15-12-2001 అవ్యక్త మురళి

                15-12-2001         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఏకవ్రతగా అయ్యి పవిత్రత యొక్క ధారణ ద్వారా ఆత్మీయతలో ఉంటూ మనసాసేవ చేయండి.

ఈరోజు ఆత్మికతండ్రి నలువైపుల ఉన్నటువంటి ఆత్మిక పిల్లల యొక్క ఆత్మీయతను చూస్తున్నారు. ప్రతి ఒక పిల్లవానిలో ఆత్మీయత యొక్క మెరుపు ఎంత వరకు ఉంది అని. ఆత్మికశక్తి కలిగిన ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మికశక్తినిస్తుంది. ఆత్మిక చిరునవ్వు ఇతరులకు కూడా సంతోషం యొక్క అనుభూతిని చేయిస్తుంది. వారి యొక్క నడవడిక, ముఖం ఫరిస్తాల సమానంగా డబల్ లైట్ గా కనిపిస్తుంది. ఈవిధమైన ఆత్మీయతకు అధారం - పవిత్రత. ఎంతెంతగా మనసా, వాచా, కర్మణాలో పవిత్రత ఉంటుందో అంతగానే ఆత్మీయత కనిపిస్తుంది. పవిత్రత బ్రాహ్మణజీవితం యొక్క శృంగారం. పవిత్రత బ్రాహ్మణజీవితం యొక్క మర్యాద. కనుక బాప్ దాదా ప్రతి పిల్లవాని యొక్క పవిత్రత ఆధారంగా ఆత్మీయతను చూస్తున్నారు. ఆత్మిక ఆత్మ ఈ లోకంలో ఉంటూ కూడా అలౌకిక ఫరిస్తాగా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకొండి - మా యొక్క సంకల్పంలో, మాటలో పవిత్రత ఉందా అని. ఆత్మిక సంకల్పం మీలో కూడా శక్తి నింపుతుంది మరియు ఇతరులకు కూడా శక్తినిస్తుంది. దీనినే ఇంకొక మాటలో ఆత్మిక సంకల్పం మనసాసేవకు నిమిత్తమవుతుంది అని అంటారు. ఆత్మికమైన మాట స్వయానికి మరియు ఇతరులకు కూడా సుఖం యొక్క అనుభూతిని చేయిస్తుంది. శాంతి యొక్క అనుభవం చేయిస్తుంది. ఆత్మికమైన ఒక మాట ఇతరాత్మలను జీవితంలో ముందుకు తీసుకువెళ్ళడానికి నిమిత్తమవుతుంది. ఆత్మికమాట మాట్లాడేవారు వరదాని ఆత్మగా అవుతారు. ఆత్మిక కర్మ స్వయానికి కూడా సహజంగా కర్మయోగిస్థితి యొక్క అనుభవం చేయిస్తుంది మరియు ఇతరులను కూడా సహజయోగిగా చేసే ఉదాహరణ అవుతుంది. వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారు సహజయోగి, కర్మయోగి యొక్క జీవితాన్ని అనుభవం చేసుకుంటారు కానీ బాబా చెప్పారు కదా - ఆత్మీయతకు ఆధారం - పవిత్రత. కలలో కూడా పవిత్రత భంగం అవ్వకూడదు అప్పుడే ఆత్మీయత కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు కానీ ప్రతి మాటలో బ్రహ్మాచారిగా ఉండాలి, ప్రతి సంకల్పంలో బ్రహ్మచారిగా ఉండాలి. ఏవిధంగా అయితే లౌకికంలో కొంతమంది పిల్లల యొక్క ముఖం వారి తండ్రి వలె ఉంటే వీరిలో వారి తండ్రి కనిపిస్తున్నారు అని అంటారు కదా! అదేవిధంగా బ్రహ్మచారి బ్రాహ్మణాత్మ యొక్క ముఖంలో ఆత్మీయత ఆధారంగా బ్రహ్మాబాబా సమానంగా అనుభవం అవ్వాలి. సంపర్కంలోకి వచ్చిన ఆత్మలు వీరు బాబా సమానమైనవారు అని అనుభవం చేసుకోవాలి. 100 శాతం లేకపోయినా కానీ ఎంత శాతం కనిపించాలి? ఎంత వరకు చేరుకున్నారు? 75 శాతం వరకు చేరుకున్నారా, 80 శాతం వరకు చేరుకున్నారా, 90 శాతం వరకు చేరుకున్నారా? ఇక్కడ ముందు వరసలో కూర్చున్నవారు చెప్పండి! కూర్చోవటంలో అయితే ముందు నెంబర్ లభించింది కనుక బ్రహ్మాచారి అవ్వటంలో కూడా ముందు నెంబర్ లో ఉంటారు కదా!  

బాప్ దాదా ప్రతి పిల్లవాని యొక్క పవిత్రత ఆధారంగా ఆత్మీయతను చూడాలనుకుంటున్నారు. బాప్ దాదా దగ్గర అందరి చార్జ్ ఉంది. ఏమేమి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు. ఈ చార్ట్ అంతా బాప్ దాదా దగ్గర ఉంది కానీ బాబా చెప్పటం లేదు. పవిత్రతలో కూడా కొంతమంది పిల్లల యొక్క శాతం ఇప్పటి వరకు చాలా తక్కువగా ఉంది. సమయం అనుసరించి ఇప్పుడు విశ్వ ఆత్మలు మీ ఆత్మీయత యొక్క ఉదాహరణ చూడాలనుకుంటున్నారు. దీనికి సహజసాధనం - కేవలం ఒక మాట ధ్యాసలో ఉంచుకోండి. మాటిమాటికి ఒక మాట అండర్‌లైన్ చేసుకోండి - ఏకవ్రతభవ. ఎక్కడ ఒకరే ఉంటారో అక్కడ ఏకాగ్రత స్వతహాగానే వస్తుంది. అచంచలంగా, స్థిరంగా స్వతహాగా అవ్వగలరు. ఏకవ్రత అవ్వటం ద్వారా ఒకే మతంపై నడవటం చాలా సహజం అవుతుంది. ఏకవ్రత అవ్వటం ద్వారా, ఒకే మతంపై నడవటం ద్వారా, సహజంగా ఏకమతిగా అంటే సద్గతి సహజంగా లభిస్తుంది. ఏకరసస్థితి కూడా సహజంగా తయారవుతుంది. కనుక ఏకవ్రతగా అయ్యానా? అని పరిశీలించుకోండి. మొత్తం రోజంతటిలో మనస్సు, బుద్ది ఏకాగ్రంగా ఉంటున్నాయా? అని పరిశీలన చేసుకోండి. లెక్క ప్రారంభం అయ్యేటప్పుడు కూడా ఒకటితోనే లెక్క ప్రారంభం అవుతుంది. ఒక బిందువు మరియు ఒక మాట, ఒకటి అంకె ప్రక్కన ఒక బిందువు అంటే సున్న పెడుతూ వెళ్తే ఎంతగా పెరిగిపోతూ ఉంటుంది! ఏ విషయం స్మృతి లేకపోయినా ఒక మాట అయితే స్మృతి ఉంటుంది కదా! ఏకవ్రత ఆత్మలైన మిమ్మల్ని సమయం మరియు ఆత్మలు పిలుస్తున్నారు. దేవాత్మలైన మీకు సమయం మరియు ఆత్మల యొక్క పిలుపు వినబడటంలేదా? ప్రకృతి కూడా ప్రకృతిపతులైన మిమ్మల్ని చూసి ఇప్పుడు పరివర్తన చేయండి అని పిలుస్తుంది. ప్రకృతి మధ్యమధ్యలో చిన్న, చిన్న ఆకస్మిక విపత్తులు చూపిస్తుంది. దీనాత్మలకు మాటిమాటికి దు:ఖం లేదా భయం యొక్క ఆకస్మిక విపత్తులు కలగనివ్వకండి. ముక్తినిచ్చే మాస్టర్ ముక్తి దాతలైన మీరు ఈ ఆత్మలకు ఎప్పుడు ముక్తినిస్తారు? మనస్సులో దయ రావటంలేదా? వార్తలు విని, విన్నాము అయిపోయింది....ఇలా నిశ్శబ్దం అయిపోతున్నారా! అందువలనే బాప్ దాదా ఇప్పుడు ప్రతి పిల్లవాని యొక్క దయాస్వరూపం చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ హద్దు యొక్క విషయాలను వదిలేయండి, దయాహృదయులుగా అవ్వండి. మనసా సేవలో నిమగ్నమవ్వండి. శక్తి ఇవ్వండి, శాంతి ఇవ్వండి, తోడు ఇవ్వండి. దయా హృదయులుగా అయ్యి ఇతరులకు సహాయం చేయటంలో బిజీ అయిపోతే ఇక ఈ హద్దు యొక్క ఆకర్షణల నుండి, హద్దు యొక్క విషయాల నుండి సహజంగానే దూరం అవుతారు. శ్రమ నుండి రక్షించబడతారు. వాచా సేవలో చాలా సమయం ఉపయోగించారు, సమయాన్ని సఫలం చేసుకున్నారు, సందేశం ఇచ్చారు, ఆత్మలను సంబంధ, సంపర్కంలోకి తీసుకువచ్చారు, ఇలా డ్రామానుసారం ఇప్పటి వరకు చేసిన సేవ చాలా మంచిగా చేసారు. కానీ ఇప్పుడు వాచా సేవతో పాటూ మనసాసేవ యొక్క అవసరం చాలా ఉంది మరియు ఈ మనసాసేవ అందరూ చేయవచ్చు అంటే క్రొత్తవారు, పాతవారు, మహారథులు, గుఱ్ఱపుసవారీలు, కాల్బలం వారు అందరూ చేయగలరు. ఈ సేవ పెద్దవారు చేస్తారు, మేము చిన్నవారము, మేము అనారోగ్యంతో ఉన్నాము, మాకు సాధనాలు లేవు ఇలా ఏవిధమైన ఆధారం అవసరం లేదు. ఈ సేవ చిన్న,చిన్న పిల్లలు కూడా చేయగలరు. పిల్లలు చేస్తున్నారు కదా? (చేస్తున్నాము అని చెప్పారు) అందువలనే ఇప్పుడు వాచాసేవ మరియు మనసాసేవ రెండింటి సమానత ఉంచుకోండి. మనసాసేవ చేయటం ద్వారా మీకు చాలా లాభం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏ ఆత్మకైతే మీరు మనసాసేవ అంటే సంకల్పం ద్వారా శక్తిని ఇస్తారో ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది మరియు మీ యొక్క ఖాతాలో స్వపురుషార్ధం యొక్క ఖాతా అయితే ఉంది కానీ దానితో పాటు ఆశీర్వాదాల యొక్క ఖాతా కూడా జమ అవుతుంది. మీ యొక్క జమాఖాతా రెండు రకాలుగా పెరిగిపోతూ ఉంటుంది. అందువలన క్రొత్తవారైనా, పాతవారైనా చేయవచ్చు. ఎందుకంటే ఈసారి క్రొత్త పిల్లలు చాలా మంది వచ్చారు కదా! మొదటిసారిగా బాబా దగ్గరికి వచ్చినవారు చేతులు ఎత్తండి! మొదటిసారి బాబా దగ్గరికి వచ్చిన పిల్లలను బాప్ దాదా అడుగుతున్నారు - మీరు మనసాసేవ చేస్తున్నారా? (బాప్ దాదా పాండవులను మరియు మాతలను వేర్వేరుగా మనసాసేవ చేస్తున్నారా? అని అడిగారు) చాలా మంచిగా చేతులు ఎత్తారు. ఇప్పుడు బాప్ దాదా అందరికీ అంటే టి.విలో బాప్ దాదాని చూస్తూ మురళి వినేవారికి మరియు ఎదురుగా కూర్చుని వినేవారికి అందరికీ బాధ్యత ఇస్తున్నారు - ప్రతి రోజు మొత్తం రోజంతటిలో ఎన్ని గంటలు యదార్ధంగా మనసాసేవ చేసాము అని పరిశీలించుకోవాలి. చేసేసాము అని చెప్పటం కాదు. యదార్ధ రూపంలో ఎన్ని గంటలు మనసాసేవ చేసారు? ప్రతి ఒక్కరు ఈ చార్ట్ పెట్టుకోవాలి. మరలా బాప్ దాదా అకస్మాత్తుగా చార్ట్ అడిగిస్తారు. తారీఖు చెప్పరు. అకస్మాత్తుగా అడిగిస్తారు. బాధ్యతాకిరీటం ధరించారా లేదా చలిస్తూ ఉందా అనేది చూస్తారు. బాధ్యతాకిరీటం పెట్టుకున్నారు కదా! టీచర్స్ అయితే బాధ్యతాకిరీటం పెట్టుకునే ఉన్నారు కదా! ఇప్పుడు దానిలో ఈ మనసాసేవ యొక్క బాధ్యతను కూడా కలపండి. డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి? ఆ బాధ్యతా కిరీటం మంచిగా అనిపిస్తుందా? చేతులు ఎత్తండి! టీచర్స్ చేతులు ఎత్తండి! మిమ్మల్ని చూసి అందరికీ ప్రేరణ వస్తుంది. కనుక చార్ట్ పెట్టుకుంటారా? బాప్ దాదా అకస్మాత్తుగా ఒక రోజు చార్ట్ అడుగుతారు. మీ యొక్క చార్ట్ వ్రాసి పంపించండి. ఎందుకంటే ఇది వర్తమాన సమయంలో చాలా అవసరం. మీ పరివారం యొక్క దు:ఖం, అలజడి మీరు చూస్తున్నారా? దు:ఖీ ఆత్మలకు బిందువు ఇవ్వండి. మీ యొక్క పాట ఉంది కదా - మేము ఒక బిందువు దాహంతో ఉన్నాము...... అని. ఈ సమయంలో ఆత్మలందరు ఒక బిందువు యొక్క సుఖ, శాంతులకు దాహంతో ఉన్నారు, సుఖ శాంతుల యొక్క ఒక బిందువు లభించటం ద్వారా సంతోషం అయిపోతారు. బాప్ దాదా మాటిమాటికి చెప్తున్నారు - సమయం మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. బ్రహ్మాబాబా ఇంటి యొక్క తలుపు తెరవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రకృతి తీవ్రమైన వేగంతో శుభ్రం చేయడానికి ఎదురుచూస్తుంది. కనుక ఓ ఫరిస్తాలూ ! మీ యొక్క డబల్ లైట్ ద్వారా వారి యొక్క నిరీక్షణను సమాప్తి చేయండి. ఎవరెడి అనే మాట అందరూ మాట్లాడుతున్నారు కానీ సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వటంలో ఎవరెడిగా ఉన్నారా? కేవలం శరీరం వదలడానికి ఎవరెడి అవ్వటం కాదు కానీ బాబా సమానంగా అయ్యి వెళ్ళటంలో ఎవరెడిగా అవ్వాలి. 

మధువనం వారు ముందుకు వెళ్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు, మంచిది. మధువనం వారు ఎవరెడిగా అయ్యారా? నవ్వుతున్నారు. మొదటి వరసలో కూర్చున్న మహారథిలు ఎవరెడిగా అయ్యారా? బాబా సమానంగా అవ్వటంలో ఎవరెడిగా అయ్యారా? ఇలా బాబా సమానంగా అయితే ఎడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు, ఎడ్వాన్స్ పార్టీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో బిజీగా అయిపోతారు కదా! వాణీ మరియు మనస్సు యొక్క సేవలో సమానంగా ఉంటే చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. డబల్ ఖాతా జమ అవుతుంది. పురుషార్ధం యొక్క ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. కనుక సంకల్పం ద్వారా, మాట ద్వారా, కర్మ ద్వారా, సంబంధ, సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు తీసుకోండి. ఒక విషయం చేయండి అంటే ఆశీర్వాదాలు ఇవ్వాలి అంతే. ఎవరైనా శాపం ఇచ్చినా కూడా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎవరైనా కోపంలోకి వచ్చినా మీరు కోపగించుకోకూడదు. మీరు రాజీగా ఉండండి. ఇలా ఉండగలుగుతున్నారా? 100 మంది కోపగించుకున్నా మీరు రాజీగా ఉండగలుగుతున్నారా? ఉండగలరా? రెండవ వరసలో ఉన్నవారు ఉండగలరా? ఇప్పుడు ఇంకా కోపంలోకి తీసుకువస్తారు. పరీక్ష అయితే వస్తుంది కదా! మాయ కూడా వింటుంది కదా! ఈ వ్రతం తీసుకోండి, ధృఢసంకల్పం తీసుకోండి - ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. అంటే మాయ భలే కోపగించుకొనే విధంగా చేసినా మీరు రాజీ చేసేవారు కదా? కేవలం ఒక పని చేయండి అంతే. మనం కోపగించుకోకూడదు మరియు ఇతరులను కోపంలోకి తీసుకురాకూడదు. కావాలంటే వారు కోపంలోకి వస్తారు కానీ మీరు కోపంలోకి రాకూడదు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. వీరు ఇది చేస్తున్నారు,అది చేస్తున్నారు అని ఇతరులను చూడకండి. మనం సాక్షి అయ్యి ఆట చూసేవారిగా ఉండాలి, కేవలం రాజీగా ఉండేవిధంగా ఆట ఉండదు. మధ్యమధ్యలో కోపగించుకొనేవారి యొక్క ఆట కూడా చూడాల్సి వస్తుంది. అయినా కానీ ప్రతి ఒక్కరు ఎవరికి వారు రాజీగా ఉండాలి. మాతలు ఉండగలుగుతున్నారా? పాండవులు ఉండగలుగుతున్నారా? బాప్ దాదా మ్యాప్ (పఠం) చూస్తారు. బాప్ దాదా దగ్గర చాలా పెద్ద టీ.వి ఉంది. చాలా పెద్దది ఉంది. ఏ సమయంలో ఎవరు ఏ కార్యం చేస్తున్నారు అని బాబా ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, కానీ బాబా మీకు చెప్పటం లేదు. చాలా రంగులు చూస్తున్నారు. దాచిదాచి ఏమి చేస్తున్నారో కూడా చూస్తున్నారు. పిల్లలలో నేర్పరితనం (చతురత) కూడా చాలా ఉంది. ఒకవేళ ఆ నేర్పరితనం గురించి బాబా వినిపిస్తే మీరు కొద్దిగా ఆలోచనలో పడతారు. అందువలన బాప్ దాదా చెప్పటంలేదు. మిమ్మల్ని ఆలోచనలో పడేయటం ఎందుకు అని బాప్ దాదా చెప్పటంలేదు. కానీ చాలా తెలివితో చేస్తున్నారు. అందరికంటే తెలివైనవారిని చూడాలంటే బ్రాహ్మణాత్మలలోనే చూడాలి. కానీ ఇప్పుడు దేనిలో తెలివైనవారు అవుతారు? మనసాసేవలో తెలివైనవారు అవ్వండి. మొదటి నెంబర్ తీసుకోండి, వెనుక ఉండకూడదు. దీనిలో ఏ కారణాలు లేవు. సమయం లభించడం లేదు, అవకాశం లభించడంలేదు, ఆరోగ్యం మంచిగా లేదు, నన్ను అడగలేదు ఇవేమి దీనిలో ఉండవు. అందరు చేయగలరు. పిల్లలు పరుగు పెట్టే ఆట ఆడారు కదా! అలాగే ఇప్పుడు దీనిలో పరుగు పెట్టాలి. మనసాసేవలో పరుగు పెట్టాలి. 

నలువైపుల ఉన్నటువంటి సర్వశ్రేష్ట ఆత్మీయత యొక్క అనుభవం చేయించే ఆత్మలకు, సంకల్పం మరియు స్వప్నంలో కూడా పవిత్రత యొక్క పాఠం చదువుకునే బ్రహ్మాచారి ఆత్మలకు, సర్వ ధృఢసంకల్పధారి, మనసా సేవాధారులకు, తీవ్రపురుషార్ధి ఆత్మలకు, ఆశీర్వాదాలు ఇచ్చే మరియు ఆశీర్వాదాలు తీసుకునే పుణ్యాత్మలకు బాప్ దాదా యొక్క , మనోభిరాముడి యొక్క మనస్పూర్వకమైన, ప్రాణపదమైన మరియు ప్రేమతో నిండిన ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments