30-11-2005 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సమయం యొక్క సమీపతననుసరించి ఇప్పుడు స్వయాన్ని హద్దు యొక్క బంధనాల నుండి ముక్తి చేసుకుని సంపన్నంగా మరియు సమనంగా అవ్వండి.
ఈరోజు నలువైపుల ఉన్న సంపూర్ణ సమాన పిల్లలను చూస్తున్నారు. సమానమైన పిల్లలే బాబా యొక్క హృదయంలో ఇమిడి ఉన్నారు. సమాన పిల్లల యొక్క విశేషత - సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణంగా మరియు నిర్మలంగా ఉంటారు. వీరు సదా స్వతంత్రంగా ఉంటారు. ఏవిధమైన హద్దు యొక్క బంధనలో బంధింపబడి ఉండరు. కనుక మిమ్మల్ని మీరు అడగండి - ఈవిధమైన బేహద్ స్వతంత్ర ఆత్మగా అయ్యానా? అని. మొదటి స్వతంత్రత - దేహాభిమానం నుండి స్వతంత్రంగా అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహానికి అతీతం అవ్వాలి. దేహం యొక్క ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయం - స్వతంత్ర ఆత్మ ఏవిధమైన పాత స్వభావ, సంస్కారాల యొక్క బంధనలో బంధించబడదు. పాత స్వభావ, సంస్కారాల నుండి ముక్తిగా ఉంటుంది. వెనువెంట ఏ దేహధారి ఆత్మ యొక్క సంబంధ, సంపర్కానికి ఆకర్షితం అవ్వదు. సంబంధ, సంపర్కంలోకి వస్తూ అతీతంగా, ప్రియంగా ఉంటుంది. కనుక మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి - ఏ చిన్న కర్మేంద్రియం అయినా బంధనలో బంధించడం లేదు కదా? మీ స్వమానాన్ని జ్ఞాపకం చేయండి - మాష్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శనచక్రధారి. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివాన్ పిల్లలను ఏ కర్మేంద్రియం అయినా ఆకర్షితం చేయగలదా? ఎందుకంటే సమయం యొక్క సమీపతననుసరించి మిమ్మల్ని మీరు చూసుకోండి - సెకనులో సర్వ బంధనాల నుండి ముక్తి అవుతున్నానా? అని. ఏవిధమైన బంధన మిగిలిపోలేదు కదా? ఎందుకంటే అంతిమ పేపర్‌లో నెంబర్ వన్ గా అయ్యే ప్రత్యక్ష ప్రమాణంగా - మీ బుద్ధిని సెకనులో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా స్థిరం చేయగలగాలి. అలజడిలోకి రాకూడదు.
ఎలా అయితే స్థూలశరీరం ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు కదా! అదేవిధంగా బుద్ధి ద్వారా ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో స్థిరం కాగలుగుతున్నారా? సైన్స్ ద్వారా తయారైన లైట్ హౌస్, మైట్ హౌస్ సెకనులో స్విచ్ ఆన్ చేయటం ద్వారా నలువైపుల లైట్, మైట్ ఇస్తాయి. అలాగే మీరు స్మృతి అనే స్విచ్ ఆన్ చేయటం ద్వారా లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యి విశ్వానికి లైట్, మైట్ ఇవ్వగలుగుతున్నారా? ఒక సెకనులో అశరీరి అయిపోండి అని ఆజ్ఞ లభించగానే అశరీరి అయిపోతారు కదా! లేక యుద్ధం చేయవలసి వస్తుందా? చాలా కాలం యొక్క ఈ అభ్యాసమే అంతిమంలో సహాయం చేస్తుంది. ఒకవేళ చాలా కాలం నుండి ఈ అభ్యాసం లేకపోతే ఆ సమయంలో అశరీరీ అవ్వటంలో కష్టం అనిపిస్తుంది. అందువలన బాప్ దాదా ఇదే సైగ చేస్తున్నారు - మొత్తం రోజంతటిలో కర్మ చేస్తూ కూడా ఈ అభ్యాసం చేయండి. దీని కొరకు మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ (అదుపు చేసుకునే శక్తి) అవసరం. మనస్సు కంట్రోల్ లో ఉంటే ఏ కర్మేంద్రియం తనకి వశీభూతం చేసుకోలేదు.
ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. సర్వశక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఆత్మలకు ఇదే శుభకోరిక ఉంది - శ్రమ లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా మిమ్మల్ని ముక్తి చేయాలి అని. ఇప్పుడు శ్రమ చేసి అందరు అలసిపోయారు. మీరందరు శ్రమ నుండి ముక్తి అయిపోయారు కదా! లేక ఇప్పుడు కూడా శ్రమ చేయవలసి వస్తుందా? శ్రమ నుండి ముక్తి అయ్యే సాధనం చెప్పాను కదా - మనస్సుతో బాబాకి అతి స్నేహిగా అవ్వాలి. బ్రాహ్మణాత్మలైన మీరు జన్మతో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉందా? బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జన్మ ఇచ్చినప్పుడు మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అని కదా! ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉందా? పక్కాగా జ్ఞాపకం ఉందా లేక అప్పుడప్పుడు మర్చిపోతున్నారా? 63 జన్మల నుండి మర్చిపోయేవారిగా అయ్యారు, ఈ ఒక జన్మ జ్ఞాపకం ఉందా? ఎంత సహజంగా ఇచ్చారు - ఒకే బాబాలో మొత్తం ప్రపంచం, ఒకే బాబాతో సర్వసంబంధాలు, ఒకే బాబా ద్వారా సర్వప్రాప్తులు. చదివించేవారు ఒక్కరే, పాలన చేసేవారు ఒక్కరే, అన్నింటిలో ఒక్కరే. ఈశ్వరీయ పరివారం ఉన్నా కానీ ఈ ఈశ్వరీయ పరివారం కూడా ఒకే బాబా పరివారం. వేర్వేరు తండ్రుల యొక్క పరివారం కాదు. ఒకే పరివారం, పరివారంలో కూడా ఒకరి పట్ల ఒకరికి ఆత్మికస్నేహం ఉండాలి, కేవలం స్నేహం కాదు, ఆత్మికస్నేహం ఉండాలి, జన్మతోనే చేసిన ప్రతిజ్ఞను బాప్ దాదా జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా ఏమి ప్రతిజ్ఞ చేసారు? అందరు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో మనస్సుతో బాబా ముందు అన్నీ నీవే అని అని చెప్పారు కదా! తనువు, మనస్సు, ధనం అన్నీ నీవే అని. మనం ఇచ్చేసిన వస్తువులను బాబా తిరిగి మనకి తాకట్టు రూపంలో కార్యంలో ఉపయోగించడానికి ఇచ్చారు, మీరయితే బాబాకి ఇచ్చేసారు, ఇచ్చేసారు కదా? లేక కొద్దికొద్దిగా తిరిగి తీసుకుంటున్నారా? తిరిగి తీసుకుంటున్నారు అంటే తాకట్టులో నాది అనేది కలిసినట్లే. కొంతమంది పిల్లలు అంటున్నారు మరియు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు - నా మనస్సు అశాంతిగా ఉంటుంది అని. నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడైతే నాది అనేది నీదిగా అర్పణ చేసేసారో ఇక నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీరు గుడ్డిగవ్వ కూడా లేకుండానే చక్రవర్తులుగా అయిపోయారు, ఇప్పుడు మీకు ఏమీ లేదు, గుడ్డిగవ్వ లేకుండానే చక్రవర్తులుగా అయ్యారు ఎలా? బాబా యొక్క ఖజానా మీ ఖజానాగా అయిపోయింది. నీది అనే దానిలో నాది అనేది కలపకండి. బాబా చెప్తున్నారు - బాబా మిమ్మల్ని ఖజానాలలో సంపన్నంగా చేసారు, బాధ్యత బాబా తీసుకున్నారు, ఏ మాటలలో చెప్పారు? మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు సర్వప్రాప్తులకు అధికారులు అవుతారు అని. కేవలం బాబాని జ్ఞాపకం చేయండి అంతే. మీరు అన్నారు - నేను నీవాడిని, నీవు మా వాడివి అని. ఇదే ప్రతిజ్ఞ కదా! కనుక బాబా చెప్తున్నారు - ఖజానాలను సదా స్వయం పట్ల సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించండి. ఎంత కార్యంలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతాయి. సర్వశక్తుల యొక్క ఖజానాను కార్యంలో ఉపయోగించండి. నేను సర్వశక్తివంతుడిని అని కేవలం బుద్దిలో జ్ఞానం ఉంచుకోవడం కాదు, కానీ సమయం అనుసరించి సర్వశక్తులను కార్యంలో ఉపయోగించండి మరియు సేవలో ఉపయోగించండి.
బాప్ దాదా చాలామంది పిల్లల యొక్క ఖాతా చూసారు, రెండు శక్తులను సదా జ్ఞాపకం ఉంచుకుని వాటిని సమయానికి కార్యంలోకి తీసుకువచ్చి సదా నిర్విఘ్నంగా ఉండండి. అప్పుడిక విఘ్నానికి మీ ముందుకి వచ్చే శక్తి ఉండదు. ఇది బాబా యొక్క గ్యారంటీ. సర్వశక్తులు ఉండాలి కానీ సహనశక్తి మరియు అనుభవం చేసుకునే శక్తి. అనుభవం చేసుకుంటున్నారు కానీ ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురావటంలో ధ్యాస తక్కువగా ఉంటుంది. అందువలనే ఏ సమయంలో అనుభవం చేసుకుంటున్నారో ఆ సమయంలో నడవడిక మరియు ముఖం మారిపోతుంది. చాలా మంచి ఉత్సాహ, ఉల్లాసాలలోకి వస్తున్నారు, అనుభవం చేసుకున్నాము అని, కానీ మరలా ఏమౌతుంది? అందరు అనుభవీలే కదా! మరలా ఏమౌతుంది? దానిని ప్రతి సమయం స్వరూపంలోకి తీసుకురావటంలో తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపంగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవటం వేరే విషయం కానీ స్వరూపంలోకి తీసుకురావాలి. అప్పుడప్పుడు బాప్ దాదాకి కొంతమంది పిల్లల పట్ల దయ కూడా వస్తుంది పిల్లలు కష్టపడకూడదు, పిల్లల బదులు నేనే చేయాలి అనుకుంటున్నారు. కానీ డ్రామా యొక్క రహస్యం ఏమిటంటే - ఎవరు చేసుకుంటే వారు పొందుతారు. అందువలన బాప్ దాదా సహయోగం తప్పకుండా ఇస్తారు కానీ చేయవలసింది మాత్రం పిల్లలే. బాప్ దాదా చూసారు - పిల్లలు సంకల్పాలు చాలా మంచిగా చేస్తున్నారు. అమృతవేళ బాబా దగ్గరికి మంచి, మంచి సంకల్పాల యొక్క మాలలు చాలా వస్తున్నాయి. ఇది చేస్తాము, అది చేస్తాము ..... అని. బాప్ దాదా కూడా ఓహో నా పిల్లలు! ఓహో!! అని సంతోషిస్తున్నారు. కానీ చేయటంలో ఎందుకు బలహీనం అయిపోతున్నారు? దీనికి కారణం ఏమిటంటే - బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం. అక్కడక్కడ వాయు మండలం బలహీనంగా కూడా ఉంటుంది, దాని ప్రభావం త్వరగా పడుతుంది. మరలా వారి భాష ఎలా ఉంటుందో చెప్పనా? చాలా మధురమైన భాష ఉంటుంది, ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, అంటారు. అటువంటి సమయంలో ఏ సంకల్పం నడవాలి! ఇది జరుగుతూనే ఉంది, ఇది ఇలా నడుస్తూనే ఉంది. ఈ సంకల్పాలు సోమరితనాన్ని తీసుకువస్తాయి కానీ ఆ సమయంలో భాషని పరివర్తన చేయండి, బాబా యొక్క ఆజ్ఞ ఏమిటి? బాబాకి ఇష్టమైనది ఏమిటి? బాబా ఏ విషయాన్ని ఇష్టపడతారు? బాబా ఇలా చెప్పారా? ఇది చేసారా? ఇలా బాబా జ్ఞాపకం వస్తే సోమరితనం సమాప్తి అయ్యి ఉత్సాహ, ఉల్లాసాలలోకి వస్తారు. సోమరితనం కూడా రకరకాలుగా వస్తుంది. మీరు పరస్పరం క్లాస్ చేసుకోండి, లిస్ట్ తీయండి, ఒకటి - సాధారణమైన సోమరితనం, రెండు - రాయల్ (సూక్ష్మ) సోమరితనం. సోమరితనం అనేది ధృఢతను రానివ్వదు, ధృఢతయే సఫలతకి సాధనం. అందువలనే సంకల్పం వరకు ఉండిపోతుంది కానీ స్వరూపంలోకి రావటం లేదు.
ఈ రోజు ఏమి విన్నారు? ప్రతిజ్ఞను జ్ఞాపకం చేశారు కదా? మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు. ఆ ప్రతిజ్ఞలు విని బాప్ దాదా సంతోషం అయిపోతారు. కానీ ఎంత ప్రతిజ్ఞలు చేస్తున్నారో అంత వాటి లాభం పొందటం లేదు. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, మన నుండి బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో అని అడుగుతున్నారు. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - సమయాని కంటే ముందే అందరు ఎవరెడీ అవ్వండి. సమయం మీకు మాష్టర్‌గా కాకూడదు. మీరు సమయానికి మాష్టర్. అందువలన బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - సమయాని కంటే ముందే సంపన్నంగా అయ్యి విశ్వం యొక్క స్టేజ్ పై బాబాతో పాటు వెనువెంట పిల్లలు కూడా ప్రత్యక్షం అవ్వాలి. మంచిది.
బాప్ దాదా ఒక సెకనులో అశరీరీభవ యొక్క డ్రిల్ (వ్యాయామం) చూడాలనుకుంటున్నారు. అంతిమంలో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్ చాలా అవసరం. అందువలన ఇప్పుడు ఇంత పెద్ద సంఘటనలో కూర్చున్నా ఒక సెకనులో దేహాభిమానానికి అతీతమైన స్థితిలో స్థితులవ్వండి. ఏ ఆకర్షణా ఆకర్షితం చేయకూడదు. మంచిది.
నలువైపుల ఉన్న తీవ్రపురుషార్థి పిల్లలకు, సదా స్వపరివర్తన మరియు విశ్వపరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేషాత్మలకు, సదా బ్రహ్మాబాబా సమానంగా కర్మయోగులుగా అయ్యే ఆత్మలకు, కర్మ యొక్క, కర్మేంద్రియాల యొక్క ఆకర్షణ నుండి ముక్తి అయ్యే ఆత్మలకు, సదా ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో ధృడతను స్వరూపంలోకి తీసుకువచ్చే బాబాకి సమీపమైన మరియు బాబా సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క మనస్సు యొక్క ఆశీర్వాదాలు మరియు మనస్సు యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment