27-02-1996 అవ్యక్త మురళి

        27-02-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యత యొక్క పునాది పవిత్రత మరియు దానికి గుర్తు - నడవడిక లేదా ముఖకవళికల్లో దివ్యత.

ఈరోజు సత్యమైన తండ్రి, టీచర్, సద్గురువు తన యొక్క నలువైపుల ఉన్న సత్యత యొక్క శక్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. సత్యతకి పునాది పవిత్రత. సత్యతకి ప్రత్యక్ష ఋజువు ముఖంలో మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. ప్రపంచంలో అనేక ఆత్మలు తమని తాము సత్యవాదిగా భావిస్తారు. కానీ పవిత్రత ఆధారంగానే సంపూర్ణ సత్యత ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండదు. మీ అందరి పునాది ఏమిటి? పవిత్రత. పవిత్రత ఆధారంగానే సత్యత యొక్క స్వరూపం స్వతహాగా మరియు సహజంగా సదా ఉంటుంది. కేవలం సత్యం మాట్లాడటం, చేయడాన్ని సత్యత అని అనరు. కానీ అన్నింటికంటే మొదటి సత్యం, దీని ద్వారానే మీకు పవిత్రత యొక్క లేదా సత్యతాశక్తి వచ్చింది, ఆ మొదటి విషయం - మీ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు. నేను ఆత్మను అనే ఈ సత్యస్వరూపం ఇంతకు ముందు తెలియదు. కానీ మొదటి మీ స్వరూపం యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు. నేను ఫలానా, ఫలానా అని దేహాభిమానం లెక్కతో అనుకుంటే అది సత్యస్వరూపమా? సత్య స్వరూపం అంటే మొదట స్వస్వరూపం మరియు బాబా యొక్క సత్య పరిచయాన్ని తెలుసుకున్నారు. మీ సత్య స్వరూపం మరియు బాబా యొక్క సత్యపరిచయాన్ని బాగా తెలుసుకున్నారా? మూడవవిషయం - సృష్టిచక్రాన్ని కూడా సత్యంగా తెలుసుకున్నారు. ఈ చక్రం ఏమిటి మరియు దీనిలో నా పాత్ర ఏమిటి? అని మీ పాత్ర గురించి స్పష్టంగా తెలుసుకున్నారా? మీ పాత్ర బావుంది కదా? అన్నింటికంటే సంగమయుగంలోనే మంచి పాత్ర ఉంటుంది. కానీ దేవాత్మలైన మీ యొక్క పాత్ర కూడా విశ్వంలోని, చక్రంలోని ఆత్మలు అందరికంటే శ్రేష్టమైనది. ధర్మాత్మలు, మహాన్ ఆత్మలు కూడా పాత్ర అభినయిస్తారు. కానీ వారు ఆత్మ మరియు శరీరం రెండింటితో పవిత్రంగా ఉండరు. కానీ దేవాత్మలైన మీ శరీరం మరియు ఆత్మ రెండూ పవిత్రంగా ఉంటాయి. మొత్తం కల్పంలో ఇక ఏ ఆత్మ ఇలా ఉండదు. అంటే పవిత్రత యొక్క పునాది మీకు తప్ప ఇక ఏ ఆత్మకి శ్రేష్టంగా ఉండదు. మీకు దేవాత్మ యొక్క పాత్ర జ్ఞాపకం ఉందా? పాండవులకి జ్ఞాపకం ఉందా? దేవాత్మలకు పవిత్రత సహజ రూపంలో ఉంటుంది. మహాన్ ఆత్మలు, ఆత్మలు పవిత్రంగా అవుతారు కానీ చాలా పురుషార్ధంతో పవిత్రంగా అవుతారు. కానీ అది సహజంగా ఉండదు. సంస్కారంగా ఉండదు. కానీ అక్కడ ఏ పురుషార్థం ఉండదు. ఇక్కడ చేసిన పురుషార్థం ద్వారా అక్కడ సహజం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అపవిత్రత యొక్క నామరూపాలు ఉండవు. అపవిత్రత కూడా ఉంటుంది అనేది తెలియదు. అందువలన మీ పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం దేవత అంటే దివ్యత. ఈ ప్రపంచంలో వారు ఎంతగా తమని తాము సత్యవాదిగా భావించినా కానీ వారికి అసలు స్వస్వరూపం యొక్క సత్యమే తెలియదు. బాబా యొక్క సత్య పరిచయం కూడా తెలియదు. అందువలన వారిని సంపూర్ణ సత్యస్వరూపులు అనరు. మీలో కూడా సత్యతాశక్తి సదా ఎప్పుడుంటుందంటే స్వయం యొక్క మరియు బాబా యొక్క సత్యస్వరూపం స్మృతిలో ఉన్నప్పుడే ఉంటుంది. మరియు స్వతహాగానే ప్రతి సంకల్పం కూడా సత్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మరిచిపోతున్నారు, దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. అందువలన సదా సంకల్పం సత్యత మరియు పవిత్రత యొక్క శక్తితో శక్తిశాలిగా ఉండటం లేదు. సదా సత్యంగా ఉంటుందా లేక వ్యర్థం కూడా ఉంటుందా? వ్యర్థాన్ని సత్యం అంటారా? అబద్దం మాట్లాడలేదు కదా అయితే సత్యం ఎందుకు అవ్వదు? నేను ఎప్పుడు అసత్యం మాట్లాడను, సదా సత్యమే మాట్లాడతాను అని అనుకున్నా కానీ సత్యత యొక్క పరిశీలన - సంకల్పం, మాట, కర్మ, సంబంధ, సంపర్కాలు అన్నింటిలో దివ్యత అనుభవం అవుతుంది. మాట సత్యంగానే ఉండవచ్చు, కానీ దివ్యత లేదు. నేను సత్యం మాట్లాడతాను, మాట్లాడతాను అని అనేకసార్లు అంటారు. మీరు సత్యమే కానీ మాటలో, కర్మలో దివ్యత లేకపోతే ఇతరులకి మీ సత్యం, సత్యంగా అనిపించదు. వీరు తమని తాము ఋజువు చేసుకుంటున్నారు అని అనుకుంటారు కానీ ఇది సత్యం అని అనిపించదు. సత్యం ఋజువు అవ్వడానికి ఋజువు చేయవలసిన పని లేదు. ఒకవేళ మీరు మొండిగా సత్యాన్ని ఋజువు చేస్తే అది దివ్యతగా కనిపించదు. ఇది సాధారణత. ఇలా ప్రపంచంలో వారు కూడా చేస్తున్నారు. బాప్ దాదా సత్యానికి గుర్తుగా ఒక స్లోగన్ చెప్తున్నారు. సాకార బ్రహ్మ ద్వారా కూడా విన్నారు. సత్యంగా ఉండేవారు ఎలా కనిపిస్తారు. సత్యంగా ఉండేవారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. కానీ మీరు మొండిగా రుజువు చేసినప్పుడు మీ ముఖం లేదా ఇతరుల ముఖం సంతోషంగా కనిపించదు. కొంచెం ఆలోచిస్తున్నట్లు మరియు కొంచెం ఉదాసీనంగా కనిపిస్తుంది. నాట్యం చేసే విధంగా ఉండదు. సత్యమైన వారు సంతోషంతో నాట్యం చేస్తారు. రేయింబవళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు. ఒకవేళ కొంచెం అయినా సత్యంలో అసత్యం కలిస్తే ఆ సమయంలో జీవితంలో రేయింబవళ్ళు బావుంటాయి. ఒకవేళ కొంచెం అయినా సత్యంలో అసత్యం కలిస్తే ఆ సమయంలో జీవితం అంత బాగా అనిపించదు. సత్యత అంటే సత్య స్వరూపంలో స్థితులై సంకల్పం, మాట, కర్మ చేయాలి. 

ఈనాటి ప్రపంచంలోని వారు అంటారు - ఈ రోజుల్లో సత్యంగా నడవటం కష్టం, అసత్యం మాట్లాడవలిసే ఉంటుంది అని. కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితులలో బ్రాహ్మణాత్మలు కూడా నోటితో పైకి అనటం లేదు కానీ అక్కడక్కడ చతురంగా నడవవలసిందే అని అనుకుంటున్నారు. అసత్యం అని అనరు కానీ చతురత అంటారు. అయితే ఆ చతురత ఏమిటి? ఇలా చేయవలసి వస్తుంది అని అంటున్నారు. వారు స్పష్టంగా అంటున్నారు. బ్రాహ్మణులు రాయల్ భాషలో అంటున్నారు. మరలా అంటున్నారు - ఇది నా భావం కాదు, నా భావన కాదు, కానీ చేయవలసి వస్తుంది, అలా నడవవలసి వస్తుంది. కానీ సాకారంలో బ్రహ్మాబాబాని చూసారు కదా! సాకారుడే కదా, నిరాకారుడి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు, శివబాబా అయితే నిరాకారుడు, మజాగా పైన కూర్చున్నారు, ఆయన కూడా క్రిందకి వస్తే తెలుస్తుంది అని అంటారు కానీ బ్రహ్మాబాబా అయితే సాకార స్వరూపంలో మీ అందరితో పాటూ ఉన్నారు కదా! విద్యార్థిగా కూడా ఉన్నారు మరియు సత్యత లేదా పవిత్రత గురించి ఎంత వ్యతిరేకత జరిగింది. అయితే అప్పుడు చతురతతో ఉన్నారా? మీరు డైరక్టుగా, పవిత్రంగా ఉండండి అని చెప్పకండి. కొంచెం కొంచెం ఉండండి అని చెప్పండి అని ఇతరులు సలహా ఇచ్చారు అయినా కానీ బ్రహ్మాబాబా భయపడ్డారా? సత్యతా శక్తి ధారణ చేయడంలో సహనశక్తి కూడా అవసరం. సహించవలసి వస్తుంది, ఒంగవలసి వస్తుంది, ఓటమి అంగీకరించవలసి వస్తుంది. కానీ అది ఓటమి కాదు. ఆ సమయానికి ఓటమిలా అనిపిస్తుంది కానీ అది సదాకాలిక విజయం . 

సత్యతా శక్తితోనే ఈ రోజు వజ్రోత్సవం జరుపుకుంటున్నారు. పవిత్రత మరియు సత్యత లేకపోతే ఈ రోజు మీ ముఖంలో, నడవడికలో ఏదైతే దివ్యత అనుభవం అవ్వాలో అది అనుభవం అవ్వదు. కాలిబలంవారైనా కానీ, నెంబర్ వారీగా ఉండవల్సిందే. మహారథీ అంటే పేరుకి మహారథీగా ఉండటం కాదు, సత్యతాశక్తితో నడిచే మహారథీలే సత్యమైన మహారథీలు. పరిస్థితిని చూసి సత్యతను కొంచెం కూడా వదలకూడదు. కొందరు అంటున్నారు. ఏమీ చేయలేదు. కానీ ఒకటి, రెండు మాటలు మాట్లాడేసాము, మనస్పూర్వకంగా అనలేదు. బయటికి అలా అన్నాము అంతే అని అంటారు. కానీ ఇది కూడా సంపూర్ణ సత్యత కాదు. సత్యత గురించి ఎంత సహించవలసి వచ్చినా అది సహించటం కాదు. బయటికి మేము చాలా సహిస్తున్నాము అని అనిపించినా కానీ అది సహనశక్తి రూపంలో మీ ఖాతాలో జమ అయిపోతుంది. కొంచెం అయినా కానీ సహించటంలో బలహీనంగా ఉంటే వారు తప్పనిసరిగా అసత్యం వారి సహాయం తీసుకోవలసి వస్తుంది. వారి సహాయం అందింది, సరైపోయింది అని ఆ సమయంలో అనిపిస్తుంది. కానీ వారి ఖాతాలో సహనశక్తి జమ అవ్వదు. మేము చాలా మంచిగా నడుస్తున్నాము. మాకు చాలా చతురత వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ స్వయం యొక్క ఖాతా చూసుకుంటే జమా ఖాతా చాలా తక్కువగా ఉంటుంది. అందువలన చతురతతో నడవకండి. ఒకరిని చూసి ఒకరు కాపీ చేస్తున్నారు. వీరు ఇలా నడుస్తున్నారు కదా! అందువలన వీరికి చాలా పేరు వచ్చేసింది, చాలా ముందుకు వెళ్ళిపోయారు. కానీ మేము సత్యంగా నడుస్తున్నాము కనుక వెనుక ఉండిపోయాము అని అనుకుంటున్నారు. కానీ అది వెనుక ఉండటం కాదు. ముందుకు వెళ్ళటం. బాబా దృష్టిలో మున్ముందుకి వెళ్తున్నారు. ఇతరులకి వెనుక ఉన్నట్లు కనిపించినా కానీ మీకు పని ఎవరితో ఉంది? బాబాతో ఉందా? లేక ఆత్మలతో ఉందా? (బాబాతో) అయితే బాబా హృదయంలో ముందుకు వెళ్ళటం అంటే మొత్తం కల్పం యొక్క ప్రాలబ్దంలో ముందుకు వెళ్ళటం. ఒకవేళ ఇక్కడ ముందుకు వెళ్ళటంలో ఆత్మలని కాపీ చేస్తే ఆ సమయంలో పేరు, గౌరవం వస్తుంది, ఉపన్యాసం చెప్పేవారి జాబితాలో ఉంటారు, సెంటర్ సంభాళించే జాబితాలో ఉంటారు కానీ మొత్తం కల్పం యొక్క ప్రాలబ్దం ఉండదు. దీనినే బాప్ దాదా అంటారు - శ్రమ చేసారు, బీజం వేసారు, వృక్షాన్ని పెద్దది చేసారు, ఫలం కూడా వచ్చింది. కానీ పచ్చి ఫలం తినేసారు అంటే సదాకాలిక ప్రాలబ్దం అనే ఫలం సమాప్తి అయిపోయింది. అల్పకాలిక పేరు, గౌరవం కోసం ఒకరినొకరు కాపీ చేయకండి. ఇక్కడ పేరు లేకపోయినా కానీ బాప్ దాదా హృదయంలో మీ పేరు మొదటి నెంబర్ లో ఉంటుంది. అందువలన డైమండ్ గా అవ్వాలంటే ఇవన్నీ పరిశీలించుకోండి. కొంచెం కూడా రాయల్ రూపం యొక్క మచ్చ వజ్రంలో దాగి ఉండకూడదు. సత్యతాశక్తితో దివ్యతను ధారణ చేయండి. ఎంత సహించాల్సి వచ్చినా భయపడకండి. సమయానుసారంగా సత్యత దానంతట అదే ఋజువు అయిపోతుంది. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు అని అంటారు కదా! చివరికి ఒడ్డుకి చేరుకుంటుంది. అందువలన నిర్భయులుగా అవ్వండి. ఎక్కడైనా ఎదుర్కోనవలసి వస్తే బ్రహ్మాబాబా జీవితాన్ని ఎదురుగా పెట్టుకోండి. బ్రహ్మాబాబా ముందు ప్రపంచం యొక్క పరిస్థితులైతే ఉన్నాయి. కానీ వాటితో పాటు రకరకాలైన పిల్లల యొక్క పరిస్థితులు ఉన్నా కానీ సంఘటనలో ఉంటూ భాధ్యత ఉన్నా కానీ సత్యతాశక్తితో విజయీగా అయ్యారు. పిల్లల యొక్క గొడవలు బ్రహ్మబాబా చూడలేదా? బ్రహ్మాబాబా దగ్గర కూడా ప్రపంచం యొక్క పరిస్థితులు కూడా ఉన్నాయి మరియు రకరకాల సంస్కారాలు కలిగిన ఆత్మలు ఉండేవారు కానీ అన్ని పరిస్థితులు ఉన్నా కానీ సత్యత యొక్క స్వస్థితి సంపూర్ణంగా తయారు చేసింది. 

