25-02-2006 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈ ఉత్సవ రోజున మనస్సు యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో మాయ నుండి ముకులయ్యే వ్రతాన్ని తీస్కోండి, దయాసాగరులై మాస్టర్ ముక్తిదాతలు కండి, బాబా వెంట వెళ్ళాలంటే బాబా సమానంగా అవ్వండి.
ఈ రోజు నలువైపుల ఉన్న అతి స్నేహి పిల్లల యొక్క ఉత్సాహ ఉల్లాసాలు నిండిన మధురాతి మధుర ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనస్సులో బాప్ దాదా యొక్క జన్మదినోత్సపు ఉల్లాసంతో కూడిన శుభాకాంక్షలు నిండి ఉన్నాయి. మీరందరూ కూడా ఈరోజు విశేషంగా శుభాకాంక్షలు ఇచ్చేటందుకు వచ్చారా లేక తీసుకునే టందుకు వచ్చారా? బాప్ దాదా కూడా ప్రతి ఒక్క గారాభమైన ప్రియమైన బిడ్డకు జన్మదినోత్సవం యొక్క పదమాపదమ్ పదమా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ రోజుకి ఉన్న విశేషత మొత్తం కల్పంలో ఏ రోజుకీ ఉండదు. ఈ రోజు తండ్రి మరియు పిల్లలు ఇద్దరి యొక్క జన్మదినోత్సవం. కనుక దీనిని విచిత్ర జయంతి అని అంటారు. మొత్తం కల్పం అంతా తిరిగి చూడండి ఇటువంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా? ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క జయంతి జరుపుకుంటున్నారు. మరియు పిల్లలు బాప్ దాదా యొక్క జయంతి జరుపుకుంటున్నారు. అనడానికి అయితే శివజయంతి అని అంటారు కానీ ఈ జయంతిలో అనేకుల జయంతి ఇమిడి ఉంది. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు ఇద్దరి యొక్క జన్మదినం ఒకటే. ఇది అతి ప్రేమకు గుర్తు. తండ్రి పిల్లలు లేకుండా ఏమి చేయలేరు మరియు పిల్లలు తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. కలిసి జన్మించారు. సంగమయుగంలో కూడా కలిసే ఉంటారు ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు ఇద్దరు కంబైండ్. విశ్వ కళ్యాణం యొక్క కార్యం కూడా కలిసే చేస్తారు. బాబా కూడా ఒంటరిగా చేయలేరు, పిల్లలు కూడా ఒంటరిగా చేయలేరు. ఇద్దరు వెనువెంట ఉన్నారు. బాబా యొక్క ప్రతిజ్ఞ వెంటే ఉంటాను, వెంటే నడుస్తాను, వెంటే తీసుకువెళ్తాను. ప్రతిజ్ఞ ఉంది కదా - తండ్రి మరియు పిల్లలకి ఎంత ప్రేమో చూసారా? చూసారా లేక అనుభవం చేసుకుంటున్నారా? ఈ శివజయంతి రోజున భక్తులు భగవంతుడా రా! అని పిలుస్తున్నారు. ఎప్పుడు వస్తారు, ఏవిధంగా వస్తారు అని ఆలోచి స్తున్నారు. కానీ మీరు జరుపుకుంటున్నారు.
భక్తులపై బాప్ దాదాకి స్నేహం కూడా వస్తుంది మరియు దయ కూడా వస్తుంది. ఎంతో ప్రయత్నిస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. మీరు వెతికారా లేక బాబా మిమ్మల్ని వెతికారా? ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరయితే ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కానీ బాబా చూడండి - పిల్లలు ఏ మూలలో దాగి ఉన్నా కానీ వెతికి పట్టుకున్నారు. ఈ రోజు కూడా భారతదేశపు అనేక రాజ్యాల నుండి వచ్చారు. విదేశీయులు కూడా తక్కువ కాదు. 100 దేశాల నుండి వచ్చారు. మీరు ఏమి శ్రమ చేశారు? బాబా వారిగా అవ్వడానికి ఏమి శ్రమ చేశారు? శ్రమ చేశారా? చేశారా శ్రమ? శ్రమించిన వారు చేతులెత్తండి. బాబాని వెతకటం అయితే భక్తిలో చేశారు కానీ బాబా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత శ్రమ చేశారా? చేశారా శ్రమ? సెకనులో వ్యాపారం చేసేశారు. ఒక మాటలో వ్యాపారం జరిగిపోయింది. ఆ ఒక్క మంటు ఏమిటి ? " అనే ఒక మాట. పిల్లలు అన్నారు నా బాబా అని, బాబా అన్నారు నా పిల్లలు అని. వ్యాపారం అయిపోయింది అంతే. చౌక వ్యాపారమేనా? చౌకే కదా! కొంచెం కొంచెం కష్టం అనేవారు చేతులెత్తండి. కష్టమని భావించేవారు చేతులెత్తండి? అప్పుడప్పుడు కష్టమనిపిస్తుంది కదా? అనిపించటం లేదా? వాస్తవానికి సహజమే కానీ మీ బలహీనతలు శ్రమని అనుభవం చేయిస్తాయి.
బాప్ దాదా చూస్తున్నారు - భక్తులలో కూడా స్వార్ధ భక్తులు కాకుండా సత్యమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు వ్రతం పెట్టుకుంటారు. మీరందరు కూడా వ్రతం తీసుకున్నారు. వారు కొన్ని రోజులకే వ్రతం తీసుకుంటారు కానీ మీరు ఎటువంటి వ్రతం తీసుకున్నారంటే ఇప్పటి ఈ ఒక్క వ్రతం 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. వ్రతం పెట్టుకుంటారు కానీ మీరు కల్పంలో ఒకసారి వ్రతం తీసుకుంటున్నారు. దీని ద్వారా 21 జన్మలు మనస్సుతో, తనువుతో వ్రతం పెట్టుకోవలసిన అవసరం లేదు. వ్రతమైతే మీరు పెట్టుకుంటు న్నారు, కానీ ఏ వ్రతం? పవిత్ర వృత్తి, దృష్టి, కృతి, పవిత్ర జీవితం యొక్క వ్రతం తీసుకున్నారు. జీవితమే పవిత్రం అయిపోయింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యవ్రతమే కాదు కానీ జీవితంలో, ఆహారంలో, విహారంలో, సంసారంలో, సంస్కారంలో అన్నింటిలో పవిత్రంగా ఉండాలి. ఇటువంటి వ్రతం తీసుకున్నారు కదా? తీసుకున్నారా? చేతులు ఊపండి, తీసుకున్నారా? పక్కాగా తీసుకున్నారా? లేక కొద్దికొద్దిగా పచ్చిగా ఉందా? మంచిది. కామం అనే మహాభూతం గురించే వ్రతం తీసుకున్నారా లేక మిగిలిన నాల్గింటి గురించి కూడా తీసుకున్నారా? బ్రహ్మచారిగా అయితే అయ్యారు. కానీ మిగిలిన నాలుగు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్రతం తీసుకున్నారా? క్రోధం యొక్క వ్రతం తీసుకున్నారా? లేక దీనిని వదిలేశారా? క్రోధం గురించి అనుమతి లభించిందా? రెండవ నెంబర్ కదా పర్వాలేదు అని అనుకోవటం లేదు కదా? ఎలా అయితే కామాన్ని మహాభూతంగా భావించి మనసా, వాచా, కర్మణాలో పక్కా వ్రతం తీసుకున్నారు కదా? అదేవిధంగా క్రోధం యొక్క వ్రతం తీసుకున్నారా? క్రోధం యొక్క పిల్లలు లోభ, మోహ, అహంకారాలు వాటి విషయం తర్వాత కానీ ఈరోజు బాబా క్రోధం గురించి అడుగుతున్నారు. మనస్సులో కూడా క్రోధం ఉండకూడదు. హృదయంలో కూడా క్రోధం యొక్క ఫీలింగ్ ఉండకూడదు. ఈ విధంగా క్రోధం యొక్క వ్రతం తీసుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు శివజయంతి కదా! భక్తులు వ్రతం పెట్టుకుంటారు, కనుక బాప్ దాదా కూడా వ్రతం గురించి అడుగుతున్నారు. కలలో కూడా క్రోధం యొక్క అంశం మా దగ్గరకి రాలేదు అనేవారు చేతులెత్తండి. రాలేదా? రావటం లేదా? మంచిది. వీరికి ఫోటో తీయండి. చేతులెత్తిన వారికి ఫోటో తీయండి. మీరు చేతులెత్తినంత మాత్రాన బాప్ దాదా అంగీకరించరు. మీ సహయోగుల నుండి సర్టిఫికెట్ తీసుకోవాలి, ఆ తర్వాత బహుమతి ఇస్తాను. మంచిది. ఎందుకంటే బాప్ దాదా చూశారు క్రోధం యొక్క అంశం ఈర్ష్య, అసూయ రూపంలో వస్తుంది. ఈ ఈర్ష్య, అసూయ క్రోధం యొక్క పిల్లలు. ధైర్యం పెట్టుకున్న పిల్లలందరికీ బాప్ దాదా ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరలా సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత బహుమతి ఇస్తారు. ఎందుకంటే బాప్ దాదా ఏదైతే హోమ్ వర్క్ ఇచ్చారో దాని యొక్క ఫలితం కూడా బాప్ దాదా చూస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జన్మదినోత్సవానికి ఏమి చేస్తారు? కేక్ కట్ చేస్తారు. ఇప్పటికి రెండు నెలలు అయిపోయాయి. ఇంకొక నెల మిగిలి ఉంది. ఈ రెండు నెలలలో మీరు వ్యర్థ సంకల్పాల యొక్క కేక్ కట్ చేసారా? ఆ కేక్ అయితే ఆ సహజం. కట్ చేస్తారు కదా! ఈ రోజు కూడా కట్ చేస్తారు. కానీ వ్యర్థ సంకల్పాల యొక్క కేక్ కట్ చేశారా? చేయవలసి ఉంటుంది కదా? ఎందుకంటే బాబా వెంట వెళ్ళాలి కదా! ఇది పక్కా ప్రతిజ్ఞ కదా! వెంటే ఉంటాము, వెంటే వెళ్తాము అని పక్కా ప్రతిజ్ఞ కదా! మరి వెంట వెళ్ళాలి అంటే సమానంగా తయారుకావాలి కదా! ఈరోజు జన్మదినోత్సవం జరుపుకునేటందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. విమానంలో వచ్చారు. రైలులో వచ్చారు, కార్లలో వచ్చారు. బాప్ దాదాకి సంతోషం ఉంది. పరుగు పరుగున వచ్చారు. జన్మదినోత్సవానికి బహుమతి కూడా ఇస్తారు కదా! ఇక ఒక నెల మిగిలి ఉంది. హోలీ రాబోతుంది. హోలీకి కాలుస్తారు కదా! అలాగే మీలో మిగిలి ఉన్నటువంటి వ్యర్ధ సంకల్పాల యొక్క బీజాన్ని కాల్చండి. ఒకవేళ బీజం మిగిలిపోతే దాని నుండి అప్పుడప్పుడు కాండం, కొమ్మలు వస్తాయి. కనుక ఈ శివరాత్రి ఉత్సవమున మనస్సు యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో, నోటి యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో కాదు, మనస్సు యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో మిగిలి ఉన్న వ్యర్ధ బీజాన్ని సమాప్తి చేయండి. మనసా, వాచా, సంబంధ సంపర్కాలలో మిగిలి ఉన్న బీజాన్ని బాబాకి జన్మదినోత్సవ బహమతిగా ఇస్తారా? మనస్సు యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో ఇస్తారా? దీని ద్వారా లాభం మీకే, బాబా అయితే చూస్తూ ఉంటారు. ధైర్యంతో, ఉత్సాహ ఉల్లాసాలతో చేసి చూపిస్తాం అనేవారు చేతులెత్తండి. మాటలో కూడా రాకూడదు. సంబంధ సంపర్కంలో కూడా రాకూడదు. ధైర్యం ఉందా? ఉందా ధైర్యం? మధువనం వారిలో కూడా ఉంది, భారతదేశం వారిలో కూడా ఉంది, విదేశం వారిలో కూడా ఉంది ఎందుకంటే బాప్ దాదాకి పిల్లలపై ప్రేమ ఉంది, కనుకనే అందరు కలిసే వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎవరూ ఉండిపోకూడదు. ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేశారో సమానంగా అవ్వవలసే ఉంటుంది. ప్రేమ ఉంది కదా! కష్టంతో చేతులు ఎత్తలేదు కదా? బాప్ దాదా ఈ సంఘటనని, బ్రాహ్మణ పరివారాన్ని బాబా సమాన మూర్తిగా చూడాలను కుంటున్నారు. కేవలం ధృడ సంకల్పం చేసే ధైర్యం పెట్టుకోండి. కష్ట విషయమేమీ కాదు కానీ దీని కొరకు సహన శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి అవసరం. ఎవరిలో అయితే సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ఉంటాయో వారు సహజంగా క్రోధముక్తులుగా అవుతారు. బ్రాహ్మణ పిల్లలైన మీకు బాప్ దాదా సర్వ శక్తులను వరదాన రూపంలో ఇచ్చారు. మీ టైటిల్ - మాస్టర్ సర్వశక్తివాన్. కేవలం ఒక స్లోగన్ స్మృతిలో ఉంచుకోవాలి. ఒక నెలలో బాబా సమానంగా అవ్వాలంటే ఒక స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోండి - దు:ఖం తీసుకోకూడదు మరియు దు:ఖం ఇవ్వకూడదు. కొంతమంది ఈరోజు ఎవరికీ దు:ఖం ఇవ్వలేదు కదా అని పరిశీలన చేసుకుంటున్నారు, కానీ తీసుకోవటంలో చాలా సహజంగా దు:ఖాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇతరులు ఇచ్చారు అనుకుని స్వయం గురించి వదిలేస్తారు. నేనేమైనా చేశానా ఏమిటి, వారే ఇచ్చారు అనుకుంటారు. కానీ మీరు ఎందుకు తీసుకున్నారు తీసుకునేవారు మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు పొరపాటు చేశారు దాని యొక్క లెక్కాచారం బాబాకి, డ్రామాకి తెలుసు కానీ అసలు మీరెందుకు తీసుకున్నారు? బాప్ దాదా ఫలితంలో చూసింది ఏమిటంటే ఇవ్వటంలో ఆలోచిస్తున్నారు కానీ తీసుకోవటంలో చాలా త్వరగా తీసుకుంటున్నారు, అందువలన సమానంగా అవ్వటం లేదు. ఎవరు ఎంత దు:ఖం ఇచ్చినా కానీ తీసుకోకూడదు లేకపోతే ఫీలింగ్ యొక్క జబ్బు పెరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న విషయాలలో ఫీలింగ్ పెరిగిపోతే వ్యర్ధ సంకల్పాలు సమాప్తి అవ్వవు. అప్పుడు బాబా వెంట ఎలా వెళ్తారు? బాబాకి మీరంటే ప్రేమ కనుక బాబా మిమ్మల్ని వదలలేరు, అంటే తీసుకువెళ్తారు. అంగీకారమేనా? ఇష్టమే కదా? ఇష్టమైతే చేతులెత్తండి. వెనుక వెనుక రాకూడదు కదా! ఒకవేళ బాబా వెంట వెళ్ళాలంటే బాబాకి బహుమతి ఇవ్వవలసిందే. దు:ఖం ఇవ్వకూడదు మరియు దు:ఖం తీసుకోకూడదు అని ఒక నెల అందరు అభ్యాసం చేయండి. నేను ఇవ్వలేదు, వారే తీసుకున్నారు అని అనకూడదు. ఏదొకటి జరుగుతుంది కానీ పరదర్శనం చేయకూడదు, స్వదర్శనంలో ఉండాలి. నేనే అర్జునునిగా అవ్వాలి అని అనుకోవాలి.
బాప్ దాదా రిపోర్టులో చూశారు - ఇప్పటి వరకు కూడా చాలామందికి సంతుష్టత లేదు. అందువలన బాప్ దాదా మరలా ఒక నెల కోసం అండర్‌లైన్ చేయిస్తున్నారు. ఒక నెల అభ్యాసం చేస్తే అలవాటు అయిపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇది ఇలా అవుతూనే ఉంటుంది, ఇలా నడుస్తూనే ఉంటుంది .... అని తేలికగా వదిలేయకండి. బాప్ దాదాపై ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం క్రోధం అనే వికారాన్ని అర్పణ చేయలేరా? అర్పణ అవ్వటం అంటే ఆజ్ఞని అంగీకరించటం. వ్యర్థ సంకల్పాలు అంతిమ సమయంలో చాలా మోసం చేస్తాయి. ఎందుకంటే నలువైపుల దు:ఖం యొక్క వాయుమండలం, ప్రకృతి యొక్క వాయుమండలం మరియు ఆత్మల యొక్క వాయుమండలం మిమ్మల్ని ఆకర్షితం చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ వ్యర్ధ సంకల్పాల యొక్క అలవాటు అయిపోతే వ్యర్ధంలోనే అలజడి అయిపోతారు. భారతదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా అందరూ ఒకే బాప్ దాదా యొక్క పిల్లలు. కనుక నలువైపుల ఉన్న పిల్లలందరు ధైర్యం మరియు ధృడత ద్వారా సఫలతామూర్తులై విశ్వానికి ప్రకటించాలి - మేము పరమాత్మ పిల్లలం, మాలో కామం లేదు, క్రోధం లేదు అని. మీరు ఇతరులచే మధ్యపానాన్ని, ధూమపానాన్ని మానిపిస్తున్నారు. బాప్ దాదా ఈ రోజు ప్రతి ఒక్క పిల్లవానిని క్రోధముక్తులుగా, కామవికార ముక్తులుగా అయ్యే ధైర్యాన్నిచ్చి విశ్వ వేదికపై చూపించాలనుకుంటున్నారు. ఇష్టమేనా? దాదీలకు ఇష్టమేనా? మధువనం వారికి ఇష్టమేనా? మధువనం వారికి కూడా ఇష్టమే. విదేశీయులకు కూడా ఇష్టమేనా? ఇష్టమైన విషయం చేయటం ఏమీ కష్టం కాదు. బాప్ దాదా కూడా ఎగస్ట్రా కిరణాలు ఇస్తారు. వీరు ఆశీర్వాదాలు ఇచ్చే మరియు తీసుకునే బ్రాహ్మణపరివారం, అనే పటాన్ని ప్రపంచానికి చూపించాలి. ఎందుకంటే సమయం కూడా పిలుస్తోంది. బాప్ దాదా దగ్గరికి ఎడ్వాన్స్ పార్టీ వారి మనస్సు యొక్క పిలుపు వస్తుంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయింది. మాయ కూడా ముక్తిని కోరుకుంటుంది. ముక్తి ఇస్తున్నారు కానీ మధ్యమధ్యలో కొద్దిగా స్నేహం చేస్తున్నారు. ఎందుకంటే 63 జన్మల నుండి స్నేహి కదా! కనుక బాప్ దాదా చెప్తున్నారు - ఓ మాస్టర్ ముక్తిదాతలూ! ఇప్పుడు అందరికీ ముక్తినివ్వండి. ఎందుకంటే విశ్వమంతటికీ ఏదొక ప్రాప్తి యొక్క సహాయం కావాలి. ఇంకా ఎంతో పని చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో సమయం మీకు సహయోగిగా ఉంది. ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్లవలసిందే. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఇక తర్వాత సమయంలో మీరు పురుషార్ధం చేసినా కానీ సమయం లేని కారణంగా మీరు ఇవ్వలేరు. ఇప్పుడు సమయం ఉంది కనుక బాప్ దాదా చెప్తున్నారు - మొదట స్వయానికి ముక్తినివ్వండి. ఆ తర్వాత విశ్వంలోని సర్వాత్మలకు ప్రాప్తిని, ముక్తిని ఇవ్వండి. వారు పిలుస్తున్నారు. మీకు ఆ దు:ఖీ ఆత్మల పిలుపు వినబడడం లేదా? మీరు స్వయంలోనే బిజీ అయిపోతే ఆ పిలుపు వినబడదు. మాటిమాటికి పాడుతున్నారు - దు:ఖీ ఆత్మలపై దయ చూపించండి అని. ఇప్పటి నుంచే దయాళువు, కృపాళువు, దయా స్వరూపం యొక్క సంస్కారం చాలా సమయము నింపుకోకపోతే మీ జడ చిత్రాలలో దయ, కృప, జాలి యొక్క తరంగాలు ఎలా నిండుతాయి? డబల్ విదేశీయులు, మీరు కూడా దయాహృదయులై ద్వాపరయుగంలో జడ చిత్రాల ద్వారా అందరిపై దయ చూపిస్తారు కదా? మీ చిత్రం కూడా ఉంది కదా లేక భారతవాసీయుల చిత్రమేనా? విదేశీయులు మా చిత్రం అని భావిస్తున్నారా? చిత్రం ఏమి ఇస్తుంది? చిత్రాల దగ్గరికి వెళ్లి ఏమి అడుగుతారు? దయ, దయ అనే మాట వస్తుంది. ఇప్పుడు ఈ సంగమయుగంలోనే మీరు మీ ద్వాపరయుగం, కలియుగం యొక్క సమయం కోసం జడచిత్రాల కోసం సమయం యొక్క వాయు మండలం నింపుకుంటారు. అప్పుడు వారు మీ వంశావళియే కదా! మీరందరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సంతానం కనుక భక్తులైనా, దు:ఖీ ఆత్మలైనా కానీ మీ వంశావళియే. మరి మీకు దయ రావటం లేదా? వస్తుంది కానీ కొద్ది కొద్దిగా మరలా ఎక్కడో బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు మీ పురుషార్ధంలో ఎక్కువ సమయం ఉపయోగించకండి. ఇవ్వటంలో ఉపయోగించండి. అప్పుడు ఇవ్వడమే తీసుకోవడం అవుతుంది. చిన్న చిన్న విషయాలలో కాదు. ముక్తి రోజు జరుపుకోండి. ఈ రోజుని ముక్తి రోజుగా జరుపుకోండి సరేనా? మొదటి వరుసలోని వారు సరేనా? మధువన నివాసీయులూ సరేనా? ఈ రోజు మధువనం వారు చాలా ప్రియంగా అనిపిస్తున్నారు. ఎందుకంటే మధువనం వారిని అందరూ చాలా త్వరగా అనుసరిస్తారు కదా! కనుక మధువనం వారు ముక్తి రోజుని జరుపుకుంటే అందరూ జరుపుకుంటారు. మధువన నివాసీయులు అయిన మీరందరు ముక్తిదాతలు అవ్వాలి. అవ్వాలా? చాలా మంచిది. మంచిది. చాలా చాలా మంచివారు. నమ్మకదారులు ఎందుకంటే మధువన నివాసీయులు చాలా సమీపంగా ఉండేవారు. సమీపంగా ఉండేవారు ప్రియంగా కూడా ఉంటారు. మధువనం వారు ప్రియమైనవారు కదా! సమీపంగా ఉండే వారు మరియు ప్రియమైన వారు. మీరందరు కాదు అని కాదు. మీరు కూడా ప్రియమైన వారే కానీ వారు సమీపంగా ఉంటారు. సమీపంగా ఉండే లాభంతో పాటు చేసే విషయంలో కూడా లాభం పొందుతారు కదా! నలువైపులా ఉన్న ప్రియమైన మరియు అదృష్టవంతులైన పిల్లలకు, సదా స్వరాజ్యం ద్వారా స్వ పరివర్తన చేసుకునే రాజా పిల్లలకు, సదా ధృడత ద్వారా సఫలతను పొందే సఫలతా సితారలకు, సదా సంతోషంగా ఉండే సంతోషవంతులైన పిల్లలకు, తండ్రి మరియు పిల్లల యొక్క జన్మదినోత్సవ చాలా చాలా శుభాకాంక్షలు. ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు. ఇటువంటి శ్రేష్ట పిల్లలకు నమస్తే.
బాప్ దాదా తన హస్తాలతో జెండా ఎగురవేశారు మరియు పిల్లలందరికీ 70వ త్రిమూర్తి శివజయంతి యొక్క శుభాకాంక్షలు ఇచ్చారు
ఇప్పుడు ఎగురవేసిన ఈ జెండా ప్రజల సేవార్ధం ఎగురవేశారు. కానీ మీ హృదయంలో తండ్రి ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతూ ఉంది. ఈ జెండా సదా ఎగురుతూనే ఉంటుంది. మీ హృదయంలో ప్రభు ప్రేమ యొక్క జెండా ఏదైతే ఎగురుతూ ఉందో మీ ఆ హృదయం యొక్క వాయు మండలం విశ్వమంతా వ్యాపిస్తుంది. మీ హృదయంలో ప్రేమ యొక్క వాయుమండలం అయస్కాంతం వలె వ్యాపిస్తుంది. అందరూ తమ నోటివెంట అంటారు వచ్చేశారు.. వచ్చేసారు అని. అటువంటి రోజు రానుంది. ఇప్పుడు ఈ జెండా ఎగురవేస్తున్నారు. ఇప్పుడు త్వరలో ప్రత్యక్షతజెండా ఎగురవేస్తారు. ఎందుకంటే బాప్ దాదాపై పిల్లలందరికీ హక్కు ఉంటుంది. మరియు బాబా కూడా ఏదోక ప్రాప్తి ఇవ్వవలసి ఉంటుంది కదా! మీకు జీవన్ముక్తి వారికి ముక్తి. వారు ముక్తిలోనే సంతోషపడతారు. మీరు జీవన్ముక్తిలో సంతోషంగా ఉంటారు. మీకు డబల్ అంటే జీవితం ఉంటుంది, ముక్తి ఉంటుంది. వారికి అయితే కేవలం ముక్తి ఉంటుంది. ఇలా హృదయంలో బాబా ప్రేమ యొక్క జెండా ఎగురవేసే నలువైపులా పిల్లలకు శుభాకాంక్షలు.. శుభాకాంక్షలు..
Comments
Post a Comment