* 15-02-2000 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మనస్సును స్వచ్ఛముగా, బుద్ధిని స్పష్టముగా ఉంచుకొని డబుల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకోండి.
ఈరోజు బాప్ దాదా తమ స్వరాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. స్వరాజ్యము బ్రాహ్మణ జీవితము యొక్క జన్మసిద్ధ అధికారము. బాప్ దాదా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరినీ స్వరాజ్య సింహాసనానికి అధికారులుగా చేసేసారు. స్వరాజ్య అధికారము జన్మతోనే బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరికీ ప్రాప్తించింది. ఎంతగా స్వరాజ్యములో స్థితులై ఉంటారో అంతగానే స్వయములో ప్రకాశమును మరియు శక్తిని అనుభవం చేసుకుంటారు.
బాప్ దాదా ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకము పైనా ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. ఎంతగా స్వయములో శక్తిని ధారణ చేసారో అంతగానే నెంబర్ వారీగా, ప్రకాశ కిరీటము మెరుస్తూ ఉంటుంది. బాప్ దాదా పిల్లలందరికీ సర్వశక్తులనూ అధికారముగా ఇచ్చేసారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే కానీ ధారణ చేయడంలో నెంబర్ వారీగా అయిపోయారు. సర్వశక్తుల యొక్క జ్ఞానము కూడా అందరిలోనూ ఉంది. అలాగే ధారణ కూడా ఉంది. కానీ ఒక్క విషయములో తేడా ఏర్పడుతోందని బాప్ దాదా గమనించారు. ఏ బ్రాహ్మణ ఆత్మనైనా అడగండి - ప్రతి ఒక్క శక్తిని గూర్చి ఎంతో బాగా వర్ణన చేస్తారు, అలాగే ప్రాప్తి యొక్క వర్ణనను కూడా చాలా బాగా చేస్తారు కానీ తేడా ఏమిటంటే సమయం వచ్చినపుడు ఏ శక్తి యొక్క అవసరమైతే ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తిని కార్యములో వినియోగించలేకపోతారు. సమయం గతించిన తర్వాత ఈ శక్తి యొక్క అవసరం ఏర్పడింది అని అనుభవం చేసుకుంటారు. సర్వశక్తుల యొక్క వారసత్వము ఎంతటి శక్తివంతమైనదంటే, దాని వల్ల ఎటువంటి సమస్య అయినా అది మీ ముందు నిలువజాలదు, సమస్యాముక్తులుగా అవ్వగలుగుతారు అని బాప్ దాదా పిల్లలకు చెబుతారు. కేవలం సర్వశక్తులను ఎమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకోండి మరియు సమయానుసారముగా వాటిని కార్యములో వినియోగించండి. ఇందుకొరకు మీ బుద్ధిరూపీ లైన్ ను క్లియర్ గా ఉంచుకోండి, బుద్ధి యొక్క లైన్ ఎంతగా క్లియర్ గా ఉంటుందో మరియు స్వచ్ఛముగా ఉంటుందో అంతగానే నిర్ణయ శక్తి తీవ్రముగా ఉన్న కారణముగా ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటే ఆ శక్తిని కార్యములో వినియోగించగలుగుతారు. ఎందుకంటే సమయానుసారముగా బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా శ్రమతో కూడుకున్న పురుషార్ధము నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. అందరూ అలా తయారవ్వవలసిందే, కానీ ఈ అభ్యాసం ఎంతోకాలం ఉండడం అవసరం. బ్రహ్మా బాబా యొక్క విశేష సంస్కారాన్ని చూసారు కదా! 'త్వరిత దానం మహాపుణ్యం'. జీవితం యొక్క ప్రారంభం నుండి ప్రతి కార్యములోనూ వెంటనే దానమూ చేసారు, వెంటనే పనీ చేసారు. బ్రహ్మా బాబా యొక్క విశేషత - నిర్ణయ శక్తి చాలా వేగముగా ఉండేది. కావున బాప్ దాదా ఈ రోజు రిజల్టు చూసారు. అందరినీ తోడుగా తీసుకొని వెళ్ళవలసిందే. అందరూ బాప్ దాదాతో పాటు వెళ్ళే వారే కదా, లేక వెనుక, వెనుక వచ్చేవారా? తోడుగా వెళ్ళవలసిందే, కావున బ్రహ్మాబాబాను అనుసరించండి. కర్మలో బ్రహ్మా బాబాను అనుసరించండి మరియు స్థితిలో నిరాకార శివబాబాను అనుసరించాలి. అనుసరించడం వస్తుంది కదా?
డబుల్ విదేశీయులకు అనుసరించడం వస్తుందా? అనుసరించడమైతే సహజమే కదా! అనుసరించవలసినపుడు మరి ఎందుకు? ఏమిటి? ఎలా?... అనేవి సమాప్తమైపోతాయి. వ్యర్ధ సంకల్పాలకు ఈ ఎందుకు? ఏమిటి? ఎలా?... అనేవే ఆధారమవుతాయని అందరికీ అనుభవం కూడా ఉంది. బాబాను అనుసరించడంలో ఈ పదాలు సమాప్తమైపోతాయి. ఎలా? అన్నది ఇలా...గా అవుతుంది. బుద్ధి వెంటనే ఇలా నడుచుకోండి, ఇలా చేయండి అని నిర్ణయిస్తుంది. కావున బాప్ దాదా ఈ రోజు విశేషముగా పిల్లలందరికీ మొదటిసారి వచ్చినవారికైనా లేక పాతవారికైనా అందరికీ మీ మనస్సును స్వచ్ఛముగా ఉంచుకోండి అని సూచనను ఇస్తున్నారు. చాలామంది మనస్సులలో ఇప్పుడు కూడా వ్యర్థము మరియు నెగిటివ్ ఆలోచనల యొక్క మచ్చలు ఉన్నవి. పెద్దవి ఉన్నాయి. ఈ కారణముగానే పురుషార్ధము యొక్క శ్రేష్ట వేగములో, తీవ్రగతిలో అవరోధము ఏర్పడుతుంది. మనసులో సదా ప్రతి ఆత్మపై శుభభావనను మరియు శుభకామనను ఉంచండి. ఇదే స్వచ్ఛమైన మనస్సు అని బాప్ దాదా సదా శ్రీమతమును ఇస్తారు. అపకారులపై కూడా ఉపకార వృత్తిని ఉంచడమే స్వచమైన మనస్సు. స్వయం పైనా లేక అన్యుల పైనా వ్యర్థసంకల్పాలు రావడం స్వచ్ఛమైన మనస్సు యొక్క లక్షణము కాదు. కావున స్వచ్ఛమైన మనస్సును మరియు శుభ్రమైన, స్పష్టమైన బుద్ధిని ఉంచండి. పరిశీలించండి. మిమ్మల్ని మీరు ధ్యానముగా చూసుకోండి. పైపైన కాదు, బాగున్నాములే అని భావించడం కాదు. మనసు మరియు బుద్ధి స్పష్టముగా ఉందా, శ్రేష్ఠముగా ఉందా అని ఆలోచిస్తూ పరిశీలించండి. అప్పుడు డబుల్ లైట్ స్థితిని తయారుచేసుకోగలుగుతారు. బాబా సమానమైన స్థితిని తయారుచేసుకునేందుకు ఇదే సహజమైన సాధనము మరియు ఆ అభ్యాసము అంతిమంలో కాదు. ఎంతోకాలంగా ఉండడం అవసరం. మరి మీకు పరిశీలించడం వస్తుందా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇతరులను పరిశీలించడం కాదు. బాప్ దాదా ఇంతకుముందు కూడా నవ్వు కలిగించే విషయాన్ని ఒకటి చెప్పారు. పిల్లల దూరదృష్టి చాలా తీవ్రముగా ఉంది మరియు సమీప దృష్టి బలహీనంగా ఉంది. కావున ఇతరులను గూర్చి నిర్ణయించడంలో చాలా చురుకుగా ఉన్నారు. స్వయాన్ని పరిశీలించుకోవడంలో బలహీనంగా అవ్వకండి.
నేను బ్రహ్మాకుమారుడిని లేక బ్రహ్మాకుమారిని అని ఏ విధంగా ఇప్పుడు పక్కా అయిపోయిందో, నడుస్తూ, తిరుగుతూ మేము బ్రహ్మాకుమారీలము లేక బ్రహ్మాకుమారులము లేక బ్రాహ్మణ ఆత్మలము అని ఏ విధంగా పక్కా అయిపోయిందో అలాగే ఇప్పుడు 'నేను ఫరిస్తాను' అన్నది కూడా సహజ స్మృతిగా మరియు స్వభావంగా చేసుకోండి. అమృతవేళ లేస్తూనే ఫరిస్తానైన నేను పరమాత్మ యొక్క శ్రీమతానుసారముగా కిందకు ఈ సాకార తనువులోకి అందరికీ సందేశమును ఇచ్చేందుకు లేక శ్రేష్ఠ కర్మను చేసేందుకు వచ్చాను అన్నది పక్కా చేసుకోండి. కార్యము పూర్తి అవడంతోనే మీ శాంత స్థితిలో స్థితులైపోండి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోండి. పరస్పరం ఒకరినొకరు ఫరిస్తా స్వరూపములో చూడండి. మీ యొక్క వృత్తి మెల్లమెల్లగా ఇతరులను కూడా ఫరిస్తాలుగా చేసేస్తుంది. మీ దృష్టి ఇతరులపైన కూడా ప్రభావాన్ని కలిగిస్తుంది. మేము ఫరిస్తాలము అన్నది పక్కాగా ఉందా? ఫరిస్తాభవ అనే వరదానము అందరికీ లభించిందా? ఒక్క క్షణములో ఫరిస్తాలుగా అనగా డబుల్ లైట్ గా అవ్వగలరా? ఒక్క క్షణములో, నిమిషం కూడా కాదు. ఒక్క క్షణములో ఆలోచించగానే అలా అయిపోవాలి. అటువంటి అభ్యాసం ఉందా? అచ్చా! ఎవరైతే ఒక్క క్షణములో అలా అవ్వగలరో, ఒక్క నిముషములో, 10 సెకండ్లలో కూడా కాదు. ఒక్క క్షణములో అలా అనుకోగానే అవ్వగలగాలి. అటువంటి అభ్యాసం ఉందా? అచ్చా ఎవరైతే ఒక్క క్షణములో డబుల్ లైట్ గా అవ్వగలరో రెండు, మూడు క్షణాలలో కూడా కాదు, ఒక్క క్షణములో ఎవరైతే అవ్వగలరో వారు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అలా అవ్వగలరా? ఏదో అలా నామమాత్రంగా చేతులు ఎత్తేయకండి. డబుల్ విదేశీయులు చేతులు ఎత్తడం లేదు. సమయం పడుతోందా? అచ్చా! ఎవరైతే కొద్దిగా సమయం పడుతుంది, ఒక్క క్షణములో అవ్వలేము, కాస్త సమయం పడుతుంది అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. (చాలా మంది చేతులు ఎత్తారు) బాగుంది. కానీ చివరి ఘడియలో వచ్చే పేపర్ ఒక్క క్షణములోనే రానున్నది. మరి అప్పుడేమి చేస్తారు? అది అకస్మాత్తుగా వస్తుంది మరియు ఒక్క క్షణములో వస్తుంది. చేతులు ఎత్తారు, పర్వాలేదు. కనీసం అలా భావించారు. అది కూడా చాలా మంచిదే కానీ ఈ అభ్యాసమునైతే చేసి తీరవలసిందే. చేయవలసిందేనా? అని భావించడం కాదు, చేసి తీరాలి అని భావించాలి. ఈ అభ్యాసము చాలా అవసరం. పోనీ బాప్ దాదా కొంత సమయం ఇస్తారు. మీకు ఎంత సమయం కావాలి? 2,000 సంవత్సరాల వరకూ కావాలా? 21వ శతాబ్దమును గూర్చి మీరు ఛాలెంజ్ చేసారు, ఢంకా మోగించారు. గుర్తుందా? ఏమని ఛాలెంజ్ చేసారు? స్వర్ణయుగ ప్రపంచం వస్తుంది లేక ఆ వాతావరణాన్ని తయారుచేస్తాము అని ఛాలెంజ్ చేసారు కదా! కావున అంతవరకూ అయితే ఇంకా ఎంతో సమయం ఉంది. స్వయంపై ఎంత అటెన్షన్ ను ఉంచగలిగితే అంత ఉంచండి. ఉంచగలిగితే అని కూడా కాదు, ఉంచవలసిందే. దేహాభిమానంలోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? రెండు క్షణాలా? ఇష్టం లేకపోయినా కూడా దేహ భావములోకి వచ్చేస్తారు. మరి అందుకు ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం పడుతుందా లేక దాని కన్నా కూడా తక్కువ సమయం పడుతుందా? దేహాభిమానంలోకి వచ్చేసాము అని తెలియను కూడా తెలియదు. అలాగే ఈ అభ్యాసం కూడా చేయండి. ఏమి జరుగుతున్నా, ఏమి చేస్తున్నా నేను ఆత్మాభిమానములో ఉన్నాను అన్నది సహజమైపోవాలి. శక్తిశాలి స్థితిలో సహజంగా ఉండాలి. ఫరిస్తా స్థితి కూడా సహజముగా ఉండాలి. ఎంతగా మీ స్వభావాన్ని ఫరిస్తా స్వరూపముగా తయారుచేసుకుంటారో అంతగా మీ స్వభావము మీ స్థితిని సహజముగా చేసేస్తుంది. మరి బాప్ దాదా ఎంత సమయం తర్వాత ఇది అడుగవచ్చు? మీకు ఎంత సమయం కావాలి? జయంతి - ఎంత సమయం కావాలో చెప్పు. విదేశీయుల తరఫున నీవు చెప్పు. విదేశీయులకు ఎంత సమయం కావాలో చెప్పండి. జనక్ - నీవు చెప్పు (ఈరోజే అవ్వాలి, రేపు కాదు అని దాదీ అన్నారు). ఈ రోజు ది ఈ రోజే అయినట్లయితే ఇప్పుడు అందరూ ఫరిస్తాలుగా అయిపోయారా? అయిపోతాము అని కాదు. అయిపోతాము అని అన్నట్లయితే అది ఎప్పటివరకు? ఈరోజు బాప్ దాదా బ్రహ్మా బాబా యొక్క ఏ సంస్కారమును గూర్చి తెలియజేసారు? త్వరితదానము మహాపుణ్యము.
బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపైననూ ప్రేమ ఉంది, కావున పిల్లలు ఒక్కరు కూడా తక్కువగా ఉండకూడదు అని భావిస్తారు. నెంబర్ వారీగా ఎందుకు ఉండాలి? అందరూ నెంబర్ వన్‌గా అయిపోతే ఎంత బాగుంటుంది? అచ్చా - ఈ రోజు చాలా గ్రూపుల వారు వచ్చారు.
ప్రశాశక విభాగం (అడ్మినిస్ట్రేషన్ వింగ్): పరస్పరం కలుసుకొని ఏమి ప్రోగ్రాం తయారుచేసారు? త్వరత్వరగా శ్రేష్ఠ ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యము వచ్చేసేలా అటువంటి తీవ్రపురుషార్ధము యొక్క ప్లాన్‌ను తయారుచేసారా? విశ్వపరివర్తన చేయాలంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్నంతా మార్చవలసి ఉంటుంది కదా! ఈ కార్యము సహజముగా వృద్ధినొందుతూ ఉండాలి, వ్యాపిస్తూ ఉండాలి అన్నది ఆలోచించారా? కనీసం పెద్ద, పెద్ద నగరాలలో ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా సందేశమును ఇచ్చే ప్లాన్‌ను తయారుచేసారా? కనీసం తక్కువలో తక్కువ ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారానే పరివర్తన జరుగగలదు మరియు జరగాలి అన్నదైనా అర్ధం చేసుకోగలగాలి. కావున మీ వర్గాన్ని మేల్కొలపండి. అందుకనే ఈ వర్గాలు తయారుచేయబడ్డాయి. కావున బాప్ దాదా వర్గాలవారి యొక్క సేవను చూసి సంతోషిస్తున్నారు కానీ ప్రతి వర్గం వారూ తమ తమ వర్గం వారికి ఎంతవరకూ సందేశమును ఇచ్చారు అన్న రిజల్టును ఇంకా చూడాలి. ఎంతో కొంత మేల్కొలిపారు కానీ తోటివారిగా తయారుచేసారా? సహయోగులుగా, తోటివారిగా చేసారా? బ్రహ్మాకుమారులుగా చేయలేకపోయినా సహయోగులుగా, తోటివారిగా తయారుచేసారా? ఏవిధంగా ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో, వారు నెంబర్ వన్ వారు కాకపోయినా అందరూ ఒక స్టేజి పైన అయితే కలిసారు మరియు అందరి నోటి నుండి, మనమందరమూ కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపజేయాలి అని అయితే వెలువడింది. అలాగే ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో వారందరు తమ వర్గం వారిలోకి సందేశం ఎంతవరకూ చేరుకుంది అన్న రిజల్టును తీయాలి. ఇంకొకటి ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది మరియు అందులో మనం కూడా సహయోగులుగా అవ్వాలి అన్న రిజల్టు ఉండాలి. రెగ్యులర్ విద్యార్ధులుగా అవ్వరు కానీ సహయోగులుగా అవ్వగలుగుతారు. కావున ఇప్పటివరకూ ప్రతి వర్గం వారి యొక్క సేవనేదైతే చేసారో ఏ విధంగా ఇప్పుడు ధర్మనేతలను పిలిచారో అలాగే ప్రతి దేశము నుండి ప్రతి వర్గం వారి యొక్క కార్యక్రమాన్ని జరపండి. మొదట భారతదేశంలోనే చేయండి. ఆ తర్వాత అంతర్జాతీయంగా చేయండి. ప్రతి వర్గం యొక్క భిన్న భిన్న స్టేట్ల వారు కలవాలి మరియు మేము సహయోగులుగా అవ్వాలి అన్నది అనుభవం చేసుకోవాలి. ప్రతి వర్గం యొక్క రిజల్టు ఇప్పటివరకూ ఎంతగా వెలువడింది? ఇంకా ముందు, ముందు ప్లాన్ ఏమిటి? ఎందుకంటే ఒక్కొక్క వర్గం వారు లక్ష్యం ఉంచి ఒక్కొక్కరిని సమీపముగా తీసుకువచ్చినట్లయితే అన్ని వర్గాల యొక్క సమీప సహయోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంఘటనను చేసి పెద్ద సంఘటనను తయారుచేయవచ్చు మరియు ఒకరినొకరు చూసుకుంటూ ఉల్లాస, ఉత్సాహాలు కూడా వస్తాయి. ఇప్పుడు చెల్లాచెదురై ఉన్నారు. ఒక నగరంలో కొందరు, ఇంకొక నగరంలో ఇంకొందరు ఉన్నారు. మంచి, మంచివారు కూడా ఉన్నారు కానీ మొదట అందరి యొక్క సంఘటనను ఒకచోటికి చేర్చండి, ఆ తర్వాత అందరినీ కలిపి వారి కార్యక్రమాన్ని మధువనములో జరుపుదాము. అటువంటి ప్లాన్ నేదైనా చేసారా? తప్పకుండా అటువంటిది చేసే ఉంటారు. చెల్లాచెదురై ఉన్నవారు ఎందరో ఉన్నారని విదేశీయులకు కూడా సందేశం పంపబడింది. భారతదేశంలో కూడా మంచి మంచి సహయోగీ ఆత్మలు అనేకస్థానాలలో వెలువడ్డారు, కానీ వారు గుప్తముగానే ఉండిపోతారు. వారందరినీ కలిపి విశేషముగా ఏదైనా కార్యక్రమాన్ని జరిపి అనుభవాలను పంచుకున్నట్లయితే అందులో తేడా ఏర్పడుతుంది, సమీపముగా వచ్చేస్తారు. ఒకవర్గములో ఐదుగురు, ఇంకొకవర్గంలో ఎనిమిది మంది ఉంటారు. కొన్ని వర్గాలలో 25-30 మంది కూడా ఉంటారు. వారు సంఘటనలోకి వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతారు. ఉల్లాస, ఉత్సాహాలు పెరుగుతాయి. కావున ఇప్పటివరకూ అన్నివర్గాల యొక్క సేవలేవైతే జరిగాయో వాటి యొక్క రిజల్టు వెలువడాలి. విన్నారా? అన్నివర్గాల వారు వింటున్నారు కదా! వివిధవర్గాల వారు ఎవరైతే ఈ రోజు విశేషముగా వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు, కావున ఇప్పుడు ఎంతెంతమంది ఉన్నారో, ఎవరెవరు మరియు ఎంత శాతములో సమీప సహయోగులుగా ఉన్నారో రిజల్టు ఇవ్వండి. ఆ తర్వాత వారి కొరకు రమణీయమైన కార్యక్రమాన్ని జరుపుదాము. సరేనా?
మధువనం వారు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండాలనుకుంటున్నారా? బిజీగానే ఉండాలనుకుంటున్నారు కదా! లేక అలసిపోతున్నారా? మధ్యమధ్యలో 15 రోజుల సెలవు కూడా ఉంటుంది మరియు ఉండాలి కూడా. కానీ ప్రోగ్రాం వెనుక ప్రోగ్రాం, ఇలా లిస్ట్ లో ఉండాలి. అప్పుడే ఉల్లాస, ఉత్సాహాలు ఉంటాయి. లేకపోతే సేవ లేనప్పుడు దాదీ ఒక కంప్లయింట్ ఇస్తారు. ఆ కంప్లయింట్ ఏమిటో చెప్పాలా? అందరూ తమ, తమ ఊళ్ళకు వెళతాము, అలా చుట్టి వస్తాము, సేవ కొరకు కూడా అలా చుట్టూ తిరిగి వస్తాము అని అంటారు. కావున బిజీగా ఉంచడమే మంచిది. బిజీగా ఉన్నట్లయితే గొడవలు కూడా ఉండవు. మధువనం వారిలోని ఒక విశేషతపై బాప్ దాదా కోటానురెట్ల అభినందనలు చెబుతారు. 100 రెట్లు కూడా కాదు, కోటానురెట్లు. ఏ విషయంపై? ఎవరు వచ్చినా మధువనం వారిలో సేవ యొక్క ఎటువంటి లగనం ఉంటుందంటే, లోపల ఏమి ఉన్నా కానీ అదంతా దాగిపోతుంది. అందరూ అవ్యక్తంగా కనిపిస్తారు, అలసట లేనివారిగా కనిపిస్తారు. ఇక్కడ అందరూ ఫరిస్తాలుగా అనిపిస్తున్నారు అని అందరూ రిమార్క్ వ్రాసి వెళతారు. కావున ఈ విశేషత చాలా బాగుంది. ఆ సమయంలో విశేషమైన విల్ పవర్ వచ్చేస్తుంది, సేవ యొక్క ప్రకాశము వచ్చేస్తుంది. కావున ఈ సర్టిఫికెట్‌ను బాప్ దాదా ఇస్తున్నారు. అభినందన యోగ్యమే కదా! మరి మధువనం వారు చప్పట్లయినా కొట్టండి! చాలా బాగుంది. ఆ సమయంలో బాప్ దాదా కూడా చూసేందుకు వస్తారు. కానీ మీకు అది తెలియదు. బాబా చుట్టూ తిరిగి చూసేందుకు వస్తారు కావున మధువనం వారి యొక్క విశేషత ఇంకా ముందుకు వెళుతూ ఉంటుంది, అచ్ఛా!
మీడియా వింగ్: ఫారిన్లో కూడా మీడియా వారిది ప్రారంభమయ్యింది కదా! మీడియాలో ఇప్పుడు బాగా కష్టపడడం బాప్ దాదా గమనించారు. వార్తాపత్రికల్లో వెలువడడం ప్రారంభమయ్యింది మరియు ప్రేమగా కూడా వేస్తున్నారు. కావున మీ శ్రమకు ఫలితం లభిస్తోంది. ఇప్పుడు ఇంకా విశేషముగా వార్తాపత్రికల్లో రావాలి. టి.వి.లో ఎవరో ఒకరు పర్మినెంట్ గా కొద్ది సమయమైనా ఇచ్చేసారు కదా! దానితో రోజూ వస్తోంది కదా! కావున ఈ ప్రోగ్రెస్ బాగుంది. వినేందుకు అందరికీ ఎంతో నచ్చుతుంది. అలాగే వార్తాపత్రికల్లో కూడా విశేషముగా వారంలో ఒకరోజు కానీ లేక రోజూ కానీ లేక ప్రతి మరుసటిరోజు కానీ ఏదో ఒక చిన్న స్థానం నిశ్చితమవ్వాలి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచే అవకాశము అని వెలువడాలి. ఇటువంటి పురుషార్ధము చేయండి. సఫలత బాగుంది. సంబంధాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిక వార్తాపత్రికల యొక్క అద్భుతమునేదైనా చేసి చూపించండి, చేయగలరా? గ్రూప్ వారు చేయగలరా? చేతులు ఎత్తండి - తప్పక చేస్తాము. ఉల్లాస, ఉత్సాహాలు ఉన్నట్లయితే సఫలత తప్పకుండా ఉంటుంది. అది ఎందుకు జరుగజాలదు! చివరికి ఆ సమయము వస్తుంది, అన్ని సాధనాలూ మీ వైపు నుండి ఉపయోగపడతాయి. మీకు ఆఫర్ చేస్తారు. ఏదో ఒకటి ఇవ్వండి, సహాయం తీసుకోండి అని ఆఫర్ చేస్తారు. ఇప్పుడు సహయోగులుగా అవ్వండి అని మీరు అనవలసి వస్తోంది. కానీ తర్వాత మమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని వారు అనడము మొదలుపెడతారు. కేవలం ఫరిస్తా, ఫరిస్తా, ఫరిస్తా అన్న విషయాన్ని పక్కాగా ఉంచుకోండి. ఆ తర్వాత మీ పని ఎంత త్వరగా అయిపోతుందో చూడండి. వెంట పడవలసిన అవసరం ఉండదు. నీడ వలే వారే మీ వెనుక వస్తారు కానీ కేవలం మీ స్థితి ఆగి ఉన్న కారణముగా అదీ ఆగి ఉంది. మీరు ఎవర్రెడీగా అయిపోయినట్లయితే కేవలం స్విచ్ ను నొక్కడమే ఆలస్యం. అంతే! బాగా చేస్తున్నారు. ఇంకా చేస్తారు
స్పార్క్ గ్రూప్ - ఇది చాలా పెద్ద గ్రూప్. స్పార్క్ వారు రీసెర్చ్ చేస్తారు కదా! ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష అనుభవమును కలిగిస్తుందో, వేడిగా ఉంటే సైన్స్ యొక్క సాధనాలు శీతలతను ప్రత్యక్షముగా అనుభవం చేయిస్తాయి. అలాగే రీసెర్చ్ వారు కూడా బాబా యొక్క లేక ఆత్మ యొక్క విశేషతలైన జ్ఞానస్వరూపము, శాంతిస్వరూపము, ఆనంద స్వరూపము, శక్తి స్వరూపము... మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ విశేషతల యొక్క ప్రత్యక్ష అనుభవం ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుందో అనుభవము కలిగించే విధంగా అటువంటి విశేషమైన ప్లాన్‌ను తయారుచేయాలి. ఎవరైనా అనుభవము చేసుకోవాలనుకుంటే కొద్ది సమయంలో శాంతి అని దీనినే అంటారో అనుభవం చేసుకోగలిగేలా అటువంటి సహజసాధనమును ఏదైనా కనుగొనండి. ఒక్క క్షణము లేక రెండు క్షణాలైనా అనుభవము చేసుకోగలిగే విధిని కనుగొనండి. ఒక్క క్షణమైనా ఎవరికైనా అనుభవం అయినట్లయితే ఆ అనుభవము ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటువంటి ఇన్వెన్షన్ను ఏదైనా కనుగొనండి. మీ ముందుకు రావాలి మరియు ఏ విశేషతను అనుభవం చేసుకోవాలనుకుంటే ఆ విశేషతను అనుభవం చేసుకోగలగాలి. భిన్న, భిన్న స్థితులు ఎలా ఉంటాయో, సాధన చేసే సాధువులు వారికి ఏ విధంగా అనుభవం చేయిస్తారో - చక్రము నాభి నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పైకి వెళుతుంది. ఆ తర్వాత పైకి వెళ్ళాక ఏ అనుభూతి కలుగుతుంది... అనేవి వారు ఏ విధంగా ప్రత్యక్షముగా అనుభవం చేయిస్తారో అలా మీరూ విధిపూర్వకముగా మనస్సు మరియు బుద్ధి ద్వారా వారికి అనుభవం కలిగించండి. కూర్చోబెట్టి లైట్‌ను చూపించండం కాదు, లైట్ యొక్క అనుభవాన్ని కలిగించండి. రీసెర్చ్ యొక్క అర్ధమే ప్రత్యక్ష విధి ద్వారా అనుభవం కలిగించడం మరియు అనుభవం పొందడం. కావున ఇటువంటి ప్లాన్ ను తయారుచేసి ప్రత్యక్షముగా దీని యొక్క విధిని తయారుచేయండి. యోగ శిబిరము యొక్క విది వెలువడినట్లుగా, అల్పకాలికముగా యోగ శిబిరములోకి ఎవరు వచ్చినా వారు ఆ సమయంలో అనుభవమైతే పొందుతారు కదా! మరియు వారికి ఆ అనుభవం గుర్తు కూడా ఉంటుంది. అలా ఏదో ఒక గుణము, ఏదో ఒక శక్తి, ఏదో ఒక అనాది సంస్కారము వాటి యొక్క అనుభూతి కలిగించండి. కావున రీసెర్చ్ వారు ఇటువంటి అనుభూతిని మొదట వారు స్వయం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత విధిని తయారుచేయండి మరియు ఇతరులకు అనుభూతి చేయించండి. ఈ రోజుల్లో మనుష్యులకు భక్తిలో ఏ విధంగా చమత్కారాలు కావాలో శ్రమ లేకుండా చమత్కారాలు కావాలో అలా ఆధ్యాత్మిక రూపంలో వారికి అనుభూతి కావాలి. అనుభవజ్ఞులు ఎప్పుడూ మారరు. త్వరత్వరగా అనుభవం యొక్క ఆధారముతో ముందుకు వెళుతూ ఉంటారు. విన్నారా? ఇప్పుడు కొత్త, కొత్త విధులను కనుగొనండి. మీరు చెబుతూ ఉంటే వారు అనుభవం చేసుకుంటూ ఉండాలి. అందుకొరకు చాలా శక్తి శాలీ అభ్యాసమును చేయవలసి ఉంటుంది.
సమాజ సేవా విభాగము(సోషల్ వింగ్):- పాడైన దానిని ప్రాక్టికల్ గా బాగు చేయడం వీరి యొక్క కార్యము. వారు ఊళ్ళను మారుస్తారు. పరివారాలను మారుస్తారు. పరివారంలోని సమస్యలను సమాప్తం చేసి చూపిస్తారు... కానీ వారివి అల్పకాలికమైనవి. ఇంతకుముందు దు:ఖితమైన పరివారాలుగా ఉన్నవారు పరివర్తన చెంది సుఖవంతులుగా అయిపోయిన ఇటువంటి ఉదాహరణలను సోషల్ వింగ్ వారు చూపించాలి. అటువంటి పరివారాలైతే ఇక్కడకు ఎందరో వస్తారు. కావున గవర్నమెంట్ వారి ముందు ప్రత్యక్ష ఉదాహరణలను చూపించాలి. ఇన్ని పరివారాలు మారి ఏమి అనుభవం చేసుకుంటున్నాయి అన్నది ప్రభుత్వం వారి ముందుకు తీసుకురావాలి. ఇటువంటి పరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఏదైనా స్టేజి పైకి తీసుకురండి. సందేశాలు అయితే ఇస్తున్నారు. కార్యాలైతే చేస్తున్నారు కానీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా సామాజికవర్గం ఏమేమి చేయగలదో, ఏమేమి చేస్తోందో గవర్నమెంట్ వారి కనుల ముందుకు రావాలి. పార్క్ లను గూర్చి వినిపించారు కదా! (బాంబేలోని పార్కులు) ఎంతటి సేవ జరుగుతోంది! ఎంతమంది పిల్లలకు విశ్రాంతి లభిస్తోంది! ఈ రిజల్టు గవర్నమెంట్ వారి ముందుకు రావాలి. కావున సామాజిక వర్గం వారి నేతలు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు ఈ రిజల్టు రావాలి. లిస్టు వ్రాసినట్లయితే ముఖ్య ముఖ్య పరివారాల యొక్క లిస్టు ఎన్నో వెలువడగలవు. ఇక్కడ అంతా ప్రాక్టికల్ గా ఉంది. ఆ సమాజ సేవకులు ఏమి చేస్తారు? వస్త్రాలు పంచుతారు, డబ్బు సహాయం చేస్తారు... కానీ మీరు పరివారాలలో ఏ సంతుష్టతనైతే తీసుకువస్తారో దాని ద్వారా వారి యొక్క ఎకానమీ కూడా బాగా జరుగుతుంది. వస్త్రాల కోసం, అన్నపానాదుల కోసం ఏ కష్టాలైతే ఉన్నాయో అవి సమాప్తమైపోతాయి. ఎంతో విశ్రాంతిగా ఉంటారు. కొద్దిలో కూడా ఎంతో సుఖంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కావున వారు ఏదైతే చేస్తారో దానిని పోల్చి అలౌకిక రూపంలో మీరు ఏమి చేస్తున్నారో అది తెలియజేయండి మరియు ఇలా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి, మేము ఏమి చేస్తున్నామో చూడండి అని చెప్పండి. అప్పుడు గవర్నమెంట్ యొక్క దృష్టిలోకి రావడంతో గవర్నమెంట్ వారు ఎవరైనా వస్తే దాని ప్రచారం కూడా సహజమైపోతుంది. మీరు ప్రెస్ వారిని పిలిస్తే కొద్దిమందే వస్తారు కానీ వారు పిలిస్తే వారి వెనుక వచ్చేస్తారు... కావున ఈ విధంగా అందరికీ మీరు ఏమి చేస్తున్నారో ప్రత్యక్షమైన ఉదాహరణలను చూపించండి. నిజానికి మీరు ఎంతో చేస్తున్నారు కానీ గుప్తముగా ఉన్నారు, అచ్ఛా!
రాజకీయవేత్తల సేవా విభాగం:- పొలిటీషియన్ వింగ్ వారు కూడా తమ, తమ స్థానాల వారి యొక్క సేవను చేస్తూనే ఉన్నారు. సేవ చేస్తున్నారు మరియు అది జరుగుతూనే ఉంటుంది. పోలిటీషియన్ వారు విశేషంగా విశేష ధ్యానమును ఉంచాలి. హైదరాబాద్ లో చీఫ్ మినిస్టర్ ప్రభావితమైన కారణముగా అక్కడి గవర్నమెంట్ యొక్క సేవ సహజముగా అవుతోంది అన్న సమాచారాన్ని విన్నారు కదా! అలాగే ప్రతి స్థానములోనూ ఇలా సంపర్కములోనివారు ఎవరో ఒకరు ఉన్నారు, వారిని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకురావచ్చు. ప్రతి ఒక్క నగరములోనూ తమ, తమ ప్రభుత్వాలలో ఎంతో కొంతమంది మంచివారు ఉన్నారు. కావున బాప్ దాదా హైదరాబాద్
(ముఖ్య మంత్రి) ఏ విధంగా విశేషముగా ఉన్నాడో, అతడి ద్వారా భిన్న భిన్న స్థానాలలో ఇటువంటి క్వాలిటీ ఏదైతే ముందుకు రాగలదో కాస్త వారి వెంట శ్రమించినట్లయితే అటువంటి క్వాలిటీ వెలువడగలదు అని బాప్ దాదా భావిస్తున్నారు. ఇటువంటి గ్రూపు ఒక దానిని తయారుచేయండి. వారు భిన్న, భిన్న నగరాలలో ఉన్నా వీరు సమీపముగా రాగలరు అని భావించే క్వాలిటీ వారందరినీ పిలువండి, ఆ తర్వాత ఆ హైదరాబాద్ (చీఫ్ మినిష్టర్‌ను) ఆ కార్యక్రమానికి పిలిచి ఇతరుల యొక్క సేవను చేయించండి. వారు ప్రత్యక్షముగా అతడి అనుభవాన్ని వినడం ద్వారా తామూ చేయవచ్చు అన్న ధైర్యాన్ని పొందుతారు. కావున ఇటువంటి గుంపును ముందు పోగు చేయండి. రిపోర్ట్ అయితే వస్తూ ఉంటుంది కదా! కావున ఇటువంటి గ్రూప్ ను తయారుచేసి ఆ తర్వాత వివిధ స్థానాలలో కొద్దిగా గవర్నమెంట్ లోకి వెళుతూ ఉన్నట్లయితే ఇక పెద్దవారి వద్దకు కూడా చేరుకుంటారు. ఎందుకంటే పెద్దవారికి ఖాళీ తక్కువగా ఉంటుంది. కానీ మధ్యలోనివారు రాగలరు. ఏ విధంగా ధర్మనేతలలో మధ్యలోనివారే వచ్చారు కదా! మొదటి నెంబర్ లోని వారు రాలేదు కానీ ఈ మధ్యలోని వారిద్వారా వారి వరకూ చేరుకోగలరు. ఇది దారి, కావున ఆ విధంగా మీరు కూడా అటువంటి గ్రూపును తయారుచేసి కొద్దిగా ముందుకు వెళుతూ ఉండండి. మీరు ఈ సమయంలో రాజ్యము మరియు ధర్మము రెండింటినీ స్థాపన చేస్తున్నారు. కావున రాజధాని వారు వంచితులుగా ఉండకూడదు కదా! ఎంతైనా వారు తోటివారే కదా! కావున ఇలా చేసి చూడండి, అచ్ఛా!
ధార్మిక సేవా విభాగం: - ధార్మికవర్గం వారు ఒక కార్యమునైతే చేసి చూపించారు. కానీ అది రిహార్సలే. రిహార్సల్ లో సఫలత లభించింది. అది బాగుంది. ఇప్పుడు ముఖ్యమైనవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కేవలం ఆధ్యాత్మిక శక్తి యొక్క మహత్వాన్ని తెలిపి ఆధ్యాత్మిక శక్తి ద్వారా తాము ఏమి చేయవచ్చో తెలియజేయండి. వాదోపవాదాలలోకి వెళ్ళకండి కానీ మొదట సమీపముగా రావాలి మరియు ఆధ్యాత్మిక శక్తి కలిసి ఏమి చేయగలదు? అన్న విషయము పైనే చర్చ జరగాలి. ఆధ్యాత్మిక శక్తిగల వారి యొక్క బాధ్యత ఎంతగా ఉందో ఆ అంశాన్ని తీసుకొని వారిని సమీపముగా తీసుకురండి మరియు సమీపముగా తీసుకువచ్చి మళ్ళీ సంపర్కములోకి తీసుకురండి, ఇక్కడకు ఆబూ వరకూ తీసుకురండి. అప్పుడు ఆబూ యొక్క ప్రవాహము, ప్రభావము తనకు తానుగానే వారిని ఆకర్షిస్తుంది. యాత్ర జరిపాము, నేతల యొక్క సమ్మేళనము జరిగింది, చాలా బాగుంది అని భావించకండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళుతూనే ఉండాలి.
రథయాత్రికులతో:- రథయాత్రికుల యొక్క స్వాగతం ఎంతో జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, రథయాత్రికుల కోసం అందరూ ఎంతగా చప్పట్లు కొట్టారు! అంతగా మళ్ళీ ఇతర గ్రూపుల్లో కొట్టలేదు. కావున చాలా బాగుంది, ఈ యాత్రకు వరదానం ఉంది. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. రథయాత్రికులకు విశేషంగా బాప్ దాదా ద్వారా వరదానాలు లభించాయి. ఒకటేమో నిర్విఘ్నముగా జరిగింది, ఎటువంటి విఘ్నమూ రాలేదు, రెండవది అందరూ ఆరోగ్యముగా ఉన్నారు. అనారోగ్యము యొక్క విఘ్నము కూడా రాలేదు. మూడవది విశేషముగా అందరిలో ఉల్లాస, ఉత్సాహాలు ఉన్న కారణముగా అలసట లేని వారిగా ఉన్నారు. కావున ఈ వరదానాన్ని ప్రత్యక్ష రూపములో అందరూ చూసారు మరియు అనుభవం చేసుకున్నారు. ఎక్కడైతే ఉల్లాస, ఉత్సాహాలు ఉంటాయో అక్కడ ఈ విషయాలన్నీ స్వతహాగానే ప్రాప్తమవుతాయి. కావున సఫలతా పూర్వకముగా అందరూ చేరుకున్నారు మరియు ఇప్పుడు కూడా శివరాత్రి యొక్క ఉత్సవములో ఈ రథాలు అటూ, ఇటూ వెళ్ళలేవు కానీ వీటి వీడియో ఫిలిం ఏదైతే వెలువడిందో ఆ స్థానములో ఈ వీడియో ఫిల్మ్ ద్వారా సేవ బాగా జరుగుతుంది. కావున మీ యాత్ర వీడియో లోకి వచ్చేసింది అనగా అమరమైపోయింది, నడుస్తూనే ఉంటుంది. బాగుంది, నిమిత్తముగా జగదీష్ ఇన్వెన్షన్ తీసాడు, అలాగే మొదటి నుండి ఇన్వెన్షన్ చేసే వరదానము ఉంది. ఇప్పుడు కూడా ఈ వరదానాన్ని ఇంకా పెంచుతూ ఉండాలి. బాగుంది, ఒక్కరి ఇన్వెన్షన్ ద్వారా అన్నివైపులా ఉల్లాస, ఉత్సాహాలు వచ్చేసాయి కావున ఇన్వెన్షన్ యొక్క అభినందనలు, అచ్ఛా!
విదేశీయుల ఇంటర్నేషనల్ సర్వీస్ గ్రూప్: - డబుల్ విదేశీయులు డబుల్ లాభాన్ని పొందడంలో తెలివైనవారు. మధువనము యొక్క రిఫ్రెష్ మెంట్ ను పొందారు మరియు సేవా ప్లాన్లు కూడా తయారయ్యాయి. కావున మంచి అవకాశాన్ని తీసుకుంటూ ఉంటారు. బాప్ దాదాకు కూడా సంఘటితరూపంలో కలిసి సేవ యొక్క ప్లాన్లను తయారుచేస్తే ఎంతో సంతోషము కలుగుతుంది. ఆ ప్లాన్ లో అన్ని వైపుల నుండీ నిమిత్తమైయున్న ఆత్మల యొక్క దృష్టి పడుతుంది, వైబ్రేషన్లు లభిస్తాయి. కావున ఆ ప్లాన్లో దీవెనలు నిండుతాయి మరియు నలువైపులా ఒకే విధమైన సేవా ప్లాన్ జరగడం ద్వారా నలువైపులా వ్యాపించిన శబ్దము ఎంతో పెద్దగా ప్రత్యక్షము చేస్తుంది. కావున ఇప్పుడు కూడా "కల్చర్ ఆఫ్ పీస్" యొక్క ప్లాన్‌ను తయారుచేస్తారు కదా! టాపిక్ బాగుంది. చూడండి! రెండు విధాలుగా ఈ టాపిక్ పై సేవ చేయవచ్చు. కల్చర్ పైనా చేయవచ్చు. పీస్ పైనా చేయవచ్చు. రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు. శాంతి యొక్క అనుభూతినైతే ఈ రోజుల్లో అందరూ కోరుకుంటారు. అలాగే తమ కల్చర్‌ను కూడా బాగుచేసుకోవాలనుకుంటూనే ఉంటారు. తమ కల్చర్ చాలా బాగా మరియు ఉన్నతోన్నతముగా అయిపోయేందుకు అందులో ఇంకేదో కలవాలి అని భావిస్తూ ఉంటారు. కావున టాపిక్ బాగుంది మరియు ఏ విధముగా అయితే భారతదేశం వారైనా లేక విదేశం వారైనా ఉల్లాస, ఉత్సాహాలతో ఏ ప్లాన్లనైతే తయారుచేస్తున్నారో అందులో సఫలత అయితే ఉండనే ఉంది మరియు బాగుంది కూడా! ఈ టాపిక్ వారిది మరియు ప్రాక్టికల్ లో మీరు ఉన్నారు. టాపిక్ మరియు ప్రాక్టికల్ కలిసిపోతే బాగుంటుంది. ఇది బాగుంది, యు.ఎన్.ఒ యొక్క సేవ కూడా బాగా జరుగుతోంది. ఆ కారణముగా వేరే సేవలు కూడా జరుగుతున్నాయి. మెల్లమెల్లగా నాన్ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ వరకూ కూడా చేరుకుంటారు. బాగా నడుస్తోంది కదా! కనెక్షన్ కూడా బాగా పెరుగుతూనే ఉంటుంది. సహయోగాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కావున సహయోగులుగా చేయండి, సంపర్కములోకి తీసుకురండి. ఎంతెంతగా సంపర్కములోకి వస్తూ ఉంటారో అంతగానే స్వతహాగా సహయోగులుగా అవుతూ ఉంటారు మరియు ఎంతగా అయితే సేవ వ్యాపిస్తూ ఉంటుందో అంతగా వ్యతిరేకత ఉన్న వాయుమండలం అందులో అణిగిపోతుంది. కావున ఇది మంచి విషయం. బాప్ దాదా ప్రాజెక్ట్ గురించి ముందే అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా!
డబుల్ విదేశీయులు మీటింగ్ వారైనా లేక గ్రూప్లో వచ్చిన వారైనా అందరికీ బాప్ దాదా ఎంతో స్నేహ సంపన్నమైన అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి ధైర్యాన్ని ఉంచుతున్నారు. బాప్ దాదా సేవ యొక్క ఉల్లాస, ఉత్సాహాలలో మరియు ధైర్యములో మంచి రిజల్టును చూసారు. సేవ మరియు స్వ ఉన్నతి యొక్క బ్యాలెన్స్ ను అందులో కలపాలి. సేవ బాగా జరుగుతోంది మరియు సేవ విఘ్న వినాశకముగా రచింపబడి ఉంది. కావున డబుల్ విదేశీయులందరికీ బాప్ దాదా సదా ప్రియస్మృతులను తెలియజేస్తారు మరియు సదా ప్రియస్మృతులు మీ తోడుగా ఉంటాయి. అచ్చా!
మహారాష్ట్ర జోన్ వారు సేవ చేసేందుకు వచ్చారు. అచ్చా. సగం హాల్ మహారాష్ట్ర వారే ఉన్నారు. మహారాష్ట్రలో సేవ యొక్క వృద్ధి బాగా జరుగుతోంది. కావున మహారాష్ట్ర 9 లక్షలను త్వరగా తయారుచేయగలుగుతుంది. అవును కదా! ఆ లక్షలను తయారుచేయడంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుంటారు కదా! బాగుంది, మీ అందరికీ కూడా సంతోషము కలుగుతుంది కదా! మీ పరివారములో వృద్ధి జరుగుతోందంటే మీరూ సంతోషిస్తారు కదా! త్వరత్వరగా వృద్ధి జరగాలి అనే అందరూ కోరుకుంటారు. కావున మహారాష్ట్ర వృద్ధి చెందుతున్నారు మరియు ఇతర జోన్లందరూ కూడా అలాగే వృద్ధినొంది త్వరత్వరగా సంపన్నమై, సంపూర్ణముగా అయి బాబాతో పాటు వెళ్ళగలుగుతారు. కలిసి వెళ్ళాలి అన్నది మరచిపోకూడదు. ప్రేమగా రాకపోతే బలవంతంగా కూడా తీసుకువెళతాను అని బాప్ దాదా ఇంతకుముందు కూడా అన్నారు. కలిసి రాకపోతే వెనుక కూడా తీసుకు వెళతారు కానీ అందులో అంత ఆనందం ఉండదు. అచ్ఛా!
నలువైపుల నుండి, దేశ, విదేశాల నుండి సాకార స్వరూపములో లేక సూక్ష్మ స్వరూపములో మిలనమును జరుపుకునే సర్వ స్వరాజ్యాధికారీ ఆత్మలకు, సదా ఈ శ్రేష్ట అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షము చేసే విశేష ఆత్మలకు సదా బాప్ దాదాను ప్రతి అడుగులోనూ అనుసరించే వారికి, సదా మనస్సును స్వచ్ఛముగా మరియు బుద్ధిని స్పష్టముగా ఉంచుకునే వారికి, ఇటువంటి స్వత: తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా తోడుగా ఉండే మరియు తోడుగా నడిచే డబుల్ లైట్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment