31-10-2006 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సదా స్నేహితో పాటు అఖండ మహాదాని అవ్వటం ద్వారా విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపంగా అవుతారు.
ఈరోజు ప్రేమ సాగరుడు తన యొక్క పరమాత్మ ప్రేమకు పాత్రులయిన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. మీరందరు కూడా స్నేహమనే అలౌకిక విమానంలో ఇక్కడకు చేరుకున్నారు కదా! లేక మామూలు విమానంలో వచ్చారా? స్నేహమనే విమానంలో ఎగురుతూ వచ్చారా! అందరి మనస్సులో స్నేహం యొక్క అలలు వస్తూ ఉన్నాయి, స్నేహమే బ్రాహ్మణ జీవితం యొక్క పునాది. మీరందరు మొదట బాబా దగ్గరకు వచ్చినప్పుడు స్నేహమే మిమ్మల్ని ఆకర్షించింది కదా! జ్ఞానమైతే తరువాత విన్నారు కానీ స్నేహమే పరమాత్మకు స్నేహిగా చేసింది. మేము పరమాత్మ స్నేహానికి పాత్రులుగా అవుతాము అని కలలో కూడా అనుకోలేదు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? అయిపోయాము అంటున్నారు. స్నేహం కూడా సాధారణ స్నేహం కాదు, మనస్సు యొక్క స్నేహం, ఆత్మిక స్నేహం, సత్యమైన స్నేహం, నిస్వార్థ స్నేహం. ఈ పరమాత్మ స్నేహం చాలా సహజంగా స్మ్మతి యొక్క అనుభవం చేయిస్తుంది. స్నేహిని మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది. స్మ్మతి చేయడం కష్టం అనిపించదు. స్నేహం ఒక అలౌకిక అయస్కాంతం, స్నేహం సహయోగిగా చేస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది, స్నేహం ఉంటే స్మృతి చేయడంలో శ్రమ అనిపించదు, ప్రేమ ఫలాన్ని తింటారు. నలువైపుల చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ డబల్ విదేశీయులు చాలా స్నేహంతో పరుగు పెట్టుకుంటూ చేరుకున్నారు. చూడండి! 90 దేశాల నుండి పరుగు పెట్టుకుంటూ వచ్చారు. భారతవాసీ పిల్లలు ప్రభు ప్రేమకు పాత్రులే కానీ ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులకు స్వర్ణిమ అవకాశం. మీ అందరికీ కూడా విశేష ప్రేమ ఉంది కదా! స్నేహం ఉంది కదా! ఎంత స్నేహం ఉంది? ఎంత!! స్నేహాన్ని దేనితోనైనా పోల్చగలమా? దేనితోనూ పోల్చలేరు. మీ పాట ఒకటి ఉంది కదా - మా స్నేహం ఎంత అంటే పోల్చడానికి ఆకాశంలో నక్షత్రాలు చాలవు, సాగరంలో నీరు చాలదు. అంటే బేహద్ ప్రేమ, బేహద్ స్నేహం.
బాప్ దాదా కూడా స్నేహీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. మీరందరు స్నేహంతో బాబాని జ్ఞాపకం చేసారు. మీ ప్రేమ కారణంగా బాప్ దాదా వచ్చారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖంలో స్నేహం యొక్క రేఖ మెరుస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఏమి కలపాలి? స్నేహం అయితే ఉంది, పక్కాయే? స్నేహానికి బాప్ దాదా సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? అర్థమయ్యే ఉంటుంది. సదా స్నేహీగా ఉండాలి. సదా అనే దానిని అండర్‌లైన్ చేసుకోండి. సదా స్నేహీగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, స్నేహం అయితే తెగిపోనిదే కానీ శాతంలో తేడా వస్తుంది. ఆ తేడాని తొలగించుకునే మంత్రం ఏమిటి? ప్రతి సమయం మహాదాని, అఖండదాని అవ్వండి. దాత యొక్క పిల్లలు సదా విశ్వసేవాధారిగా ఉండాలి. ఏ సమయంలోను మాష్టర్ దాత స్థితి లేకుండా ఉండకూడదు. ఎందుకంటే విశ్వకళ్యాణం యొక్క కార్యంలో బాబాతో పాటు మీరందరు కూడా సహాయకారి అయ్యే సంకల్పం చేసారు. మనస్సు ద్వారా శక్తుల యొక్క దానం లేదా సహయోగం ఇవ్వండి. నోటి ద్వారా జ్ఞానదానం ఇవ్వండి, సహయోగం ఇవ్వండి. కర్మ ద్వారా గుణాల దానం ఇవ్వండి మరియు స్నేహ సంపర్కం ద్వారా సంతోషం యొక్క దానం ఇవ్వండి. మీరు అఖండ ఖజానాలకు యజమానులు. మొత్తం ప్రపంచంలో ధనవంతులు. మీ దగ్గర లెక్కలేనంత మరియు అఖండ ఖజానా ఉంది. ఎంత ఇస్తూ ఉంటారో అంత పెరుగుతుంది, తక్కువ అవ్వదు పెరుగుతుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో చాలా మంది మీ ఆత్మిక సోదరీసోదరులు ఈ ఖజానాల కొరకు దాహంగా ఉన్నారు. మీ ఆత్మిక సోదరీ సోదరులపై దయ రావటం లేదా? దాహంతో ఉన్న ఆత్మల యొక్క దాహం తీర్చరా? ఓ మా దేవీదేవతలూ! మాకు శక్తినివ్వండి సత్యమైన ప్రేమనివ్వండి అని వారి పిలిచే పిలుపు మీ చెవులకు వినిపడటం లేదా?
మీ భక్తులు మరియు దు:ఖీలు ఇద్దరూ దయ చూపించండి, కృప చూపించండి, ఓ కృపా దేవీదేవతలు .... అని అరుస్తున్నారు. సమయం యొక్క పిలుపు వినిపిస్తుంది కదా! ఇప్పుడు ఇచ్చేటటువంటి సమయం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? లెక్కలేనంత అఖండ ఖజానా మీ దగ్గర జమ అయి ఉంటే అది ఎప్పుడు ఇస్తారు? అంతిమ సమయంలో ఇస్తారా? ఆ సమయంలో కేవలం దోసిలి ఇవ్వగలరు. మీరు జమ చేసుకున్న ఖజానా ఎప్పుడు కార్యంలో ఉపయోగిస్తారు? ప్రతి సమయం ఏదొక ఖజానా సఫలం చేసుకుంటున్నానా అని పరిశీలించుకోవాలి. దీనిలో డబల్ లాభం ఉంది. ఖజానాను సఫలం చేసుకోవటం ద్వారా ఆత్మల యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది మరియు మీరందరు మహాదాని అయిన కారణంగా విఘ్నవినాశకులుగా, సమస్యా స్వరూపంగా కాక సహజంగా సమాధాన స్వరూపంగా అవుతారు. ఈ రోజు ఇది వచ్చింది, రేపు అది వచ్చింది, ఈ రోజు ఇది జరిగింది, రేపు అది జరిగింది అని అనరు. సదాకాలికంగా విఘ్న ముక్తులుగా, సమస్య ముక్తులుగా అయిపోతారు. సమస్య కోసం సమయం ఉపయోగిస్తున్నారు, శ్రమిస్తున్నారు. అందువలన అప్పుడప్పుడు ఉదాశీనంగా, అప్పుడప్పుడు ఉల్లాసంగా ఉంటున్నారు, దాని నుండి కూడా రక్షించబడతారు. ఎందుకంటే బాప్ దాదాకి కూడా పిల్లల శ్రమ ఇష్టమనిపించటం లేదు. పిల్లల శ్రమ బాబా చూడలేకపోతున్నారు. కనుక శ్రమ ముక్తులుగా అవ్వండి. పురుషార్థం చేయాలి కానీ ఏ పురుషార్థం చేయాలి. ఇప్పటివరకు మీ యొక్క చిన్న చిన్న సమస్యలలో పురుషార్థం చేస్తూ ఉంటారా! ఇప్పుడు ఈ పురుషార్థం చేయండి. అఖండ మహాదాని, అఖండ సహయోగి అవ్వండి. బ్రాహ్మణాత్మలకి సహయోగిగా అవ్వండి మరియు దు:ఖంతో, దాహంతో ఉన్న ఆత్మలకి మహాదాని అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థం అవసరం. ఇష్టమే కదా! వెనుక ఉన్నవారికి ఇష్టమేనా? ఇప్పుడు కొంచెం మార్పు చేసుకోవాలి కదా! స్వయం పట్ల చాలా పురుషార్థం చేసారు. పాండవులు ఎలా ఉన్నారు? ఇష్టమేనా? రేపటి నుండి ఏం చేస్తారు? రేపటి నుండి ప్రారంభిస్తారా లేక ఇప్పుడే చేస్తారా? ఇప్పటి నుండే సంకల్పం చేయండి - నా యొక్క సమయం, సంకల్పం విశ్వం పట్ల విశ్వసేవ పట్ల ఉపయోగిస్తాను అని. దీనిలో స్వయం యొక్క కళ్యాణం స్వతహాగానే జరుగుతుంది. ఆగిపోదు పెరుగుతుంది. ఎందుకు? మీరు ఎవరి ఆశలైనా పూర్తి చేస్తే, దు:ఖిలకు సుఖం ఇస్తే, నిర్భల ఆత్మలకు శక్తి ఇస్తే వారు మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. కనుక సహజంగా ముందుకు వెళ్ళటానికి సహజ సాధనం - ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు అందరి నుండి ఆశీర్వాదాలు తీస్కోవాలి. ఉపన్యాసం చెప్పలేకపోయినా, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయలేకపోయినా పర్వాలేదు, చేయగలిగితే చేయండి, ఒకవేళ చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఖజానాలను సఫలం చేస్కోండి. చెప్పాను కదా - మనస్సు ద్వారా శక్తుల దానం, వాణీ ద్వారా జ్ఞాన ఖజానా, కర్మ ద్వారా గుణాల ఖజానా మరియు బుద్ది ద్వారా సమయం యొక్క ఖజానా, సంబంధ సంపర్కాల ద్వారా సంతోష ఖజానా ఇవ్వండి, సఫలం చేస్కోండి. సఫలం చేస్కోవటం ద్వారా సహజంగా సఫలతామూర్తిగా అవుతారు, ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదాలు లిఫ్ట్ వలె పనిచేస్తాయి. మెట్లు ఎక్కనక్కర్లేదు. సమస్య వచ్చింది దానిని తొలగించుకోవటంలో అప్పుడప్పుడు రెండు రోజులు పట్టటం లేదా రెండు గంటలు పట్టటం అంటే మెట్లు ఎక్కటం, సఫలం చేస్కోండి - సఫలతామూర్తి అవ్వండి. అప్పుడు లిఫ్టులో సెకనులో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. సెకనులో సూక్ష్మవతనంలోకి వెళ్ళగలరు, సెకనులో మీ రాజ్యంలోకి వెళ్ళగలరు. సెకనులో పరంధామం వెళ్ళగలరు. లండన్లో 'ఒక్క నిమిషం' అనే ప్రోగ్రామ్ చేసారు కదా! బాప్ దాదా అంటున్నారు ఒక్క సెకను అని. ఒక సెకనులో ఆశీర్వాదాల యొక్క లిఫ్ట్ ఎక్కండి. స్మృతి అనే స్విచ్ వేయండి. శ్రమ ముక్తులుగా అయిపోతారు. ఈరోజు విదేశీయుల రోజు కదా! కనుక బాప్ దాదా డబల్ విదేశీయులని ఏ స్వరూపంలో చూడాలనుకుంటున్నారు - శ్రమ ముక్తులుగా, సఫలతామూర్తులుగా అశీర్వాదాల పాత్రులుగా చూడాలనుకుంటున్నారు. అవుతారు కదా! ఎందుకంటే డబల్ విదేశీయులకి బాబాపై చాలా ప్రేమ ఉంది. శక్తి ఉండాలి కానీ ప్రేమ చాలా ఉంది. అద్భుతం చేసారు కదా! 90 దేశాల నుండి వచ్చారు. వేర్వేరు దేశాలు, వేర్వేరు ఆచార వ్యవహారాల నుండి వచ్చినా కానీ అయిదు ఖండాల వారు ఒక చందన వృక్షంగా అయ్యారు. ఒకే వృక్షంలోకి వచ్చారు కదా! ఒకే బ్రాహ్మణ సంస్కృతి కదా! మాది విదేశీ సంస్కృతి అన్నది లేదు కదా! బ్రాహ్మణులు అయ్యారు కదా! ఇప్పుడు మాది బ్రాహ్మణ సంస్కృతి అనేవారు చేతులెత్తండి. బ్రాహ్మణ సంస్కృతి తప్ప మరేది లేదు. ఒకే సంస్కృతి వారిగా అయిపోయారు కదా! అందరు ఒకే వృక్షం వారిగా అయిపోయారు. దీనికి బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎంత బావుంది. అమెరికా వారిని, యూరప్ వారిని ఎవరినైనా మీరు ఎవరు అంటే ఏమంటారు? బ్రాహ్మణాత్మలు. యూరప్, అమెరికా, ఆఫ్రికా వారు కాదు. అందరు బ్రాహ్మణాత్మలుగా అయిపోయారు. ఒకే మతం వారిగా అయ్యారు. ఒకే మతం అంటే శ్రీమతం ఒకే బ్రాహ్మణ స్వరూపం వారిగా అయిపోయారు. దీనిలో మజా వస్తుంది కదా! మజాగా ఉందా! కష్టం అనిపిస్తుందా! కష్టం లేదు కదా! చేతులు ఊపుతున్నారు. బాప్ దాదా సేవలో ఏమి నవీనత కోరుకుంటున్నారు? ఏ సేవలు అయితే చేస్తున్నారో చాలా - చాలా - చాలా మంచిగా చేస్తున్నారు, శుభాకాంక్షలు. కానీ ఇక ముందు ఏమి కలపాలి? మీ అందరి మనస్సులో కూడా ఏదోక నవీనత చూపించాలి అని ఉంది కదా! బాప్ దాదా చూసారు - ఏదైతే ప్రోగ్రామ్ చేసారో, సమయం కూడా ఉపయోగించారు మరియు ప్రేమతోనే చేసారు. శ్రమ కూడా ప్రేమతోనే చేసారు. మరియు ఏదైతే స్తూలధనం కూడా బాబా సేవలో ఉపయోగించారో అది కోటానుకోట్ల రెట్లు అయ్యి పరమాత్మ బ్యాంక్ లో జమ అయిపోయింది. ఉపయోగించారు, జమ చేసుకున్నారు. ఫలితంలో సందేశం ఇచ్చే కార్యం చాలా మంచిగా చేసారు. ఎక్కడ చేసినా, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది, లండన్ లో అయితే అయిపోయింది మరియు బాప్ దాదాకి డబల్ విదేశీయులు యొక్క సమయం యొక్క పిలుపు, పీస్ ఆఫ్ మైండ్ ఈ ప్రోగ్రామ్స్ మంచిగా అనిపిస్తున్నాయి. ఏ పని చేస్తున్నా చేస్తూ ఉండండి కానీ సందేశం కూడా లభిస్తుంది, స్నేహిగా కూడా అవుతున్నారు, సహయోగిగా కూడా అవుతున్నారు, కొంతమంది సంబంధంలోకి కూడా వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇవి కలపాలి - ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దానిలో సందేశం అయితే మంచిగా లభిస్తుంది, కానీ వారు ఏదోకటి అనుభవం చేసుకుని వెళ్ళాలి, అనుభవం చాలా తొందరగా ముందుకి తీసుకువెళ్తుంది. సమయం యొక్క పిలుపు. పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రామ్ లో కొద్ది అనుభవం ఎక్కువ మంది చేసుకుంటున్నారు. కానీ పెద్ద ప్రోగ్రామ్స్ లో సందేశం అయితే మంచిగా లభిస్తుంది. కానీ వచ్చిన వారందరు ఏదోక అనుభవం చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అనుభవం ఎప్పుడు మర్చిపోరు మరియు అనుభవం ఎలాంటిదంటే అనుకోనప్పటికీ ఆకర్షిస్తూ ఉంటుంది. బాప్ దాదా చెప్తున్నారు - బ్రాహ్మణులందరూ జ్ఞానం యొక్క ఫాయింట్స్ యొక్క అనుభవీగా అయ్యారా? ప్రతి శక్తి, ప్రతి గుణం యొక్క అనుభవం చేసుకున్నారా? ఆత్మిక స్థితి యొక్క అనుభవం చేసుకున్నారా? పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం చేసుకున్నారా? జ్ఞానం అర్థం చేసుకోవటంలో పాస్ అయిపోయారు, జ్ఞానసాగరులుగా అయిపోయారు. దీనిలో బాప్ దాదా కూడా మార్కులు ఇస్తున్నారు మంచిదే. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, డ్రామా అంటే ఏమిటి అనే జ్ఞానం అయితే అర్థం చేసుకున్నారు కానీ ఎప్పుడు కావాలంటే, ఎంత సమయం కావాలంటే ఏ పరిస్థితిలో అయినా ఆ పరిస్థితిలో ఆత్మికబలం యొక్క అనుభవిగా, పరమాత్మ యొక్క అనుభవం అవుతుందా? ఏ సమయంలో ఎంత సమయం ఎలాంటి అనుభవం కావాలంటే ఆ అనుభవం అవుతుందా? అప్పుడప్పుడు ఒక విధంగా, అప్పుడప్పుడు ఒకవిధంగా ఉన్నారా? నేను ఆత్మను అని ఆలోచిస్తూ మరలా మాటిమాటికి దేహాభిమానంలోకి వస్తే అక్కడ అనుభవం ఉపయోగిపడిందా? అనుభవీ మూర్తి అంటే ప్రతి సబ్జక్టు యొక్క అనుభవీ మూర్తిగా, ప్రతి శక్తి యొక్క అనుభవీ మూర్తిగా ఉండాలి. స్వయం యొక్క అనుభవాన్ని కూడా ఇంకా పెంచండి. అనుభవం లేదు అనటం లేదు కానీ అప్పుడప్పుడు, కొంచెం సమయం ఉంటుంది. బాప్ దాదా కొంచెం సమయం కోరుకోవటం లేదు. ఏదొక కారణంగా కొంచెం సమయం మాత్రమే ఉంటుంది. మీ అందరు ఏవిధంగా అవుతారు అంటే మీ లక్ష్యం ఏమిటి? బాబా సమానంగా అవుతాము అంటారు కదా! అందరు ఒకే జవాబు చెప్తున్నారు. బాబా సమానంగా అంటే బాబా కొంచెం సమయం ఒకవిధంగా, కొంచెం సమయం మరోవిధంగా ఉండరు కదా! బ్రహ్మబాబా సదా రాజయుక్తిగా, యోగయుక్తిగా, ప్రతి శక్తి యొక్క అనుభవంలో సదా ఉండేవారు, అప్పుడప్పుడు కాదు. అనుభవం సదాకాలికంగా ఉంటుంది. కొంచెం సమయం ఉండదు. స్వయం అనుభవీ మూర్తి అయ్యి ప్రతి విషయంలో, ప్రతి సబ్జక్టులో అనుభవీ అవ్వాలి. జ్ఞానస్వరూపంలో అనుభవిగా, యోగయుక్తంలో అనుభవిగా, ధారణాస్వరూపంలో అనుభవిగా అవ్వాలి. ఆల్ రౌండ్ సేవ మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కం అన్నింటిలో అనుభవిగా అవ్వాలి, అప్పుడే పాస్ విత్ ఆనర్ అంటారు.
ఏవిధంగా అవ్వాలనుకుంటున్నారు? పాస్ అవ్వాలనుకుంటున్నారా లేక పాస్ విత్ ఆనర్ అవ్వాలనుకుంటున్నారా? పాస్ అయ్యేవారైతే చివరిలో కూడా వస్తారు. మీరు చాలా ఆలశ్యం అవ్వకముందే వచ్చారు, క్రొత్తవారు కూడా వచ్చారు కానీ చాలా ఆలశ్యం అనే బోర్డ్ ఇంకా పెట్టలేదు. ఆలశ్యం అయ్యింది. కానీ చాలా ఆలశ్యం అవ్వలేదు. అందువలన క్రొత్తవారైనా కానీ ఇప్పుడు పురుషార్థం కాదు, తీవ్రపురుషార్థం చేసి ముందుకి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడింకా నెంబర్ నిర్ణయం కాలేదు. బాబా మరియు మమ్మా వీరిద్దరి నెంబర్స్ తెలిసాయి. మూడవనెంబరు ఏ అక్కయ్య, అన్నయ్య అనేది తెలియలేదు. దాదీలంటే ఇష్టం అని మీరు అంటారు, బాబాకి కూడా దాదీలపై ప్రేమ ఉంది కానీ నెంబర్ ప్రకటించబడలేదు. అందువలన మీరు చాలా - చాలా ప్రియమైన, గారాభమైన భాగ్యవంత పిల్లలు, ఎంత ఎగరాలనుకుంటే అంత ఎగరండి, ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బాబా తన వ్రేలు ఇచ్చి నడిపిస్తారు, ఎగస్ట్రా ప్రేమ ఇస్తారు. పెద్దవారిని వ్రేలుతో నడిపించరు, వారు కాళ్ళతో నడవవలసి ఉంటుంది. క్రొత్తవారు కూడా మేకప్ చేసుకోవచ్చు. స్వర్ణిమ అవకాశం ఉంది. త్వరలో బాగా ఆలశ్యం అనే బోర్డ్ పెట్టబడుతుంది. అందువలన ముందుగా చేసుకోండి. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి! మంచిది, శుభాకాంక్షలు. మొదటిసారి మీ ఇంటికి, మధువనానికి చేరుకున్నారు. అందువలన బాప్ దాదా మరియు మొత్తం పరివారం భారతవాసీ పిల్లలు, విదేశీ పిల్లలు అందరి తరుపున కోటానుకోట్ల శుభాకాంక్షలు.
ఇప్పుడు విన్నారు కదా - యోగ్య ఆత్మలను చూసి అనుభవీ మూర్తిగా తయారుచేయండి. ఇక మీరు వస్తూ ఉండండి అని మీరు చెప్పవలసిన అవసరం ఉండదు. మీరు రాకండి అని చెప్పినా వారు వస్తారు. స్వయాన్ని కూడా అనుభవిగా చేసుకోండి. ఎంతెంత అనుభవంలో మరియు మహాదాని అయ్యే సేవలో బిజీగా ఉంటారో అప్పుడు సమస్యలలో ఏదైతే సమయం వ్యక్తం అవుతుందో దాని నుండి రక్షించబడతారు. మీ సమస్యలకు దాదీలు కూడా ఏదైతే సమయం ఉపయోగిస్తున్నారో అది కూడా రక్షించబడుతుంది. ఎందుకంటే సమయం యొక్క గొప్పతనం కూడా తెలుసు, అకస్మాత్తుగా జరుగుతుంది. కొంతమంది అన్నయ్యలు, అక్కయ్యలు 10 సంవత్సరాలు ఉందా, 20 సంవత్సరాలు ఉందా అని కొద్దిగా సైగ చేస్తే చాలు అనుకుంటున్నారు కానీ బాబా అకస్మాత్తుగా జరుగుతుంది అని చెప్పేశారు కనుక ఎవరెడీగా ఉండాలి. ఇప్పుడు స్వయం మరియు ఇతరులను యోగ్యంగా చేయాలి. విదేశీ సేవ మంచి వృద్ధిని పొందుతుంది. 90 దేశాల వరకు చేరుకున్నారు, ఇంకా ఎన్ని మిగిలాయి? పదింటిని పెంచితే వంద అవుతాయి. బాప్ దాదా ఆఫ్రికా సమాచారం కూడా విన్నారు. వారు కూడా కొద్ది సమయంలో బాగా వృద్ధి చేశారు. దయాహృదయులు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. చూడండి - ఎక్కడెక్కడి నుండో వేర్వేరు ధర్మాలలోకి వెళ్ళిపోయినా కానీ చివరికి బాబా దగ్గరకు చేరుకున్నారు. మీ పరివారాన్ని అయితే వెతికి తీయాలి కదా! అందరు మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా పెద్ద ప్రోగ్రామ్, మేళా చేస్తున్నారు ఇదైతే సాధారణమే కానీ క్రొత్త రూపంలో చేయటం ద్వారా ప్రజలకి ఆసక్తిగా ఉంటుంది. లండన్ ప్రోగ్రామ్ కూడా బాగా చేసారు, చాలామందికి పరిచయం కూడా లభించింది. ఇప్పుడు వారి చిరునామాలు సేకరించండి. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఏ ప్రోగ్రామ్ కి ఎవరు వచ్చినా వారి చిరునామా మరియు ఫోన్ నెంబరు తప్పక వ్రాసుకోండి. ఏదైనా మరలా ప్రోగ్రామ్ జరిగినప్పుడు వారిని పిలిచి సమయం ఇచ్చి మరలా వారిని ముందుకి తీసుకువెళ్ళగలరు. ఇప్పుడు సమయం యొక్క ఈల మ్రోగనున్నది దాని కంటే ముందే మీ సోదరీసోదరులకు కళ్యాణం చేయాలి కదా! దయ వస్తుంది కదా! ఈగలు వస్తాయి దోమలు వస్తాయి వాటిని ఉంచుకోరు కదా! తరిమేస్తారు కదా! అదేవిధంగా సమస్య అనేది దోమ లేదా ఈగ. దానిని వెంటనే తరిమేయండి. రావటం వాటి పని, రావటం అనే పనిని మాయ వదలటం లేదు కానీ బ్రాహ్మణులు తరిమే పనిని అప్పుడప్పుడు ఆలశ్యం చేస్తున్నారు. అన్ని దేశాలలో ఎంతో కొంత మార్పు చేశారు. 5,6 ఖండాల వారిని చూశారు. పరివర్తన చేశారు, వ్రాశారు శుభాకాంక్షలు కానీ ఆ పరివర్తన అవినాశిగా ఉండాలి. అంతే కానీ చిన్న విషయం ఎదురుగా రాగానే పరివర్తన మారిపోకూడదు. అమరభవ! అనే వరదానం తీస్కోండి. కొంతమంది బాగా పరివర్తన అయ్యారు కానీ సదా అనే మాటని ఎప్పుడూ మర్చిపోకండి, ఎందుకంటే మాయ కూడా మీ ప్రతిజ్ఞను వింటుంది. మాయ కూడా తన పెత్తనం చెలాయిస్తుంది కదా! కానీ మీరు మాయాజీత్ లు కదా! మాయాజీత్ గా అయినప్పుడే జగత్ జీత్ గా అవుతారు. మాయ రావటం చూసి తరమటం నా పని అని జ్ఞాపకం ఉంచుకోండి. నేను రావటం మానను, మీరు విజయం పొందండి అని మాయ కూడా మీకు నేర్పిస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ఈగ, దోమలను రానివ్వకండి. సంపూర్ణ స్థితి ముందు ఈ చిన్న చిన్న విషయాలు చాలా చిన్నవి.
ఇప్పుడు బాప్ దాదా సెకనులో ఏ స్థితిలో స్థితులు అవ్వమని ఆజ్ఞాపిస్తే ఆ స్థితికి చేరగలరా? పురుషార్థంలో సమయం గడిచిపోతుందా? ఇప్పుడు సెకను యొక్క అభ్యాసం కావాలి. ఎందుకంటే అంతిమ సమయంలో పాస్ విత్ ఆనర్ అనే సర్టిఫికెట్ దీని ద్వారానే లభిస్తుంది. ఆ అభ్యాసం ఇప్పటి నుండే చేయాలి. సెకనులో ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో స్థితులవ్వండి. అయితే ఎవరెడీ అవ్వండి. రెడీ అయిపోయారు. ఇప్పుడు మొదట ఒక్క సెకనులో నేను పురుషోత్తమ సంగమయుగి శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మను ఈ స్థితిలో స్థితులవ్వండి ..... ఇప్పుడు నేను ఫరిస్తా రూపాన్ని ...... డబల్ లైట్ ని ....... విశ్వకళ్యాణకారినై మనస్సు ద్వారా నలువైపుల శక్తి శాంతి కిరణాలను వ్యాపింపచేస్తున్నాను అని అనుభవం చేస్కోండి. ఇలా రోజంతటిలో సెకనులో స్థితులు అవ్వగలుగుతున్నారా? ఈ అనుభవం చేస్కోండి. ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది, ఎక్కువ సమయం లభించదు. అలజడిలో సెకనులో అచంచలంగా అవ్వాలి.. కనుక స్వయమే సమయాన్ని తీసి మధ్యమధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. దీని ద్వారా మనస్సు సహజంగా అదుపులోకి వస్తుంది. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ పెరుగుతుంది. నలువైపుల పిల్లల నుండి ఉత్తరాలు చాలా వచ్చాయి, అనుభవాలు కూడా చాలా వచ్చాయి, వాటికి సమాధానంగా బాబా చాలా చాలా మనస్సు యొక్క ఆశీర్వాదాలు మరియు కోటానుకోట్ల మనస్సు యొక్క ప్రియస్మృతులు ఇస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు మురళీ వింటున్నారు, బాబాని చూస్తున్నారు, చూడని వారు కూడా బాబాని స్మృతి చేస్తున్నారు. అందరి బుద్ధి ఈ సమయంలో మధువనంలోనే ఉంది. నలువైపుల ఉన్న పిల్లలందరూ పేరు పేరున ప్రియస్మృతులు స్వీకరించండి.
సదా ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కల ద్వారా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ట ఆత్మలకు, సదా స్నేహంలో లవలీనమై ఉండే పిల్లలకు, సదాశ్రమ ముక్తులుగా, సమస్యాముక్తులుగా, విఘ్న ముక్తులుగా, యోగ యుక్తులుగా, రహస్య యుక్తులుగా ఉండే పిల్లలకు, సదా ప్రతి పరిస్థితిలో సెకనులో పాస్ అయ్యేవారికి, ప్రతి సమయం సర్వశక్తి స్వరూపంగా ఉండే మాస్టర్ సర్వ శక్తివాన్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. .
ఈసారి జనవరి నెలలో విఘ్నముక్తులు అనే సర్టిఫికెట్ తీస్కోవాలి. ఈ విధంగా జరుపుకోండి. అందరికీ సర్టిఫికెట్ లభించాలి. నవీనత తీసుకురండి. నవీనత ఉంటే ఎగిరిపోతారు. ఇప్పుడు ఎగిరేటటువంటి సమయం ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది. అలజడి యొక్క సమయం. దీనిలో మీరు అచంచలంగా ఉండాలి. మేము అలజడిలో ఉన్నాము, మీరు అచంచలంగా ఉన్నారు అని అందరికీ ఇవే తరంగాలు వ్యాపించాలి. అవ్వవలసిందే. మంచిది. చాలా చాలా శుభాకాంక్షలు.
Comments
Post a Comment