30-11-2006 అవ్యక్త మురళి

 30-11-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్వాలాముఖ తపస్సు ద్వారా " నేను " అనే తోకను కాల్చి బాప్ దాదా సమానంగా అవ్వండి.  అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది.

ఈరోజు తరగని అవినాశి ఖజానాలకు యజమాని అయిన బాప్ దాదా తన నలువైపుల ఉన్న సంపన్న పిల్లల యొక్క జమ ఖాతాను చూస్తున్నారు. మూడు రకాల ఖాతాలను చూస్తున్నారు. 1.స్వ పురుషార్థం ద్వారా శ్రేష్ట ప్రాలబ్దం యొక్క జమ ఖాతా 2. సదా సంతుష్టంగా ఉంటూ, సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల ఖాతా 3. మనసా, వాచా, కర్మణా, సంబంధ సంపర్కాల ద్వారా బేహద్ నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా. మీరందరు కూడా మీ యొక్క ఈ మూడు ఖాతాలను పరిశీలించుకుంటూ ఉంటూనే ఉంటారు. ఈ మూడు ఖాతాలు ఎంతగా జమ అయినవి? జమ అయినదా, లేదా అనే దానికి గుర్తు - సదా సర్వుల పట్ల, స్వయం పట్ల సంతుష్టతా స్వరూపంగా, సర్వుల పట్ల శుభ భావన, శుభ కామన మరియు సదా స్వయాన్ని సంతోషవంత, అదృష్టవంత స్థితిలో అనుభవం చేసుకోవటం. రెండు ఖాతాల యొక్క గుర్తు స్వయంలో అనుభవం అవుతుందా అని పరిశీలించుకోండి. ఈ సర్వ ఖజానాలను జమ చేసుకునే తాళంచెవి - నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్ధ భావం. పరిశీలించుకుంటూ వెళ్ళండి. తాళంచెవి నెంబరు ఏమిటో తెలుసా? నెంబరు - మూడు బిందువులు. 

1. ఆత్మ బిందువు 2. బాబా బిందువు 3. డ్రామా బిందువు. మీ అందరి వద్ద తాళంచెవి ఉంది కదా! తెరిచి ఖజానాలను చూసుకుంటూ ఉంటున్నారు కదా! ఈ అన్ని ఖజానాల వృద్ధి యొక్క విధి - ధృడత. ధృడత ఉన్నట్లయితే ఇది అవుతుందా, అవ్వదా అనే సంకల్పం ఏ కార్యంలోనూ ఉత్పన్నం అవ్వదు. జరిగే ఉంది, తయారయ్యే ఉంది ఇదే ధృడ స్థితి. జరుగుతుందా, జమ అవుతుందా, అవ్వదా, చేయటం అయితే చేస్తున్నాం, అవ్వాలి ఇలా అనరు. ధృడత గల వారు నిశ్చయబుద్దిగా, నిశ్చింతగా మరియు నిశ్చిత అనుభవం చేసుకుంటారు. 

బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - సర్వ ఖజానాలను ఎక్కువలో ఎక్కువగా జమ చేసుకోవాలంటే మన్మనాభవ మంత్రాన్ని యంత్రంగా చేస్కోండి. దీని ద్వారా స్వతహాగా బాబా తోడుగా మరియు సమీపంగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. దీనిలో మూడు రూపాలు 1. బాబాకి సమీపంగా (పాస్) ఉండాలి. 2. జరిగిపోయిన దానిని జరిగిపోయినదిగా (పాస్) భావించాలి. 3. పాస్ విత్ ఆనర్ అవ్వాలి. ఇలా మూడు రకాలుగా పాస్ అయితే రాజ్యా ధికారి అయ్యేటందుకు పూర్తి పాస్ (హక్కు) లభిస్తుంది. పూర్తి హక్కు తీసుకున్నారా, లేదా? పూర్తి హక్కు పొందిన వారు చేతులెత్తండి. తీసుకోలేదా, తీసుకున్నారా? మొదటి వరుసలోని వారు చేతులు ఎత్తటం లేదు, తీసుకోవాలా మీరు? ఇప్పుడు ఇంకా సంపూర్ణం కాలేదు, అందువలన అని అనుకుంటున్నారా! కానీ నిశ్చయబుద్ది తప్పక విజయీ అవుతారు. లేక అవ్వాలా? ఇప్పుడు సమయం మరియు భక్తుల పిలుపు, మీ మనస్సు యొక్క ధ్వని ఏమిటి? ఇప్పుడిప్పుడే సంపన్నంగా మరియు సమానంగా అవ్వవలసిందే. అవుతాం, ఆలోచిస్తాం, చేస్తాం.... అంటారా? ఇప్పుడు సమయానుసారంగా ప్రతి సమయం ఎవరెడీగా ఉండే పాఠం పక్కాగా ఉండాల్సిందే. నా బాబా అంటున్నారు, మధురమైన బాబా ప్రియమైన బాబా అని అంగీకరిస్తున్నారు. మరి ప్రియమైనవారి సమానంగా అవ్వటం శ్రమ అనిపించదు కదా! 

బాప్ దాదా చూశారు, సమయానుసారంగా సమానంగా అవ్వటంలో విఘ్నం వేసేది చాలా ప్రసిద్ధమైన మాట, అది అందరికీ తెలుసు మరియు అనుభవీలు. ఆ మాట నేను. నేను అనే భావం. కనుకనే బాప్ దాదా గతంలో కూడా చెప్పారు - ఎప్పుడైతే నేను అనే మాట మాట్లాడతారో అప్పుడు కేవలం నేను అనకండి, నేను ఆత్మ అని కలిపి మాట్లాడండి. నేను అనే మాట అప్పుడప్పుడు అభిమానాన్ని తీసుకువస్తుంది. దేహాభిమానం యొక్క నేను అనే మాట వలన, ఆత్మాభిమాని నేను వలన కాదు. దేహాభిమానంతో కూడిన నేను అనే మాట అభిమానాన్ని తీసుకువస్తుంది మరియు అవమానాన్ని కూడా తీసుకువస్తుంది. అప్పుడప్పుడు బలహీనంగా కూడా చేస్తుంది. అందువలన ఈ దేహాభిమానపు నేను అనే భావాన్ని కలలో కూడా రానివ్వకండి.  

బాప్ దాదా చూశారు, స్నేహంలో మెజారిటీ పాస్ అయిపోయారు. మీ అందరినీ ఇక్కడికి తీసుకువచ్చింది ఏది? విమానంలో వచ్చినా, రైలులో వచ్చినా, బస్సులో వచ్చినా కానీ వాస్తవానికి బాప్ దాదాపై స్నేహం అనే విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. ఎలా అయితే స్నేహంలో పాస్ అయ్యారో అలాగే సమానంగా అవ్వటంలో కూడా పాస్ విత్ ఆనర్ అయి చూపించే అద్భుతం చేయండి. ఇష్టమేనా? సమానంగా అవ్వటం ఇష్టమేనా? ఇష్టమే కానీ తయారవ్వటంలో కొంచెం శ్రమ. సమానంగా అయిపోతే సమాప్తి ఎదురుగా వస్తుంది. తయారు కావలసిందే అని మనస్సులో ప్రతిజ్ఞ చేస్తున్నారు కానీ అప్పుడప్పుడు ప్రతిజ్ఞ బలహీనం అయిపోతూ పరీక్ష గట్టిగా అయిపోతుంది. అందరు కావాలనుకుంటున్నారు కానీ కావాలనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు కానీ ధృడత లోపంగా ఉంటుంది. సమానత దూరం అయిపోతుంది, సమస్య ప్రబలం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏమి చేస్తారు? బాప్ దాదాకి ఒక విషయం గురించి నవ్వు వస్తుంది, ఆ విషయం ఏమిటి? అవ్వటానికి అయితే మహావీరులు కానీ శాస్త్రాలలో హనుమంతుడిని మహావీర్ అన్నారు మరియు తోక కూడా చూపించారు. ఈ తోక అంటే నేను అనే భావానికి గుర్తుగా చూపించారు. ఎప్పటి వరకు మహావీరులు ఈ తోకకి నిప్పు అంటించరో అప్పటి వరకు లంక అనగా పాత ప్రపంచం సమాప్తి అవ్వదు. ఇప్పుడు ఈ నేను, నేను అనే తోకను కాల్చండి, అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది. ఈ తోకను కాల్చేటందుకు జ్వాలాముఖి తపస్సు కావాలి. సాధారణ స్మృతి కాదు. జ్వాలాముఖి స్మృతి అవసరం. అందువలనే జ్వాలాదేవి యొక్క స్మృతిచిహ్నం ఉంది. 

మరి, విన్నారా ఏమి చేయాలో? సమానంగా అవ్వవలసిందే మరియు సమాప్తిని సమీపంగా తీసుకురావలసిందే అనే ధ్వని మనస్సులో మారుమ్రోగుతూ ఉండాలి. సంగమయుగం చాలా బావుంది కదా, ఇక సమాప్తి ఎందుకు అని మీరు అంటారు. కానీ మీరు బాబా సమానంగా దయాళువు, కృపాళువు, దయాహృదయ ఆత్మలు. కనుక ఈనాటి దు:ఖి, భక్తాత్మలపై దయ చూపించండి. దయాహృదయులు అవ్వండి. దు:ఖం పెరిగిపోతూ ఉంది. దు:ఖీలపై దయ చూపించి వారిని ముక్తిధామానికి పంపండి. కేవలం వాచా సేవ కాదు, మనసా మరియు వాచా రెండూ వెనువెంట ఉండటం ఇప్పుడు అవసరం. ఒకే సమయంలో రెండు సేవలు వెనువెంట ఉండాలి. సేవకి అవకాశం లభించాలి అని ఆలోచించకండి, నడుస్తూ, తిరుగుతూ మీ ముఖం ద్వారా, నడవడిక ద్వారా బాబా యొక్క పరిచయం ఇస్తూ వెళ్ళండి. మీ ముఖం బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీ నడవడిక బాబాను ప్రత్యక్షం చేస్తూ ఉండాలి. ఇలా సదా సేవాధారి భవ! 

బాప్ దాదా ఎదురుగా స్థూలంగా అయితే మీరందరు ఎదురుగా ఉన్నారు కానీ సూక్ష్మ స్వరూపంలో నలువైపుల ఉన్న పిల్లలు మనస్సులో ఉన్నారు. కొందరు వింటున్నారు, కొందరు చూస్తున్నారు. దేశవిదేశాలలోని పిల్లలు ఈ - మెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ప్రియస్మృతులు పంపారు. అందరి పేరు మీదుగా బాప్ దాదాకి స్మృతి లభించింది. అయితే బాప్ దాదా మనస్సులోనే పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ పాట పాడుతూ ఉన్నారు - ఓహో పిల్లలూ! ఓహో!! ప్రతి ఒక్కరికీ ఈ సమయంలో స్మృతి ప్రత్యక్ష రూపంలో ఉంటుంది. ఫలానా వారి స్మృతి తెల్పండి, ఫలానా వారి స్మృతి తెల్పండి అని వేర్వేరుగా పంపిస్తారు. కానీ బాబా అంటారు, మీ సందేశం సాధనాల ద్వారా తర్వాత అందుతుంది కానీ మీ స్నేహ సంకల్పం సాధనాల కంటే ముందే చేరుతుంది. సరేనా! మంచిది. 

మంచిది, ఇప్పుడు ఏ ధృడ సంకల్పం చేస్తున్నారు. సఫలత నా జన్మసిద్ధ అధికారం, విజయం మా కంఠహారం అనే సంకల్పంలో, నిశ్చయం మరియు ఆత్మిక నషాలో అనుభవీ స్వరూపంగా అయ్యి కూర్చోండి. 

మంచిది, నలువైపుల ఉన్న నిశ్చింతా చక్రవర్తులకి, నిశ్చింత స్థితిలో స్థితులయ్యే పిల్లలకు, సర్వ ఖజానాలతో సంపన్నమై ప్రపంచంలోకెల్లా ధనవంతులైన పిల్లలందరికీ, సదా ఉత్సాహ ఉల్లాసాల యొక్క రెక్కలతో ఎగిరేకళలో ఉండే పిల్లలకు, సదా సమాప్తిని సమీపంగా తీసుకువచ్చే బాబా సమాన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, మనస్పూర్వక ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానం మరియు నమస్తే. 

Comments