01-03-1999 అవ్యక్త మురళి

             01-03-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

హోలీ జరుపుకోవటం అంటే సంపూర్ణ పవిత్రంగా అయ్యి సంస్కారాల కలయిక జరుపుకోవటం.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న తన యొక్క పవిత్రమైన (హోలియస్ట్) మరియు ఉన్నతమైన (హైయస్ట్) పిల్లలను చూస్తున్నారు. విశ్వంలో అందరికంటే ఉన్నతోన్నతమైన శ్రేష్ట ఆత్మలు పిల్లలైన మీరు తప్ప మరెవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరందరు ఉన్నతోన్నతమైన బాబా యొక్క పిల్లలు. కల్పం అంతటిలో చూడండి - అందరి కంటే ఉన్నత కర్తవ్యం గలవారు మరెవరైనా కనిపిస్తారా? రాజ్యాధికారి స్వరూపంలో కూడా మీ కంటే ఉన్నత రాజ్యాధికారిగా ఎవరైనా అయ్యారా? పూజ మరియు మహిమలో చూడండి - మీకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుందో, దాని కంటే ఎక్కువగా మరెవరికైనా జరుగుతుందా? డ్రామా యొక్క అద్భుతమైన రహస్యం ఎంత శ్రేష్టమైనది అంటే మీరు స్వయంగా చైతన్యరూపంలో ఉన్నారు మరియు మీ యొక్క పూజ్యాస్వరూపాన్ని ఈ సమయంలో జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నారు మరియు చూస్తున్నారు కూడా! ఒకవైపు మీరు చైతన్య ఆత్మలు, రెండవవైపు మీ జడచిత్రాలను పూజ్య రూపంలో ఉన్నాయి. మీ పూజ్య స్వరూపాన్ని మీరు చూస్తున్నారు కదా? జడ రూపంలో కూడా ఉన్నారు మరియు చైతన్య రూపంలో కూడా ఉన్నారు. కనుక అద్భుతమైన ఆట కదా! మరియు రాజ్యం యొక్క లెక్కప్రకారంగా కూడా కల్పం అంతటిలో నిర్విఘ్న అఖండ, స్థిరమైన రాజ్యం మీ ఒక్కరిదే నడుస్తుంది. రాజులుగా చాలామంది అవుతారు కానీ మీరు విశ్వానికి రాజులు మరియు విశ్వరాజు యొక్క రాయల్ ఫ్యామిలీ అందరికంటే శ్రేష్టమైనది. అంటే రాజ్యంలో కూడా ఉన్నతమైనవారు, పూజ్య రూపంలో కూడా ఉన్నతమైనవారు మరియు ఇప్పుడు సంగమయుగంలో పరమాత్మ వారసత్వానికి అధికారులు, పరమాత్మ కలయికకు అధికారులు, పరమాత్మ ప్రేమకు అధికారులు, పరమాత్మ పరివారంలోని ఆత్మలు... ఇలా మరెవరైనా అవుతారా? మీరే అయ్యారు కదా? అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కూడా కానీ ఇప్పుడు వారసత్వం తీసుకుని సంపన్నంగా అయ్యి బాబాతో పాటు మీ ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు. సంగమయుగం యొక్క సుఖం, సంగమయుగం యొక్క ప్రాప్తులు, సంగమయుగం యొక్క సమయం ఇష్టమనిపిస్తున్నాయి కదా! చాలా ప్రియమనిస్తాయి. రాజ్య సమయం కంటే కూడా సంగమయుగ సమయం ప్రియమనిపిస్తుంది కదా? ప్రియంగా అనిపిస్తుందా లేక త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? మరయితే బాబా వినాశనం ఎప్పుడు అవుతుంది అని ఎందుకు అడుగుతున్నారు? వినాశనం ఎప్పుడు అవుతుందో, ఏమవుతుందో, మేము ఎక్కడ ఉంటామో అని అనుకుంటున్నారు కదా? బాప్ దాదా చెప్తున్నారు - ఎక్కడ ఉన్నా కానీ స్మృతిలో ఉంటారు, బాబాతో పాటు ఉంటారు. సాకారంలో లేదా ఆకారంలో బాబాతో పాటు ఉంటే ఏమీ అవ్వదు. సాకారంలో కథ చెప్పారు కదా! పిల్లి పిల్లలు భట్టీలో ఉండిపోయినా కానీ రక్షణగా ఉన్నాయా లేక కాలిపోయాయా? అన్ని రక్షణగా ఉన్నాయి. అదేవిధంగా పరమాత్మ పిల్లలైన మీరు బాబా తోడుగా ఉంటే రక్షణగా ఉంటారు. ఒకవేళ బుద్ది మరెక్కడైనా ఉంటే ఎంతోకొంత సెగ తగులుతుంది అంటే కొంచెం అయినా ప్రభావం పడుతుంది. బాబాతో పాటు కంబైండ్ గా, ఒక్క సెకను కూడా ఒంటరిగా లేకపోతే రక్షణగా ఉంటారు. అప్పుడప్పుడు కార్యవ్యవహారాలలో లేదా సేవలో ఒంటరిగా అనుభవం చేసుకుంటున్నారా? ఏమి చేయము, ఒంటరిగా ఉన్నాం, చాలా పని ఉంది అని. తిరిగి అలసిపోతున్నారు కూడా! బాబాని తోడుగా ఎందుకు చేసుకోవటం లేదు? రెండు భుజాలు గలవారిని తోడుగా చేసుకుంటున్నారు, వేయి భుజాలు గల బాబాని ఎందుకు తోడు చేసుకోవటం లేదు? ఎవరు ఎక్కువ సహయోగం ఇస్తారు? వేయి భుజాలు గల బాబాయా లేక రెండు భుజాలు గలవారా? 

సంగమయుగంలో బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులు ఒంటరిగా ఉన్నవారు కాదు. సేవలో లేదా కర్మయోగంలో బాగా బిజీ అయిపోయినప్పుడు తోడుని కూడా మర్చిపోతున్నారు మరియు అలసిపోతున్నారు. అలసిపోయాము, ఇప్పుడు ఏమి చేయాలి అంటున్నారు. అందువలన అలసిపోకండి. బాప్ దాదా సదా మీకు తోడు ఇవ్వడానికే వచ్చారు. పరంధామాన్ని వదిలి ఎందుకు వచ్చారు? నిద్రపోతూ, మేల్కొంటూ, కర్మ చేస్తూ, సేవ చేస్తూ ఉన్నప్పుడు తోడుని ఇవ్వడానికే వచ్చారు. బ్రహ్మాబాబా కూడా మీ అందరికీ సహయోగం ఇవ్వడానికే అవ్యక్తం అయ్యారు. వ్యక్త రూపం కంటే అవ్యక్తరూపంలో సహయోగం ఇచ్చే వేగం చాలా ఎక్కువ. అందువలనే బ్రహ్మాబాబా కూడా తన వతనాన్ని మార్చేసుకున్నారు. శివబాబా మరియు బ్రహ్మాబాబా ఇద్దరూ ప్రతి సమయం మీకు సహయోగం ఇవ్వడానికి సదా హాజరై ఉన్నారు. మీరు బాబా అని అనుకోగానే సహయోగాన్ని అనుభవం చేసుకుంటారు. ఒకవేళ సేవ, సేవ, సేవ ఇదే స్మృతిలో ఉంచుకుని, బాబాని వేరు చేసేసి దూరంగా కూర్చుని చూడమంటున్నారు అప్పుడు బాబా కూడా సాక్షి అయ్యి చూస్తూ ఉంటారు, ఎంత వరకు ఒంటరిగా చేస్తారో చూద్దాం అని. తిరిగి రావలసింది ఇక్కడికే కదా! అందువలన తోడుని వదలకండి. అధికారికంగా మరియు మీ ప్రేమ అనే సూక్ష్మ త్రాడుతో బంధించి ఉంచండి. సోమరిగా వదిలేస్తున్నారు. స్నేహాన్ని వదులు చేసేస్తున్నారు, అధికారాన్ని కొద్దిగా స్మృతి నుండి తొలగించేస్తున్నారు. ఇలా చేయకండి. స్వయం సర్వశక్తివంతుడు స్నేహాన్ని ఆఫర్ చేస్తుంటే ఇటువంటి ఆఫర్ మరెప్పుడైనా లభిస్తుందా? లభించదు కదా? ఎంత వరకు ఒంటరిగా చేస్తారో చూద్దాం అని బాప్ దాదా కూడా సాక్షి అయ్యి చూస్తారు. 

సంగమయుగం యొక్క సుఖాన్ని మరియు సౌకర్యాల స్మృతిని ప్రత్యక్షంలో ఉంచుకోండి. బుద్ది బిజీగా ఉంటుంది, అందువలన స్మృతి గుప్తం అయిపోతుంది.. ఆలోచించండి - ఎవరినైనా కానీ రోజంతటిలో బాబా స్మృతి ఉంటుందా లేక బాబా స్మృతిని మర్చిపోతున్నారా అని అడిగితే ఏమంటారు? స్మృతి ఉంటుంది అంటారు. స్మృతి ఉంటుంది అనేది నిజమే కానీ ప్రత్యక్షంగా ఉంటుందా లేక గుప్తంగా ఉంటుందా? స్థితి ఎలా ఉంటుంది? ప్రత్యక్ష రూపం యొక్క స్థితి మరియు గుప్త రూపం యొక్క స్మృతి, వీటిలో తేడా ఏమిటి? స్మృతిని ప్రత్యక్ష రూపంలో ఎందుకు ఉంచుకోవటం లేదు? ప్రత్యక్ష రూపం యొక్క నషా, శక్తి, సహయోగం, సఫలత చాలా ఉన్నతమైనవి. స్మృతి అయితే మర్చిపోలేరు, ఎందుకంటే ఇది ఒక జన్మ యొక్క బంధం కాదు. శివబాబా అయితే సత్యయుగంలో వెంట ఉండరు కానీ బంధం ఇదే ఉంటుంది కదా! అందువలన మర్చిపోలేరు, ఇది నిజమే. ఏదో విఘ్నానికి వశమైపోయినప్పుడు మర్చిపోతున్నారు కూడా కానీ సహజ రూపంలో ఉన్నప్పుడు మర్చిపోవటం లేదు కానీ స్మృతి గుప్తంగా ఉంటుంది. అందువలన బాప్ దాదా చెప్తున్నారు - బాబా తోడు యొక్క అనుభవం గుప్త రూపంలో ఉందా లేక ప్రత్యక్ష రూపంలో ఉందా అని మాటిమాటికీ పరిశీలించుకోండి. ప్రేమ అయితే ఉంది. ప్రేమ తెగిపోగలదా? తెగిపోలేదు కదా? ప్రేమ తెగిపోలేనప్పుడు ప్రేమ యొక్క లాభాన్ని పొందండి. లాభాన్ని పొందే పద్ధతి నేర్చుకోండి. 

బాప్ దాదా చూస్తున్నారు - ప్రేమయే బాబా వారిగా చేసింది. ప్రేమయే మధువననివాసిగా చేస్తుంది. మీ మీ స్థానాలలో ఎలా ఉన్నా, ఎంత శ్రమ చేసినా అయినా సరే మధువనానికి వచ్చేస్తారు. బాప్ దాదాకి తెలుసు, చూస్తున్నారు - కొంతమంది పిల్లలకు కలియుగీ పరిస్థితుల ప్రమాణంగా టికెట్ తీసుకోవటం కూడా కష్టం కానీ ప్రేమయే చేరుస్తుంది. అవును కదా? ప్రేమతో వచ్చేస్తున్నారు. పరిస్థితులు అయితే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటాయి. సత్యమైన మనస్సుకు యజమాని రాజీ అయిపోతారు సరే. దానితో పాటూ స్థూల సహయోగం కూడా ఎక్కడో అక్కడ ఏదోక విధంగా లభించేస్తుంది. డబల్ విదేశీయులైనా, భారతవాసీయులైన అందరినీ బాబా యొక్క ఈ ప్రేమ పరిస్థితులనే గోడలను దాటిస్తుంది. అవును కదా? మీ, మీ సెంటర్స్ లో కూడా చూడండి - కొంతమంది పిల్లలు ఇక్కడి నుండి వెళ్తూనే, మరలా సంవత్సరం వస్తామో, రామో అని అనుకుంటారు కానీ మరలా వచ్చేస్తారు. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఇది ప్రేమకు రుజువు. . 

ఈరోజు హోలీ జరుపుకున్నారా? జరిపేసుకున్నారా హోలీ? బాప్ వాదా హోలీ జరుపుకునే హోలీ హంసలను చూస్తున్నారు. పిల్లలందరి టైటిల్ ఒకటే - హోలీయస్ట్ (పవిత్రులు). ద్వాపరయుగం నుండి ఏ ధర్మాత్మ లేదా మహాత్మ కూడా సర్వులని పవిత్రంగా తయారుచేయలేదు. స్వయం తయారవుతారు. కానీ తమ అనుచరులను, తమ తోటివారిని పవిత్రంగా తయారుచేయరు. కానీ ఇక్కడ పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ముఖ్య ఆధారం. మీ చదువు కూడా ఏమిటి? మీ సూక్తి కూడా ఇదే - "పవిత్ర భవ! యోగి భవ!” స్లోగన్ ఉంది కదా? పవిత్రతయే మహానత, పవిత్రతయే యోగి జీవితానికి ఆధారం. అప్పుడప్పుడు పిల్లలు అనుభవం చేసుకుంటారు - నడుస్తూ, నడుస్తూ మనస్సులో అయినా కానీ అపవిత్రత అంటే వ్యర్ధ లేదా అశుభ, పరచింతన సంకల్పాలు నడిస్తే యోగం శక్తిశాలిగా చేయాలని ఎంత అనుకున్నా కానీ కుదరదు. ఎందుకంటే కొంచెం అయినా, అంశమాత్రంగా సంకల్పంలో అయినా కానీ ఏ రకమైన అపవిత్రత ఉన్నా కానీ ఎక్కడ అపవిత్రత యొక్క అంశం ఉంటుందో అక్కడ పవిత్ర బాబా యొక్క స్మృతి ఎలా, ఏవిధంగా ఉండాలో అలా ఉండదు. ఎలా అయితే రాత్రి, పగలు కలిసి ఉండవో అదేవిధంగా పవిత్రత, అపవిత్రత కలిసి ఉండవు. అందువలనే బాప్ దాదా వర్తమాన సమయంలో పవిత్రతపై మాటిమాటికి ధ్యాస ఇప్పిస్తున్నారు. కొంచెం సమయం ముందు బాప్ దాదా కేవలం కర్మలో పవిత్రత కోసమే సైగ చేసేవారు కానీ ఇప్పుడు సమయం సంపూర్ణతకి సమీపంగా వస్తుంది. కనుక మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశం ఉంటే మోసం చేసేస్తుంది. అందువలన మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కం అన్నింటితో పవిత్రత అత్యంత అవసరం. మనస్సుని తేలికగా వదిలేయకండి. ఎందుకంటే మనస్సు పైకి కనిపించదు కానీ లోపల చాలా మోసం చేస్తుంది. బ్రాహ్మణజీవితం యొక్క ఆంతరంగిక వారసత్వం అయిన సదా సుఖ స్వరూపం, శాంతి స్వరూపం, మనస్సు యొక్క సంతుష్టత వీటిని అనుభవం చేసుకోవడానికి మనసా పవిత్రత కావాలి. బాహ్య సాధనాల ద్వారా లేదా సేవ ద్వారా మిమ్మల్ని మీరు సంతోషం చేసుకోవడం - ఇది కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం. 

బాప్ దాదా చూస్తున్నారు - అప్పుడప్పుడు పిల్లలు వీటి ఆధారంగా తమని తాము మంచిగా, సంతోషంగా భావించి మోసపోతున్నారు మరియు మోసగిస్తున్నారు కూడా. మోసపోతున్నారు మరియు మోసగిస్తున్నారు. ఇది కూడా ఒక గుహ్య రహస్యం. ఏమౌతుందంటే బాబా దాత, దాత యొక్క పిల్లలు మీరు. కనుక సేవ యుక్తియుక్తంగా చేయకపోయినా, కల్తీ ఉన్నా, కొంచెం స్మృతి మరియు కొంచెం బాహ్యసాధనాలు లేదా సంతోషం ఆధారంగా చేస్తున్నారు, మనస్సుతో చేయడం లేదు, బుద్ధి ఆధారంగా చేస్తున్నారు. అయినా కానీ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం లభిస్తుంది, ఎందుకంటే బాబా దాత కనుక. వారు దానిలోనే సంతోషపడతారు - ఓహో! మాకు ఫలం లభించేసింది, మా సేవ మంచిది అని. కానీ అలాంటి వారికి సదాకాలికంగా మనస్సు యొక్క సంతుష్టత ఉండదు మరియు ఆత్మ యోగయుక్త శక్తిశాలి స్మృతి యొక్క అనుభవం చేసుకోలేదు. వీటి నుండి వంచితంగా ఉండిపోతారు. ఏమి లభించకుండా అయితే ఉండదు, ఏదోకటి అయితే లభిస్తుంది కానీ జమ అవ్వదు. సంపాదించుకున్నారు, తినేసారు మరియు సమాప్తి అయిపోయింది. అందువలన ఈ ధ్యాస కూడా ఉంచుకోవాలి. సేవ చాలా బాగా చేస్తున్నారు, ఫలం కూడా మంచిగా వచ్చింది అంటే తినేసారు, సమాప్తి అయిపోతుంది. జమ ఏమయ్యింది? మంచి సేవ చేసారు, మంచి ఫలితం వచ్చింది, ఆ సేవకి ఫలం లభించేసింది, జమ ఏమీ అవ్వలేదు. అందువలన జమ చేసుకునే విధి - మనసా, వాచా, కర్మణాలో పవిత్రత. పునాది - పవిత్రత. సేవలో కూడా పునాది - పవిత్రత. స్వచ్చంగా, శుభ్రంగా ఉండాలి. ఏవిధమైన భావం యొక్క కల్తీ ఉండకూడదు. భావంలో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత ఉండాలి. హోలీ అంటేనే పవిత్రత అని అర్ధం. అపవిత్రతను కాల్చేయాలి. అందువలనే మొదట కాలుస్తారు ఆ తర్వాత జరుపుకుంటారు ఆ తర్వాత పవిత్రంగా అయ్యి సంస్కారాల కలయిక జరుపుకుంటారు. హోలీ అంటే కాల్చటం మరియు జరుపుకోవటం. బయటవారు అయితే ఆలింగనం చేసుకుంటారు కానీ ఇక్కడ సంస్కారాలు కలవాలి, ఇదే మంగళ కలయిక. అయితే ఈ విధమైన హోలీ జరుపుకున్నారా లేక కేవలం నాట్యం చేసారు అంతేనా? పన్నీరు జల్లుకున్నారా? అది కూడా మంచిదే, బాగా జరుపుకోండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు - పన్నీరు జల్లుకోండి, నాట్యం చేయండి కానీ సదా నాట్యం చేయండి. కేవలం 5-10 నిమిషాల నాట్యం కాదు. ఒకరిపై ఒకరు గుణాల తరంగాలను జల్లుకోవటమే... పన్నీరు జల్లుకోవటం. కాల్చటం అంటే ఏమి కాల్చాలో మీకు తెలుసు. ఇప్పటివరకు కూడా కాలుస్తూనే ఉన్నారా! ప్రతి సంవత్సరం చేయి ఎత్తి వెళ్తారు, ధృడసంకల్పం చేసేశాం అనుకుంటారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు - ధైర్యం అయితే పెట్టుకుంటున్నారు. ధైర్యానికి బాప్ దాదా శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. ధైర్యం పెట్టుకోవడం మొదటి అడుగు, కానీ బాప్ దాదా యొక్క శుభ ఆశ ఏమిటి? సమయం యొక్క తారీఖు చూడకండి. 2000లో అవుతుందా లేక 2001లో అవుతుందా, 2005లో అవుతుందా... ఇలా ఆలోచించకండి. ఎవరెడీగా కాకపోయినా సరే, దీనిని కూడా బాప్ దాదా వదిలేస్తున్నారు, కానీ ఆలోచించండి - చాలాకాలం యొక్క సంస్కారం కావాలి కదా! చాలాకాలం యొక్క పురుషార్ధమే చాలా కాలం యొక్క రాజ్యాధికారిగా తయారుచేస్తుంది అని మీరు కూడా చెప్తారు కదా! మరయితే సమయం వచ్చినప్పుడు ధృఢసంకల్పం చేస్తే అది చాలాకాలం యొక్క అభ్యాసం అయ్యిందా లేక అల్పకాలిక అభ్యాసం అయ్యిందా? దేనిలో లెక్కించబడుతుంది? అల్పకాలికంలో లెక్కించబడుతుంది కదా! అంటే అవినాశి తండ్రి నుండి ఏమి వారసత్వం తీసుకున్నారు? అల్పకాలికమైనది తీసుకున్నారు. ఇది బావుంటుందా! బావుండదు కదా? కనుక చాలాకాలం యొక్క అభ్యాసం కావాలి. ఎంత సమయం ఉంది అని ఆలోచించకండి. ఎంత చాలాకాలం యొక్క అభ్యాసం ఉంటుందో అంతగా అంతిమంలో మోసపోరు. చాలాకాలం యొక్క అభ్యాసం లేకపోతే ఇప్పటి చాలాకాలం యొక్క సుఖం, చాలాకాలం యొక్క శ్రేష్టస్థితి యొక్క అనుభవం నుండి కూడా వంచితం అయిపోతారు. అందువలన ఏమి చేయాలి? చాలాకాలం చేయాలి కదా? ఒకవేళ ఎవరి బుద్దిలో అయితే తారీఖు యొక్క నిరీక్షణ ఉంటే నిరీక్షించకండి, తయారీలు చేస్కోండి. చాలాకాలం యొక్క తయారీ చేసుకోండి. తారీఖుని తీసుకురావలసింది కూడా మీరే. సమయం అయితే ఇప్పుడు కూడా ఎవరెడీ, రేపు అయినా కాగలదు కానీ సమయం మీ కోసమే ఆగి ఉంది. మీరు సంపన్నంగా అవ్వండి. అప్పుడు సమయం యొక్క పరదా తొలగవలసిందే. మీరు ఆపటం వలనే ఆగి ఉంది. రాజ్యాధికారి తయారవ్వాలి కదా? సింహాసనం ఖాళీగా అయితే ఉండకూడదు కదా! విశ్వమహారాజు ఒక్కడే ఒంటరిగా సింహాసనంపై కూర్చుంటారా? ఇలా అయితే అందంగా ఉంటుందా? రాయల్ ఫ్యామిలీ కావాలి, ప్రజలు కావాలి, అందరూ కావాలి, కేవలం విశ్వమహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటే నా కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది అని చూస్తుంటారు. అందువలన బాప్ దాదాకి ఒకే శుభ ఆశ ఉంది - పిల్లలందరు కొత్తవారైనా, పాతవారైనా, ఎవరైతే బ్రహ్మాకుమారీ, బ్రహ్మకుమారులుగా పిలవబడుతున్నారో, మధువననివాసీలైనా, విదేశీయులైనా, భారతవాసీయులైనా - ప్రతి ఒక్క బిడ్డ చాలాకాలం యొక్క అభ్యాసం చేసి చాలాకాలం యొక్క అధికారిగా అవ్వాలి అని. అప్పుడప్పుడు వారిగా కాదు. ఇష్టమేనా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి. వెనుక ఉన్నవారు తెలివైనవారు, ధ్యాసగా వింటున్నారు. బాప్ దాదా వెనుక ఉన్నవారిని మీ కంటే ముందు చూస్తున్నారు. ముందు ఉన్నవారు ఎలాగూ ముందే. (మెడిటేషన్ హాల్ లో కూర్చుని మురళి వింటున్నారు) క్రింద కూర్చున్నవారు బాబా యొక్క శిరోకిరీటాలై కూర్చున్నారు. వారు కూడా చప్పట్లు కొడుతున్నారు. క్రింద కూర్చున్నవారి త్యాగానికి భాగ్యం లభించాల్సిందే. మీకు అయితే ఎదురుగా కూర్చునే భాగ్యం మరియు వారికి త్యాగానికి భాగ్యం జమ అవుతుంది. మంచిది, బాప్ దాదాకి ఉన్న ఒక ఆశ ఏమిటో విన్నారు. ఇష్టమే కదా? ఇక తర్వాత సంవత్సరం ఏమి చూస్తారు. అప్పుడు కూడా ఇలాగే మరలా చేతులు ఎత్తుతారా? చేతులు ఎత్తండి, రెండు చేతులూ ఎత్తండి కానీ మనస్సు యొక్క చేతిని కూడా ఎత్తండి. దృఢసంకల్పం అనే చేతిని సదాకాలికంగా ఎత్తండి. 

బాప్ దాదా ఒక్కొక్క బిడ్డ యొక్క మస్తకంలో సంపూర్ణపవిత్రత యొక్క మెరిసేమణిని చూస్తున్నారు. నయనాలలో పవిత్రత యొక్క మెరుపు, రెండు నయనాలు పవిత్ర సితారల వలె ఆత్మీయతతో మెరుస్తూ చూడాలని అనుకుంటున్నారు. మాటలో మధురత, విశేషత, అమూల్య మాటలను వినాలనుకుంటున్నారు. కర్మలో సంతుష్టత, నిర్మాణత సదా చూడాలను కుంటున్నారు. భానవలో - సదా శుభ భావన మరియు భావంలో - సదా ఆత్మికభావం, సోదరత్వ భావం కనిపించాలి. సదా మీ మస్తకం ద్వారా ఫరిస్తా స్థితి యొక్క ప్రకాశకిరీటం కనిపించాలి. కనిపించాలి అంటే అనుభవం అవ్వాలి. ఇలా అలంకరించబడిన మూర్తిగా చూడాలనుకుంటున్నారు. మరియు ఇటువంటి మూర్తులే శ్రేష్ట పూజ్యులు అవుతారు. వారయితే మీ యొక్క జడచిత్రాలను తయారుచేస్తారు కానీ బాబా చైతన్యచిత్రాన్ని చూడాలనుకుంటున్నారు. 

మంచిది - నలువైపుల సదా బాప్ దాదా వెంట ఉండేవారికి, సమీపంగా ఉండే సదా సహచరులకు, సదా చాలాకాలం యొక్క పురుషార్ధం ద్వారా చాలా కాలం యొక్క సంగమయుగి అధికారాన్ని మరియు భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తింప చేసుకునే అతి తెలివైన ఆత్మలకు, సదా స్వయాన్ని శక్తులతో, గుణాలతో అలంకరించుకుని ఉండేవారికి, బాబా యొక్క ఆశా దీపాలకు, సదా స్వయాన్ని హోలియస్ట్ మరియు హైయస్ట్ స్థితిలో స్థితులు చేసుకునే బాబా సమాన అతి స్నేహి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. దేశ, విదేశాలలో దూరంగా కూర్చుని కూడా సన్ముఖంగా అనుభవం చేసుకునేవారికి బాప్ దాదా యొక్క చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు. 

Comments