసాధనాలను ఇచ్చారు, తినడానికి, త్రాగడానికి, ఉండడానికి కావాల్సిన సాధనాలు లేకుండా ఏ పిల్లలూ లేరు. బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటూ అవసరమైన సాధనాలన్నీ అందరి దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఎవరిదగ్గరైనా లేకపోతే అది వారి సోమరితనం మరియు నిర్లక్ష్యం కారణంగానే కానీ డ్రామానుసారం అందరి దగ్గర సాధనాలు ఉన్నాయి అనేది బాప్ దాదాకి తెలుసు. అవసర సాధనాలు ఉండాలి కానీ అక్కడక్కడ అవసరాన్ని మించి సాధనాలు ఉన్నాయి. సాధన తక్కువ మరియు సాధనాలను ఉపయోగించటం మరియు ఉపయోగింపచేయటం ఎక్కువగా ఉంది. అందువలనే బాబా సమానంగా అయ్యే ఈ రోజున బాప్ దాదా విశేషంగా ద్యాస ఇప్పిస్తున్నారు - సాధనాల ప్రయోగం యొక్క అనుభవం ఇప్పుడు చాలా చేసుకున్నారు, ఏది చేసుకున్నారో అది చాలా మంచిది కానీ ఇప్పుడు సాధనని పెంచాలి అంటే బేహద్ వైరాగ్యవృత్తిని తెచ్చుకోవాలి. బ్రహ్మాబాబాని చూసారు కదా - అంతిమఘడియ వరకు పిల్లలకు చాలా సాధనాలు ఇచ్చారు. కానీ స్వయం సాధనాల యొక్క ప్రయోగానికి దూరంగా ఉన్నారు, ఉంటూ కూడా దూరంగా ఉండటం - దీనినే వైరాగ్యం అంటారు. మన దగ్గర ఏమీ లేకుండా మాకు వైరాగ్యం, మేము వైరాగులం అని అంటే అది ఎలా కుదురుతుంది! ఆ విషయమే వేరు. అన్నీ ఉంటూ కూడా జ్ఞానం మరియు విశ్వకళ్యాణ భావన ద్వారా, బాబాని మరియు స్వయాన్ని ప్రత్యక్షం చేసే భావన ద్వారా ఇప్పుడు సాధనాలకు బదులు బేహద్ వైరాగ్యం ఉండాలి. స్థాపన ఆదిలో సాధనాల లోటు లేదు, కానీ బేహద్ వైరాగ్యవృత్తి యొక్క భట్టీలో ఉండేవారు. 14 సంవత్సరాలు తపస్సు చేశారు, బేహద్ వైరాగ్యవృత్తి యొక్క వాయుమండలం ఉండేది. బాప్ దాదా ఇప్పుడు చాలా సాదనాలను ఇచ్చారు, ఇప్పుడు సాధనాలకు ఏ లోటు లేదు, అన్నీ ఉంటూ కూడా బేహద్ వైరాగ్యవృత్తిలో ఉండాలి. విశ్వ ఆత్మల కళ్యాణం కోసం ఈ సమయంలో ఈ విధి అవసరం ఎందుకంటే నలువైపుల కోరికలు పెరిగిపోతున్నాయి, కోరికలకు వశం అయ్యి ఆత్మలు అలజడిలో ఉన్నారు, ఎంత కోటీశ్వరులైనా అయినా కానీ కోరికల కారణంగా అలజడిగా ఉన్నారు. వాయుమండలంలో ఆత్మల యొక్క అలజడికి విశేష కారణం - ఈ హద్దులోని కోరికలు. ఇప్పుడు మీ యొక్క బేహద్ వృరాగ్యవృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా వైరాగ్యవృత్తిని వ్యాపింపచేయండి. మీ వైరాగ్యవృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖిగా, శాంతిగా కాలేవు. అలజడి నుండి విముక్తి అవ్వరు. ఎందుకంటే మీరు వృక్షానికి వేర్లు. వృక్షంలో బ్రాహ్మణులకు ఏ స్థానం చూపించారు? వేర్లలో చూపించారు కదా! కనుక మీరు పునాది, మీ అల విశ్వంలో వ్యాపిస్తుంది. అందువలన బాప్ దాదా విశేషంగా సాకారంలో బ్రహ్మాబాబా సమానంగా అయ్యే విధి మరియు వైరాగ్యవృత్తి వైపు విశేష ధ్యాస ఇప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ అనుభవం చేసుకోవాలి - వీరు సాధనాలకు వశమయ్యేవారు కాదు, సాధనలో ఉండేవారు అని. అన్నీ ఉంటూ కూడా వైరాగ్యవృత్తిలో ఉండాలి. అవసర సాధనాలను ఉపయోగించుకోండి కానీ ఎంత వీలైతే అంత మనస్పూర్వక వైరాగ్య వృత్తితో ఉండాలి, సాధనాలకు వశీభూతమై ఉండకూడదు. ఇప్పుడు సాధన యొక్క వాయుమండలాన్ని నలువైపుల తయారు చేయండి. సమయం యొక్క సమీపతను అనుసరించి సత్యమైన తపస్సు లేక సాధన - బేహద్ వైరాగ్యం . ఈ సంవత్సరంలో సేవను బాగా విస్తరించారు. ఈ సంవత్సరం నలువైపుల పెద్ద, పెద్ద ప్రోగ్రామ్స్ చేసారు మరియు సేవ ద్వారా సహయోగి ఆత్మలు కూడా చాలా మంది తయారయ్యారు. సమీపంగా వచ్చారు, సంపర్కంలోకి వచ్చారు. కానీ కేవలం సహయోగిగానే తయారుచేయాలా? అంతవరకే ఉంచాలా ఏమిటి? సహయోగి ఆత్మలు మంచి మంచివారు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ సహయోగి క్వాలిటీ ఆత్మలను మరింత సంబంధంలోకి తీసుకురండి, అనుభవం చేయించండి. దీని ద్వారా వారు సహయోగి నుండి సహజయోగి అయిపోవాలి. దీని కొరకు 1. సాధన యొక్క వాయుమండలం 2. బేహద్ వైరాగ్యవృత్తి యొక్క వాయుమండలం ఉండాలి. వీటి ద్వారా వారు సహయోగి నుండి సహజ యోగి అయిపోవాలి. వారి సేవ చేస్తూ ఉండండి కానీ వెనువెంట సాధన మరియు తపస్సు యొక్క వాయుమండలం అవసరం.
ఇప్పుడు నలువైపుల శక్తిశాలి తపస్సు చేయాలి. ఆ తపస్సు మనసాసేవకి నిమిత్తం అవ్వాలి. ఇప్పుడు ఈ విధమైన శక్తిశాలి సేవ తపస్సు ద్వారా చేయాలి. ఇప్పుడు మనసాసేవ అంటే సంకల్పం ద్వారా సేవ యొక్క ప్రేరణ రావాలి, ఇప్పుడు ఇది అవసరం. సమయం సమీపంగా వస్తూ ఉంది. కనుక నిరంతరస్థితి మరియు నిరంతర శక్తిశాలి వాయుమండలం అవసరం. బాబా సమానంగా అవ్వాలంటే మొదట బేహద్ వైరాగ్యవృత్తిని ధారణ చేయండి. బ్రహ్మాబాబాలో అంతిమం వరకు ఇదే విశేషతను చూశారు. వైభవాలపై తగుల్పాటు లేదు, పిల్లలపై తగుల్పాటు లేదు .... అన్నింటితో వైరాగ్యవృత్తి. ఈ రోజు బాబా సమానంగా అవ్వాలనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. బ్రహ్మాబాబా సమానంగా అవ్వాల్సిందే అంతే. ఈ విధమైన దృఢ నిశ్చయం తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుంది.
ఈరోజు బహుమతి లభించాలి కదా అని పిల్లలందు ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. ఇప్పుడు నలువైపుల పిల్లలందరు లేరు కేవలం ఇక్కడికి వచ్చిన మీకే బహుమతి ఇవ్వనా! ఫైజ్ అయితే ఉంది కానీ బాప్ దాదా చెప్తున్నారు - ప్రతి ఒక్కరు సంవత్సరం అంతా సర్వబంధనాల నుండి ముక్తిగా ఉండాలి. జాబితా తీసారు కదా! ఎన్ని బంధనాలు వచ్చాయి? (18 బంధనాలు) 18 బంధనాల నుండి స్వప్నం వరకు కూడా ముక్తి అవ్వాలి, స్వప్నంలో కూడా ఏ బంధన యొక్క రూపు రేఖ రాకుండా ఉండాలి. అటువంటి వారినే ముక్తులు అని అంటారు. చేతులు అయితే చాలా సహజంగా ఎత్తుతున్నారు. బాబాకి తెలుసు, చేతులు ఎత్తిస్తే చాలా రకాలుగా చేతులు ఎత్తుతారు. అయినా కానీ బాప్ దాదా చెప్తున్నారు - ఈ పరిశీలన ద్వారా చేతులు ఎత్తడానికి తయారుగా ఉన్నారా! ఎంత మంది తయారుగా ఉన్నారో, ఎవరెవరు తయారుగా ఉన్నారో బాప్ దాదాకి తెలుసు. ఇప్పుడు కూడా మరింత అంతర్ముఖి అయ్యి సూక్ష్మ పరిశీలన చేసుకోండి. ఎవరికీ దు:ఖం ఇవ్వలేదు మంచిది, కానీ సుఖం యొక్క ఖాతా ఎంత జమ అవ్వాలో అంత అయ్యిందా? ఎవరినీ కోపగించుకోనివ్వలేదు కానీ రాజీ చేసుకున్నారా? వ్యర్థం ఆలోచించలేదు కానీ వ్యర్ధానికి బదులు అంతగానే శ్రేష్టసంకల్పాలు జమ అయ్యాయా? అందరి పట్ల శుభభావన పెట్టుకున్నారు కానీ శుభభావనకి ఫలితం లభించిందా? అంటే వారు మారినా మారకపోయినా కానీ మీరు వారితో సంతుష్టంగా ఉన్నారా? ఈ విధమైన మిమ్మల్ని మీరు సూక్ష్మ పరిశీలన చేసుకోండి. ఈ సూక్ష్మ పరిశీలనలో పాస్ అయితే చాలా మంచిది. ఇలా పాస్ అయిన ఆత్మలు మీ మీ సేవాకేంద్రాలలో మీ పేరు మరియు అన్ని విషయాలో ఎంత శాతం ఫలితం ఉంది? సుఖం ఎంతమందికి ఇచ్చారు? ఎంతమందిని రాజీ చేసుకున్నారు? కోపగించుకున్నవారిని రాజీ చేసుకున్నారా? లేక రాజీగా ఉన్నవారినే రాజీ చేసుకున్నారా? ఇవన్నీ పరిశీలించుకుని చేసుకుని అన్నింటిలో మీరు పాస్ విత్ ఆనర్ అయితే మీ పేరు వ్రాసి మీ టీచర్ కి ఇవ్వండి. చిన్న చిన్న సేవాకేంద్రాల వారు నిమిత్తమైన పెద్ద అక్కయ్యలకు ఇవ్వాలి అన్నీ కలిపి జోన్ యొక్క ముఖ్యకేంద్రానికి చేరాలి. అందరి పేర్లు జోన్ వారి వద్ద నమోదు చేయించుకోండి మరియు జోన్ వారు దగ్గరలో ఉన్న స్థానాలలోని ఆత్మల యొక్క పేర్లు మధువనానికి పంపాలి. ఆ తర్వాత బహుమతి లభిస్తుంది, ఆ తర్వాత చప్పట్లు కొడతారు. ఇలా పాస్ విత్ ఆనర్ అయినవారికి బహుమతి లభించవలసిందే. అది అయితే లభిస్తుంది. కానీ సత్యమైన మనస్సుతో, సత్యమైన బాబాకి మీ సత్యమైన ఖాతా చెప్పాలి. మరియు బహుమతి తీసుకోవాలి ఎందుకంటే బాప్ దాదా దగ్గరికి అందరి సంకల్పాలు అయితే చేరతాయి కదా! చేతులు ఎత్తిన వారిలో చాలా కల్తీ ఉన్నట్లు బాప్ దాదా చూశారు మరియు అర్థం చేసుకోకుండానే చేతులు ఎత్తేస్తున్నారు. ఇలా కల్తీగా చేతులు ఎత్తితే బాప్ దాదా బహుమతి ఇవ్వకపోతే బావుండదు కదా! అందువలన నియమానుసారంగా పాస్ విత్ ఆనర్ అయితే చాలా, చాలా మహిమ లభిస్తుంది మరియు అటువంటి వారి పేరు బ్రాహ్మణాత్మలందరిలో ప్రసిద్ధి అవ్వాలి కదా! మంచిది, ఎక్కువమంది బాగా శ్రమించారు, ధ్యాస ఉంది కానీ సంపూర్ణం అనే విషయం చెప్తున్నాను. ఎవరైతే శ్రమ చేసారో వారికి ఈ రోజు బహుమతికి బదులు శుభాకాంక్షలు ఇస్తున్నాను. తర్వాత బహుమతి ఇస్తాను. సరేనా!
మరోవిషయం ఏమిటంటే అన్ని జోన్ల వారు మార్చి లోపు మైక్ ని తీసుకురావాలి. అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే మొదట మార్చిలో బాప్ దాదా జోన్ వారిని ఫలితం అడుగుతారు. ఎవరు, ఏ రకమైన మైక్ ని తయారు చేశారు అని. వీరు మైక్ అని మీరు చెప్పేస్తారు కానీ వారు చిన్న మైక్ అవుతారు. కేవలం ఒక నగరానికే మైక్ అయిన వారు వస్తారు. వారు ఆ పట్టణానికే కానీ జోన్ కి కాదు, వారినే చిన్న మైక్ అని అంటారు. అటువంటి మైక్ ని ఎవరు తయారుచేశారు అని బాప్ దాదా అడుగుతారు. ఒకవేళ ఏ జోన్ వారు అయినా చివరి మిలనానికి రాలేకపోతే చీటీ వ్రాసి చివరి మిలనానికి పంపించాలి. వస్తే జోన్ హెడ్స్ అందరికీ ఆహ్వానం. ఒకవేళ రాలేకపోతే అంటే ఏ కారణంగా అయినా రాలేకపోతే చీటీ వ్రాసి పంపినా సరిపోతుంది. ఆ తర్వాత బాప్ దాదా అలా మైక్ అయిన వారందరినీ కలిపి సంఘటనగా ఒక కార్యక్రమం పెడతారు. అలాగని మార్చికి మైక్లను తీసుకురమ్మని కాదు, వారిని అక్కడే ఉండనివ్వండి, మీరు రండి. మైక్ అయిన వారిని ఆర్భాటంగా స్వాగతించాలి కదా! కనుక వారికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టి మొదటి నెంబర్, రెండవ నెంబర్, మూడవ నెంబర్ అని బహుమతి ఇస్తారు. సరే. జోన్ వారికి స్పష్టంగా అర్థమైందా? మార్చికి ఫలితం తీసుకురావాలి. మంచిది. ఇప్పుడు ఏమి జ్ఞాపకం ఉంచుకుంటారు? ఏ విషయంపై ధ్యాస పెట్టుకున్నారు? బేహద్ వైరాగ్యంపై. ఇప్పుడు ఆత్మలను కోరికల నుండి రక్షించండి. పాపం చాలా దు:ఖంతో ఉన్నారు. చాలా అలజడిగా ఉన్నారు. కనుక ఇప్పుడు దయాహృదయులుగా అవ్వండి. బేహద్ వైరాగ్యవృత్తి ద్వారా దయ యొక్క అలను వ్యాపింపచేయండి. ఇప్పుడు అందరు ఉన్నతోన్నతమైన పరంధామంలో బాబాతో పాటు కూర్చుని సర్వాత్మలకు దయాదృష్టినివ్వండి. వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి. వ్యాపింపచేయగలరు కదా? ఇప్పుడు పరంధామంలో బాబాతో పాటు కూర్చోండి. అక్కడి నుండి బేహద్ దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) మంచిది!
నలువైపుల ఉన్న అతిస్నేహి పిల్లలందరికీ, నలువైపుల ఉన్న సాధన చేసే శ్రేష్ట ఆత్మలకు, బాప్ దాదాకి రోజంతటిలో చాలా ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన మనస్సు యొక్క పాట వినిపించేవారికి, ఆత్మికసంభాషణ చేసే శక్తులకు, గుణాల వరదానాలతో జోలెను నింపుకునేవారికి, బాప్ దాదాకి అందరూ సంతోషం యొక్క పాట, స్నేహం యొక్క పాట, ఆత్మిక నషా యొక్క పాట, మధురాతి మధురమైన విషయాలు, మనస్సుని చాలా, చాలా మురిపించే విషయాలు వినిపించారు. మరియు బాప్ దాదా కూడా వినటం మరియు కలయికలో లవలీనం అయిపోయారు. ఇలా సత్యంగా మనస్సు యొక్క ధ్వని వినిపించే పిల్లలు గొప్పవారు మరియు సదా గొప్పగానే ఉంటారు. ఇలా మధురాతి, మధురమైన పిల్లలకు, సదా బేహద్ వైరాగ్యవృత్తి ధారణ చేసే వారికి, ధృడనిశ్చయబుద్ది పిల్లలకు, బాప్ దాదా ఒకటికి కోటానుకోట్లరెట్లు స్నేహాన్ని బదులుగా ఇస్తున్నారు. మనోభిరాముని మనస్సులో ఉండే పిల్లలందరికీ చాలా, చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment