22-12-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వప్రాప్తి సంపన్నజీవితం యొక్క విశేషత - అప్రసన్నత నుండి ముక్తులుగా మరియు ప్రసన్నతాయుక్తులుగా ఉండాలి.
ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్ దాదా తన ప్రేమ స్వరూప ఆత్మలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ప్రేమ నిండి ఉంది. ఈ పరమాత్మ ప్రేమ ఒకే జన్మలో లభిస్తుంది. 83 జన్మలు దేవాత్మల ద్వారా లేదా సాధారణాత్మల ద్వారా లభిస్తాయి. ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి, మొత్తం కల్పం తిరగండి. స్వదర్శనచక్రధారులే కదా! ఒక్క సెకనులో మొత్తం కల్పం తిరిగి వచ్చారా? 83 జన్మలలో పరమాత్మ ప్రేమ ఎప్పుడైనా లభించిందా? లభించలేదు కదా! ఈ సంగమయుగం యొక్క ఒక జన్మలోనే పరమాత్మ ప్రేమ లభిస్తుంది. ఆత్మల ప్రేమలో మరియు పరమాత్మ ప్రేమలో ఎంత తేడా ఉంది! తేడా అయితే తెలుసుకున్నారు కదా! సాధారణాత్మల ప్రేమ ఎక్కడికి తీసుకువెళ్ళింది? దాని ద్వారా ఏమి లభించిందో అనుభవమే కదా! మరియు పరమాత్మ ప్రేమ ఎక్కడికి తీసుకువస్తుంది? మీ మధుర ఇంటికి లేదా మధుర రాజధానిలోకి తీసుకువెళ్తుంది. ఆత్మల యొక్క ప్రేమ రాజ్యభాగ్యాన్ని పోగొడుతుంది మరియు పరమాత్మ ప్రేమ రాజ్యభాగ్యాన్ని ఇప్పిస్తుంది. అది కూడా ఈ జన్మలోనే. కేవలం భవిష్యత్తు యొక్క ఆధారంగా నడవటం లేదు. స్వయంగా పరమాత్మ యొక్క ప్రాప్తి ఇప్పుడే లభిస్తుంది. వర్తమానం ముందు భవిష్యత్తు ఏమీ గొప్ప కాదు. స్వర్గంలో ఏమి ఉంటాయి, ఏమి ఉండవు? అనేది మీరు పాట పాడతారు కదా! మరియు ఇప్పటి పాట ఏమిటి? పొందవలసింది అంతా పొందాను..... లేదా పొందాలా? పొందారు కదా! పాండవులు పొందారా! గోపికలైతే మహిమ ఉండనే ఉంది. ఈ సమయం యొక్క మహిమ ఏమిటంటే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. దేవతల ఖజనాలో కాదు, బ్రాహ్మణుల ఖజానాలోనే అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. ఇప్పుడు బ్రాహ్మణులే కదా! అయితే అప్రాప్తి వస్తువు ఏదీ లేదు అని అనుభవం చేసుకుంటున్నారు కదా! మరియు ఈ ప్రాప్తులు కూడా అవినాశి, అల్పకాలికమైనవి కాదు. సర్వప్రాప్తులు ఉన్నవారి జీవితం యొక్క విశేషత ఏమిటి? అన్ని ప్రాప్తులు ఉన్నాయి, ఏ ప్రాప్తి లోటు లేదు అయితే వారి నడవడిక, ముఖంలో ఏమి కనిపిస్తుంది? సదా ప్రసన్నత కనిపిస్తుంది. ఏమైపోయినా కానీ సర్వప్రాప్తి స్వరూప ఆత్మ తన ప్రసన్నతను వదలదు. ఎప్పుడైనా అప్రసన్నత అనుభవం అవుతుంటే పరిశీలించుకోండి, అప్రాప్తి అనుభవం అవుతుందా? సర్వప్రాప్తులు అనుభవం అవుతున్నాయా? అని.
ఈరోజు బాప్ దాదా చాలా సేవాకేంద్రాలను మరియు ఉపసేవాకేంద్రాలను చూసారు. విదేశాలలో కాదు, భారతదేశంలో ఉన్న సేవాకేంద్రాలను చూసారు. సేవాకేంద్రంలో విశేషంగాసేవాధారులు ఉన్నారు. ఈరోజు బాబా అంతా తిరుగుతూ సేవాకేంద్రాలను, సేవాధారులను చూసారు. చిన్న, పెద్ద అన్ని స్థానాలలో పరిశీలించారు, సేవాధారులు తనువుతో, మనస్సుతో, ధనంతో మరియు సేవ యొక్క సంబంధ సంపర్కంతో ఎంత ప్రసన్నంగా ఉన్నారు? అని. ఎందుకంటే ఈ విషయాలే విశేషమైనవి కదా! అయితే ఏమి చూసారు? తనువు అయితే అందరిది పాతదే. యువకులైనా, పెద్దవారైనా, అక్కడక్కడ చిన్నవారు పెద్దవారి కంటే బలహీనంగా ఉన్నారు. ఎంత పెద్ద రోగం అయినా నేను బలహీనుడిని, నేను రోగిని అనే ఈ రోగం యొక్క భావన రోగాన్ని పెంచుతుంది. ఎందుకంటే తనువు యొక్క ప్రభావం మనస్సుపై పడినట్లయితే డబల్ రోగిగా అయిపోయినట్లు. తనువు మరియు మనస్సు రెండూ రోగిగా అయిపోతే మాటిమాటికి ఆత్మాభిమానిగా అవ్వడానికి బదులు రోగాభిమానిగా అయిపోతారు. అయితే ఏం చూసారు? ఎక్కువ మంది ఏ రోగమైనా లేదా కర్మల ఖాతా అయినా అది పూర్తి చేసుకుంటున్నారు కానీ 50% డబల్ రోగిగా ఉన్నారు మరియు 50% సింగిల్ రోగిగా ఉన్నారు. అసలు ఏమి అవ్వాలి? ఎప్పుడు కూడా నేను రోగిని, నేను రోగిని.... అని మనస్సులో రోగం యొక్క సంకల్పాలు రాకూడదు. కానీ జరిగేది ఏమిటి? నేను రోగిని... అనే పాఠం పక్కా అయిపోతుంది. ఒక్కొక్కసారి నిజానికి రోగం ఏమి ఉండదు కానీ మనస్సులో సంతోషం లేని కారణంగా నాకు నడుంనొప్పిగా ఉంది అని సాకు చెప్తారు. ఎందుకంటే ఎక్కువమందికి కాళ్ళు నొప్పులు లేదా నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒకోసారి నిజంగా నొప్పి ఉండదు. కానీ నాకు నడుంనొప్పిగా ఉంది అంటారు. దానిని ఎలా పరిశీలిస్తారు?నడుంనొప్పి ఉందా? లేదా? అని పరిశీలించే ధర్మామీటర్ వైద్యులు దగ్గర ఏమైనా ఉందా? ఎక్స్ రే తీయించాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. తనువు గురించి ఏమి చూసారో చెప్పారు. కొంతమంది సేవాధారులు ఇలా కనిపించారు. మీరందరు కూడా సేవాధారులే. ఇది టీచర్స్ విషయం అని అనుకోకండి. ప్రవృత్తిలో ఉండే మీరు కూడా సేవాధారులే కదా! ఒకోసారి మీ ఇంటికి కూడా వచ్చి చూస్తారు. ఎలా నిద్రపోతున్నారు, ఎలా మేల్కొంటున్నారు అన్నీ చూస్తారు. రెండు పడకలు ఉన్నాయా లేదా ఒకే పడక ఉందా అనేది కూడా చూస్తారు. ఇది ఈ రోజు తిరిగిన చక్రం యొక్క సమాచారం.
ఈనాటి లెక్కల్లో మందులు వేసుకోవటం ఏమీ గొప్ప విషయం కాదు. ఎందుకంటే వర్తమాన సమయంలో కలియుగం యొక్క శక్తిశాలి ఫలాలు ఈ మందులే. మందులలో కూడా చాలా రంగులు ఉంటాయి కదా! ఈ మందులు కలియుగ అంతిమం యొక్క ఫలాలు, ప్రేమగా తినండి, కష్టంగా మందులు వేసుకుంటున్నారు. అందువలన రోగం జ్ఞాపకం వస్తుంది. శరీరాన్ని నడిపించడానికి ఒక శక్తి నింపుకుంటున్నాను అనే స్మృతిలో మందు వేసుకుంటే ఆ మందు రోగాన్ని జ్ఞాపకం చేయదు. సంతోషాన్ని ఇస్తుంది, ఆ మందుతో రెండు, మూడు రోజులలో సరి అయిపోతుంది. ఈ రోజుల్లో చాలా క్రొత్త ఫ్యాషన్, కలియుగంలో అన్నింటికంటే పెద్ద ఆవిష్కరణ - ఈ మందులే. అన్నింటికీ వేర్వేరు పద్ధతులు వచ్చేసాయి, ఈ రోజు ఒక క్రొత్త పద్ధతి కనిపెడుతున్నారు, రేపు ఇంకొక క్రొత్త పద్ధతి కనిపెడుతున్నారు. ఇవి కలియుగ సీజన్ యొక్క శక్తిశాలి ఫలాలు, అందువలన భయపడకండి. కానీ మందును రోగం యొక్క అభిమానంతో వేసుకోకండి. తనువుకి రోగం వస్తూనే ఉంటుంది, ఇదేమీ కొత్త విషయం కాదు. అందువలన రోగంతో ఎప్పుడూ భయపడకండి. రోగం వచ్చింది దానికి కొన్ని ఫలాలు పెట్టండి, వీడ్కోలు ఇచ్చేయండి. ఇది తనువు యొక్క ఫలితం. ఇంకా ఏమి చూసారు?
మనస్సు గురించి ఏమి చూశారు? ఒక శుభవార్త ఏమిటంటే చాలామంది సేవాధారుల యొక్క మనస్సులో బాబా ప్రేమ మరియు సేవ యొక్క ఉల్లాసం రెండూ ఉన్నాయి. మిగిలిన 25 శాతం కొందరు కష్టంగా నడుస్తున్నారు. ఆ విషయం వదిలేయండి. కానీ చాలామంది మనస్సులో ఈ రెండు విషయాలు చూసారు. మరియు ఇది కూడా చూసారు, బాబాతో ప్రేమ ఉన్న కారణంగా స్మృతిలో శక్తిశాలిగా కూర్చోవాలి, నడవాలి, సేవ చేయాలి అని ధ్యాస చాలా పెడుతున్నారు. కానీ ఏమి ఆట ఆడుతున్నారు? స్మృతి యొక్క సీట్ పై మంచిగా స్థితులు అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ కొంచెం సమయం స్థితులవుతున్నారు మరలా కదలటం, జరగటం ప్రారంభం అయిపోతుంది. చిన్న పిల్లలని ఎక్కువ సేపు సీట్ పై కూర్చోబెడితే కదిలిపోతారు కదా! అలాగే మనస్సు కూడా అదుపులో, ఆజ్ఞలో లేకపోతే కొంచెం సమయం మంచిగా కూర్చుంటుంది, మంచిగా నడుస్తుంది, సేవ కూడా చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి అప్ సెట్ అయిపోతుంది. కారణం ఏమిటి? సెట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ అప్సెట్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటి? ఏకాగ్రతా శక్తి, ధృఢతాశక్తి యొక్క లోపం. ప్లాన్ చాలా మంచిగా ఆలోచిస్తున్నారు, ఇలా కూర్చుందాం, ఇలా అనుభవం చేసుకుందాం, ఇలా సేవ చేద్దాం, ఇలా నడుద్దాం అని అనుకుంటున్నారు కానీ కర్మలో లేదా కూర్చోవటంలో ధృడతాశక్తి లోపంగా ఉంటుంది. ఇతర విషయాలలోకి మనస్సు, బుద్ది భ్రమిస్తుంది. పనిలో బిజీగా లేకపోయినా ఈ వ్యర్థ సంకల్పాలు అనేవి అన్నింటికంటే పెద్ద పని. ఇవి వాటి వైపు ఆకర్షించుకుంటాయి. స్థూల పని లేకపోయినా కానీ ధృఢతా శక్తి యొక్క లోపం కారణంగా మనస్సు మరియు బుద్ది సీట్ పై సెట్ అవ్వటానికి బదులు అలజడిలోకి వచ్చేస్తాయి.
బాప్ దాదా మీ అందరికీ ఏదైతే పని ఇచ్చారో అది చూసారు. అందరి చీటిలు బాప్ దాదా దగ్గరకు చేరుకున్నాయి. కొంతమంది పిల్లలు చాలా చతురులుగా ఉన్నారు. ఏమి చతురత చేస్తున్నారు? చీటి వ్రాస్తున్నారు, కానీ పేరు వ్రాయటం లేదు. బాబాకి తెలుసు కదా అనుకుంటున్నారు. బాబాకి తెలుసు కానీ ఒక పని ఇచ్చినప్పుడు దానిని పూర్తి చేయాలి కదా! ఎదైనా వ్రాయమని టీచర్ చెప్పినప్పుడు ఇది వ్రాయటం నాకు వచ్చు అని మీకు తెలుసు కదా అని అంటే టీచర్ ఒప్పుకుంటారా? కొందరు అసలు పేరే వ్రాయటం లేదు. ఏ గ్రూప్ కి ఏ పని ఇచ్చారో దానిలో చాలామంది డైమండ్ జూబ్లీకి చేసి చూపిస్తాము అనే సంతోషకరమైన విషయం వ్రాసారు. చాలా మంది వ్రాసారు. మీకు కూడా ఇదే సంకల్పం ఉంది కదా! జీవన్ముక్తులు అయిపోతారా? అన్నీ విషయాల నుండి ముక్తులు అయిపోతే ఏవిధంగా అవుతారు? జీవన్ముక్తులు అయిపోతారు కదా! విదేశీయులకైనా, భారతదేశీయులకైనా ధైర్యం ఉత్సాహ, ఉల్లాసాలు చాలా ఉన్నాయి. చాలా కొద్దిమంది మాకు కొంచెం సమయం పడుతుంది అని వ్రాశారు. వారికి పట్టనివ్వండి. కానీ మీరు జీవన్ముక్తులు అయిపోండి. చివరికి ఫలితంలో ఏమి చూసారంటే ఈ డైమండ్ జూబ్లీలో ఏదో ఒకటి చేసి చూపిస్తాము అనే ఉల్లాసం అందరికి ఉంది. కానీ బాప్ దాదా చూసారు, ఎంతగా మిమ్మల్ని మీరు వజ్రంగా తయారుచేసుకోవాలని ఉత్సాహ,ఉల్లాసాలు ఉన్నాయో అంతగానే ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో సేవ యొక్క ప్లాన్స్ కూడా చాలా తీవ్రంగా తయారుచేసారు. తీవ్రంగా తయారుచేసినందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ చాలా సేవ యొక్క బాధ్యత ఉంది కదా! అందువలన స్థితి కొంచెం తగ్గుతుంది అని అనకూడదు. దానిని బాప్ దాదా కోరుకోవటం లేదు. స్వయాన్ని మరియు ఇతరులని అలజడి చేసే సేవ, సేవ కాదు. అది స్వార్థం అవుతుంది. ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, అందువలన స్థితి అలజడి అవుతుంది. మీ యొక్క లేదా ఇతరుల యొక్క స్వార్థం పూర్తి అవ్వనప్పుడే సేవలో అలజడి వస్తుంది. అందువలన స్వార్థానికి అతీతంగా మరియు సంబంధంలో సర్వులకి ప్రియంగా అయ్యే సేవ చేయండి, డైమండ్ జూబ్లీలో వజ్రం అయ్యి వజోత్సవం జరుపుకుంటామనే సంకల్పం చేసారు కదా, లక్ష్యం పెట్టుకున్నారు కదా! అది అప్పుడే పూర్తి అవుతుంది. కేవలం సగమే జ్ఞాపకం ఉంచుకోవటం కాదు. డైమండ్ జూబ్లీ జరుపుకోవడానికే కదా! అందువలన దానిలో బిజీగా అయిపోయాం అని అంటున్నారు. కానీ బాప్ దాదా యొక్క రెండు మాటలను జ్ఞాపకం ఉంచుకోండి, సగం కాదు. వజ్రంగా అయ్యి వజోత్సవం జరుపుకోవాలి. కేవలం జరుపుకోవటమే కాదు, తయారయ్యి జరుపుకోవాలి. కేవలం పైపై అర్ధం తీసుకోకూడదు, జరిపేసుకున్నాం అని అనుకోవటం కాదు. కానీ తయారయ్యి జరుపుకున్నారా? తయారయ్యి జరుపుకోవాలి ఇదే డైమండ్ జూబ్లీ యొక్క లక్ష్యం. కేవలం సగం లక్ష్యం పూర్తి చేయటం కాదు. తయారవ్వాలి మరియు జరుపుకోవాలి, రెండూ చేయాలి. కేవలం తయారవ్వటం కాదు, కేవలం జరుపుకోవటం కాదు. రెండూ వెనువెంట ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా - మీరు డైమండ్ జూబ్లీలో డైమండ్ గా అయ్యే ప్లాన్ తయారుచేసుకుంటున్నారు. అయితే మీ అందరికంటే ముందు మాయ కూడా తన ప్లాన్ తయారుచేసుకుంటుంది. అందువలన ఏమి చేయము? దైర్యం తక్కువ అయిపోయింది, మాయ చాలా తీవ్రంగా ఉంది, మాయని నీ దగ్గర ఉంచుకో అని అనకండి. రాజ్యం మీరు చేస్తారు, మాయని బాబా సంభాళిస్తారు. రాజ్యం అయితే మీరే చేయాలి కదా! మాయాజీత్ లే జగత్ జీత్ లు అవుతారు. మాయని జయించకుండా జగత్తుని ఏవిధంగా జయిస్తారు? అందువలన దయ ఉంచి నలువైపులా ధ్యాస పెట్టుకోండి. మంచిది.
యాత్ర యొక్క సగం ఫలితం చెప్పాను. మిగిలిన సగం తర్వాత చెప్తాను. కొన్ని సెంటర్స్ చాలా మంచిగా అలంకరించబడి ఉన్నాయి. కొన్ని సాధారణంగా ఉన్నాయి, కొన్ని ఠీవిగా ఉన్నాయి. కొన్ని మధ్యరకంగా ఉన్నాయి. ఎక్కువ మంది సెంటర్ రాయల్ అనిపించాలి. ఎవరైనా గొప్పవ్యక్తులు (వి.ఐ.పి) వస్తే మంచిగా అనిపించాలి అని అనుకుంటున్నారు. కానీ ఆది నుండీ ఇప్పటివరకూ బ్రాహ్మణులకి ఉన్న నియమం ఏమిటంటే పూర్తిగా సాధారణంగా ఉండకూడదు. పూర్తిగా రాయల్ గా ఉండకూడదు. మధ్యస్తంగా ఉండాలి. బ్రహ్మాబాబా చాలా సాధారణంగా కనిపించేవారు మరియు ఉండేవారు. కానీ ఇప్పుడు సాధనాలు ఉన్నాయి మరియు సాధనాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అయినా కానీ ఏ కార్యం చేసినా మధ్యస్థంగా చేయాలి. వీరు ఏం చేశారో ఎవరికీ తెలియదు అని అనకూడదు మరియు వీరికి ఇప్పుడే రాజరికం వచ్చేసింది అని కూడా అనుకోకూడదు. ఈరోజు యొక్క పాఠం ఏమిటి? అన్నింటి నుండీ ముక్తులు అయిపోతారు కదా! అన్నింటి నుండీ ముక్తి అయ్యే ప్రతిజ్ఞ చేశారు కదా! పక్కాయేనా లేక ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టం అంటారా? పక్కాగా ఉండాలి. డైమండ్ జూబ్లీలో మాయకి మజా చేసి చూపించాలి. మాస్టర్ సర్వశక్తివంతులు, తక్కువైన వారు కాదు. మంచిది.
డబల్ విదేశీయులు కూడా చాలా మంది వచ్చారు. స్థాపనా కార్యంలో డబల్ విదేశీయులు డబల్ శోభ. ఎంత కష్టంతో, ఎంత యుక్తితో ఇక్కడికి వస్తున్నారో అది బాప్ దాదాకి తెలుసు. సంలగ్నత తక్కువైతే రావటం కూడా కష్టమే. ఒక వైపు బాప్ దాదా వింటున్నారు, ధనం విలువ పడిపోయింది అని కానీ రెండవ సంవత్సరం చూస్తే ఇంకా ఎక్కువ విదేశీయులు వచ్చారు. ఇది ధైర్యం అయ్యింది కదా! రష్యా గ్రూప్ వచ్చింది కదా! రష్యా వారు టికెట్ ఎక్కడి నుండి తెచ్చుకున్నారు? వీరి కథలు వినడానికి చాలా బావుంటాయి. ఇవన్నీ జరగవలసిందే. డాలర్ అయినా, పౌండ్ అయినా, ఏదైనా కాగితమే కదా! ఈ కాగితం ఎంతవరకు నడుస్తుంది. బంగారానికి విలువ ఉంది, వజ్రానికి విలువ ఉంది, కాగితానికి ఏమి ఉంటుంది? ధనం యొక్క విలువ పడిపోనున్నదే. కానీ మీ ధనం చాలా విలువైనది. ఆదిలో వార్తాపత్రికల్లో వేసారు కదా - ఓం మండలి ప్రపంచంలో అన్నింటికంటే ధనవంతమైనది అని. సంపాదించుకునే సాధనం ఏదీ లేదు,ఆ సమయంలో బ్రహ్మాబాబాతో పాటూ ఒకరిద్దరు సమర్పణ అయ్యారు అంతే వార్తాపత్రికల్లో ధనవంతమైనదిగా వేసేసారు. ఇప్పుడు కూడా నలువైపుల ఈ స్థూల అలజడి జరుగుతుంది, అప్పుడు మీరు పేపర్ లో వేయించవలసిన పని లేదు, ఆ పత్రికల వారే స్వయంగా వచ్చి పత్రికలలో వేస్తారు. బ్రహ్మాకుమారీలే ప్రపంచంలో అందరికంటే ధనవంతులు అని టీ.విల్లో కూడా చూపిస్తారు. ఎందుకంటే ఏది ఏమైపోయినా కానీ మీ ముఖం మెరుస్తూ ఉంటుంది. రోజులో తినడానికి రొట్టె దొరకకపోయినా కానీ మీ ముఖం మెరుస్తూ ఉంటుంది. నలువైపుల దు:ఖం ఉంటుంది, మరియు మీరు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. దీనినే పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం అని అంటారు. అందువలన బాప్ దాదా ఈ రోజు చెప్పారు సత్యమైన బ్రాహ్మణుల లేదా బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ట జీవితం యొక్క లక్ష్యం పెట్టుకునే వారి విశేషత - ప్రసన్నత. ఎవరైనా నిందిస్తున్నా కానీ మీ ముఖంలో దు:ఖం యొక్క అల రాకూడదు. ప్రసన్నచిత్తంగా ఉండాలి. నిందించేవారే అలసిపోతారు.... అలా అవుతుందా? వారు ఒక గంట అన్నారు. నేను ఒక సెకనే అన్నాను అని అనకూడదు. ఒక్క సెకను అయినా కానీ మాట్లాడారు, ఆలోచించారు. అంటే ముఖంలో అప్రసన్నత వచ్చేసింది, అంటే ఫెయిల్ అయిపోయారు. చాలా సహించారు, ఒక గంట సహించారు కానీ ఒక్క సెకనులో బుడగ నుండి గాలి వచ్చేసింది. ఇలా గాలి బుడగలా అవ్వకూడదు. ఇంకా మీకు ఏమి కావాలి? బాబా లభించారు అంటే అన్నీ లభించినట్లే. ఇదే పాట పాడుతారు కదా! అటువంటి సమయంలో ఇటువంటి విషయాలు జ్ఞాపకం చేస్కోండి. అప్పుడు ముఖంలో మార్పు రాదు. అలాగని వారి ముందు గట్టిగా నవ్వుతూ ఉంటే వారు ఇంకా వేడెక్కిపోతారు. ప్రసన్నత అంటే ఆత్మిక చిరునవ్వు. బయటికి నవ్వటం కాదు. ఆత్మికమైన చిరునవ్వు ఉండాలి. ఈ రోజు పాఠం ఏమిటి? సదా అప్రసన్నతా ముక్తులుగా మరియు ప్రసన్నతా యుక్తులు అవ్వండి. రెండూ అవ్వాలి. అర్ధమైందా? మంచిది.
నలువైపుల ఉన్న బాప్ దాదా యొక్క ప్రేమ స్వరూప ఆత్మలకు, సదా స్వయాన్ని అప్రసన్నత నుండి విముక్తులు చేసుకునే తీవ్ర పురుషార్ధి ఆత్మలకు, సదా స్మృతి మరియు సేవ యొక్క సమానత ద్వారా సేవలో సఫలత పొందే భాగ్యవాన్ ఆత్మలకు, సదా బాబాని ప్రత్యక్షం చేయాలనే ఉత్సాహం ఉల్లాసాలతో ఉండే దేశ, విదేశాలలోని పిల్లలందరికి, బాబాకి తమ శుభవార్త వ్రాసేవారికి, తమ సేవ యొక్క ఉల్లాసం ఉంచుకునే వారికి, బాబాకి సదా స్నేహి మరియు సమీప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే,
Comments
Post a Comment