16-12-2000 అవ్యక్త మురళి

               16-12-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సాక్షాత్ బ్రహ్మాబాబా సమానంగా కర్మయోగి ఫరిస్తాగా అవ్వండి అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభం అవుతాయి.

ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత బాప్ దాదా తన యొక్క బ్రాహ్మణ ప్రపంచాన్ని చూసి, చూసి సంతోషిస్తున్నారు. ఇది ఎంత చిన్న, ప్రియమైన ప్రపంచము! ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ యొక్క మస్తకంలో భాగ్యసితార మెరుస్తూ ఉంది, నెంబర్‌వారీ అయినా కానీ ప్రతి ఒక్క సితారలో భగవంతుని గ్రహించే మరియు భగవంతుని వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యం యొక్క మెరుపు ఉంది. ఏ తండ్రినైతే ఋషులు, మునులు, తపస్విలు తెలియదు, తెలియదు అంటూ వెళ్ళిపోయారో ఆ తండ్రిని బ్రాహ్మణ ప్రపంచం యొక్క అమాయక ఆత్మలు తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యం ఏ ఆత్మలకి లభిస్తుంది? సాధారణ ఆత్మలకే లభిస్తుంది. బాబా కూడా సాధారణ తనువులోనే వస్తారు, సాధారణ ఆత్మలే గ్రహిస్తారు. ఈనాటి ఈ సభను చూడండి, ఈ సభలో ఎవరు కూర్చున్నారు? కోటీశ్వరులు ఎవరైనా కూర్చున్నారా? బాబా పేదల పాలిట పెన్నిధి అని సాధారణ ఆత్మల కోసమే మహిమ ఉంది. కోటీశ్వరుల పెన్నిధి అనే మహిమ లేదు. బుద్ధిమంతులకు బుద్ధిమంతుడైన బాబా కోటీశ్వరుల బుద్దిని మార్చలేరా? బాబాకి అదేమైనా గొప్ప విషయమా ఏమిటి! కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమం తయారై ఉంది అది ఏమిటంటే పరమాత్మ కార్యంలో బిందువు, బిందువు కలిసి చెరువు అవ్వటం. అనేక ఆత్మల యొక్క భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు, అనేకాత్మలది సఫలం అవ్వాలి. అందువలనే బిందువు, బిందువు ద్వారా చెరువు అనే మహిమ ఉంది. మీరందరు ఎంతెంత తనువు, మనస్సు, ధనాలను సఫలం చేసుకుంటారో అంతగానే సఫలతా సితారగా అయ్యారు. అందరు సఫలతా సితార అయ్యారా? అయ్యారా లేక ఇప్పుడు అవ్వాలా? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయవలసిందే.... ఇలా ఆలోచించడం అంటే సమయం పోగొట్టుకోవటం. భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవటం. . 

బయట వారు అయితే దీనులు కానీ బ్రాహ్మణాత్మలు అయితే దీనులు కాదు, తెలివైనవారు కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లలలో ఒక బలహీన సంకల్పం వస్తుంది, అది ఏమిటో చెప్పనా! చెప్పమంటారా? చాలా మంచిగా చేతులు ఎత్తుతున్నారు. అప్పుడప్పుడు అనుకుంటున్నారు - అసలు వినాశనం అవుతుందా, అవ్వదా? 99 కూడా పూర్తయిపోయింది, 2000 కూడా పూర్తయిపోనున్నది. ఇంకా ఇప్పుడు ఎంత వరకు ఉంటుంది? అని అనుకుంటున్నారు. బాప్ దాదా అనుకుంటున్నారు - ఇది నవ్వు వచ్చే విషయం, ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించడం అంటే బాబాకి వీడ్కోలు ఇవ్వటం. ఎందుకంటే వినాశనం అయిపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా! సంగమయుగంతో అలసిపోయారా ఏమిటి? సంగమయుగాన్ని వజ్రతుల్యం అని అంటున్నారు కానీ బంగారుయుగాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నారు, వినాశనం అయితే జరగవలసిందే కానీ దాని గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు? సఫలం చేసుకోవాలని కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు. కానీ రేపో, ఎల్లుండో వినాశనం అయిపోతే మేము చేసినది ఉపయోగపడకపోతే, సేవలో ఉపయోగపడకపోతే ఎలా అని ఆలోచిస్తూ, చేద్దామా, ఆలోచించి చేద్దాం, దీని గురించి లెక్కించి చేద్దాం, కొంచెం కొంచెం చేద్దాం.... అలాంటి సంకల్పాలన్నీ చేస్తున్నారు, అవన్నీ బాప్ దాదాకి చేరుకుంటున్నాయి. కానీ ఈ రోజు మీరు మీ తనువును సేవలో సమర్పణ చేసారు, మనస్సుని నిరంతరం విశ్వపరివర్తన యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయటంలో నిమగ్నం చేశారు, మీ దగ్గర ఉన్న ధనం అంతా ఉపయోగించారనుకోండి, వాస్తవానికి ప్రాప్తి ముందు ఇదేమీ గొప్ప కాదు కానీ ఈ రోజు మీరు అర్పణ చేసారు, రేపే వినాశనం అయిపోతే మీవి సఫలం అయినట్లా లేక వ్యర్ధం అయినట్లా? వాటిని సేవలో ఉపయోగించలేదు అంటే సఫలం అయినట్లా? మీరు ఎవరి కోసం సఫలం చేసుకున్నారు? బాప్ దాదా దగ్గర సఫలం చేసుకున్నారు కదా! బాప్ దాదా అయితే అవినాశి, వినాశనం అవ్వరు. అవినాశి బాబా దగ్గర, అవినాశి ఖాతాలో ఈరోజు మీరు జమ చేసుకున్నారు, ఒక గంట ముందే జమ చేసుకున్నారు. అయినా కానీ అవినాశి బాబా దగ్గర మీ ఖాతా ఒకటికి కోటానుకోట్లరెట్లు జమ అయిపోతుంది. ఒకటికి కోటానుకోట్ల రెట్లు ఇవ్వడానికి బాబా బంధించబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా! పాత సృష్టి మాత్రమే వినాశనం అవుతుంది కదా! కానీ మీరు మనస్పూర్తిగా చేయాలి. కష్టంగా చేసిన దానికి లేక ఒకరిని చూసి పోటీగా చేసిన దానికి మాత్రం పూర్తిగా లభించదు. లభించటం అయితే తప్పక లభిస్తుంది. ఎందుకంటే దాతకి ఇచ్చారు కనుక లభిస్తుంది. కానీ పూర్తిగా లభించదు. అందువలన ఇప్పుడు వినాశనం అయితే 2001 వరకు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ తయారుచేస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్లాన్స్ తయారవుతున్నాయి, కనుక 2001కి కూడా వినాశనం అయ్యేలా కనిపించడం లేదు అని అనుకోకండి. ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఆధారంగా తీసుకొని సోమరిగా కాకూడదు. అకస్మాత్తుగా జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా జరగవచ్చు. అలాగని గంట తర్వాత ఏమి జరుగుతుందో అని భయపడకండి, అవ్వదు కానీ అలా అవ్వవచ్చు అని చెప్తున్నాను. ఇంత ఎవరెడీగా ఉండాలి. శివరాత్రి వరకు చేయాలని ఆలోచించకండి. సమయం గురించి ఆలోచించకండి. సమయం గురించి ఎదురు చూడకండి. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. రచయిత, రచనకి ఆధీనం అవ్వరు. రచన అయిన సమయం మీ ఆజ్ఞానుసారం నడిచేది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. ఇప్పుడు సమయం మీ కోసం ఎదురుచూస్తుంది. బాబా 6 నెలలు సమయం ఇచ్చారు కనుక 6 నెలలు తప్పక ఉంటుంది అని కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు. ఉంటుంది కదా, కానీ బాప్ దాదా చెప్తున్నారు - ఇలా హద్దు యొక్క విషయాలను ఆధారంగా తీసుకోకండి. ఎవరెడీగా ఉండండి. నిరాధారంగా ఉండాలి. ఒక సెకనులో జీవన్ముక్తి పొందాలి. ఒక సెకనులో జీవన్ముక్తి వారసత్వం తీసుకోండి అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! మరయితే స్వయాన్ని ఒక సెకనులో జీవన్ముక్తులుగా చేసుకోలేరా. అందువలన వేచి చూడకండి, సంపన్నంగా అయ్యేటందుకు తయారీలు చేయండి. 

పిల్లల యొక్క ఆట చూసి బాప్ దాదాకి నవ్వు కూడా వస్తుంది. ఏ ఆట గురించి నవ్వు వస్తుంది? ఏమిటో చెప్పనా? ఈరోజు సమాచారం చెప్తున్నాను, మురళీ చెప్పటం లేదు. ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లలకు ఆటబొమ్మలతో ఆడుకోవటం చాలా ఇష్టమనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలనే ఆటబొమ్మలతో ఆడుకోవటం, చిన్న చిన్న విషయాలను పట్టించుకుని సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ మార్గమధ్య దృశ్యాలు. భిన్న భిన్న సంస్కారాల యొక్క విషయాలు లేదా నడవడిక అనేవి సంపూర్ణ గమ్యం మధ్యలో దృశ్యాలవంటివి. వీటిలో ఆపటం అంటే వీటి గురించి ఆలోచించటం, వీటి ప్రభావంలోకి రావటం, సమయాన్ని పోగొట్టుకోవటం, ఆసక్తిగా వినటం, చెప్పటం, ఇటువంటి వాయుమండలాన్ని తయారు చేయటం.... ఇవే. ఇలా ఆగిపోవటం వలన సంపూర్ణత అనే గమ్యానికి దూరం అయిపోతున్నారు. శ్రమ ఎక్కువ, బాబా సమానంగా అవ్వవలసిందే అని కోరుకునేది ఎక్కువే, శుభ సంకల్పం, శుభ కోరిక ఉన్నాయి, శ్రమిస్తున్నా కానీ ఆటంకం వచ్చేస్తుంది. రెండు చెవులు, రెండు కళ్ళు, నోరు ఉన్నాయి కనుక చూడటం, వినటం, మాట్లాడటం జరుగుతుంది అంటున్నారు కానీ బాబా యొక్క ఒక పాత సూక్తిని గుర్తు ఉంచుకోండి - చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. వింటూ కూడా వాటి గురించి ఆలోచించకండి. వినినా కానీ లోపల ఇముడ్చుకోండి కానీ వ్యాపింప చేయకండి. ఈ పాత సూక్తిని గుర్తు ఉంచుకోవటం తప్పనిసరి. ఎందుకంటే రోజు రోజుకీ అందరి యొక్క పాత శరీరం యొక్క ఖాతా పూర్తి అయిపోతూ ఉందో అదేవిధంగా అందరికీ పాత సంస్కారాలనే పాత జబ్బులు కూడా బయటికి వచ్చి సమాప్తి కానున్నవి, అందువలన ఇప్పుడు ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి ఏమిటో! మొదట్లో ఇలాంటివి లేవు అని భయపడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటకి వస్తున్నాయి మరియు రావలసిందే. మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుకునే శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలు ఇవి. 10 సం||ల క్రిందట వచ్చిన పరీక్షే వస్తుందా ఏమిటి! యమ్. ఎ చదువుకునే సమయంలో బి.ఎ పేపర్ వస్తుందా ఏమిటి? అందువలన ఏమేమి జరుగుతున్నాయో, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి.... అని అనుకోకండి. ఆటని చూడండి. పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వండి. పాస్ విత్ ఆనర్ అయిపోండి. 

బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - ఉత్తీర్ణులయ్యేటందుకు అన్నింటికంటే సహజ సాధనం - బాప్ దాదాకి దగ్గరగా ఉండండి. మీకు పనికిరాని దృశ్యాలను దాటవేయండి. అంటే బాబాకి దగ్గరగా ఉండండి, పనికిరాని దృశ్యాలను దాటవేయండి మరియు పరీక్షలో ఉత్తీర్ణులవ్వండి. కష్టమేముంది? టీచర్స్ చెప్పండి, మధువనం వారు చెప్పండి. మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారు తెలివైనవారు, ముందుకి వచ్చి కూర్చుంటారు, సరే రండి. బాప్ దాదాకి కూడా సంతోషం. మీ హక్కు మీరు తీసుకుంటారు కదా? మంచిది, ఈ విషయంలో బాబాకి కోపం లేదు, ముందే కూర్చోండి. మధువనంలో ఉంటున్నారంటే దగ్గరగా కూర్చునే మర్యాద దక్కాలి కదా! కానీ ఉత్తీర్ణులవ్వాలి అనే విషయాన్ని గుర్తు ఉంచుకోండి. మధువనంలో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి కదా! దొంగలు కూడా వస్తున్నారు. కొన్ని కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్ దాదా ఎలా చెప్పగలరు? అందువలన కొంచెం గుప్తంగా ఉంచుతున్నారు. కానీ అవి ఏమిటో మధువనం వారికి తెలుసు. కానీ వాటి ద్వారా మనోరంజనం చేస్కోండి కానీ అయోమయం అవ్వకండి. అయోమయం అవ్వటం ఒకటి, మనోరంజనంగా భావించి ఆనందంగా దాటేయటం మరొకటి. మరయితే అయోమయం అవ్వటం ఇష్టమా? మధువనం వారు చెప్పండి. అయోమయం అవ్వటం మంచిదా లేక వాటిని దాటేసి మజాగా ఉండటం మంచిదా? దాటేయాలి కదా! ఉత్తీర్ణులు అవ్వాలి కదా! కనుక వాటిని దాటేయండి. పెద్ద విషయమా? పెద్ద విషయం ఏమీ కాదు. విషయాన్ని పెద్దగా చేసుకోవటం అయినా, చిన్నగా చేసుకోవటం అయినా మీ బుద్ధి పైనే ఆధారపడి ఉంది. చిన్న విషయాన్ని పెద్దగా చేయటాన్ని త్రాడుని పాముగా చేయటం అని అజ్ఞాన కాలంలో కూడా అంటూంటారు. ఇలాంటి ఆటలు ఆడకండి, ఈ ఆటలన్నింటినీ ఇప్పుడు సమాప్తి చేసేయండి. ఈ రోజు విశేష సమాచారం వినిపించాను కదా, బాప్ దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్ధం వినిపిస్తున్నారు, కష్టమైనది కాదు. బాబా సమానంగా అవ్వవలసిందే అని అందరికీ ఇదే సంకల్పం ఉంది. ఉంటే కనుక ఒక చేతితో చప్పట్లు కొట్టండి. తయారవ్వవలసిందే, పక్కాయే కదా! విదేశీయులూ! తయారవ్వవలసిందే కదా! ఇంతమంది టీచర్స్ ఉన్నారు, ఓహో! టీచర్స్ ది అద్భుతం. బాప్ దాదా ఈ రోజు టీచర్స్ యొక్క శుభవార్త విన్నారు. శుభవార్త ఏమిటో చెప్పండి! టీచర్ కి ఈ రోజు గోల్డ్ మెడల్ (స్వర్ణిమ పతకం) లభించింది. ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారు చేతులు ఎత్తండి! ఇప్పుడు లభించిన వారు నిల్చోండి! పాండవులకి లభించలేదా! బాబాతో సమానమైన వారు మిగిలిపోకూడదు. పాండవులు బ్రహ్మాబాబాతో సమానమైనవారు, వీరికి మరోవిధమైన గోల్డెన్ మెడల్ లభించింది. వీరికి రాయల్ గోల్డ్ లభించింది. పాండవులకి రాయల్ గోల్డ్ మెడల్ లభించింది. గోల్డెన్ మెడల్ లభించిన వారికి బాబా యొక్క కోటానుకోట్ల సార్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 

దేశవిదేశాలలో ఉండి వింటున్నారు, పాండవులు అయినా, శక్తులు అయినా, ఏ కార్యానికి నిమిత్తమైనవారికి అయినా పరివారంలో ఉండే ఎవరికైనా ఏదో విశేషత కారణంగా దాదీలు పతకం ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా కానీ అంటే సమర్పణ అయినందుకు లేదా ఏదో ఒక సేవలో విశేషంగా ముందుకి వెళ్ళినటువంటి వారికి దాదీల ద్వారా స్వర్ణపతకం లభించింది. దూరంగా ఉండి వింటున్న వారికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు, అలా స్వర్ణపతకాన్ని పొంది దూరంగా కూర్చున్న వారందరి కోసం మీరు ఒక చేతితో చప్పట్లు కొట్టండి, వారు చూస్తున్నారు. మీరు చప్పట్లు కొట్టడం వారు చూస్తున్నారు. వారు కూడా నవ్వుకుంటున్నారు, 
సంతోషిస్తున్నారు. 

బాప్ దాదా సహజ పురుషార్ధం గురించి చెప్తున్నారు - ఇప్పుడు సమయం అకస్మాత్తుగా సమాప్తి కానున్నది, ఒక గంట ముందు కూడా బాప్ దాదా ప్రకటించరు, ప్రకటించరు మరియు ప్రకటించరు. నెంబరు ఏవిధంగా తయారవుతుంది? అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష ఎలా అవుతుంది? అకస్మాత్తుగా జరిగినప్పుడే పాస్ విత్ ఆనర్ అనే అంతిమ సర్టిఫికెట్ లభిస్తుంది. అందువలన దాదీల యొక్క ఒక సంకల్పం బాప్ దాదాకి చేరుకుంది, ఉంది కదా సంకల్పం! బాప్ దాదా ఇప్పుడు సాక్షాత్కారాల తాళాన్ని తెరవాలి అని దాదీలు అనుకుంటున్నారు. వీరికి ఈ సంకల్పం ఉంది. ఇప్పుడు మీరందరు కూడా కోరుకుంటున్నారు కదా! తాళం బాప్ దాదా తెరుస్తారా లేక మీరు నిమిత్తమవుతారా? మంచిది, బాప్ దాదా తాళం తీస్తారు సరేనా! అలాగే అని బాప్ దాదా అంటున్నారు. (చప్పట్లు కొట్టారు) మొదట పూర్తిగా వినండి. తాళం తీయడానికి బాప్ దాదా యొక్క ఆలశ్యం ఏముంది? కానీ చేయించేది ఎవరి ద్వారా? ఎవరి ద్వారా చేయిస్తారు? ఎవరు ప్రత్యక్షమవ్వాలి? పిల్లలా లేక బాబాయా? పిల్లల ద్వారా బాబా ప్రత్యక్షమవ్వాలి. ఎందుకంటే జ్యోతిర్బిందు యొక్క సాక్షాత్కారం అయితే తెలివిలేని కొందరు అది ఏమిటో కూడా అర్ధం చేసుకోలేరు. అంతిమంలో శక్తులు మరియు పాండవులైన పిల్లల ద్వారా బాబా ప్రత్యక్షం అవ్వాలి. అందువలన బాప్ దాదా చెప్పేది ఏమిటంటే బాబా సమానంగా తయారవ్వలసిందే అని పిల్లలందరి సంకల్పం ఒక్కటే అయినప్పుడు, ఈ విషయంలో మరో ఆలోచన లేదు కదా! అందరి ఆలోచన ఒక్కటే కదా! దీని గురించి ముందే చేయి ఎత్తారు. కనుక బ్రహ్మాబాబాను  అనుసరించండి. అశరీరిగా, బిందువుగా స్వతహాగానే అయిపోతారు. కానీ బ్రహ్మాబాబాపై అందరికీ ప్రేమ ఉంది కదా! ప్రేమ ఉన్నట్లుగా బాబా చూడటం జరిగింది. మామూలుగా అయితే అందరికీ ఉంది కానీ విదేశీయులకి బ్రహ్మాబాబాపై ఎక్కువ ప్రేమ ఉంది. కళ్ళ ద్వారా చూడలేదు కానీ అనుభవం అనే నేత్రం ద్వారా ఎక్కువమంది విదేశీయులు బ్రహ్మాబాబాని చూశారు మరియు ప్రేమ కూడా ఎక్కువ ఉంది. భారతదేశంలో కూడా ఇటువంటి గోపగోపికలు ఉన్నారు. అయినా కానీ అప్పుడప్పుడు బాప్ దాదా విదేశీయుల యొక్క అనుభవాలను వింటుంటారు. భారతవాసీయులు కొద్దిగా గుప్తంగా ఉంచుతారు. కానీ వారయితే బ్రహ్మాబాబాతో తమ కథలన్నీ చెప్తారు. బాప్ దాదా కూడా వింటూంటారు మరియు ఇతరులకు కూడా చెప్తున్నారు, విదేశీయులకు శుభాకాంక్షలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, రష్యా, జర్మనీ... నలువైపుల ఉన్న విదేశీయులందరు దూరంగా ఉండి కూడా వింటున్నారు, వారికి కూడా బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. విశేషంగా బ్రహ్మాబాబా శుభాకాంక్షలు ఇస్తున్నారు. భారతీయులు కొద్దిగా గుప్తంగా ఉంచుతారు, అంతగా ప్రసిద్ది చేయలేరు, గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. భారతదేశంలో కూడా చాలా మంచి మంచి వారు ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారంటే వారి అనుభవాన్ని ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ వంటివారు విన్నా కానీ వారి కళ్ళ నుండి కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి అనుభవం వారికి ఉంది. కానీ గుప్తంగా ఉంచుతారు. హృదయాన్ని తెరవరు, అవకాశం కూడా తక్కువ లభిస్తుంది. బాప్ దాదా చెప్తున్నారు - అందరికీ బ్రహ్మాబాబాపై ప్రేమ అయితే ఉంది. అందువలనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మాకుమారీ అనా లేక శివకుమారీ అనా? బ్రహ్మాకుమారీ అనే పిలిపించుకుంటారు కదా, అంటే బ్రహ్మబాబా అంటే ప్రేమ ఉంది అనే కదా! అశరీరిగా అవ్వటంలో కొంచెం శ్రమ అనిపించవచ్చు కానీ బ్రహ్మాబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు? చెప్పండి? (ఫరిస్తా రూపంలో ఉన్నారు) కనుక బ్రహ్మతో ప్రేమ ఉండటం అంటే ఫరిస్తా రూపంతో ప్రేమ కలిగి ఉండటం. బిందువుగా అవ్వటం కష్టమనిపిస్తుంది కానీ ఫరిస్తా అవ్వటం అనేది దానికంటే సహజమే కదా! చెప్పండి, దానికంటే సహజమేనా? బిందురూపం కంటే ఫరిస్తా రూపంగా అవ్వటం సహజం కదా! బిందు రూపంలో ఉండాలంటే అప్పుడప్పుడు కర్మ చేస్తూ వ్యక్త శరీరంలో రావలసి ఉంటుంది కనుక కష్టమనిపించవచ్చు. వైజ్ఞానికులు కరెంట్ ఆధారంగా పనిచేసే రోబోట్ ను తయారుచేశారని బాప్ దాదా విన్నారు, చూడకపోయినా కానీ విన్నారు కదా! విన్నారా అందరూ! మాతలు విన్నారా! మీకు చిత్రాన్ని చూపిస్తారు. కరెంట్ ఆధారంగా రోబోట్ అన్ని పనులూ చేస్తుంది, వేగంగా కూడా చేస్తుంది, కరెంట్ ఆధారంగా పని చేస్తుంది. విజ్ఞానం యొక్క ప్రత్యక్ష రుజువు ఇది. అదేవిధంగా శాంతిశక్తి ద్వారా, శాంతి యొక్క ప్రకాశం ద్వారా మీరు కర్మ చేయలేరా? చేయలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చున్నారు కదా! చేతులెత్తండి! నిల్చోండి. మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వలె స్థితిని తయారుచేస్కోండి. వీరినే ఆత్మిక కర్మయోగులు అని అంటారు. ఫరిస్తా, కర్మయోగి ముందుగా మీరు తయారవ్వాలి. ఇంజనీర్లు, విజ్ఞానం వారు మొదట మీరు అనుభవం చేసుకోవాలి. చేసుకుంటారా? చేయగలరా? మంచిది, ఇటువంటి ప్లాన్ తయారుచేయండి. నడుస్తూ, తిరుగుతూ ఈ విధమైన ఆత్మిక కర్మయోగి ఫరిస్తాలుగా చూడాలని బాప్ దాదా అనుకుంటున్నారు. అమృతవేళ మేల్కోండి, బాప్ దాదాని కలుసుకోండి, ఆత్మిక సంభాషణ చేయండి, వరదానం తీస్కోండి. ఏది చేయాలంటే అది చేయండి కానీ రోజూ అమృతవేళ బాప్ దాదా నుండి కర్మయోగి ఫరిస్తా భవ! అనే వరదానాన్ని తీసుకుని కార్యవ్యవహారాలలోకి రండి. ఇలా చేయగలరా? మీది బుద్ది ఉపయోగించవలసిన విభాగం (అకౌంట్స్ విభాగం), ఇలా చేయగలరా? 

మధువనం వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి, చిన్నగా ఎత్తారు. మధువనంలో అక్కయ్యలు చేతులెత్తారు. మధువనం యొక్క తరంగాలు నలువైపులకి వ్యాపిస్తాయి. ఫరిస్తా రూపంలో, కర్మయోగియై, డబల్ లైట్ గా, ప్రకాశమయ శరీరం ద్వారా తేలికయై కర్మ చేస్తున్నాను అని భావించాలి. మాట్లాడినా కానీ ఫరిస్తా రూపంలో, పని చేసినా కానీ ఫరిస్తా రూపంలో చేయండి. ఏ విషయంతో ఎవరికి పని ఉందో వారు ఒక్కరే వినాలి, ఇతరులు వినకూడదు. 

వాతావరణం ఎందుకు తయారవుతుంది? ఏ చిన్న విషయం గురించి అయినా కానీ అటువంటి వాతావరణం ఎందుకు తయావుతుందంటే ఆ విషయం మాట్లాడేటప్పుడు ఆ విషయంతో సంబంధం లేనివారి చెవుల్లో కూడా పడేలా మాట్లాడతారు. అప్పుడు వారికి కూడా వ్యర్థ సంకల్పాలు నడవటం ప్రారంభమవుతుంది. అందువలన ఫరిస్తా అంటే ఆ విషయంతో ఎవరికి పని ఉందో వారే వినాలి. ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడాలి, కథగా తయారుచేసి చెప్పకండి. విషయాన్ని కథగా చేయకండి. కథల్లో తప్పక కల్తీ ఉంటుంది మరియు కథలు పెద్దగా ఉంటాయి. బ్రహ్మాబాబా యొక్క ప్రేమకు బదులివ్వటం అంటే బ్రహ్మాబాబా సమానంగా కర్మయోగి ఫరిస్తా భవ! 

బాప్ దాదా చెప్పేది ఇదే - ఈ స్థితి యొక్క భూమిని తయారుచేయండి అప్పుడు బాప్ దాదా పిల్లల ద్వారా సాక్షాత్ బాబా యొక్క సాక్షాత్కారం తప్పక చేయిస్తారు. సాక్షాత్ బాబా మరియు సాక్షాత్కారం - ఈ రెండు మాటలను గుర్తు ఉంచుకోండి. కేవలం ఫరిస్తా అంతే. సేవ చేస్తున్నా కానీ ఉన్నత స్థితి నుండి ఫరిస్తాగా వచ్చారు, సందేశం ఇచ్చారు తిరిగి పైకి వెళ్ళిపోయారు అంటే ఉన్నత స్మృతిలోకి వెళ్ళిపోయారు. 

ఇప్పటి సమయాన్ని అనుసరించి అక్కడక్కడ నీటి కోసం ఎలాగైతే దప్పికతో ఉన్నారో అలాగే వర్తమాన సమయంలో శుద్ధమైన, శాంతిమయ, సుఖమయ తరంగాల కోసం దప్పికగా ఉన్నారు. ఫరిస్తా రూపం ద్వారానే తరంగాలను వెదజల్లగలరు. ఫరిస్తా అంటే సదా ఉన్నత స్థితిలో ఉండేవారు. ఫరిస్తా అంటే పాత ప్రపంచం మరియు పాత సంస్కారాలతో సంబంధం లేదు. ప్రపంచ పరివర్తన అనేది మీ అందరి సంస్కార పరివర్తన గురించి ఆగి ఉంది. కనుక ఈ కొత్త సంవత్సరంలో సంస్కారాల పరివర్తన యొక్క లక్ష్యం పెట్టుకోండి. స్వయం యొక్క మరియు సహయోగం ద్వారా ఇతరుల యొక్క సంస్కారాలను కూడా పరివర్తన చేయాలి. ఎవరైనా బలహీనంగా ఉంటే సహయోగం ఇవ్వండి కానీ వర్ణించకండి, వాతావరణాన్ని తయారుచేయకండి. సహయోగమివ్వండి. ఈ సంవత్సరం యొక్క టాపిక్ - సంస్కారాల పరివర్తన. ఫరిస్తా సంస్కారాలు మరియు బ్రహ్మాబాబా సమాన సంస్కారాలు ఉండాలి. ఇది సహజ పురుషార్ధమేనా లేక కష్టమా? కొంచెం కొంచెం కష్టమా? కష్టం కాదా? ఎప్పుడూ కూడా ఏ విషయం కష్టంగా ఉండదు, మీ బలహీనతయే కష్టంగా చేస్తుంది. అందువలన బాప్ దాదా చెప్తున్నారు - ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలూ! ఇప్పుడు శక్తుల యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. వాయుమండలానికి ఇప్పుడు మీరు చాలా చాలా చాలా అవసరం. ఎలాగైతే ప్రపంచంలో ఈ రోజుల్లో కాలుష్యం అనే సమస్య ఉందో అదేవిధంగా విశ్వంలో ఒక ఘడియ అయినా మనస్సుకి శాంతి సుఖం యొక్క వాయుమండలం అవసరం. ఎందుకంటే మనస్సు యొక్క కాలుష్యం ఎక్కువగా ఉంది. ఈ కాలుష్యం వాయుకాలుష్యం కంటే ఎక్కువగా ఉంది. మంచిది. 

బాప్ దాదా సమానంగా అవ్వవలసిందే అనే లక్ష్యం పెట్టుకున్న నలువైపుల ఉన్న వారందరికీ, నిశ్చయబుద్ది విజయీ ఆత్మలకు, సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను ధృడ సంకల్పం ద్వారా పరివర్తన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు, సదా ఏ కారణంగానైనా, పరిస్థితుల వలన అయినా, స్వభావ సంస్కారాల వలన అయినా కానీ బలహీనంగా ఉన్న మీ తోటి ఆత్మలకు సహయోగాన్ని ఇచ్చేవారికి, కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా యొక్క స్నేహానికి బదులు ఇచ్చే కర్మయోగి ఫరిస్తా ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments