04-02-2001 అవ్యక్త మురళి

               04-02-2001         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమయప్రమాణంగా స్వరాజ్యాధికారి అయ్యి సర్వ ఆత్మిక సాధనాలను తీవ్రంగా మరియు బేహద్ గా కార్యంలో ఉపయోగించండి.

ఈ రోజు బాప్ దాదా విశ్వం యొక్క అన్ని వైపుల ఉన్న తన యొక్క స్వరాజ్యాధికారి పిల్లల యొక్క రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వరాజ్యాధికారి, పవిత్రత యొక్క లైట్ కిరీటధారులు, అధికారం యొక్క స్మృతి తిలకధారులు, భ్రుకిటి యొక్క అకాలసింహాసనాధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్యాధికారిగా అనుభవం చేసుకుంటారో అంతగానే విశ్వరాజ్యం యొక్క అధికారం లభిస్తుంది. నేను ఎవరు? మరియు నా యొక్క భవిష్యత్తు ఏమిటి? అది ఇప్పుడు మీ స్వరాజ్యం యొక్క స్థితి ద్వారా స్వయమే చూసుకోవచ్చు. 

బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క సదా స్వరాజ్యం యొక్క స్థితిని చూస్తున్నారు. నిరంతరం ప్రతి కర్మ చేస్తూ, లౌకిక, అలౌకిక కార్యం చేస్తూ స్వరాజ్యాధికారం యొక్క నషా ఎంత సమయం మరియు ఏ శాతంలో ఉంటుంది? అని. ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్యం యొక్క స్థితిని సంకల్ప రూపంలో స్మృతి చేస్తున్నారు - నేను అధికారి ఆత్మను అని. 1.సంకల్పంలో ఆలోచించటం, నేనే అని మాటిమాటికి స్మృతిని రిఫ్రెష్ చేసుకోవటం. 2. అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేసుకోవటం మరియు ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారి మనస్సు, బుద్ధి, సంస్కారాల రూపీ సహయోగులపై రాజ్యం చేయటం అంటే అధికారంతో నడిపించటం. మీ అందరికీ అనుభవం ఉంది కదా! ప్రతి సమయం బాప్ దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతంపై నడుస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. అదేవిధంగా స్వరాజ్యధికారి ఆత్మలు మీ యొక్క స్వరాజ్యంలో మీ యొక్క కర్మేంద్రియాలు అంటే కర్మచారులు మీ యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీ యొక్క ఆజ్ఞలో నడుస్తున్నాయా? అన్నీ నడుస్తున్నాయా? ఒకటి, రెండు సంస్కారాలు కొద్దిగా ఒయ్యారం చూపించటం లేదు కదా? మీ యొక్క రాజ్యం లవ్ (ప్రేమ) మరియు లా (నియమం) ప్రకారం నడుస్తుందా? లా మరియు ఆర్డర్ కి బదులు లవ్ మరియు లా లో యదార్థంగా నడుస్తుందా? ఏమనుకుంటున్నారు? ఇలా నడుస్తుందా లేదా కొన్ని పెడచెవిని పెడుతున్నాయా? నా చేయి, నా సంస్కారం, నా బుద్ది, నా మనస్సు అని అంటున్నారు. ఈ నాది అనే వాటిపై నేను అనే మీ యొక్క అధికారం ఉందా? లేదా అప్పుడప్పుడు నాది యొక్క అధికారిగా, అప్పుడప్పుడు నేను యొక్క అధికారిగా అవుతున్నారా? సమయాను సారం ఇప్పుడు సదా మరియు సహజంగా అకాలసింహానాధికారిగా అవ్వండి. అప్పుడే ఇతరాత్మలకు బాబా ద్వారా ముక్తి, జీవన్ముక్తి యొక్క అధికారాన్ని తీవ్రంగా ఇప్పించగలరు. ఇప్పుడు సమయం యొక్క పిలుపు చాలా తీవ్రంగా మరియు బేహద్ గా ఉంది. చిన్న రిహార్సల్ చూసారు మరియు విన్నారు. ఒకేసారి బేహద్ ఉదాహరణ చూసారు కదా! అరవటం కూడా బేహద్లో మరియు చనిపోవటం కూడా బేహద్ గా, చనిపోయిన వారితో పాటు జీవించి ఉన్నవారు కూడా తమ జీవితం యొక్క అలజడితో చనిపోతున్నారు. అలాంటి సమయంలో స్వరాజ్యాధికారి పిల్లలైన మీరు ఏమి కార్యం చేసారు? పరిశీలించుకోండి. స్థూలసాధనాల గురించి చెప్పుకుంటున్నారు కదా, తుఫాను వస్తే ఇది చేయాలి, అగ్ని అంటుకుంటే ఇది చేయాలి, భూకంపం వస్తే ఇది చేయాలి అని అదేవిధంగా శ్రేష్టాత్మలైన మీ దగ్గర సర్వశక్తులు, యోగబలం, స్నేహం యొక్క శక్తి ఇలా ఏవైతే సాధనాలు ఉన్నాయో ఇవి సమయానికి తయారుగా ఉన్నాయా? సర్వశక్తులు ఉన్నాయా? ఎవరికైనా శాంతి యొక్క శక్తి కావాలంటే మీరు మరొక శక్తి ఇస్తే వారు సంతుష్టం అవుతారా? చూడండి - ఎవరికైనా నీరు కావల్సి వస్తే మీరు 36 రకాలతో భోజనం పెడితే వారు సంతుష్టం అవుతారా? కనుక ఎవరెడీగా అవ్వాలి. మీ కొరకు అశరీరీగా అవ్వటం కాదు అది అయితే అవ్వాలి కానీ ఏవైతే సాధనాలు స్వరాజ్యాధికారం ద్వారా లభించాయో , పరమాత్మ వారసత్వంలో లభించాయో వాటి అధికారంలో ఎవరెడీగా అయ్యారా? సమాచారాలలో విన్నారు కదా, ఆ సమయంలో కావల్సిన మిషనరీ విదేశం నుండి వచ్చిన తర్వాత కార్యంలో ఉపయోగించారు అంటే సాధనాలు ఎవరెడిగా లేవు కదా! అన్ని సాధనాలు సమయానికి ఉపయోగించలేదు కనుక ఎంత నష్టం జరిగింది! కనుక ఇలా ఉండకూడదు. కనుక ఓ విశ్వకళ్యాణీ, విశ్వపరివర్తక ఆత్మలూ! అన్ని సాధనాలు ఎవరెడిగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆజ్ఞలో ఉన్నాయా? ఆజ్ఞాపించగానే అంటే సంకల్పం చేయగానే నిర్ణయశక్తి కావాలి అని ఒక సెకను కంటే తక్కువ సమయంలో నిర్ణయశక్తి హాజరవ్వాలి. ఇలా మీ ఆర్డర్‌లో ఉన్నాయా? లేదా మీ దగ్గరకు తీసుకురావడానికి ఒక నిమిషం పడితే ఇతరులకు ఇవ్వగలరా?  

ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వలేకపోతే ఏమౌతుంది? పిల్లలందరి మనస్సులో ఈ సంకల్పమైతే నడస్తుంది - ఇక ముందు ఏమౌతుంది మరియు ఏమి చేయాలి? అని. జరగవలసినవి చాలా ఉన్నాయి. చెప్పాను కదా, ఇదైతే రిహార్సల్ అంతే. ఇప్పుడు 6 నెలలు తయారవ్వడానికి గంట మ్రోగింది, ఇంకా వినాశనానికి గంట మ్రోగలేదు. మొదట గంట మ్రోగుతుంది, తర్వాత నగాడా మ్రోగుతుంది. కొద్ది కొద్దిగా భయపడుతున్నారా? శక్తిస్వరూప ఆత్మలకు ఏమి స్వరూపం చూపించారు? (శక్తి స్వరూపంలో పాండవులు కూడా వస్తారు మరియు శక్తులు కూడా వస్తారు) సదా శక్తులకు కొంతమందికి 4 భుజాలు, కొంతమందికి 6 భుజాలు, కొంతమందికి 8 భుజాలు, కొంతమందికి 16 భుజాలు ఇలా సాధారణంగా చూపించరు. అందువలన సర్వశక్తివంతుని ద్వారా లభించిన మీ యొక్క శక్తులను ప్రత్యక్షం చేయండి. సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షం అవుతాయి అని ఆలోచించకండి. కానీ మొత్తం రోజంతటిలో స్వయం సర్వశక్తులను ఉపయోగించి చూడండి. అన్నింటికంటే మొదటి అభ్యాసం, స్వరాజ్యం యొక్క అధికారాన్ని మొత్తం రోజంతటిలో ఎంత వరకు కార్యంలో ఉపయోగించాను? నేను ఆత్మను, యజమానినే కదా ఇలా కాదు. యజమాని అయ్యి ఆజ్ఞాపించండి మరియు పరిశీలించుకోండి, నా యొక్క ప్రతి కర్మేంద్రియం రాజునైన నా యొక్క లవ్ మరియు లా ప్రకారం నడుస్తుందా? అని. మీరు మన్మనాభవ అవ్వమని ఆజ్ఞాపించారు మరియు మీ మనస్సు వ్యర్ధఆలోచనలలోకి వెళ్తే ఇది లవ్ మరియు లాలో ఉన్నట్లు అవుతుందా? మీరు మధురతా స్వరూపంగా అవ్వమని ఆజ్ఞాపిస్తే సమస్యలననుసరించి, పరిస్థితులననుసరించి క్రోధం యొక్క మహారూపం రాలేదు. కానీ సూక్ష్మరూపంలోనైనా ఆవేశం మరియు చిటపటలు వస్తే అది ఆజ్ఞను అంగీకరించినట్లు అవుతుందా? నిర్మాణంగా అవ్వాలి అని ఆజ్ఞ ఇచ్చారు కానీ వాయుమండలం అనుసరించి ఎంత వరకు అణిగి ఉండి నడుస్తాము, ఏదోకటి చూపించాలి, నేనే అణిగి ఉండాలా? నేనే చనిపోయి ఉండాలా? నేనే మారాలా? ఇలా అంటే లవ్ మరియు లా యొక్క ఆర్డర్లో ఉన్నట్లు అవుతుందా? అందువలన విశ్వాత్మలపై, అరిచేటువంటి దు:ఖీ ఆత్మలపై దయ చూపించే ముందు మీపై మీరు దయ చూపించుకోండి. మీ యొక్క అధికారాన్ని సంభాళించుకోండి. ఇక ముందు మీరు నలువైపుల శక్తినిచ్చేటువంటి, తరంగాలను ఇచ్చేటువంటి, మనస్సు ద్వారా వాయు మండలాన్ని తయారుచేసే కార్యం చాలా చేయాలి. ఇప్పటి వరకు ఏదైతే సేవకి నిమిత్తమయ్యారో చాలా బాగా చేసారు మరియు ఇంకా చేస్తారు. కానీ ఇప్పుడు సమయానుసారం తీవ్రగతితో బేహద్ సేవ చేసే అవసరం ఉంది. కనుక మొదట మిమ్మల్ని మీరు ప్రతి రోజు పరిశీలన చేసుకోండి. ఎంతవరకు స్వరాజ్యాధికారిగా ఉంటున్నాను? అని. ఆత్మ యజమానిగా అయ్యి కర్మేంద్రియలను నడిపించుకోవాలి. నేను యజమానిని, ఈ సహయోగుల ద్వారా కార్యం చేస్తున్నాను అనే స్మృతి ఉండాలి. స్వరూపంలో సంతోషం ఉంటే స్వతహాగానే సర్వకర్మేంద్రియాలు మీ ముందు హాజరవుతాయి. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు వ్యర్థసంకల్పాలను తొలగించుకోవాలి, ఈ రోజు సంస్కారాలను తొలగించుకోవాలి, ఈరోజు నిర్ణయశక్తిని ప్రత్యక్షం చేయాలి అని ఇలా శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక దెబ్బతో సర్వకర్మేంద్రియాలు మరియు మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఏది కావాలంటే అది చేస్తాయి. ఇప్పుడు అంటున్నారు కదా - బాబా ఇలా అవ్వాలంటున్నారు కానీ అంతగా అవ్వలేదు అని. తర్వాత అంటారు ఎలా కావాలనుకుంటున్నారో అలా అయ్యాము అని. సహజం అయిపోతుంది. కనుక ఏమి చేయాలో అర్థమైందా? మీ అధికారాల యొక్క సిద్ధులను కార్యంలోకి తీసుకురండి. సంస్కారాలకు ఆర్డర్ చేయండి. సంస్కారాలు మీకు ఎందుకు ఆర్డర్ చేస్తున్నాయి? సంస్కారాలు ఎందుకు తొలగటంలేదు? సంస్కారాలు మీ యొక్క ఆజ్ఞకు బంధీ అయ్యి ఉన్నాయా? యజమానిస్థితిలో ఉండండి. కనుక ఇప్పుడు ఇతరుల యొక్క సేవ చాలా, చాలా, చాలా, చాలా అవపరం. ఇప్పుడేమీ కాదు. ఇప్పుడింకా నాజుకు సమయం రానున్నది. అలాంటి సమయంలో మీరు ఎగిరేకళ ద్వారా ఫరిస్తా అయ్యి నలువైపుల చక్రం తిరుగుతూ కొంతమందికి శాంతి కావాలి, కొంతమందికి సంతోషం కావాలి, కొంతమందికి సంతుష్టత కావాలి ఇలా ఫరిస్తా రూపంలో చక్రం తిరిగితే వారు కూడా అనుభవం చేసుకుంటారు. ఎలా అయితే ఇప్పుడు నీరు లభించింది, చాలా మంది దాహం తీర్చింది, భోజనం లభించింది, టెంట్ లభించింది అని అనుభవం చేసుకుంటున్నారు కదా! అదేవిధంగా ఫరిస్తా ద్వారా శాంతి లభించింది అని అనుభవం చేసుకుంటారు. శక్తి లభించింది, సంతోషం లభించింది అని అనుభవం చేసుకుంటారు. ఇలా అంత:వాహకం అంటే అంతిమస్థితి, శక్తిస్వరూపస్థితి మీ యొక్క అంతిమ వాహనంగా అవుతుంది మరియు నలువైపుల నడుస్తూ, తిరుగుతూ సర్వులకు శక్తిని ఇస్తారు. మీ యొక్క ఫరిస్తా స్వరూపం వారి ఎదురుగా కనిపిస్తుంది. ఎన్ని ఫరిస్తాలు చక్రం తిరుగుతున్నాయి, శక్తినిస్తున్నారు అని. మీరు శక్తులు వచ్చారు అని పాట పాడతారు కదా! ఆ పాట ప్రత్యక్షం అవుతుంది. శక్తుల ద్వారా సర్వశక్తివంతుడు స్వతహాగానే ప్రత్యక్షం అవుతారు. విన్నారా! ఇప్పటి వరకు ఏదైతే చేసారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారం చాలా మంచిగా జరిగింది. ఇక ముందు చాలా చాలా మంచిగా జరగాల్సిందే. మంచిది. భయపడటంలేదు కదా? సమాచారం చూస్తూ, వింటూ భయపడ్డారా? ఇదైతే ఏమీ కాదు, మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఇదేమీ కాదు కానీ మీ యొక్క సోదరి, సోదరులు కదా! అందువలన వారికి సేవ చేయటం కూడా మంచిది. ఇప్పుడు స్వరాజ్యాధికారి, అకాల సింహాసనంపై కూర్చోండి. పైకి, క్రిందికి అవ్వకండి. అప్పుడు చూడండి, గవర్నమెంట్ కి కూడా సాక్షాత్కారం అవుతుంది, ఇదే, ఇదే, ఇదే అని. సింహాసనం నుండి క్రిందికి దిగకండి. అధికారాన్ని వదలకండి. ప్రతి సమయం అధికారాన్ని నడిపించండి. స్వయంపై నడిపించండి అంతేకానీ ఇతరులపై కాదు. 

క్రొత్త, క్రొత్త పిల్లలు చాలా మంది వచ్చారు. వృద్ది అయితే అవ్వాల్సిందే. ఎవరైతే ఈ కల్పంలో ఈసారి మొదటిగా వచ్చారో వారు చేతులు ఎత్తండి! మంచిగా చేసారు. ధైర్యం పెట్టుకుని చేరుకోవాలి అనుకున్నారు, చేరుకున్నారు కదా! ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉంటే సఫలత లభించినట్లే. ధైర్యం తక్కువగా ఉంటే సఫలత కూడా తక్కువగా వస్తుంది. అందువలనే ధైర్యం మరియు నిర్భయత ఉండాలి. భయంలోకి రాకూడదు. నిర్భయంగా ఉండండి. వారికి శాంతి యొక్క సహయోగం ఇవ్వండి. ఆ ఆత్మకి దయాభావనతో సహయోగం ఇవ్వండి. భయంలోకి రాకండి. భయం చాలా పెద్ద భూతం. ఇతర భూతాలు తొలగిపోతాయి. కానీ భయం యొక్క భూతం చాలా కష్టంగా తొలుగుతుంది. భయం అనేది అనేక రకాలుగా ఉంటుంది. కొంతమందికి తమ బలహీనత కారణంగా భయం వస్తుంది. ఈ అన్ని భయాల నుండి నిర్భయంగా అయ్యే సాధనం సదా స్వచ్చమైన మరియు సత్యమైన మనస్సుతో ఉండండి. స్వచ్ఛమైన మరియు సత్యమైన మనస్సుకి యజమాని రాజీ అయిపోతారు మరియు అందరూ రాజీ అయిపోతారు. ఇప్పుడు ఒక సెకనులో ఫరిస్తా అయ్యి ఎక్కడ భూకంపం వచ్చిందో ఆ నలువైపుల ఫరిస్తాగా అయ్యి ఎగిరేకళ ద్వారా శాంతి, శక్తి మరియు సంతుష్టత యొక్క శక్తిని వ్యాపింపచేసి రండి. ఒక్క సెకనులో చక్రం తిరిగిరండి. అందరు అన్నీ చక్రం తిరిగిరండి. 

నలువైపుల దేశ, విదేశాలలో ఫరిస్తా రూపంలో విరాజమానమై ఉన్న పిల్లలకు, స్వరాజ్యాధికారి పిల్లలకు, సదా మీ యొక్క సహయోగులను, సూక్ష్మ లేదా స్థూల సహయోగులను లవ్ మరియు లాలో నడిపించేవారికి, సదా బాప్ దాదా ద్వారా లభించిన సాధనాలతో ఎవరెడిగా ఉండేవారికి, నేను ఆత్మ రాజు అని భావించి రాజ్యా ధికారం అనుభవం చేసుకునేవారికి, సదా ఎగిరేకళ ద్వారా ఫరిస్తారూపం ద్వారా నలువైపుల శక్తినిచ్చే శక్తి స్వరూప ఆత్మలకు, సదా సత్యమైన హృదయం మరియు స్వచ్ఛమైన మనస్సు ద్వారా నిర్భయంగా అయ్యి నిరాకారి స్థితిని అనుభవం చేసుకునే విశ్వకళ్యాణి, విశ్వపరివర్తక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments