31-12-2004 అవ్యక్త మురళి

    31-12-2004         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“ఈ సంవత్సర ప్రారంభం నుండి అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రత్యక్షము చేసుకోండి, ఇదే ముక్తి ధామ ద్వారాలను తెరిచేందుకు తాళం చెవి.”

ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్ దాదా తమ పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు, పరమాత్మ మిలనమును జరిపేందుకు పిల్లల స్నేహానికి జవాబుగా దూరదేశము నుండి సాకారవతనములోకి మిలనమును జరిపేందుకు వచ్చారు. ప్రపంచములోనైతే కొత్త సంవత్సర అభినందనలను పరస్పరం ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ బాప్ దాదా పిల్లలైన మీకు నవయుగము యొక్క మరియు కొత్త సంవత్సరము యొక్క రెండింటి యొక్క అభినందనలను తెలుపుతున్నారు. కొత్త సంవత్సరమును ఒక్క రోజే జరుపుకుంటారు. కాని నవయుగమునైతే మీరు సంగమయుగములో సదా జరుపుకుంటూనే ఉంటారు. మీరందరూ పరమాత్మ ప్రేమ యొక్క ఆకర్షణలో ఆకర్షింపబడుతూ ఇక్కడివరకూ చేరుకున్నారు. కానీ అందరికన్నా దూరదేశమునుండి వచ్చేవారు ఎవరు? డబుల్ విదేశీయులా? వారైతే ఈ సాకారదేశములోనే ఉన్నారు, కానీ బాప్ దాదా అయితే దూరదేశ నివాసి, వారు ఎంత దూరము నుండి వచ్చారు? వారు ఎన్ని మైళ్ళ దూరమునుండి వచ్చారు అన్న లెక్కను మీరు కనుగొనగలరా? కావున దూరదేశవాసి అయిన బాప్ దాదా తమ నలువైపులా ఉన్న పిల్లలను -వారు ముందు డైమండ్ హాల్ లో కూర్చున్నా లేక మధువనములో కూర్చున్నా లేక జ్ఞానసరోవరములో కూర్చున్నా, గ్యాలరీలో కూర్చున్నా మీ అందరితోపాటు దూరముగా కూర్చుంటూ కూడా దేశ, విదేశాలనుండి బాప్ దాదాతో మిలనమును జరుపుకుంటున్నారు. అందరూ ఎంత ప్రేమగా దూరము నుండి చూస్తున్నారో, వింటున్నారో బాప్ దాదా గమనిస్తున్నారు. కావున నలువైపులా ఉన్న పిల్లలకు నవయుగము మరియు కొత్త సంవత్సరం సందర్భంగా కోటానుకోట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. పిల్లలకైతే నవయుగము వారి కళ్లముందే ఉంది కదా! ఈరోజు సంగమంలో ఉన్నారు. రేపు మన నవయుగములో రాజ్యాధికారులుగా అయి రాజ్యము చేస్తాము, ఇంతటి సమీపముగా అనుభవమవుతోందా? ఇది కేవలం నేడు మరియు రేపు యొక్క విషయమే. నిన్న అలా ఉన్నారు, రేపు మళ్ళీ అలా అవ్వనున్నారు. మీ నవయుగము యొక్క, స్వర్ణయుగము యొక్క స్వర్ణిమ వస్త్రాలు మీ ముందు కనిపిస్తున్నాయా? అవి ఎంత సుందరముగా ఉన్నాయి! స్పష్టముగా కనిపిస్తున్నాయి కదా! ఈరోజు సాధారణ వస్త్రాలలో ఉన్నారు మరియు రేపు నవయుగము యొక్క సుందరమైన డ్రస్లో ప్రకాశిస్తూ కనిపిస్తారు. కొత్త సంవత్సరములో ఒకరికొకరు ఒక రోజు కోసం కానుకలను ఇచ్చుకుంటారు. కానీ నవయుగ రచయిత అయిన బాప్ దాదా మీ అందరికీ స్వర్ణ ప్రపంచము యొక్క కానుకను ఇచ్చారు. అది అనేక జన్మలు కొనసాగనున్నది. ఇది వినాశీ కానుక కాదు. బాబా పిల్లలైన మీకు అవినాశీ కానుకను ఇచ్చేసారు. అది అనేక జన్మలు కొనసాగనున్నది. అది వినాశీ కానుక కాదు. అవినాశ కానుకను బాబా పిల్లలైన మీకు ఇచ్చేసారు. మీకు గుర్తుంది కదా! మరచిపోలేదు కదా! మీరు ఒక్క క్షణములో రాగలరు, వెళ్ళిపోగలరు. ఇప్పుడిప్పుడే సంగమయుగములో, మళ్ళీ ఇప్పుడిప్పుడే మీ స్వర్ణయుగములోకి వెళ్ళిపోగలరా లేక అందుకు సమయం పడుతుందా? మీ రాజ్యము మీ స్మృతిలోకి వస్తుంది కదా! ఈరోజును వీడ్కోలు చెప్పే రోజు అనికూడా అంటారు. 12 గంటల తర్వాత అభినందనల రోజు అని అంటారు. కావున వీడ్కోలు చెప్పే రోజున ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతో పాటు మీరు ఈ సంవత్సరంతో పాటు ఇక దేనికి వీడ్కోలు చెబుతారు? సదాకాలికముగా వీడ్కోలు చెప్పారా లేక కొద్ది సమయం కొరకు వీడ్కోలు చెప్పారా అన్నది పరిశీలించారా? సమయం యొక్క వేగము తీవ్రగతితో ముందుకు వెళుతోంది అని బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. కావున నా పురుషార్థము యొక్క వేగము తీవ్రముగా ఉందా లేక అప్పుడప్పుడూ ఒక్కోలా ఉంటోందా? అని సంవత్సరమంతటి రిజల్టులో పరిశీలించారా? ప్రపంచంలోని పరిస్థితులను చూస్తూ ఇప్పుడు మీ యొక్క రెండు స్వరూపాలను ప్రత్యక్షము చేసుకోండి. ఒకటి- సర్వుల పట్ల దయార్థ భావన మరియు కళ్యాణకారీ భావన, ఇంకొకటి- ప్రతి ఆత్మ పట్ల సదా దాత పిల్లలైన మాస్టర్ దాతలుగా ఉండడం. విశ్వంలోని ఆత్మలు పూర్తిగా శక్తిహీనముగా, దుఖితముగా అశాంతితో ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా ముందు, పూజ్య ఆత్మలైన మీ ముందు కొద్ధి ఘడియల కోసమైనా సుఖమును ఇవ్వమని, శాంతిని ఇవ్వమని, సంతోషమును ఇవ్వమని, ధైర్యమును ఇవ్వమని ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా అయితే పిల్లల దుఃఖమును, వ్యాకులతను చూడజాలరు, వినజాలరు. పూజ్య ఆత్మలైన మీ అందరికి దయ కలగడం లేదా? ఇవ్వండి, ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కావున దాత పిల్లలైన మీరు ఎంతో కొంత దోసిలితోనైతే ఇవ్వండి. బాబా కూడా మిమ్మల్ని తమ తోటివారిగా చేసుకొని, మాస్టర్ దాతలుగా చేసుకొని తమ కుడి భుజాలుగా చేసుకుని ఇంతమంది విశ్వంలోని ఆత్మలందరికి ముక్తిని ఇప్పించాలి, ముక్తిధామంలోకి తీసుకువెళ్ళాలి అన్న ప్రేరణనే ఇస్తున్నారు. కావున హే దాత పిల్లల్లారా! మీ శ్రేష్ణ సంకల్పము ద్వారా, మనసా శక్తి ద్వారా, వాణి ద్వారా కానీ , సంబంధ సంపర్వాల ద్వారా కానీ శుభభావన, శుభకామనల ద్వారా కాని, వైబ్రేషన్లు, వాయు మండలం ద్వారా కానీ, ఏ యుక్తి ద్వారానైనా ముక్తిని ఇప్పించండి. ముక్తిని ఇవ్వమని ఆర్తనాదాలు చేస్తున్నారు. దయ చూపించమని బాప్ దాదా తమ కుడి భుజాలకు చెబుతున్నారు.

ఇప్పటివరకూ లెక్క చూడండి. మెగా ప్రోగ్రాంలు చేసినా, కాన్ఫరెన్సులు చేసినా భారతదేశములో కానీ, విదేశాలలో కానీ, సెంటర్లు తెరిచినా కానీ మొత్తం విశ్వంలోని ఆత్మల యొక్క సంఖ్యతో పోల్చి చూస్తే ఎంత శాతం మంది ఆత్మలకు ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేసారు! కేవలం భారతదేశపు కళ్యాణకారులుగా ఉన్నారా లేక విదేశములో ఐదు ఖండాలేవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సేవాకేంద్రాలు తెరువబడ్డాయో అక్కడి కళ్యాణకారులుగా ఉన్నారా? లేక విశ్వ కళ్యాణకారులుగా ఉన్నారా? విశ్వానికి కళ్యాణము చేసేందుకు పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు కుడి భుజాలుగా ఉన్నారు కదా! ఎవరికైనా, ఏమైనా ఇచ్చేటప్పుడు దేనితో ఇస్తారు? చేతులతోనే ఇస్తారు కదా! కావున బాప్ దాదాకు మీరు భుజాలే కదా! కావున బాప్ దాదా ఎంత శాతం కళ్యాణమును చేసారు అని తమ కుడి భుజాలను అడుగుతున్నారు. ఎంత శాతం కళ్యాణము చేసారు? వినిపించండి, లెక్క చూడండి. పాండవులు లెక్క చూడడంలో చురుకైనవారే కదా! కావున ఇప్పుడు స్వపురుషార్థము మరియు సేవ యొక్క భిన్న భిన్న విధుల ద్వారా పురుషార్థమును తీవ్రతరం చేయండి అని బాబా చెబుతున్నారు. స్వయం యొక్క స్థితిలోనూ విశేషముగా నాలుగు విషయాలను పరిశీలించండి. దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు.

మొదటి విషయము - నిమిత్త భావము ఉందా అని పరిశీలించండి. ఏవిధమైన రాయల్ రూపములోనూ నేను, నాది అనేదైతే లేదు కదా! సాధారణమైన వ్యక్తుల విషయములో నేను, నాది అనేది కూడా సాధారణముగా బాహ్యరూపములో ఉంటుంది. కానీ, బ్రాహ్మణ జీవితములో నాది మరియు నేను అనేది సూక్ష్మముగా మరియు రాయల్ గా ఉంటుంది. దాని భాష ఏమిటో మీకు తెలుసా? ఇవైతే జరుగుతూనే ఉంటాయి, ఇవి నడుస్తూనే ఉంటాయి, ఇవైతే జరుగవలసిందే, నడుస్తున్నాయి. చూస్తున్నాము... అని అంటూ ఉంటారు. కావున ఒకటేమో నిమిత్తభావము. ప్రతి విషయములోనూ నిమిత్తముగా ఉన్నాము. సేవలోనైనా, స్థితిలోనైనా, సంబంధ, సంపర్కాలలోనైనా ముఖము మరియు నడవడిక నిమిత్త భావముతో కూడినదై ఉండాలి. దాని ఇంకొక విశేషత- నిమిత్త భావముతో పాటు నిర్మాణభావము (నిర్మాణచిత్తత). నిమిత్తము మరియు నిర్మాణచిత్తము ద్వారా నిర్మాణమును చేయాలి. కావున మూడు విషయాలు నిమిత్తత, నిర్మాణచిత్తత మరియు నిర్మాణము, అలాగే నాల్గవ విషయము - నిర్వాణము. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నిర్వాణధామములోకి చేరుకోవాలి. నిర్వాణ స్థితిలో స్తితులైపోవాలి. ఎందుకంటే స్వయం నిర్వాణస్థితిలో ఉన్నప్పుడే ఇతరులను నిర్వాణధామములోకి చేర్చగలుగుతారు. ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. విముక్తులను చేయండి, విముక్తులను చేయండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. కావున ఈ నాలుగు విషయాలు మంచి శాతములో ప్రత్యక జీవితములో ఉండడము అనగా పురుషార్థులుగా ఉండడము. అప్పుడే ఓహో నా పిల్లలూ ఓహో అని బాప్ దాదా అంటారు. అలాగే మీరు కూడా ఓహో బాబా ఓహో!,ఓహో డ్రామా ఓహో,ఓహో పురుషార్థము ఓహో అని అంటారు. కానీ ఇప్పుడు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా? ఒకసారి వాహ్ (ఓహో) అని అంటే మరోసారి వై(ఎందుకు) అని అంటున్నారు. అనగా ఓహో అని అనేందుకు బదులుగా వై (ప్రశ్నార్థకం) అని అంటున్నారు. అలా వై అని అన్నది ఆర్తనాదాలుగా మారిపోతున్నాయి. కావున ఇక ప్రశ్నలు వద్దు, ఓహో అని అనండి. మీకు కూడా ఏమి నచ్చుతుంది? ఓహో అని అనడం నచ్చుతుందా లేక ప్రశ్నలు అనడం నచ్చుతుందా? ఓహో అని అనడమే నచ్చుతుంది కదా! మరి ఎప్పుడూ ప్రశ్నలు వేయరా? పొరపాటున వచ్చేస్తాయి.

డబుల్ విదేశీయులు వై, వై అని అంటారా? అప్పుడప్పుడూ అనేస్తారు కదా! ఎవరైతే ఎప్పుడూ ప్రశ్నలు వేయరో వారు చేతులెత్తండి. డబుల్ విదేశీయులు చాలా కొద్దిమంది ఉన్నారు. అచ్ఛా! భారతవాసీయులెవరైతే ఓహో, ఓహో అని అనేందుకు బదులుగా ఎందుకు, ఏమిటి అని అంటారో వారు చేతులెత్తండి. ఎందుకు? ఏమిటి? అని అంటారా? మీకు ఆ అనుమతిని ఎవరు ఇచ్చారు? మీకు అనుమతి ఎవరిచ్చారు? సంస్కారాలు ఇచ్చాయా? పాత సంస్కారాలు మీకు ఎందుకు అని అనేందుకు అనుమతిని ఇచ్చేసాయి మరియు బాబా ఓహో ఓహో అని అనండే కానీ ప్రశ్నలు వేయకండి అని చెప్పారు. మరి ఇక కొత్త సంవత్సరంలో ఏమి చేస్తారు? ఓహో, ఓహో అని అంటారా? లేక అప్పుడప్పుడూ ఎందుకు, ఎందుకు అని అనేందుకు అనుమతిని ఇచ్చేయాలా? ఇలా ప్రశ్నలు వేయడం మంచిది కాదు. ఎందుకు అని అన్నప్పుడు అది పాడైపోతుంది కదా! కావున ప్రశ్నలు వేయకండి. అలాగే ఆర్తనాదాలూ చేయకండి. ఓహో ఓహో అని అనడం ఎంత బాగా ఉంటుంది. కాబట్టి వాహ్! వాహ్! వాహ్! అని అనండి (ఓహో, ఓహో) అచ్ఛా! భారతదేశములోనూ మరియు విదేశములో కూడా దూరదేశములో ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో, ఎవరైతే దూరదేశములో ఉంటూ కూడా వింటున్నారో ఆ పిల్లలను కూడా బాబా అడుగుతున్నారు. మీరు ఓహో ఓహో అని అంటారా లేక ఎందుకు, ఎందుకు అని అంటారా? ఇప్పుడు ఇది వీడ్కోలు చెప్పే రోజు కదా! ఈ రోజు సంవత్సరం యొక్క చివరి వీడ్కోల రోజు. కావున ఇక మేము ప్రశ్నలు వేయము. ఆలోచించము కూడా అని సంకల్పం చేయండి. ప్రశ్నార్థకమూ లేదు, అశ్చర్యార్ధకమూ లేదు, బిందువును దిద్దండి. ప్రశ్నార్థకము వ్రాసినప్పుడు అది ఎంత వంకర టింకరగా ఉంటుంది. కానీ బిందువు ఎంత సహజముగా ఉంటుంది! నయనాలలో బిందురూపుడైన బాబాను ఇముడ్చుకోండి. నయనాలలో దృష్టిని కలిగించేందుకు బిందువు ఇమిడి ఉంటుంది కదా! అలాగే సదా నయనాలలో బిందువైన బాబాను ఇముడ్చుకోండి. అలా ఇముడ్చుకోవడం వస్తుందా లేక అది ఫిట్ అవ్వదా? పైకి, కిందకూ అయిపోతుందా? మరి ఏమి చేస్తారు? దేనికి వీడ్కోలు చెబుతారు? ప్రశ్నలకు వీడ్కోలు చెప్పండి. ఎప్పుడూ ఇది ఎలాగ, ఇది కూడా జరుగుతుందా? ఇలాగైతే జరుగకూడదు, కానీ ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు కూడా రాకూడదు. బాబా మరియు నేను. ఇవైతే నడుస్తూనే ఉంటాయి కదా అని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు. ఆత్మిక సంభాషణలో బాప్ దాదా చాలా రమణీకమైన విషయాలను చెబుతూ ఉంటారు. బాబా ముందైతే చెప్పలేరు కదా! కావున ఆత్మిక సంభాషణలో అన్నీ చెప్పేస్తారు. అచ్చా! ఏదైనా నడుస్తుందేమో కానీ మీరైతే అలా నడువకూడదు. మీరైతే ఎగిరిపోవాలి. కావున నడిచే విషయాలను మీరెందుకు చూస్తారు? మీరు ఎగరండి మరియు అందరినీ ఎగిరించండి. శుభభావన మరియు శుభకామన ఎంతటి శక్తిశాలిగా ఉంటాయంటే, కేవలం మధ్యలో శుభభావన. శుభకామన తప్ప ఈ ప్రశ్నలు ఏవీ రాకూడదు. కావున మీరు అశుభభావనలో ఉన్నవారిని కూడా శుభభావనలోకి మార్చేంతగా అంతటి శక్తిశాలిగా ఉన్నారా? అచ్ఛా! మీరు వారిని మార్చలేకపోయినా మీ శుభభావన. శుభకామన అవినాశిగా ఉన్నట్లయితే, అప్పుడప్పుడూ ఉండేవిగా లేనట్లయితే, అవినాశిగా ఉన్నట్లయితే మీ పైన అశుభభావన యొక్క ప్రభావము పడజాలదు. ఇది ఎందుకు జరుగుతోంది? ఇది ఎప్పటివరకూ కొనసాగుతుంది, ఎలా నడుస్తుంది అని ప్రశ్నలలోకి వెళ్ళిపోతారు, దానివల్ల శుభభావన యొక్క శక్తి తగ్గిపోతుంది. లేకపోతే శుభభావన లేక శుభకామన - ఈ సంకల్ప శక్తిలో ఎంతో శక్తి ఉంది. చూడండి. మీరందరూ బాప్ దాదా వద్దకు వచ్చారు. బాప్ దాదా వద్దకు వచ్చినప్పుడు ఆ మొదటి రోజును గుర్తు చేసుకోండి. బాప్ దాదా ఏమి చేసారు? పతితులుగా వచ్చినా, పాపులుగా వచ్చినా, సాధారణమైనవారిగా వచ్చినా, భిన్న భిన్న వృత్తులు కలవారిగా, భిన్న భిన్న భావనలు కలవారిగా వచ్చినా బాప్ దాదా ఏమిచేసారు? శుభభావనను ఉంచారు కదా! మీరు నావారు. మాస్టర్ శక్తివంతులు, హృదయ సింహాసనాధికారులు అన్న ఈ శుభభావనను ఉంచారు కదా, శుభకామనను ఉంచారు కదా! దాని ద్వారానే ఒక్క బాబాకు చెందినవారిగా అయిపోయారు కదా! హేపాపీ, ఎందుకు వచ్చావు అని బాబా అన్నారా? మీరు నా పిల్లలు, మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు అని శుభభావనను ఉంచారు. బాబా మీ అందరిపైనా శుభభావనను ఉంచారు. శుభకామనను ఉంచారు. కావున మీ హృదయము ఏమంది? నా బాబా అని అంది కదా! బాబా ఏమన్నారు? నా పిల్లలు అని అన్నారు. అలాగే శుభభావన. శుభకామనను ఉంచినట్లయితే ఏమి కనిపిస్తుంది? నా కల్పపూర్వపు మధురమైన సోదరుడు,నా చాలాకాలం తర్వాత కలిసిన సోదరి అనే అనిపిస్తుంది, పరివర్తన జరుగుతుంది.

కావున ఈ సంవత్సరంలో ఏదో ఒకటి చేసి చూపించాలి. కేవలం చేతులు ఎత్తడం కాదు, చేతులు ఎత్తడం చాలా సహజము. మనస్సుతో చేతులు ఎత్తండి, ఎందుకంటే ఇంకా ఎంతో పని మిగిలి ఉంది. బాప్ దాదా అయితే విశ్వంలోని అందరి ఆత్మలవైపు దృష్టి సారిస్తారు. బాబాకు ఎంతో దయ కలుగుతుంది. ఇప్పుడు ఇక ప్రకృతి కూడా విసిగిపోయింది. ప్రకృతి స్వయమూ విసిగిపోయింది. మరి అది ఏమి చేస్తుంది? ఆత్మలను విసిగిస్తోంది మరియు బాబాకు పిల్లలను చూసి దయ కలుగుతుంది. మీ అందరికీ దయ కలుగదా? కేవలం ఇంతమంది ఆత్మలు వెళ్ళిపోయారు అని వార్తలు విని మౌనంగా ఉండిపోతారా? ఆ ఆత్మలు సందేశమునుండైతే వంచితమైపోయాయి కదా! ఇప్పుడు దాతలుగా అవ్వండి. దయార్ద్ర హృదయులుగా అవ్వండి ఎప్పుడైతే ఈ సంవత్సర ప్రారంభం నుండి మీ లోపల బేహద్ వైరాగ్య వృతిని ప్రత్యక్షము చేసుకుంటారో అప్పుడే అది సంభవమవుతుంది. బేహద్ వైరాగ్య వృత్తి కావాలి. ఈ దేహము యొక్క, దేహభావము యొక్క స్మృతి - ఇది కూడా బేహద్ వైరాగ్యము యొక్క లోపమే. చిన్న చిన్నహద్దులోని విషయాలు స్థితిని అలజడి పరుస్తూ ఉంటాయి. అందుకు కారణము ఏమిటి? బేహద్ వైరాగ్య వృత్తి తక్కువగా ఉంది, ఆకర్షణ ఉంది. వైరాగ్యము లేదు, ఆకర్షణ ఉంది. ఎప్పుడైతే పూర్తిగా బేహద్ వైరాగ్య వృత్తి గలవారిగా అయిపోతారో వృత్తిలో కూడా వైరాగ్యము, దృష్టిలో కూడా బేహద్ వైరాగ్యము, సంబంధ సంపర్కాలలో,సేవలో అన్నింటిలోనూ ఎప్పుడైతే బేహద్ వైరాగ్యులుగా అవుతారో అప్పుడే ముక్తిధామము యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు ఏ ఆత్మలైతే వస్తున్నాయో వారంతా మళ్లీ జన్మలు తీసుకుంటారు. మళ్లీ దుఃఖితులుగా అవుతారు. ఇప్పుడిక ముక్తిధామము యొక్క ద్వారాలను తెరిచేందుకు మీరే నిమిత్తులు కదా! మీరు బ్రహ్మాబాబా యొక్క సహచరులే కదా! కావున అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారాలను తెరిచే తాళం చెవి. ఇప్పుడు ఇంకా తాళంచెవిని పెట్టలేదు. ఇంకా తాళం చెవిని తయారుచేయలేదు. బ్రహ్మాబాబా కూడా ఎదురుచూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీవారు కూడా ఎదురుచూస్తున్నారు, ప్రకృతి కూడా ఎదురుచూస్తోంది. బాగా విసిగిపోయింది. మాయ కూడా తన రోజులను లెక్కపెడుతోంది. కావున హే మాస్టర్ సర్వశక్తివంతులారా, ఇప్పడిక ఏమి చేయాలో చెప్పండి. ఈ సంవత్సరం ఏదైనా కొత్తదనమును చేస్తారు కదా! కొత్త సంవత్సరం అని అన్నప్పుడు ఏదైనా కొత్తదనమును చేస్తారు కదా! ఇప్పుడిక బేహద్ వైరాగ్యము కొరకు, ముక్తిధామానికి వెళ్ళేందుకు తాళంచెవిని తయారుచేయండి. మీరందరూ కూడా మొట్టమొదట ముక్తిధామంలోకి వెళ్ళాలి కదా! కలిసి వెళతాము, కలిసి వస్తాము, కలిసి రాజ్యం చేస్తాము, కలిసి భక్తి చేస్తాము అని బ్రహ్మాబాబాతో ప్రతిజ్ఞ చేసారు కదా! కావున ఇప్పుడు ఇక ఏర్పాట్లు చేయండి. ఈ సంవత్సరం చేస్తారా? లేక మరొక సంవత్సరం కావాలా? ఎవరైతే ఈ సంవత్సరంలో పూర్తి ధ్యానమును ఉంచుతాము, పదే పదే చేస్తాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి చేస్తారా? అలాగైతే అడ్వాన్స్ పార్టీవారు మీకు ఎంతో అభినందనలు తెలుపుతారు. వారు కూడా అలసిపోయారు. అచ్చా! టీచర్లు ఏమంటారు? మొదటి లైన్ వారు ఏమంటారు? మొదటి లైన్లోని పాండవులు మరియు శక్తులు ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి. సగం చేతులెత్తడం కాదు, సగమే ఎత్తినట్లయితే సగమే చేస్తారని అర్థం. చేతులు పూర్తిగా ఎత్తండి. అచ్చా! అభినందనలు, అభినందనలు. డబుల్ విదేశీయులు కూడా చేతులెత్తండి. ఎవరెవరు చేతులెత్తలేదో పరస్పరం చూసుకోండి, దూరం నుండి కనిపించడం లేదు కదా, అచ్చా! ఈ సింధీ గ్రూప్ వారు కూడా చేతులెత్తుతున్నారు. ఇది అద్భుతమే. మీరు కూడా చేస్తారా? సింధీ గ్రూప్ వారు కూడా చేస్తారా? అలాగైతే మీకు డబుల్ అభినందనలు. చాలా బాగుంది. ఒకరికొకరు సహయోగమునిచ్చుకుంటూ శుభభావన యొక్క ప్రేరణను ఇచ్చుకుంటూ చేతిలో చేయి కలుపుతూ దీనిని చేయవలసిందే. అచ్చా!

(సభలో ఎవరో శబ్దం చేసారు) అందరూ కూర్చోండి. నథింగ్ న్యూ. అచ్చా! మధువనము వారు చేతులెత్తండి. అచ్చా! పైన కూడా ఎవరైతే వింటున్నారో వారు చేతులెత్తుతున్నారు. దేశ విదేశాలవారు చేతులెత్తుతున్నారు. బాగుంది. సంఘటనలో శక్తి ఉంది. ఒకరికొకరు శుభభావన యొక్క ప్రేరణను ఇచ్చుకోండి. చెప్పనక్కరలేదు. చెబితే ఘర్షణ జరుగుతుంది. కావున శుభభావన యొక్క ప్రేరణను ఇవ్వండి. శుభభావన యొక్క ప్రేరణను ఇవ్వడము మీకు వచ్చు కదా! శుభభావన యొక్క ప్రేరణను మీరు ఇవ్వగలరా? అచ్చా! బాప్ దాదా సంతోషిస్తున్నారు. బాప్ దాదా డైమండ్ హాలు ఏదైతే తయారుచేయించారో దానిని సఫలం చేస్తున్నారు. కావున సఫలతా భవ. ప్రతి క్షణమును, ప్రతి సంకల్పమును, ప్రతి వాక్కును, ప్రతి అడుగును. ప్రతి వస్తువును సఫలం చేయండి మరియు సఫలం చేయించండి. ఈ సంవత్సరం 12 గంటల తర్వాత బాప్ దాదా వైపు నుండి 'సఫలతా భవ' అన్న మొదటి వరదానమును స్వయమునకు ఇచ్చుకోండి. సంకల్పము కూడా అసఫలం అవ్వకూడదు. ఎందుకంటే మీ ఒక్కొక్క శుభసంకల్పము విశ్వకళ్యాణమును చేస్తుంది. అది అంతటి అమూల్యమైనది. ఒక్కొక్క క్షణము విశ్వకళ్యాణమునకు ఆధారము. కావున సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా అవ్వండి. ఒక్క క్షణము ఏదైతే గతిస్తుందో, సంకల్పమేదైతే కలుగుతుందో అది సఫలమయ్యిందా అన్నది పరిశీలించుకోండి. ఈరోజు అందరూ మెజార్టీ కింద కూర్చున్నారు. వారంతా పట్రానీలు, వీరు కుర్చీ రాణీలు, కుర్చీ రాజులు మరియు మీరు పట్రానులు. ఇందులో ఆనందముగా ఉంది కదా అలసిపోలేదు కదా? ఎందుకంటే ఈరోజు ఎక్కువ సమయం కూర్చోవాలి కదా? మూడు గంటల నుండే వచ్చి మీ స్థానాన్ని పట్టుకొని కూర్చుంటారు. బాప్ దాదా అన్ని చూస్తూ ఉంటారు. ఎవరెవరైతే మూడు, నాలుగు గంటలకే హాల్ లోకి వచ్చారో వారు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో టీవిలో చూడండి. మొత్తం అందరూ చేతులెత్తుతున్నారు. కొందరు మూడు గంటలకు, కొందరు నాలుగు గంటలకు వచ్చారు. మూడు గంటలకు వచ్చిన వారికి త్రిలోకీనాథ్ అన్న వరదానము. భక్తిలో ఎంతో చేసారు కదా! కావున సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కూడా చేస్తారు. మన రాజ్యంలో ఇదేదీ ఉండదు. కానీ అక్కడకు బాబా రారు. అలాగే మీరూ రారు. మరి ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడే ఆనందాన్ని పొందండి. మీరు కింద కూర్చోలేదు. బాప్ దాదా అయితే మిమ్మల్ని హృదయసింహానముపై చూస్తున్నారు. కానీ దృశ్యం చాలా బాగుంది. అందరూ హిందువులుగా అయి కూర్చున్నారు. చలిగా అనిపిస్తోందా? చలి పారిపోయింది కదా, అచ్చా!

ఇప్పుడిప్పుడే ఒక్క క్షణములో బిందువుగా అయి బిందువైన బాబాను స్మృతి చేయండి మరియు ఏవైనా విషయాలుంటే వాటన్నింటికీ బిందువును దిద్దండి, బిందువును దిద్దగలరా? ఒక్క క్షణములో నేను బాబాకు చెందినవాడను మరియు బాబా నావారు, అచ్చా!

సేవ యొక్క టర్న్ మహారాష్ట్ర వారిది:- అచ్చా! మంచి స్వర్ణిమ అవకాశం లభిస్తుంది. ప్రతిజోన్‌ వారికి ఈ స్వర్ణావకాశం లభిస్తుంది. ఈ 15-20 రోజుల్లో సత్యమైన బ్రాహ్మణుల సేవ చేసి మీ పుణ్యము యొక్క గోదాములను నింపుకుంటున్నారు. ఎందుకంటే మంచి సేవ చేస్తే అందరి హృదయమునుండి ఏమి వెలువడుతుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది అన్నదే వెలువడుతుంది. కావున ఈ దీవెనలు పుణ్యఖాతాలో జమ అయిపోతాయి. కావున ఎవరికైనా పుణ్యఖాతాను జమ చేయించడం ఎంతో సహజం. యోగబలం ద్వారానైతే జరుగుతూనే ఉంటుంది. కానీ కర్మచేస్తూ కూడా పుణ్య ఖాతాను జమ చేసుకున్నట్లయితే కర్మయోగ స్థితిలో యజ్ఞ సేవను చేసినట్లయితే ఖాతా నిండుగా అయిపోతుంది. ఇది సహజ విధి. వీరు మహారాష్ట్రవారు, కావున మహారాష్ట్ర వారి సంఖ్య కూడా మహాన్ గా ఉంది. సెంటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. గీతా పాఠశాలలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. బాగుంది.. ఎవరెవరైతే తమ స్వ ఇచ్ఛ ద్వారా స్వయమును సేవలో తమ జీవిత సహితముగా సమర్పణ చేస్తారో అలా సమర్పితమైన పిల్లలందరికి తమ శరీర నిర్వహణకు కావలసిన సాధనము తప్పకుండా సహజముగా ప్రాప్తమవుతుంది. తినండి, తాగండి, ప్రభువు యొక్క గుణగానం చేయండి. సేవచేస్తారు, భాషణ చేస్తారు,కోర్సులు చేయిస్తారు. ఇవన్నీ ఏమిటి? ప్రభువు యొక్క గుణగానమునే చేస్తారు కదా! పప్పు, అన్నమును ఇప్పించేందుకైతే బాప్ దాదా బంధింపబడి ఉన్నారు. 36 రకాల భోజనాలనైతే తినిపించరు. అలా వాటిని అప్పుడప్పుడు తినిపిస్తారు. కావున చాలా మంచిది. ట్రస్టీగా అయి సేవ చేస్తున్నట్లయితే, ట్రస్టీలుగా ఉన్నట్లయితే నిత్యమైన ట్రస్టీలుగానే కానీ స్వార్ధమున్న ట్రస్టీలుగా కాదు. సత్యమైన ట్రస్టీలుగా ఉన్నట్లయితే బాప్ దాదా ఎప్పుడూ ఆకలితో ఉండనివ్వరు. పప్పు, అన్నమునైతే తప్పకుండా తినిపిస్తారు. బాప్ దాదా తినకుండా ఉంటారా? బాప్ దాదా ఆకలితో ఉండరు. మీరందరూ భోగ్ పెడతారు కదా! చతురతనైతే చేయరు కదా! ఒక్క ముద్ద తినిపించి ఆ తర్వాత మరిచిపోవడం కాదు. ట్రస్టీలుగా ఉన్నట్లయితే బాప్ దాదా బంధింపబడి ఉన్నారు. కావున మహారాష్ట్ర ఎంత విశాలమైనదో అంతగానే వారసులు కూడా మహాన్ గా ఉన్నారు. అంతే కదా! ఇప్పుడు ఈ సంవత్సరంలో బాప్ దాదా అన్ని జోన్లలోనూ ఎంతమంది వారసుల క్వాలిటీలో ఉన్నారో ఆ లిస్ట్ను తెప్పిస్తారు. ఆ వారసుల సెరిమనీని జరుపుతారు, టీచర్లకైతే తెలుసు కదా! ఇందులో నెంబర్ వన్ గా ఏ జోన్ వారు ఉన్నారో చూద్దాము. మహారాష్ట్ర వారు ఉంటారు కదా! చాలా బాగుంది. పక్కా వారసులు ఎవరు? ఎంతమంది ఉన్నారు మరియు ఈ సంవత్సరంలో ఈ మెగా కార్యక్రమాలేవైతే చేసారో వాటన్నింటినీ బాగా చేసారు. ఎన్ని కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడెక్కడ జరిగాయి(15-16 జరిగాయి). కొన్ని, కొన్ని ప్రోగ్రాంలైతే జోన్లవారు కలిసి చేసారని, మరికొన్ని కార్యక్రమాలను ఒక సెంటర్ లేక పరస్పరం సంబంధంలో ఉన్న సెంటర్లు కలిసి చేసారని బాప్ దాదా గమనించారు. వారు ఎవరెవరు? (మంగళూరు, సంభల్ పూర్, భిలాసపూర్, పూనా, మెహసానా) కావున వీరు అద్భుతం చేసారు కదా! వారు వచ్చారా? ఎవరెవరు వచ్చారు? పూనా టీచర్లు లేవండి. పూనావారు కూడా అద్భుతము చేసారు. బాగుంది. మంచి సర్టిఫికెట్‌ను తీసుకున్నారు. అచ్చా! మెహసానా వారు కూడా చేసారు. అభినందనలు. భిలాసాపూర్ నుండి అన్నయ్యలు వచ్చారు. వారికి కూడా అభినందనలు, సంభల్ పూర్ నుండి ఎవరైనా వచ్చారా? కొద్ది కొద్దిమంది వచ్చారు, వారికి కూడా అభినందనలు. ధైర్యమును ఉంచి చేసారు మరియు సఫలతను పొందారు. కావున సఫలతకు అభినందనలు, బాగుంది, ఇదైతే జరిగింది. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? అన్ని వర్గాల సేవ అయితే జరిగింది కానీ అన్ని వర్గాల వారు ఆదినుండి అంతిమం వరకూ ఏ సేవనైతే చేసారో,బాప్ దాదా మైకులను పిలిపించారు కదా, కాని వారంతా నెంబర్ వారీగానే ఉన్నారు. అందరూ పవర్ ఫుల్ గా లేరు, కొందరు మధ్యస్థంగా ఉన్నారు కానీ ఇప్పుడు బాప్ దాదా ఇంతకాలం వర్గాల యొక్క సేవనేదైతే చేసారో వారినుండి ఐ.పి.లు లేక వి. ఐ.పి.లు మేము జ్ఞానమును ఒప్పుకుంటున్నాము అని అనేవారు ప్రతి జోన్ నుండి ఎంతమంది వెలువడ్డారు? కేవలం ఈ కార్యం చాలా బాగుంది. దీనిని ఇంకెవ్వరూ చేయలేరు అని మాత్రమే మహిమను గానం చేయడం కాదు. నేను ఈ జ్ఞానాన్ని ఒప్పుకుంటున్నాను అని వ్యక్తపరిచే ఇటువంటి నాలెడ్జ్ ఫుల్ గ్రూపును బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. అర్ధమయ్యిందా? కావున ఈ సంవత్సరంలో చివరిలో వచ్చే చివరి టర్న్ ప్రతి వర్గం వారు ఐ.పి.లు అని ఎవరినైతే అంటారో వి.ఐ.పి.ల భాగ్యమైతే కాస్త వెనుక ఉంది. కానీ ఐ.పి.లెవరైతే జ్ఞానమును ఒప్పుకుంటారో అటువంటి గ్రూపును బాప్ దాదాల ముందుకు తీసుకురండి, వారు సేవ చేయాలి. వారిని సేవకు నిమిత్తముగా తయారుచేద్దాము. సరేనా? ఇప్పుడు ఇది వచ్చే సంవత్సరం యొక్క హోంవర్క్, వర్గాలవారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక వర్గం వారైతే తప్పక వస్తారు..

బ్యారిస్ట్ మరియు కల్చరల్ వింగ్ వారు వచ్చారు - అచ్చా! కల్చరల్‌ వారు ఎప్పుడైతే కల్చర్‌ను చూపిస్తారో అందులో ఇంకేమి నిరూపిస్తారు? మీరు ఏ సాంస్కృతిక కార్యక్రమాలనేవైతే చేస్తారో అందులో మీ నడవడిక, ముఖము మరియు కర్మల ద్వారా ఏ క్యారెక్టర్ కనిపిస్తుంది? వీరు శ్రేష్ఠ క్యారెక్టర్ గలవారు అన్నది కనిపిస్తుందా? అవును అన్నా అనండి, లేదన్నా అనండి, అవును అంటే చేతులు ఉపండి, అచ్చా! రెండు లక్ష్యాలనూ ఉంచుతున్నారా? ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలనైతే అందరూ చేస్తారు. కానీ మీరు ఏ కార్యక్రమాలనైతే చూపిస్తారో లేక ఏ కార్యక్రమాలనైతే చేస్తారో అందులో కేవలం కల్చరల్ మాత్రమే ఉండడం కాదు, అందులో నైతిక విలువలు కూడా ఇమిడియుండాలి. క్యారెక్టర్ (సద్ శీలత) ఉండాలి. తద్వారా ఏమి జరుగుతుంది? మేము కూడా క్యారెక్టర్‌ను ధారణ చేయాలి అని చూసేవారికి సహజముగానే ఆకర్షణ కలుగుతుంది. కావున ఈ విధిద్వారా చేయండి. ఎందుకంటే చాలామంది జ్ఞానమును వినాలనుకోరు. నేరుగా జ్ఞానమును వినరు. మీ నడవడిక ద్వారా వారు నడవడికను నేర్చుకుంటారు. కావున ఇలా కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకా లక్ష్యమును ఉంచి- మేము తక్కువలో తక్కువ ఎవరైతే చూస్తున్నారో వారికి నైతిక విలువల యొక్క ప్రేరణ లభించాలి, ఆకర్షణ కలగాలి. దీనిని మనం చేయాలి అని భావించాలి. బాగా చేస్తున్నారు, ఏ ఏ వర్గాలైతే చేస్తున్నారో బాప్ దాదా ఆ ప్రతివర్గం యొక్క పురుషార్థమును మరియు రిజల్టును చూసి సంతోషిస్తున్నారు మరియు ఈ వర్గీకరణ యొక్క సేవ తర్వాత చాలా మంది సోదరి, సోదరులకు అవకాశము లభిస్తోంది. సేవాక్షేత్రములో ముందుకు రావడంలో ఇంకా బిజీగా ఉంటున్నారు. కావున బాప్ దాదాకు వర్గాల సేవ బాగా నచ్చుతుంది. అందరూ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో వర్గం వారు వస్తారు. అందరూ బాగున్నారా? చాలా బాగున్నారా లేక బాగున్నారా? చాలా బాగున్నారా? తీవ్ర పురుషార్థము చేస్తున్నారా లేక పురుషార్ధము చేస్తున్నారా? బాగా నడుచుకుంటున్నారా లేక ఎగురుతున్నారా ఏమంటారు? ఇప్పుడు ఎగరాలి మరియు అందరినీ ఎగిరేలా చేయాలి. నడిచే సమయం పూర్తయిపోయింది. ఎడ్ల బండ్ల సీజన్ పూర్తయిపోయింది కదా! కార్లు వచ్చాయి. ఇంతకుముందైతే ఎడ్ల బండ్లపైనే వెళ్ళేవారు కదా! కానీ ఇప్పుడు అలా వెళ్ళే సమయం పూర్తయిపోయింది. ఇప్పుడిక ఎగరాలి.

బాగుంది. అందరూ కూర్చోండి, అచ్చా!

జ్యూరిస్ట్ వింగ్ వారితో - అచ్చా! మంచి, మంచి వారందరూ వచ్చారు. అభినందనలు జడ్జీలు మరియు వకీళ్ళు శబ్దాన్ని ప్రఖ్యాతము చేసేవారిగా ఉంటారు కదా! కావున ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్‌గా మీరు కూడా ఆధ్యాత్మికత యొక్క శబ్దమును ప్రఖ్యాతము చేసి చూపించండి. తద్వారా సాధారణ వకీలులు, సాధారణ జడ్జీలు మరియు ఆధ్యాత్మిక జడ్జీలు లేక వకీలులలో ఎంత తేడా ఉంటుంది అన్నది అందరి దృష్టిలోకి రావాలి. జరుగుతుంది. గీతా భగవానుని విషయమును గూర్చి కూడా ఆలోచిస్తున్నారని బాప్ దాదా విన్నారు. ఆలోచించండి, ఇందులో ఎవరో ఒకరిని నిమిత్తముగా చేయవలసి ఉంటుంది. కొందరు జడ్జీలు, కొందరు ధర్మాత్మలు రెండు గ్రూపులనుండి ముగ్గురు నలుగురిని తయారుచేయండి. సేవలోకి, మైదానములోకి రావలసి ఉంటుంది. పరస్పరం మీటింగ్ జరపండి. జడ్జీలందరూ కలిసి మీటింగ్ చేసి ఏదైనా ప్లాన్ను గూర్చి ఆలోచించండి. అలాగే రెలిజియస్ వారు ఎవరైతే ఉన్నారో వారు. వీరు ఇరువురూ కలిసి చర్చించండి. అప్పుడు ఏదైనా చేయగలుగుతారు. తప్పక అవుతుంది. ఇదైతే అవ్వవలసిందే, అభినందనలు. ఎవరెవరైతే వచ్చారో వారందరికీ కూడా విశేషమైన అభినందనలు. అచ్ఛా!

డబుల్ విదేశీయులు చాలామంది వచ్చారు - డబుల్ విదేశీయులైతే శాంతివనానికి లేక మధువనానికి విశేష సింగారము. పిల్లలు ఒక్కొక్కరు విశేషముగా డబుల్‌ హీరోలుగా ఉన్నారని బాప్ దాదా గమనిస్తున్నారు. రత్నాలుగానూ ఉన్నారు మరియు హీరో పాత్రను అభినయించే వారిగానూ ఉన్నారు. కావున విదేశీయులు ఒక్కొక్కరు డబుల్ హీరోలుగా ఉన్నారు. ఎన్ని దేశాలలో, అక్కడి నుండి తయారై అక్కడే సేవ చేస్తున్నారో చూడండి! ఎన్ని దేశాలనుండి వచ్చారో వినిపించారు కదా! (40 దేశాలు), అచ్చా! 40 దేశాలవారు చేతులెత్తండి. ఎవరైతే భిన్న, భిన్న దేశాలనుండి వచ్చారో మరియు అక్కడే సేవ చేస్తున్నారో వారిలో నుండి ఎవరైనా ఒక్కొక్కరు చేతులెత్తండి. చిన్న పిల్లవాడు కూడా చేతులెత్తుతున్నాడు. అభినందనలు, అభినందనలు. అచ్చా! 40 దేశాలవారు పొడుగ్గా చేతులెత్తండి. 45 దేశాల వారికి కోటానురెట్ల అభినందనలు. చిన్నపిల్లల రిట్రీట్ జరుగుతోంది. ఈ పిల్లల గ్రూప్ ఎంత బాగుందో అందరూ చూడండి. ఎన్ని దేశాల పిల్లలు వచ్చారు? దేశాల నుండి 20 మంది పిల్లలు వచ్చారు. పాటలు వినిపించండి. (మేము బాబాకు చెందినవారము మరియు బాబా మావారు) అన్న పాటను పిల్లలు పాడారు. అచ్చా! పిల్లలందరూ అమృతవేళ యోగం చేస్తున్నారా? ఏ పిల్లలైతే అమృతవేళ యోగం చేస్తారో వారు చేతులెత్తండి. అచ్చా! ఎవరైతే అప్పుడప్పుడూ చేస్తారో వారు చేతులెత్తండి, అప్పుడప్పుడూ చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అచ్చా, పోట్లాటలు, గొడవలు చేస్తారా? ఎవరైతే పోట్లాడుకోరో వారు చేతులెత్తండి? అచ్చా! ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఇక పోట్లాడకండి. ఎందుకంటే మీరు బ్రహ్మాకుమారులు కదా! కావున బ్రహ్మాకుమారులు బాబా నావారు మరియు నేను బాబాకు చెందినవాడను అన్న తర్వాత ఇక పోట్లాటలు ఉండకూడదు. అలా చేస్తే బాబా నావారిగా ఉండరు. మరి ఇప్పుడు పోట్లాడుతారా? ఇప్పుడు పరివర్తన జరుపుతారా? ఇప్పుడు వీరు పోట్లాటలు, గొడవలు చేస్తున్నారా లేదా అన్న రిపోర్టు టీచర్లందరూ ఇవ్వండి. అభినందనలు. బాగుంది. ఎంతైనా పురుషార్థమునైతే బాగా చేస్తున్నారు కదా! కావున కోటానురెట్ల అభినందనలు. (విదేశమునుండి యూత్ గ్రూప్ వారు కూడా వచ్చారు. 'మై బాబా' అన్న సైన్‌బోర్డు చూపిస్తున్నారు. చాలా బాగుంది, చప్పట్లు కొట్టండి. యూత్ గ్రూప్ వారు పురుషార్థములో చాలా గుహ్యతను తీసుకువచ్చారని బాప్ దాదా విన్నారు. కావున ఈ పురుషార్థములో ఎవరైతే సూక్ష్మములోకి వెళ్ళారో వారంతా సదా పురుషార్థములో ఇంకా మున్ముందుకు వెళ్ళండి. వెనుకకు రాకండి, ముందుకే వెళుతూ ఉండాలి మరియు ఎగురుతూ ఉండాలి. అభినందనలు. అభినందనలు, అభినందనలు, అచ్చా!

(జానకీ దాదీజీ బాబాను ఒక ప్రశ్న అడిగారు. విశ్వములోని కోట్లాది ఆత్మలకు ఈ సంవత్సరంలో సందేశం ఎలా లభించగలదు? వీరు 'మా బాబా' అన్న అనుభవం ఎలా కలుగగలదు? అందుకొరకు ఏ ప్లాన్ తయారుచేయాలి) దానికొరకు ఏదైనా గ్రూప్ తయారుచేయండి. ఇటువంటి చిన్న గ్రూప్ నేదైనా తయారుచేయండి. వారు ఈ విషయముపై మననము చేయాలి. ఎందుకంటే విధులనైతే వినిపించారు. ప్రతి ఒక్కరూ తాము మనసా సంకల్పము ద్వారా కానీ, వృత్తి, వైబ్రేషన్ల ద్వారా కానీ, వాణి ద్వారా కానీ, సంబంధ సంపర్కాల ద్వారా కానీ ప్రతి ఒక్కరూ రోజంతటిలో ఎంతమంది ఆత్మల యొక్క సేవను చేసాను అన్న లక్ష్యమును ఉంచాలి. మనస్సు ద్వారా కానీ, వృత్తి, వైబ్రేషన్ల ద్వారా కానీ, వాణి ద్వారా కానీ, ప్రోగ్రాం ద్వారా కానీ లేక సంబంధం సంపర్కాల ద్వారా కానీ లేక నడవడిక మరియు ముఖకవళికల ద్వారా కానీ, నా సేవ యొక్క రిజల్టు రోజంతటిలో ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. సేవ లేకుండా ఉండలేని ఒక గ్రూపు ఆలోచించేందుకు తయారుచేయండి, వారిని చూసి అందరూ అనుసరిస్తారు. కానీ స్వస్థితి మరియు సేవా స్థితి యొక్క సమతుల్యత ఉండాలి. అప్పుడిక సేవ బాగా పెరుగుతుంది మరియు ఇతరులకు కూడా ఇక్కడ బ్యాలెన్స్ ఉంది అని ఉత్సాహము కలుగుతుంది. కేవలం సేవే చేస్తూ ఉంటే, వీరు కేవలం మాట్లాడేవారే అని భావిస్తారు. బాధ్యతను చేపట్టే ఇటువంటి గ్రూప్ నేదైనా తయారుచేయండి. మేము సృస్థితి మరియు సేవ యొక్క విధుల ద్వారా సేవ చేస్తాము అని భావించే గ్రూపును తయారుచేయండి. గ్రూప్ ఒక ఉదాహరణగా ఉండాలి. దీపము నుండి దీపము వెలుగుతూ దీపావళిగా అయిపోతుంది అని అంటారు కదా! అలా ఒక గ్రూప్ నుండి మరొకటి వృద్ధి చెందుతూ ఉంటుంది. అచ్చా!అందరికి ఈ సంవత్సరం యొక్క హోంవర్క్ గుర్తుంది కదా! ఈ సంవత్సరం దేనికి వీడ్కోలు చెప్పాలో మరియు దేనికి అభినందనలు చెప్పాలో బాప్ దాదా ఏదైతే తెలియజేసారో అది మీకు గుర్తుంది కదా! ఒక్క నెల రిజల్టులో ఇంతశాతం సేవచేసాము, 40శాతము, 80 శాతము, 20 శాతము, 10 శాతము సేవ చేసాము అని కేవలం శాతములో వ్రాయాలి. ఎక్కువగా ఉత్తరాలు వ్రాయనక్కర్లేదు. ఫస్ట్ నెంబర్ లో చేసినవారికి బాప్ దాదా ఇనాము ఇస్తారు. స్వయం మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉండాలి. సంతుష్టత, ప్రసన్నత యొక్క బ్యాలెన్స్ ఉండాలి. సరేనా? అందరూ రిజల్టును వ్రాయండి. మధురమైన దాదీ, యోగయుక్తమైన దాదీ.... అంటూ పెద్ద, పెద్ద ఉత్తరాలు వ్రాయకండి. కేవలం పర్సెంటేజిని వ్రాయండి, ఎందుకంటే అవన్నీ చదివే సమయం ఉండదు. ఆ తర్వాత బహుమానమును ఇవ్వడం జరుగుతుంది. మొత్తం బ్రాహ్మణ పరివారములో ఎవరైతే నెంబర్ వన్లో వస్తారో వారికి బాప్ దాదా బహుమానమును ఇస్తారు. ఇది ఒక్క నెల యొక్క రిజల్టు. ఒక్క నెల అయితే సీజన్ కొనసాగుతుంది కదా! సరేనా? ఇది మీ అందరికీ ఇష్టమేనా? ఇది మీకు అర్థమయ్యిందా? మాతలకు అర్ధమయ్యిందా? టీచర్లకు అర్థమయ్యిందా? వెనుక ఉండేవారికి అర్ధమయ్యిందా? వెనుక ఉన్నవారు చేతులు ఊపండి, అచ్ఛా!

ఇప్పుడు నలువైపులా ఉన్న కొత్త యుగము యొక్క అధిపతులైన పిల్లలందరికీ, నలువైపులా కొత్త సంవత్సరమును జరుపుకునే ఉల్లాస, ఉత్సాహాలు గల పిల్లలందరికీ, సదా ఎగురుతూ ఉండండి మరియు అందరినీ ఎగిరిస్తూ ఉండండి, ఇటువంటి ఎగిరే కళలో ఉన్న పిల్లలకు, సదా తీవ్ర పురుషార్థము ద్వారా విజయమాలలోని మణులుగా అయ్యే విజయీ రత్నాలకు బాప్ దాదాల కొత్త సంవత్సరము మరియు కొత్తయుగము యొక్క దీవెనలతో సంపన్నమైన కోటానురెట్లుగా పత్రాల్లో నింపి మరీ అభినందనలు మరియు అభినందనలు. ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి, అచ్చా! ఇప్పుడు ఏమి చేయాలి?

రాత్రి 12.00 గంటల తర్వాత బాబా పిల్లలందరికీ 2005 నూతన సంవత్సరపు అభినందనలు తెలిపారు.

నలువైపులా ఉన్న ప్రియమైన ముద్దు పిల్లలందరికీ, సింహాసనాధికారులు, స్వరాజ్యాధికారులు అయిన పిల్లలకు కొత్త సంవత్సరము మరియు కొత్తయుగము యొక్క అభినందనలు, అభినందనలు, అభినందనలు. సదా ఈ సంవత్సరము అందరికీ అభినందనలు తెలియజేయాలి మరియు మీరు అభినందనలు తీసుకోవాలి. ఇదే లక్ష్యముతో లక్షణాలను ధారణ చేసి ఎగురుతూ ఉండండి మరియు అందరినీ ఎగిరిస్తూ ఉండండి. అభినందనలు, అభినందనలు, అభినందనలు.

Comments