18-01-2007 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఇప్పుడు స్వయాన్ని ముక్తులు చేసుకుని మాస్టర్ ముక్తిదాతయై సర్వులకు ముక్తినిచ్చేటందుకు నిమిత్తం కండి.
ఈరోజు స్నేహ సాగరుడైన బాప్ దాదా నలువైపుల ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. రెండు రకాలైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. 1. లవలీన పిల్లలు 2. లవ్లీ పిల్లలు, ఇద్దరి స్నేహపు అలలు బాప్ దాదా దగ్గరకి అమృతవేళ కంటే ముందు నుండే చేరుతున్నాయి. ప్రతి ఒక్కరి హృదయం నుండి 'నా బాబా' అనే పాట స్వతహాగా వస్తుంది. అదేవిధంగా బాప్ దాదా యొక్క హృదయం నుండి కూడా 'నా పిల్లలూ! గారాభ పిల్లలూ! శిరోకిరీటాలూ! అనే పాట వస్తుంది.
ఈరోజు స్మృతిదినోత్సవం కనుక అందరి మనసుల్లో స్నేహపు అలలు ఎక్కువగా ఉన్నాయి. అనేక పిల్లల యొక్క స్నేహ ముత్యాలమాలలు బాప్ దాదా కంఠాన్ని అలంకరిస్తున్నాయి. బాబా కూడా తన స్నేహ భుజాల యొక్క మాలను పిల్లలకు ధరింపచేస్తున్నారు. బేహద్ బాబా యొక్క బేహద్ బాహువులలో ఇమిడిపోయారు. ఈరోజు అందరు విశేషంగా స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు మరియు దూరదూరాల నుండి కూడా మనస్సు అనే విమానం ద్వారా అవ్యక్తరూపంలో, ఫరిస్తా రూపంలో చేరుకున్నారు. కనుక పిల్లలందరికీ బాప్ దాదా ఈరోజు సమర్థ దినోత్సవం యొక్క పదమాపదమ స్మృతిని ఇస్తున్నారు. ఈ రోజు ఎన్ని స్మృతులను అందిస్తుంది మరియు ప్రతీ స్మృతి సెకనులో సమర్థంగా తయారు చేస్తుంది. స్మృతుల యొక్క జాబితా సెకనులో స్మృతిలోకి వస్తుంది కదా! స్మతి రావటంతోనే సమర్థత యొక్క నషా ఎక్కుతుంది. మొట్టమొదటి స్మృతి జ్ఞాపకం ఉంది కదా? బాబా వారిగా అయిన తర్వాత బాబా మొదటగా ఏమి స్మృతిని ఇప్పించారు? మీరు కల్పపూర్వపు భాగ్యశాలి ఆత్మ. ఈ మొదటి స్మృతి ద్వారా మీలో ఏమి పరివర్తన వచ్చిందో గుర్తు తెచ్చుకోండి. ఆత్మాభిమాని అవ్వటం ద్వారా పరమాత్మ తండ్రి స్నేహం యొక్క నషా వచ్చింది. నషా ఎందుకు వచ్చింది? మనస్సు నుండి మొట్టమొదటగా ఏ స్నేహ మాట వచ్చింది? “నా మధురమైన బాబా” అని వచ్చింది మరియు ఈ ఒక్క స్వర్ణిమ మాట రావటం ద్వారా ఏమి నషా వచ్చింది? నా బాబా అని అనటం ద్వారా, తెలుసుకోవటం ద్వారా, అంగీకరించటం ద్వారా పరమాత్మ ప్రాప్తులన్నీ మీవిగా అయిపోయాయి. అనుభవం ఉంది కదా! నా బాబా అనటం వలన ఎన్ని ప్రాప్తుల మీ సొంతం అయ్యాయి! ఎక్కడ ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు, స్మృతి స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రాప్తులు మీవి అయినవి కదా! తండ్రి ఖజానా నా ఖజానా అయిపోయింది, కనుక మనవి అయినవి ప్రత్యేకంగా స్మృతి చేయాల్సిన పని ఉండదు, స్వతహాగానే స్మృతిలో ఉంటాయి. నాది అనుకున్నది మర్చిపోవటం కష్టం కానీ గుర్తు ఉంచుకోవటం కష్టం కాదు. నా శరీరం అనుకున్నప్పుడు శరీరాన్ని మర్చిపోగలరా? మర్చిపోలేరు ఎందుకంటే నాది అనే భావన ఉంటుంది కదా! కనుక అది సహజంగా గుర్తు ఉంటుంది. ఈ విధంగా స్మృతి మిమ్మల్ని సమర్థ ఆత్మగా తయారు చేసింది. నా బాబా అని ఒక్కమాట అనటం ద్వారా బాగ్య విధాత, తరగని ఖజానాల దాత అయిన బాబాని మీవారిగా చేసేసుకున్నారు. పిల్లలు ఇటువంటి అద్భుతం చేసేవారు. పరమాత్మ పాలనకి అధికారిగా అయిపోయారు. పరమాత్మ పాలన కల్పమంతటిలో ఒక్కసారే లభిస్తుంది, ఆత్మల యొక్క లేదా దేవాత్మల యొక్క పాలన అయితే లభిస్తూనే ఉంటుంది. కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మలోనే లభిస్తుంది.
ఈరోజు స్మృతి నుంచి సమర్ధ దినోత్సవం, ఈరోజున పరమాత్మ పాలన యొక్క నషా మరియు సంతోషం సహజంగా గుర్తు ఉంది కదా. ఎందుకంటే ఈరోజు సహజ స్మృతి యొక్క వాయు మండలం ఉంటుంది. కనుక ఈరోజు సహజయోగిగా ఉన్నారు కదా లేక ఈరోజు కూడా స్మృతి కొరకు యుద్ధం చేయవలసి వచ్చిందా? ఎందుకంటే ఈరోజుని స్నేహం రోజు అని అంటారు. కనుక స్నేహం శ్రమని తొలగిస్తుంది. స్నేహం అన్ని విషయాలను సహజం చేసేస్తుంది. కనుక అందరూ ఈరోజు విశేషంగా సహజయోగిగా ఉన్నారా లేక శ్రమ పడ్డారా? ఈరోజు కూడా శ్రమ పడ్డవారు చేతులెత్తండి. ఎవరికీ శ్రమ అనిపించలేదా? అంటే అందరూ సహజ యోగులు, మంచిది. అయితే సహజ యోగులు అయిన వారు చేతులెత్తండి. మంచిది. సహజ యోగులుగా ఉన్నారా? అంటే ఈరోజు మాయకి శెలవు ఇచ్చేశారా? ఈరోజు మాయ రాలేదా? ఈరోజు మాయకి వీడ్కోలు ఇచ్చేశారా? మంచిది. ఈరోజు వీడ్కోలు ఇచ్చేశారు, శుభాకాంక్షలు. ఇదే విధంగా సదా స్నేహంలో లీనమై ఉంటే మాయ సదాకాలికంగా వీడ్కోలు తీసేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 70 సం|లు పూర్తి కావస్తున్నాయి, కనుక బాప్ దాదా ఈ సంవత్సరాన్ని అతీత మరియు సర్వప్రియ సంవత్సరంగా, శ్రమ మరియు సమస్యల నుంచి ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మరీ మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమేనా? ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారా? ఎందుకంటే ముక్తిధామానికి వెళ్లాలి. ముక్తిదాత అయిన బాబాకి తోడుయై అనేకాత్మలకు దు:ఖం అశాంతి నుంచి ముక్తినివ్వాలి. కనుక స్వయం ముక్తియై మాస్టర్ ముక్తిదాతలు అయినప్పుడే ముక్తి సంవత్సరం జరుపుకోగలరు. ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరు స్వయం ముక్తులై అనేకులకు ముక్తినిచ్చేటందుకు నిమిత్తులు. ఒక భాష ముక్తినివ్వడానికి బదులు బంధనలో బంధిస్తుంది. సమస్యకి ఆధీనం చేస్తుంది. ఆ భాష ఏమిటంటే ఇలా కాదు అలా, ఆ విధంగా కాదు ఈ విధంగా... సమస్య వచ్చినప్పుడు బాబాకి ఇవే చెప్తున్నారు. బాబా ఇలా కాదు అలా, ఇలా అవ్వటం లేదు, ఇలా అవుతుంది కదా ఇలా సాకులు చెప్పే ఆట ఆడుతున్నారు. బాప్ దాదా అందరి ఫైల్ చూశారు. అయితే ఆ ఫైల్ ఏమి చూశారు? ఎక్కువ మంది యొక్క ఫైల్స్ ప్రతిజ్ఞల కాగితాలలో నిండి పోయి ఉన్నాయి. ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా మనస్పూర్వకంగా చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కూడా కానీ ఇప్పటి వరకు ఫైల్ పెరిగిపోతూ ఉంది కానీ ఫైనల్ అవ్వటం లేదు. ధృఢ ప్రతిజ్ఞ గురించి బాబా చెప్తారు - ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞను వదలకూడదు. ఈ విధంగా ఈరోజు బాప్ దాదా అందరి ఫైల్ చూశారు. చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేశారు. మనస్సుతో చేశారు మరియు వ్రాసి ఇచ్చారు. కనుక ఈ సంవత్సరం ఏమి చేస్తారు? ఫైల్ ని పెంచుతారా లేక ప్రతిజ్ఞ పూర్తి చేసేస్తారా? ఏం చేస్తారు? మొదటి వరుసలోని వారు చెప్పండి, పాండవులు చెప్పండి, టీచర్స్ చెప్పండి. సమాప్తి చేసేస్తారా? వంగవసి వచ్చినా, మారవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినవలసి వచ్చినా మారి తీరాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. టీవీలో అందరి ఫొటోలు చూపండి. నాలుగైదు టీవీలు ఉన్నాయి కదా. అందరినీ ఫొటో తీయండి. రికార్డ్ చేసి ఉంచండి. ఫొటో తీసి బాబాకి ఇవ్వాలి. టీవీ విభాగం వారు ఎక్కడ ఉన్నారు? బాప్ దాదా కూడా ఫైల్ యొక్క లాభాన్ని చూడాలి కదా? శుభాకాంక్షలు... శుభాకాంక్షలు... మీకొరకు మీరే చప్పట్లు కొట్టండి. ఒకవైపు విజ్ఞానం, రెండవ వైపు భ్రష్టాచారం, మూడోవైపు పాపాచారం అన్నీ తమ తమ కార్యాల్లో ఉన్నాయి మరియు వృద్ధి పొందుతూ ఉన్నాయి. చాలా కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. మీరు అయితే సృష్టికర్త యొక్క సంతానం కనుక మీరు ఈ సంవత్సరం నవీన సాధనాలను ఉపయోగించి ప్రతిజ్ఞను ధృడం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. ఎంతో ఖర్చు చేస్తున్నారు, ప్రతి చోట పెద్ద, పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి వర్గం వారు బాగా శ్రమిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఒక విషయాన్ని జోడించండి - ఏ సేవ చేస్తున్నా అనగా నోటి ద్వారా సేవ చేస్తున్నా కేవలం నోటి ద్వారానే కాదు మనసా మరియు వాచా మరియు స్నేహం సహయోగం రూపీ కర్మ మూడు సేవలూ ఒకే సమయంలో చేయాలి. వేర్వేరుగా కాదు. ఒకే సేవ చేయటం ద్వారా బాప్ దాదా తను చూడాలనుకుంటున్న ఫలితాన్ని చూడలేకపోతున్నారు. ప్రత్యక్షత జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఫలితం మంచిదే. మొదట్లో కంటే ఫలితం చాలా బావుంది. అందరూ మంచిది, మంచిది, చాలా మంచిది అంటూ వెళ్తున్నారు. కానీ వారు కూడా మంచిగా అవ్వటమే ప్రత్యక్షత జరగటం, కనుక ఇప్పుడు ఒకే సమయంలో మనసా వాచా కర్మణాలో స్నేహీ సహయోగిగా అవ్వాలి ఇప్పుడు ఈ విషయాన్ని జోడించండి. మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు అయినా, సేవకి నిమిత్తమైన బయటవారు అయినా ఎవరైనా కానీ సహయోగం మరియు స్నేహం ఇవ్వాలి, కర్మణా సేవలో నెంబరు తీసుకోవటం అంటే ఇదే. వీరు ఇలా చేశారు కదా! అందువలనే ఈ విధంగా చేయవలసి వచ్చింది... ఇలాంటి భాషను సమాప్తి చేయండి. స్నేహానికి బదులు కొద్ది కొద్దిగా అనవలసి ఉంటుంది, చూడవలసి ఉంటుంది... అనకండి. ఇన్ని సంవత్సరాలు చూశారు, అయినా బాప్ దాదా ఊరుకున్నారు. ఇలా కాదు అలా అంటూ అలాగే ఎంత వరకు చేస్తారు? ఆఖరికి పరదా ఎప్పుడు తెరుచుకుంటుంది అని చాలా మంది పిల్లలు బాప్ దాదాని ఆత్మిక సంభాషణలో అడుగుతున్నారు. ఎంత వరకు నడుస్తుంది? అని అడుగుతున్నారు. కానీ బాప్ దాదా మీకు చెప్పేది ఏమిటంటే ఈ పాత భాష, పాత నడవడిక, సోమరితనం, కఠినత్వం ఎంత వరకు ఉంటాయి? ఎంత వరకు అని బాప్ దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు సమాధానం చెప్తే బాప్ దాదా కూడా ఎప్పుడు వినాశనం అవుతుందో చెప్తారు. ఎందుకంటే బాప్ దాదా అయితే వినాశనం యొక్క పరదాను ఇప్పుడే తెరవగలరు, ఈ సెకెనులో తెరువగలరు కానీ మొదట రాజ్యం చేసేవారు తయారుగా ఉండాలి కదా! ఇప్పటి నుంచి తయారీ చేస్తే సమప్తి సమీపంగా వస్తుంది. ఏ బలహీనత యొక్క విషయంలోను కారణం చెప్పకండి, నివారణ చేయండి. బాప్ దాదా రోజంతటిలో పిల్లల యొక్క ఆట చూస్తూ ఉంటారు. పిల్లలంటే ప్రేమ కనుక మాటిమాటికి పిల్లల ఆటను చూస్తుంటారు. బాప్ దాదా యొక్క టివీ చాలా పెద్దది. ఒకేసారిగా ప్రపంచం అంతా కనిపిస్తుంది. నలువైపులా ఉన్న పిల్లలందరూ కనిపిస్తారు. ఇలా బాప్ దాదా చాలా ఆటలు చూస్తున్నారు. తెలివిగా తప్పించుకునే భాష చాలా బాగా మాట్లాడుతున్నారు. బాబా నా పొరపాటు ఏమీ లేదు. ఇదీ కారణం, అందుకే ఇలా చేశాను అంటున్నారు. వారు చేశారు. సరే మీరు సమాధానపరిచారా? కారణాన్ని కారణంగానే చేసుకున్నారా? లేక కారణాన్ని నివారణలోకి మార్చారా? బాప్ దాదా తన ఆశ ఏమిటో చెప్తున్నారు - బాప్ దాదాకి ఉన్న ఆశ ఒక్కటే అది ఏమిటంటే నివారణ కనిపించాలి. కారణం సమాప్తి అయిపోవాలి. సమస్య సమాప్తి అయిపోయి సమాధానపడాలి. అవుతుందా!! అవుతుందా? మొదటి వరుసలోని వారు చెప్పండి అలా అవుతుందా? చేతులూపండి, వెనుక ఉన్నవారు చెప్పండి, అలా జరుగుతుందా? అవుతుందా? మంచిది. రేపు టీవీ చూసినప్పుడు టీవీలో తప్పక ఆ విధంగా కనిపిస్తారు కదా! కనుక బాప్ దాదా రేపు టీవీ చూస్తే దానిలో భారతీయులు అయినా, విదేశీయులు అయినా, చిన్న గ్రామాల్లోని వారు అయినా, చాలా పెద్ద రాష్ట్రంలోని వారు అయినా ఎక్కడి వారైనా కానీ వారిలో కారణం అనేది కనిపించకూడదు. ఈ విషయంలో సరే అనటం లేదు. అవుతుందా? చేతులెత్తండి. చేతులు చాలా బాగా ఎత్తుతారు, బాప్ దాదా సంతోషం అయిపోతారు. చేతులు ఎత్తటం నిజంగా అద్భుతం. పిల్లలకి బాబాని సంతోషం చేయటం వచ్చు. ఎందుకంటే బాప్ దాదా చూస్తున్నారు, మీరు కోట్లలో కొందరు, కొందరిలో కొందరు నిమిత్తులు అయ్యారు కనుక పిల్లలైన మీరు తప్ప మరెవ్వరు చేస్తారు? చేయాల్సింది అయితే మీరే కదా! బాప్ దాదాకి అయితే పిల్లలైన మీపై ఆశలు ఉన్నాయి. ఇక ముందు వచ్చేవారు మీ స్థితిని చూసి సరి అయిపోతారు. వారు శ్రమ పడనక్కర్లేదు, మీరు తయారైపోండి చాలు ఎందుకంటే మీరందరూ కూడా జన్మ తీసుకుంటూనే బాబాతో ప్రతిజ్ఞ చేశారు - బాబా నీతోనే ఉంటాం, నీతోనే తయారవుతాం మరియు నీ వెంటనే వెళ్తాం మరియు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యంలోకి వస్తాం అని ప్రతిజ్ఞ చేశారు కదా? వెంటే ఉంటాం, వెంటే వెళ్తాం అంటే సేవలో కూడా వెంటే ఉండే సహయోగులు కదా! కనుక ఇప్పుడు ఏం చేస్తారు? చేతులు అయితే చాలా బాగా ఎత్తారు, బాప్ దాదా సంతోషపడ్డారు కానీ ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే ఈరోజు మరియు ఈ తారీఖు, ఈ సమయాన్ని గుర్తు ఉంచుకోండి, మేమే ఏ విషయానికి చేతులు ఎత్తాం అనేది గుర్తు ఉంచుకోండి, అప్పుడు సహాయం లభిస్తుంది. తయారవ్వాల్సింది అయితే మీరే కానీ ఇప్పుడు త్వరగా తయారైపోండి. కల్పపూర్వంలో కూడా మేమే అయ్యాము, ఇప్పుడు అవుతాం మరియు ప్రతి కల్పం మేమే అవ్వాలి అని అనుకుంటారు కదా, మీరు, పక్కాయేనా లేక రెండు సంవత్సరాలు తయారై మూడవ సంవత్సరంలో వెళ్లిపోతారా? కనుక సదా మేమే నిమిత్తం, కోట్లలో కొందరు మరియు కొందరిలో కొందరు మేము అని గుర్తు ఉంచుకోండి. కోట్లలో కొద్దిమంది అయితే వస్తారు కానీ మీరు కొందరిలో కొందరు.
ఈరోజు స్నేహ రోజు, అయితే స్నేహంలో ఏమి చేయాలన్నా కష్టమనిపించదు. కనుకనే బాప్ దాదా ఈ రోజే అందరికీ స్మృతిని ఇప్పిస్తున్నారు. బ్రహ్మాబాబాపై పిల్లలకి ఎంత ప్రేమ ఉందో అని శివబాబా చాలా సంతోషిస్తున్నారు. నలువైపులా చూశారు. ఏడు రోజుల కోర్స్ చేసిన బిడ్డ అయినా, 70 సంవత్సరాల బిడ్డ అయినా ఇద్దరూ కూడా ఈరోజు ప్రేమలో మునిగి ఉన్నారు. బ్రహ్మాబాబాపై పిల్లలకు ఉన్న ప్రేమను చూసి శివబాబా కూడా హర్షిస్తున్నారు.
ఈనాటి మరింత సమాచారం చెప్పనా! ఈరోజు అడ్వాన్స్ పార్టీ వారు కూడా బాప్ దాదా దగ్గర ప్రత్యక్షమయ్యారు. బాబాతో పాటు ముక్తిధామం యొక్క ద్వారం ఎప్పుడు తెరుస్తారు అని వారు కూడా మిమ్మల్ని స్మృతి చేస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వారందరూ కూడా మాకు తారీఖు చెప్పండి అని బాప్ దాదాను అడుగుతున్నారు. ఏమి జవాబు చెప్పమంటారు? చెప్పండి, ఏమి చెప్పమంటారు? జవాబివ్వటంలో తెలివైనవారు ఎవరు? చాలా త్వరలోనే అయిపోతుంది అని బాప్ దాదా సమాధానం ఇస్తున్నారు. కానీ ఈ విషయంలో పిల్లలైన మీ సహయోగం బాబాకి కావాలి, అందరూ కలిసే వెళ్తారు కదా, వెంట వెళ్లేవారేనా లేక ఆగి ఆగి వెళ్లేవారా? వెంట వెళ్లేవారే కదా? వెంట వెళ్లటం ఇష్టం కదా? మరైతే సమానం అవ్వాలి కదా. వెంట వెళ్లాలంటే సమానంగా అవ్వవలసిందే కదా! చేతిలో చేయి కలిపి తోడుగా నడవాలి అని అంటూంటారు కదా! చేతిలో చేయి అంటే సమానం అని అర్థం. అయితే దాదీలు చెప్పండి, తయారీ అవుతుందా, దాదీలు చెప్పండి, దాదాలు (పెద్ద అన్నయ్యలు) చేతులెత్తండి. మిమ్మల్ని పెద్ద అన్నయ్యలు అని అంటారు కదా, కనుక పెద్ద అక్కయ్యలు, పెద్ద అన్నయ్యలు తారీఖు ఏమిటో చెప్పండి. (ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు) ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడే తయారు అనే కదా అర్థం, మంచి జవాబిచ్చారు. దాదీలూ? పూర్తి అవ్వవలసిందే, ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించండి, చిన్న పెద్ద అందరూ బాధ్యులే, దీనిలో చిన్నవారు కాదు కదా, ఏడు రోజుల బిడ్డ కూడా బాధ్యుడే, ఎందుకంటే వెంట వెళ్లాలి కదా! బాబా ఒంటరిగా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లగలరు కానీ బాబా అలా వదిలేసి వెళ్లలేరు, వెంటే వెళ్లాలి. ఈ ప్రతిజ్ఞ తండ్రిది కూడా మరియు పిల్లలైన మీది కూడా, ప్రతిజ్ఞను నిలుపుకోవాలి కదా! నిలుపుకోవాలి కదా? ఇక్కడ మధువనం వారు కూర్చుంటారు కదా! మధువనంలో ఎవరైతే విభాగాలకు పెద్దగా ఉన్నారో, విభాగాలు అయితే చాలా ఉన్నాయి. శాంతివనం, జ్ఞానసరోవరం, పాండవభవనం అన్ని చోట్ల ఉన్నాయి. కనుక విభాగాలకు పెద్దగా వ్యవహరించేవారి పేర్ల జాబితా బాప్ దాదాకు ఇవ్వండి, వారి నుంచి లెక్క తీసుకుంటారు. టీచర్స్, సేవా కేంద్రాల ఇన్‌ఛార్జ్ లు, జోన్ ఇన్‌ఛార్జ్ లు వారందరినీ ఒక రోజు సంఘటితపరిచి లెక్కల ఖాతా అడుగుతారు. ఎందుకంటే బాప్ దాదా దగ్గరికి దు:ఖం, అశాంతి యొక్క ధ్వని చాలా వస్తుంది. అలజడి అరుపులు వినిపిస్తున్నాయి. మీకు వినిపించడం లేదా, మీకు కూడా భక్తులు ఉంటారు కదా, మరి భక్తుల పిలుపు ఇష్టదేవతలైన మీకు చేరటం లేదా? టీచర్స్ కి భక్తుల పిలుపు వినిపిస్తుందా? మంచిది. నలువైపుల నుంచి ఉత్తరాలు, స్మృతులతో కూడా ఈమెయిల్స్ చాలా చాలా వచ్చాయి. మదువనానికి వచ్చాయి, మరియు వతనానికి కూడా చేరుతున్నాయి. ఈరోజు బంధనాలలో ఉన్న మాతల యొక్క స్నేహంతో నిండిన మనస్పూర్వక స్మృతులు చాలా బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి. బాప్ దాదా అటువంటి స్నేహి పిల్లలకు చాలా స్మృతి ఇస్తారు మరియు ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. ఈరోజుల్లో అందరూ కూడా దూరంగా ఉన్నా కానీ బాబాని చూస్తూ చాలా సంతోషంతో సమీపంగా అనుభవం చేసుకుంటున్నారు, కానీ మధువనంలో సన్ముఖంగా చూడడం, మీ జోలెను నింపుకోవటం, ఇంత పెద్ద పరివారంతో కలుసుకోవడంతో చాలా సంతోషం ఉంటుంది కదా, ఎందుకంటే ఈ పరివారం తక్కువ కాదు ఐదువేల సంవత్సరాల తరువాత కలుసుకున్నారు అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా! కనుక ఏ రీతిలో చూసినా కానీ పరివారాన్ని ఎదురుగా చూడటంలో సంతోషంగా ఉంటుంది కదా. ఆ అనుభవమే వేరు. మధువన నివాసీగా అయ్యే స్వర్ణిమ అవకాశం చాలా సహయోగం ఇస్తుంది. మరియు అందరూ అనుభవం చేసుకుంటున్నారు కూడా, బాప్ దాదాకి సంతోషంగా ఉంది, ఎందుకంటే అందరికీ మురళీపై ప్రేమ ఉంది. మురళీపై ప్రేమ ఉంది అంటే మురళీధరునితో కూడా ప్రేమ ఉన్నట్లే. మురళీధరునితో మాకు ప్రేమ ఉంది అని చెప్తూ అప్పుడప్పుడూ మురళీ వింటూంటే అటువంటి వారి ప్రేమను బాబా ప్రేమగా భావించరు. ప్రేమను నిలుపుకోవటం వేరు, ప్రేమించడం వేరు. మురళీతో ప్రేమ ఉన్నవారే ప్రేమను నిలుపుకునేవారు. మురళీతో ప్రేమ లేదు అంటే ప్రేమించేవారి జాబితాలో ఉంటారు కానీ నిలుపుకునేవారి జాబితాలో ఉండరు. మధువనంలో మురళీ మోగింది అని మధువనానికి మహిమ ఉంది మధువన భూమికే గొప్పతనం.
నలువైపుల ఉన్న స్నేహి పిల్లలకు, లవ్లీ మరియు లవలీన పిల్లలకు, సదా బాబా యొక్క శ్రీమతానుసారంగా ప్రతి అడుగులో కోటానుకోట్లు జమచేసుకునే జ్ఞాన సాగరులు మరియు శక్తిశాలీ పిల్లలకు, సదా స్నేహి, స్వమానధారి మరియు సన్మానధారులకు, సదా బాబా యొక్క శ్రీమతాన్ని పాలన చేసే విజయీ పిల్లలకు, సదా బాబా యొక్క అడుగుపై ప్రతి అడుగు వేసే సహజయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు ఈరోజు వతనంలో ఉన్న అడ్వాన్స్ పార్టీ పిల్లలు ఒక్కొక్కరు ఏమి చెప్పారంటే మా తరుపున కూడా అందరికీ, నలువైపులా ఉన్న పిల్లలకు ప్రియస్మృతులు ఇవ్వండి మరియు మేము వారి కొరకు ఎదురుచూస్తున్నాం, త్వరత్వరగా తయారవ్వండి అనే సందేశాన్ని కూడా ఇవ్వండి అని అన్నారు. విశేషంగా మీ అందరి ప్రియ మమ్మా, దీది మరియు విశ్వకిషోర్ దాదా మరియు మిగిలిన వారందరూ కూడా మీ అందరికీ ప్రియస్మృతులు ఇచ్చారు మరియు ఇప్పుడు విజయీ అయ్యి దు:ఖం మరియు బాధను దూరం చేసి త్వరత్వరగా ముక్తిధామం యొక్క ద్వారాన్ని తెరిచేటందుకు బాబాతో పాటు సంసిద్ధులు కండి అని విశేషంగా మీ మధుర మమ్మా చెప్పారు. మరియు ఎవరైతే సాకారంలో బ్రహ్మాబాబాను చూడలేదో వారందరికీ కూడా బ్రహ్మాబాబా చాలా మనస్పూర్వకంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment