31-12-2006 అవ్యక్త మురళి

 31-12-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నూతన సంవత్సరం యొక్క నవీనత - ధృడత మరియు పరివర్తనా శక్తి ద్వారా కారణం లేదా సమస్య అనే మాటకు వీడ్కోలు ఇచ్చి నివారణ లేదా సమాధాన స్వరూపంగా అవ్వండి.

ఈరోజు నవయుగ రచయిత బాప్ దాదా నలువైపుల ఉన్న తన పిల్లలకి నవ సంవత్సరం మరియు నవ యుగం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేటందుకు వచ్చారు. నలువైపుల ఉన్న పిల్లలందరు కూడా శుభాకాంక్షలు ఇచ్చేటందుకు చేరుకున్నారు. కేవలం నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేటందుకే వచ్చారా లేక నవయుగం యొక్క శుభాకాంక్షలను కూడా ఇచ్చేటందుకు వచ్చారా? నూతన సంవత్సరం గురించి సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని పంచుతారు. మరి బ్రాహ్మణాత్మలైన మీకు నవయుగం కూడా అంతగా జ్ఞాపకం ఉందా? ఇనుపయుగం కళ్ళ ఎదురుగా వచ్చిందా? నూతన సంవత్సరం రానే వచ్చింది అని మనస్సులోకి వస్తుంది కదా! అదేవిధంగా నవయుగం కూడా రానే వచ్చింది అని అనుభవం చేసుకుంటున్నారా? నవయుగం నవయుగం యొక్క స్మృతి అంత సమీపంగా వచ్చిందా? అక్కడ మీ శరీర రూపి మెరిసే వస్త్రం ఎదురుగా కనిపిస్తుందా? బాప్ దాదా డబల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లల మనస్సులో, నయనాలలో నవయుగం యొక్క దృశ్యాలు ప్రత్యక్షంగా ఉన్నాయి. మీ నవయుగంలో తనువు - మనస్సు - ధనం - జనం ఎంత శ్రేష్టంగా ఉంటాయి? సర్వ ప్రాప్తుల భండారా నిండుగా ఉంటుంది. ఈ రోజు పాత ప్రపంచంలో ఉన్నాము మరలా ఇప్పుడిప్పుడే మీ రాజ్యంలో ఉంటారు. ఈరోజు పాత సంవత్సరానికి వీడ్కోలు, క్రొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే రెండు కార్యాల గురించి వచ్చారు. కేవలం పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడానికే వచ్చారా లేక పాత ప్రపంచం యొక్క పాత సంస్కార స్వభావాలు, పాత నడవడికకు కూడా వీడ్కోలు ఇచ్చేటందుకు వచ్చారా? పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటం సహజం. అదేవిధంగా పాత సంస్కారాలకి వీడ్కోలు ఇవ్వటం కూడా అంత సహజంగానే అనిపిస్తుందా? ఏమని భావిస్తున్నారు? మాయకి కూడా వీడ్కోలు ఇచ్చేటందుకు వచ్చారా లేక సంవత్సరానికే ఇచ్చేటందుకే వచ్చారా? వీడ్కోలు ఇవ్వాలి కదా! లేక మాయ అంటే కొంచెం ప్రేమ ఉందా? కొంచెం కొంచెం ప్రేమ ఉంచుకోవాలని భావిస్తున్నారా? 

బాప్ దాదా ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలందరి నుండి పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు ఇప్పించాలని అనుకుంటున్నారు. ఇవ్వగలరా? ధైర్యం ఉందా లేక వీడ్కోలు ఇవ్వాలనుకుంటున్నాము కానీ మరలా మాయ వచ్చేస్తుంది అంటారా? ఈరోజు ధృడ సంకల్ప శక్తితో పాత సంస్కారాలకి వీడ్కోలు ఇచ్చి నవయుగం యొక్క సంస్కారాలకి, జీవితానికి స్వాగతం చెప్పే ధైర్యం ఉందా? ఉందా ధైర్యం? ఇవ్వగలరా లేక ఇవ్వాల్సిందేనా? ధైర్యవంతులేనా? ధైర్యం ఉన్న వారు చేతులెత్తండి. ధైర్యం ఉందా? చేతులు ఎత్తని వారు ఆలోచిస్తున్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తారు. ఎవరిలో ధైర్యం ఉందో వారు చేతులెత్తండి, అందరూ కాదు. మంచిది. డబల్ విదేశీయులు తెలివైనవారు. డబల్ నషా అందువలన. బాప్ దాదా ప్రతీ నెల ఫలితం చూస్తారు. పిల్లలు ధైర్యవంతులు అని బాప్ దాదాకి సంతోషంగా ఉంది. చతురతతో జవాబు ఇచ్చే పిల్లలు. ఎందువలన? ఎందుకంటే వారికి తెలుసు - ఒక అడుగు మనం ధైర్యంతో వేస్తే వేల అడుగులు బాబా యొక్క సహాయం లభించవలసిందే అని. అధికారులు వేల అడుగుల సహాయానికి అధికారులు. కానీ మాయ ధైర్యాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుంది. బాప్ దాదా చూస్తున్నారు - ధైర్యం బాగా పెట్టుకుంటున్నారు, దానికి మనస్సుతో శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు కానీ ధైర్యం పెట్టుకుంటూ మరలా స్వయంలో లోలోపల వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం చేస్తున్నారు. చేస్తూ ఉన్నాము... అవ్వాలి కానీ .... తప్పక చేస్తాం .... కానీ ఎందుకో తెలియదు... ఇలా సంకల్పాలతో ధైర్యాన్ని తక్కువ చేసేసుకుంటున్నారు. చేస్తున్నాము, చేయాలి, ఎగరాలి .... ఇలాంటి సంకల్పాలు ధైర్యాన్ని కదుపుతున్నాయి. చేయాలి కానీ అని అనకండి, చేయాల్సిందే అనుకోండి. బాబా తోడుగా ఉండగా ఎందుకు అవ్వలేరు? బాబా తోడుగా ఉంటే కానీ లేదా అయితే అనే మాటలు రావు. 

ఈ నూతన సంవత్సరంలో ఏమి నవీనత చేస్తారు? ధైర్యం అనే పాదాన్ని గట్టిగా చేసుకోండి. మాయ కదిలిపోవాలి కానీ మీ పాదం కదలకూడదు అంత గుర్తు చేసుకోవాలి. అయితే నూతన సంవత్సరంలో నవీనత చేస్తారా? లేక ఒకసారి కదులుతూ, ఒకసారి గట్టిగా అలా ఉంటారా? మీ అందరి కర్తవ్యం ఏమిటి? మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటున్నారు? జ్ఞాపకం చేస్కోండి. విశ్వకళ్యాణి, విశ్వ పరివర్తకులు, ఇదే మీ పని కదా! బాప్ దాదాకి అప్పుడప్పుడు మధురాతి మధురదరహాసం వస్తుంది. మీ బిరుదు విశ్వపరివర్తకులు. విశ్వపరివర్తకులేనా? లేక లండన్, ఇండియా పరివర్తకులా? అందరూ విశ్వపరివర్తకులే కదా! ఏదో గ్రామంలో లేదా లండన్లో, అమెరికాలో ఉంటున్నా కానీ విశ్వ కళ్యాణకారులే కదా! అవును అంటే చేతులూపండి. పక్కా కదా! లేక 75% విశ్వకళ్యాణకారులు మిగిలిన 25% పర్వాలేదా? మీ ప్రతిజ్ఞ ఏమిటి? ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాం అని ప్రతిజ్ఞ చేసారు కదా! మరి మీ కర్తవ్యాన్ని గుర్తు పెట్టుకోండి. అప్పుడప్పుడు స్వయం గురించి అంటున్నారు - ఇలా చేయకూడదు కానీ అయిపోతుంది. విశ్వ పరివర్తకులు, ప్రకృతి పరివర్తకులు అయిన మీరు స్వ పరివర్తకులుగా కాలేరా? శక్తిసేన ఏమి ఆలోచిస్తున్నారు? ఈ సంవత్సరం మీ కర్తవ్యం విశ్వ పరివర్తన, స్వ మరియు బ్రాహ్మణ పరివారం పట్ల కూడా, ఎందుకంటే మొదటి ఇంటి నుండే ఉద్దరణ ప్రారంభించాలి కదా! మీ కర్తవ్యం యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తారు కదా! స్వ పరివర్తన స్వయం కూడా కోరుకుంటున్నారు మరియు బాప్ దాదా కూడా కోరుకుంటున్నారు. తెలుసు కదా! పిల్లలైన మీ అందరి లక్ష్యం ఏమిటి అని బాప్ దాదా అడుగుతున్నారు. మెజారిటీ అందరూ ఒకే సమాధానం చెప్తారు - బాబా సమానంగా అవ్వాలని. బాబా సమానంగా అవ్వవలసిందే కదా! లేక చూస్తాం ... ఆలోచిస్తాం .... అంటారా? ఈ సంవత్సరంతో 70 సం||లు పూర్తయి 71వ సం||రం వస్తుంది కనుక అద్భుతం చేసి చూపించాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. సేవా ఉల్లాసంలో భిన్న భిన్న కార్యక్రమాలు తయారు చేస్తూ ఉన్నారు. సఫలులు కూడా అవుతూ ఉన్నారు. చేసే శ్రమకి సఫలత లభిస్తుంది అని బాప్ దాదా సంతోషిస్తున్నారు. వ్యర్థం అవ్వటం లేదు కానీ సేవ ఎందుకు చేస్తున్నారు అంటే ఏమి జవాబు ఇస్తారు? బాబాని ప్రత్యక్షం చేసేటందుకు. అయితే బాబా ఈరోజు పిల్లలని ప్రశ్నిస్తున్నారు - బాబాని ప్రత్యక్షం చేయవలసిందే, చేస్తారు కూడా కానీ బాబాని ప్రత్యక్షం చేసే ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేస్కోండి. ఈ సంవత్సరం స్వయాన్ని శివశక్తి రూపంగా ప్రత్యక్షం చేసుకుంటారా? చెప్పండి శివశక్తులూ! చేస్తారా? 

జానకీ (దాదీ) చెప్పండి. చేస్తారా? (చేయాల్సిందే) రెండవ వరుసలో టీచర్స్ ఉన్నారు. ఈ సంవత్సరంలో చేసి చూపిస్తాం అనే టీచర్స్ చేతులెత్తండి. టీచర్స్ అందరూ చేతులెత్తారా లేక ఎవరైనా ఎత్తలేదా? మంచిది. మరి మధువనం వారు? మధువనం వారు చేయాల్సిందే మరియు చేయవలసి ఉంది. ఎందుకంటే మధువనం వారు సమీపంగా ఉంటారు కదా! ఈరోజు తారీఖు వ్రాసుకోండి. 31 వ తారీఖు, సమయం కూడా వ్రాస్కోండి (9 గంటల 20 నిమిషాలు). పాండవసేన, పాండవులని ఏవిధంగా చూపించారు? విజయీ పాండవులుగా చూపించారు. అప్పుడప్పుడు విజయం పొందువారు కాదు, పేరే విజయీ పాండవులు. ఈ సంవత్సరంలో ఏమి చేసి చూపించాలో చెప్పమంటారా? మాయ వచ్చేసింది అంటారా, కావాలనుకోవటం లేదు కానీ వచ్చేసింది. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - అంతిమ సమయం వరకు మాయ రాకుండా ఉండదు. మాయ పని రావటం, మరి మీ పని ఏమిటి? విజయీ అవ్వటం. కనుక కావాలనుకోవటం లేదు కానీ మాయ వచ్చేస్తుంది, అలా అయిపోతుంది అని అనుకోకండి. ఈరోజు పాత సంవత్సరంతో పాటూ ఈ మాటలకు కూడా వీడ్కోలు ఇప్పించాలనుకుంటున్నారు. 12 గంటలకి ఈ సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చేస్తారు కదా! గంటలు మ్రోగిస్తారు కదా! మీరు వేటికి గంటలు మ్రోగిస్తారు? రోజుకా, సంవత్సరానికా లేక మాయకి వీడ్కోలు ఇచ్చేటందుకా? రెండు విషయాలు లోపంగా ఉన్నాయి. ఒకటి - పరివర్తనా శక్తి లోపంగా ఉంది. ఇలా చేస్తాం, అలా చేస్తాం అని ప్లాన్స్ చాలా బాగా తయారుచేస్తున్నారు. చాలా 

మంచి ప్లాన్ తయారు చేశారు అని బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు కానీ పరివర్తనా శక్తి లోపంగా ఉన్న కారణంగా కొంచెం పరివర్తన అవుతున్నారు, కొంచెం ఆగిపోతున్నారు. రెండవ లోపం - ధృడత. మంచి మంచి సంకల్పాలు చేస్తున్నారు, ఈ రోజు కూడా చూడండి - ఎన్ని గ్రీటింగ్ కార్డులో, ఎన్ని ప్రతిజ్ఞలో! చాలా మంచి మంచి ఉత్తరాలు వచ్చాయి. (కార్డులు, ఉత్తరాలు అన్నీ స్టేజ్ పై అలంకరించారు). చేస్తాం, చేసి చూపిస్తాం, తయారవ్వలసిందే, పదమా పదమ్ ప్రియస్మృతులు అన్నీ బాప్ దాదా దగ్గరకి చేరుకున్నాయి. మీరు ఎదురుగా కూర్చున్నారు, వారి మనస్సు యొక్క ధ్వని కూడా బాబా దగ్గరకి చేరుకుంది. కానీ ఈరోజు బాప్ దాదా ఈ రెండు శక్తులపై ధ్యాస ఇప్పిస్తున్నారు. 1. ధృడత లోపంగా ఉంది, లోపానికి కారణం - సోమరితనం. ఇతరులను చూసే బలహీనత. అయిపోతుందిలే, చేయటం అయితే చేస్తున్నాం కదా, చేస్తాం, తప్పక చేస్తాం అంటారు. 2. ఈ సంవత్సరం ఒక మాటకి సదాకాలికంగా వీడ్కోలు ఇవ్వాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఆ మాట ఏమిటో చెప్పమంటారా? వీడ్కోలు ఇచ్చేయవలసి ఉంటుంది. ఈ సంవత్సరం బాప్ దాదా కారణం అనే మాటకి వీడ్కోలు ఇప్పించాలని అనుకుంటున్నారు. కారణం సమాప్తి అయిపోయి నివారణ అయిపోవాలి. సమస్య సమాప్తి అయిపోయి సమాధాన స్వరూపంగా అవ్వాలి. స్వయం యొక్క కారణం అయినా లేక సహయోగుల కారణం లేదా సంఘటనలో కారణం, ఏ పరిస్థితి యొక్క కారణం అయినా కానీ బ్రాహ్మణుల నిఘంటువులో కారణం, సమస్య అనే మాట పరివర్తన అయిపోవాలి. నివారణ మరియు సమాధానంలోకి మారిపోవాలి. ఎందుకంటే ఈరోజు అమృతవేళ కూడా చాలా మంది పిల్లలు క్రొత్త సంవత్సరంలో ఏదొక నవీనత చేసి చూపిస్తాం అని ఆత్మిక సంభాషణ చేశారు. కనుక బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అంటే - ఈ నూతన సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారంటే ఈ రెండు మాటలు పూర్తిగా సమాప్తి అయిపోవాలి. పరోపకారి అవ్వాలి. స్వయం యొక్క కారణం అయినా లేక ఇతరులు ఎవరైనా కారణం అయినా కానీ పరోపకారి ఆత్మగా అయ్యి, శుభ భావన, శుభ కామన గల హృదయులై సహయోగం ఇవ్వండి మరియు స్నేహం తీస్కోండి. 

అయితే, ఈ నూతన సంవత్సరానికి ఏ పేరు పెడ్తారు? మొదట్లో ప్రతి సంవత్సరానికి పేరు పెట్టేవారు కదా, గుర్తుంది కదా? బాప్ దాదా ఈ సంవత్సరం శ్రేష్ట, శుభ సంకల్ప, ధృడ సంకల్ప, స్నేహ సహయోగ సంకల్ప సంవత్సరం అని అంటున్నారు, ఇది పేరు కాదు, ఆవిధంగా చూడాలనుకుంటున్నారు అని అర్థం. ధృడతా శక్తిని, పరివర్తనా శక్తిని సదా వెంట ఉంచుకోండి. నెగిటివ్ ని పాజిటివ్ లోకి మార్చుకోండి అని మీరు ఇతరులకు కోర్స్ చెప్తారు అదేవిధంగా ఎవరు మీకు నెగిటివ్ (అశుభం) ఇచ్చినా కానీ మీరు అశుభాన్ని శుభంలోకి (పాజిటివ్) మార్చుకోలేరా? ఇతరులు పరవశం అవుతారు, అలా పరవశం అయిన వారిపై దయ చూపించాలి కదా! జడచిత్రాలు మీవే కదా! భారతదేశంలో డబల్ విదేశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి కదా! దిల్ వాడా మందిరంలో మీ చిత్రాన్ని చూసుకున్నారు కదా! చాలా మంచిది. మీ జడచిత్రాలే దయా హృదయంతో ఉంటాయి. ఏ చిత్రం దగ్గరకి వెళ్ళినా ఏమి కోరకుంటారు? దయ చూపించండి, కృప చూపండి ..... ఇలా దయనే కోరుకుంటారు. కనుక సదా స్వయంపై దయ చూపండి, తర్వాత బ్రాహ్మణ పరివారంపై దయ చూపండి. అంటే ఒకవేళ ఎవరైనా పరవశం అయినా, సంస్కారానికి వశమైనా, బలహీనులు అయినా ఆ సమయంలో వారు తెలివి లేకుండా ఉంటారు. కనుక క్రోధం చూపకండి. క్రోధం యొక్క రిపోర్ట్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ క్రోధం లేకపోతే దాని పిల్లలతో చాలా ప్రేమ ఉంటుంది. క్రోధం యొక్క సంతానం - అహంకారం. కుటుంబంలో కూడా పిల్లల కంటే మనవలతో ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా! అదేవిధంగా క్రోధం తండ్రి వంటిది, అహంకారం, వ్యతిరేక నషా (గర్వం) ఇవి పిల్లలు. గర్వంలో కూడా రకరకాలు. బుద్ధి యొక్క గర్వం, కర్తవ్యం యొక్క గర్వం, సేవలో ఏదొక విశేష కర్తవ్యం యొక్క గర్వం ఇలా రకరకాలుగా ఉంటుంది. దయాళువు, కృపాళువుగా అవ్వండి. క్రొత్త సంవత్సరంలో ఒకరికొకరు మిఠాయి పంచుకుంటూ నోటిని మధురం చేస్తారు. శుభాకాంక్షలు చెప్తారు మరియు నోటిని మధురం కూడా చేస్తారు కదా! అంటే సంవత్సరమంతా కఠినత్వం ఉండకూడదు. వారు కేవలం నోటిని మధురం చేస్తారు, కానీ మీరు కేవలం నోటిని మధురం చేయటమే కాదు మీ ముఖం కూడా మధురంగా ఉండాలి. సదా మీ ముఖం ఆత్మీయతతో, స్నేహ పూర్వకంగా మరియు నవ్వుతూ ఉండాలి. కఠినత్వం ఉండకూడదు. మెజారిటీ పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణలో తమ గురించి సత్యంగా చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది విషయంలో ఇతర వికారాల కంటే ఎక్కువగా క్రోధం మరియు దాని సంతానం యొక్క రిపోర్ట్ ఎక్కువగా ఉంది. 

కనుక బాప్ దాదా ఈ నూతన సంవత్సరంలో ఈ కఠినత్వం తొలగిపోవాలి అని అనుకుంటున్నారు. కొందరు తమ ప్రతిజ్ఞను కూడా వ్రాశారు మరియు కావాలనుకోవటం లేదు కానీ వచ్చేస్తుంది అంటున్నారు. బాప్ దాదా కారణం చెప్పారు కదా - ధృడత లోపంగా ఉంది. బాబా ఎదురుగా సంకల్పం ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ ధృడత ఎంత గొప్ప శక్తి అంటే ప్రపంచం వారు కూడా అంటారు ప్రాణం పోయినా కానీ మాటను నిలుపుకోవాలి అని. చనిపోవలసి వచ్చినా, వంగవలసి వచ్చినా, మారవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా ప్రతిజ్ఞపై ధృడంగా ఉండేవారు ప్రతి అడుగులో సఫలతామూర్తులు. ఎందుకంటే ధృడత, సఫలతకి తాళంచెవి. తాళంచెవి అందరి దగ్గర ఉంది కానీ సమయానికి మాయం అయిపోతుంది. మీ ఆలోచన ఏమిటి?  

క్రొత్త సంవత్సరంలో స్వయం యొక్క సహయోగుల యొక్క మరియు విశ్వ పరివర్తన యొక్క క్రొత్తదనం చేయవలసిందే. కనుక ఉన్నవారు వింటున్నారా? చేయాలి కదా! మొదట పెద్దవారు చేయాలి, మేము అయితే చిన్నవాళ్ళం అనుకోకండి. చిన్నవారు దేవునితో సమానం అంటారు కదా! ప్రతి ఒక్క పిల్లవానికి తండ్రిపై అధికారం ఉంటుంది. మొదటి సారిగా వచ్చిన వారు అయినా కానీ "నా బాబా ” అన్నారు అంటే అధికారులే. శ్రీమతంపై నడవడానికి కూడా అధికారం ఉంది మరియు సర్వప్రాప్తులకు కూడా అధికారులు. టీచర్స్ అందరూ కలిసి పరస్పరం కార్యక్రమం తయారు చేసుకోవాలి. విదేశీయులు కూడా తయారు చేసుకోవాలి. భారతవాసీయులు కూడా తయారు చేసుకోవాలి. బాప్ దాదా బహుమతి ఇస్తారు. విదేశీయులైనా, భారతవాసీయులైన ఎవరైనా కానీ ఏ జోన్ వారు మొదటి నెంబరు పొందుతారో వారికి గోల్డ్ కప్ ఇస్తారు. కేవలం మిమ్మల్ని మీరు తయారు చేసుకోవటం కాదు, మీ తోటి వారిని కూడా తయారు చేయాలి, ఎందుకంటే బాప్ దాదా చూశారు - పిల్లలు పరివర్తన కానందుకే విశ్వ పరివర్తన కూడా ఆలశ్యం అవుతుంది. ఆత్మలు క్రొత్త క్రొత్త రకాల దు:ఖాలకు పాత్రులు అవుతున్నారు. దు:ఖం, అశాంతి యొక్క క్రొత్త క్రొత్త కారణాలు తయారవుతూ ఉన్నాయి. కనుక బాబా, పిల్లల యొక్క దు:ఖపూరిత పిలుపు విని పరివర్తనని కోరుకుంటున్నారు. కనుక ఓ మాస్టర్ సుఖదాత పిల్లలూ! దు:ఖి ఆత్మలపై దయ చూపండి. భక్తులు కూడా భక్తి చేసి చేసి అలసిపోయారు. భక్తులకి కూడా ముక్తి వారసత్వాన్ని ఇవ్వండి. దయ వస్తుందా, లేదా? లేక మీ సేవ లేదా మీ దినచర్యలోనే బిజీగా ఉన్నారా? మీరు నిమిత్తులు. పెద్దవారే నిమిత్తులు అనుకోకండి. నా బాబా అని ఎవరైతే అన్నారో, అంగీకరించారో వారందరూ నిమిత్తులే. క్రొత్త సంవత్సరంలో పరస్పరం బహుమతి కూడా ఇచ్చిపుచ్చుకుంటారు కదా! మీరు భక్తుల యొక్క ఆశను పూర్తి చేయండి, బహుమతి ఇవ్వండి. దు:ఖీలను దు:ఖం నుండి విముక్తులు చేయండి. ముక్తిధామంలో శాంతిని బహుమతిగా ఇవ్వండి. బ్రాహ్మణ పరివారంలో ప్రతీ ఆత్మకి మనస్పూర్వక స్నేహం మరియు సహయోగం యొక్క బహుమతి ఇవ్వండి. మీ దగ్గర బహుమతుల స్టాక్ ఉందా? స్నేహం ఉందా? సహయోగం ఉందా? ముక్తినివ్వగల శక్తి ఉందా? ఎవరి దగ్గర స్టాక్ ఎక్కువగా ఉందో వారు చేతులెత్తండి. ఉందా స్టాక్? తక్కువగా ఉందా? మొదటి వరుసలోని వారి దగ్గర స్టాక్ తక్కువగా ఉందా ఏమిటి? బ్రిజ్ మోహన్ చేయి ఎత్తటం లేదు. స్టాక్ అయితే ఉంది కదా? ఉందా స్టాక్? అందరూ ఎత్తారా? స్టాక్ ఉందా? మరి స్టాక్ ఉంచుకుని ఏం చేస్తున్నారు? జమ చేసుకుని ఉంచారా? టీచర్స్ దగ్గర స్టాక్ ఉంది కదా! మరి అయితే ఇవ్వండి, విశాల హృదయులు అవ్వండి. మధువనం వారు ఏమి చేస్తారు? మధువనంలో స్టాక్ ఉందా? మధువనంలో అయితే నలువైపుల స్టాక్ నిండి ఉంది. కనుక ఇప్పుడు దాతగా అవ్వండి. కేవలం జమ చేసుకుని ఉంచుకోకండి. దాతగా అవ్వండి, ఇస్తూ వెళ్ళండి. సరే. 

మంచిది, బాప్ దాదా చూస్తారు. ప్రతీ వారం, ప్రతీ జోన్ వారు తమ ఫలితాన్ని ఓ.కె. అని లేదా మధ్యలో ఒక లైన్ పెట్టి పంపండి. ఓ.కె. కాకపోతే మరేదీ వ్రాయకండి, ఉత్తరాలు ఎవరూ చదవరు. చాలా పెద్ద ఉత్తరాలు పంపిస్తారు కానీ చదవడానికి ఖాళీ ఉండదు. అందువలన కేవలం ఓ.కె. అని వ్రాసి పంపండి. ఒకవేళ ఓ.కె. కాకపోతే మధ్యలో ఒక గీత పెట్టి పంపండి అంటే దాని ద్వారా చేశారో లేదో తెలిసిపోతుంది. ప్రతీ జోన్ కాదు, ప్రతీ సేవాకేంద్రం వారు వ్రాయాలి. అందరూ సేవలో అనగా భక్తుల యొక్క దు:ఖీల యొక్క పరస్పరం బ్రాహ్మణ ఆత్మల యొక్క ముగ్గురి సేవలో ఓ.కె. అయితే ఓ.కె. అని వ్రాయండి, లేకపోతే లైన్ పెట్టి వదిలేయండి. పరివర్తనా శక్తి మరియు ధృడతా శక్తిని బాగా ఉపయోగించాలి. మంచిది. 

నలువైపుల ఉన్న అతి సర్వ స్నేహి మరియు సర్వ సహయోగి శ్రేష్ట ఆత్మలకు, నలువైపుల ఉన్న విజయీ పిల్లలకు, నలువైపుల ఉన్న పరివర్తనా శక్తి గల పిల్లలకు, నలువైపుల ఉన్న స్వయాన్ని ప్రత్యక్షం చేసుకుని బాబాని ప్రత్యక్షం చేసుకునే పిల్లలకు, సదా సమాధాన స్వరూపులు, విశ్వ పరివర్తకులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, మనస్పూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. మరియు బాబాకే శిరోకిరీటాలు అయిన పిల్లలందరికీ బాప్ దాదా యొక్క సమస్తే

Comments