31-12-1997 అవ్యక్త మురళి

          31-12-1997         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఈ క్రొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి సఫలం చేస్కోండి, సఫలత పొందండి.

ఈరోజు బాప్ దాదా తన నవజీవితం గల శ్రేష్ట ఆత్మలకు, నవయుగ రచయితలు అయిన ఆత్మలకు నవ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రపంచం వారికి క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, పిల్లలైన మీకు క్రొత్త యుగం స్మృతి వస్తుంది. ఎలా అయితే క్రొత్త సంవత్సరం రేపు రానున్నదో అదేవిధంగా క్రొత్త యుగం కూడా రేపు రానున్నది. మా క్రొత్త యుగం వచ్చేస్తుంది అని స్మృతి వస్తుందా? ఎలా అయితే ఈనాటి క్రొత్త సంవత్సరం గురించి మనుష్య ఆత్మలకి మనస్సులో సంతోషం, అల్పకాలిక ఉత్సాహం ఉందో అదేవిధంగా మీకు క్రొత్త యుగం రానున్నది అని సదాకాలిక సంతోషం ఉంది. డ్రామానుసారం ఈరోజు మరియు రేపటి విషయం, ఇలా స్పష్ట స్మృతి అవుతుందా? లేక కేవలం క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికే వచ్చారా? క్రొత్త సంవత్సరం క్రొత్త యుగం యొక్క స్మృతినిస్తుంది, రేపు మనం ఏవిధంగా అవుతాము అని మనస్సులో ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయా? మీ క్రొత్త శరీర రూపి వస్త్రం సదా ఎదురుగా వస్తుందా? క్రొత్తయుగంలో మీ క్రొత్త శరీరం ఎంత సుందరంగా ఉంటుందో జ్ఞాపకం ఉందా? ఎటువంటి యుగం, ఎటువంటి రాజ్యం ఎలా ఉండేది, ప్రకృతి దాసీగా ఎలా ఉండేదో, సతోప్రధానంగా ఉండేదో ఆ రాజ్యాధికారి స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉందా? ఆ క్రొత్త ప్రపంచం ఎంత సుందరంగా ఉండేదో కనిపిస్తుందా? ఒక సెకనులో మీ రాజ్యాధికారి స్థితి అనుభవం చేసుకోగలుగుతున్నారా? ఒక సెకనులో క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోండి. వెళ్ళటం వస్తుందా? ఎన్నిసార్లు ఆ రాజ్యాధికారం పొందారో స్మృతి ఉందా? మీ రాజ్యం ఎంత ప్రియమైనదో అనుభవం చేసుకోండి, అతీతమైనది కూడా, ప్రియమైనది కూడా! ఒక సెకనులో మీ యొక్క రాజ్యం , మీ యొక్క విశ్వ రాజ్యా ధికారం స్మృతిలోకి రావాలి, వారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాలిక బహుమతులు ఇచ్చుకుంటారు. మరియు బాబా మీకు క్రొత్త యుగాన్ని, విశ్వరాజ్యాధికారాన్ని బహుమతిగా ఇస్తున్నారు. బాబా ద్వారా మీకు ఈ అవినాశి బహుమతి లభించటం అనేది స్థిరమైన విధిగా అవుతుంది, ఈ విధిని ఎవరూ తప్పించలేరు. అచంచలమైనది మరియు అఖండితమైనది. ఇటువంటి బహుమతి లభించింది కదా? ఈ బహుమతిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దొంగలెవరూ ఈ బహుమతిని తీసుకువెళ్ళకూడదు. అందరి దగ్గర డబల్ లాక్ ఉంది కదా! ఈ రోజులలో సింగిల్ లాక్ పని చేయటం లేదు డబల్ లాక్ కావాలి. గాడ్రేజ్ లాక్ కాదు, గాడ్ (దేవుని) యొక్క లాక్ కావాలి. ఎవరు తీయలేనటువంటి లాక్ గాడ్ ఇచ్చారు. ఒకవేళ బలహీనంగా ఉంటే దొంగలు వచ్చేస్తారు. దొంగలు కూడా తెలివైనవారు ఈరోజు వీరి లాక్ బలహీనంగా ఉంది అని వారికి కూడా తెలిసిపోతుంది అందువలన బలహీనంగా అవ్వకూడదు. ఈ కొత్త సంవత్సరంలో స్వయం పట్ల, ఇతరుల పట్ల ఏదైనా కొత్త ప్లాన్ తయారుచేసారా? కాన్ఫరెన్స్ చేయటం, డైలాగ్ చేయటం ఇవన్నీ అయిపోయాయి. ఏదైనా కొత్త ప్లాన్ తయారుచేసారా? బాప్ దాదా ఈ క్రొత్త సంవత్సరంలో దేశ, విదేశాలలో వైరైటీ వర్గాల, విశేష ఆత్మల యొక్క పుష్పగుచ్చం చూడాలని అనుకుంటున్నారు. వర్గాల యొక్క సేవ చాలా చేసారు కదా! ఇప్పుడు ప్రతి వర్గం యొక్క ఒక్కొక్క రత్నాన్ని తయారు చేయండి ఒక వర్గం కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకు? ఇప్పుడు అంతిమ సమయం సమీపంగా వస్తుంది కనుక మా వర్గం ఉండిపోయింది అని ఏ వర్గం వారు కూడా నిందించకూడదు. ఒక్కొక్క వర్గంలో విశేష ఆత్మలను తయారుచేయాలి, వారు మైక్ గా పని చేయాలి, ఎందుకంటే సమయం సమీపంగా వచ్చే కొలదీ అన్ని ధర్మాల వారి, అన్ని వర్గాల వారి నోటి నుండి ఒకే ధ్వని వస్తుంది - తండ్రి వచ్చారు అని. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే సర్వ ధర్మస్థాపక ఆత్మలకి, అన్ని వర్గాల వారికి బీజం వేయాలి. ఇంత శక్తి వారిలో వచ్చిన తర్వాత మరలా తమతమ సమయాలలో ఆ వర్గం లేక ధర్మం యొక్క స్థాపనకి నిమిత్తం అవుతారు. అన్ని బీజాలు మీరే తయారుచేయాలి. అప్పుడు వారు తమ తమ సమయాలలో ఆయా వర్గాలకు నిమిత్తం అవుతారు. ఎందుకంటే బీజం బాబా మరియు బ్రాహ్మణ ఆత్మలు కాండం, సర్వ ఆత్మలు బీజం మరియు కాండం నుండే వస్తాయి. విదేశీయులు మరియు దేశీయులు ఈ విధమైన పుష్పగుచ్చం బాబా దగ్గరకి తీసుకురండి. ఒక్కొక్క ఉదాహరణని తీసుకురండి, వారి ద్వారా అనేకులు స్వతహాగానే వస్తారు. కానీ ఒక్కొక్క పవరపుల్ మైక్ ని తయారుచేయాలి. ఇలా బీజం అనండి లేక ధర్మం లేక వర్గం వారిని ఇలా వెరైటీ పుష్పగుచ్చాన్ని తయారుచేయాలి. ఒకరు కూడా మిస్ అవ్వకూడదు. అప్పుడే విశ్వకళ్యాణకారి లేదా సర్వాత్మల ఉద్దరణకి నిమిత్తమైన ఆత్మలు అని అంటారు. ఒక శాఖ కూడా తక్కువ అవ్వకూడదు. అన్ని శాఖలు కావాలి. మీ క్రొత్త ప్రపంచంలో ఏ వర్గాలు ఉండవు కానీ ఆ ఆత్మలు కూడా ద్వాపరయుగంలో లేక కలియుగంలో స్థాపనకి నిమిత్తం అవుతారు. కనుక వారికి కూడా శక్తి మీ నుండే లభించాలి. ఎలా అయితే ధర్మపితలందరు బాబా ప్రత్యక్షత జెండా ఎగరవేయడంలో సహయోగి అవుతారో అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షతా జెండా ఎగురవేయడంలో సహయోగి అవుతారు. అప్పుడే సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచం అంటారు. సహయోగి అవుతున్నారు. కానీ ఇప్పుడు విశేష ఆత్మలను సహయోగిగా చేయండి. నిమిత్తంగా చేయండి. ఏమి చేయాలో అర్థమైందా? విదేశంలో కూడా ఇప్పుడు వి.ఐ.పి, లేక ఐ.పిల సంబంధం సహజం అయిపోయింది కదా! కష్టం కాదు కదా? కష్టమా లేక సహజమా? మీరందరు మరలా రెండవ క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసరికి బాప్ దాదా ఆ సంవత్సరం యొక్క బహుమతిగా ఈ పుష్పగుచ్చాన్ని చూడాలని అనుకుంటున్నారు. ఒక సంవత్సర సమయం ఇచ్చాను, తక్కువ కాదు. దేశీయులు మరియు విదేశీయులు కూడా చేస్తారా? (అలాగే) తప్పకుండా చేస్తాము. అయిపోయే ఉంది అని చెప్పండి మీరు కేవలం నిమిత్తం అవ్వాలి అంతే. డబల్ విదేశీయులు చెప్పండి? విదేశీయులు అందరూ చప్పట్లు కొట్టండి. మొదట దేశీయులు తయారుచేస్తారో లేక విదేశీయులు తయారు విదేశీయులు తయారు చేస్తారో చూస్తాను. ఎంత పెద్ద పుష్పగుచ్ఛం తయారుచేస్తారో కూడా చూస్తాను. సరేనా? నలువైపుల వింటున్నారు. విదేశం వారు, దేశం వారు కూడా వింటున్నారు. ఇప్పుడు ఉత్సాహం వస్తుంది. ఇది చేస్తాము, ఇది చేస్తాము అని మనస్సులో ప్లాన్ తయారుచేసుకుంటున్నారు. మంచిది - ఇది విశ్వసేవ గురించి. 

స్వయం కోసం ఏమి చేస్తారు? అది కూడా ప్లాన్ తయారుచేసుకుంటారు కదా? ఎందుకంటే స్వ కళ్యాణం యొక్క ప్లాన్ శ్రేష్టంగా తయారు చేసుకోకపోతే విశ్వకళ్యాణంలో శక్తి లభించదు. బాప్ దాదా అందరి మనస్సులో ఉత్సాహ, ఉల్లాసాలను చూసి చెప్తున్నారు - గోల్డెన్ జూబ్లీ వారైనా, సిల్వర్ జూబ్లీ వారైనా, ఇక ఏ జూబ్లీ వారైనా అందరు మనస్సుతో ఉత్సాహ ఉల్లాసాలతో ప్రతిజ్ఞ చేశారు - మేము బాబా సమానంగా అయ్యి చూపిస్తాము అని. ఈ ప్రతిజ్ఞ చేసారు. కదా? డబల్ విదేశీయులు చేశారా? (అందరూ చేతులు ఊపారు) మంచిది, శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ అయితే చాలా మంచిగా, చాలా మధురంగా, చాలా ప్రియంగా, చాలా శక్తిశాలిగా చేసారు. ఇప్పుడు కేవలం నిలుపుకుంటూ ఉండాలి. ప్రతిజ్ఞ చేసేవారు ఆ సమయంలో చాలా మంచిగా చేస్తున్నారు, చాలా ఉత్సాహ ఉల్లాసాలతో చేస్తున్నారు. ధైర్యం కూడా చాలా మంచిగా పెట్టుకుంటున్నారు, కానీ మరలా ఏమి అవుతుంది? అప్పుడప్పుడు మాయ ఎలుక రూపంలో వస్తుంది, అప్పుడప్పుడు పిల్లి రూపంలో వస్తుంది. పిల్లి ఏమి చేస్తుంది? మ్యావ్, మ్యావ్ అంటుంది కదా! పిల్లలు ఏమి చేస్తున్నారు? నేను, నేను, నేను, (మై మై) ఇలా పిల్లిలా మ్యావ్, మ్యావ్ అనకూడదు. ఎలుక ఏమి చేస్తుంది? తెలివిలో లేనివారిని కరుస్తుంది. అలాగే మాయ కూడా పిల్లల ఖజానాను కరిచి తినేస్తుంది. అప్పుడప్పుడు సింహం రూపంలో వస్తుంది, సింహం ఏమి చేస్తుంది? నిర్భయంగా ఉన్నవారిలో భయం పుట్టిస్తుంది అలాగే సర్వశక్తివంతుని పిల్లలను బలహీనంగా చేసేస్తుంది. ఇలా రానివ్వకండి, డబల్ లాక్ వేసి ఉంచండి. ఈ సంవత్సరం దేనినీ రానివ్వకూడదు. ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఎప్పుడైతే ముక్తి సంవత్సరం జరుపుకుంటారో అప్పుడు ముక్తిధామానికి వెళ్తారు. దీని కొరకు ఏమి చేస్తారు? చాలా చిన్న విషయం, పెద్ద విషయం కాదు. బాప్ దాదా కేవలం చిన్న స్లోగన్ ఇస్తున్నారు - "సఫలం చేసుకోండి, సఫలత పొందండి” అర్థమైందా! ఏమి సఫలం చేసుకోవాలి? మీ దగ్గర ఏవైతే ఉన్నాయో, మీ ఆస్తి ఉంది కదా - సమయం, సంకల్పం, శ్వాస లేదా తనువు, మనస్సు, ధనం సఫలం చేసుకోండి, వ్యర్ధంగా పోగొట్టుకోకండి, జీవితం కోసం దాచుకుని ఉంచుకోకండి. సంకల్పాన్ని కూడా సఫలం చేసుకోండి. ఒక్కొక్క సంకల్పం మీ యొక్క ఆస్తి. ఎలా అయితే స్థూలధనం ఆస్తియో అదేవిధంగా సూక్ష్మ ఆస్తి - సమయం, శ్వాస, సంకల్పం. ఒక సంకల్పం కూడా వ్యర్ధంగా పోకూడదు, సఫలం చేసుకోవాలి. మనస్సు ద్వారా, వాచా ద్వారా, కర్మ ద్వారా - ఎంత సఫలం చేసుకున్నాను అని పరిశీలించుకోండి. ఎంత జమ చేసుకున్నాను? మరియు బాప్ దాదా ఈ సంవత్సరం వరదానం ఇస్తున్నారు - సఫలం చేసుకోండి మరియు కోటిరెట్లు సఫలత అనుభవం చేసుకోండి. ఈ ప్రత్యక్ష ఫలం స్వతహాగా లభిస్తుంది. సత్యమైన మనస్సు ఉంటే చాలు. సత్యమైన మనస్సుకి భోళానాధ్ బాబా సహజంగా రాజీ అవుతారు. అందువలన సఫలం చేసుకోండి. జ్ఞానధనం, శక్తులధనం, గుణాలధనం ప్రతి సమయం జమ చేసుకోండి. సఫలం చేసుకోవటం వస్తుందా లేక దాచుకోవటం, సంభాళించుకోవటం వస్తుందా? దాచుకోకండి. సఫలం చేసుకోండి. అకస్మాత్తుగా అన్నీ జరుగుతాయి, ఎవరెడీగా ఉండాలి. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని సఫలం చేసుకోండి. బాప్ దాదాకి అవసరం లేదు కానీ మీ కోసం మీరు జమ చేసుకోండి. బాప్ దాదా అయితే దాత. సఫలం చేసుకోవటం అంటే జమ చేసుకోవటం. ఎందుకంటే బాప్ దాదా సమయప్రమాణంగా ప్రతి బిడ్డ యొక్క జమాఖాతా చూసారు, ప్రతి ఒక్కరి జమాఖాతా బాబా దగ్గర ఉంది. కనుక జమాఖాతాలో ఏమి చూసారు? కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు - మేము చాలా జమ చేసుకున్నాము, అది జమ చేసుకున్నాము, ఇది జమ చేసుకున్నాము అని చాలా వర్ణన చేస్తున్నారు కానీ బాబా యొక్క ఖాతాలో వారు ఎంత భావిస్తున్నారో, ఎంత చెప్తున్నారో దానికంటే తక్కువ జమ అవుతుంది. ఎందుకు? అదే మొదటి పాఠం - "నేను మరియు నాది” నేను చేసాను, ఇది నా సేవ, ఇది నా కార్యం. కనుక ఇలా జమ చేసుకునే సమయంలో చాలా జమ చేసుకుంటున్నాము అని భావిస్తున్నారు కానీ అది స్వతహాగా జమ ఖాతా నుండి తొలగి వ్యర్ధ ఖాతాలో జమ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ సూక్ష్మ మిషనరీ. బాబా చేయించారు, బాబా సేవ, నా సేవ కాదు, నేను చేసాను అని కాదు. నేను ఇది చేసాను, నేను ఇది చేస్తాను ఇలా నేను, నేను అని వర్ణన చేయకండి. బాబా, బాబా అంటే కోటిరెట్లు జమ అవుతుంది. నేను, నాది అంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్ధ ఖాతాలో జమ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్ మిషనరీ చాలా వేగంగా పని చేస్తుంది. మీకు తెలియదు కూడా. దీని యొక్క పరిశీలన కూడా సత్యమైన మనస్సుతో చేసుకోవాలి. నేను అనే భావానికి అతీతం అయ్యి చేయించేవారు చేయిస్తున్నారు. ఆదిరత్నాలకు ఆదిలో సేవలోకి వచ్చినప్పుడు ఏ భావం ఉండేది? ఏ మాట వచ్చేది? నేను అనే బావం ఉండేదా? బాబా అన్నారు. అప్పుడే వారసులుగా అయ్యారు. ఈనాడు సేవకు ఆది అయ్యారు అంటే అది బాబా, బాబా అని అనిన దాని యొక్క ఫలితానికి రుజువు. ఇప్పుడు బాప్ దాదా దగ్గరికి వారసుల క్వాలిటీ తక్కువ వస్తున్నారు. ఎందుకు? బాబా మరియు నేను అనేది కలిసిపోతుంది. అందువలన బాప్ దాదా ఈ సంవత్సరం విశాల మనస్సుతో వరదానం ఇస్తున్నారు - ఎంత జమ చేసుకోవాలంటే అంత జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. సఫలం చేసుకోండి, సఫలతామూర్తి అవ్వండి. మంచిది! 

సర్వ నవయుగ విశ్వ అధికారులకు, నవజీవితం ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసు ఆత్మలకు, సదా సఫలం చేసుకోవటం ద్వారా సఫలతామూర్తి అయ్యే ఆత్మలకు, సదా స్వయం చేసిన ప్రతిజ్ఞలను సాకారంలోకి తీసుకువచ్చే అచంచల, అఖండ స్వరూప ఆత్మలకు, సదా క్రొత్త సంవత్సరం మరియు క్రొత్త యుగం స్థాపన యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. వెనువెంట ధైర్యం పెట్టుకుని ధైర్యం ద్వారా ముందుకు వెళ్ళి సహాయం పొందేవారికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments