28-11-1997 అవ్యక్త మురళి

          28-11-1997         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బేహద్ సేవకు సాధనం - ఆత్మిక వ్యక్తిత్వం ద్వారా దృష్టితో అద్భుతం చేయాలి.

ఈ రోజు బాప్ దాదా అనేక కల్పాలుగా కలుసుకుంటున్న గారాభమైన, ప్రియమైన పిల్లలను మరలా కలుసుకునేటందుకు వచ్చారు. అవ్యక్త కలయిక అయితే సదా జరుపుకుంటూ ఉంటారు కానీ అవ్యక్తం నుండి వ్యక్తంలో కలుసుకునేటందుకు భారతదేశం నుండి, విదేశాల నుండి పిల్లలందరు తమ ఇంటికి మరలా చేరుకున్నారు. బాప్ దాదా చూస్తున్నారు - నలువైపుల ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో కూడా కలయిక జరుపుకుంటున్నారు. ఈ కలయిక ఆత్మిక అలౌకిక కలయిక. ఈ కలయిక బాప్ దాదా మరియు పిల్లల యొక్క స్నేహానికి సాకార స్వరూపం. 

ఈరోజు బాప్ దాదా తన పిల్లల యొక్క ఆత్మిక వ్యక్తిత్వం చూస్తున్నారు. ప్రతి ఒక బిడ్డ యొక్క ఆత్మిక వ్యక్తిత్వం ఎంత శ్రేష్టమైనది! ఈవిధమైన ఆత్మిక వ్యక్తిత్వం కల్పమంతటిలో ఎవరికీ ఉండదు. ఎందుకంటే మీ అందరికీ వ్యక్తిత్వాన్ని తయారుచేసేవారు ఉన్నతోన్నతమైన తండ్రి, మీ ఆత్మిక వ్యక్తిత్వం గురించి మీకు కూడా తెలుసు కదా! అన్నింటికంటే ఉన్నతోన్నతమైన వ్యక్తిత్వం - స్వప్నం మరియు సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత. మీలో కూడా నెంబరు వారీగా ఉంటారు. కానీ విశ్వంలో ఉన్న సర్వ ఆత్మల కంటే శ్రేష్టమైనవారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో వ్యక్తిత్వం యొక్క మెరుపు చూస్తున్నారు. పవిత్రతతో పాటు వెనువెంట అందరి ముఖం మరియు నడవడికలో ఆత్మీయత యొక్క వ్యక్తిత్వం ఉండాలి. మరొక వ్యక్తిత్వం ఏమిటి? ఖజానాలతో సంపన్నంగా ఉన్నవారికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరు ఎంత సంపన్న ఆత్మలైనా కానీ మీ ముందు ఆ సంపన్న ఆత్మలు కూడా గొప్ప కాదు. ఎందుకంటే వారు కూడా అవినాశి సుఖశాంతి యొక్క ఖజానాతో ఖాళీ. మీ దగ్గర ఏదైతే సంపత్తి ఉందో దాని ముందు, ఎంత కోట్లాధిపతులైనా బాబా నుండి సుఖం, శాంతి అడిగేవారే. కానీ మీరు సదా అవినాశి ఖజానాలతో సంపన్నులు. ఆ ఖజానా ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ మీ ఖజానాను ఎవరూ దొంగలించలేరు, ఎవరూ కదిలించలేరు, తరగని ఖజానా మరియు అఖండ ఖజానా. ఇటువంటి వ్యక్తిత్వం గల పిల్లలు మీరు. ప్రాపంచికంగా అయితే అందరికంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారు కూడా ఆత్మల ద్వారా, వినాశీ ధనం ద్వారా, వినాశీ వృత్తి ద్వారా వ్యక్తిత్వాన్ని తయారుచేసుకుంటారు లేదా పిలవబడతారు. కానీ మిమ్మల్ని ఉన్నతోన్నతమైన పరమాత్మ శ్రేష్టవ్యక్తిత్వం కలిగినవారిగా తయారుచేసారు. కనుక మీ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం యొక్క ఆత్మికనషా ఉంటుందా? ఉంటే కనుక చేతులు ఊపండి. 

ఇంత శ్రేష్ట వ్యక్తిత్వం కలిగినవారిని చూసి బాప్ దాదాకి ఎంత సంతోషంగా ఉంటుంది! మీకు కూడా సంతోషం ఉంటుందా? బాప్ దాదా పిల్లల యొక్క ఇటువంటి శ్రేష్ఠతను చూసి ఏ పాట పాడుతున్నారో తెలుసా? మీరు కూడా పాడుతున్నారు, బాబా కూడా పాడుతున్నారు. బాబా యొక్క పాట వినిపిస్తుందా లేక టేప్ రికార్డర్ లో వచ్చే పాట వినిపిస్తుందా? బాప్ దాదా యొక్క టేప్ రికార్డర్ అతీతమైనది, ఆటోమేటిక్ గా పని చేసేది, ప్రత్యేకించి పెట్టే శ్రమ చేయవలసిన అవసరం లేదు. మనస్సులోని పాటను మనస్సులో ఉన్నవారే వినగలరు, కేవలం చెవులు ఉన్నవారు వినలేరు, మనస్సు ఉన్నవారే వినగలరు. అందరు మనస్సు ఉన్నవారే కదా! దిల్ వాడా మందిరంలో మీ చిత్రం ఉంది కదా? అందరు మీ చిత్రాన్ని చూసుకున్నారా? బాప్ దాదా సదా పిల్లల యొక్క చిత్రం మరియు చరిత్రను చూస్తూ ఉంటారు, ఈ రోజు వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. ఈ వ్యక్తిత్వం సదా స్మృతిలో ప్రత్యక్షంగా ఉండాలి. ఉండనే ఉంటుంది అని కాదు, ఉండాలి మరియు కనిపించాలి, అనుభవంలోకి రావాలి. సదా ఇటువంటి వ్యక్తిత్వంలో ఉండేవారి గుర్తులు ఏమిటి? ఆ గుర్తుల ద్వారా వీరు వ్యక్తిత్వంలో ఉన్నారు అని తెలుస్తుంది. ఈ ఆత్మిక వ్యక్తిత్వం ప్రత్యక్ష రూపంలో ఉంటే వారి నయనాలు, వారి ముఖం, నడవడిక, సంకల్పం మరియు సంబంధం అన్నీ ప్రసన్నంగా ఉంటాయి. సదా ప్రసన్నచిత్ గా ఉంటారు, ప్రశ్నచిత్ గా కాదు. ప్రశ్నచిత్ గా ఉంటే నడవడిక కూడా వ్యక్తిత్వంగా ఉండదు. ముఖంలో కూడా ప్రసన్నత యొక్క మెరుపు కనిపించదు. ఏది ఏమైనా కానీ వ్యక్తిత్వం గలవారి ప్రసన్నత దాగి ఉండదు, గుప్తం అవ్వదు. ప్రసన్నచిత్ ఆత్మ, ఏ ఆత్మ ఎటువంటి అలజడిలో ఉన్నా, అశాంతిగా ఉన్నా తన ప్రసన్న దృష్టితో వారిని ప్రసన్నం చేస్తుంది. బాబా యొక్క మహిమ - "దృష్టితో అద్భుతం చేసేవారు”. ఇది కేవలం బాబా యొక్క మహిమయే కాదు, మీ యొక్క మహిమ కూడా ఇదే. మరియు ఇప్పుడు సమయం ఎంత సమీపంగా వస్తూ ఉందో అంతగా దృష్టితో అద్భుతం చేసే సేవ చేసే సమయం వస్తుంది. 7 రోజుల కోర్స్ చెప్పరు, ఒక దృష్టితోనే ప్రసన్నచిత్ లు అయిపోతారు. వారి మనస్సులోని ఆశ మీ ద్వారా పూర్తి అయిపోతుంది. అందరు ఏమని భావిస్తున్నారు? ఆది సేవారత్నాలు ఏమని భావిస్తున్నారు? ఇలాంటి సేవ చేయగలరు కదా? 

ఇప్పుడు చూడండి మీరందరు 40 సం||లు సేవ చేసారు లేదా ఇంకా ఎక్కువ కూడా చేసి ఉండవచ్చు. కొందరికి 1, 2 సం||లు తక్కువ ఉండవచ్చు. కొంతమందికి ఎక్కువ ఉండవచ్చు. ఇప్పుడు మీరందరు మీ సహయోగులకు ఈ సేవ నేర్పించారు మరియు నిమిత్తంగా కూడా చేసారు. ఇప్పుడు మీరు ఏమి చేస్తారు? ఆ సేవ అయితే వారు కూడా చేస్తున్నారు. ఆది రత్నాలైన మీరు అతీతమైన, ప్రియమైన సేవ చేస్తున్నారు కదా? ఇప్పుడు దృష్టి ద్వారా అద్భుతం ఎంతమంది చేసారో వారికి ఉత్సవం జరుగుతుంది. 9 లక్షలలో ఎంతమందిని తయారుచేసారు? ఇక ముందు అయితే 33 కోట్లు వస్తారు. 9 లక్షలు వారి ముందు చాలా తక్కువ, బీజం అయితే ఇక్కడే వేయాలి కదా? ఇప్పుడు ఆదిరత్నాలు ఏమి అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాను. సేవా కేంద్రాలు తెరిచారు, మంచి, మంచి ప్రోగ్రామ్స్ చేసారు. దీనిలో అద్భుతం చేసి చూపించారు, దీనికైతే శుభాకాంక్షలు. రెండు రకాలైన పిల్లలు ఉన్నారు, మొదటి వారు స్థాపనకి నిమిత్తమైన పిల్లలు, మరియు మీరు విశేష సేవకి ఆది పిల్లలు, వీరు (దాదీలు) జీజాన్ని నాటేవారు, మరియు మీరు (సేవ యొక్క ఆదిరత్నాలు) మొట్టమొదటి కాండం. కాండం గట్టిగా ఉంటుంది కదా! కాండం పైనే మొత్తం ఆధారపడి ఉంటుంది. కాండం నుండే అన్ని శాఖలు వస్తాయి. బీజం నాటినవారు సూక్ష్మంగా శక్తి ఇస్తారు. కానీ ప్రత్యక్షంగా కనిపించేది కాండమే. దాదీలు ఇప్పుడు గుప్తం అయిపోయారు, శక్తి ఇస్తున్నారు. మరియు ప్రత్యక్షంలో స్టేజ్ పైకి రావడానికి మీరు నిమిత్తం అయ్యారు. (సమారోహానికి వచ్చిన పెద్ద అన్నయ్యలు, పెద్ద అక్కయ్యలతో బాప్ దాదా చేతులు ఎత్తించారు) అందువలనే బాబా పని ఇస్తున్నారు. సమారోహం చాలా మంచిగా జరుపుకున్నారు కదా! బాప్ దాదా అన్నీ చూసారు. అలంకరించండి ఉన్న మూర్తులను చూసారు. ఆ సమయంలో కూడా మీ అందరికీ ఇదే అనుభవం అవుతుంది కదా మేము చైతన్యమూర్తులం అని. అలకరించబడిన మూర్తులు మందిరం నుండి శాంతివనం చేరుకున్నట్లు ఉంది. బాప్ దాదా ఇప్పుడు పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - ఇప్పుడు తీవ్రమైన సేవ ప్రారంభించండి అని. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది చాలా మంచిది. ఇప్పుడు సమయప్రమాణంగా ఇతరులకు వాణీ యొక్క అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైక్ గా తయారు చేయండి. మీరు మైట్ (శక్తి) అయ్యి శక్తి ఇవ్వండి. అప్పుడే 9 లక్షలు స్వతహాగా తయారవుతారు. ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్ లో కూర్చున్నారో, ఇంకా ఎవరైతే మహారథీలు ఉన్నారో ఇప్పుడు వారందరి సేవ ఇదే - కేవలం శక్తిని ఇవ్వాలి. బేహద్ సేవ యొక్క మైదానంలోకి రావాలి. బాబా ఎలాగైతే అవ్యక్తవతనంలో ఒకే చోట కూర్చుని నలువైపుల పిల్లలను పాలన చేస్తున్నారో అదేవిధంగా పిల్లలు కూడా బాబా సమానంగా ఒకే చోట ఉంటూ బేహద్ సేవ చేయలేరా? ఆదిరత్నాలు అంటే తండ్రిని అనుసరించేవారు. బేహద్ లో శక్తిని ఇవ్వండి. కొంతమంది పిల్లలు తమలో తాము మరియు పరస్పరంలో కూడా ఇదే అడుగుతున్నారు - బేహద్ వైరాగ్యం ఎలా వస్తుంది? అని. కనిపించటం లేదు కానీ బేహద్ సేవలో బిజీగా ఉంటే బేహద్ వైరాగ్యం స్వతహాగానే వస్తుంది. ఎందుకంటే శక్తి ఇచ్చే సేవ నిరంతరం చేయవచ్చు. దీనిలో ఆరోగ్యం యొక్క విషయం , సమయం యొక్క విషయం - అన్నీ సహజం అయిపోతాయి. రాత్రి, పగలు ఈ బేహద్ సేవలో ఉండవచ్చు. బ్రహ్మాబాబాని చూసారు కదా - రాత్రి కూడా కళ్ళు తెరుచుకునే ఉండేవి, బేహద్ శక్తిని ఇచ్చే సేవ చేస్తూ ఉండేవారు. బేహద్ సేవ ఎంత బిజీ చేస్తుందంటే బేహద్ వైరాగ్యం స్వతహాగా మనస్సుతో వస్తుంది. ప్రోగ్రామ్ లో కాదు. ఇది చేయాలి, అది చేయాలి - ఈ ప్లాన్ తయారుచేస్తున్నారు, కానీ బేహద్ సేవలో ఉండటం అనేది అన్నింటికంటే సహజసాధనం. ఎందుకంటే బేహద్ గా శక్తి ఇస్తూ ఉంటే సమీపంగా ఉన్నవారు స్వతహాగానే శక్తి పొందుతారు. బేహద్ శక్తి ఇవ్వటం ద్వారా వాయుమండలం స్వతహాగానే తయారవుతుంది. ఇది ఈ సెంటర్ యొక్క భాధ్యత, ఈ జోన్ యొక్క భాధ్యత అని అనుకోవటం కాదు మీరందరు ఒక దేశానికి రాజుగా అవ్వాలా లేక విశ్వానికి రాజుగా అవ్వాలా? ఎలా అవ్వాలా? ఆదిరత్నాలు కనుక విశ్వానికి శక్తి ఇచ్చేవారు అవ్వండి. మాకు 20 సెంటర్స్, 30 సెంటర్స్, లేక 200 సెంటర్స్ కి లేక ఒక జోన్ కి ఆధారం ఇవి బుద్దిలో ఉండకూడదు ఎందుకంటే ఇది కాండం యొక్క పని కాదు. ఈ పని కొమ్మలు, రెమ్మలు వారు కూడా చేస్తారు. మీరయితే కాండం కదా! కాండం నుండే అందరికీ శక్తి మీరందరు ఇదే ఆలోచిస్తున్నారు. బేహద్ వైరాగ్యం రావాలి అని. ఇది చాలా మంచిది, ఇప్పుడు వినాశనం అయిపోతుంది, కానీ 9 లక్షలు కూడా తయారుకాలేదు, సత్యయుగం ఆది ఆత్మలే తయారుకాకుండా వినాశనం అయిపోతే సత్యయుగంలోకి ఎవరు వస్తారు? 2-3 వేల పైన రాజ్యం చేస్తారా? 4-5 లక్షలపై రాజ్యం చేస్తారా? అందువలన ఇప్పుడు బేహద్ సేవ ప్రారంభించండి. పాండవులు ఏమని భావిస్తున్నారు? బేహద్ సేవ చేస్తారు కదా? పాండవులు తయారేనా? బేహద్ లోకి వెళ్ళటం ద్వారా హద్దు యొక్క విషయాలు స్వతహాగానే తొలగిపోతాయి. విడిపించుకోవటం ద్వారా తొలగవు. బేహద్ శక్తి ద్వారా తొలగించుకోవటం ఇది తీవ్రమైన సేవ యొక్క ఫలితం. 

బాప్ దాదాకి తెలుసు నాజూకు పరిస్థితులలో కూడా నిమిత్తమైన ఆత్మలు సేవ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ చూపించారు. కానీ మీ అందరి పునాది లేక సెకను పరివర్తన యొక్క మూల అనుభవం ఇదే - బ్రహ్మాబాబాని చూసారు, బ్రాహ్మణులుగా అయిపోయారు. సేవ యొక్క వరదానం లభించింది, మరియు సేవలో నిమగ్నం అయిపోయారు. బాప్ దాదా అందరి అనుభవం కూడా విన్నారు. మంచి అనుభవాలు విన్నారు. మీ అందరి అనుభవం ఏమిటంటే బ్రహ్మాబాబాని చూసారు, ఆలోచించను కూడా ఆలోచించలేదు. సహిస్తున్నాము అని సహనంగా కూడా అనిపించలేదు, పెద్ద విషయంగా అనిపించలేదు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక బ్రాహ్మణ ఆత్మలో బ్రహ్మాబాబాని చూడాలి. ఇదే సేవ యొక్క తీవ్రతకు సాధనం. బ్రహ్మాబాబా మీకు ఏమైనా కోర్స్ చెప్పారా? కోర్స్ తర్వాత చెప్పారు కానీ మొదట చూడగానే బాబా పిల్లలు అయిపోయారు. బ్రహ్మాబాబాలో బాబా ఉన్నారు కనుక శ్రమ అనిపించలేదు. అలాగే మీరందరు కూడా బాప్ దాదాను మీలో నింపుకుని దృష్టి ద్వారా అద్భుతం చేయండి. మీ అందరికీ ఇది అనుభవమే, అనుభవీలే కదా! చూసారు, బాబా అయిపోయారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరలా ట్రైల్ కి వస్తారు. ఆ తర్వాత కొంతమంది ఉంటున్నారు. కొంతమంది వెళ్ళిపోతున్నారు. మీరు ఇంత శ్రమను తీసుకున్నారా? ట్రైనింగ్ పొందారా? ట్రైల్ కి వచ్చారా? వచ్చారు మరియు అర్పణ అయిపోయారు. ఇలాంటి సేవ బ్రహ్మాబాబా ఒక్కరే చేయగలిగారు మరి మీరందరూ చేయలేరా? మీ వ్యక్తిత్వాన్ని మీరు తయారుచేసుకోండి. బ్రహ్మాబాబాకి వ్యక్తిత్వం ఉండేది కదా! ముఖంలో అయినా లేక నడవడికలో అయినా వ్యక్తిత్వం ఉండేది అందుకే ఆకర్షితం అయ్యారు. కనుక బాబాని ఫాలోచేయండి. బాబా ఆదిలో మిమ్మల్ని నిమిత్తం చేసారు. ఆదిలో సేవకి, స్థాపనకి నిమిత్తమైన మీరు అంతిమం వరకు సేవలోనే ఉండాలి. ఆరోగ్యపరంగా శరీరంతో తిరగలేకపోయినా కానీ మనస్సుతో తిరగగలరు కదా? దీనిలో ఖర్చు కూడా ఉండదు, వీసా తీసుకోవలసి పనిలేదు, పరుగుపెట్టవలసిన అవసరం కూడా ఉండదు. పడుకుని కూడా చేయవచ్చు. ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి ప్లాన్ ఏదైనా తయారుచేయండి. కొత్త పాఠం ప్రారంభించండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే చేసారు. సేవకి ప్రత్యక్షఫలం లభించింది, ఇప్పుడు కొత్త సేవ ప్రారంభించండి. 

బాప్ దాదా కేవలం ఎదురుగా కూర్చున్నవారికే కాదు, అందరికీ చెప్తున్నారు. విదేశాలలో వినేవారికి కూడా చెప్తున్నారు. ఎక్కడ వింటున్నా, శాంతివనంలో వింటున్నా, పైన పాండవభవనంలో వింటున్నా, విదేశంలో వింటున్నా అందరికీ బాప్ దాదా చెప్తున్నారు - ఇప్పుడు బేహద్ సేవాధారి అవ్వండి. బేహద్ సేవలో సమయం ఉపయోగించండి. బేహద్ సేవలో సమయం ఉపయోగించటం ద్వారా సమస్యలు స్వతహాగానే తొలగిపోతాయి. ఎందుకంటే అజ్ఞాని ఆత్మలైనా, జ్ఞాని ఆత్మలైనా సమయాన్ని సమస్యలలో ఉపయోగిస్తున్నారు. ఇతరులు సమయం తీసుకుంటున్నారు అంటే వారు బలహీన ఆత్మలు, వారికి శక్తి లేదు అని రుజువు అవుతుంది. ఎవరికైతే శక్తి లేదో, కుంటిగా ఉన్నవారిని మీరు పరుగు పెట్టమంటే వారు పరుగుపెట్టగలరా లేక పడిపోతారా? బ్రాహ్మణ ఆత్మ అయినా కానీ సమస్యకి వశమై శక్తి లేకపోతే ఆ సమయంలో బలహీన ఆత్మయే అప్పుడు ఎక్కడినుండి శక్తి తీసుకుంటుంది? స్వయంగా బాబా నుండి శక్తి తీసుకోలేదు. ఎందుకంటే బలహీన ఆత్మ, కనుక ఏమి చేస్తారు? బలహీన ఆత్మకి వేరేవారి రక్తాన్ని ఎక్కించి శక్తినిస్తారు. ఏదైనా శక్తిశాలి ఇంజక్షన్ చేసి శక్తి ఇస్తారు. అలాగే మీరు కూడా శక్తుల యొక్క గుణాల యొక్క సహయోగం ఇవ్వండి. వారిలో లేనే లేదు కనుక మీది ఇవ్వండి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా - దాత అవ్వండి అని. వారు అనమర్థులు వారికి సమర్థతను ఇవ్వండి. గుణాలు, శక్తులను సహయోగంమివ్వటం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలు అనేవి లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి. అప్పుడు మీ పురుషార్ధానికి సమయం ఉపయోగించవలసిన అవసరం కూడా ఉండదు. ఆశీర్వాదాల రాకెట్ లో ఎగిరి వెళ్ళిపోతారు. పురుషార్ధం యొక్క శ్రమకి బదులు సంగమయుగ ప్రాప్తులను అనుభవం చేసుకుంటారు. ఆశీర్వాదాలు తీసుకోవటం నేర్చుకోండి మరియు నేర్పించండి. మీ సహజ ధ్యాస మరియు ఆశీర్వాదాలు, ధ్యాస కూడా ఒత్తిడిగా మారిపోకూడదు, సహజంగా ఉండాలి. జ్ఞానమనే దర్పణం సదా ఎదురుగా ఉండనే ఉంది. దీనిలో స్వతహాగానే సహజంగా మీ చిత్రం కనిపిస్తూనే ఉంటుంది. అందువలనే వ్యక్తిత్వానికి గుర్తు - ప్రసన్నత అని చెప్పాను. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా ఇలాంటి ఏ, ఏ అనే భాషను సమాప్తి చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండటం మరియు ప్రసన్నంగా చేయటమే ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం. ఎవరు ఎలా ఉన్నా కానీ మీ మనస్సు నుండి ప్రతి ఆత్మ పట్ల ఆశీర్వాదాలు రావాలి - వీరికి కూడా కళ్యాణం జరగాలి అని. వీరి బుద్ది కూడా శాంతి అవ్వాలి అని. వీరు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు ఇలా కాదు, అందరు మంచిగా ఉండాలి. ఆశీర్వాదాలు ఇవ్వటం వస్తుందా? ఆశీర్వాదాలు తీసుకోవటం వస్తుంది కానీ ఇవ్వటం వస్తుందా? ఇవ్వకపోతే తీసుకునేది ఎలా? ఇవ్వండి మరియు తీసుకోండి. వీరు చేయాలి అని అనుకోకూడదు, నేను చేయాలి అని అనుకోవాలి. బ్రహ్మాబాబా యొక్క ఒక స్లోగన్ ఉంది, బ్రహ్మాబాబా మాటిమాటికి అనేవారు - "ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు” అని. ఇతరులు చేస్తే నేను చేస్తాను అనేది స్లోగన్ కాదు. నేను ఏది చేస్తే నన్ను చూసి అందరూ చేస్తారు, లేకపోతే స్లోగన్ మార్చేయండి. జగదంబ సరస్వతి యొక్క విశేష స్లోగన్ - యజమాని యొక్క ఆజ్ఞ నన్ను నడిపిస్తుంది, మేము నిమిత్తంగా నడుస్తున్నాము. ఈ రెండు సూక్తులను సదా ప్రత్యక్షంగా స్మ్మతిలో ఉంచుకోండి. అవును, వింటున్నాము, గుర్తు ఉంటుంది.... అని అనటం కాదు, కర్మలో కనిపించాలి. అయితే ఏమి చేస్తారు? ఆశీర్వాదాలు తీసుకుని ఆశీర్వాదాలు ఇస్తారా లేక గ్లాని చేస్తే ఫీల్ అవుతారా? వీరు ఇలా, వారు అలా అని అనకండి, వారికి కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి. వారు బలహీనులు మరియు వశీభూతం అయ్యి ఉన్నారు. భాషను మరియు సంకల్పాన్ని మార్చండి. వీరు మారరు అని సంకల్పమాత్రంగా కూడా ఉండకూడదు. నేను మారాలి అనుకోవాలి. ఇతర విషయాలలో అయితే నేను, నేను అని వస్తుంది కానీ ఈ విషయంలో నేను అని రావాలి. ఆ విషయాలలో అయితే వారు చేస్తే నేను చేస్తాను అని అనుకుంటారా ఏమిటి? మంచి పని అయితే నేను అంటారు. ఇలాంటి పని అయితే వీరు చేసారు, వారు అన్నారు అని అంటారు. వ్యతిరేకత అయ్యింది కదా? ఎవరు ఏమి చేసినా కానీ నేను ఏమి చేయాలి, నేను ఏమి ఆలోచించాలి, నేను ఏమి చెప్పాలి అని ఈ విషయంలో నేను అనే భావాన్ని తీసుకురండి. దేహాభిమానంతో కూడిన నేను కాదు, సేవాభావంతో నేను అనాలి. ఇలా శ్రేష్ఠ తరంగాలను వ్యాపింపచేయండి. ఇప్పుడు వాచా యొక్క ఉపయోగం తక్కువ, మనస్సు యొక్క సహయోగం, మనస్సు యొక్క తరంగాలు త్వరగా పని చేస్తాయి. ఇది చేయగలనా? 

చేయగలిగినప్పుడు శుభకార్యానికి ఆలశ్యం ఎందుకు? ఇప్పటి నుండే జరుగుతుందా? పాండవులు చెప్పండి? మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోకూడదు. అక్కడికి వెళ్ళి బాప్ దాదా అయితే చెప్తారు, సాకారంలో ఉన్నది మేము, బాప్ దాదాకి ఏమి తెలుసు, ఏమి అవుతుందో... అని అనకండి. మాతలు ఏమంటారు? బాప్ దాదాకి పిల్లలను సంభాళించమని చెప్తే తెలుస్తుంది అనుకుంటున్నారా, ఇలా ఆలోచిస్తున్నారా? బాప్ దాదా పెద్దవారైన మిమ్మల్నే సంభాళిస్తున్నారు, పిల్లలను సంభాళించటం పెద్దపనా? అక్కడికి వెళ్ళి మారిపోకండి. మీకు పాట ఒకటి ఉంది కదా - ప్రపంచం మారిపోయినా కానీ మేము మారము అని. ఈ పాట గట్టిగా ఉందా? నిజమేనా? అయితే చేతులు ఎత్తండి? తర్వాత మీకు 21వ శతాబ్దపు కాన్ఫెరెన్స్ కదా! అప్పటికి ప్రత్యక్షంలోకి వచ్చేస్తుంది కదా. సరేనా! సృష్టి అంతటికీ ప్రత్యక్ష పటాన్ని చూపించండి. ఇలా అవుతాం, అలా అవుతాం అని కాదు, అయిపోయాము అనాలి. ఉదాహరణకి మీరు నిందని లేదా అలజడిని సహించారనుకోండి, సహించటమే కాదు, ఇముడ్చుకున్నారు కూడా. మీరు సహించటం, ఇముడ్చుకోవటం అంటే మీ కోసం మీ రాజధానిని నిశ్చితం చేసుకోవటం. మీకు వచ్చిన నష్టం ఏమిటి? లాభమే అయ్యింది కదా! చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. విషయం ఎంత పెద్దది అయినా కానీ మీరు సహించారు, ఇముడ్చుకున్నారంటే మీ రాజధాని తయారైపోయింది అనే స్టాంప్ పడిపోయింది, అంటే అది నష్టమా లేక లాభం అయ్యిందా? 

ఇప్పుడు ఈ సీజన్లో బాప్ దాదా నలువైపుల స్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రతి సీజన్లో ఇవే విషయాలు వినటం మంచిగా అనిపించటం లేదు. అవే కథలు, కథలు, కథలు...... బాప్ దాదా కూడా పిల్లలను ప్రశ్నిస్తున్నారు - ఈ విషయాలు కూడా ఎప్పటివరకు? లేకపోతే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు కావాలి అని సమయం అడగండి. ఈ తారీఖుని కూడా నిర్ణయించండి. ఫంక్షన్ యొక్క తారీఖు అయితే త్వరగా నిర్ణయం చేసేసారు, ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క తారీఖు ఏమిటి? 

అందరూ దూరదూరాల నుండి ప్రేమతో వచ్చారు. బాప్ దాదా విదేశీయులను కూడా చూస్తున్నారు. రకరకాల సమయం అయినా కానీ చాలా ప్రేమతో సమయం ఇచ్చి వింటున్నారు. (విదేశంలో 200 స్థానాలలో శాటిలైట్ ద్వారా మురళి వింటున్నారు) చూడండి, ఇది కూడా తీవ్ర వేగం కదా! ఇక్కడి ధ్వని విదేశాలలో 200 స్థానాలకు చేరుతుంది. ఇది కూడా ధ్వని యొక్క వేగం కదా! ఇది కూడా ఆవిష్కరణ కదా! మరి మీ శాంతిశక్తిని తీవ్రం చేసుకోలేరా? విజ్ఞానం భారతదేశం యొక్క ధ్వనిని విదేశాల వరకు చేరుస్తుంది, మరి మీ శాంతిశక్తి ద్వారా మనస్సు యొక్క శుభభావనలు ఇతర ఆత్మల వరకు చేర్చలేరా? చేర్చగలరు కదా? లేకపోతే సైన్స్ ముందుకు వెళ్ళిపోతుంది, సైలెన్స్ పవర్ తక్కువ అయిపోతుంది. అందువలన ఇప్పుడు శాంతిశక్తిని ప్రత్యక్షం చేయండి. అందరిలో ఉంది. నాలో శాంతిశక్తి లేదు అని ఒక బ్రాహ్మణ ఆత్మ కూడా అనదు, ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? ఇంతమంది బ్రాహ్మణుల శక్తి చేయలేనిది ఏమి ఉంది? అందరిలో శాంతిశక్తి ఉందా? ఇప్పుడు ఒక నిమిషంలో మీ శాంతిశక్తిని ప్రత్యక్షం చేయండి. ఒక్కసారిగా మనస్సు ద్వారా, తనువు ద్వారా ప్రత్యక్షం చేయండి. (బాప్ దాదా పూర్తి శాంతి యొక్క డ్రిల్ చేయించారు) మంచిది! 

నలువైపుల ఉన్నటువంటి సర్వ విశేష ఆత్మలకి, సదా ఆత్మిక వ్యక్తిత్వం యొక్క నషాలో ఉండేవారికి, సదా బేహద్ సేవలో స్వయాన్ని నిమిత్తంగా చేసుకునే విశ్వకళ్యాణకారి ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా మరియు జగదంబ యొక్క స్లోగన్స్ సాకారంలో తీసుకువచ్చేవారికి, ఉన్నతోన్నతమైన దృష్టి ద్వారా అద్భుతం చేసే సేవ చేసే బాబా సమాన ఆత్మలకు బాప్ దాదా మరియు జగదంబ తల్లి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments