03-02-2002 అవ్యక్త మురళి

                03-02-2002         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి, సర్వఖజానాలతో సంపన్నంగా అవ్వండి. 

ఈరోజు ఖజానాలకు యజమాని అయిన బాబా ఖజానాలతో సంపన్నంగా ఉండే తన యొక్క పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. 1. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారి యొక్క గుర్తు - సదా ప్రాప్తిస్వరూప తృప్తి ఆత్మగా కనిపిస్తారు. సదా వారిలో సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే నిండుగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి - మా దగ్గర ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి? అని. ఈ అవినాశి ఖజానా ఇప్పుడు కూడా లభిస్తుంది మరియు భవిష్యత్తులో అనేక జన్మలు మన వెంట ఉంటుంది. ఈ ఖజానా సమాప్తి అయ్యేది కాదు. అన్నింటికంటే మొదటి ఖజానా - జ్ఞానం యొక్క ఖజానా, ఈ జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలో కూడా మీరందరు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవం చేసుకుంటున్నారు. జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుణీ వాతావారణంలో ఉంటూ జ్ఞానఖజానా ఆధారంగా ఈ వాయుమండలం నుండి, వైబ్రేషన్ నుండి అతీతంగా, ముక్తులుగా ఉంటున్నారు, కమలపుష్ప సమానంగా అతీతంగా ముక్తి ఆత్మలుగా ఉంటున్నారు, దు:ఖం నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులుగా ఉంటున్నారు, జీవితంలో ఉంటూ పాత బంధనాల నుండి ముక్తులుగా ఉంటున్నారు, వ్యర్ధసంకల్పాల యొక్క తుఫానుల నుండి ముక్తులుగా ఉంటున్నారు. ముక్తులుగా అయ్యారా? అందరు చేతులు ఊపుతున్నారు. ముక్తి మరియు జీవన్ముక్తి అనేది జ్ఞానఖజానా యొక్క ఫలం మరియు ప్రాప్తి, వ్యర్థసంకల్పాలు రావడానికి ప్రయత్నం చేస్తాయి, వ్యతిరేకం కూడా వస్తుంది కానీ జ్ఞానం అంటే తెలివి ఉంది కదా! వ్యర్ధ సంకల్పాలు లేక వ్యతిరేకత వీటి యొక్క పని రావటం కానీ జ్ఞానీ ఆత్మల యొక్క పని - వీటి నుండి ముక్తులుగా, అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండాలి.కనుక జ్ఞానం యొక్క ఖజానా లభించిందా? అని పరిశీలన చేసుకోండి. నిండుగా ఉందా? సంపన్నంగా ఉందా? లేక తక్కువగా ఉందా? ఒకవేళ తక్కువగా ఉంటే దానిని జమ చేసుకోండి, ఖాళీగా ఉండకూడదు. 

2. యోగ ఖజానా - యోగం ద్వారా సర్వశక్తులు లభిస్తాయి. మిమ్మల్ని మీరు చూసుకోండి - యోగం యొక్క ఖజానా ద్వారా సర్వశక్తులను జమ చేసుకున్నానా? అని. అన్నీ జమ చేసుకున్నారా? ఒకవేళ ఒక శక్తి లోపంగా ఉన్నా సమయానికి మోసం చేసేస్తుంది. మీ అందరి యొక్క టైటిల్ - మాస్టర్ సర్వశక్తివంతులు, శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. కనుక సర్వశక్తుల యొక్క ఖజానా యోగబలం ద్వారా జమ చేసుకున్నారా? నిండుగా, ప్రాప్తి స్వరూపంగా ఉన్నారా లేక లోటు ఉందా? ఎందుకు? ఇప్పుడు మీ యొక్క లోటుని నింపుకోవచ్చు, ఇప్పుడు అవకాశం ఉంది. మరలా సంపన్నంగా అయ్యే సమయం సమాప్తి అయిపోతే లోపం ఉండిపోతుంది. ఒక్కొక్క శక్తిని ఎదురుగా తెచ్చుకుని మొత్తం రోజంతటి దినచర్యలో పరిశీలన చేసుకోండి ఒకవేళ శాతం తక్కువగా ఉంటే పూర్తి పాస్ అనరు. ఎందుకంటే మీ అందరి యొక్క లక్ష్యం - ఎవరినైనా మీరు ఫుల్ పాస్ అవుతారా లేక సగం పాస్ అవుతారా అని అడిగితే అందరు మేము సూర్యవంశీయులు అవుతాము కానీ చంద్ర వంశీయులు అవ్వము అని చెప్తారు. బాప్ దాదా మంచి సింహాసనం ఇస్తారు. చంద్రవంశీయులుగా అవుతారా? విదేశీయులు అవుతారా? భారతదేశం వారు సూర్యవంశీయులుగా, విదేశం వారు చంద్రవంశీయులుగా ఇలా అవ్వరు కదా? అందరు సూర్యవంశీయులుగా అవ్వాలి కదా? అవ్వవలసిందే. ఇది అయితే బాబా సంభాషణ చేస్తున్నారు. సూర్యవంశీయులుగా అవ్వాలంటే ధృఢనిశ్చయంతో బాబాతో మరియు స్వయంలో ప్రతిజ్ఞ చేసుకోండి - ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క శాతంలో లోపం ఉంచుకోను అని. ఒకవేళ పరిస్థితులు అనుసరించి, సమస్యలనుసరించి శాతం తక్కువ అయ్యింది అంటే 14 కళల వారిగా అవుతారు. అందువలనే బాప్ దాదా ఈ రోజులలో నలువైపుల ఉన్న పిల్లల యొక్క లెక్కలఖాతా మరియు రిజిష్టర్ పరిశీలన చేస్తున్నారు. బాప్ దాదా దగ్గర కూడా ప్రతి ఒక్కరి రిజిష్టర్ ఉంది. ఎందుకంటే సమయం అనుసరించి బాప్ దాదా మొదటే పిల్లలకు చెప్తున్నారు - సమయం వేగం అనుసరించి ఇప్పుడు ఎప్పుడో అనకండి, "ఇప్పుడే అనండి అని. ఎప్పుడో అవుతుంది, చేస్తాము .... అవ్వవలసిందే ..... ఇలా ఆలోచించకండి. అవ్వవలసిందే కాదు ఇప్పుడిప్పుడే చేయవలసిందే. సమయం యొక్క వేగం తీవ్రం అవుతుంది. అందువలనే ఏదైతే లక్ష్యం పెట్టుకుంటున్నారో - బాబా సమానంగా అవ్వాలి, పుల్ పాస్ అవ్వాలి, 16 కళా సంపన్నంగా అవ్వాలి అని ఈ లక్ష్యం మరియు ప్రత్యక్షంలో లక్షణాలు సమానంగా ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యం మరియు లక్షణాలలో సమానంగా ఉంటారో అప్పుడే సహజంగా బాబా సమానంగా అవుతారు. కనుక పరిశీలన చేసుకోండి. అయిపోతుంది, తయారైపోతాము ..... ఇవి సోమరితనం యొక్క మాటలు. ఏది చేయాలనుకున్నా, ఎలా తయారవ్వాలనుకున్నా, ఏ లక్ష్యం ఉందో అది ఇప్పటినుండే చేయాలి, తయారవ్వాలి. ఎప్పుడో అనే శబ్దం తగిలించకండి, ఇప్పుడే అనండి.

3. జ్ఞానం యొక్క ఖజానా, యోగం యొక్క ఖజానా మరియు ధారణల యొక్క ఖజానా కూడా ఉంది. ధారణల ద్వారా గుణాల యొక్క ఖజానా జమ అవుతుంది. ఎలా అయితే శక్తులలో సర్వశక్తులు జమ అవుతాయో అలాగే గుణాలలో కూడా సర్వగుణాలు జమ అవుతాయి, కేవలం గుణాలు కాదు, సర్వగుణాలు జమ అవుతాయి. కనుక సర్వగుణాలు ఉన్నాయా? లేక ఒకటి, రెండు గుణాలు తక్కువగా ఉన్నా ఫర్వాలేదు అనుకుంటే అది నడుస్తుందా? నడవదు. సర్వగుణాల యొక్క ఖజానా జమ అయ్యిందా? ఏ గుణం లోపంగా ఉందో దానిని పరిశీలన చేసుకుని నిండుగా అవ్వండి. 

4. సేవ. సేవ ద్వారా అందరికీ అనుభవం కూడా ఉంది - ఎప్పుడైనా ఏ సేవ అయినా మనసాసేవ అయినా, వాచా సేవ అయినా, లేక కర్మ ద్వారా అయినా సేవ చేస్తే దానికి ఫలంగా ఆత్మిక సంతోషం లభిస్తుంది. కనుక సేవ ద్వారా ఎంత వరకు సంతోషం యొక్క అనుభూతి అయ్యింది? అనేది పరిశీలన చేసుకోండి. ఒకవేళ సేవ చేసారు, కానీ సంతోషం రాలేదు అంటే అది యదార్ధసేవ కాదు. సేవలో ఏదైనా లోపం ఉంటే కనుక సంతోషం లభించదు. సేవ అంటే ఆత్మ తనని తాను సంతోషంగా వికసించిన ఆత్మిక గులాబీగా, సంతోషం యొక్క ఊయలలో ఊగుతున్నట్లు అనుభవం చేసుకుంటుంది. కనుక పరిశీలన చేసుకోండి - మొత్తం రోజంతా సేవ చేసారు కానీ మొత్తం రోజంతటి సేవ యొక్క సంతోషం వచ్చిందా లేక ఆలోచనలోనే నడుస్తూ ఉన్నారా? ఇది కాదు, అది కాదు ..... అని. మరియు మీ సంతోషం యొక్క ప్రభావం ఒకటి - సేవాస్థానంపై, రెండు - సేవా సహయోగులపై, మూడు - ఏ ఆత్మలకైతే సేవ చేస్తున్నారో ఆ ఆత్మల యొక్క వాయుమండలం సంతోషం అవుతుంది, ఇది సేవ యొక్క ఖజానా - సంతోషం. 

మరొక విషయం - నాలుగు సబ్జక్టులు అయితే వచ్చేస్తాయి. మరియు సంబంధ, సంపర్కాలు కూడా చాలా అవసరం. కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు - బాప్ దాదాతో అయితే సంబంధం ఉండనే ఉంది పరివారంతో ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, బీజంతో అయితే ఉంది కదా! అని. కానీ మీరయితే విశ్వంపై రాజ్యం చేయాలి కదా! అయితే రాజ్యంలో సంబంధంలోకి రావలిసే ఉంటుంది. అందువలన సంబంధ, సంపర్కంలోకి రావలిసిందే కానీ సంబంధ, సంపర్కాల ద్వారా ఆశీర్వాదాల యొక్క యదార్థ ఖజానా లభిస్తుంది. సంబంధ, సంపర్కాలు లేకుండా ఆశీర్వాదాల యొక్క ఖజానా జమ అవ్వదు. తల్లి, తండ్రి యొక్క ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి కానీ సంబంధ, సంపర్కంలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ యద్దారరీతిలో సంబంధ, సంపర్కాలు ఉంటే ఆశీర్వాదాల యొక్క అనుభూతి అవ్వాలి మరియు ఆశీర్వాదాల యొక్క అనుభూతి ఏముంటుంది? అనుభవీలే కదా! ఒకవేళ సేవ ద్వారా ఆశీర్వాదాలు లభిస్తున్నాయి అంటే స్వయం కూడా తేలికగా ఉంటారు మరియు ఎవరి సంపర్కంలోకి వచ్చురో వారు కూడా తేలికగా ఉంటారు. (దగ్గు వస్తుంది) బాజా (దాదీ శరీరం) సరిగా లేదు అయినా కానీ మ్రోగించాలి కదా! ఆశీర్వాదాలు లభిస్తే ఇదే అనుభవం అవుతుంది - స్వయం కూడా సంబంధంలోకి వస్తూ, కార్యం చేస్తూ డబల్ లైట్ గా ఉంటారు. తేలికగా ఉంటారు. బరువు అనేది అనుభవం అవ్వదు మరియు మీరు ఎవరికైతే సేవ చేసారో అంటే సంబంధ, సంపర్కంలోకి వచ్చినవారు కూడా డబల్ లైట్ యొక్క అనుభవం చేసుకుంటారు. వారు కూడా వీరు సంబంధంలో సదా తేలికగా అంటే ఈజీగా ఉంటారు, బరువుగా ఉండరు అనే అనుభవం చేసుకుంటారు. సంబంధంలోకి రావాలా, వద్దా..... అని అనుకోరు. ఎందుకంటే ఆశీర్వాదాలు లభించిన కారణంగా రెండు వైపులా నియమప్రమాణంగా ఉంటారు. అలాగని అతి సహజంగా కూడా ఉండకూడదు. బాగా తీపి ఉన్నచోట చీమలు కూడా చాలా చేరుతాయి అంటారు కదా! అలా అంత అతిగా ఉండరు కానీ డబల్ లైట్ గా ఉంటారు. అందువలన బాప్ దాదా చెప్తున్నారు - మీ యొక్క ఖజానాలను పరిశీలన చేసుకోండి. సమయం ఇస్తున్నాను, ఇప్పుడు ఇంకా సమాప్తం అనే బోర్డ్ పెట్టలేదు. అందువలన పరిశీలన చేసుకోండి మరియు పెంచుకోండి. బాప్ దాదాకి పిల్లలపై ప్రేమ ఉంది కదా! కనుక బాప్ దాదా ఏ పిల్లవాడు వెనుక ఉండకూడదు అని భావిస్తున్నారు. ప్రతి పిల్లవాడు ముందుకు వెళ్ళాలి అని. నడుస్తూ, నడుస్తూ దేహాభిమానం వస్తుంది. స్వమానం మరియు దేహాభిమానం.స్వమానంలో లోపం వస్తున్న కారణంగా దేహాభిమానం వస్తుంది. దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి చాలా సహజసాధనం - దేహాభిమానం రావడానికి ఒకే అక్షరం ఉంది, ఒకే శబ్దం ఉంది, అది మీకు తెలుసు కూడా! దేహాభిమానం యొక్క ఒక శబ్దం ఏమిటి? (నేను) ఎన్నిసార్లు మీరు నేను, నేను అంటున్నారు? మొత్తం రోజంతటిలో ఎన్ని సార్లు నేను అంటున్నారు అది ఎప్పుడైనా నోట్ చేసారా? మంచిది, ఒక రోజు నోట్ చేయండి. మాటి, మాటికి నేను అనే శబ్దం వస్తూనే ఉంటుంది. కానీ నేనెవరు? మొదటి పాఠమే, నేనెవరు? దేహాభిమానంలో నేను అంటున్నారు. కానీ వాస్తవానికి నేనెవరు? ఆత్మయా లేక దేహమా? ఆత్మ, దేహాన్ని ధారణ చేసిందా లేక దేహం, ఆత్మని ధారణ చేసిందా? ఏమి జరిగింది? ఆత్మ దేహాన్ని ధారణ చేసింది. మంచిదే కదా? ఆత్మ దేహాన్ని ధారణ చేస్తే నేనెవరు? ఆత్మ కదా! కనుక సహజమైన సాధనం ఏమిటంటే - ఎప్పుడు నేను అనే మాట మాట్లాడినా, నేను ఎటువంటి ఆత్మను? అనేది స్మృతి ఉంచుకోండి. ఆత్మ నిరాకారి, దేహం సాకారి. నిరాకారి ఆత్మ సాకార దేహాన్ని ధారణ చేసింది. కనుక ఎన్ని సార్లు నేను, నేను అనే మాట మాట్లాడిన అంత సమయం నేను నిరాకారి ఆత్మను, సాకారంలో ప్రవేశించాను అని స్మృతి ఉంచుకోండి. ఎప్పుడైతే నిరాకారి స్మతి ఉంటుందో అప్పుడు నిరహంకారి స్థితి స్వతహాగా వస్తుంది. దేహాభిమానం సమాప్తి అయిపోతుంది. అదే మొదటి పాఠం నేనెవరు? నేను ఎటువంటి ఆత్మను ఇలా ఆత్మ యొక్క స్మృతి రావటం ద్వారా నిరాకారి స్థితి పక్కా అవుతుంది. ఎక్కడ నిరాకారిస్థితి ఉంటుందో అక్కడ నిరహంకారిగా, నిర్వికారిగా అయిపోతారు. కనుక రేపటి నుండి నోట్ చేసుకోండి - ఎప్పుడైతే నేను అనే మాట అంటున్నానో అప్పుడు ఏమి స్మృతి వస్తుంది? అప్పుడు ఎంతగా నేను అనే మాట ఉపయోగిస్తారో అంతగా నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా స్వతహాగా అవుతారు. మంచిది. 

ఈరోజు యూత్ (యువకులు) గ్రూప్ వచ్చింది. యూత్ చాలామంది ఉన్నారు. బాప్ దాదా యూత్ గ్రూప్ కి వరదానం ఇస్తున్నారు - సదా సంపన్నంగా ఉండండి అని. ఒక ఖజానా కూడా వ్యర్థం చేయకూడదు, సంపన్నంగా ఉండాలి, సంపన్నంగా చేయాలి. లౌకిక గురువులు ఆశీర్వాదం ఇస్తారు - ఆయుష్మాన్ భవ అని. మరియు బాప్ దాదా చెప్తున్నారు - శరీరం యొక్క ఆయువు అయితే ఎంత ఉంటే అంతే ఉంటుంది. అందువలన శరీరం యొక్క ఆయువు యొక్క లెక్కతో అయితే బాబా ఆయుష్మాన్ భవ అనే వరదానం ఇవ్వటం లేదు కానీ ఈ బ్రాహ్మణజీవితంలో సదా ఆయుష్మాన్ భవ అనే వరదానం ఇస్తున్నారు. ఎందుకు? బ్రాహ్మణుల నుండి దేవతగా అవుతారు. కనుక ఆయుష్మాన్‌గా అవుతారు కదా! యూత్ కి ఒక విశేషత ఉంటుంది. మీ యొక్క విశేషత తెలుసా మీకు? ఏ విశేషత ఉంటుందో తెలుసా? మీలో ఏ విశేషత ఉంది? (ఏది కావాలంటే అది చేయగలం) మంచిది - చేయగలరా? మంచి విషయం, యువకుల గురించి ప్రపంచంలోని వారు అంటారు యువకులు చాలా మొండిగా ఉంటారు, వారు ఏది అనుకుంటారో అది చేసి చూపిస్తారు అని. ఇలా వారు వ్యతిరేకంగా అంటారు కానీ బ్రాహ్మణులైన యువకులు మొండిగా ఉండరు కానీ తమ ప్రతిజ్ఞతో పక్కాగా ఉండేవారు, తొలగిపోయేవారు కాదు. యూత్ ఇలా ఉన్నారా? చేతులు ఎత్తడం అయితే చాలా సహజం. చేతులు ఎత్తడం ఇది కూడా ధైర్యం కదా! కనుక బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ రోజు అమృతవేళ బాబాతో చేసిన ప్రతిజ్ఞ - మేము ఈ బ్రాహ్మణజీవితం యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడు సంకల్పంలో కూడా తొలగిపోము అనే ఈ ధైర్యాన్ని, ప్రతిజ్ఞను రోజు రిపీట్ చేసుకోండి. మరియు మాటిమాటికి పరిశీలన చేసుకోండి - దేని గురించి ధైర్యం పెట్టుకున్నానో, సంకల్పం చేసానో అది ప్రత్యక్షంలో జరుగుతుందా? అని. 

గవర్నమెంట్ అయితే రెండు, నాలుగు లక్షల మంది యూత్ తయారయినా మంచిదే అంటుంది. బాప్ దాదా చెప్తున్నారు - ఇక్కడ ఒక్కొక్క బ్రాహ్మణ యువకుడు ఒకొక్కరు లక్ష మందితో సమానం. అంత గట్టివారు. అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత మాయ వచ్చేసింది, సంస్కారాలు వచ్చేసాయి, సమస్య వచ్చేసింది .... ఇలా వ్రాయకండి. సమస్యల యొక్క సమాధాన స్వరూపంగా అవ్వండి. సమస్యలైతే వస్తాయి కానీ మిమ్మల్ని మీరు నేనెవరు? అని అడగండి. సమాధానస్వరూపాన్నా లేక సమస్యతో ఓడిపోయేవారిమా? మీ అందరి యొక్క టైటిల్ ఏమిటి? విజయీరత్నాలా లేక ఓడిపోయే రత్నాలా? విజయీరత్నాలు కదా! బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే బాప్ దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాని మస్తకంలో విజయీ తిలకం పెట్టారు. కనుక అమరభవ యొక్క వరదానీలు. ఇప్పుడు మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, ఇలా ప్రతిజ్ఞ అయితే అందరు చేస్తున్నారు కానీ మనస్సులో మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి - ఎప్పుడు కూడా సంస్కారాలకు వశం అవ్వము. బాబా యొక్క సంస్కారం ఏదైతే ఉందో అదే బ్రాహ్మణాత్మనైన నా యొక్క సంస్కారం. ద్వాపర, కలియుగం యొక్క సంస్కారాలు నా యొక్క సంస్కారాలు కాదు, ఎందుకంటే అవి బాబా యొక్క సంస్కారాలు కాదు. ఈ తమోగుణీ సంస్కారాలు బ్రాహ్మణ సంస్కారాలా? కాదు కదా! కనుక మీరెవరు? బ్రాహ్మణులు కదా ! 

బాప్ దాదాకి కూడా యూత్ గ్రూప్ గురించి గర్వంగా ఉంది. దాదీలకు కూడా యూత్ గురించి గర్వంగా ఉంది. దాదీకు కూడా యూత్ అంటే ఇష్టం కదా! ఎగస్ట్రా ప్రేమ ఉంది కదా! కుమారులు సు (మంచి) కుమారులుగా అవ్వాలి. కుమారులుగా కాదు, మంచి కుమారులుగా అవ్వాలి. ఒకొక్క కుమారుడు విశ్వంలోని కుమారులను పరివర్తన చేసి చూపించాలి. మంచిది, కుమారులకు పని ఇవ్వనా? ధైర్యం ఉందా? చేయవలసి ఉంటుంది. కుమారులు చెస్తారా?

పని ఇస్తున్నాను - ధ్యాసతో వినండి. మరలా వచ్చే సీజన్ ఉంటుంది కదా, వచ్చే సీజన్లో కూడా ఇలాగే కుమారులకు స్పెషల్ ప్రోగ్రామ్ పెడతారు కానీ ..... కానీ అనేది కూడా ఉంటుంది. ఎక్కువ పని ఇవ్వటంలేదు ఒక్కొక్క కుమారుడు 10 మంది కుమారులను అంటే చేతికి చిన్న కంకణాన్ని తయారుచేసి తీసుకురావాలి. చేతికి కంకణం ధరిస్తారు కదా! బ్రహ్మాబాబా సదా చేతిలో పువ్వుల యొక్క కంకణం ఉంచుతారు. కనుక ఒక్కొక్క కుమారుడు కచ్చా, కచ్చా వారిని కాదు, పక్కా పక్కా కుమారులను తీసుకురావాలి. లేకపోతే మధువనం వస్తారు కానీ మరలా ఇంటికి వెళ్ళి మారిపోతారు. ఇలా పక్కాగా చేసి తీసుకురావాలి. వారిని చూసి బాప్ దాదా ఓహో కుమారులూ! ఓహో!! అనాలి. ఇలా తయారుచేస్తారా? కొద్దిగా ఆలోచించుకోండి. చేయవలసి వస్తుంది, తయారుచేయవలసి వస్తుంది అని ఇలా ఆలోచించి చేతులు ఎత్తకండి. డబల్ విదేశీయులు కూడా చేస్తారా? డబల్ విదేశీయులలో కుమారులు చేతులు ఎత్తండి? మీరు కూడా 10 మందిని తీసుకువస్తారు కదా? విదేశీయులు కూడా తీసుకువస్తారు మరియు భారతవాసీయులు కూడా తీసుకువస్తారు. మరలా ఎవరైతే ఫస్టక్లాస్ క్వాలిటి వారిని తీసుకువస్తారో వారికి బహుమతి ఇస్తారు. గొప్ప బహుమతియే ఇస్తారు, చౌకగా ఉండేది కాదు. కుమారులపై ప్రేమ ఉంది కదా! ఒకవేళ గవర్నమెంట్ కి కూడా ఎక్కువలో ఎక్కువ మంచి కర్మ చేసే కుమారులు లభిస్తే ఎంత సంతోషిస్తారు! మీరు ఒక్కొక్కరు 10 మంది కుమారులను తీసుకువస్తే మొత్తం హాల్ కుమారులతో నిండిపోతుంది. అప్పుడు ఈ కుమారులను చూడండి అని గవర్నమెంట్ వారిని పిలుస్తారు. కానీ తీసుకురావాలి మరియు తయారు చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క స్థితిని మరియు లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉంచుకుంటే సేవలో సఫలత వస్తుందా, రాదా అనే సంకల్పం కూడా రాదు. సఫలత లభించే ఉంది, కేవలం మీరు నిమిత్తంగా అవ్వవలసి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను సదా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అద్భుతం అయితే చేయాలి కదా! మంచిది! 

డబల్ విదేశీయులు కూడా వచ్చారు. బాప్ దాదా చెప్తున్నారు - డబల్ విదేశీయులు బాప్ దాదా యొక్క ఒక టైటిల్ ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు. అది ఏమిటి? (విశ్వకళ్యాణకారి) మొదట స్థాపన జరిగినప్పుడు భారతదేశం యొక్క కళ్యాణకారిగా అయ్యారు కానీ డబల్ విదేశీయులు ఎప్పుడైతే బ్రాహ్మణాత్మలుగా అయ్యారో అప్పటినుండి బాబా యొక్క విశ్వకళ్యాణకారి అనే టైటిల్ ప్రాక్టికల్ గా ప్రత్యక్షం అయ్యింది. అందువలనే బాప్ దాదాకి డబల్ విదేశీయుల గురించి కూడా గర్వంగా ఉంది. బాప్ దాదా చూసారు - డబల్ విదేశీయులకు సేవ విషయంలో ఒక పట్టుదల ఉంది - ఏ కోన మిగిలిపోకూడదు అని. 

(మురళీ మధ్యలో అకస్మాత్తుగా బాప్ దాదా ఎదురుగా ఇద్దరు కుమారులు స్టేజ్ పైకి వచ్చేశారు, వారిని తొలగించి పంపారు) 

మంచిది, ఇప్పుడు ఆటలో ఆట చూసారు కదా! ఇప్పుడు బాప్ దాదా చెప్తున్నారు - సాక్షిగా అయ్యి ఆట చూశారు, ఆనందం పొందారు కదా! ఇప్పుడు ఒక సెకనులో ఒక్కసారిగా దేహానికి అతీతంగా శక్తిశాలిగా ఆత్మిక స్వరూపంలో స్థితులవుతున్నారా? పుల్ స్టాప్ పెట్టాలి. మంచిది. ఇదే అభ్యాసం ప్రతి సమయం మధ్యమధ్యలో చేయాలి. ఇప్పుడిప్పుడే కార్యంలోకి రావాలి, ఇప్పుడిప్పుడే కార్యానికి అతీతంగా, సాకారి నుండి నిరాకారి స్థితిలో స్థితులవ్వాలి. అలాగే ఇక్కడ కూడా ఒక అనుభవం చూసారు కదా! అలాగే ఏదైనా సమస్య వస్తే ఒక సెకనులో సాక్షి దృష్టితో సమస్యను ఒక సైడ్ సీన్ గా (మార్గమధ్య దృశ్యం) భావించి, తుఫానును కూడా కానుకగా భావించి దానిని దాటేయండి. అభ్యాసం ఉంది కదా? మున్ముందు ఈ అభ్యాసం చాలా అవసరం అవుతుంది. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది? అనే ప్రశ్నార్థకం పెట్టకూడదు. అయిపోయింది అంతే, పుల్ స్టాప్ పెట్టాలి మరియు పూర్తిగా శక్తిశాలి స్థితిలో స్థితులవ్వాలి. అప్పుడు సమస్య క్రింద ఉండిపోతుంది, మీరు ఉన్నత స్థితిలో సమస్యను సైడ్ గా చూస్తూ ఉంటారు. మంచిది. ఎవరైతే దూరంగా కూర్చుని చూస్తున్నారో, భారతదేశంలో లేదా విదేశాలలో వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా. అలా దూరంగా ఉన్నా కానీ మనస్సుతో సమీపంగా ఉన్న పిల్లలకు మొదట బాప్ దాదా ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు - ఎవరికి ఏ సమయం అవుతుంది అనేది, అయినప్పటికీ రాత్రిని పగలుగా చేసుకుని, పగలుని రాత్రిగా చేసుకుని కూర్చుంటున్నారు. ఇది పిల్లలు మరియు తండ్రి యొక్క ప్రేమ మరియు మధ్యలో బాప్ దాదా వైజ్ఞానిక పిల్లలకు (సైన్స్ వారికి) కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలైన మీ కోసం ఈ సైన్స్ సాధనాలు తయారుచేసారు. అందువలనే బాప్ దాదా ఆ పిల్లలకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీ కోసమే ఈ సాధనాలన్నీ 100 సంవత్సరాలలోపే తయారయ్యాయి. కనుక సైన్స్ వారి యొక్క అద్భుతం కదా, వారికి ధన్యవాదాలు కదా! మంచిది! 

నలువైపుల సర్వఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మలకు, సదా ప్రతి సమయం, ప్రాప్తులతో నిండుగా ఉండేవారికి, నవ్వుతూ హర్షితంగా ఉండే ఆత్మలకు, సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే జ్ఞానీ ఆత్మలకు, యోగీ ఆత్మలకు, సదా లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా ఉంచుకునే బాబా సమాన ఆత్మలకు, సదా ప్రతి సమయం సర్వఖజానాల యొక్క స్టాక్ జమ చేసుకునే వారికి మరియు స్టాప్ చేసే తీవ్ర పురుషార్ది శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, మనోభిరాముని మనస్సు యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments