31-03-1995 అవ్యక్త మురళి

       31-03-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరమాత్మ కలయిక మేళా యొక్క బహుమతి - కిరీటము, సింహాసనము మరియు తిలకం.

ఈరోజు బేహద్ బాబా తన పిల్లలందరినీ బే హద్ లో చూస్తున్నారు. తండ్రి బేహద్ మరియు మీరందరు కూడా బేహద్ యజమానులు మరియు పిల్లలు. బాప్ దాదా తన స్నేహి, సహయోగి పిల్లలందరిని చూసి సంతోషిస్తున్నారు మరియు పిల్లలు బాబాను చూసి సంతోషిస్తున్నారు. బాబాకి ఎక్కువ సంతోషమా, పిల్లలకు ఎక్కువ సంతోషమా అంటే ఏమంటారు? ఇద్దరికి ఉంది అంటారా! దీనినే పరమాత్మ కలయిక యొక్క మేళా అంటారు. మేళాలు అయితే చాలా జరుగుతాయి కానీ పరమాత్మ కలయిక మేళా ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. మొత్తం కల్పంలో ఇక ఎప్పుడూ జరుగదు. ఇప్పుడు జరుగుతుంది మరియు ఇక ముందు కూడా జరుగుతుంది. మీ అందరికి కూడా ఈ మేళా మంచిగా అనిపిస్తుంది. కదా! బాప్ దాదా అయితే పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు మరియు ఓహో పిల్లలు! ఓహో!! అని మనస్సులో పాట పాడుతున్నారు. ఈ భాగ్యం గురించి కలలో కూడా అనుకోలేదు, సంకల్పంలో కూడా లేదు కానీ ఇప్పుడు ఆ శ్రేష్ట భాగ్యాన్ని సాకారంలో అనుభవం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో శ్రేష్ట భాగ్యరేఖ మెరుస్తూ ఉంది. అందరు మెరిసే సితారలే కదా? మీ యొక్క ఈ శ్రేష్ట భాగ్యం స్మృతి ఉంటుంది కదా! ఎందుకు శ్రేష్ట భాగ్యం అయ్యింది? ఎందుకంటే భాగ్యవిధాత ద్వారా శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలైన మీకు దివ్య బ్రాహ్మణ జన్మ లభించింది. బాబాను కూడా భాగ్య విధాత అంటారు. బ్రహ్మను కూడా భాగ్యవిధాత అంటారు. మీ అందరి జన్మ బాప్ దాదా ద్వారా లభించింది. ఎవరి తండ్రి అయితే స్వయం భాగ్యవిధాతయో వారి భాగ్యం ఎంత శ్రేష్టంగా ఉంటుంది! పరమాత్మ కలయిక జరుపుకుంటున్నారు కదా! (డబల్ విదేశీయులతో) వీరు కూడా జరుపుకుంటున్నారు కదా! బేహద్ మేళాలో డబల్ విదేశీయులు లేకపోతే దానిని బేహద్ అనరు. మీకు కూడా విశేష పాత్ర ఉంది, అది చూసి బాబా మరియు పిల్లలందరు కూడా హర్షిస్తున్నారు. భాగ్యవిధాత ద్వారా జన్మ లభించటం అనేది అన్నింటికంటే మొదటి నెంబర్ భాగ్యం. దానితో పాటు మొత్తం కల్పంలో ఈ జన్మలోనే ఒకే పరమాత్మ తండ్రిగా, శిక్షకునిగా, సద్గురువుగా కూడా అయ్యారు మరియు సర్వ సంబంధాలు కూడా నిలుపుతున్నారు. ఇటువంటి భాగ్యం మొత్తం కల్పంలో సత్యయుగం నుండి కలియుగం వరకు ఎవరికైనా లభించిందా? ఇప్పుడు మీకే లభించింది. ఇప్పుడు మీరు నిశ్చయం మరియు నషాతో అంటున్నారు, మిమ్మల్ని పాలన చేసేవారు పరమాత్మ అని. బయటవారు కేవలం పైపైకి పరమాత్మ పాలన చేస్తున్నారు అని అంటారు కానీ మీరు ప్రత్యక్ష అనుభవంతో అంటున్నారు, పరమాత్మ మా తండ్రి ఆ తండ్రే మిమ్మల్ని పాలన చేస్తున్నారు అని. ఇలా నషా ఉంది కదా లేదా కొంచెం కొంచెం మర్చిపోతున్నారా? నడుస్తూ, నడుస్తూ మీ శ్రేష్ట భాగ్యాన్ని సాధారణంగా భావిస్తున్నారు. భాగ్యం అయితే శ్రేష్టమే కానీ సాధారణంగా భావిస్తున్నారు. అందువలన ఏ నషా మరియు మెరుపు సదా ఉండాలో అది ఉండటం లేదు. ఒక సెకను కూడా మర్చిపోవటం లేదు కానీ బాబా లభించేసారు, మావాడిగా అయిపోయారు, మేము కూడా బాబా వారిగా అయిపోయాము.... అని సాధారణంగా భావిస్తున్నారు. మనవాడిగా అయిపోయినప్పుడు నషా ఉండాలి కదా? మన తండ్రి పరమాత్మ, శిక్షకుడు కూడా పరమాత్మ ఆయన ఏమి శిక్షణ ఇచ్చారు? మనల్ని ఏవిధంగా తయారు చేస్తున్నారు? త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథులుగా తయారుచేసారు. ఇటువంటి చదువు ఎవరైనా చదివిస్తారా! ఈ డిగ్రీ గురించి ఎప్పుడైనా విన్నారా? జడ్జ్, బ్యారిష్టర్, డాక్టర్, ఇంజనీర్... ఈ డిగ్రీల గురించి విన్నారు. కానీ త్రిలోక నాధులు, త్రికాలదర్శి, త్రినేత్రి, నాలెడ్జ్ పుల్ ఇటువంటి డిగ్రీల గురించి విన్నారా? ద్వాపరయుగం నుండి కలియుగం వరకు ఎవరికైనా ఈ డిగ్రీ లభించిందా? మీకు లభించిందా? మీరు 63 జన్మలు తీసుకున్నారు కదా, ఎవరికి లభించలేదు మరియు లభించదు. మన శిక్షకుడు అంత ఉన్నతమైనవారు. విజ్ఞానం వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ మూడు లోకాల వరకు చేరుకోలేదు. మూడు లోకాల యొక్క జ్ఞానాన్ని పొందలేరు. కానీ మీలో 5 సంవత్సరాల పిల్లవాడు కూడా మూడులోకాల జ్ఞానం చెప్తాడు. ఆ చిన్న పిల్లవాడు కూడా చాలా నిశ్చయంతో చెప్తాడు, ఇది సూక్ష్మవతనం, ఇది మూలవతనం అని. ఇలా పరమాత్మ మనకి శిక్షకుడు కూడా, శ్రేష్ట శిక్షణ ద్వారా ఈ డిగ్రీ అయితే పొందారు. కానీ ప్రపంచంలో అన్నింటికంటే ఉన్నతమైన పదవి రాజ్య పదవి. చదువుతో పదవి కూడా లభిస్తుంది కదా! అలాగే మిమ్మల్ని కూడా రాజుగా తయారుచేసిందా? ఇప్పుడు రాజులేనా లేక అవ్వాలా? అవ్వటానికి రాజులే కానీ కూర్చున్నది పట్టాపై. గట్టి ఇంటిలో కూడా కాదు, టెంట్ లో కూర్చున్నారు. అన్నింటికంటే శ్రేష్టాతి శ్రేష్ఠ పదవి రాజ్యపదవి. మీరు ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులు మరియు భవిష్యత్తులో కూడా విశ్వరాజ్యాధికారిగా అవ్వవలసిందే. ఇది పక్కాయే కదా? ఎవరిపై రాజ్యం చేయాలి? మీరు రాజ్యం చేస్తారా లేక మీపై ఎవరైనా రాజు లేదా మీపై మీరే రాజ్యం చేసుకుంటారా? పరమాత్మ మీకు శిక్షకులు, రాజ్యపదవి ఇచ్చేవారు కనుక మీ భాగ్యం ఎంత ఉన్నతమైనది! మరలా సద్గురువుగా కూడా అవుతున్నారు. గురువు ఏమి చేస్తారు? మంత్రం ఇస్తారు కదా! అయితే సద్గురువు ఏ మంత్రం ఇచ్చారు? మన్మనాభవ. సద్గురువు ద్వారా మహామంత్రం కూడా లభించింది మరియు సర్వ వరదానాలు కూడా లభించాయి. ఎన్ని వరదానాలు లభించాయి? వరదానాల యొక్క జాబితా చూడండి, ఎంత పెద్దది? రోజూ వరదానం లభిస్తుంది కదా! ఎంత సమయం నుండి లభిస్తుంది! ఇన్ని వరదానాలు ఏ గురువు ఏ శిష్యునికి ఇవ్వరు. రోజూ వరదానాన్ని ఇచ్చే సద్గురువును చూసారా? ఇప్పుడు నషా ఉంది కదా? (ఉంది) చాలా మంచిది. సదా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి బస్సులో వెళ్ళేటప్పుడు నషా దిగిపోకూడదు, సదా పెరుగుతూ ఉండాలి. బాప్ దాదా పిల్లలందరినీ ప్రతి సబ్జక్టులో నెంబర్ వన్ గా చూడాలనుకుంటున్నారు. అయితే అందరు నెంబర్‌ వన్‌ యేనా లేక ఇప్పుడు అవ్వాలా? మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు అని నషాతో చెప్పండి. డబల్ విదేశీయులకి డబల్ నషా ఉంది కదా! మంచిది. బాబా కూడా సంతోషిస్తున్నారు - నా యొక్క ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ, ప్రజలు కాదు అని. ప్రజలు అయితే తర్వాత వచ్చేవారు. మీరు అదృష్టవంతులు ఇంతగా అయినా మీకు అవకాశం లభించింది. టెంట్ లో ఉండవలసి వచ్చినా కానీ ఏమైంది? మట్టిపై అయితే నిద్రపోవటం లేదు కదా! తివాచీపై నిద్రపోతున్నారు కదా. బ్రహ్మాభోజనం కూడా మంచిగా దొరుకుతుంది కదా? మట్టితో ఉన్నది అయితే కాదు కదా? ప్రేమగా తింటున్నారు కదా? కొంచెం కష్టం అయితే ఉంటుంది, ఉండాల్సిందే. ఎందువలన? మాయ మరియు ప్రభువు యొక్క ఆట రెండు వెనువెంట జరుగుతున్నాయి. పరమాత్మ కలయిక జరుగుతుంటే మాయ కూడా తప్పకుండా అలజడి చేస్తుంది. మీ పని బాబాని కలుసుకోవడం, దాని పని అలజడి చేయటం. అలజడి కూడా జరిగింది. మరియు కలయిక కూడా జరిగింది. (తుఫాను వచ్చింది) ఏమీ పర్వాలేదు. మీకు పురుషార్ధంలో తుఫానులు వస్తాయి. ఇదైతే గాలి తుఫాను. ఏమయ్యిందో అని భయపడటం లేదు కదా? తుఫాను వచ్చినా, వర్షం వచ్చినా, ఎంత అలజడి అయినా కానీ మీ మనస్సు అయితే అచంచలంగా ఉంది కదా? టెంట్ ఎగిరిపోతే ఏం చేయాలి అని మాతలు భయపడ్డారా? కొంచెం కొంచెం భయపడ్డారా ఏమౌతుందో, ఆరోగ్యం బావుంటుందో, లేదో? అని. ఎంతైనా కానీ భక్తిలో కంటే ఇప్పుడు ఎదురుదెబ్బలు, శ్రమ తక్కువే కదా! భక్తిలో వలె ఎదురు దెబ్బలు తినటం లేదు కదా, మజాగా ఉంటున్నారు కదా! ఈ కలయిక మంచిగా అనిపిస్తుందా లేదా అలజడి చూసి భయపడిపోయారా? ఎవరు భయపడలేదా? ఒకరిద్దరు భయపడి ఉంటారు? మజా వస్తుందా? ఇంకా రెండు రోజులు ఉంచితే? మంచిది. బాప్ దాదా కూడా మాయ యొక్క అలజడిని చూసి చక్రం తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు మరియు మాయ ఏం చేస్తుంది అనే ఆట చూస్తున్నారు. 

బాప్ దాదా పిల్లల స్నేహం చూసి సంతోషిస్తున్నారు. స్నేహమే మేళాని రచించింది. బాబాకి కూడా స్నేహం ఉంది మరియు పిల్లలకి కూడా స్నేహం ఉంది. రెండూ కలిస్తే ఏమయ్యింది? మేళా అయ్యింది. దృశ్యం కూడా ఎంత బాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద పరివారం లభిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత పరివారం ఎవరికైనా ఉంటుందా? మీకు ఎన్ని ఇళ్ళు? (ఒక్కటే) మీ సేవాస్థానాలు ఎన్ని? (చాలా ఉన్నాయి) వాటిని కూడా బాబా ఇళ్ళు అంటారు కదా! అయితే బాబా ఇల్లే మీ ఇల్లు. బయట ప్రపంచం వారు అయితే అంటారు వీరు ఇళ్ళు,వాకిళ్ళు వదిలేస్తారు అని అంటారు కానీ మీరు ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు! లెక్క పెట్టలేరు. జ్ఞాపకం ఉంచుకోవలసి వస్తుంది. అందువలన ఇది వదిలేయటం కాదు తయారు చేసుకోవటం. ఇక కుటుంబాన్ని వదిలివేశారా లేదా కలుసుకోవటానికే కష్టం అయ్యేటంత పరివారాన్ని తయారు చేసుకున్నారు. బ్రాహ్మణులందరు ఎంతమంది ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరు ఒకే చోట కలుసుకోగలరా? కష్టం అవుతుంది కదా! ఎందుకంటే ఇది ఇతరుల రాజ్యం కదా, మీ రాజ్యం అయితే లేదు కదా. కానీ బాబా లభించారు, బేహద్ పరివారం లభించింది. బేహద్ ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా బేహద్ నషా, సంతోషం ఉంటాయి. నేను ఫలానా దేశంలోని వాడిని, నేను ఫలానా జోన్ ఇలా హద్దుగా భావిస్తే హద్దు ఉంటుంది. వీరు ఫలానా జోన్, ఫలానా స్థానం అని కేవలం గుర్తు కోసం నిమిత్తమాత్రంగా అంటారు అంతే. కానీ మిమ్మల్ని మీరు బేహద్ గా భావిస్తున్నారు కదా! నియమం కూడా పెట్టవలసి వస్తుంది. కొందరు అనుకుంటున్నారు, ఏమిటి, బ్యాడ్జి పెట్టుకుంటేనే భోజనం దొరుకుతుందా? మిమ్మల్ని భోజనం గురించి విసిగిస్తున్నారు కదా? కానీ ఇవన్నీ చేయవలసిందే. ఎందుకంటే నియమంలోనే లాభం ఉంటుంది. ఇది బంధన కాదు విఘ్నాల నుండి నిర్బంధనంగా తయారుచేసే సాధనం. ఇది ఏమిటి ఇలా క్రొత్తగా మొదలు పెట్టారు అని ఆలోచించకూడదు. సంకల్పాలు అయితే బాప్ దాదా దగ్గరికి చేరుకుంటాయి కదా! కానీ మర్యాదా పురుషోత్తములు మీరే కదా! లేదా పెద్ద దాదీలు మర్యాదా పురుషోత్తములు మీరు సాధారణమైనవారా? మర్యాదాపురుషోత్తములు అంటే మర్యాదలో ఉండేవారు, మర్యాదలో నడిచేవారు. అలాగే అనే పాఠం పక్కాగా ఉంది కదా? మంచిది. ఏదైనా విషయం వచ్చేసరికి అలాగే అంటున్నారా లేక కాదు అంటున్నారా? ఇటువంటి విషయాలలో