03-03-2000 అవ్యక్త మురళి

             * 03-03-2000         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శుభభావన మరియు ప్రేమ భావనను ఎమర్జ్ చేసుకొని క్రోధ మహాశత్రువుపై విజయులుగా అవ్వండి - ఇదే జన్మదినం యొక్క విశేష కానుక. 

ఈ రోజు బాప్ దాదా తమ జన్మనాటి తోటివారిని అలాగే సేవలోని తోటివారిని చూసి హర్షితమవుతున్నారు. ఈరోజు మీ అందరికీ బాప్ దాదా యొక్క అలౌకిక జన్మ మరియు జన్మనాటి తోటివారి జన్మదినం యొక్క సంతోషము ఉంది. ఎందుకు? ఎందుకంటే, ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక జన్మ ఇంకెవరికీ ఉండజాలదు. తండ్రి యొక్క జన్మదినము మరియు పిల్లల యొక్క జన్మదినము కూడా ఒక్కటే అయి ఉండడం ఎప్పుడూ విని ఉండరు. అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్యమైన జన్మదినాన్ని మీరు ఈ రోజు జరుపుకుంటున్నారు; అలాగే అందరికీ ఇంకొక అతీతమైన మరియు ఎంతో ప్రియమైన విషయం కూడా స్మృతిలో ఉంది - ఈ అలౌకిక జన్మ ఎంత విచిత్రమైనదంటే, స్వయంగా భగవంతుడైన తండ్రి పిల్లల యొక్క ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. పరమాత్మ పిల్లల యొక్క, శ్రేష్ఠ ఆత్మల యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఏదో నామమాత్రంగా మనకు జన్మనిచ్చేవాడు భగవంతుడు, పరమాత్మ అని అంటారు కానీ వారికి తెలియదు, అలాగే అదే స్మృతిలో కూడా నడుచుకోరు. మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మావంశీయులము, పరమాత్మ మా జన్మదినాన్ని జరుపుతారు మరిము మేము పరమాత్మ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటాము అని మీరందరూ అనుభవంతో అంటారు.

ఈ రోజు అన్నివైపుల నుండి ఇక్కడకు ఎందుకు చేరుకున్నారు? అభినందనలు తెలిపేందుకు మరియు అభినందనలు తీసుకునేందుకు. బాప్ దాదా విశేషంగా తమ జన్మనాటి తోటివారికి అభినందనలు తెలుపుతున్నారు. అలాగే సేవలోని తోటివారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అభినందనలతో పాటు పరమ ప్రేమ యొక్క ముత్యాలు, రత్నాలు, వజ్రాల ద్వారా వర్షిస్తున్నారు. ప్రేమ యొక్క ముత్యాలను చూసారు కదా! ప్రేమ యొక్క ముత్యాలను గూర్చి మీకు తెలుసు కదా! పూలవర్షము, బంగారము యొక్క వర్షమైతే అందరూ చూస్తూనే ఉంటారు కానీ బాప్ దాదా మీ అందరి పైనా పరమ ప్రేమ, అలౌకిక స్నేహము యొక్క ముత్యాలను వర్షిస్తున్నారు. ఒక్క సారి కాదు, కోటానుకోట్ల రెట్లుగా హృదయపూర్వకముగా అభినందనలను తెలుపుతున్నారు. అలాగే మీరందరూ కూడా హృదయపూర్వకముగా అభినందనలు తెలుపుతున్నారు. అవి కూడా బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి. కావున ఈ రోజు జరుపుకునే మరియు అభినందనలు తెలుపుకునే రోజు. జరుపుకునేటప్పుడు ఏమి చేస్తారు? బ్యాండ్ మ్రోగిస్తారు. కావున బాప్ దాదా పిల్లలందరి మనఃపూర్వకమైన సంతోషము యొక్క బాజాలను లేక గీతాలను వింటున్నారు. భక్తులు పిలుస్తూ ఉంటారు మరియు పిల్లలైన మీరు బాబా యొక్క ప్రేమలో ఇమిడిపోతారు. అలా ఇమిడిపోవడమైతే వస్తుంది కదా? ఇలా ఇమిడిపోవడమేసమానముగా చేస్తుంది.

బాప్ దాదా పిల్లలను తమ నుండి వేరు చేయజాలరు. అలాగే పిల్లలు కూడా వేరు అవ్వాలనుకోరు కానీ అప్పుడప్పుడూ మాయ యొక్క ఆటలలో కాస్త పక్కకు తప్పుకుంటారు. బాప్ దాదా నేను పిల్లలైన మీకు ఆధారమును అని బాప్ దాదా అంటారు. కానీ పిల్లలు అల్లరిగా ఉంటారు కదా! మాయ అల్లరిగా చేసేస్తుంది, నిజానికి వారు అలా లేరు కానీ మాయ చేసేస్తుంది. కావున ఆధారము నుండి పక్కకు తప్పించేస్తుంది, అయినా బాప్ దాదా ఆధారముగా అయి సమీపముగా తీసుకువస్తారు. బాప్ దాదా ప్రతి ఒక్కరికీ జీవితములో ఏమి కావాలి? అని పిల్లలందరినీ అడుగుతారు. విదేశీయులు రెండు విషయాలను బాగా ఇష్టపడతారు. డబుల్ విదేశీయులకు చాలా ఇష్టమైన రెండు పదాలు ఏమిటి? (కంపానియన్ మరియు కంపెనీ) ఈ రెండూ ఇష్టమే. ఇవి ఇష్టమైనట్లయితే చేతులు ఎత్తండి. భారతీయులకు కూడా ఇష్టమేనా? కంపానియనూ అవసరమే అలాగే కంపెనీ కూడా అవసరమే. కంపెనీ లేకుండా కూడా ఉండలేరు, అలాగే కంపానియన్ లేకుండా కూడా ఉండలేరు. కావున మీ అందరికీ ఎవరు లభించారు? కంపానియన్ లభించారా? లభించారో లేదో చెప్పండి(హాజీ). కంపెనీ లభించిందా? (హాజీ). ఇటువంటి కంపెనీ మరియు ఇటువంటి కంపానియన్ మొత్తం కల్పమంతటిలో ఎవరైనా లభించారా? కల్పపూర్వం లభించారా? ఎప్పుడూ పక్కకు తప్పించని, ఎన్ని అల్లర్లు చేసినా కానీ తాను ఎప్పుడూ ఆధారముగానే అయ్యే కంపానియన్ ఎప్పుడైనా లభించారా? మరియు మీ మనసు కోరుకునే ప్రాప్తులన్నింటినీ పూర్ణం చేస్తాడు. అప్రాప్తి ఏదైనా ఉందా? అందరి హృదయం అలాగే ఉంటోందా లేక ఏదో మర్యాదా పూర్వకముగా పొందేసాము అని అంటున్నారా? ఏదైతే పొందాలో అది పొందేసాము అని అయితే పాడుతూ ఉంటారు. లేక ఇంకా పొందాలా? పొందేసారా? ఇప్పుడు పొందేది ఇంకేదీ లేదా? లేక కొద్ది కొద్ది ఆశలు మిగిలియున్నాయా? అన్ని ఆశలూ పూర్తయ్యాయా లేక ఇంకా మిగిలియున్నాయా? ఇంకా మిగిలియున్నాయి అని బాప్ దాదా అంటున్నారు (బాబాను ప్రత్యక్షం చేయాలి అనే ఆశ మిగిలి ఉంది). పిల్లలందరికీ తెలియాలి అనే ఈ ఆశ బాబాదే. తండ్రి వచ్చాక కూడా ఇంకా ఎవరైనా మిగిలియుండడమా... కావున పిల్లలందరికీ కనీసం మా సదాకాలికమైన తండ్రి వచ్చారు అన్న విషయమైనా తెలియాలి అన్నది బాప్ దాదా యొక్క విశేషమైన ఆశ. కానీ పిల్లల యొక్క హద్దులోని ఇతర ఆశలు పూర్తయిపోయాయా? ప్రేమ యొక్క ఆశలు ఉన్నాయి. స్టేజి పైకి రావాలి అని అందరూ కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? (ఇప్పుడైతే బాబా తాము స్వయమే అందరి వద్దకు వస్తున్నారు). ఈ ఆశ కూడా పూర్తయిపోయింది కదా! మీరు సంతుష్ట ఆత్మలు. అభినందనలు. ఎందుకంటే పిల్లలందరూ వివేకవంతులు. సమయాన్ని బట్టి అటువంటి స్వరూపాన్ని తయారుచేసుకోవలసిందేనని భావిస్తారు. కావున బాప్ దాదా కూడా డ్రామా యొక్క బంధనలో అయితే ఉన్నారు కదా! కావున పిల్లలందరూ సమయానుసారముగా సంతుష్టముగా ఉన్నారు మరియు సదా సంతుష్టమణులుగా అయి మెరుస్తూ ఉంటారు. ఎందుకు? పొందవలసిందేదో పొందేసాము అని మీరు స్వయమే అంటారు కదా! ఇది బ్రహ్మా బాబా యొక్క ఆదిలోని అనుభవం యొక్క పదాలు. కావున బ్రహ్మా బాబా యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో అవే సర్వ బ్రాహ్మణులది కూడా. కావున బాప్ దాదా పిల్లలందరికీ సదా బాబా యొక్క కంపెనీలోనే ఉండండి అని రివైజ్ చేయిస్తున్నారు. బాబా సర్వ సంబంధాల యొక్క అనుభవాన్ని కలిగించారు. తండ్రితోనే సర్వసంబంధాలు అని కూడా మీరు అంటారు. తండ్రియే సర్వసంబంధీకుడైనప్పుడు మరి సమయాన్ని బట్టి అటువంటి సంబంధాన్ని కార్యములో ఎందుకు వినియోగించరు? మరియు ఇవే సర్వసంబంధాలను సమయ, ప్రతి సమయము అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే కంపానియనూ ఉంటారు మరియు కంపెనీ కూడా ఉంటుంది. ఇంకే తోటివారి వైపుకు మనసు మరియు బుద్ధి వెళ్ళజాలదు. సర్వసంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు మరి సర్వసంబంధాల యొక్క సుఖాన్ని తీసుకోండి అని బాప్ దాదా ఆఫర్ చేస్తున్నారు. సంబంధాలను కార్యములో వినియోగించండి. 

కొంతమంది పిల్లలు స్వయాన్ని కొన్ని సమయాలలో ఒంటరిగా లేక కాస్త నీరసంగా అనుభవం చేసుకుంటే బాప్ దాదాకు వారిని చూసినప్పుడు ఇటువంటి శ్రేష్ఠ కంపెనీ ఉంటూ, ఆ కంపెనీని కార్యములో ఎందుకు వినియోగించడం లేదు? అని దయ కలుగుతుంది. పిల్లలు ఏమంటారు? వై, వై(ఎందుకు, ఎందుకు) అని అంటారు. ఈ వై అన్న శబ్దమును వాడకండి, ఇది నెగిటివ్ శబ్దము. అందుకు బదులుగా పాజిటివ్ శబ్దము - ఫ్లై(ఎగరడం). కావున ఎందుకు? ఎందుకు? అని ఎప్పుడూ అనకండి. ఎగిరిపోవాలి అన్నదే గుర్తుంచుకోండి. బాబాను మీతోడుగా చేసుకొని ఎగరండి, అప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. కంపెనీ మరియు కంపానియన్ - ఈ రెండు రూపాలను రోజంతా కార్యములోకి తీసుకురండి. ఇటువంటి కంపానియన్ (జీవిత భాగస్వామి) మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? మీరు బుద్ధి ద్వారా లేక శరీరము ద్వారా రెండు రూపాలలోనూ అలసిపోతే మీ ఈ కంపానియన్ మీకు రెండు రకాలగానూ మాలిష్ చేసేందుకు తయారుగా ఉన్నారు అని కూడా బాప్ దాదా అంటారు. మనోరంజన కలిగించేందుకు కూడా ఎవర్రెడీగా ఉన్నారు. అప్పుడిక హద్దులోని మనోరంజనల యొక్క అవసరమే ఉండదు. ఈ విధంగా ఉపయోగించడం వస్తుందా లేక తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఉన్నతోన్నతమైనవారు అనే భావిస్తున్నారా లేక సర్వసంబంధాలూ ఉన్నాయా? డబుల్ విదేశీయులు అర్థం చేసుకున్నారా?

అచ్చా. ఇప్పుడు జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా! జరుపుకోవాలి కదా! అచ్ఛా ఎవరి జన్మదినమును అయినా జరుపుకునేటప్పుడు వారికి కానుకను ఇస్తారా లేక ఇవ్వరా? (ఇస్తాము) కావున ఈరోజు మీరందరూ బాబా యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. శివరాత్రి అన్న పేరు ఉంది కదా! కావున విశేషముగా తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. జరుపుకునేందుకే వచ్చారు కదా! కావున ఈరోజు జన్మదిన కానుకగా ఏమిచ్చారు? లేక కేవలం కొవ్వొత్తులు వెలిగించి కేక్ కోస్తారా... కేవలం ఇలాగే జరుపుకుంటారా? ఈరోజు ఏ కానుకను ఇచ్చారు? లేక రేపు ఇస్తారా? చిన్నదైనా లేక పెద్దదైనా కానుకను అయితే ఇస్తారు కదా! మరి ఏమిచ్చారు? ఆలోచిస్తున్నారు. అచ్చా మరి ఇస్తారా? ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా? బాప్ దాదా ఏది అడిగితే అది ఇస్తారా లేక మీ ఇష్టానుసారంగా ఇస్తారా? ఏమి చేస్తారు? (బాప్ దాదా ఏది అంటే అది ఇస్తాము). చూడండి, కాస్త ధైర్యాన్ని ఉంచవలసి ఉంటుంది. ధైర్యం ఉందా? మధువనం వారికి ధైర్యము ఉందా? డబుల్ విదేశీయులలో ధైర్యం ఉందా? చేతులైతే బాగా ఎత్తేస్తున్నారు. అచ్చా - శక్తులలో, పాండవులలో ధైర్యం ఉందా? భారతదేశం వారిలో ధైర్యం ఉందా? చాలా మంచిది, ఇదే బాబాకు అభినందనలు లభించినట్లు, అచ్చా - మరి వినిపించాలా? ఇదైతే ఆలోచించవలసి ఉంటుంది అని అయితే అనరు కదా! ఇలా ఉంటుంది, ఉంటుంది అని అనకండి. ఒక్క విషయాన్ని బాబా మెజార్టీలో చూసారు. మైనార్టీ కాదు, మెజార్టీలో చూసారు. ఏమి చూసారు? ఎప్పుడైనా పరిస్థితులు ముందుకు వచ్చినప్పుడు మెజార్టీలో 1, 2, 3 నెంబర్లలో క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా ఎమర్ట్ అయిపోతుంది. కొందరిలో మహాక్రోధం యొక్క రూపంలో ఉంటుంది. కొందరిలో ఆవేశం యొక్క రూపంలో ఉంటుంది, కొందరిలో మూడవ రూపంలో అనగా చికాకు యొక్క రూపంలో ఉంటుంది. చికాకు అంటే ఏమిటో తెలుసు కదా! అది కూడా క్రోధం యొక్క అంశమే, కానీ తేలికైనది. మూడవ నెంబర్ కదా! కావున అది చిన్నది. మొదటిది తీవ్రమైనది, రెండవది దానికన్నా తక్కువ. ఈ రోజుల్లో అందరి భాష రాయల్ గా అయిపోయింది. మరి రాయల్  రూపంలో ఏమంటారు? విషయమే అలా ఉంది కదా! ఆవేశమైతే వస్తుంది కదా! అని అంటారు. కావున ఈ రోజు బాప్ దాదా అందరి నుండి ఈ కానుకను తీసుకోవాలనుకుంటున్నారు. క్రోధమును వదలండి, క్రోధమునే కాదు క్రోధము యొక్క అంశమాత్రము కూడా ఉండకూడదు, ఎందుకు? క్రోధములోకి వచ్చి డిస్ సర్వీస్ చేస్తారు, ఎందుకంటే క్రోధం ఇద్దరి మధ్యలో జరుగుతుంది. అది ఒంటరిగా జరుగదు, ఇద్దరి మధ్యలో జరిగినప్పుడు అది కనిపిస్తుంది. మనస్సులో కూడా ఎవరిపైన అయినా ద్వేషభావము అంశము కూడా ఉన్నా అప్పుడు మనస్సులో కూడా ఆ ఆత్మపై ఆవేశం తప్పకుండా వస్తుంది. కావున బాప్ దాదాకు ఈ డిస్ సర్వీస్ యొక్క కారణము నచ్చదు. కావున క్రోధము యొక్క భావము అంశమాత్రము కూడా ఉత్పన్నమవ్వకూడదు. బ్రహ్మచర్యముపై ధ్యానమును ఉంచుతారు కదా! అలాగే కామం మహాశత్రువు. క్రోధం మహాశత్రువు అని గానం చేయబడింది. శుభభావము, ప్రేమ భావము ఎమర్జ్ అవ్వదు. మళ్ళీ మూడ్ ఆఫ్ చేసేస్తారు. ఆ ఆత్మనుండి దూగమైపోతారు. ముందుకు రారు, మాట్లాడరు. వారి మాటలను వ్యతిరేకిస్తారు. ముందుకు ఎదగనివ్వరు. ఈ రోజు వీరి ఆరోగ్యం బాగోలేదు, అంతే ఇంకేమీ లేదు అని అన్నా ఇవన్నీ బయటివారికి కూడా తెలుస్తాయి. మరి ఈ జన్మదినం నాడు ఈ గిఫ్టు ఇవ్వగలరా? ఎవరైతే మేము ప్రయత్నిస్తాము అని భావిస్తారో వారు చేతులెత్తండి. కానుకను ఇచ్చేందుకు ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అన్నవారు చేతులు ఎత్తండి. సత్యమైన హృదయం కలవారిపై తండ్రి రాజీవుతారు (కొందరు అక్కయ్యలు, అన్నయ్యలు లేచి నిల్చున్నారు). మెల్లమెల్లగా లేస్తున్నారు. నిజం చెప్పినందుకు అభినందనలు. ఎవరైతే ప్రయత్నిస్తాము అని అన్నారో వారికి అలా ప్రయత్నించేందుకు ఎంత సమయం కావాలి? ఒక నెల కావాలా? ఆరు నెలలు కావాలా? ఎంత కావాలి? వదులుతారా లేక వదిలే లక్ష్యమే లేదా? ఎవరైతే ప్రయత్నిస్తాము అని అన్నారో వారు మళ్ళీ లేచి నిల్చోండి. ఎవరైతే మేము 2, 3 నెలల్లో ప్రయత్నించి వదిలివేస్తాము అని భావిస్తున్నారో వారు కూర్చోండి మరియు ఎవరైతే మాకు ఆరు నెలలు కావాలి అని భావిస్తున్నారో వారు పూర్తిగా ఆరు నెలలు తీసుకున్నా దానిని తగ్గించేయాలి. ఈ విషయాన్ని వదిలేయకూడదు, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఈ డిస్ సర్వీస్ కనిపిస్తుంది. మీరు నోటితో చెప్పకపోయినా మీ ముఖం చెబుతుంది, కావున ఎవరైతే ధైర్యమును ఉంచారో వారందరిపైనా బాప్ దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాలను వర్షిస్తున్నారు. అచ్ఛా!

బాప్ దాదా ప్రతిఫలంగా విశేషముగా అందరికీ ఒక వరదానాన్ని కానుకగా ఇస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటున అయినా లేక ఇష్టం లేకపోయినా క్రోధము వచ్చేసినా కేవలం హృదయపూర్వకముగా 'మీఠా బాబా' అన్న శబ్దాన్ని పలకండి. అప్పుడు బాబా యొక్క ఎక్స్ ట్రా సహాయము ధైర్యం ఉన్న పిల్లలకు తప్పకుండా లభిస్తుంది. కేవలం బాబా అని అనకండి 'మీఠా బాబా' అని అనండి, సహాయం లభిస్తుంది. తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యాన్ని ఉంచాలి కదా! కావున లక్ష్యం ద్వారా లక్షణాలు రావాల్సిందే. మధువనం వారు చేతులు ఎత్తండి, అచ్చా - చేసి తీరతారు కదా! (హా జీ) అభినందనలు. చాలా బాగుంది, ఈ రోజు విశేషముగా మధువనం వారికి టోలీ  ఇద్దాము, ఎంతో కష్టపడుతూ ఉంటారు. క్రోధము విషయంలో ఇవ్వడం లేదు. శ్రమిస్తున్నందుకు ఇస్తున్నారు. లేకపోతే చేతులు ఎత్తారు కాబట్టి టోలీ ఇస్తున్నారు అని అందరూ భావిస్తారు. చాలా బాగా కష్టపడతారు. అందరినీ సేవ ద్వారా సంతుష్ట పరచడం ఇది మధువనము యొక్క ఉదాహరణ. కావుననే ఈ రోజు నోటిని తీపి చేస్తారు. మీరందరూ వారి నోరు తీయనవ్వడం చూసి మీ నోటినీ తీపి చేసుకోండి, సంతోషం కలుగుతుంది కదా! ఇది కూడా బ్రాహ్మణ పరివారము యొక్క సాంప్రదాయమే. ఈ మధ్య మీరు కల్చర్ ఆఫ్ పీస్ యొక్క కార్యక్రమాన్ని తయారుచేస్తున్నారు కదా! కావున బ్రాహ్మణ కులము యొక్క సభ్యత - ఇది కూడా మొట్టమొదటి కల్చరే. దాదీ సౌగాద్(కానుక) ఇస్తారు కదా, అందులో ఒక సంచి ఉంటుంది. దానిపై తక్కువగా మాట్లాడండి. మెల్లగా మాట్లాడండి. మధురముగా మాట్లాడండి అని వ్రాయబడి ఉంటుంది. కావున ఈరోజు బాప్ దాదా ఈ కానుకను ఇస్తున్నారు. సంచి ఇవ్వడం లేదు. వరదానముగా ఈ పదాలను ఇస్తున్నారు. ప్రతి బ్రాహ్మణుని ముఖము మరియు నడవడికలో బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి. ప్రోగ్రాం అయితే తయారుచేసారు. భాషణ కూడా తయారుచేస్తారు కానీ మొదట స్వయంలో ఈ సభ్యత ఎంతో అవసరం. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ హర్షితముగా ప్రతి ఒక్కరి సంపర్కములోకి రావాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్కరిలా ఉండకూడదు. ఎవరినైనా చూసి మీ కల్చర్‌ను వదలకూడదు. గతించిన విషయాలను వదిలేయండి. కొత్త సంస్కారాలను ఈ సభ్యతాపూర్ణమైన జీవితములో చూపించండి. ఇప్పుడు అవి చూపించాలి. సరేనా! (అందరూ హాజీ) అని అన్నారు.

ఇది చాలా బాగుంది. డబుల్ విదేశీయులు 'హాజి' అని అనడంలో చాలా బాగున్నారు. భారతవాసీయులకైతే హాజీ అని అనడం ఒక మర్యాద, కేవలం మాయకు ' నా జీ' అని చెప్పండి, చాలు మరియు ఆత్మలతో హాజీ, హాజీ అని అనండి, మాయతో నా జీ, నా జీ' అని అనండి. అందరూ జన్మదినాన్ని జరుపుకున్నారా? కానుకను ఇచ్చారు. అలాగే కానుకను కూడా తీసుకున్నారు. అచ్ఛా!

మీతోపాటు వివిధ స్థానాలలో కూడా ఇలా సభలు ఏర్పడియున్నాయి. కొన్నిచోట్ల చిన్నవి ఉన్నాయి, కొన్నిచోట్ల పెద్ద సభలు ఉన్నాయి. అందరూ వింటున్నారు. చూస్తున్నారు. మరి ఈరోజున మీరు కూడా కానుకను ఇచ్చారా, లేదా? అని బాప్ దాదా వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. అందరూ 'హాజీ', 'హాజీ బాబా' అని అంటున్నారు. బాగుంది. దూరంగా ఉంటూ కూడా ముందే ఉండి వింటున్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే సైన్స్ వారు ఎంతైతే శ్రమిస్తున్నారో దాని వల్ల ఎక్కువగా బ్రాహ్మణులకే లాభం కలగాలి కదా! వారెంతో శ్రమిస్తున్నారు కదా! కావున ఎప్పటినుండైతే సంగమయుగము ప్రారంభమయ్యిందో అప్పటినుండి ఈ సైన్స్ యొక్క సాధనాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. సత్య యుగములో మీ దేవతారూపములో ఈ సైన్స్ సేవ చేస్తుంది, కానీ సంగమయుగములో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి. అలాగే సేవలోనూ, ప్రత్యక్షము చేయడంలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాలరూపముగా సహయోగిగా అవుతాయి. కావున ఈ సైన్స్ కొరకు నిమిత్తముగా అయిన పిల్లలకు కూడా బాగా తమ శ్రమకు అభినందనలు తెలుపుతున్నారు.

దేశ, విదేశాల నుండి వచ్చిన ఎంతో సుందరమైన, శోభాయమానమైన కార్డులను, పత్రాలను బాప్ దాదా చూసారు. కొందరు ఇతరుల ద్వారా ప్రియస్మృతుల యొక్క సందేశాలను కూడా పంపించారు. బాప్ దాదా వారికి కూడా విశేషముగా ప్రియస్మృతులను మరియు జన్మదినం యొక్క పదమా-పదమా-పదమా-పదమా-పదమా(కోటాను) రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. పిల్లలందరూ బాప్ దాదా కనుల ముందుకు వస్తున్నారు. మీరందరూ కేవలం కార్డులనే చూసారు. కానీ బాప్ దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. ఎంతో స్నేహముతో పంపుతారు మరియు అదే స్నేహముతో బాప్ దాదా స్వీకరించారు. కొందరు తమ స్థితిగతులనుగూర్చి కూడా వ్రాసారు. కావున బాప్ దాదా మీరూ ఎగరండి మరియు అందరినీ ఎగిరించండి అని అంటారు. ఎగరడం ద్వారా అన్ని విషయాలూ కింద ఉండిపోతాయి మరియు మీరు సదా ఉన్నతోన్నతుడైన తండ్రితో ఉన్నతముగా ఉంటారు. క్షణములో స్టాప్ అనగానే శక్తుల యొక్క గుణాల యొక్క స్టాకు ఎమర్జ్ చేసుకోండి. అచ్చా!

నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట బ్రాహ్మణ ఆత్మలకు, సదా బాబా యొక్క కంపెనీలో ఉండే వారికి, బాబాను కంపానియన్ గా తయారుచేసుకునే స్నేహీ ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాల సాగరములో ఇమిడిపోయి ఉండే సమానమైన బాప్ దాదా యొక్క శ్రేష్ట  ఆత్మలకు, సదా క్షణములో బిందువును పెట్టే మాస్టర్ సింధూ స్వరూప ఆత్మలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు చాలా చాలా అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్ దాదా అన్నివేళలా పిల్లలందరికీ నమస్తే చేస్తారు. అలాగే ఈరోజు కూడా నమస్తే. 

Comments