మీరందరు ఏవిధంగా తయారవ్వాలి? చతురత లేదు కదా! చాలా మంచిగా మాట్లాడతారు. నేను ఏమి చేయలేదు, కొంచెం చతురతతో నడవల్సివస్తుంది అని. కానీ ఎంతవరకు నడుస్తారు? సహనశక్తిని ధారణ చేసి అసత్యతను ఎదుర్కోండి, ప్రభావంలోకి వచ్చేయకండి. కొందరు అంటున్నారు - మేము మహారథీలలోనే ఇలా చూసాము. మహారథీలను అనుసరించాలి కదా! ఇప్పుడు బ్రహ్మాబాబా ఎదురుగా లేరు. మహారథీలు ఉన్నారు. కనుక వారిని అనుసరించాము అంటున్నారు. కానీ ఒకవేళ మహారథీలు కూడా కల్తీ చేస్తున్నారు, చతురతతో నడుస్తున్నారు అంటే ఆ సమయంలో ఆ మహారథి మహారథీ కాదు, ఆ సమయంలో వారికి గ్రహచారం పట్టింది. మహారథీలు కాదు. అందువలనే బాప్ దాదా ఏమి స్లోగన్ ఇచ్చారు? తండ్రిని అనుసరించమని చెప్పారా? లేదా అక్కయ్యని, అన్నయ్యని అనుసరించమని చెప్పారా? సాకార కర్మలో బ్రహ్మాబాబాని ఎదురుగా ఉంచుకుని అనుసరించండి మరియు అశరీరిగా అవ్వటంలో నిరాకారి శివబాబాను అనుసరించండి. మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారు కూడా తండ్రినే అనుసరిస్తారు. మరి మీరేం చేయాలి? తండ్రిని అనుసరించాలి. పక్కాయేనా? లేక కొంచెం కొంచెం లాభం లభిస్తే తీసుకోండి. భవిష్యత్తు గురించి తర్వాత చూడచ్చు అని కొందరు అనుకుంటున్నారు. కొందరు సత్యయుగంలో తక్కువ పదవి పొందినా కానీ సుఖమే ఉంటుంది. దు:ఖం ఉండనే ఉండదు. సర్వప్రాప్తులు ఉంటాయి. ప్రజలకి కూడా ప్రజలు ఉన్నా కానీ అప్రాప్తి ఉండదు. అందువలన ఇప్పుడు మజాగా ఉందాం తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ అల్పకాలిక మజా శిక్షని అనుభవించే విధంగా చేస్తుంది. దానికి మంజూరేనా? కొంచెం శిక్ష అనుభవిస్తారా? దాని మజా కూడా పొందండి. వద్దా? అయితే మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి - పవిత్రత, సత్యత మరియు దివ్యత. సాధారణ మాట, సాధారణ సంకల్పం ఉండకూడదు, దివ్యత ఉండాలి. దివ్యత అంటే దివ్యగుణాల ద్వారా కర్మ చేయాలి, సంకల్పం చేయాలి, అదే దివ్యత. పాపకర్మ అంటే ఏమిటి? అని ప్రజలు అడుగుతారు కదా! ఏదైనా వికారానికి వశం అయ్యి కర్మ చేయటమే పాపం అని మీరు చెప్తారు కదా! అయితే దివ్యత అంటే దివ్యగుణాల ఆధారంగా మనస్సు, వాక్కు కర్మ ఉండాలి. సత్యత యొక్క మహత్వం తెలిసిందా? (వ్యాయామం) ఒక సెకనులో మిమ్మల్ని మీరు అశరీరిగా చేసుకోగలుగుతున్నారా? ఎందుకు? నేను అశరీరి ఆత్మను అని సంకల్పం చేయటానికి ఎంత సమయం పట్టింది? ఒక్క సెకను పట్టింది కదా! ఒక్క సెకనులో అశరీరిగా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అయిపోవాలి. ఈ వ్యాయామం రోజంతటిలో మధ్యమధ్యలో చేస్తూ ఉండండి. చేయటం వస్తుంది కదా! అయితే ఇప్పుడు ఒక్క సెకనులో అన్నింటిని మర్చిపోయి ఒక్కసారిగా అశరీరిగా అయిపోండి. (5 నిమిషాలు బాప్ దాదా ఈ వ్యాయామం చేయించారు) 

మంచిది. నలువైపుల ఉన్న సర్వ పవిత్రతల యొక్క పునాదిని సదా గట్టిగా ఉంచుకునేవారికి, సదా సత్యత యొక్క శక్తి ద్వారా విశ్వంలో కూడా సత్యయుగం అంటే సత్యత శక్తి యొక్క తరంగాలు వెదజల్లే వారికి, సదా ప్రతి సమయం మనసా, వాచా, కర్మణా మూడింటిలో దివ్యతని ధారణ చేసేవారికి, సదా ఫాలోఫాదర్ చేసే సహజ అభ్యాసి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments