13-02-1999 అవ్యక్త మురళి

            13-02-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శివఅవతరణ మరియు పొదుపు యొక్క అవతారం.

ఈరోజు త్రిమూర్తి శివతండ్రి తన యొక్క అతి ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన సాలిగ్రామ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. 

ఈరోజు శివుడు మరియు సాలిగ్రామాల యొక్క విశేషమైన రోజు. పిల్లలను కలుసుకుని బాబా సంతోషిస్తున్నారు. పిల్లల పుట్టినరోజు జరుపుకోవడానికి బాబా వచ్చారు మరియు మేము బాబా యొక్క పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చాము అని పిల్లలు అంటున్నారు. బాబాకి కూడా సంతోషంగా ఉంది మరియు పిల్లలకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ పుట్టినరోజు కల్పమంతటిలో అతీతమైనది మరియు ప్రియమైనది. మొత్తం కల్పంలో ఈవిధమైన పుట్టినరోజు ఎవరికీ జరగదు. తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు ఒకే సమయంలో - ఇలా మరే సమయంలో మరియు మరెవరిదీ జరగదు. కనుక మొదట బాప్ దాదా పిల్లలకు కోటానుకోట్ల రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లల యొక్క శుభాకాంక్షలు అయితే అమృతవేళ నుండి చాలా హృదయంతో చెప్పిన శుభాకాంక్షలన్నీ బాబా దగ్గరికి చేరాయి. బాప్ దాదా ఇంతమంది పిల్లలను, సాలిగ్రామాలను చూసి ఓహో! గారాభ పిల్లలూ ఓహో!!, ఓహో! ప్రియమైన పిల్లలూ ఓహో!!, ఓహో! అలౌకిక జన్మ, అలౌకిక పుట్టినరోజు జరుపుకునే పిల్లలూ ఓహో!! అని మనస్సులో సంతోష గీతాన్ని పాడుతున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డ గురించి ఓహో! ఓహో!! అనే పాట పాడుతున్నారు. ఎందుకంటే మొత్తం విశ్వంలో ఆత్మలలో ఇంత కొద్దిమందియే నా పిల్లలై కోటానుకోట్ల భాగ్యవంతులుగా అయ్యారు మరియు ఇక ముందు కూడా భాగ్యవంతులుగా ఉంటారు అని. అర్ధకల్పం వరకు అమర భాగ్యవంతులుగా ఉంటారు. ఇది ఒక జన్మ యొక్క వరదానం కాదు, అనేక జన్మల కొరకు అమర వరదానిగా అయిపోయారు. ఇలా పిల్లలకు స్వయం యొక్క స్వమానం ఎంతవరకు స్మృతిలో ఉంటుంది? ఈ అలౌకిక పుట్టినరోజు లేక అలౌకిక జన్మ యొక్క తరగని వారసత్వాన్ని బాబా జన్మతోనే ఇస్తున్నారు. జన్మతోనే స్మృతి యొక్క శ్రేష్ట తిలకం ప్రతి ఒక్క బిడ్డకి బాబా పెట్టారు. తిలకం పెట్టి ఉంది కదా? బ్రాహ్మణజీవితం కనుక తిలకం కూడా అవినాశి. బ్రాహ్మణుల మస్తకంలో తిలకం శ్రేష్టభాగ్యానికి గుర్తు. మీరందరు మరియు నలువైపుల ఉన్న పిల్లలు దూరంగా కూర్చున్నా కానీ చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో ఈ అతీతమైన, ప్రియమైన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. జరుపుకుంటున్నారు కదా! బాబా మా పుట్టినరోజుని జరుపుకుంటున్నారు మరియు మేము బాబా యొక్క పుట్టినరోజు జరుపుకుంటన్నాం అని అందరికీ సంతోషంగా ఉంది. ఎంత సంతోషం ఉంది? సంతోషాన్ని కొలవగలరా? కొలిచారా? ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచే సాధనం ఏదీ ఈ ప్రపంచంలో కనుగొనలేదు. సముద్రం అంత సంతోషం ఉందా అని అడిగితే ఏమంటారు? సముద్రం సరిపోదు అంటారు. మంచిది, అయితే ఆకాశం అంత ఉందా? ఆకాశం కంటే ఉన్నతంగా మీ ఇల్లు మరియు మీ సూక్ష్మవతనం ఉన్నాయి. అందువలన కొలవడానికి ఏదీ సరిపోలేదు మరియు సరిపోదు కూడా! ఇంత సంతోషం ఉంటే ఒక చేతితో చప్పట్లు కొట్టండి. (అందరు చప్పట్లు మ్రోగించారు) సంతోషం ఉంది అని దీనిలో అందరూ చేతులు ఎత్తారు, శుభాకాంక్షలు. ఇప్పుడు మరో ప్రశ్న (తెలిసిపోయి ఉంటుంది అందుకే నవ్వుతున్నారు) బాప్ దాదా ప్రతి ఒక బిడ్డని సదా వికసించి ఉన్న ఆత్మిగులాబి పుష్పం వలె చూడాలనుకుంటున్నారు. సగం వికసించి కాదు, సదా మరియు పూర్తిగా వికసించి ఉన్నట్లుగా చూడాలనుకుంటున్నారు. వికసించి ఉన్న పుష్పం ఎంతో ప్రియంగా అనిపిస్తుంది! చూడడానికి ఇష్టం అనిపిస్తుంది. కొంచెం అయిన వాడిపోతే ఏమి చేస్తారు? తొలగించేస్తారు. కానీ బాప్ దాదా అయితే తొలగించరు వారికి వారే తొలగిపోతారు. 

ఈ రోజు జరుపుకునే రోజు కదా! మురళి అయితే సదా వింటూనే ఉంటారు. ఈ రోజు బాగా సంతోషంతో మనస్సుతో నాట్యం చేయండి మరియు పాడండి. మనస్సుతో నాట్యం చేయండి కానీ పాదాలతో కాదు. పాదాలతో నాట్యం మొదలు పెడితే మొత్తం పెద్ద యుద్ధం అయిపోతుంది. బాప్ దాదా చూస్తున్నారు - పిల్లలు నాట్యం చేస్తున్నారు మరియు మధురాతి మధురమైన బాబా యొక్క మహిమ, తమ అలౌకిక మహిమ యొక్క పాటలు చాలా పాడుతున్నారు. మీ మనస్సు యొక్క ధ్వని బాబా దగ్గరకి చేరుకుంటుంది. అన్ని దేశాల నుండి ధ్వని వస్తుంది. వారు బాబా యొక్క ధ్వని వింటున్నారు మరియు బాబా కూడా వారి ధ్వని వింటున్నారు. అందువలన బాబా కూడా చెప్తున్నారు - విశ్వానికి అతి స్నేహి అయిన ఓ పిల్లలూ! బాగా నాట్యం చేయండి, పాడండి, ఇక వేరే పని ఏమిటి? బ్రాహ్మణుల పని ఏమిటి? యోగం జోడించడం కూడా ఏమిటి? శ్రమ ఏదైనా ఉందా? యోగం అంటేనే ఆత్మ మరియు పరమాత్మల కలయిక అని అర్థం, కలయికలో ఏమి ఉంటుంది? సంతోషంలో నాట్యం చేస్తారు. బాబా యొక్క మహిమ యొక్క మధురాతి మధుర పాటలు మనస్సు స్వతహాగానే పాడుతూ ఉంటుంది. బ్రాహ్మణుల పనే ఇది. పాడుతూ ఉండండి మరియు నాట్యం చేస్తూ ఉండండి. ఇది కష్టమా? నాట్యం చేయడం, పాడటం కష్టమా? కాదు కదా! ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వారు చేతులు ఎత్తండి! ఈ రోజులలో నాట్యం చేయడం, పాడటం సీజన్ అయితే మీరు కూడా ఏమి చేయాలి? నాట్యం చేయండి, పాడండి. సహజమే కదా? సహజం అయితే చేతులు ఊపండి! కష్టం కాదు కదా? తెలివితక్కువతనంతో సహజం నుండి తొలగి కష్టంలోకి వెళ్ళిపోతున్నారు. కష్టం కానే కాదు. చాలా సహజం ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు - అర్ధకల్పం కష్టజీవితాన్ని గడిపారు. అందువలన ఈ సమయంలో సహజమైనది లభించింది. కష్టం అనేవారు ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? ఎలా అయితే ఎవరైనా నడుస్తూ, నడుస్తూ మార్గం మర్చిపోయి వేరే మార్గంలోకి వెళ్ళిపోతే కష్టం అనిపిస్తుంది కదా? జ్ఞానమార్గం కష్టం కాదు, బ్రాహ్మణజీవితం కష్టం కాదు. బ్రాహ్మణులకు బదులు క్షత్రియులు అయిపోతున్నారు. క్షత్రియుల పని యుద్ధం చేయడం, దెబ్బలాడటం ...... ఇది అయితే కష్టమే కదా! యుద్ధం చేయటం కష్టం కానీ ఆనందంగా ఉండటం అయితే సహజం. 

డబల్ విదేశీయులు ఆనందంలో ఉండేవారే కదా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి! ఆనందంలో ఉన్నారా? అక్కడికి వెళ్ళి అయోమయం అవ్వరు కదా? ఈ రోజు శివజయంతి యొక్క గొప్పతనం రెండు విషయాలలో ఉంది. 1. ఈరోజు వ్రతం పెట్టుకుంటారు. డబల్ విదేశీయులు అయితే అసలు జరపుకోరు. భారతదేశంలోనే జరుపుకుంటారు. ఈనాటి గొప్పతనం 1. వ్రతం పెట్టుకోవటం 2. జాగరణ చేయడం. మీరందరు వ్రతం తీసుకున్నారు కదా? పక్కా వ్రతం తీసుకున్నారా? లేక అప్పుడప్పుడు పచ్చిగా, అప్పుడప్పుడు పక్కాగా ఉంటున్నారా? పచ్చిగా ఉన్నతి ఇష్టమనిపింస్తుందా? పక్వం అయినది అందరికీ ఇష్టమనిపిస్తుంది కదా? అయితే ఏమి వ్రతం తీసుకున్నారు? బాప్ దాదా అన్నింటికంటే మొదట ఏ వ్రతం ఇచ్చారు? స్మృతి తిలకం పెట్టుకునేటప్పుడు మొట్టమొదట ఏ వ్రతం తీసుకున్నారు? జ్ఞాపకం ఉంది కదా? సంపూర్ణ పవిత్ర భవ! బాబా చెప్పారు మరియు పిల్లలు ధారణ చేసారు. పవిత్రత వ్రతం అంటే కేవలం బ్రహ్మచర్యవ్రతమే కాదు, కానీ బ్రహ్మాబాబా సమానంగా ప్రతి సంకల్పం, మాట, మరియు కర్మలో పవిత్రత - వీరినే బ్రహ్మచారి మరియు బ్రహ్మాచారి అంటారు. ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ నిండి ఉండాలి, ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క గొప్పతనం ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం అంటే కర్మయోగి యొక్క అనుభవం అవ్వాలి - వీరినే బ్రహ్మాచారి అంటారు. బ్రహ్మాబాబాని చూసారు కదా - ప్రతి మాట మహావాక్యంలా ఉండేది, సాధారణమైనది కాదు. ఎందుకంటే మీ జన్మయే సాధారణమైనది కాదు, అలౌకికమైనది. అలౌకికత అంటేనే పవిత్రత అని అర్ధం. కనుక రోజూ రాత్రి మీకు మీరు టీచర్ అయ్యి పరిశీలన చేసుకోండి మరియు మీ శాతాన్ని అనుసరించి మీకు మీరే మార్కులు ఇచ్చుకోండి. 100 శాతం తయారవ్వాలి. కానీ ప్రతిరోజు మీకు మీరు చూసుకోండి, ఇతరులను చూడటం కాదు. బాప్ దాదా చూస్తున్నారు - తమనితాము చూసుకోవడానికి బదులు ఇతరులను చూడటంలో నిమగ్నం అయిపోతున్నారు. అది అయితే సహజం, కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి - ఈరోజు సంకల్పం, మాట మరియు కర్మలో ఎంత శాతం ఉంది? అని. మీరు ఈ సంవత్సరం నలువైపుల ఏ సందేశాన్ని ఇచ్చారు? పరివర్తన గురించి అన్ని ఫంక్షన్స్ లో చెప్పారు. పరివర్తన టాపిక్ గురించి అన్నిచోట్ల మంచి,మంచి ఉపన్యాసాలు చెప్పారు. ఈ సంవత్సరం నలువైపుల సేవలో ఇతరులకు కూడా పరివర్తన యొక్క లక్ష్యం చాలా మంచి ఆర్భాటంగా ఇచ్చారు. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. అయితే మీకు మీరు కూడా ప్రతిరోజు ఎంత శాతంలో పరివర్తన అయ్యాను? అని పరిశీలించుకోండి. పరివర్తన అనేది ఎక్కేకళలో ఉండాలి కానీ దిగిపోయే కళలో కాదు. బాప్ దాదా కూడా ప్రతి ఒక పిల్లవాని చార్జ్ చూస్తారు - ప్రతి బిడ్డది చూస్తారా లేక విశేషమైనవారిదే చూస్తారా అని మీరనుకుంటున్నారు! బాప్ దాదా పిల్లలందరి చార్ట్ అప్పుడప్పుడు చూస్తారు, రోజూ చూడరు కానీ అప్పుడప్పుడు చూస్తారు. చివరి వారు అయినా. తీవ్రమైనవారు అయినా అందరిదీ చూస్తారు. అందరు నవ్వుతున్నారు. అయితే బాప్ దాదా దగ్గర ఏమి చార్డ్ ఉందో వినిపించమంటారా? ఈరోజు జరుపుకునే రోజు కదా! కనుక ఈరోజు చెప్పడం లేదు. కానీ ఇకముందు కోసం సైగ చేస్తున్నారు - ఈరోజు యొక్క గొప్పతనం వ్రతం తీసుకోవడం అంటే ధృడ సంకల్పం చేయడం. సత్యమైన భక్తులు ఎప్పుడు వ్రతాన్ని భంగపర్చరు. బాప్ దాదా పిల్లలకు మరలా ముందు కోసం సైగ చేస్తున్నారు - ఇప్పుడు కూడా మొదటి పునాది సంకల్పశక్తి అప్పుడప్పుడు వ్యర్థానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరియు అశుభం అనేది వ్యర్ధం కంటే కొంచెం తక్కువగా ఉంది. ఈ సంకల్పశక్తి యొక్క ఉపయోగాన్ని స్వయం పట్ల మరియు విశ్వం పట్ల ఎంత కావాలంటే అంత ఉపయోగించి పెంచుకోండి. ఎందుకంటే సంకల్పం ఆధారంగా మాట మరియు కర్మ ఉంటాయి. కనుక సంకల్పశక్తిని పరివర్తన చేసుకోండి. ఏదైతే వ్యర్ధంగా మరియు అశుభంగా పోతుందో దానిని పరివర్తన చేసి విశ్వకళ్యాణ కార్యంలో ఉపయోగించండి. బాప్ దాదా సంకల్ప ఖజానాని అన్నింటికంటే శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందువలన ఈ సంకల్ప ఖజానాలో పొదుపు యొక్క అవతారిగా అవ్వండి. ఈ రోజుని అవతరణ రోజు అని అంటారు. కనుక బాప్ దాదాకి పిల్లలందరి పట్ల ఇదే శుభ ఆశ ఉంది - ఈరోజు శివఅవతరణతో పాటు మీరందరు పొదుపు యొక్క అవతారిగా అవ్వండి. సంకల్పంలో పొదుపు అంటే అర్ధం - వ్యర్థం నుండి రక్షించుకోవటం, దీని ద్వారా మిగతా ఖజానాలన్నీ స్వతహాగానే రక్షించబడతాయి. 99సం||రంలో ఏమి అవుతుంది? 99 సం||రం ప్రారంభమైపోయింది. 99 సం||రంలో ఏమి అవుతుందో అని అనుకుంటున్నారు. ఏమైనా అయ్యిందా? ఫిబ్రవరి కూడా వచ్చేసింది. ఒకవేళ అయితే కూడా మీకు ఏమిటి? మీకేమైనా నష్టమా? భయమా? ఏమవుతుందో అనే భయం ఉందా? మీకు అయితే అన్నీ మంచిగా జరుగుతాయి. ప్రపంచం వారికి అయితే ఏదైనా అయినా కానీ మీరు నిర్భయంగా అయ్యి హర్షితముఖిగా ఆటను చూడాలి. ఆటలో రక్తం కూడా చూపిస్తారు, ప్రేమను కూడా చూపిస్తారు, యుద్ధం కూడా చూపిస్తారు. మంచి విషయాలు కూడా చూపిస్తారు. అయినా ఆటలో (సినిమా) భయం అనిపిస్తుందా ఏమిటి? ఏమౌతుందో, ఏమయ్యిందో, ఏమయ్యిందో? అని అనుకుంటారా? కూర్చుని ఆనందంగా చూస్తారు? అదేవిధంగా ఇది కూడా బేహద్ ఆట. ఒకవేళ కొద్దిగా అయినా ఏమైపోయిందో....ఇలా అవ్వకూడదు కానీ ఎందుకు అయ్యింది..... ఇలా భయం లేదు అలజడి యొక్క స్థితి ఉన్నవారిపై ప్రభావం పడుతుంది. మంచిలో మంచిగా ఉంటారు, అలజడి స్థితిలో స్వయం కూడా అలజడి స్థితిలోకి వచ్చేస్తారు. అందువలనే 99 సం||రంలో అయినా, 2000 సం||రంలో అయినా మీకేంటి? ఆట అవ్వనివ్వండి, ఆనందంతో చూడండి, భయపడకండి. అయ్యో, ఇలా అయిపోయింది ఏమిటి అని సంకల్పంలో కూడా ఆలోచించకూడదు. అందరు అడుగుతున్నారు - 99లో ఏమౌతుంది? అని. ఏమైనా అవుతుందా, అవ్వదా అని. బాప్ దాదా చెప్తున్నారు - మీరే మంచిగా శుభ్రం చేయమని ప్రకృతికి సేవ ఇచ్చారు. ప్రకృతికి శుభ్రం చేయమని పెద్ద, పెద్ద చీపురులు ఇచ్చారు. మరి ఎందుకు భయపడుతున్నారు? మీ ఆజ్ఞతోనే అది శుభ్రం చేస్తుంది మరి మీరెందుకు అలజడిలోకి వస్తున్నారు? ఆజ్ఞ ఇచ్చింది మీరే! కనుక అచంచలంగా, స్థిరంగా అయ్యి మనస్సు, బుద్ధిని పూర్తిగా శక్తిశాలిగా చేసుకుని అచంచల, స్థిరమైన స్థితిలో స్థితులవ్వండి. ప్రకృతి యొక్క ఆటను చూస్తూ నడవండి, భయపడకండి. మీరు సాధారణమైన వారు కాదు, అలౌకికమైన వారు. సాధారణమైనవారు అలజడిలోకి వస్తారు, భయపడతారు. అలౌకికమైన వారు, మాస్టర్‌ సర్వశక్తివంతులు ఆటను చూస్తూ తమ విశ్వకళ్యాణ కార్యంలో బిజీగా ఉంటారు. మనస్సు, బుద్ధిని ఖాళీగా ఉంచితే భయపడతారు. మనస్సు, బుద్ధితో లైట్ హౌస్ అయ్యి ప్రకాశాన్ని వ్యాపింపచేసే కార్యంలో బిజీగా ఉంటే బిజీగా ఉన్న ఆత్మకు భయం అనిపించదు. సాక్షి స్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా అలజడి వచ్చినా మీ బుద్ధిని సదా స్పష్టంగా ఉంచుకోవాలి, ఎందుకు, ఏమిటి అనే విషయాలతో బుద్దిని బిజీగా ఉంచకూడదు, నింపి ఉంచకూడదు, ఖాళీగా ఉంచాలి, ఒకే బాబా మరియు నేను ..... ఎప్పుడైతే సమయం అనుసారంగా ఉత్తరాలు లేక టెలిఫోన్, టి.వి. ఏవైతే సాధనాలు ఉన్నాయో వాటి ద్వారా కూడా సందేశం అందని సమయంలో కూడా బాప్ దాదా యొక్క సలహా మీకు స్పష్టంగా అందుతుంది. కనుక ఈ విజ్ఞాన సాధనాలను ఎప్పుడు ఆధారంగా చేసుకోకండి. ఉపయోగించుకోండి కానీ వాటి ఆధారంగా మీ జీవితాన్ని తయారుచేసుకోకండి. అప్పుడప్పుడు విజ్ఞాన సాధనాలు ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేరు. అందువలన శాంతి సాధన ఉంటే ఎక్కడ ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా కానీ చాలా త్వరగా మరియు స్పష్టంగా ఉపయోగపడుతుంది. కానీ మీ బుద్ది యొక్క లైన్ స్పష్టంగా ఉంచుకోవాలి, అర్ధమైందా! మీరే ఆహ్వానం చేస్తున్నారు కదా - త్వరత్వరగా స్వర్ణిమయుగం వచ్చేయాలి అని. కనుక స్వర్ణిమయుగంలో ఈ శుభ్రత కావాలి కదా! కనుక ప్రకృతి మంచిగా శుభ్రం చేస్తుంది. 

ఈరోజు సంకల్పం కాదు కానీ ఏ ధృడసంకల్పం చేశారు? పొదుపు యొక్క అవతారిగా అవ్వవలసిందే. సంకల్పంలో అయినా, మాటలో అయినా, సాధారణ కర్మలో అయినా పొదుపు చేయాలి. మరియు రెండవ విషయం - సదా బుద్ధిని స్పష్టంగా ఉంచుకోవాలి. దీనినే బాప్ దాదా మరో మాటలో సత్యమైన మనస్సుకి యజమాని రాజీ అవుతారు అని అంటారు. సత్యమైన మనస్సు, స్వచ్చమైన హృదయం ఉండాలి. వర్తమాన సమయంలో సత్యత మరియు స్వచ్ఛత అవసరం. మనస్సులో కూడా సత్యత, పరివారంలో కూడా సత్యత, మరియు బాబా దగ్గర కూడా సత్యత ఉండాలి. అర్థమైందా! ఈరోజు చెప్పాలనుకోలేదు కానీ చెప్పేశాను. బాబాకి పిల్లలంటే ప్రేమ అందువలన చిన్న బలహీనత కూడా చూడలేరు. బాప్ దాదా ప్రతి ఒక బిడ్డని తన సమానంగా సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. 

నలువైపుల అలజడిగా ఉంది. ప్రకృతి యొక్క తత్వాలు చాలా ఎక్కువగా అలజడి చేస్తున్నాయి. ఒకవైపు కూడా అలజడి లేకుండా లేదు, వ్యక్తుల యొక్క అలజడి, ప్రకృతి యొక్క అలజడి ఉంది. ఇలా నలువైపుల సృష్టిలో అలజడిగా ఉంటే ఆ సమయంలో మీరు ఏమి చేస్తారు? రక్షణ సాధనం ఏమిటి? సెకనులో మిమ్మల్ని మీరు విదేహిగా, అశరీరిగా లేక ఆత్మాభిమానిగా చేసుకుంటే అలజడిలో అచంచలంగా ఉండగలరు. దీనిలో సమయం అయితే పట్టదు కదా? ఏమవుతుంది? ఇప్పుడు ప్రయత్నం చేయండి - ఒక సెకనులో మనస్సు, బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ స్థితులు చేయగలుగుతున్నారా? (డ్రిల్) దీనినే "సాధన” అని అంటారు. మంచిది. 

దేశ, విదేశాలలో నలువైపుల బాబా యొక్క ప్రేమలో లవలీనమైన ఆత్మలకు, సదా స్వయాన్ని బ్రహ్మాచారి స్థితిలో స్థితులు చేసుకునే స్నేహి, సహయోగి పిల్లలకు, సదా పొదుపు మరియు ఒకే పేరు ఈవిధమైన కార్యంలో నిమగ్నం అయ్యే ధైర్యవంతులైన పిల్లలకు, సదా అలజడిలో ఉంటూ అచంచలంగా ఉండే నిర్భయ ఆత్మలకు, సదా ఆనందంలో ఉండేవారికి, బాబాకి సమీపంగా ఉండే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.. 

పిల్లల యొక్క గ్రీటింగ్ కార్డులన్నీ అందాయి. బాప్  దాదా చూస్తున్నారు - అందరూ జన్మదినం యొక్క కార్డులు మరియు విదేశీయులు ప్రేమికుల రోజు యొక్క కార్డులు పంపించారు. ప్రేమసాగరుడైన బాబా పిల్లలందరికీ శివరాత్రితో పాటు వెనువెంట ప్రేమలో లవలీనమైన రోజు యొక్క శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 

Comments