11-03-2002 అవ్యక్త మురళి

                11-03-2002         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మనలోని విశేషతలు పరమాత్ముని కానుకలు - వాటిని విశ్వసేవలో అర్పణ చేయండి.

ఈ రోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇద్దరూ నలువైపుల ఉన్న శ్రేష్ట భాగ్యవంతులైన బ్రాహ్మణ కులానికి చాలా చాలా కోటానుకోట్ల సార్లు దివ్య అలౌకిక జన్మ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. వెనువెంట అతి స్నేహం యొక్క మనస్సులోని ప్రేమ యొక్క ఆత్మిక పుష్పాలతో జన్మదిన శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రతీ బ్రాహ్మణాత్మ యొక్క విశేషతను చూసి చూసి హర్షిస్తున్నారు. ఓహో పిల్లలూ ..... ఓహో! అంటూ మనస్సులోనే పాట పాడుకుంటున్నారు. ఈ రోజు అమృతవేళ నుండి అందరి యొక్క మనస్సులో సంతోషం యొక్క అలలు ఎలా కనిపిస్తున్నాయి అంటే - ఓహో బాబా మరియు మా యొక్క అలౌకిక జన్మ అని పాడుకుంటున్నారు. అమృతవేళ నుండి పిల్లలు వేసిన శుభాకాంక్షల యొక్క మాలలను చూసి చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. మొత్తం కల్పంలో ఇటువంటి జన్మదినం సంగమయుగంలోనే జరుపుకుంటారు. సత్యయుగంలో కూడా ఇటువంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఈ విచిత్ర జన్మదినం అక్కడ ఉండదు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించటం అనే విషయం ఇంత వరకు విన్నారా? కానీ ఈ రోజు పిల్లలైన మీ యొక్క మరియు బాప్ దాదా యొక్క జన్మదినాన్ని ఒకే రోజు జరుపుకుంటున్నారు. అంటే ఓహో! ఓహో!! అనే పాటలు పాడుకుంటున్నారు కదా!  

ఈ రోజు బాప్ దాదా అమృతవేళ ఒక మాలను తయారుచేసారు. అది ఏ మాల? అంతిమ 108 మాలను తయారుచేయటం లేదు, మా పేరు ఉండే ఉంటుంది, ఉంటుంది అని ...... ఇలా మీరు ఆలోచించే అవసరం లేదు. అయితే ఈ రోజు స్థాపన యొక్క ఆది సమయం నుండి, వినాశనం యొక్క సమీప సమయం అయిన ఇప్పటి వరకు పిల్లలెవరెవరు అమరభవ యొక్క వరదానిగా ఉన్నారు అని వారి యొక్క మాలను తయారుచేస్తున్నారు. డ్రామానుసారం అటువంటి ఆత్మలకి భగవంతునితో పాటు సర్వ చరిత్రను చూసే లేదా వినే శ్రేష్ట పాత్ర ఉంది కానీ అటువంటి పిల్లలు ఎంతో కొద్దిమంది! మీ అందరి యొక్క పాత్ర కూడా ఉంది, ఎందువలన? బాప్ దాదా బ్రాహ్మణ వంశావళిని తయారుచేస్తున్నారు. అందువలన విశ్వం యొక్క లెక్కతో ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఉన్నారో వారు చాలా చాలా చాలా భాగ్యవంతులు. ఎందువలన? కోట్లలో కొద్దిమంది అనే వరుసలో ఉన్నారు మరియు కొద్దిమందిలో కొద్దిమందిగా అయ్యారు. 

విశ్వంలో కోట్ల ఆత్మలు ఒకవైపు ఉన్నారు, మరోవైపు బ్రాహ్మణులైన మీరు ఒకరు. అయితే ఈ జన్మదినాన బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాని యొక్క అంటే కొందరిది కాదు పిల్లలందరి యొక్క జన్మపత్రాన్ని చూసి ప్రతి ఒక్కరి విశేషతల యొక్క మాలలను మెడలో వేస్తున్నారు. మీరందరు క్రొత్తవారైనా, ఆదిలోనివారైనా, మధ్యలోనివారైనా కానీ విశేషమైనవారు మరియు విశేషంగానే ఉంటారు. విశ్వంలోని సర్వాత్మల దృష్టి మొత్తం కల్పం అంతా శ్రేష్టాత్మలైన మీ యొక్క మహానత వైపే ఉంటుంది. అయితే మీకు మీ విశేషతల గురించి తెలుసా? తెలుసు అనేవారు చేయి ఊపండి. చాలా మంచిది. ఆ విశేషతలను ఏం చేస్తారు? విశేషతల గురించి చాలా బాగా తెలుసు మరియు మంచిగా అంగీకరిస్తున్నారు కూడా, కానీ ఆ విశేషతలను ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? (సేవలో ఉపయోగిస్తున్నాం) వేరే విధంగా ఉపయోగించటం లేదు కదా! విశేషత అనేది పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ యొక్క కానుకని సదా విశ్వ సేవలో అర్పించాలి. విశేషతలను వ్యతిరేక రూపంలో ఉపయోగిస్తే అది అభిమాన రూపం అయిపోతుంది, ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత బాబా ద్వారా చాలా విశేషతలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే బాబా వారిగా అవ్వటంతోనే విశేషతల యొక్క ఖజానాకి అధికారిగా అయిపోతారు. ఒకటి - రెండు విశేషతలు కాదు, చాలా విశేషతలు వస్తాయి. వాటిని స్మృతిచిహ్నరూపంలో కూడా వర్ణన చేస్తారు - 16 కళా సంపన్నులు, అంటే 16 సంఖ్య అని కాదు, 16 కళలు అంటే సంపూర్ణులు అని అర్ధం. సర్వగుణ సంపన్నులు అని అర్ధం. సంపూర్ణ నిర్వికారతకు వివరణ. సంపూర్ణ నిర్వికారి అని అంటారు అంటే సంపూర్ణతలో వివరణ ఏదైనా ఉందా? విశేషతలు అనేవి బాబా ద్వారా ప్రతి బ్రాహ్మణాత్మకి వారసత్వ రూపంలో ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చేయాలి, తిరిగి సేవలో ఉపయోగించాలి. నాది ఈ విశేషత అని అనకూడదు, పరమాత్మ ఇచ్చినది అని భావించాలి. పరమాత్మ ఇచ్చినట్లు భావిస్తే ఆ విశేషతలో పరమాత్మ యొక్క శక్తులు నిండుతాయి. నాది అనుకోవటం ద్వారా అభిమానం మరియు అవమానం రెండిటిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఏ రకమైన అభిమానం అయినా అంటే జ్ఞానం యొక్క అభిమానం లేదా యోగం యొక్క లేదా సేవ యొక్క లేదా బుద్ధి యొక్క లేదా ఏదైనా గుణం యొక్క ఇలా ఏ విషయం గురించి అభిమానం ఉన్నా కానీ దానికి గుర్తు - వారు తొందరగా అవమానాన్ని అనుభవం చేసుకుంటారు. అందువలన విశేషాత్మలు అంటే పరమాత్ముని కానుకకి అధికారులు. అయితే ఈ రోజు మీరందరు బాప్ దాదా యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా మీ అందరి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మీరయితే కేవలం బాప్ దాదా యొక్క జన్మదినాన్నే జరుపుకుంటారు కానీ బాప్ దాదా అయితే మొత్తం బ్రాహ్మణకులం యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. భారతదేశంలోనే ఉండి కూడా దూరంగా ఉన్నా కానీ, విదేశం యొక్క మాలలో దూరంగా కూర్చునా కానీ ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఉన్నారో అంటే ఎవరైతే బ్రాహ్మణ కులంలోని వారిగా అయ్యారో వారందరి యొక్క జన్మదినాన్ని కూడా బాప్ దాదా జరుపు కుంటున్నారు మరియు మీరు కూడా జరుపుకుంటున్నారు. అందరిదీ జరుపుకుంటున్నారు కదా! లేక కేవలం ఇక్కడ కూర్చున్నవారిదే జరుపుకుంటున్నారా? అందరూ జ్ఞాపకం ఉన్నారు కదా! అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, జరుపుకోవటం అంటే ఉత్సాహ ఉల్లాసాలలోకి రావటం. అయితే మనస్సులో ఉత్సాహం ఉంది కదా! ఓహో ..... మా యొక్క అలౌకిక జన్మదినం ఓహో! అని పాడుకుంటున్నారు కదా! 

ఈరోజు అమృతవేళ నుండి జన్మదినం యొక్క ఉత్సాహ,ఉల్లాసాలు అందరిలో చాలా, చాలా ఉన్నాయి కదా! బాప్ దాదా కార్డులు కూడా చూసారు, మీరయితే కళ్ళతో చూస్తారు, బాప్ దాదా అయితే సూక్ష్మంగా, మీకంటే ముందుగానే చూస్తారు. కానీ బాప్ దాదా చూశారు - తమ మనస్సులోని ఉల్లాసాన్ని చూపించడానికి ఎంతో ఉత్సాహపడతారు. ఈ రోజులలో ఈ మెయిల్ చాలా చౌకగా ఉంది కదా! అందరు చాలా ఈ మెయిల్స్ పంపిస్తున్నారు. బాప్ దాదా దగ్గరికీ అన్నీ చేరుకుంటాయి. ఈ మెయిల్ అయినా, కార్డ్ అయినా, ఉత్తరం అయినా, మనస్సు యొక్క సంకల్పం అయినా ... అన్నీ చేరుకుంటాయి. అమృతవేళ నుండి నలువైపుల నుండి పంపిన కార్డులు, ఉత్తరాలు, ఈ -మెయిల్స్ సంకల్పాలు అన్నీ కలిపి వతనంలో చూస్తే చాలా మజా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ విచిత్రంగా ఉంటుంది. పుట్టినరోజున భవిష్యత్తు కొరకు సంకల్పం చేస్తారు. పుట్టినరోజు యొక్క నెంబర్ ముందుకు వెళ్తుంది కదా! అంటే 65 నుండి 66కి వచ్చింది కదా! ఏవిధంగా అయితే సంవత్సరాలు ముందుకు వెళ్తున్నాయో అదేవిధంగా పురుషార్థంలో లేదా మీ అమూల్య జీవితం కొరకు, మనస్సులో అంటే సంకల్పంలో, బుద్ధి యొక్క నిర్ణయశక్తిలో, వాచాలో సెకనులో సఫలతామూర్తిగా అయ్యే శక్తిలో మరియు సంబంధ సంపర్కంలో అంటే ప్రతి సమయం సంబంధ, సంపర్కంలో వచ్చే వారికి ఏదోక ప్రాప్తి యొక్క అనుభూతి అవ్వాలి..... ఇలా రాబోయే సంవత్సరం కొరకు ధృఢసంకల్పం యొక్క వ్రతం తీసుకున్నారా? 

ఎందుకంటే శివజయంతి రోజు విశేషంగా బ్రాహ్మణాత్మలకు విశేషంగా రెండు లక్ష్యాలు ఉంటాయి. 1. స్వయంతో ప్రతిజ్ఞ మరియు 2. బాబా ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయాలి అనే లక్ష్యం. ఈ రెండు లక్ష్యాలు విశేషంగా ఈ రోజు అందరిలో ఉంటాయి. బాప్ దాదా మీరందరు అంతకు ముందు చేసిన ప్రతిజ్ఞల యొక్క లెక్కలఖాతా చూసారు. ప్రతి సంవత్సరం, ప్రతి ఒక్కరు విధిపూర్వకంగా సంకల్పంతో, వాణీతో ప్రతిజ్ఞ చేసారు. చాలా మంచిగా చేసారు. కానీ ఇప్పుడు ఈ రోజు తర్వాత అంటే జన్మదినం జరుపుకున్న తర్వాత ఒక మాటపై విశేషంగా అండర్‌లైన్ చేసుకోవాలి. సాధారణమాటయే క్రొత్తది కాదు. ఆ మాట - నిరంతరం ధృఢత. అప్పుడప్పుడు ధృఢంగా, అప్పుడప్పుడు ధృఢతలో సోమరిగా ఉండకూడదు. ఒకవేళ నిరంతరం ధృఢత ఉంటే కనుక దాని యొక్క గుర్తు - నిరంతరం ప్రతి సంకల్పం, మాట, కర్మ ద్వారా స్వయంలో, సేవలో మరియు సంబంధంలో 100% సఫలత లభిస్తుంది. ఎప్పటివరకు అయితే బ్రాహ్మణులలో ఈ అన్ని విషయాలలో సఫలత తక్కువగా ఉంటుందో అప్పటివరకు ప్రత్యక్షత అనేది డ్రామానుసారం ఆగి ఉంటుంది. సఫలత అనేది ప్రత్యక్షతకు ఆధారం. ప్రతి మాట సఫలతో పూర్వకంగా ఉండాలి. ప్రతి సంకల్పం సఫలతాపూర్వకంగా ఉండాలి. అందువలనే ఈ రోజుల్లో స్మృతిచిహ్నంలో కూడా అంటే గురువులుగా పిలవబడే వారిని కూడా సత్యవచన మహారాజు అని అంటారు. వారు అసత్యం చెప్తున్నా కానీ భక్తులు సత్యవచనం అంటారు. అది మీ మాట యొక్క మహిమయే. మహారాజుగా, మహాన్ గా మీరే అవుతున్నారు కదా! అందువలనే సత్యవచన మహారాజులు అంటే మహాన్ ఆత్మలు. నా భావం ఇది కాదు కానీ మాట్లాడేసాను, వచ్చేసింది అని ఇలా ఎప్పుడు అనకండి, ఎందుకంటే భావం లేదా భావన లేకుండా మాట రాదు. అలా అంటున్నారు అంటే అది తప్పించుకోవటం. అలా వచ్చేసింది అని ఒకొక్కసారి అంటున్నారు, అసలు ఎలా ఎందుకు వచ్చేసింది? కంట్రోలింగ్ పవర్ లేక వచ్చేసిందా? అలా అయిపోయింది అని అన్నారు అంటే మీరు రాజు కాదా? ఏదోక కర్మేంద్రియానికి వశీభూతం అయిపోయారు కదా! అందువలనే మాట అలా వచ్చేసింది లేదా అలా అయిపోయింది అంటున్నారు. 

ఈ సంవత్సరంలో శుభాకాంక్షలతో పాటు ప్రతి విషయంలో నిరంతరం ధృఢతపై అండర్‌లైన్ చేసుకోండి. ఈ రోజు పుట్టినరోజు కదా! కనుక ఈ రోజు చెప్పటం లేదు కానీ అందరి చార్ట్ నుండి బాప్ దాదా ఒక విషయం నోట్ చేసుకున్నారు కానీ చివరిసారి వినిపిస్తాను. ఈ రోజు జరుపుకోవాలి, కనుక చెప్పకూడదు. 15 రోజుల తర్వాత వినిపిస్తాను. (బాప్ దాదా చెప్తే కనుక 15 రోజులలో మంచిగా అయిపోతాము అని పిల్లలు చెప్పారు) అయితే 15 రోజుల్లో సరి అయిపోతాం అనిమొదట చెప్పండి అప్పుడు చేస్తే బావుంటుంది. ఏం చేస్తారో తెలియదు కానీ 15 రోజుల్లో పరివర్తన అయిపోవాలి. అయితే చెప్పమంటారా? పాండవులు చెప్పండి - చెప్పమంటారా? మరి 15 రోజుల్లో పరివర్తన అయిపోతారా? సంకల్పం చేస్తారా? మంచిది. పాండవులు చేస్తారా, చెప్పమంటారా? చెప్పటం అయితే సహజమే కానీ చేస్తారా? చేయాల్సి ఉంటుంది. (బాప్ దాదా వెనుక ఉన్నవారిని, మాతలను, టీచర్సును, డబల్ విదేశీయులను అందరినీ అడిగారు. అందరు చేతులు ఊపారు) చేతులు అయితే అందరు మంచిగా ఎత్తేస్తారు. 

జన్మదినోత్సవాన్ని జరుపుకునే నలువైపుల ఉన్న శ్రేష్ట ఆత్మలకి, సదా అలౌకిక జన్మ యొక్క అలౌకిక దివ్య కర్తవ్యం చేసే శ్రేష్ట ఆత్మలకు, సదా ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అనే ఏక్ నామిగా మరియు సర్వఖనాల యొక్క ఎకానమి (పొదుపు) యొక్క అవతార పిల్లలకు, సదా ప్రతి వరదానం మరియు వారసత్వాన్ని జీవితం ద్వారా ప్రత్యక్షం చేసే ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క అలౌకిక జన్మ యొక్క శుభాకాంక్షలతో కూడిన ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments