26-01-1995 అవ్యక్త మురళి

       26-01-1995         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రహ్మాబాబా యొక్క మరియొక రెండు అడుగులు - ఆజ్ఞాకారి మరియు నమ్మకదారి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న స్నేహి, సహయోగి పిల్లలను మరియు శక్తిశాలి సమాన పిల్లలను చూస్తున్నారు. అందరు స్నేహి పిల్లలే కానీ శక్తిశాలిగా శక్తిననుసరించి ఉన్నారు. స్నేహి పిల్లలకు స్నేహానికి ఫలితంగా కోటిరెట్లు స్నేహం మరియు సహయోగం ప్రాప్తిస్తుంది. శక్తిశాలి సమాన పిల్లలకు సదా విజయీభవ అనే వరదానం లభిస్తుంది. అందరికి లభిస్తుంది కానీ స్నేహి పిల్లలు శక్తిననుసరించి శక్తిశాలిగా ఉంటారు కనుక సదా సహజంగా విజయాన్ని అనుభవం చేసుకోలేరు. ఒక్కొక్కసారి సహజంగా, ఒక్కొక్కసారి కష్టంగా అనుభవం చేసుకుంటారు. బాప్ దాదా స్నేహి పిల్లలకు కూడా శ్రమని సహజం చేసుకునే సహయోగం ఇస్తున్నారు. ఎందుకంటే స్నేహి ఆత్మలే సహయెగులుగా కూడా ఉంటారు. సహయోగానికి ఫలితంగా బాప్ దాదా తప్పక సహయోగాన్ని ఇస్తారు కానీ యోగం యదార్ధంగా లేని కారణంగా సహయోగం లభిస్తున్నా కానీ అనుభవం చేసుకోవటం లేదు. యోగం ద్వారానే సహయోగం అనుభవం అవుతుంది. శక్తిశాలి సమాన పిల్లలు సదా యోగయుక్తంగా ఉంటారు అందువలన సహయోగం యొక్క అనుభవం చేసుకుంటూ సహజంగా విజయీగా అయిపోతారు. కానీ బాబాకి ఇద్దరు ప్రియమైన పిల్లలే. పిల్లలందరిపై ప్రేమ మరియు సదా విజయీ అవ్వాలి అనే శుభకోరిక అయితే ఉంటుంది కానీ శక్తి తక్కువగా ఉన్న కారణంగా సమయానుసారం సర్వశక్తులను కార్యంలో ఉపయోగించలేక పోతున్నారు. బాబా వారసత్వ అధికారంగా సర్వశక్తుల యొక్క అధికారాన్ని పిల్లలందరికి ఇస్తున్నారు. అధికారం ఇవ్వటంలో బాప్ దాదా తేడాగా ఇవ్వటం లేదు అందరినీ సంపూర్ణ అధికారిగా తయారు చేస్తున్నారు. అధికారం ఇవ్వటంలో బాబా నెంబర్ వారీగా ఇవ్వటం లేదు కానీ తీసుకోవటంలో నెంబర్ వారీగా అయిపోతున్నారు. బాప్ దాదా కొందరికి విశేషంగా, కొందరికి వేరుగా భోదిస్తున్నారా? లేదు కదా, చదువు అందరిదీ ఒక్కటే, పాలన కూడా అందరికి ఒక్కటే. పాండవులకి పేరుగా, శక్తులకి వేరుగా ఇలా ఏమైనా ఉందా? అందరికి ఒకే విధమైన చదువు మరియు పాలన కానీ తీసుకోవటంలో, ఫలితంలో ఎంత తేడా వచ్చేస్తుంది. ఎక్కడ అష్టరత్నాలు మరియు ఎక్కడ 16108 రత్నాలు ఎంత తేడా ఉంది! ఈ తేడా ఎందుకు వచ్చింది? చదువు మరియు పాలన, వరదానాలను ధారణ చేయటంలో మరియు కార్యంలో ఉపయోగించటంలో తేడా వచ్చేస్తుంది. కొందరు ధారణ కూడా చేస్తున్నారు. కానీ సమయానుసారంగా కార్యంలో ఉపయోగించటం రావటం లేదు. బుద్ది వరకు చాలా నిండుగా ఉంటున్నారు. కానీ కర్మలోకి రావటంలో తేడా వచ్చేస్తుంది. బ్రహ్మాబాబా నెంబర్ వన్ ఏవిధంగా అయ్యారు? రెండు అడుగులు ఇంతకు ముందు చెప్పాను కదా! ఇక మూడవది - సదా తండ్రి, శిక్షకులు మరియు సద్గురువు యొక్క ఆజ్ఞాకారిగా అయ్యారు. ప్రతి ఆజ్ఞను పాటించేవారు. బాబా యొక్క ఆజ్ఞ ఏమిటంటే సదా సర్వ ఖజానాల యొక్క వారసత్వంతో సంపన్నంగా అవ్వండి మరియు సంపన్నంగా తయారుచేయండి అని. దానిని ప్రత్యక్షంగా చూశారు కదా! సర్వఖజానాలు అంటే జ్ఞానము, శక్తులు, గుణాలు, శ్రేష్టసమయం, సంకల్పాల ఖజానాను మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కార్యంలో ఉపయోగించారు. చివరి రోజు కూడా సమయం, సంకల్పం కూడా పిల్లల కోసమే ఉపయోగించారు. జ్ఞానఖజానా, స్మృతిశక్తి మరియు సహనశీలత యొక్క గుణ స్వరూపం ఇలా అన్ని ఖజానాలు చివరి సమయం వరకు శరీరాన్ని కూడా మర్చిపోయి సేవలో ప్రత్యక్షంగా ఉపయోగించి చూపించారు. అటువంటి వారినే నెంబర్ వన్ ఆజ్ఞాకారి పిల్లవాడు అని అంటారు. ఎందుకంటే బాబా యొక్క విశేష ఆజ్ఞ ఏమిటంటే స్మృతి మరియు సేవలో సదా బాబా సమానంగా ఉండండి. అయితే ఆది నుండి అంతిమ ఘడియ వరకు రెండు ఆజ్ఞలను ప్రత్యక్షంలో చూశారు కదా? స్నేహానికి గుర్తు అనుసరించటం. అందువలన పరిశీలించుకోండి ఆది నుండి ఇప్పటివరకు సర్వఖజానాలను స్వయంతో పాటు సేవలో కూడా ఉపయోగించానా? అని.బాబా యొక్క ఆజ్ఞ ఏమిటంటే ప్రతి శ్వాస, సంకల్పం, సెకను కూడా వ్యర్థం చేయకూడదు అని. అయితే రోజంతటిలో ఈ ఆజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు? లేదా అప్పుడప్పుడు తీసుకువస్తున్నారు, అప్పుడప్పుడు తీసుకురావటం లేదా? ఒక్కొక్కసారి ఆజ్ఞాకారి అయ్యి ఒక్కొక్కసారి కాకపోతే ఏ జాబితాలోకి వెళ్తారు? బాప్ దాదా ఆజ్ఞాకారుల జాబితా తీస్తే మీరు ఏ జాబితాలో ఉంటారు? మీ గురించి మీకు అయితే తెలుసు కదా? ఎందుకంటే మీరందరు సర్వ ఖజానాలకు నిమిత్తులు, యజమానులు. ఒక సంకల్పం కూడా బాబా ఆజ్ఞ లేకుండా ఉపయోగించటం లేదు. లేదా మేం బాబాకి పిల్లలం మరియు యజమానులం కనుక వ్యర్ధంగా పోగొట్టినా, ఏమి చేసినా దీనిలో బాబాది ఏముంది? అని ఆలోచిస్తున్నారా! బాబా అయితే ఇచ్చేశారు ఇప్పుడు మరల లెక్క ఎందుకు తీస్తున్నారు? అని అనుకోకండి. ఎందుకంటే మీరు రోజూ బాబా ముందు అంటున్నారు అన్నీ నీవే, నావి కాదు అని లేదా ఒకే సమయంలో నాది మరొక సమయంలో నీది అని అంటారా! లేదా నాది అంటే నీది అనే అర్థం అని చతురత చేయటం లేదు కదా? బ్రహ్మాబాబాని చూసారు కదా - తన యొక్క విశ్రాంతి సమయాన్ని కూడా విచారసాగర మధనం చేసి పిల్లల కోసం ఉపయోగించేవారు. రాత్రి కూడా మేల్కొని పిల్లలకి యోగశక్తిని ఇస్తూ ఉండేవారు. ఈ చరిత్ర అయితే విన్నారు కదా? బ్రహ్మాబాబా యొక్క కథ విన్నారు కదా? కేవలం విన్నారా లేక దానిని అనుసరించారా? వినటం అంటే చేయటం. 

మూడవ అడుగు - సదా చిత్తం ప్రభూ! అని అనేవారు మరియు ప్రభువు సదా హాజరుగా ఉండేవారు. బ్రహ్మాబాబా నుండి శివబాబా ఎప్పుడూ వేరుగా ఉండేవారు కాదు. శివబాబా సదా హాజరుగా ఉండేవారు కదా, పిల్లలు తండ్రీ! అని అనేవారు, తండ్రి పిల్లలూ! అని అనేవారు. మనస్సు యొక్క ఆంతరంగిక స్థితిలో బాబా సదా హాజరుగా ఉన్నట్లు అనుభవం అయ్యేది. సేవలో సదా చిత్తం ప్రభూ! అని అనేవారు. రాత్రి అయినా, పగలు అయినా కానీ సేవ యొక్క ఆజ్ఞ లభించింది అంటే వెంటనే ప్రత్యక్షంలో ఆ సేవను చేసేవారు మరియు ప్రతి కర్మలో అలాగే అని అనేవారు. అలాగే అనే పాఠం చదివించారు కదా? మీరు ఏమి అనుసరిస్తున్నారు? ఒక్కొక్కసారి అలాగే అని ఒక్కొక్కసారి కాదు అని అంటున్నారా? ప్రేమ యొక్క రుజువు చూపించండి. నాకు బాబాపై ఉన్నంత ప్రేమ ఎవ్వరికీ లేదు అని ఆలోచించటం కాదు. నా హృదయంలో చూడండి ఏమి కనిపిస్తుందో, ఏమి వినిపిస్తుందో.... పిల్లలు ఇలా పాట పాడుతున్నారు కానీ రుజువు చూపించండి. రుజువు ఏమిటంటే బాబాని అనుసరించాలి. పరిశీలించుకోండి - స్థితిలో, సేవలో కర్మ అంటే సంబంధ సంపర్కాలలో (సంబంధం మరియు సంపర్కంలోకి రావటమే కర్మ) మూడింటిలో సదా బాబాని అనుసరిస్తున్నారా? ఫలితంలో ఏమి చూసారంటే ప్రతి ఆజ్ఞ కేవలం బుద్ది వరకే ఉంటుందా? లేదా కర్మలోకి కూడా వస్తుందా? బుద్ధి మరియు వాణీలో 100 విషయాలు ఉంటున్నాయి కానీ కర్మలోకి వచ్చేసరికి 50 ఉంటున్నాయి. అయితే అటువంటి వారిని బాబాని అనుసరించేవారు అని అంటారా? సగం ఫలితం వచ్చిన వారిని ఫాలోఫాదర్ జాబితాలో ఉంచుతారా? వారు ఆజ్ఞాకారులేనా? లేక మీరు కూడా సగంలోనే రాజీ అయిపోతారా? కొంచెం కొంచెం తేడా ఉండటం ఇష్టమా? ఆదిలో మాల కూడా తయారు చేసేవారు, బంగారు, వెండియుగాల్లోకి వెళ్ళేవారి యొక్క జాబితా కూడా తీసేవారు. ఇప్పుడు మరలా జాబితా తీయమంటారా? లేదా వెండిలో పేరు చూసుకుని రాగిలోకి వెళ్ళిపోతారా? 

సమయం యొక్క సూచన బాబా అయితే ఇస్తూనే ఉన్నారు కానీ ప్రకృతి కూడా ఇస్తుంది. ప్రకృతి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది మరియు సమయప్రమాణంగా మీరు కూడా ఇతరులకి సూచన ఇస్తూ ఉంటారు. ఉపన్యాసాలలో అందరికి చెప్తారు - సమయం వచ్చేసింది, వచ్చేసింది అని. అలాగే స్వయానికి స్వయం చెప్పుకుంటున్నారా లేదా కేవలం ఇతరులకే చెప్తున్నారా? ఇతరులకి చెప్పటం అయితే సహజం కదా? స్వయం కూడా ఆ ప్రతిజ్ఞను స్మృతిలోకి తెచ్చుకోండి. సమయ ప్రమాణంగా మీ పురుషార్ధం యొక్క వేగం ఏమిటి? బాప్ దాదా ఒక విషయం గురించి లోలోపలే నవ్వుకుంటున్నారు. ఏ విషయానికి నవ్వుకుంటున్నారో తెలుసా? ఒకవైపు చాలామంది పిల్లలు ఒక్కొక్కసారి ఒక సెకను అనుకుంటున్నారు సమయప్రమాణంగా పురుషార్థంలో తీవ్రత ఉండాలి అని మరల రెండవ వైపు మాయా ప్రభావం పడినప్పుడు రెండవ సెకను అనుకుంటున్నారు ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయి, ఇది మహారథీల నుండి కూడా పరంపరగా వస్తుంది అని. అప్పుడు బాప్ దాదా ఏం చేస్తారు? కోప్పడరు కదా! నవ్వుకుంటారు. దీనికి విశేష కారణం - సమయానుసారం పురుషార్థాన్ని చాలా సహజం చేసేశారు. స్వభావాన్ని సహజం చేయటం లేదు, స్వభావంలో గట్టిగా ఉంటున్నారు మరియు పురుషార్ధంలో సహజంగా అయిపోతున్నారు. మరలా సహజయోగం కదా అని అనుకుంటున్నారు, కానీ జీవితంలో, పురుషార్థంలో సహజంగా ఉండటం అనేది సహజయోగం కాదు. ఎందుకంటే సహజంగా ఉండటం వలన శక్తులు గుప్తం అయిపోతున్నాయి, ప్రత్యక్షం అవ్వటం లేదు. మీరందరు మీ బ్రాహ్మణ జీవితం యొక్క ఆది సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయంలో ఏవిధమైన పురుషార్థం ఉండేది? సహజ పురుషార్ధం ఉండేదా లేదా ధ్యాసతో కూడిన పురుషార్ధం ఉండేదా? ధ్యాసతో, ఉత్సాహ,ఉల్లాసాలతో ఉండేవారు కానీ ఇప్పుడు సోమరితనం యొక్క డన్ లప్ పరుపు, తలగడ లభించాయి. విశ్రాంతిని ఇష్టపడేవారిగా సాధనాలు తయారుచేసేశాయి. మీ యొక్క ఆది పురుషార్థం, సేవ మరియు ఉత్సాహ, ఉల్లాసాలు ఎలా ఉండేవో పరిశీలించుకోండి. ఎలా ఉండేవారు? విశ్రాంతిని ఇష్టపడేవారా? (లేదు) మరియు అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా విశ్రాంతి కావాలా? సాధనాలు సేవకోసం లభించాయి. కానీ స్వయానికి విశ్రాంతిని ఇచ్చేటందుకు కాదు. ఇప్పుడు ఆ డన్ లప్ పరుపు, తలగడను తీసేయండి. పట్టాపై కూర్చునే రాణులు, రాజులుగా అవ్వండి. మంచంపై పడుకోండి కానీ స్థితి మాత్రం పట్టారాణి, రాజులుగా ఉండాలి. ఆదిలో సేవా సమయంలో సాధనాలు ఉండేవి కాదు కానీ సాధన ఎంత శ్రేష్టంగా ఉండేది! ఆదిలోని ఆ సాధనయే ఇంత వృద్ధి చేసింది. సాధన అనే బీజాన్ని విస్తారంలో దాచేయకండి. విస్తారం ఎక్కువైనప్పుడు బీజం కనిపించదు. అలాగే సాధన అనేది బీజం; విస్తారం అంటే సాధనాలు. సాధన యొక్క బీజాన్ని దాగనివ్వకండి. ఇప్పుడు మరల బీజాన్ని ప్రత్యక్షం చేయండి. 

బాప్ దాదా ఈ సీజన్లో పని ఇచ్చారు కానీ చేయలేదు. ఏమి పని ఇచ్చారో జ్ఞాపకం ఉందా? లేదా పుస్తకాలలో ఉందా? బాబా ఇచ్చిన పని ఏమిటంటే - బేహద్ వైరాగ్యవృత్తి గురించి స్వయంలో మరియు ఇతరులతో చర్చ చేయండి మరియు ఈ సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షంలోకి తీసుకుని రండి అని. అయితే చేశారా? ఒకరోజు డిబెట్, వర్క్ షాప్ చేసేశారు కానీ అది కార్యంలోకి తీసుకురాలేదు. వర్తమాన సమయప్రమాణంగా ఇప్పుడు మీ యొక్క సేవ లేదా సేవాస్థానాల యొక్క దినచర్యలో బేహద్ వైరాగ్యవృత్తి ఉండేలా తయారుచేసుకోండి. ఇప్పుడు విశ్రాంతి యొక్క దినచర్య కలిసిపోయింది. ఈ సోమరితనం శరీరం యొక్క చిన్న చిన్న రోగాలను కూడా సాకులుగా తయారుచేస్తుంది. ఆదిలో అనారోగ్యంగా ఉన్నా కానీ సేవ యొక్క ఉల్లాసం అనారోగ్యాన్ని కూడా మరిపింపజేసేది. మీ మనస్సుకి ఇష్టమైన సేవ ఏదైనా ఉంటే అనారోగ్యం జ్ఞాపకం వస్తుందా? మీకు ఆరోగ్యం సరిగా లేదు కదా ఈ సేవ ఇంకొకరిని చేయనివ్వండి అని ఇన్ చార్జ్ అక్కయ్య చెప్తే చేయనిస్తారా? ఆ సమయంలో జ్వరం లేదా తలనొప్పి ఎక్కడికి వెళ్ళిపోతాయి? మరల ఏదైనా సేవ చేయటం ఇష్టం లేకపోతే ఏమౌతుంది? తలనొప్పి వచ్చేస్తుంది, కడుపు నొప్పి కూడా వచ్చేస్తుంది. ఒకవేళ జ్వరం అని సాకు చెప్తీ టీచర్ ధర్మామీటర్ పెట్టుకోమని అంటారు కానీ తలనొప్పి, కడుపునొప్పికి అయితే ధర్మామీటరే లేదు కదా! మూఢ్ సరిగ్గా లేకపోతే కడుపునొప్పి అంటారు. ఇవి సోమరితనం యొక్క సాకులు. బేహద్ వైరాగ్యవృత్తి గుప్తం అయిపోయింది. సాకులు ప్రత్యక్షం అయ్యాయి. బాప్ దాదా చూస్తున్నారు - పిల్లలందరు చాలా స్నేహంతో మధువనం చేరుకున్నారు. స్నేహం అయితే చూపించారు దానికి శుభాకాంక్షలు. బాప్ దాదాకి కూడా పిల్లలందరి సంతోషం చూసి సంతోషం వస్తుంది కానీ ఇక ముందు ఏమి చేయాలి? కేవలం మధువనం వరకు రావటమేనా లేదా స్నేహం యొక్క రుజువు చూపించటానికి ఫరిస్తా రూపంలో వతనానికి చేరుకోవాలా? ఏం చేయాలి? మధువనం వరకు చేరుకున్నారు. దీనికైతే శుభాకాంక్షలు కానీ ఫరిస్తా అయ్యి వతనానికి ఎప్పుడు చేరుకుంటారు? నడుస్తూ, ఆరుగుతూ అందరికి ఫరిస్తాగా కనిపించాలి. మాట, నడవడిక, జీవనవిధానం అన్నింటిలో ఫరిస్తాగా అవ్వాలి. మరియు ఫరిస్తా అంటేనే డబల్ లైట్ అని అర్థం. దినచర్యలో తేలికగా అవ్వకూడదు కానీ సంబంధ, సంపర్కాలలో, స్థితిలో తేలికగా ఉండాలి. తేలికగా అవ్వటం వస్తుందా లేదా బరువు ఆకర్షిస్తుందా? బాప్ దాదా స్నేహానికి రుజువు చూడాలనుకుంటున్నారు. స్నేహానికి రుజువు ఇస్తే మీరు చప్పట్లు కొట్టవలసిన పని లేదు. మాయ, ప్రకృతి మీకు చప్పట్లు కొడతాయి. మాయ కూడా ఓహో విజయీ! ఓహో!! అంటూ చప్పట్లు కొడుతుంది, ప్రకృతి కూడా చప్పట్లు కొడుతుంది. ఇప్పుడు కొంచెం పరివర్తన చేయండి. 

ఈ రోజు సీజన్ యొక్క చివరి మేళా. విదేశీయుల సీజన్ వేరు కానీ భారతదేశం యొక్క ప్రోగ్రామ్ ప్రమాణంగా ఈరోజు చివరి రోజు. మేళా యొక్క విషయం వేరు. మొత్తం సీజన్లో కలుసుకోవటం, మనోరంజనంగా ఉండటం, సంతోషంగా జరుపుకోవటం ఇది చాలా బావుంది కానీ రుజువు ఏమిటి! అనేది బాప్ దాదా చూస్తున్నారు. సెంటర్స్  అయినా లేదా మీ కుటుంబంలో ఉంటున్నా కూడా మీ దినచర్యను పరివర్తన చేసుకోండి. ఇంకేమి పరివర్తన చేసుకోవాలి? తండ్రిని అనుసరించాలి. బ్రహ్మాబాబా ఏం చేసారు? బ్రహ్మాబాబా సోమరితనంగా ఉండేవారా? రుజువు ఉంది కదా, చివరి రోజు వరకు విశ్రాంతి తీసుకున్నారా? బ్రహ్మాబాబా అంటే స్నేహం ఉంది కదా? ఎంత స్నేహం ఉంది? (అతి స్నేహం ఉంది) మరియు రుజువు ఎంత చూ పించారు? దీనిలో అతిగా చూపించాము అని అనటంలేదు. ఇప్పుడు స్వయాన్ని స్నేహంతో పాటు శక్తిశాలిగా తయారుచేసుకోండి. స్వయం యొక్క పరివర్తనలో శక్తిరూపంగా అవ్వండి. సహజయోగం, సహజయోగం అంటూ సోమరితనంలోకి రాకండి. బాప్ దాదా చూస్తున్నారు, స్వయం పట్ల, సేవ పట్ల, ఇతరుల సంబంధ, సంపర్కాల పట్ల సోమరితనం ఎక్కువగా వచ్చేసింది. అందరూ ఇలాగే నడుస్తున్నారు అని ఆలోచించకండి. ఒకరినొకరు కాపీ చేయకండి, బాబాని కాపీ చేయండి. ఇతరులను చూసే అలవాటు కొద్దిగా ఎక్కువైపోయింది. తమని తాము చూసుకోవటంలో సోమరితనం వచ్చేసింది. బాప్ దాదా చెప్పారు కదా, దగ్గరదృష్టి బలహీనం అయిపోయింది మరియు దూరదృష్టి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? సీజన్ యొక్క ఫలం ఏమి ఇస్తారు? బాబా వచ్చారు, కలుసుకున్నాము, జరుపుకున్నాము, మురళి విన్నాము ఇదే ఫలమా? ప్రతి సీజన్ బట్టి ఫలం ఉంటుంది కదా? ఈ సీజన్లో బాప్ దాదాకి ఏ ఫలం భోగ్ (నైవేద్యం) చేస్తారు? భోగ్ చేసేటప్పుడు ఫలం కూడా పెడతారు కదా! అవైతే బజార్లో దొరుకుతాయి అదేమీ గొప్పవిషయం కాదు. ఇప్పుడు ఈ సీజన్లో ఏ ఫలం పంచిపెడతారు లేదా భోగ్ చేస్తారు? చేస్తారా లేదా కష్టమా? నెంబర్ వన్ భోగ్ ఎక్కడినుండి వస్తుందో చూస్తాను. ప్రతిజ్ఞలు అయితే చాలా బాగా చేస్తున్నారు, ఎప్పుడు కాదు అనటంలేదు, అవును అనే అంటున్నారు. సంతోషం చేసేస్తున్నారు కానీ ఇప్పుడేమి చేస్తారు? అందరి సెంటర్స్ యొక్క భోగ్ చూస్తాను. కుటుంబంలో ఉండేవారు కూడా భోగ్ చేస్తున్నారా లేదా స్వయమే తినేస్తున్నారు? ఇది కేవలం సెంటర్స్ లో ఉండేవారి పనే అని అనుకోకండి. ఇది అందరి పని. ఆజ్ఞాకారి యొక్క అడుగు ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. 

నాల్గవ అడుగు - నమ్మకధారి. ఎప్పుడు మనస్సుతో, బుద్ధితో, సంకల్పంతో బాబాతో అవిధేయతగా ఉండకూడదు. నమ్మకధారి అంటే సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. సంకల్పంలో కూడా దేహం, దేహ సంబంధీకులు, దేశం యొక్క పదార్థాలు, దేహధారి వ్యక్తులు ఆకర్షితం చేయకూడదు. భార్యాభర్తలు పరస్పరం నమ్మకంగా ఉంటారు స్వప్నంలో అయినా ఇతరుల స్మృతి వస్తే నమ్మకధారి అని అనరు. బ్రహ్మాబాబాని చూడండి సంకల్పం కూడా ఇతరులవైపు ఉండేది కాదు. అన్నీ ఒకే బాబాయే అటువంటి వారినే నమ్మకధారి అంటారు. ఒకవేళ పదార్థాల యొక్క ఆకర్షణ కానీ, సాధనాల యొక్క ఆకర్షణ కానీ ఉంటే సాధన ఖండితం అయిపోతుంది. నమ్మకం ఖండితం అయిపోతుంది. ఖండితం అయినది ఎప్పుడు సంపన్నంగా, పూజ్యంగా కాలేదు. అందువలన పరిశీలించుకోండి సంకల్పంలో కూడా ఏ ఆకర్షణ అవిధేయతగా తయారు చేయటం లేదు కదా? అని. ఒకవేళ కొంచెంగా అయినా ఎవరి పట్ల అయినా విశేష తగుల్పాటు ఉంటే, కొంచెం అయినా వ్యక్తిగత తగుల్పాటు ఉంటే, ఏదైనా గుణంపై, మంచి సంస్కారాలపై అయినా ఎక్కువగా ప్రభావితం అయితే వారిని నమ్మకధారి అని అనరు. అందరి విశేషతపై, బేహద్ విశేషతపై ఆకర్షితం అవ్వటం అనేది వేరే విషయం కానీ ఎవరైనా విశేష వ్యక్తి లేదా వైభవానికి ఆకర్షితం అయితే నమ్మకధారి జాబితా నుండి ఖండితం అయిపోతారు. అందువలన పరిశీలించుకోండి ఖండిత మూర్తిని కాదు కదా? అని. పూజ్యులే కదా? ఎక్కడైనా ఎక్కువ తగుల్పాటు,లొంగుపాటు లేదు కదా? సంకల్పంలో కూడా తగుల్పాటు ఉండకూడదు. వాచా, కర్మణా విషయం వదిలేయండి కానీ సంకల్పంలో అయినా ఉంటే ఖండితుల జాబితాలోకి వచ్చేస్తారు. పరిశీలించుకోవటం వస్తుంది కదా? మంచిది. 

ఇప్పుడు ఏదైనా నవీనత చూపించండి. క్రొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. బాప్ దాదాకి ఆదిలో బేహద్ వైరాగ్యం సదా జ్ఞాపకం వస్తుంది. ఆ సమయం యొక్క ఫలాలు మీరే. బేహద్ వైరాగ్యవృత్తి లేకపోతే స్థాపన యొక్క వృద్ది ఇంతగా జరిగేది కాదు. బ్రహ్మాబాబా అంతిమం వరకు పెద్ద వయస్సు అయినా కానీ తనువు యొక్క కర్మలఖాతా పూర్తి చేసుకుంటూ కూడా బేహద్ వైరాగ్య స్థితిని ప్రత్యక్షంగా చూపించారు. సాధనాలను స్వయం కోసం స్వీకరించలేదు. సేవ కోసం ఉండటం వేరు. స్వయం కొరకు స్వీకరించటం మరియు సేవ కొరకు కార్యంలో ఉపయోగించటంలో ఉన్న తేడా తెలుసు కదా? స్వయం పట్ల బేహద్ వైరాగ్యవృత్తి ఉండాలి, సేవ కొరకు సాధనాలను కార్యంలో ఉపయోగించండి. కానీ సాధనాలు సోమరితనంలోకి తీసుకురాకూడదు. అయితే బాబాని అనుసరించాలి కదా లేదా ఇక ముందు వచ్చేవారు అనుసరించాలా? మీరే చేయాలి. పిల్లలని సదా ఏమంటారు? కులదీపాలు. బ్రాహ్మణకులంలో సదా వెలిగి ఉండే దీపాలే కదా? బాబా యొక్క శ్రేష్ట ఆశల దీపాన్ని వెలిగించే కులదీపాలే కదా! 

నలువైపుల ఉన్నటువంటి స్నేహానికి రుజువు ఇచ్చేవారికి, ప్రతి ఆజ్ఞను సంకల్పం, మాట మరియు కర్మలోకి తీసుకువచ్చేవారికి, సదా స్వయాన్ని బాబా సమానంగా సాధారణంగా (సింపుల్) మరియు ఉదాహరణగా(సేంపిల్)గా తయారు చేసుకునేవారికి, బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసేవారికి, ఈవిధంగా శక్తిశాలి బాబా సమానంగా అయ్యే ధృడసంకల్పధారి పిల్లలందరికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే

Comments