11-11-2000 అవ్యక్త మురళి

               11-11-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి.

ఈరోజు బాప్ దాదా తన యొక్క పవిత్రమైన, ఉన్నతమైన, అదృష్టవంతమైన, మధురమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో సమయం అనుసరించి పవిత్ర ఆత్మలు వస్తూ ఉన్నారు. మీరు కూడా పవిత్ర ఆత్మలే కానీ శ్రేష్ట ఆత్మలైన మీరు ప్రకృతిజీత్ అయ్యి, ప్రకృతిని కూడా సతో ప్రధానంగా, పవిత్రంగా తయారుచేస్తున్నారు. మీ యొక్క పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతో ప్రధాన పవిత్రంగా తయారు చేస్తుంది. అందువలనే ఆత్మలైన మీ అందరికీ ప్రకృతి యొక్క శరీరం కూడా పవిత్రమైనది ప్రాప్తిస్తుంది. మీ యొక్క పవిత్రతా శక్తి విశ్వంలో జడమైనవాటిని, చైతన్యమైనవాటిని అన్నింటినీ పవిత్రంగా చేస్తుంది. అందువలన మీకు శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ కూడా పవిత్రమైనది, శరీరం కూడా పవిత్రమైనది మరియు ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతో ప్రధానంగా పావనంగా ఉంటాయి. కనుక విశ్వంలోకెల్లా పవిత్ర ఆత్మలు మీరు. పవిత్రమైనవారేనా? మిమ్మల్ని మీరు విశ్వంలోకెల్లా పవిత్ర ఆత్మలుగా భావిస్తున్నారా? ఉన్నతమైన వారు కూడా. ఎందుకు ఉన్నతమైనవారు? ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుడిని గ్రహించారు. ఉన్నతోన్నతమైన బాబా ద్వారా ఉన్నతోన్నత ఆత్మలుగా అయ్యారు. సాధారణ వృత్తి, దృష్టి, స్మృతి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ట స్మృతి స్వరూపం, శ్రేష్ట వృత్తి, శ్రేష్ట దృష్టి తయారయ్యాయి. ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఏ వృత్తితో కలుసుకుంటున్నారు సోదరులు అనే వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారం అనే భావంతో కలుసుకుంటున్నారు. కనుక ఉన్నతమైన వారు అయ్యారు కదా? మారిపోయారు కదా! మరియు అదృష్టవంతులుగా ఎవరు తయారుచేశారు? మీ అదృష్ట రేఖను ఏ జ్యోతిష్యులు గీయలేదు, స్వయంగా భాగ్య విధాత మీ అదృష్ట రేఖను గీసారు. మరియు ఎంత పెద్ద గ్యారంటీ ఇచ్చారు? అదృష్ట రేఖ 21 జన్మలు అవినాశిగా ఉండే గ్యారంటీ తీసుకున్నారు. ఒక జన్మకి కాదు, 21 జన్మలలో ఎప్పుడూ దు:ఖం, అశాంతి యొక్క అనుభూతి ఉండదు, సదా సుఖీగా ఉంటారు. జీవితంలో మూడు విషయాలు అవసరం - ఆరోగ్యం, సంపద మరియు సంతోషం. ఈ మూడూ అందరికీ బాబా ద్వారా వారసత్వ రూపంలో లభించాయి. 21 జన్మలకు గ్యారంటీ ఉంది కదా? అందరు గ్యారంటీ తీసుకున్నారా? వెనుక ఉన్నవారికి గ్యారంటీ లభించిందా? అందరు చేతులు ఎత్తుతున్నారు, చాలా మంచిది, పిల్లలుగా అవ్వటం అంటే తండ్రి ద్వారా వారసత్వం లభించటం. పిల్లలుగా అవ్వలేదా? అవుతున్నారా? పిల్లలుగా అవుతున్నారా లేక అయిపోయారా? పిల్లలుగా అవ్వటం అనేది ఉండదు. జన్మ తీసుకోగానే పిల్లలు అయిపోతారు, జన్మిస్తూనే తండ్రి యొక్క వారసత్వానికి అధికారి అయిపోయారు. బాబా ద్వారా ఇటువంటి శ్రేష్టభాగ్యాన్ని ఇప్పుడు పొందారు. మరియు మీరు ధనవంతులు కూడా! మీరు బ్రాహ్మణాత్మలు, క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు. బ్రాహ్మణాత్మ నిశ్చయంతో అనుభవం ఏమి చేసుకుంటుందంటే నేను ఫలానా అని కాదు, నేను శ్రేష్టాత్మను. ప్రపంచలోకెల్లా ధనవంతమైన ఆత్మను. బ్రాహ్మణులు అంటే విశ్వంలోకెల్లా ధనవంతమైవారు. ఎందుకంటే బ్రాహ్మణాత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన అవుతుంది. మరయితే రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తారు? ఆలోచించండి, ప్రతి అడుగులో కోటానుకోట్లు అంటే రోజంతటిలో ఎన్ని కోట్లు అవుతాయి? బాబా ద్వారా ఇటువంటి ఆత్మలుగా తయారయ్యారు. బ్రాహ్మణాత్మనైన నేను ఎవరు? అని స్మృతి ఉండటమే భాగ్యం. 

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే భాగ్య సితారను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్య సితారను చూసుకుంటున్నారా? బాప్ దాదా పిల్లలను చూసి సంతోషపడతారా లేక పిల్లలు బాబాని చూసి సంతోషపడతారా? ఎవరు సంతోషపడతారు? బాబాయా లేదా పిల్లలా? ఎవరు? (పిల్లలు) బాబా సంతోషపడరా? పిల్లలు బాబాని చూసి సంతోషపడతారు మరియు పిల్లలను చూసి బాబా సంతోషపడతారు. ఇద్దరూ సంతోషపడతారు ఎందుకంటే పరమాత్మ యొక్క ఈ కలయిక, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వం, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇప్పుడే లభిస్తాయి అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. అవునా? 

బాప్ దాదా ఇప్పుడు కేవలం ఒక విషయం పిల్లలకు రివైజ్ చేయిస్తున్నారు - అది ఏ విషయం అయి ఉంటుంది? అర్ధం చేసేసుకున్నారు! బాప్ దాదా రివైజ్ చేయించేది ఏమిటంటే ఇప్పుడు శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇది విశ్వాత్మల పిలుపు. సమీపంగా తీసుకువచ్చేవారు ఎవరు? ఇది విశ్వమంతటి పిలుపు కానీ సమీపంగా తీసుకువచ్చేవారు ఎవరు? మీరేనా లేక మరెవరైనా ఉన్నారా? మీరందరే కదా! సుందర శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారు మీరందరేనా? మీరే అయితే చేతులు ఎత్తండి! మంచిది, మరో విషయం కూడా ఉంది, అది కూడా అర్థమైపోయింది, అందుకే నవ్వుతున్నారు కదా? మంచిది, దానికి తారీఖు ఏమిటి? తారీఖు నిర్ణయించండి. ఇప్పుడు విదేశీయుల అవకాశం, తారీఖు నిర్ణయించుకున్నారు కదా! ఈ తారీఖు అయితే నిర్ణయించారు. సమయాన్ని సమీపంగా తీసుకురావలసిన ఓ ఆత్మలూ ! దీనికి తారీఖు ఏది? కనిపిస్తుందా? మొదట మీ దృష్టిలోకి వస్తేనే అప్పుడు విశ్వంలోకి వస్తుంది. అమృతవేళ విశ్వం అంతా తిరిగినప్పుడు అన్నింటిని చూసి చూసి, విని విని బాప్ దాదాకి దయ వస్తుంది. ఆనందంలో కూడా ఉన్నారు కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక బాప్ దాదా అడుగుతున్నారు - దాత యొక్క సంతానం అయిన ఓ మాస్టర్ దాతలూ! మాస్టర్ దాతస్థితి యొక్క మీ పాత్రను తీవ్ర వేగంతో విశ్వం ముందు ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు? ఇంకా ఇప్పుడు కూడా పరదా లోపల తయారవుతూ ఉన్నారా? తయారీలు చేస్తున్నారా? విశ్వపరివర్తనకు నిమిత్తమైన ఆత్మలూ! ఇప్పుడు విశ్వాత్మలపై దయ చూపించండి. ఇది జరగవలసిందే, నిశ్చితం అయిపోయింది మరియు జరగవలసింది కూడా నిమిత్తాత్మలైన మీ ద్వారానే. కానీ ఇక ఆలస్యం ఏ విషయంలో? బాప్ దాదా ఈ మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు - ప్రతి ఒక బ్రాహ్మణాత్మ మనస్సులో సంపన్నం మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగురుతూ కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో సంపూర్ణత అనే జెండా ఎగురవేస్తారో అప్పుడే విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క జెండా ఎగురవేస్తారు. ఈ జెండా పండుగని బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. శివరాత్రికి శివఅవతరణ యొక్క జెండా ఎగురవేస్తారు కదా! అదేవిధంగా ఇప్పుడు శివశక్తి పాండవుల అవతరణ యొక్క సూక్తి పెట్టాలి. శివశక్తులే వెలసెను... అనే పాట పెట్టుకుంటారు కదా! అదేవిధంగా ఇప్పుడు శివునితో పాటు శక్తులు, పాండవులు ప్రత్యక్షమయ్యారు అనే పాట పాడాలి. ఎంత వరకు పరదాలో ఉంటారు? పరదాలో ఉండటం మంచిగా అనిపిస్తుందా? కొద్దికొద్దిగా ఇష్టం అనిపిస్తుందా? వెనుక ఉన్నవారికి పరదా ఇష్టమనిపిస్తుందా? ఇష్టమనిపించటంలేదా? అయితే పరదాను తొలగించేవారు ఎవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? తొలగించేవారు కూడా మీరేనా లేక డ్రామా తొలగిస్తుందా? డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా? మీరు తొలగించేటట్లు అయితే ఇక ఆలస్యం ఎందుకు? అంటే పరదాలో ఉండటం మంచిగా అనిపిస్తున్నట్లు అర్ధమవుతుంది కదా? బాప్ దాదాకి ఇప్పుడు ఒకే శ్రేష్ట ఆశ ఉంది - అందరు ఓహో! ఓహో!! వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అనే పాట పాడాలి. ఇది జరుగుతుందా? చూడండి దాదీలూ! అందరూ జరుగుతుంది అని చెప్తున్నారు కానీ ఎందుకు జరగటం లేదు? కారణం ఏమిటి? అందరూ చెప్పినా కానీ ఎందుకు జరగటం లేదు? (అందరు సంపన్నంగా అవ్వలేదు) ఎందుకు అవ్వలేదు? తారీఖు చెప్పండి. (తారీఖు అయితే బాబా చెప్పాలి) బాప్ దాదా యొక్క మహామంత్రం జ్ఞాపకం ఉందా? బాప్ దాదా ఏమి చెప్తారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే అంటారు. (అంతిమ తారీఖు మీరే చెప్పండి బాబా అని దాదీజీ అన్నారు) బాప్ దా\దా చెప్పిన తారీఖుకి మిమ్మల్ని మీరు మలుచుకుని తయారైపోతారా? మాట నెరవేరుస్తారా? పాండవులు నెరవేరుస్తారా? పక్కాయేనా? ఒకవేళ తారుమారు చేస్తే ఏమి చేయాలి? (మీరు తారీఖు చెప్తే ఎవరూ తారుమారు చేయరు) శుభాకాంక్షలు, మంచిది. ఇప్పుడు తారీఖు చెప్తున్నాను చూసుకోండి. చూడండి, బాప్ దాదా దయాహృదయులు కనుక తారీఖు చెప్తున్నారు. ధ్యాసతో వినండి. బాప్ దాదా పిల్లలందరిపై శ్రేష్ట భావన లేక ఆశ పెట్టుకుంటున్నారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో, 6 నెలలు ఎప్పటికి పూర్తి అవుతాయి? (మే నెలకి) మే నెలలో నేను,నేను (మై, మై) అనేది సమాప్తం అయిపోవాలి. బాప్ దాదా మరలా అవకాశం ఇస్తున్నారు - తక్కువలో తక్కువ 6 నెలల్లో అయిపోవాలి. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు మరియు ఇంతకు ముందు సీజన్లో పని ఇచ్చారు, అదైతే మర్చిపోయి ఉంటారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో స్వయాన్ని జీవన్ముక్తస్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి. సత్యయుగీ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమయుగ జీవన్ముక్తి స్థితి పొందాలి. ఏ రకమైన విఘ్నం, పరిస్థితులు, సాధనాలు, నేను మరియు నాది, దేహాభిమానపు నేను, నాది, సేవలో నేను, నాది వీటన్నింటి ప్రభావం నుండి ముక్తులవ్వాలి. అవి వస్తాయి కానీ మీరు వాటి ప్రభావం నుండి ముక్తిగా ఉండండి. నేనయితే ముక్తి అవ్వాలనుకున్నాను కానీ ఈ విఘ్నం వచ్చేసింది, ఈ విషయం చాలా పెద్దది, చిన్న విషయం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నం , పెద్ద పరిస్థితి అని అంటున్నారు. కానీ ఎంత పెద్ద పరిస్థితి అయినా, విఘ్నం అయినా, సాధనాల యొక్క ఆకర్షణ మిమ్మల్ని ఎదుర్కున్నా అవి ఎదుర్కుంటాయి, ఈ విషయం ముందుగానే చెప్తున్నాను. అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలలలో 75% ముక్తి అవ్వగలరా! 100% అని బాప్ దాదా చెప్పటం లేదు. 75% అంటే మూడు వంతులు చేరుకున్నప్పుడు చివరకు చేరుకుంటారు కదా! కనుక 6 నెలల్లో, ఒక నెల కాదు, 6నెలలు అంటే అర్ధసంవత్సరం ఇస్తున్నాను. ఈ తారీఖు నిర్ణయించగలరా? బాబా నీవే నిర్ణయించు అని దాదీలు అన్నారు. దాదీల ఆజ్ఞ అంగీకరించాలి కదా! ఫలితం చూసి బాప్ దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వస్తారు, చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. 6 నెలల్లో 75% తయారవ్వాలి. 100% అని చెప్పటం లేదు. దాని కొరకు మరలా సమయం ఇస్తాను. దీనిలో ఎవరెడీ అవ్వాలి. ఎవరెడీ కాదు, 6 నెలల్లో రెడీ అవ్వాలి. ఇష్టమేనా? ఏమౌతుందో తెలియదు అని కొద్దిగా ధైర్యం తక్కువ ఉందా? సింహం కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి అంటే విఘ్నాలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి. సాధనాలు కూడా పెరుగుతాయి కానీ సాధనాల ప్రభావం నుండి కూడా ముక్తిగా ఉండాలి. ఇష్టమైతే చేతులు ఎత్తండి! టి.విలో చూపించండి. మంచిగా చేతులు ఎత్తండి! క్రిందికి దించవద్దు. దృశ్యం బావుంది. మంచిది, ముందుగానే శుభాకాంక్షలు. 

మేము చాలా చనిపోవల్సి వస్తుంది అని అనకండి. చనిపోండి లేదా జీవించండి కానీ తయారవ్వవలసిందే. ఇలా చనిపోవటం అనేది మధురమైనది. ఇలా చనిపోవటంలో దు:ఖం ఉండదు, అనేకుల కళ్యాణం కోసం చనిపోవటం ఇది. అందువలన ఇలా చనిపోవటంలోనే ఆనందం ఉంది. దు:ఖం లేదు, సుఖం ఉంది. ఇలా అయిపోయింది, దీని వలన అయిపోయింది.... ఇలాంటి ఏ సాకులు చెప్పకండి. ఇలాంటి ఏ సాకులు సాగవు. సాకులు చెప్తారా! చెప్పరు కదా? ఎగిరే కళ యొక్క ఆట ఆడండి, మరే ఆట ఆడకండి. పడిపోయే కళలోకి వెళ్ళే ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనత యొక్క ఆట... ఇవన్నీ సమాప్తం అయిపోవాలి. సరేనా! అందరి ముఖాలు వికసించి ఉన్నాయి. మరలా 6 నెలల తర్వాత కలుసుకోవడానికి వచ్చినప్పుడు ముఖం ఏవిధంగా ఉంటుందో! అప్పుడు కూడా ఫోటో తీస్తారు. డబల్ విదేశీయులు వచ్చారు కదా అంటే డబల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చింది. ఇతరులెవ్వరినీ చూడకూడదు, తండ్రిని చూడండి, బ్రహ్మ తల్లిని చూడండి. ఇతరులు చేసినా, చేయకపోయినా, అందరూ చేస్తారు కానీ వారిపై కూడా దయా భావన పెట్టుకోండి. బలహీనులకు శుభ భావనతో శక్తినివ్వాలి, బలహీనత చూడకూడదు. ఇటువంటి ఆత్మలను మీ ధైర్యం అనే చేతితో లేవనెత్తాలి, వృద్ధి చేయాలి. ధైర్యం అనే చేతిని సదా స్వయానికి, ఇతరులకు ఇస్తూ ఉండాలి. ధైర్యమనే చేయి చాలా శక్తివంతమైనది. బాప్ దాదా యొక్క వరదానం - పిల్లల ధైర్యం యొక్క ఒక అడుగు, బాబా యొక్క వేలరెట్లు సహాయం. నిస్వార్ధ పురుషార్ధంలో మొదట నేను అనుకోవాలి. నిస్వార్ధ పురుషార్ధం చేయాలి, స్వార్ధపురుషార్ధం కాదు. నిస్వార్ధ పురుషార్ధం ఎవరు చేస్తారో వారే బ్రహ్మాబాబా సమానం. . 

బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా! కనుకనే బ్రహ్మాకుమారీ, బ్రహ్మ కుమారులు అని పిలుచుకుంటున్నారు కదా! సెకనులో జీవన్ముక్తి యొక్క వారసత్వం తీసుకోండి అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! ఇప్పుడు సెకనులో మిమ్మల్ని మీరు ముక్తి చేసుకునే ధ్యాస పెట్టుకోండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపత శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది. యజమానులు కదా! రాజులు కదా! స్వరాజ్యాధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి. రాజు ఆజ్ఞ చేస్తాడు కదా! అవును, కాదు, ఇది చేయకూడదు, ఇది చేయాలి... ఇలా ఆజ్ఞాపించండి. మనస్సు అనేది ముఖ్యమంత్రి. కనుక ఓ రాజా! నీ మనస్సు అనే మంత్రిని సెకనులో ఆజ్ఞాపించి, అశరీరి, విదేహి స్థితిలో స్థితులు చేయగలుగుతున్నారా? ఒక సెకనులో ఆర్డర్ చేయండి. మంచిది. 

సదా లవలీన మరియు అదృష్టవంత ఆత్మలకు, బాప్ దాదా ద్వారా ప్రాప్తించే సర్వప్రాప్తుల యొక్క అనుభవీ ఆత్మలకు, స్వరాజ్యాధికారియై అధికారం ద్వారా స్వరాజ్యం చేసే శక్తిశాలి ఆత్మలకు, సదా జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవీ ఉన్నత ఆత్మలకు, భాగ్య విధాత ద్వారా శ్రేష్ట భాగ్యరేఖ ద్వారా అదృష్టవంతులైన ఆత్మలకు, సదా పవిత్ర దృష్టి, వృత్తి ద్వారా స్వపరివర్తన, విశ్వపరివర్తన చేసే పవిత్ర ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments