21-10-2005 అవ్యక్త మురళి

  21-10-2005         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యేతేదీ నిర్ణయం చేసుకుని ఇప్పుడు ఎవరెడీగా అవ్వండి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క మూడు రూపాలను చూస్తున్నారు. ఎలా అయితే బాబా యొక్క విశేష మూడు సంబంధాలు స్మృతి ఉంటున్నాయో అదేవిధంగా పిల్లల యొక్క మూడు రూపాలను చూసి బాబా సంతోషిస్తున్నారు. మీ యొక్క మూడు రూపాలు గురించి తెలుసు కదా! ఈ సమయంలో పిల్లలందరు బ్రాహ్మణరూపంలో ఉన్నారు మరియు బ్రాహ్మణ జీవితం యొక్క చివరి స్థితి - ఫరిస్తా, తిరిగి ఫరిస్తా నుండి దేవత. అన్నింటికంటే విశేషమైనది వర్తమాన బ్రాహ్మణ జీవితం. బ్రాహ్మణ జీవితం విలువైనది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత - పవిత్రత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క సత్యత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం. పవిత్రతయే సుఖశాంతికి జనని. ఎంత పవిత్రత ఉంటుందో అంత స్వతహాగా జీవితంలో సుఖశాంతి సహజ సంస్కారంగా ఉంటుంది మరియు పవిత్ర ఆత్మల యొక్క లక్ష్యం బ్రాహ్మణుల నుండి దేవత కాదు, మొదట ఫరిస్తా కావాలి, ఫరిస్తా నుండి దేవతగా కావాలి. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత ఈ మూడు రూపాలు బాప్ దాదా చూస్తున్నారు. మీ అందరికీ మీ మూడు రూపాలు ఎదురుగా వచ్చాయా వచ్చాయా? బ్రాహ్మణులుగా అయితే అయ్యారు ఇప్పుడు లక్ష్యం- ఫరిస్తా కావాలి. ఇదే లక్ష్యం కదా! ఫరిస్తాగా అవ్వాలి. ఫరిస్తాస్థితి యొక్క విశేషతలు జీవితంలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఫరిస్తా అంటే పాత ప్రపంచంతో మరియు పాత సంస్కారాలతో ఏ సంబంధం ఉండదు. ఫరిస్తా అంటే కేవలం సమస్యల సమయంలోనే డబల్ లైట్ గా అవ్వటం కాదు కానీ సదా మనసా, వాచా, సంబంధ, సంపర్కాలలో డబల్ లైట్ గా తేలికగా ఉండాలి. తేలికైన వస్తువు ఇష్టమనిపిస్తుందా, బరువైన వస్తువు ఇష్టమనిపిస్తుందా, ఏది ఇష్టమనిపిస్తుంది? తేలికగా ఉండేది ఇష్టం కదా? 1. ఫరిస్తా అంటే అతీతమైనవారు మరియు సర్వులకు ప్రియమైనవారు, కొద్దిమందికి కాదు. కేవలం ప్రియంగా అవ్వటమే కాదు, ఎంత ప్రియమో అంత అతతీమైనవారు. ఫరిస్తా అంటే సర్వులకీ ప్రియమైనవారు, ఎవరు వారిని కలుసుకున్నా, ఎవరు వారి సంబంధంలోకి వచ్చినా, సంపర్కంలోకి వచ్చినా వీరు నావారు అని అనుభవం చేసుకుంటారు. ఎలా అయితే బాబాని అందరూ నా బాబా అని అనుభవం చేసుకుంటారు కదా? అలాగే ఫరిస్తా అంటే అందరు నావారు అని అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే తేలికగా ఉంటారు కదా! ఆ తేలికతనమే అందరికీ ప్రియంగా చేస్తుంది. మొత్తం బ్రాహ్మణ పరివారం నావారు అనే అనుభవం చేసుకుంటారు. బరువు ఉండదు, ఎందుకంటే ఫరిస్తా యొక్క అర్థమే డబల్ లైట్. ఫరిస్తా అంటే సంకల్పం, మాట, కర్మ, సంబంధంలో బేహద్ గా ఉంటారు, హద్దు ఉండదు. అందరు నావారు మరియు నేను అందరివాడిని అనే భావన ఉంటుంది. ఎక్కడ ఎక్కువగా నావారు అనే భావన ఉంటుందో అక్కడ ఎక్కువగా తేలికతనం ఉంటుంది. సంస్కారాలలో కూడా తేలికతనం ఉండాలి, కనుక ఎంత శాతం ఫరిస్తాస్థితి వరకు చేరుకున్నాను? అనేది పరిశీలన చేసుకోండి. పరిశీలించుకోవటం వస్తుందా? పరిశీలకులుగా కూడా అయ్యారు, తయారయ్యేవారిగా కూడా అయ్యారు. శుభాకాంక్షలు. 

బాప్ దాదా మీ అందరి హోమ్ వర్క్ యొక్క ఫలితం చూసారు. అందరూ హోమ్ వర్క్ యొక్క ఫలితం వ్రాసారు కదా! ఫలితంలో ఏమీ కనిపించింది. బాప్ దాదా యొక్క శుభ ఆశ ఏమిటంటే - తక్కువలో తక్కువ వర్తమాన సమయంలో అన్ని విషయాలలో, ముఖ్యంగా 7 విషయాలు వ్రాసారు కదా! ఈ 7 విషయాలలో వర్తమాన సమయం అనుసరించి 75 శాతం తప్పకుండా ఉండాలి. కొంతమంది కొన్నింటిలో తక్కువగా, కొద్దిమంది కొన్నింటిలో తక్కువ ఉన్నారు. కానీ బాప్ దాదా యొక్క శుభ ఆశ ఏమిటంటే ఇప్పుడు సమయం ప్రకారం ఎవరైతే మహారథులు ఉన్నారో వారి స్థితి 95 శాతం ఉండాలి. 

ఉండాలి కదా! పాండవులకు ఉంటుందా? రెండవ నెంబర్ అయినా కానీ 75 శాతం ఉండాలి. దాదీలు ఏమని భావిస్తున్నారు? 95 శాతం ఉందా? ముందు లైన్లో కూర్చున్నవారు ఏమని భావిస్తున్నారు? 95 శాంత ఉందా? మరియు మీకు ఎంత శాతం ఉండాలి? 75 శాతం ఉందా? మీరు కూడా 75 శాతం ఉందని భావిస్తున్నారా? మంచిది, రేపే వినాశనం అయిపోతే? 75 శాతంతో వెళ్ళిపోతారా? 75 శాతం ఉంటే వన్, వన్, వన్లోకి రారు. అప్పుడేమి చేస్తారు? ఈరోజు విశేషమైన రోజు కదా! కనుక ఈరోజు జరిగిపోయిందేదో జరిగిపోయింది అంటున్నారు మంచిదేనా? మంచిది, రేపటి నుండి 75 శాతం అంటున్నారు కదా, 95 శాతం కాదు కానీ 85 వరకు వస్తారా? వస్తారా? ఎల్లుండి వినాశనం చేసేస్తే 85 శాతం వరకు వస్తారా? వెనుక ఉన్నవారు అవుతారా? చేతులు ఎత్తండి! మంచిది, 85 శాతం వరకు వస్తారా? (ఎవరో 98 శాతం వరకు వస్తాము అని చెప్పారు) శుభాకాంక్షలు, గులాబ్ జామ్ తినండి, ఎందుకంటే అవ్వవలసిందే అని తెలుసుకుంటున్నారు. అవుతాము అని కాదు, అవ్వవలసిందే. అవుతాము, అవుతాము అనకండి. అయిపోతాము, చూస్తాము, ప్రయత్నిస్తాము.... అనే భాష ఇప్పుడు పరివర్తన చేయండి. ఏ సంకల్పం చేసినా ఎంత శాతం నిశ్చయంతో మరియు సఫలతాపూర్వకంగా ఉంది? అనేది పరిశీలన చేసుకోండి. ఇప్పుడు పరిశీలన చేసుకునే వేగం తీవ్రం చేసుకోండి. మొదట పరిశీలన చేసుకోండి, తర్వాత కర్మలోకి తీసుకురండి. ఏ సంకల్పం వస్తే అది, ఏ మాట వస్తే ఆ మాట, ఎలా కావాలంటే అలా సంబంధ సంపర్కాలు ఉండకూడదు. ఎవరైతే వి.వి.ఐ.పిలు ఉంటారో వారు ఎలా పరిశీలన చేసుకుంటారో తెలుసు కదా! ప్రతి విషయం మొదట పరిశీలన చేసుకుని తర్వాత అడుగు వేస్తారు. రెండు, నాలుగు గంటల తర్వాత పరిశీలన జరగదు. ఈ రోజుల్లో వి.ఐ.పి (విశేష వ్యక్తులు)లు, ఈ ఒక జన్మలోనే అది కూడా కొద్ది సమయానికే. కానీ మీరు మొదట పరిశీలన చేసుకుని తర్వాత అడుగు వేయాలి, ఎందుకంటే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యే మీ ముందు ఎన్ని వేలు పెట్టినా తక్కువే. మీరు మీ యొక్క చిత్రం చూసుకుంటున్నారు కదా! మీ చిత్రం పూజింపబడుతుంది, మందిరం చూడకపోవచ్చు కానీ మీ చిత్రం అయితే చూసుకున్నారు కదా! ఇప్పుడు కూడా వాటికి ఎంత విలువ ఉంది! ఎంత పెద్ద, పెద్ద మందిరాలను తయారు చేస్తున్నారు! మీ యొక్క చిత్రం అయితే మూడు అడుగులే ఉంటుంది కానీ దానికి ఎంత విలువ ఉంటుంది! జడచిత్రాలకు కూడా విలువ ఉంటుంది. ఉంది కదా! మీ చిత్రాన్ని చూడడానికి క్యూలో ఉంటారు! మరియు చైతన్యంలో మీరు వి.వి.ఐ.పిలు (చాలా విశేష వ్యక్తులు) అడుగు వేసే ముందే పరిశీలన చేసుకోండి, చేసిన తర్వాత పరిశీలన చేసుకుంటే ఆ అడుగు వేసేశారు, అది మరలా మీ చేతులలోకి రాదు. అజ్ఞానంలో కూడా ఆలోచించుకుని అర్ధం చేసుకుని కర్మ చేయండి అంటారు కదా! పని చేసేసిన తర్వాత ఆలోచించడం కాదు, మొదట ఆలోచించండి. తర్వాత చేయండి. స్వమానం యొక్క స్థితిలో స్థితులై ఉండండి. ఎంత మీ స్థితిలో ఉంటాతో అంత వ్యతిరేకత ఉండదు. స్థితిలో లేనప్పుడే వ్యతిరేకత కూడా వస్తుంది. ఇప్పుడు బాప్ దాదా ఒక ప్రశ్న అడుగుతున్నారు - మీ అందరి లక్ష్యం సంపూర్ణంగా, సంపన్నంగా అవ్వాలి అనా లేక కొద్దికొద్దిగా అవ్వాలనా? మీ అందరి లక్ష్యం సంపూర్ణంగా అవ్వాలి అని కదా? అందరు చేతులు ఎత్తండి! మంచిది, ఎప్పటి వరకు? మీరు అందరినీ అడుగుతారు కదా, టీచర్స్, విద్యార్థులను మీ లక్ష్యం ఏమిటి? అని అడుగుతారు కదా! ఈరోజు విశేషంగా బాప్ దాదా టీచర్లని అడుగుతున్నారు - మీ లక్ష్యం ఏమిటి? అని. ఈ రోజు విశేషంగా బాప్ దాదా టీచర్లని అడుగుతున్నారు. 30 సంవత్సరాల నుండి ఉన్నవారు కూర్చున్నారు కదా! 30 సంవత్సరాల నుండి ఉన్నవారు రేపే పరస్పరం కూర్చుని ప్రోగ్రామ్ తయారుచేసుకోవాలి. మీటింగ్స్ అయితే చాలా చేస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు - మీటింగ్, మీటింగ్ - మీటింగ్, మీటింగ్ ఇలా చాలా మీటింగ్స్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎప్పటికి సంపన్నంగా అవుతారు? అనే మీటింగ్ చేయండి. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, తేదీ నిర్ణయిస్తున్నారు, ఫలానా ప్రోగ్రామ్ ఫలానా రోజు అని మరి దీనికి తేది లేదా? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి. బాప్ దాదా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే బాబాని ప్రకృతి ఎప్పుడు వినాశనం చేయాలి? అని అడుగుతుంది. బాప్ దాదా ఏమి జవాబు చెప్పాలి! బాప్ దాదా పిల్లలనే అడుగుతారు కదా! ఎప్పటి వరకు సమయం కావాలి? ఈ రోజు టాపిక్ ఇదే. డబల్ విదేశీయులు కూర్చున్నారు కదా! డబల్ పురుషార్ధం చేస్తారు కదా! అద్భుతం చేయండి. విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం ముందు, విశ్వం ముందు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వటంలో ఉదాహరణగా అవ్వండి. సర్వగుణాలు, సర్వ శక్తులతో సంపన్నంగా అంటే సంపూర్ణంగా అవ్వాలి. మనసా, వాచా, సంబంధ, సంపర్కం ఈ నాల్గింటిలో ఒక దానిలో బలహీనత ఉండిపోయినా సంపన్నం అనరు. నాలుగు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి కదా - మనసా, వాచా, సంబంధం, సంపర్కంలో కర్మ కూడా వచ్చేస్తుంది. నాలుగు విషయాలలో సంపన్నం అవ్వాలి. మనసా, వాచాలో మంచిగా ఉన్నాము, సంబంధ, సంపర్కంలో కొద్దిగా తక్కువ ఇలా ఉండకూడదు. చెప్పాను కదా - ఎవరి ఎదురుగా వెళ్ళినా, ఎవరి సంపర్కంలోకి వెళ్ళినా వీరు నావారు అనే అనుభవం చేసుకోవాలి. నావారు అనుకున్నప్పుడు అధికారం ఉంటుంది కదా! కానీ ఇతరులపై అంత తేలికతనం ఉండదు, కొద్దిగా బరువు ఉంటుంది కానీ మనవారు అనుకున్నప్పుడు తేలికతనం ఉంటుంది. అందరితో తేలికగా అవ్వాలి. కేవలం మీ సెంటర్లో, మీ జోన్లో తేలికగా అవ్వటం కాదు. ఒకవేళ కేవలం సెంటర్లో, జోన్లో తేలికగా అయితే విశ్వమహారాజుగా ఎలా అవుతారు? విశ్వకళ్యాణకారిగా కాలేరు, విశ్వమహారాజుగా కాలేరు. రాజు అంటే కేవలం సింహాసనంపై కూర్చోవడమే కాదు, రాజధానిలో రాయల్ ఫ్యామిలీలో కూడా రాజుకి రాజ్యధికారం ఉంటుంది. కనుక ఏమి చేస్తారు? ఎప్పటి వరకు సమయం కావాలి అనే దానికి సమాధానం చెప్తారు కదా! మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టుకుని ఫైనల్ చేయండి. సరేనా? మంచిది. చేయాలి, తయారవ్వాలి అనే ఉత్సాహం వస్తుంది కదా? బాప్ దాదా ఉత్సాహ ఉల్లాసాలను ఇప్పిస్తున్నారు. మాయ కూడా చూస్తుంది ఉత్సాహ ఉల్లాసాలతో వీరు పురుషార్థం చేసేస్తారు అని ఎందుకంటే మాయకి కూడా ఇప్పుడు అంతిమ సమయం సమీపంగా వస్తుంది కదా! అందువలన మాయ కూడా తన అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తుంది మరియు ఎంత మంచిగా పాలన చేస్తుందంటే ఇది మాయ యొక్క పాలన అని కూడా తెలియదు. మాయ మతమా లేక బాబా మతమా అనేది కూడా తెలియదు. దానిలో కలిపేస్తుంది. ఫరిస్తా స్థితిలో లేక పురుషార్థంలో ముఖ్యంగా రెండు మాటలే విఘ్నం వేస్తాయి. అవి సాధారణ మాటలే, కష్టమేమీ లేదు, అందరు అనేకసార్లు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అవి ఏమిటి? నేను మరియు నాది. బాప్ దాదా ఈ నేను మరియు నాది అనే వాటిని పరివర్తన చేసుకోవడానికి ఇంతకు ముందు కూడా విధి చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఏ సమయంలో మీకు నేను అనే మాట వస్తుందో అప్పుడు నేను ఆత్మను అని ఆత్మ రూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. నేను ఆత్మను అని మాట్లాడటం కాదు, నేను అనే మాట రాగానే ఆత్మ యొక్క స్థితి స్వతహాగా వచ్చేయాలి. నాది అనే మాట మాట్లాడేటప్పుడు మొదట నా బాబా అనండి. నా రుమాలు, నా చీర, ఇది నాది అంటారు కదా! కానీ నాది అనే మాట వచినప్పుడు మొదట నా బాబా అని రావాలి. నాది అనే మాట రాగానే బాబా ఎదురుగా రావాలి. నేను అనే మాట రాగానే ఆత్మ ఎదురుగా రావాలి. దీనిని స్వతహా సంస్కారంగా చేసుకోండి. కష్టమా లేక సహజమా? నేను ఆత్మను అని తెలుసు కానీ ఆ సమయంలో అంగీకరించి నడవడం లేదు. 100 శాతం తెలుసుకున్నారు కానీ అంగీకరించడంలో శాతం వచ్చేస్తుంది. దేహాభిమానం అనేది స్వతహా సంస్కారం అయిపోయింది కదా లేక నేను దేహాన్ని అని జ్ఞాపకం చేసుకోవలసి వస్తుందా? నేను అనే మాట నోటితో మాట్లాడే ముందు మనసులో వస్తుంది కదా! నేను అనే మాట మనస్సులో రాగానే వెంటనే ఆత్మ స్వరూపం ఎదురుగా రావాలి. ఈ అభ్యాసం చేయాలి, కేవలం నేను అని అనటం కాదు ఆత్మగా భావించి మాట్లాడాలి అప్పుడు పక్కా అయిపోతుంది. పక్కాయే కదా! ఇతరులు ఎవరైనా పిలిచినా మీరు ఇలా చేస్తారు కదా! నేను ఆత్మ, ఆత్మ యొక్క ప్రపంచం బాప్ దాదా, ఆత్మ యొక్క సంస్కారం బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. ఇలా మనస్సు యొక్క వ్యాయామం చేయండి. ఈ రోజుల్లో వైద్యులు వ్యాయామం చేయండి, వ్యాయామం చేయండి అని చెప్తున్నారు కదా! నేను ఆత్మ, నా బాబా ఈ వ్యాయామం చేయండి. ఎందుకంటే డ్రామానుసారం సమయం యొక్క వేగం తగ్గించవలసి వస్తుంది. రచయిత వేగంగా ఉండాలి. రచన కాదు కానీ ఇప్పుడు సమయం వేగంగా వెళ్ళిపోతుంది. ప్రకృతి ఎవరెడీగా ఉంది ఇప్పుడు కేవలం ఆజ్ఞ కోసం ఆగి ఉంది. డ్రామా యొక్క సమయమే ఆజ్ఞ వస్తుంది కదా! స్థాపన చేసేవారు ఎవరెడీగా కాకపోతే వినాశనం అయిపోయిన తర్వాత కల్పాంతము అయిపోతుందా? అయిపోవాలా కల్పాంతం? వినాశనం తర్వాత స్థాపన అవ్వాలి కదా? స్థాపనకి నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు సమయం ప్రకారం ఎవరెడీగా అవ్వాలి. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - బ్రహ్మాబాబా అర్జునుడిగా, ఉదాహరణగా అయ్యారు కదా! అదేవిధంగా బ్రహ్మాబాబాని అనుసరించే వారిగా ఎవరు అవుతారు? స్వయాన్ని కూడా చూసుకోండి, సమయాన్ని కూడా చూడండి. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - వర్తమాన సమయంలో బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యే ఆత్మలు నిమిత్తభావం మరియు నిర్మానభావం ఈ రెండు మాటలను అండర్ లైన్ చేసుకోండి. (ధ్యాసలో ఉంచుకోండి) వీటి ద్వారా దేహాభిమానం యొక్క నేను అనే భావం మరియు నాది అనే భావం కూడా సమాప్తి అయిపోతాయి. నిమిత్తభావం మరియు నిర్మానభావం ఉండాలి. ఎంత నిర్మానంగా ఉంటారో అంత గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిర్మానంగా ఉంటారో వారు సర్వులకి ప్రియంగా అవుతారు. మరియు ఎప్పుడైతే సర్వులకి ప్రియంగా అవుతారో అప్పుడు గౌరవం కూడా లభిస్తుంది. నిమిత్తం మరియు నిర్మానభావం మరియు శుభభావన ఉండాలి. భావం మరియు భావన రెండు విషయాలు. నిమిత్తం మరియు నిర్మానభావం మరియు ప్రతి ఆత్మ పట్ల శుభాభవన మరియు శుభకామన. ఎవరు ఎలా ఉన్నా కానీ మీ యొక్క నిమిత్త, నిర్మానభావం మరియు శుభభావన ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారుచేస్తుంది అంటే ఎదురుగా వచ్చిన వారు కూడా ఆ తరంగాల ద్వారా మారిపోతారు. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు - మేము ఒక నెల నుండి శుభభావన పెట్టుకుంటున్నాము కానీ వారు మారటం లేదు అని అలసిపోతున్నారు, మనస్సుని బలహీనం చేసుకుంటున్నారు. కానీ వారి దృష్టి లేదా వృత్తి రాతి వలె కఠినంగా ఉంటే అది మారడానికి సమయం పడుతుంది కదా! పోని వారు మారకపోయినా కానీ మిమ్మల్ని మీరు మంచిగా ఉంచుకోవాలి కదా! మీ స్థితిలో మీరు ఉండాలి కదా! మీరెందుకు మనస్సుని బలహీనం చేసుకుంటున్నారు? బలహీనం అవ్వకండి. వారు మారకపోయినా నేను వారితో పాటు మారిపోకూడదు అనుకోవాలి. మీరు బలహీనం అయ్యారు అంటే వారు శక్తిశాలి అయినట్లు కదా! ఎందుకంటే వారు మిమ్మల్ని మార్చేసారు. మీరు మీ స్వమానం యొక్క సీట్ ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు అనే వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఎందుకు అన్నారంటే వ్యర్థ సంకల్పాల తలుపు తెరుచుకుంది. ఆ తలుపు తెరుచుకుంటే తిరిగి మూసివేయటం చాలా కష్టం అవుతుంది. అందువలన ఎందుకు అని ఆలోచించకండి దయాహృదయులుగా అయ్యి తరంగాలు వ్యాపింపచేస్తూ ఉండండి. మీరు మీ సీట్ ని వదిలి ఎందుకు బలహీనం అవుతున్నారు? మీ స్థితి నుండి క్రిందికి రాకూడదు. ఇది జ్ఞాపకం ఉంచుకుంటారు కదా! లేకపోతే చాలా వ్యతిరేకత వస్తుంది. వ్యక్తికి మధ్య వ్యతిరేకత వస్తుంది, స్వభావ, సంస్కారాలలో వ్యతిరేకత వస్తుంది, ఆలోచనలలో వ్యతిరేకత వస్తుంది, కనుక మీ స్థితిలో మీరు ఉండండి. రేపు ఏమి చేస్తారు? జ్ఞాపకం ఉందా? బాప్ దాదాపై ప్రేమ ఉంది కదా! కనుక అందరు బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. బ్రహ్మాబాబా ముందు వ్యతిరేకత రాలేదా ఏమిటి! మాయ ద్వారా, ఆత్మల ద్వారా, ప్రకృతి ద్వారా కూడా వ్యతిరేకత వచ్చింది కానీ బ్రహ్మాబాబా తన స్థితిని వదిలారా? వదలలేదు కదా? అప్పుడే ఫరిస్తాగా అయ్యారు కదా! ఇప్పుడు ఒకరికొకరు ఫరిస్తాగా భావించి నడవండి, నేను ఫరిస్తా మరియు అందరు ఫరిస్తా. నాది అనేది లేదు. పాత ప్రపంచం యొక్క సంస్కారాలతో, బ్రాహ్మణాత్మలతో సంబంధం లేదు. అన్నీ సమాప్తి అయిపోయాయి అంతే. వీరు కూడా ఫరిస్తా, వారు కూడా ఫరిస్తా ఈ దృష్టితో చూడండి. ఈ వాయుమండలం వ్యాపింపచేయండి. మంచిది. 

డబల్ విదేశీయులకు డబల్ నషా ఉంటుంది కదా! ఈ రోజు అవకాశం లభించింది కదా! భారతవాసీయులు మీకు సహాయం చేసారు, కనుక మీకు అవకాశం ఇచ్చి వారు క్రింద కూర్చున్నారు, క్రింద కూర్చున్న వారికి బాప్ దాదా త్యాగం యొక్క భాగ్యాన్ని జమ చేసేస్తున్నారు. మంచిది, ఇప్పుడేమి చేయాలి? 

అందరు ఇప్పుడెలా అయితే మధురంగా నవ్వుతున్నారో ఇలా సదా ఉండాలి. ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్న నవ్వుతూ ఉండండి. మీ నవ్వు ద్వారా వారి సగం దు:ఖం దూరం అయిపోతుంది. ఇంటి నుండే ఉద్దరణ ప్రారంభించాలి. ఎవరితో మాట్లాడుతున్న, మీ సహయోగి బ్రాహ్మణాత్మలతో అయినా, అజ్ఞానీ ఆత్మలతో అయినా నవ్వుతూ ఉండే ముఖంలో, ఆత్మిక గులాబిగా ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని సీరియస్ గా మాట్లాడకండి. నవ్వుతూ మాట్లాడండి. నవ్వు యొక్క స్టాక్ మీ దగ్గర ఉందా? సమాప్తి అయిపోలేదు కదా? నవ్వుతు " ఉండే ముఖం ఎంత బావుంటుంది! ఆవేశంతో ఉండేవారి ముఖం చూస్తేనే ఇతరులు అక్కడినుండి వెళ్ళిపోవాలి అనుకుంటారు మరియు నవ్వుతూ ఉండే వారి దగ్గరికి అందరు వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు మీ అందరికీ మీ నవ్వుతూ ఉండే ముఖం యొక్క ఫోటో తీసిస్తారు. ఆ ఫోటో మీ వెంట ఉంచుకోండి. ఈ కాగితం యొక్క ఫోటో ఉంచుకుంటాం లేక మనస్సు యొక్క ఫోటో ఉంచుకుంటారా? మంచిది. 

మిడిల్ ఈస్ట్ వారు సేవలో చాలా ముందుకి వెళ్తున్నారు - చాలా మంచి, మంచి రత్నాలు ఉన్నారు. ఎవరి విశేషత వారిది. చేయించేవారు బాబా చేయిస్తున్నారు మరియు పిల్లలైన మీరు నిమిత్తంగా చేస్తున్నారు. సేవా ఉత్సాహ, ఉల్లాసాల యొక్క సర్టిఫికెట్ దాదీల ద్వారా లభించింది. దీనికి చాలా చాలా శుభాకాంక్షలు, కానీ దీనికి కారణం ఏమిటి? ఏ సేవాస్థానం అయినా సేవలో వృద్ధి అవుతుంది మరియు నిర్విఘ్నంగా ఉంటుంది అంటే దానికి కారణం ఏమిటి? తెలుసా? పాలన. కొన్ని సెంటర్లో వి.ఐ.పిల యొక్క సేవ చాలా చేస్తున్నారు కానీ విద్యార్థుల యొక్క పాలన తక్కువగా చేస్తున్నారు. అందువలనే విద్యార్థులు పెరగటం లేదు. విద్యార్థులు సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండరు. క్లాస్ కి వస్తారు, ఏది చెప్తే అది చేస్తారు. కానీ తమకి తాము ఉత్సాహ, ఉల్లాసాలలోకి రారు. ఇది పాలన యొక్క ఫలితం. శుభాకాంక్షలు. 

ఎవరైతే ఇక్కడ నిమిత్తమైన టీచర్స్ కూర్చున్నారో వారు ఎంత వి.ఐ.పి సేవపై ధ్యాస పెడుతున్నారో అంత విద్యారులకు కూడా పాలన ఇవ్వండి. విద్యార్థులలో నవీనత తీసుకురండి. ఏదోక క్రొత్తదనం తీసుకురావటం ద్వారా ఉత్సాహ, ఉల్లాసాలు పెరుగుతాయి. సేవలో చాలా బిజీ అయిపోయి అలసిపోతున్నారు మరలా పాలనలో అంత రుచి చూపించడం లేదు. మొదట రాజధానిని తయారుచేయండి. అది విద్యార్థుల ద్వారానే అవుతుంది. మనస్సుతో పాలన చేయండి. ఒక్కొక్కరి బలహీనత తొలగించే శ్రమ చేయండి. సంతోషంతో శ్రమ చేయండి, ఎందుకంటే క్లాస్ విద్యార్థులు ఎంతగా పెరుగుతారో అంత రాజధాని తొందరగా తయారవుతుంది. వారిని సంబంధంలోకి తీసుకువచ్చి విద్యార్థిగా చేయండి. మంచిది, చాలా సేవ చేస్తున్నారు అని టీచర్స్ యొక్క మహిమ విన్నాను, మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు. టీచర్స్ చేతులు ఎత్తండి! మంచిది, మీకు లక్షరెట్లు శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక నిమిషం సర్వశక్తుల సంపన్నంగా విశ్వాత్మలకు శక్తిశాలి కిరణాలు ఇవ్వండి, మీ శక్తుల యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో నలువైపుల వ్యాపించాలి. మంచిది.  

నలువైపుల ఉన్న బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యే ఆత్మలకు, సదా స్వదర్శనం ద్వారా స్వయాన్ని పరిశీలన చేసుకుని పరివర్తన చేసుకునే వారికి, బ్రహ్మాబాబాని అనుసరించే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా డబల్ లైట్ గా అయ్యి సేవ మరియు పురుషార్ధం చేసే ఫరిస్తా ఆత్మలకు, సదా తమ స్థితి అనే సీట్ పై సెట్ అయ్యి వ్యతిరేకాన్ని సమాప్తి చేసుకునే మాష్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు, సంగమయుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకునే బాబా సమీప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.  

డబల్ విదేశీ సోదరీ, సోదరులు బాప్ దాదా దగ్గరికి క్రింద తెలియజేసిన 7 విషయాల యొక్క చార్ట్ సందేశీ ద్వారా పంపించారు, వాటి ఫలితం చూసి ఇక ముందు చేయవలసిన పురుషార్ధం కొరకు సైగ చేస్తున్నారు. 
1. స్వపరివర్తన యొక్క వేగం ఎంత ఉంది? 2. స్వమానంలో నిరంతరం స్థితులై ఇతరులకు సన్మానాన్ని ఇస్తున్నానా? 3. సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకున్నానా మరియు ఇచ్చానా? 4. సర్వఖజానాల యొక్క స్టాక్ ఎంత వరకు జమ చేసుకున్నాను? 5. మనస్సుని సెకనులో ఏకాగ్రం మరియు నిరంతరం ఏకీరసంగా ఉంచగలుగు తున్నానా? 6. బిందువుగా అయ్యి బిందువుని జ్ఞాపకం చేసి సెకనులో బిందువు పెట్టగలుగుతున్నానా? 7. ఆరునెలల నుండి సంతోషం, శాంతి మరియు శక్తి యొక్క కిరణాలను వ్యాపింపచేసే జ్ఞాన సూర్యునిగా అయ్యానా? 

Comments