15-03-1999 అవ్యక్త మురళి

             15-03-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ ను(నిగ్రహశక్తిని) పెంచుకోండి, స్వరాజ్యాధికారులుగా కండి.

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ గారాల రాజా పిల్లలను, పరమాత్మకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ గారాబము లేక పరమాత్మ ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఇలాంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఇలాంటి భాగ్యశాలి పిల్లలను చూసి బాప్ దాదా కూడా హర్షితమవుతున్నారు. గారాల పిల్లలనగా రాజా పిల్లలు. కావున మీరు స్వయాన్ని రాజులుగా భావిస్తున్నారా? మీ పేరే రాజయోగులు. కావున రాజయోగులనగా రాజా పిల్లలు. వర్తమాన సమయంలోనూ రాజులే, భవిష్యత్తులో కూడా రాజులే. తమ డబల్ రాజ్యపదవిని అనుభవం చేస్తున్నారు కదా! నేను రాజుగా ఉన్నానా? స్వరాజ్య అధికారిగా ఉన్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. ప్రతీ రాజ్య అధికారి రాజులైన మీ ఆజ్ఞానుసారం పనులు చేస్తున్నారా? రాజు విశేషత ఏమిటో మీకు తెలుసు కదా? పరిపాలనా శక్తి మరియు నిగ్రహశక్తి (Ruling power and Controling Power) - ఈ రెండు శక్తులు మీ వద్ద ఉన్నాయా? రాజ్యంలోని కర్మచారులు. సదా తమ కంట్రోల్ లో నడుస్తున్నారా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి.

బాప్ దాదా ఈ రోజు పిల్లల కంట్రోలింగ్ పవర్‌ను, రూలింగ్ పవర్ ను చెక్ చేస్తున్నారు. ఏం గమనించి ఉంటారో చెప్పండి? ఇవి ప్రతి ఒక్కరికీ తెలుసు. "ఇప్పటికీ అఖండ రాజ్యాధికారం అందరికీ లేదని బాప్ దాదా గమనించారు. అఖండముగా ఉండాలి. మధ్య మధ్యలో ఎందుకు ఖండితమవుతూ ఉంటుంది? సదా పరరాజ్యానికి బదులు స్వ రాజ్యం కూడా ఖండితం చేస్తారు. పరరాజ్యానికి గుర్తు - ఈ కర్మేంద్రియాలకు అధీనమవుతారు. మాయా రాజ్యం యొక్క ప్రభావం అనగా - పరాధీనంగా అయిపోవడం. వర్తమాన సమయంలో మైనారిటీ పిల్లలు బాగానే ఉన్నారు. కానీ మెజారిటీ పిల్లలు మాయ విశేష ప్రభావంలోకి వచ్చేస్తారు. ఏదైతే ఆది - అనాది సంస్కారాల మధ్యమధ్యలో మధ్య సంస్కారం అనగా ద్వాపర యుగం నుండి ఇప్పుడు అంతిమం వరకు ఉన్న సంస్కార ప్రభావంలోకి వచ్చేస్తారు. మీ స్వంత సంస్కారాలే, మీ స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా - వ్యర్థం ఆలోచించడం, వ్యర్థంగా సమయం పోగొట్టుకోవడం మరియు వ్యర్థమైన మాటలు మాట్లాడడం, వ్యర్థమైన వ్యవహారములోకి రావడం అనగా వినడం కావచ్చు, వినిపించడం కావచ్చు. ఇటువంటి సంస్కారాలు ఒకవైపు వ్యర్థ సంస్కారము, మరొకవైపు సోమరితనపు సంస్కారము రకరకాల రాయల్ రూపంతో స్వరాజ్యాన్ని ఖండితం చేస్తాయి. చాలామంది పిల్లలు సమయం సమీపానికి వస్తూ ఉందని అంటారు కానీ ఇంతకు ముందు ప్రత్యక్షంగా కనిపించని సంస్కారాలు ఇప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇప్పటికీ వాయుమండలంలో ఆ సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? మీ పై దాడి చేయుటకు మాయకు ఇదొక సాధనం. మాయ ఈ సాధనంతోనే తనవారిగా చేసుకొని పరమాత్మ మార్గంలో నిరాశావాదులుగా, బలహీనులుగా చేసేస్తుంది. ఇంకా ఇంత వరకూ ఇలాగే ఉన్నాము, సమానతలో సఫలత లభిస్తుందో లేదో అని ఆలోచిస్తూ వ్యాకులపడతారు. ఏదో ఒక విషయంలో ఎక్కడ బలహీనత ఉంటుందో, ఆ బలహీనత రూపంలోనే మాయ వచ్చి బలహీనంగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. చాలా మంచిగా నడుస్తూ - నడుస్తూ ఉంటారు. కాని ఏదో ఒక విషయంలో మాయ దాడి చేసి పాత సంస్కారాన్ని ప్రత్యక్షం చేసే రూపాన్ని ధరించి బలహీనులుగా చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తమవ్వాల్సిందే. కావున అప్పుడప్పుడు మిగిలి ఉన్న పాత సంస్కారాలు ప్రత్యక్షమైపోతాయి. అయితే బాప్ దాదా భాగ్యశాలులైన పిల్లలలందరికీ సూచన చేస్తున్నారు - భయపడకండి. మాయ జిత్తులను అర్థం చేసుకోండి. సోమరితనము మరియు వ్యర్థము - ఇందులో నెగిటివ్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు విషయాల పైన విశేషమైన అటెన్షన్ ఉంచండి. వర్తమాన సమయంలో యుద్ధం చేయడానికి మాయకిది ఒక సాధనమని అర్థం చేసుకోండి.

తండ్రి తోడును, తండ్రితో కంబైన్డ్ స్థితి అనుభవాన్ని గుర్తు చేసుకోండి. తండ్రి నావారే కదా, నా తోడుగానే ఉన్నారు కదా అని అనుకోకండి. ప్రాక్టికల్ గా తండ్రి తోడు అనుభవమవ్వాలి. అప్పుడు మాయ యొక్క యుద్ధం, యుద్ధంగా ఉండదు, మాయ ఓడిపోతుంది. ఇది మాయ పరాజయము, యుద్ధం కాదు. కావున ఏమయ్యింది? ఎందుకు అయ్యింది? అని భయపడకుంటే చాలు. ధైర్యంగా ఉండండి. తండ్రి తోడును స్మృతిలో ఉంచుకోండి. తండ్రి తోడుగా ఉన్నారా అని చెక్ చేసుకోండి. తోడును అనుభవం చేయడం అదృశ్య రూపంలో లేదు కదా? బాబా తోడు ఉన్నారు అనే జ్ఞానమైతే ఉంది. జ్ఞానంతో పాటు తండ్రి శక్తి ఏమిటి? వారు సర్వశక్తివంతులు. కనుక సర్వశక్తుల శక్తిని ప్రత్యక్ష రూపంలో అనుభవం చేయండి. దీనినే తండ్రి తోడు అనుభవమగుట అని అంటారు. తండ్రి తప్ప నా జతలో ఇంకెవరున్నారు? బాబానే కదా ఉండేది? అని సోమరులుగా ఉండకండి. తండ్రే మీ తోడుగా ఉంటే మీలో వారి శక్తి ఉందా? మీరు ప్రపంచంలోని వారికి - పరమాత్మ సర్వవ్యాపి అయితే పరమాత్మ గుణాలు అనుభవమవ్వాలి, కనిపించాలి అని చెప్తారు కదా! కావున బాప్ దాదా మిమ్ములను కూడా అడుగుతున్నారు - తండ్రి తోడుగా ఉంటే, కంబైండుగా ఉంటే ఆ శక్తి ప్రతీ కర్మలో అనుభవమవుతూ ఉందా? ఇతరులకు కూడా అలా అనుభవం అవుతూ ఉందా? ఏమనుకుంటున్నారు? డబుల్ ఫారినర్స్ ఏమనుకుంటున్నారు? శక్తి ఉందా? సదా ఉందా? మొదటి ప్రశ్నకు అందరూ 'ఉంది' అని అంటారు. రెండవ ప్రశ్న వచ్చినప్పుడు సదా ఉందా అని అడిగితే ఆలోచనలో పడిపోతారు. కనుక అఖండంగా లేదు కదా! మీరు ఏమని ఛాలెంజ్ చేస్తారు? అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా లేక ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అఖండము కదా! టీచర్లు చెప్పండి - అఖండంగా ఉందా? కావున ఇప్పుడు అఖండ స్వరాజ్యం ఉందా అని చెక్ చేసుకోండి ? రాజ్యం అనగా ప్రాలబ్ధము. సదా కాలం కొరకు తీసుకోవాలా లేక మధ్య మధ్యలో తెగిపోయినా పర్వాలేదా ? ఇలా కోరుకుంటున్నారా ? తీసుకోవడానికైతే "సదా కావాలి" పురుషార్థములో అయితే అప్పుడప్పుడు నడుస్తుంది. ఇలా ఉన్నారా? విదేశీయులు తమ జీవితమనే డిక్షనరీ నుండి సంటైమ్ (అప్పుడప్పుడు) మరియు సంథింగ్ (కొద్దిగా, కొంచెం) అనే పదాలు తీసేయమని చెప్పాము కదా? అప్పుడప్పుడు అనే పదము సమాప్తమయ్యిందా? జయంతీ చెప్పు, రిజల్టు ఇస్తావు కదా! కావున అప్పుడప్పుడు అనే పదము సమాప్తమయిందా? అప్పుడప్పుడు అనే శబ్దం సదా కాలం కొరకు సమాప్తమైపోయిందని భావించేవారు చేతులెత్తండి. సమాప్తమై పోయిందా లేక సమాప్తమవుతుందా? పెద్దగా చేతులెత్తండి. వతనంలోని టీ.వీలో మీ చేతులొచ్చేశాయి. ఇక్కడ టీవీలో అందరి చేతులు రావు. ఇది కలియుగపు టీ.వీ కదా. అక్కడ వతనంలో ఇంద్రజాలపు టీ.వీ ఉంది. అందువలన అందరి చేతులు వచ్చేస్తాయి. చాలా బాగుంది. అయినా చాలామంది చేతులెత్తారు. వారికి సదా కాలం కొరకు శుభాకాంక్షలు. మంచిది. ఇప్పుడు భారతవాసులు ఎవరికైతే ప్రాక్టికల్ గా సదా కాలపు స్వరాజ్యం ఉందో, సర్వ కర్మేంద్రియాలు తమ నియంత్రణలో (లా అండ్ ఆర్డర్ లో) ఉన్నాయో వారు చేతులెత్తండి. పక్కాగా చేతులెత్తండి. కచ్చాగా కాదు. సభలో చేతులెత్తామని సదా గుర్తుంచుకోండి. తర్వాత బాప్ దాదాకు చాలా మధురాతి మధురంగా మాటలు చెప్తారు. “బాబా, మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా” అని అంటారు. కనుక మీ చేతులకు గౌరవం ఉంచండి. బాగుంది. అయినా ధైర్యము వహించారు కనుక ధైర్యాన్ని పోగొట్టుకోకండి. ధైర్యం చేసినందుకు బాప్ దాదా సహాయం ఉండనే ఉంటుంది.

ఈ రోజు బాప్ దాదా వర్తమాన సమయం అనుసారంగా తమ పైన, మీ కర్మేంద్రియాల పైన అనగా మీకు మీ పట్ల ఎంత నిగ్రహశక్తి(కంట్రోలింగ్ పవర్) ఉండాలో అది తక్కువగా ఉందని గమనించారు. ఇంకా ఎక్కువగా ఉండాలి. బాప్ దాదా పిల్లల ఆత్మిక సంభాషణ విని నవ్వుతూ ఉన్నారు. నాలుగు గంటల శక్తిశాలి స్మృతి లేదని పిల్లలంటారు. బాప్ దాదా 8 గంటల నుండి 4 గంటలు చేశారు కాని పిల్లలు 2 గంటలైతే బాగుంటుందని అంటారు. ఇప్పుడు చెప్పండి, దీనిని కంట్రోలింగ్ పవర్ అని అంటారా? ఇప్పటి నుండే ఒకవేళ ఈ అభ్యాసం లేకపోతే సమయానికి పాస్ విత్ హానర్(Pass with Honour)గా, రాజ్యాధికారులుగా ఎలా కాగలరు? తయారవ్వాలి కదా?
పిల్లలు నవ్వుతున్నారు. ఈ రోజు బాప్ దాదా పిల్లల మాటలు చాలా విన్నారు. బాప్ దాదాను నవ్విస్తారు కూడా. ట్రాఫిక్ కంట్రోల్ 3 నిమిషాలు కూడా చెయ్యలేకపోతున్నామని అంటారు. శరీరం కంట్రోల్ అవుతుంది, నిలబడతాము. పేరేమో మనస్సును కంట్రోల్ చేసుకోవడం కానీ మనసు ఒకప్పుడు కంట్రోల్ అవుతుంది, ఒకప్పుడు కాదు. కారణం ఏమిటి? కంట్రోలింగ్ పవర్ లో లోపము. దీనిని ఇప్పుడింకా పెంచాలి. ఆర్డర్ చెయ్యండి - ఎలాగైతే చేతిని పైకి ఎత్తాలనుకుంటే ఎత్తేస్తారు. క్రేక్ లేకుంటే, విరగకుంటే ఎత్తేస్తారు కదా! అలాగే సూక్ష్మ శక్తి అయిన మనసు మీ అధీనంలోకి రావాలి, రావాల్సిందే. ఆర్డర్ చెయ్యండి, స్టాప్(ఆపు) అనగానే ఆగిపోవాలి. సేవను గురించి ఆలోచిస్తే సేవలో లగ్నమైపోవాలి. పరంధామానికి వెళ్లు అంటూనే పరంధామంలోకి వెళ్ళిపోవాలి. సూక్ష్మవతనానికి వెళ్ళు అంటే సెకండులో వెళ్ళిపోవాలి. ఏమనుకుంటే అది చేసెయ్యాలి. ఇప్పుడీ శక్తిని పెంచుకోండి. చిన్న చిన్న సంస్కారాలలో యుద్ధం చేస్తూ సమయం పోగొట్టుకోకండి. ఈ రోజు ఈ సంస్కారాన్ని పారద్రోలారు. రేపు ఇంకో దానిని పంపించారు. కంట్రోలింగ్ శక్తిని ధారణ చేస్తే వేరే వేరే సంస్కారాలపై సమయం వినియోగించాల్సిన పని ఉండదు. ఆలోచించకు, చేయకు, మాట్లాడకు, ఆగిపో (Stop) అంటూనే ఆగిపోవాలి. ఇది కర్మాతీత స్థితికి చేరుకునే విధి. ఇప్పుడు కర్మాతీతులుగా అవ్వాలి కదా? తయారవ్వాల్సింది మీరే అని బాప్ దాదా కూడా చెప్తున్నారు. ఇంకెవ్వరూ కారు. తయారయ్యేది మీరే. మిమ్ములనే తోడుగా తీసుకొని వెళ్తారు. కానీ కర్మాతీతులుగా అయినవారినే తీసుకొని వెళ్తారు కదా! తోడుగా నడుస్తారా లేక వెనుక వెనుక వస్తారా? (తోడుగానే నడుస్తాము) చెప్పడమైతే చాలా బాగా చెప్పారు. తోడుగా నడుస్తారా? ఖాతాను(అక్కౌంటును) సమాప్తము చేసుకుంటారా? ఇందులో 'అలాగే' అని అనడం లేదు. కర్మాతీతులుగా అయ్యి తోడుగా నడుస్తారు కదా. తోడుగా నడవటం అనగా సహచరులుగా అయ్యి నడవాలి. జోడి(జంట) మంచిగా ఉండాలా? లేక ఒకరు పొడవుగా, ఒకరు పొట్టిగా ఉండాలా? సమానంగా ఉండాలి కదా. కనుక కర్మాతీతులుగా అవ్వాల్సిందే. కనుక ఏం చేస్తారు? ఇప్పుడు మీ రాజ్యాన్ని బాగా సంభాళించండి. రోజూ తమ దర్బారును(సభను) పెట్టుకోండి. రాజ్యాధికారులు కదా! కావున తమ దర్బారును జరపండి. కర్మలు చేసే ఇంద్రియాల స్థితి గతులను అడగండి. ఆర్డరులో ఉన్నాయా అని చెక్ చేయండి. బ్రహ్మాబాబా కూడా రోజూ దర్బారు జరిపేవారు. వారిని కాపీ చేయాలి కదా. వాటికి(కర్మేంద్రియాలకు) చెప్పండి, చూపించండి. బ్రహ్మాబాబా కూడా కష్టపడ్డారు. రోజూ దర్బారు పెట్టుకున్నారు, అందుకే కర్మాతీతులయ్యారు. కనుక ఇప్పుడింకా ఎంత సమయం కావాలి? లేక ఎవరెడీగా ఉన్నారా? ఈ స్థితి ద్వారా సేవ కూడా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకే సమయంలో మనస్సు శక్తిశాలిగా, వాచా శక్తిశాలిగా సంబంధ-సంపర్కాలలో నడవడికలు మరియు ముఖము కూడా శక్తిశాలిగా ఉంటాయి. ఒకే సమయంలో మూడు సేవలు వేగంగా ఫలితాన్నిస్తాయి. ఈ సాధనలో సేవ తక్కువగా జరుగుతుందని అనుకోకండి. అలా జరగదు. సఫలత సహజంగా అనుభవమవుతుంది. ఇంకా ఎవరైతే సేవకు నిమిత్తంగా ఉన్నారో, సంఘటిత రూపంలో ఇలాంటి స్థితిని తయారు చేసుకుంటే తక్కువ శ్రమతో ఎక్కువ సఫలత లభిస్తుంది. కావున విశేష అటెన్షన్ - "కంట్రోలింగ్ పవర్ ను" పెంచుకోండి. సంకల్పము, సమయం, సంస్కారము అన్నిటిపైన కంట్రోల్(అదుపు) ఉండాలి. “మీరందరూ రాజులు" అని బాప్ దాదా చాలాసార్లు చెప్పారు. ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎక్కడ కావాలో, ఎంత సమయం కావాలో అలా మనస్సు, బుద్ధి నియంత్రణలో(లా అండ్ ఆర్డర్ లో) ఉండాలి. మీరు చెయ్యవద్దు అని చెప్పినా జరుగుతూ ఉంటే, చేస్తూ ఉంటే అది లా అండ్ ఆర్డర్ కాదు. కావున స్వరాజ్య అధికారులు తమ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష స్వరూపములోకి తీసుకురండి. తీసుకురావాలి కదా? తీసుకొస్తూ కూడా ఉన్నారు కాని  'సదా' అనే శబ్దాన్ని కలపమని బాప్ దాదా చెప్పారు కదా. ఇప్పుడు బాప్ దాదా చివర్లో వస్తారు, ఇంకా ఒక టర్న్ ఉంది. ఆ టర్న్ లో ఫలితం అడుగుతారు. 15 రోజులున్నాయి కదా. కావున 15 రోజులలో ఏమైనా చూపిస్తారా లేదా? టీచర్లు చెప్పండి? 15 రోజులలో ఫలితము వస్తుందా? 

మంచిది. మధువనంవారు 15 రోజులలో ఫలితం చూపిస్తారు కదా. అవుతుందో, కాదో ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు చేతులెత్తండి(అందరూ చేతులెత్తారు). మీ చేతులకు గౌరవమివ్వండి. ప్రయత్నిస్తామని ఎవరు అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. జ్ఞాన సరోవరము, శాంతివనము, వారు లేవండి. (బాప్ దాదా మధువనం, జ్ఞాన సరోవరం, శాంతివనంలోని ముఖ్యమైన నిమిత్త సోదరీ-సోదరులను ఎదురుగా పిలిచారు). 

బాప్ దాదా మీ అందరినీ సాక్షాత్కారము చేయించుటకు పిలిపించారు. మీ అందరినీ చూసి అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుతున్నారో చెప్తున్నారు. పాండవ భవనం, శాంతి వనం, జ్ఞానసరోవరం, హాస్పిటల్ వారు ఎవరైనా కావచ్చు. నాలుగు ధామాలైతే ఉన్నాయి. అయిదవది చిన్నది. నాలుగు స్థానాల వారిపై బాప్ దాదాకు ఒక ఆశ ఉంది. బాప్ దాదా మూడు నెలల కొరకు నాలుగు ధామాలలో అఖండంగా, నిర్విఘ్నంగా స్థిరంగా ఉన్న రాజ్యాధికారి రాజుల రిజల్టు చూడాలని అనుకుంటున్నారు. మూడు నెలలు ఇక్కడ, అక్కడ నుండి ఇతర మాటలేవీ వినిపించరాదు. అందరూ నంబరువన్ స్వరాజ్యాధికారులుగా ఉండాలి. మూడు నెలలలో ఇలాంటి రిజల్టు వస్తుందా? (నిర్వైర్ భాయితో) పాండవుల వైపు నుండి మీరు ఉన్నారు. వీలవుతుందా? దాదీ అయితే ఉన్నారు కాని ఎవరైతే తోడుగా, ఎదురుగా కూర్చున్నారో వారంతా ఉన్నారు. వీలవుతుందా? (దాదీ అవుతుందని చెప్తూ ఉంది). పాండవ భవన్ వారు ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. వీలవుతుందా? సరే ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి ఏదైనా జరుగుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? మీ జతలో ఉన్నవారికి కూడా చేయూతనిస్తూ (సహకరిస్తూ) రిజల్టు తీయాలని భావిస్తున్నారా? అంత ధైర్యము వహిస్తారా? అలా వీలవుతుందా లేక తమ వరకు మాత్రమే ధైర్యముందా? ఇతరుల విషయాలను కూడా ఇముడ్చుకోగలరా? వారి తప్పులను ఇముడ్చుకోగలరా? వాయుమండలములో వ్యాపింపచేయకండి, ఇముడ్చుకోండి. ఇది చెయ్యగలరా? చేస్తామని గట్టిగా (పెద్దగా) చెప్పండి. శుభాకాంక్షలు. మూడు మాసాల తర్వాత రిపోర్టు చూస్తాము. ఏ స్థానం నుండీ ఏ రిపోర్టూ రాకూడదు. ఒకరికొకరు వైబ్రేషను ఇచ్చి ఇముడ్చుకోండి అంతేకాక ప్రేమతో వైబ్రేషన్లను ఇవ్వండి. పోట్లాడుకోకండి.

డబుల్ విదేశీయులు కూడా ఇలాగే రిజల్ట్ ఇస్తారు కదా! అందరూ తయారవ్వాల్సిందే కదా. డబల్ విదేశీయులు తమ సెంటర్లలో, తోటివాళ్ళతో కలిసి 3 నెలల రిజల్ట్ తీస్తామని భావించేవారు చేతులెత్తండి. ప్రయత్నిస్తాము మాట ఇవ్వలేకపోతున్నాము అనేవారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారు! స్వచ్ఛమైన హృదయం గలవారికి సహాయం లభిస్తుంది. మంచిది.

నలువైపులా ఉన్న స్వరాజ్య అధికారి ఆత్మలకు, సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు, సదా తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునే వారికి, తండ్రిని ఫాలో చేసే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా ఒకరికొకరు శుభభావన, శుభకామనల సహయోగమిచ్చే శుభ చింతక పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే, 

దాదీలతో :- నిమిత్తంగా అయిన మీ ఆత్మలలో తీవ్ర పురుషార్ధం చేయాలనే సంకల్పం ప్రత్యక్షంగా ఉంటుంది. అది ఇతరులకు కూడా బలాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంది. బలహీన ఆత్మలలో బలాన్ని నింపుతూ ఉంది మరియు అందరూ క్రొత్త ఉత్సాహము తీసుకొని వెళ్తున్నారు. ఏమి జరిగినా, కొంచెం గడబిడ జరుగుతుంది కానీ తమ పురుషార్థపు ఉత్సాహాన్ని మెజారిటీ పిల్లలు తీసుకెళ్తారు. అందువలన నెమ్మది - నెమ్మదిగా అన్నీ మంచిగా జరుగుతున్నాయి, జరిగిపోతాయి. తగ్గిపోదు, వృద్ది చెందుతూ పోతుంది. బాగుంది. బ్రహ్మబాబాకు సాథీ పిల్లలు, తోడు బాగా నిభాయిస్తున్నారు. తక్కువగా లేరు. తోడు నిభాయించడంలో మంచి పాత్రను అభినయిస్తున్నారు. కావున బాప్ దాదా ఇరువురూ తోడు నిభాయించే సాథీ పిల్లలకు మాటి మాటికి శుభాకాంక్షలేం తెలుపుతారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. మంచి పాత్రను అభినయిస్తూ ఉన్నారు. సాకారంలో స్థంభాలుగా అయ్యారు. తమ ఆధారంతోనే అందరూ నడుస్తున్నారు. అందువలన మీది సహజ పురుషార్థము. ఆశీర్వాదాలతో తమ ఖాతా చాలా చాలా వృద్ధి చెందుతూ ఉంది. మంచిది.

Comments