అలా అనటానికి బదులు కాదు అనే పాఠముతో ఎంతగా పక్కా అయిపోతున్నారంటే బాబా చెప్పినా వినటం లేదు. స్థాపన ఆదిలో చిన్న చిన్న పిల్లలు వచ్చేవారు, బాప్ దాదా వారికి పాఠాన్ని పక్కా చేయించడానికి చెప్తూండేవారు - కాదు (నా)అన్నారంటే నాస్తికులు, అవును (హా) అన్నారంటే ఆస్తికులు. అయితే మీరందరు ఎవరు? ఆస్తికులు కదా! నాస్తికులు కాదు కదా! అప్పుడప్పుడు నాస్తికులుగా అవుతున్నారా! ఆట ఆడుతున్నారా! మాయ యొక్క జ్ఞాన సాగరులుగా కూడా అయిపోయారు. ఎందుకంటే మాయ కూడా నాలెడ్జ్ పుల్. పడవేయటంలో మాయ తెలివైనది మరియు ఎగరటంలో మీరు తెలివైన వారు. మాయ కూడా మీరు పైకి, క్రిందకి ఎగురుతూ ఉంటే అది చూసి యుద్ధం చేస్తుంది. కానీ మీరు జ్ఞాన సాగరులుగా అయిన కారణంగా అది తెలుసుకుంటున్నారు, ఓడిపోవటం లేదు కానీ విజయం కంఠహారంగా అవుతుంది. అందరి మెడలో విజయీహారం ఉందా లేదా అప్పుడప్పుడు తీసేస్తున్నారా? మంచిది. 

వెనుక ఉన్నవారు మజాలో ఉన్నారా? అది కూడా మధువనం యొక్క స్థానమే కదా, మధువనంలో తప్ప మరెక్కడైనా ఇంత పెద్ద మేళా జరుగుతుందా? జరుగదు కదా! మధువనం అంటే బేహద్ ఇల్లు. అందరు మీ భాగ్యం ద్వారా పరమాత్మ మేళాకి చేరుకున్నారు. ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి! (13,14 వేల మంది అన్నయ్యలు, అక్కయ్యల సభ ఉంది, దీనిలో చాలామంది కొత్త అన్నయ్యలు, అక్కయ్యలు ఉన్నారు) మంచిది, టి.విలో చూస్తున్నారు. చాలా విజ్ఞాన సాధనాలు ఇప్పుడే వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆ విజ్ఞాన సాధనాలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఎందుకోసం తయారయ్యాయి? మీ కోసం తయారయ్యాయి. వైజ్ఞానికులకు బాప్ దాదా కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే బాబా పిల్లలు వాటి ద్వారా సుఖం పొందుతున్నారు కదా! కానీ ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? స్థాపన అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? డైమండ్ జూబ్లీ జరుపుకునేటందుకు తయారవుతున్నారు. బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరినీ రాజా పిల్లలు అంటున్నారు కదా, అందరు రాజులే. రాజ్యసింహాసనాధికారిగా అవుతారు కదా? రాజ్యానికి గుర్తు - కిరీటము, సింహాసనము, తిలకము. బాప్ దాదా ఈ సంవత్సరంలో క్రొత్తవారైనా, పాతవారైనా, ఒకవేళ క్రొత్తవారైనా కానీ సమాప్తి సమయం అనేది క్రొత్తవారికి, పాతవారికి కూడా సమీపంగా ఉంది. మాకు 60 సంవత్సరాల తర్వాత సమాప్తి అవుతుంది అనుకోకండి. మీరు అలంకరించుకోవాలి. చివర వచ్చినా వేగంగా వెళ్ళాలి. సమాప్తి సమయం, సంపన్నంగా అయ్యే సమయం అందరికీ ఒకటే. అందువలన క్రొత్తవారైనా, పాతవారైనా కానీ నేను స్వరాజ్యాధికారి ఆత్మను అనే స్మృతి తిలకం సదా పెట్టుకునే ఉండాలి. అప్పుడప్పుడు తొలగిపోయేలా, అప్పుడప్పుడు ఉండేలా పెట్టుకోకూడదు. స్వరాజ్యాధికారి అంటే తిలకధారి, ఈ స్మృతి తిలకం అవినాశిగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. నేను తిలకధారిని, నేను విశ్వకళ్యాణకారి బాధ్యతాకిరీటధారిని అనే స్మృతిలో ఉండాలి. ఎంత పెద్ద విశ్వం మరియు మీరందరు విశ్వకళ్యాణకారులు. బాబా ఒంటరిగా చేయరు. మీరందరు కూడా బాబాకి సహయోగులు. విశ్వకళ్యాణం యొక్క బాధ్యతాకిరీటధారులు మరియు సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు. క్రిందికి రాకూడదు.సదా సింహాసనాధికారులుగా ఉండాలి. చాలా ప్రియమైన, గారాభమైన పిల్లలు ఉంటే తల్లి,తండ్రి వారిని మట్టిలోకి వెళ్ళనివ్వరు, భూమిపై పాదం పెట్టనివ్వరు. మరి మీరెంత గారాభమైనవారు! మీరు గారాభమైనవారా లేదా తర్వాత వచ్చేవారా? మీరే కదా! కనుక సింహాసనాన్ని వదిలి సాధారణ స్వరూపం, సాధారణ సంకల్పం.... అనే మట్టిలో లేదా భూమిపై పాదం పెట్టకండి. బుద్ధి రూపీ పాదం సదా సింహాసనంపై ఉండాలి. పరమాత్మ తండ్రి యొక్క పిల్లలు. మహాత్ముని లేదా ధర్మాత్ముని పిల్లలు కాదు, పరమాత్ముని పిల్లలు. ఇప్పుడు అందరు నషాలో మంచిగా ఉన్నారా, నషా అయితే కనిపిస్తుంది కానీ సదా ఉండాలి కదా? కొద్దికొద్దిగా ఉండటం మరలా యుద్ధం చేయటం, విజయం పొందటం ఇలా లేరు కదా? బ్రాహ్మణులా లేదా క్షత్రియులా? బ్రాహ్మణులు కదా! క్షత్రియులు కాదు, యుద్ధం చేయటం లేదు కదా లేదా అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా, అప్పుడప్పుడు క్షత్రియులుగా అవుతున్నారా? ఒకవేళ మాయతో యుద్ధం చేయవలసి వస్తుంది అంటే క్షత్రియులుగా అయినట్లే. బ్రాహ్మణులు అంటే విజయీలు మరియు క్షత్రియులు అంటే యుద్ధం చేసేవారు. బాప్ దాదాకి అప్పుడప్పుడు పిల్లలపై చాలా దయ వస్తుంది, కూర్చునేది యోగంలో, చేసేది యుద్ధం అని. ఒక గంట యోగం చేసాము అంటారు కానీ ఒక గంటలో యుద్ధం ఎంత సమయం చేసారు మరియు యోగం ఎంత సమయం చేసారు? ఒకవేళ ఏ కారణంగా అయినా అనుభూతి అవ్వటం లేదు అంటే తప్పకుండా అది యుద్ధం యొక్క స్థితియే. బాప్ దాదా అయితే యోగి పిల్లలు అంటున్నారు. మరి మీరు యుద్ధం చేసేవారిగా అవుతున్నారా! అంతిమం వరకు యుద్ధం చేస్తారా! యుద్ధం చేయండి అని అవకాశం ఇమ్మంటారా! అవకాశం కావాలా? వద్దా? మరి మరలా ఎందుకు యుద్ధం చేస్తున్నారు? బలహీనంగా అయితే మాయ ఎంత ఆధీనంగా చేసేస్తుందంటే చేయాలనుకోవటం లేదు కానీ చేసేస్తున్నారు. ఎలా అయితే చూడండి, కొంతమంది సేవాధారులు చాలా అమాయకంగా ఉంటారు. కనుక యజమాని వారిని ఆధీనం చేసేసుకుంటారు. ఆ సేవాధారి చేయలేని పని కూడా ఆ యజమాని చేయమంటారు, ఆ పని చేయకపోతే ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అంటారు. మాయ కూడా అలాగే చేస్తుంది, మీరు అనుకోవటం లేదు కానీ బలహీనంగా అయిపోయిన కారణంగా మాయకు ఆధీనం అయిపోతున్నారు. ఆ సమయంలో యోగులా లేదా యుద్ధం చేసేవారా? బాప్ దాదాకి పిల్లల యొక్క యుద్ధం మంచిగా అనిపించటం లేదు. పరమాత్ముని పిల్లలు సదా మజాలో ఉండేవారు, ఆనందంలో ఉండేవారు అంతేకానీ యుద్ధం యొక్క శ్రమ చేసేవారు కాదు. కనుక ఎలా అవుతారు? యోగీపిల్లలుగా అవుతారా లేదా యుద్ధం చేసేవారిగా అవుతున్నారా? యోగిగా అవుతారా లేదా కొద్దికొద్దిగా యుద్ధం చేయటం మంచిగా అనిపిస్తుందా? అనటంలో అయితే అలాగే, అలాగే అంటున్నారు కానీ చేసే సమయంలో ఫోటో తీస్తాను. సదా స్వరాజ్యాధికారి యొక్క చార్ట్ ఈ సంవత్సరం ఉండాలి. ఆధీనత సమాప్తి అవ్వాలి. 63 జన్మల నుండి ఆధీనంగా ఉన్నారు, ఇప్పుడు ఈ ఒక జన్మ అధికారిగా అయ్యేటందుకు లభించింది, దీనిలో కూడా ఆధీనంగా ఉంటారా? ఆధీనం అయ్యేటందుకు ఒక జన్మ ఎగస్ట్రాగా ఇమ్మంటారా, మజా పొందవచ్చు. వద్దా! అధికారం అయితే లభించింది, కేవలం ఆ అధికారాన్ని సంభాళించుకోండి. సోమరిగా అవ్వకండి, బలహీనంగా అవ్వకండి. అనటం అయితే నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అని అంటున్నారు, ఎవరైనా నేను మాస్టర్ బలహీనుడిని అని అంటున్నారా? కానీ అవ్వటం ఎలా అవుతున్నారు? మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతున్నారా లేదా బలహీనంగా అవుతున్నారా! ఇది బావుంటుందా? వినటానికి కూడా బావుండలేదు. 

అన్నివైపుల నుండి దేశ, విదేశాలలో సూక్ష్మ స్వరూపంతో దృశ్యం చూసే ఆత్మలకు, నలువైపుల ఉన్న సదా శ్రేష్ట పాలనలో పాలింపబడే వారికి, శ్రేష్ట చదువుతో రాజ్య పదవి పొందే ఆత్మలకు, సద్గురువు ద్వారా సర్వ వరదానాలు పొందే ఆత్మలకు, సదా మాయాజీత్, విజయీ రత్నాలకు, సదా యుద్ధాన్ని వదిలి రాజయోగి స్థితిలో స్థితులయ్యే సర్వశ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments