26-02-1995 అవ్యక్త మురళి

       26-02-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగం అంటే ఉత్సవం యొక్క యుగం, ఉత్సవం జరుపుకోవటం అంటే అవినాశి ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండటం.

ఈరోజు త్రిదేవ రచయిత త్రిమూర్తి శివ తండ్రి తన యొక్క ఆత్మిక వజ్రాలతో వజ్రతుల్య జూబ్లీ మరియు వజ్రతుల్య జయంతి జరుపుకునేటందుకు వచ్చారు. ఈ విచిత్ర జయంతిని వజ్రతుల్య జయంతి అంటారు. ఎందుకంటే బాబా అవతరించేదే, గుడ్డిగవ్వగా ఉన్నవారిని వజ్రతుల్యంగా చేసేటందుకు. ఈ అద్భుతమైన జయంతియే మొత్తం కల్పంలో, మొత్తం విశ్వంలో అన్నింటికంటే అతీతమైనది మరియు ప్రియమైనది. ఎవరైనా జయంతి జరిపితే ఆత్మల యొక్క జయంతి, దేహధారుల జయంతి జరుపుతారు. కానీ ఈ శివజయంతి శరీరధారి ఆత్మలది కాదు, నిరాకార బిందురూపుడు యొక్క జయంతి. శివజయంతి అనగానే జ్యోతిర్బిందు రూపమే ఎదురుగా వస్తుంది. కనుక మొత్తం కల్పంలో ఎప్పుడు అవినాశి పరమాత్మ యొక్క జయంతి జరుపరు. అశరీరి అయిన త్రిమూర్తి శివతండ్రి యొక్క జయంతి విచిత్రమైనది మరియు ఈ శివజయంతియే తండ్రి మరియు పిల్లలు ఇద్దరి జయంతి. ఈరోజు కేవలం బాబా యొక్క జయంతియే జరపడానికి వచ్చారా లేదా బ్రాహ్మణాత్మల యొక్క జయంతి జరిపేటందుకు కూడా వచ్చారా? అందరికీ చెప్తారు కదా, శివజయంతియే త్రిమూర్తి జయంతి, బ్రాహ్మణ జయంతి, పరమాత్మ తండ్రితో పాటు ఇంతమంది ఆత్మల యొక్క జయంతి అంటే ఇది విచిత్రమే కదా! లౌకికంలో అయితే తండ్రి యొక్క జన్మదినం మరియు పిల్లల జన్మదినం ఒకటే ఉండదు. రోజు ఒకటే అయినా సంవత్సరం అయితే తేడా ఉంటుంది. ఈవిధమైన విచిత్రజయంతి, అతీతమైన మరియు ప్రియమైన జయంతి జరుపుకునేటందుకు ఎక్కడెక్కడి నుండి వచ్చారు! విశ్వం యొక్క మూల, మూలల నుండి ఎందుకు వచ్చారు? మీ జయంతి జరుపుకునే టందుకు వచ్చారా లేదా బాబా యొక్క జయంతి జరిపేటందుకు వచ్చారా? లేదా ఇద్దరిదీ జరుపుకునేటందుకు వచ్చారా? మీరు బాబాకి శుభాకాంక్షలు ఇస్తారా లేదా బాబా మీకు శుభాకాంక్షలు ఇస్తారా? మీరు బాబాకి శుభాకాంక్షలు అని చెప్తున్నారు మరియు బాబా మీకు కోటానుకోట్ల శుభాకాంక్షలు చెప్తున్నారు. ఒక్కొక్క బ్రాహ్మణాత్మ వజ్రం కంటే విలువైనది. ఈ స్థూలవజ్రాలు మీ ముందు తక్కువే. ఈ ప్రపంచంలో వజ్రాలకే ఎక్కువ విలువ అందువలనే బాబా వజ్రతుల్యం అని అంటారు. కానీ మీ విలువ ముందు వజ్రం ఎంత! ఏమీ కాదు. ఈ వజ్రాలైతే మీ మహల్ లో, గోడలలో ఉంటాయి. ఒక్కొక్క బ్రాహ్మణాత్మ వజ్రం కంటే ఎక్కువ. బాప్ దాదా నలువైపుల వజ్రం కంటే అమూల్యమైన పిల్లలందరినీ ఎదురుగా చూస్తున్నారు. బాప్ దాదా ఎదురుగా కేవలం మధువనం యొక్క సభయే కాదు కానీ విశ్వంతో నలువైపుల ఉన్న బ్రాహ్మణాత్మల యొక్క సభ ఉంది. అందరి మనస్సు యొక్క శుభాకాంక్షల స్నేహమయ పాట లేదా మాటను బాబా సమీపంగా వింటున్నారు. మనస్సు యొక్క ధ్వని మనోభిరాముని వద్దకు ముందుగానే చేరిపోతుంది. బాప్ దాదా చూస్తున్నారు, పిల్లల సేవకు ప్రత్యక్ష ప్రమాణంగా నలువైపుల ఉన్న అందరు మధువనం లేదా స్వీట్ హోమ్ వరకు చేరుకుంటున్నారు. శివజయంతిని ఉత్సవం అని అంటారు. యదార్ధమైన ఉత్సవం బ్రాహ్మణాత్మలైన మీరే జరుపుకుంటారు. ఎందుకంటే ఉత్సవం అంటే అర్ధం - అందరు ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండటం. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో అందరి మనస్సులో ఉత్సాహ, ఉల్లాసాలు ఎంతగా ఉన్నాయి? అవినాశిగా ఉన్నాయా లేజు కేవలం ఈ రోజు వరకే ఉంటాయా? అవినాశిగా ఉంటాయి కదా? అందువలనే బాప్ దాదా ఈ శ్రేష్ట సంగమయుగాన్ని ఉత్సవం యొక్క యుగం అని అంటారు. ప్రతి రోజు మీకు ఉత్సవమే. 

మహిమ కూడా ఉంది మరియు మీరు అనేకతలో ఏకత అని టాపిక్ పేరు పెడతారు కదా అంటే ప్రత్యక్షంగా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రంగు, రూపాలు ఉంటాయి కానీ అనేకతలో కూడా అందరి మనస్సులో ఏకత ఉంది కదా! ఎందుకంటే ఒకే తండ్రి. అమెరికా నుండి వచ్చినా, ఆఫ్రికా నుండి వచ్చినా కానీ మనస్సులో ఒకే బాబా ఉంటారు. ఒకే శ్రీమతంపై నడిచేవారు. దాదికి మంచిగా అనిపిస్తుంది, అనేక భాషలలో ఉంటూ కూడా మనస్సు యొక్క పాట, మనస్సు యొక్క భాష ఒకటే. ఏ భాష వారైనా కానీ అందరికీ నల్ల కిరీటం అయితే లభించింది కదా! (అంటే అందరు హెడ్ ఫోన్స్ ద్వారా తమ,తమ భాషలలో మురళి వింటున్నారు ) తర్వాత ఈ నల్లకిరీటమే బంగారంగా అయిపోతుంది కానీ అందరి మనస్సు యొక్క భాష ఒకటే మరియు మనస్సు యొక్క మాట ఒకటే, నా బాబా. అన్ని భాషల వారు అనండి, నాబాబా అని. అవును, ఇది ఒకటే. అంటే అనేకతలో ఏకత కదా! 

ఉత్సాహంలో ఉండేవారు అంటే సదా ఉత్సవం జరుపుకునే శ్రేష్టాత్మలు. ఎప్పుడూ కూడా ఉత్సాహం తక్కువ అవ్వకూడదు. మొదట కూడా చెప్పాను, బ్రాహ్మణజీవితం యొక్క శ్వాసయే, ఉత్సాహ,ఉల్లాసాలు. ఒకవేళ శ్వాస ఆగిపోతే జీవితం సెకనులో సమాప్తి అయిపోతుంది కదా! అలాగే బ్రాహ్మణజీవితంలో ఉత్సాహ,ఉల్లాసాలనే శ్వాస లేకపోతే బ్రాహ్మణజీవితమే లేదు. ఎవరైతే సదా ఉత్సాహ, ఉల్లాసాలలో ఉంటారో వారు నిశ్చయంతో చెప్తారు, బ్రాహ్మణులు ఉన్నదే ఉత్సాహ, ఉల్లాసాలలో అని మరియు ఎవరికైతే ఉత్సాహ,ఉల్లాసాలు తక్కువ అయిపోతాయో వారి మాటే మారిపోతుంది. వారు ఇది సరైనదే.. అవ్వాలి..... అయిపోతుంది... ఈ భాషలో మరియు ఆ భాషలో ఎంత తేడా ఉంది! వారి ప్రతి మాటలో తప్పకుండా అవ్వాలి కదా, అవ్వాలి కదా,.... ఇలా కదా, కదా అంటూ ఉంటారు. ఉత్సాహ, ఉల్లాసాల యొక్క ప్రెషర్ తక్కువ అవ్వటం వలనే అటువంటి మాటలు, బలహీన మాటలు వస్తాయి. ఉత్సాహ, ఉల్లాసాలు ఎప్పుడు తక్కువ అవ్వకూడదు. ఉత్సాహ, ఉల్లాసాలు ఎందుకు తక్కువ అవుతున్నాయి? బాప్ దాదా సదా ఓహో, ఓహో అనండి అంటే ఎందుకు, ఎందుకు అంటున్నారు. ఒకవేళ ఏ పరిస్థితిలో అయినా ఎందుకు అనే మాట వస్తే ఉత్సాహ,ఉల్లాసాల యొక్క ప్రెషర్ తక్కువ అయిపోతుంది. బాప్ దాదా ఇంతకు ముందు సంవత్సరం కూడా విశేషంగా డబల్ విదేశీయులకు చెప్పారు, ఎందుకు అనే మాటను బ్రాహ్మణుల డిక్షనరీ నుండి తీసేయండి అని. ఎందుకు అనే మాట వచ్చినప్పుడు ఎగిరిపోవాలి అనే మాట జ్ఞాపకం ఉంచుకుంటే ఎందుకు అనే మాట సమాప్తి అయిపోతుంది. ఏ పరిస్థితిలో అయినా,చిన్నది పెద్దదిగా అయినప్పుడు ఎందుకు అనే మాట వస్తుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి.... అలా కాకుండా ఎగిరిపోతే పరిస్థితి ఏమౌతుంది? చిన్న ఆటబొమ్మగా అయిపోతుంది. ఎప్పుడైనా ఎందుకు అనే మాట మనస్సులో వస్తే బ్రాహ్మణుల డిక్షనరీలో ఎందుకు అనే మాట లేదు, ఎగిరిపోవాలి అనుకోండి. ఎందుకంటే ఎందుకు,ఎందుకు అనేది అయ్యో, అయ్యో అనేలా చేస్తుంది. బాప్ దాదాకి నవ్వు కూడా వస్తుంది. ఒకవైపు మాకు లభించిన భాగ్యం ఎవరి లభించలేదు అంటారు మరలా ఇప్పుడిప్పుడే ఉత్సాహం తక్కువైపోతే నా భాగ్యమే ఇలా ఉందేమో తెలియటం లేదు అంటారు. నా భాగ్యంలో ఇంతే ఉంది అంటారు అంటే అయ్యో, అయ్యో అంటున్నట్లే కటా! ఎప్పుడైనా అయ్యో, అయ్యో అనే దృశ్యాలు వస్తే ఓహో, ఓహో అనండి అప్పుడు ఆ దృశ్యాలు కూడా మారిపోతాయి మరియు మీరు కూడా మారిపోతారు. 

డబల్ విదేశీయులు ఈరోజుల్లో శుభ సంకల్పాల గురించి (పాజిటివ్ థింకింగ్) కోర్స్ చెప్తున్నారు కదా! విదేశంలో అందరు విశేషంగా డబల్ విదేశీయులు ఈ రోజుల్లో శుభ సంకల్పాల గురించి (పాజిటివ్ థింకింగ్) కోర్స్ చెప్తున్నారు కదా! విదేశంలో అందరు విశేషంగా ఇదే కోర్స్ చేయిస్తున్నారా? మీకు మీరు కూడా చేసుకుంటున్నారా లేదా కేవలం ఇతరుల చేతే చేయిస్తున్నారా? ఏ సమయంలోనైనా ఏదైనా పరిస్థితి వస్తే మీకు మీరు విద్యార్ధిగా అయ్యి మరలా స్వయమే టీచర్‌గా అయ్యి మీకు మీరే ఈ కోర్స్ చేయండి. మీకు మీరు చేసుకోగలుగుతున్నారా లేదా కేవలం ఇతరులకే చేస్తున్నారా? ఇతరులచే చేయించటం సహజం. ప్రతి వ్యక్తిని, విషయాన్ని మంచి వృత్తితో చూస్తూ, వింటూ, ఆలోచిస్తూ ఉంటే స్థితి ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో విజ్ఞానం ద్వారా ఎటువంటి సాధనాలు వచ్చాయంటే పనికిరాని వస్తువులను కూడా చాలా సుందరరూపంగా తయారుచేస్తున్నారు. ఎలా ఉన్నవాటిని ఎలా తయారుచేస్తున్నారో చూస్తున్నారు కదా! మీ వృత్తిని ఇలా పరివర్తన చేసుకోలేరా? వారు వచ్చింది వ్యతిరేక రూపంలో అయినా మీరు వ్యతిరేక వృత్తిని మంచిలోకి పరివర్తన చేసుకోండి. ఒకవేళ అలజడిలోకి వస్తున్నారు అంటే దానికి కారణం, వ్యతిరేకతను వినటం, ఆలోచించటం, మాట్లాడటం లేదా చేయటం. ఈ మోడల్ తయారుచేస్తారు కదా - ఆలోచించకండి, చూడకండి, మాట్లాడకండి, చేయకండి అని. శాంతిశక్తి వ్యతిరేకాన్ని మంచిలోకి పరివర్తన చేయలేదా! మీ మనస్సు, బుద్ది ఏవిధంగా అయిపోవాలంటే అసలు వ్యతిరేకతను తాకకూడదు, సెకనులో పరివర్తన అయిపోవాలి. ఇంత తీవ్రమైన వేగాన్ని అనుభవం చేసుకుంటున్నారా? మనస్సు మరియు బుద్ది ఇంత తీవ్రవేగం కలిగిన యంత్రంలా అయిపోవాలి. అవుతున్నాయా లేదా సమయం పడుతుందా? ఏదైనా వ్యతిరేక విషయం వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించటం, చూడటం చేస్తే అది సరైనదా! చాలా వేగంగా పరివర్తన అయిపోవాలి. దీనినే బ్రాహ్మణజీవితం యొక్క ఆనందం,మజా అంటారు. జీవించాలంటే మజాగా జీవించాలి, ఆలోచిస్తూ, ఆలోచిస్తూ జీవిస్తే దానిని జీవితం అనరు. ఇతరులకు రాజయోగం అంటే జీవించే కళ అని చెప్తారు కదా! మీరందరు రాజయోగి జీవితం కలిగిన వారే కదా! లేదా కేవలం చెప్పేవారా? రాజయోగం జీవించే కళ అయితే రాజయోగుల యొక్క కళ ఏమిటి? అదే కదా? కనుక ఉత్సవం జరుపుకోవటం అంటే ఆనందంలో ఉండటం. మనస్సులో కూడా మజాగా ఉండాలి, తనువు కూడా మజాగా ఉండాలి, సంబంధ, సంపర్కాలలో కూడా మజాగా ఉండాలి. 

కొంతమంది పిల్లలు మాతో మేము మంచిగా ఉంటున్నాము, మేము మజాలో ఉంటు న్నాము కానీ సంబంధ, సంపర్కాలలో అప్పుడప్పుడు మజాగా ఉంటున్నాము అంటున్నారు కానీ సంబంధ, సంపర్కాలే మన స్థితికి పరీక్ష. ఎవరైనా విద్యార్థి నేను పాస్ విత్ ఆనరే కానీ పరిక్ష సమయంలో మార్కులు తక్కువగా వస్తే అటువంటి వారిని ఏమంటారు? ఇలా అయితే లేరు కదా! పూర్తి పాస్ అయ్యేవారే కదా? బాప్ దాదా చెప్పారు కదా, ఎవరైతే సమీపంగా ఉంటారో వారే పాస్ అవుతారు అని. సమీపంగా లేకపోతే పాస్ అవ్వరు. కనుక సదా ఎక్కడ ఉంటున్నారు? దూరంగా ఉంటున్నారు, సమీపంగా ఉండటం లేదు. డబల్ విదేశీయులు డబల్ పాస్ అవ్వాలి కదా! మంచిది. 

డబల్ విదేశీయులు ఈసారి హైజంప్ చేసారు. హైజంప్ చేసి మధువనానికి చేరుకున్నారు. (ఈసారి ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీయులు మధువనానికి వచ్చారు) మంచిది, డబల్ విదేశీయులలో కొంతమందికి పట్టపురాణీలుగా అయ్యే అవకాశం బాగా లభించింది. మీ బెడ్డింగ్ ఎంత ఉంటుంది అంటే మీరు దానిపైనే నిద్రపోతారు, ఎందుకంటే ఒకటి పెద్దది తెచ్చుకుంటారు, ఒకటి చిన్నది తెచ్చుకుంటారు, చిన్నది తలగడగా చేసుకోండి. స్థానం తగ్గుతుంది కదా! బాప్ దాదా ఆ దృశ్యం చూస్తున్నారు, ఎంత పెద్ద బెడ్డింగ్లు గొలుసులు కట్టి మరీ తీసుకువస్తున్నారు. ఆ దృశ్యం బావుంటుంది కదా! సంగమయుగంలో ఈ శ్రమ కూడా కొద్ది సమయమే తర్వాత ప్రకృతి కూడా మీకు దాసీ అయిపోతే ఇక దాసీలు చాలా మంది ఉంటారు. అప్పుడిక మీరు సామాన్లు మోయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు మీ రాజ్యం స్థాపన అవుతుంది. ఈ సమయంలో గుప్త వేషంలో ఉన్నారు, సేవాధారులుగా ఉన్నారు, తర్వాత రాజ్యాధికారిగా అవుతారు అప్పుడు సేవాధారులు అన్ని రకాలుగా సేవ చేస్తారు. ఎంతగా ఇప్పుడు తనువు, మనస్సు, ధనం మరియు సంపర్కాల ద్వారా సేవ చేస్తారో అంతగా అక్కడ సేవాధారులు ఉంటారు. అన్నింటికంటే మొదట ఈ ప్రకృతి యొక్క పంచతత్వాలే మీకు సేవాధారిగా అయిపోతాయి. మీ రాజ్యభాగ్యం జ్ఞాపకం ఉంది కదా! ఎన్ని సార్లు రాజ్యాధికారిగా అయ్యారు! లెక్కలేనన్ని సార్లు అయ్యారు మరియు అవుతూనే ఉంటారు. కానీ ఆ రాజ్యాధికారి కంటే ఇప్పటి ఈ సేవాధారి జీవితం శ్రేష్టమైనది. ఎందుకంటే ఇప్పుడు బాబా మరియు పిల్లలు వెంట ఉన్నారు. ఇప్పుడు ఏరకంగా సేవ చేసినా సేవకు ప్రత్యక్షఫలం ఇప్పుడే లభిస్తుంది. బాబా యొక్క స్నేహం, సహయోగం మరియు బాబా ద్వారా లభించిన ఖజానా సేవకు ప్రత్యక్షఫల రూపంలో లభిస్తున్నాయి. ఎప్పుడైనా ఏదైనా విశేషసేవ చేస్తున్నప్పుడు మరియు యుక్తియుక్త సేవ చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది! ఆ సమయంలో మన ముఖం యొక్క ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? ఒకవైపు సేవ చేస్తున్నారు మరియు రెండవవైపు మీ కోసం ప్రత్యక్ష ఫలం సదా తయారుగా ఉంటుంది. ఒక చేతితో సేవ చేయండి, రెండవ చేతితో ఫలం తినండి, ఇలా అనుభవం అవుతుందా? సేవలో చాలా కష్టం ఉందా? సేవలో అలజడి వస్తుందా, లేదా? అప్పుడప్పుడు వస్తుంది. ఈ అలజడియే పరిపక్వంగా చేస్తుంది, అనుభవిగా చేస్తుంది. అలజడిలోకి ఎందుకు వస్తున్నారంటే కేవలం వర్తమానాన్నే చూస్తున్నారు కానీ ఆ వర్తమానంలో దాగి ఉన్న భవిష్యత్తు స్పష్టంగా కనిపించటం లేదు అందువలన అలజడిలోకి వస్తున్నారు. పెద్ద, పెద్ద నాజుకు పరిస్థితులు ఏవైతే వస్తున్నాయో అవి వాస్తవంగా చాలా పెద్ద పాఠం చదివిస్తున్నాయి, అది పరిస్థితి కాదు, మీకు టీచర్. ఈ పరిస్థితి ఏమి పాఠం చదివించింది? అనే దృష్టితో చూడండి. దీనినే వ్యతిరేకాన్ని మంచిలోకి పరివర్తన చేసుకోవటం అంటారు. కేవలం పరిస్థితినే చూస్తే భయపడతారు. పరిస్థితి అనేది మాయ ద్వారా క్రొత్త, క్రొత్త రూపాలలో వస్తుంది. ఒకసారి ఏ రూపంలో వచ్చిందో మరలా అదే రూపంలో రాదు. క్రొత్త రూపంలో వస్తుంది. ఇది క్రొత్త విషయం , ఇది అవ్వటంలేదు, ఇది అవ్వకూడదు...... ఇలా వాటికి భయపడిపోతున్నారు. కానీ మాయ అంతిమం వరకు బహురూపిగా అయ్యి బహురూపాలు చూపిస్తుంది, ఇది అర్థం చేసుకోండి. మాయకు బహురూపిగా అవ్వటం చాలా బాగా వచ్చు మరియు చాలా తొందరగా కూడా అవుతుంది. మీ స్థితి ఎలా ఉంటే ఆ రూపంలో పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకవేళ సోమరితనం యొక్క జీవితంలో ఉన్నారనుకోండి మాయ కూడా అప్పుడు సోమరితనం యొక్క పరిస్థితి రూపంలో వస్తుంది. ఒక రోజు మూడ్ ఆఫ్ గా ఉన్నారనుకోండి, ఆరోజు మాయ కూడా మూడ్ ఆఫ్ పరిస్థితి రూపంలోనే వస్తుంది.మరలా నేను మొదటే ఆలోచించాను కదా, మరలా ఏమయ్యింది? అంటున్నారు. అందువలన మాయను చూసేటందుకు, తెలుసుకునేటందుకు త్రికాలదర్శి మరియు త్రినేత్రి అవ్వండి. ముందు, వెనుక, ఎదురుగా త్రినేత్రి అవ్వండి. 

మీరందరు త్రినేత్రి మరియు త్రికాలదర్శి కదా? డబల్ విదేశీయులు త్రికాలదర్శియేనా, అవునా లేక కాదా? అవునా, కాదా అనేది అందరు చెప్పండి. (అవును) మీ భాషలో అయితే బాగా మాట్లాడుతున్నారు. అందరు సంతోషంగా ఉన్నారా? (ఉన్నాము) ఇంత పెద్ద సంఘటనలో మజా వస్తుందా? (వస్తుంది) వచ్చే సంవత్సరం ఇంత గుంపులో రాకూడదు, తర్వాత వద్దాము అని కొంతమంది ఆలోచించటం లేదు కదా? సంఘటన యొక్క మజా కూడా ప్రేమ. ప్రోగ్రామ్ ప్రమాణంగా రావలసి ఉంటుంది, ఎక్కువ మంది రాకూడదు. కానీ అన్నింటిలో సర్దుకునే శక్తి యొక్క అలవాటు ఉండాలి. సర్దుకునే శక్తి సదా విజయీగా చేస్తుంది. బ్రహ్మాబాబాని చూస్తే పిల్లలతో పిల్లవానిగా అయ్యి సర్దుకుపోయేవారు, పెద్దవారితో పెద్దవానిగా అయ్యి సర్దుకుపోయేవారు. బీదజీవితంలో మరియు సాధనాల ఉన్న జీవితంలో రెండింటిలో కూడా సర్దుకుపోవాలి మరియు సంతోషంతో ఉండాలి, ఆలోచిస్తూ ఉండటం కాదు. ఇక్కడ దు:ఖమైతే ఉండదు కానీ సంతోషంగా ఉండడానికి బదులు ఇది ఎలా అయ్యింది, ఇది ఏమిటి.....ఇలా కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించేవారికి సర్దుకునే మజాలో ఉండటానికి కొంచెం సమయం పడుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి - ఎటువంటి పరిస్థితి అయినా, మంచి పరిస్థితి అయినా, చలింపచేసేది అయినా కానీ ప్రతి సమయం, ప్రతి పరిస్థితిలో స్వయాన్ని సర్దుకోగలుగుతున్నానా? అని. డబల్ విదేశీయులకు ఒంటరిగా ఉండటం కూడా బావుంటుంది మరియు తోడుని కూడా చాలా బాగా తయారుచేసుకుంటారు. కానీ అందరితో కలిసి ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నా రెండింటిలో సర్లుకోవటమే బ్రాహ్మణజీవితం. సంఘటనలో ఉంటే తల బరువు అయిపోతుంది, నేను ఏకాంతంగా ఉండాలి, ఈ భయంకరయుద్ధం నాకు వద్దు, నేను ఒంటరిగా ఉండాలి..... ఇలా అనుకోకండి. మనస్సుతో ఒంటరిగా అంటే బాహర్ముఖత నుండి అంతర్ముఖతలోకి వెళ్ళిపోండి అదే ఒంటరితనం. కొంతమంది అంటారు కదా, నాకు ఒక్కరికే వేరే గది కావాలి వేరేవారు ఉండకూడదు అని కానీ ఒక్కరికే గది దొరికినా మజాగా నిద్రపోండి లేదా 10 మధ్యలో నిద్రపోవలసి వచ్చినా మజాతో నిద్రపోండి. విదేశీయులు 10 మందితో కలిసి పడుకుంటారా లేదా కష్టమనిపిస్తుందా? నిద్రపోగలరా? (అలాగే) మంచిది, వచ్చే సంవత్సరం 20,20 మందిని పడుకోపెడతారు. సమయం మారుతూ ఉంది మరియు మారుతూ ఉంటుంది. ప్రపంచం యొక్క పరిస్థితులు కూడా ఉంటున్నా అన్నీ చలిస్తాయి, అన్ని ఆధారాలు తెగిపోతాయి. అటువంటి సమయంలో ఏమి కావాలి? ఒకే బాబా యొక్క ఆధారం కావాలి. మీరు చాలా, చాలా, చాలా అదృష్టవంతులు, ఇక మీకు సహజసాధనాలు లభించే సమయం. మీ బ్రాహ్మణజన్మ సహజ సాధనాలతో ఉంటుంది. కానీ సాధనాలు మరియు సాధన రెండూ ఉండాలి, సాధనాలను చూస్తూ సాధనను మర్చిపోకూడదు. ఎందుకంటే చివరికి సాధనయే ఉపయోగపడుతుంది. అర్ధమైందా! బాప్ దాదాకి సంతోషంగా ఉంది, డబల్ విదేశీయులు సందేశం ఇవ్వటంలో చాలా మంచి పాత్రను అభినయిస్తున్నారు. సేవాకేంద్రాలు కూడా చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో తెరుస్తున్నారు. బాప్ దాదా ఈ రోజు మీ అందరికీ ఉత్సవం జరుపుకున్నందుకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు మరియు వెనువెంట సేవకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరియు అండర్లైన్ కూడా చేయిస్తున్నారు-సేవ మరియు స్వస్థితి రెండింటిలో తీవ్రవేగంతో ఉండండి అని. స్వస్థితి మరియు సేవ రెండింటి సమానత సదా స్మృతితో ఉండాలి. అప్పుడప్పుడు బాప్ దాదా వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా, ఏదైనా సేవ ఉన్నప్పుడు పరుగుపెట్టుకుంటూ ఆ కార్యం చేస్తున్నారు కదా, కార్యం యొక్క ఉత్సాహంలో కార్యం చేసేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు కొంతమంది అంటున్నారు, సేవకి వెళ్ళాము కనుక స్థితి కొద్దిగా బలహీనం అయ్యింది అని. అలా ఉండకూడదు. ఇప్పుడు యోగంలోనే కూర్చుంటాము, సేవ చేయము అని కూడా అనకూడదు. యోగం మరియు సేవ కలిసి ఉండాలి. 

నలువైపుల ఉన్నటువంటి అమూల్యమైన విశేష రత్నాలకు, సదా ప్రతి రోజు ఉత్సాహంతో ఉత్సవం జరుపుకునే శ్రేష్టాత్మలకు, సదా స్వస్థితి మరియు సేవ యొక్క ఉన్నతిలో సమానంగా ఉంటూ ఆశీర్వాదాలకు అధికారులుగా అయ్యే ఆత్మలకు, సదా పరిస్థితిని సహజంగా దాటే అచంచలమైన, స్థిరమైన, మహావీర్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే

Comments