31-01-1998 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పాస్ విత్ ఆనర్ అయ్యేటందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలించుకుని జమ చేసుకోండి.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న ప్రతి ఒక చిన్న, పెద్ద దేశ, విదేశాలలోని పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇటువంటి భాగ్యం కల్పమంతటిలో బ్రాహ్మణాత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండదు. దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు మీ జీవితం యొక్క ఆది నుండి చూడండి - జన్మతోనే మా యొక్క భాగ్యం ఎంత శ్రేష్టమైనది అని. జీవితంలో మొదట జన్మిస్తూనే తల్లిదండ్రుల పాలన యొక్క భాగ్యం లభిస్తుంది, దాని తర్వాత చదువు యొక్క భాగ్యం లభిస్తుంది, ఆ తర్వాత గురువు ద్వారా మతం లేదా వరదానం లభిస్తుంది. పిల్లలైన మీకు పాలన, చదువు మరియు శ్రీమతం లేదా వరదానం ఇచ్చేవారు ఎవరు? పరమాత్మ ద్వారా ఈ మూడు ప్రాప్తిస్తున్నాయి. పాలన చూడండి - పరమాత్మ పాలన కోట్లలో కొద్దిమందికే లభిస్తుంది. పరమాత్మ శిక్షకుని యొక్క చదువు మీకు తప్ప ఇంకెవ్వరికి లభించదు. సద్గురువు ద్వారా శ్రీమతం, వరదానం మీకే లభించాయి. కనుక మీ భాగ్యం గురించి బాగా తెలుసుకున్నారా? భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ ఓహో నా భాగ్యం! అని పాడుకుంటున్నారా, ఊగుతున్నారా?
అమృతవేళ మేల్కొనేటప్పుడు పరమాత్మ ప్రేమలో లవలీనమై మేల్కొంటున్నారు. పరమాత్మ ప్రేమ మేల్కొల్పుతుంది. దినచర్య యొక్క ఆదిలోనే పరమాత్మ ప్రేమ ఉంటుంది. ప్రేమ లేకపోతే లేవలేరు. ప్రేమయే మీకు సమయం యొక్క గంట. ప్రేమ యొక్క గంట ధ్వని మిమ్మల్ని మేల్కొల్పుతుంది. మొత్తం రోజంతటిలో పరమాత్మ వెంట ప్రతి కార్యం చేయిస్తుంది. స్వయం బాబా తన యొక్క పరంధామాన్ని వదిలి మిమ్మల్ని చదివించడానికి వస్తున్నారంటే ఎంత భాగ్యం! భగవంతుడు రోజూ తన ధామాన్ని వదిలి చదివించడానికి వస్తారు అని ఎప్పుడైనా విన్నారా! ఆత్మలు ఎంత దూరదూరాల నుండి వచ్చినా కానీ పరంధామం కంటే దూరదేశం మరేదీ లేదు. ఏదైనా దేశం ఉందా? అమెరికా, ఆఫ్రికా దూరమా? పరంధామం ఉన్నతోన్నత ధామం. ఉన్నతోన్నత ధామం నుండి ఉన్నతోన్నతమైన భగవంతుడు ఉన్నతోన్నత పిల్లలను చదివించడానికి వస్తున్నారు. మీ యొక్క ఈ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా? సద్గురువు రూపంలో ప్రతి కార్యం కొరకు శ్రీమతం కూడా ఇస్తున్నారు మరియు తోడు కూడా ఇస్తున్నారు. కేవలం మతం ఇవ్వడమే కాదు, తోడు కూడా ఇస్తున్నారు, మీరు ఏ పాట పాడుతున్నారు? నా వెంటే ఉన్నావు అని పాడుతున్నారా లేక దూరంగా ఉన్నావు అని పాడుతున్నారా? వెంట ఉన్నారు కదా! వింటున్నా పరమాత్మ టీచర్ తో, తింటున్నా బాప్ దాదాతో పాటు తింటున్నారు. ఒంటరిగా తింటే అది మీ పొరపాటు. బాబా అయితే చెప్తున్నారు - నాతో పాటు తినండి అని. పిల్లలైన మీ యొక్క ప్రతిజ్ఞ కూడా ఇదే - వెంట ఉంటాము, వెంట తింటాము, వెంట నిద్రపోతాము మరియు వెంటే వెళ్తాము. అని..... నిద్రపోవటం కూడా ఒంటరిగా నిద్రపోకూడదు. ఒంటరిగా నిద్రపోతే చెడు కలలు లేదా కలలో చెడు ఆలోచనలు కూడా వస్తాయి. బాబాకి ఎంత ప్రేమ అంటే ఒంటరిగా నిద్రపోకండి, నా వెంట నిద్రపోండి అని అంటారు. లేచినా తోడుగా, నిద్రపోయినా తోడుగా, తింటున్నా కూడా తోడుగా, నడుస్తున్నా కూడా తోడుగా నడవండి. ఆఫీసుకు వెళ్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఆ వ్యాపారానికి మీరు నిమిత్తులు, యజమాని బాబా'. ఆఫీసుకి వెళ్ళినా మా డైరెక్టర్, బాస్ బాప్ దాదా వీరు కేవలం నిమిత్తం, నేను బాబా డైరెక్షన్ ప్రకారం పని చేస్తున్నాను అని భావించాలి. ఎప్పుడైనా మీరు ఉదాశీనంగా అయితే బాబా స్నేహితునిగా అయ్యి మిమ్మల్ని ఊరడిస్తారు. స్నేహితుడు కూడా అవుతున్నారు. ఎప్పుడైనా ప్రేమతో ఏడుస్తున్నా, కన్నీళ్ళు వస్తే తుడవడానికి కూడా వస్తారు మరియు మీ కన్నీళ్ళను మనస్సు అనే డబ్బాలో ముత్యాల వలె నింపుకుంటున్నారు. అప్పుడప్పుడు తుంటరిగా అయ్యి అలుగుతున్నారు. చాలా మధురాతిమధురంగా అలుగుతున్నారు. కానీ అలిగినవారిని కూడా బాబా మాట్లాడిస్తున్నారు. ఏమీ పర్వాలేదు, ముందుకు నడవండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది మర్చిపోండి అని అలక తీరుస్తారు. కనుక మన ప్రతి దినచర్య ఎవరితో ఉంది? బాప్ దాదాతో ఉంది. బాప్ దాదాకి అప్పుడప్పుడు పిల్లల విషయాలకు నవ్వు వస్తుంది. ఒకవైపు కంబైండ్ గా ఉంటున్నాము అంటున్నారు మరలా మర్చిపోతున్నారు, వెంట ఉండేవారిని ఎవరైనా మర్చిపోతారా? వెనువెంట ఉన్నప్పుడు వెంట ఉన్నవారిని ఎవరైనా మర్చిపోగలరా. కానీ పిల్లలలో ఎంత శక్తి ఉందంటే కంబైండ్ ని కూడా వేరు చేసేస్తున్నారు. అందువలన బాబా, శభాష్ పిల్లలూ! అని అంటున్నారు. కంబైండ్ గా ఉంటున్నారు కానీ ఏదైనా మాయ వస్తే కంబైండ్ ని కూడా వేరు చేసేస్తున్నారు.
బాప్ దాదా పిల్లల యొక్క ఆట చూస్తూ చెప్తున్నారు - పిల్లలూ! మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. కానీ ఏమవుతుంది? నా భాగ్యం చాలా ఉన్నతమైనది అని భావిస్తున్నారు. కానీ ఆలోచనాస్వరూపంగా అవుతున్నారే కానీ స్మృతిస్వరూపం అవ్వటం లేదు. నేను ఇలా, నేను అలా.... "ఇలా ఆలోచిస్తున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు కూడా! కానీ ఏది ఆలోచిస్తున్నారో, ఏది చెప్తున్నారో దాని స్వరూపంగా అయిపోండి. స్వరూపంగా అవ్వటంలో లోపం వచ్చేస్తుంది. ప్రతి విషయం యొక్క స్వరూపంగా అయిపోండి. ఆలోచించిన దాని స్వరూపాన్ని కూడా అనుభవం చేస్కోండి. అన్నింటికంటే ఉన్నతమైనది అనుభవీ మూర్తిగా అవ్వటం. అనాది కాలంలో పరంధామంలో ఉన్నప్పుడు ఆలోచనాస్వరూపంగా ఉండరు. స్మృతిస్వరూపంగా ఉండేవారు. నేను ఆత్మను, నేను ఆత్మను అని ఆలోచించటం కాదు, స్వరూపంగా ఉండేవారు, ఆదికాలంలో కూడా ఈ సమయంలోని పురుషార్ధం యొక్క ప్రాలబ్ద స్వరూపం ఉంటుంది, నేను దేవతను, నేను దేవతను....... అని ఆలోచించవలసి ఉండదు, ఆవిధమైన స్వరూపం ఉంటుంది. అనాదికాలం, ఆదికాలంలో స్వరూపంగా ఉన్నప్పుడు ఇప్పుడు అంతిమంలో కూడా స్వరూపంగా అవ్వండి. స్వరూపంగా అవ్వటం ద్వారా మీ గుణాలు, శక్తులు స్వతహాగానే ప్రత్యక్షమవుతాయి. ఎవరు ఏ వృత్తి చేసేవారైనా కానీ తమ సీట్ పై కూర్చోగానే దానికి సంబంధించిన గుణాలు, కర్తవ్యం స్వతహాగానే ప్రత్యక్షమవుతాయి. అదేవిధంగా సదా మీ స్వరూపం యొక్క సీట్ పై సెట్ అయ్యి ఉంటే ప్రతి గుణం, ప్రతి శక్తి, ప్రతి నషా స్వతహాగానే ప్రత్యక్షమవుతుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. దీనినే బ్రాహ్మణత్వం యొక్క స్వతహా సంస్కారం అని అంటారు. దీనిలో అన్ని జన్మల సంస్కారం సమాప్తి అయిపోతుంది. బ్రాహ్మణజన్మ యొక్క స్వతహా సంస్కారం - గుణస్వరూపం మరియు సర్వ శక్తిస్వరూపం. ఇక మిగిలిన పాత సంస్కారాలు బ్రాహ్మణజన్మ యొక్క సంస్కారాలు కాదు. నా సంస్కారమే అంత అని అంటున్నారు కానీ నా సంస్కారం అని ఎవరు మాట్లాడుతున్నారు? బ్రాహ్మణులా లేక క్షత్రియులా? లేక వెనుకటి జన్మ యొక్క స్మ్మతిస్వరూప ఆత్మ మాట్లాడుతుందా? బ్రహ్మాబాబా యొక్క సంస్కారమే బ్రాహ్మణుల యొక్క సంస్కారం. నా సంస్కారం, నా స్వభావం అన్నప్పుడు ఆలోచించండి .. బ్రాహ్మణజీవితంలో ఈ మాటలు ఉంటాయా? అని. ఒకవేళ ఇప్పటికీ తొలగించుకుంటూ ఉంటే మరియు వెనుకటి సంస్కారం ప్రత్యక్షం అవుతూ ఉంటే ఈ సమయంలో నేను బ్రాహ్మణున్ని కాదు. క్షత్రియుడిని, తొలగించుకోవడానికి యుద్ధం చేస్తున్నాను అని భావించండి. ఇలా అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా, అప్పుడప్పుడు క్షత్రియులుగా అవుతున్నారా? ఏమని పిలుచుకుంటున్నారు? క్షత్రియ కుమారులా లేక బ్రహ్మాకుమారులా? ఎవరు? క్షత్రియ కుమారులా ఏమిటి? బ్రహ్మాకుమారి, కుమారులు. రెండవ పేరు లేనే లేదు. క్షత్రియ కుమారులు రండి అని ఎవరినైనా పిలుస్తున్నారా? నేను బ్రహ్మాకుమారుడిని కాదు, క్షత్రియకుమారుడిని అని అంటున్నారా? బ్రాహ్మణులు అంటే బ్రహ్మాబాబా యొక్క సంస్కారమే బ్రాహ్మణుల సంస్కారం. ఏమి చేయము ఇది నా సంస్కారం అనే మాట ఎప్పుడు పొరపాటుగా కూడా ఆలోచించవద్దు. మాట్లాడవద్దు. ఇవి సాకులు. ఈ కథలు తమని తాము విడిపించుకోవడానికి చెప్పే సాకులు. క్రొత్త జన్మ తీసుకున్నారు, క్రొత్త జన్మలో పాత సంస్కారం, పాత స్వభావం అనేవి ఎక్కడి నుండి వస్తాయి? అంటే పూర్తిగా చనిపోలేదా, కొద్దిగా చనిపోయి, కొద్దిగా బ్రతికి ఉన్నారా ఏమిటి? బ్రాహ్మణ జీవితం అంటే బ్రహ్మాబాబా యొక్క అడుగుపై అడుగు ఉండాలి.
బాప్ దాదా బాగ్యాన్ని చూసి ఇంత శ్రేష్టభాగ్యం ముందు ఆ మాట మంచిగా అనిపించదు అని చెప్తున్నారు. ఈసారి ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! ఏమి క్లాస్ చేస్తున్నారు? ముక్తి సంవత్సరం గురించి. 99 సం||రం ముక్తి సంవత్సరమా లేక 98సం||రం ఈ సంవత్సరమే ముక్తి సంవత్సరం అని భావిస్తున్నవారు చేతులు ఊపండి! చేతులు ఊపటం చాలా సహజం. కానీ ఏమౌతుంది? ఇప్పుడు మంచి వాయుమండంలో కూర్చున్నారు కదా, సంతోషంలో ఊగుతున్నారు కనుక చేతులు ఊపుతున్నారు, కానీ మనస్సుతో చేతులు ఊపండి. ప్రతిజ్ఞ చేయండి - ఏది ఏమైనా కానీ ముక్తి సంవత్సరం యొక్క ప్రతిజ్ఞను వదలను అని. ఇలా పక్కా ప్రతిజ్ఞ చేస్తున్నారా? చూసుకుని జాగ్రత్తగా చేతులు ఎత్తండి. ఈ టి.వి.లో వచ్చినా రాకపోయినా బాప్ దాదా దగ్గర చిత్రం వచ్చేస్తుంది. ఇలా బలహీన మాటలు నుండి కూడా ముక్తి అవ్వండి. మాట ఈవిధంగా మధురంగా, బాబా సమానంగా, సదా ప్రతి ఆత్మ పట్ల శుభాభావనతో ఉండాలి. దానినే యుక్తియుక్త మాట అని అంటారు. నడుస్తూ, తిరుగుతూ కూడా సాధారణ మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే ఇవి మాటలా లేక ముత్యాలా అని అనుభవం చేసుకోవాలి. శుభభావనతో కూడిన మాటలు వజ్రాలు, రత్నాలతో సమానం. ఎందుకంటే బాప్ దాదా చాలా సార్లు ఈ సైగ చేసారు - సమయప్రమాణంగా సర్వఖజానాలు జమ చేసుకోవడానికి కొద్ది సమయమే ఉంది అని. ఒకవేళ ఈ సమయంలో సమయం యొక్క ఖజానాను, సంకల్పం యొక్క ఖజానా, మాట యొక్క ఖజానా, జ్ఞానధనం యొక్క ఖజానా, యోగశక్తి యొక్క ఖజానా, దివ్యజీవితం యొక్క సర్వగుణాల ఖజానాలను జమ చేసుకోకపోతే మరలా ఇటువంటి జమచేసుకునే సమయం సహజంగా లభించదు. మొత్తం రోజంతటిలో మీ యొక్క ఈ ఒకొక్క ఖజానా యొక్క ఖాతాను పరిశీలన చేసుకోండి. ఎలా అయితే స్థూలధనం యొక్క ఖజానా ఇంత జమ చేసుకున్నాము అని పరిశీలన చేసుకుంటారు కదా! అలాగే ప్రతి ఖజానా యొక్క ఖాతా పరిశీలన చేసుకోండి. అన్ని ఖజానాలు కావాలి. ఒకవేళ పాస్ విత్ ఆనర్ అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా ఎంతగా జమ చేసుకోవాలంటే 21 జన్మలు ఆ జమ చేసుకున్న ఖాతాతో ప్రాలబ్దం అనుభవించాలి. ఇప్పుడు సమయం ఇంకా టూ లేట్ (బాగా ఆలశ్యం) యొక్క గంట మ్రోగలేదు కానీ మ్రోగనున్నది. రోజు మరియు తారీఖు చెప్పరు. అకస్మాత్తుగా టూలేట్ అని అవుట్ అయిపోతుంది. అప్పుడు ఏమి చేస్తారు? ఆ సమయంలో జమ చేసుకుంటారా? ఎంత కావాలనుకున్నా కానీ సమయం లభించదు. అందువలనే బాప్ దాదా చాలాసార్లు సైగ చేస్తున్నారు - జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి అని. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క టైటిల్ - సర్వశక్తివాన్, శక్తివాన్ కాదు. భవిష్యత్తులో కూడా సర్వగుణసంపన్నులు కేవలం గుణసంపన్నులు కాదు. ఈ అన్ని ఖజానాలను జమ చేసుకోవటం అంటే గుణాలు మరియు శక్తులు జమ చేసుకోవటం. ఒక్కొక్క ఖజానాకి గుణం మరియు శక్తితో సంబంధం ఉంది. సాధారణ మాట కాకుండా మధురంగా మాట్లాడటం అనేది ఒక గుణం. ఇలా ప్రతి ఖజానాకి గుణం మరియు శక్తితో సంబంధం ఉంటుంది.
బాప్ దాదాకి పిల్లలపై ప్రేమ ఉంది అందువలనే మాటిమాటికి సైగ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సభలో అన్ని రకాల వారు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే టీచర్స్ అయితే సమర్పణ అయిపోయారు. కుమారీలు కూడా ఉన్నారు, ప్రవృత్తి వారు కూడా ఉన్నారు. అన్ని రకాల వారు ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చారు, చాలా మంచిది. పిల్లలు అయితే చాలా సమయం నుండి అడుగుతున్నారు. మాకు ఎప్పుడు అవకాశం లభిస్తుంది? అని. అవును కదా పిల్లలూ! మంచిది - అన్ని రకాల పుష్పాలతో కూడిన పుష్పగుచ్చం బాప్ దాదా ఎదురుగా ఉంది. మొదట చిన్న పిల్లలు చేతులు ఎత్తండి?
1. చిన్న పిల్లల గ్రూప్ - పిల్లలంటే పెద్దవారికి ప్రేమ ఉంటుంది. బాబాకి కూడా పిల్లలపై ప్రేమ ఉంది. పిల్లలందరు ఈరోజు బ్రాహ్మణులు రేపు ఏవిధంగా అవుతారు? పిల్లలు చెప్పండి - రేపు ఏమి అవుతారు? (దేవత అవుతాము) మంచిది, ఏ దేవత అవుతారో తెలుసా? పిల్లలలో ఎవరూ దేవీగా అవ్వరా, అందరూ దేవతగానే అవుతారా? మంచిది, పిల్లల వలన వెలుగు వచ్చింది. మీ అందరి వెలుగు చూసి ఓహో పిల్లలూ! ఓహో!! అని అందరూ సంతోషిస్తున్నారు. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి - పిల్లలు బ్రాహ్మణ పిల్లలుగా అయ్యారంటే పెద్దవాళ్ళ భాగ్యం, పిల్లల భాగ్యం కూడా. అందువలన బాబా యొక్క తోడుని ఎప్పుడూ మర్చిపోకూడదు. మాయ ఎంతగా ఆకర్షించినా కానీ బాబాని మర్చిపోకూడదు. మంచిది. పిల్లలందరూ రోజూ క్లాస్ కి వెళ్తున్నారా లేక ఆదివారం, ఆదివారం వెళ్తున్నారా? (రోజూ క్లాస్ కి వెళ్ళేవారు చేతులు ఎత్తారు) వీరందరు రోజూ వెళ్ళేవారు, చాలా మంది ఉన్నారు. మంచిది - టి.వి చూస్తున్నారా? అందరూ నవ్వుతున్నారు. ఒకవేళ మంచి విషయాలు చూస్తే సరే కానీ చెడు విషయాలు చూడటం మంచిది కాదు. ఎప్పుడైనా మేము టి.వి చూసినా కానీ చెడు విషయాలు చూడము అని ఈ రోజు సంకల్పం చేయండి. ఎప్పుడైనా టి.వి చూస్తున్నప్పుడు చెడు విషయాలు వస్తే బంద్ చేసేస్తాము అని ప్రతిజ్ఞ చేయండి. చేయగలరా? టి.వి.లో చెడు విషయాలు చూడటం లేదు అనేవారు చేతులు ఎత్తండి! చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లల టీచర్ ఎవరు? టీచర్స్ పిల్లల యొక్క చార్ట్ చూడాలి. పిల్లలందరు ముక్తి సంవత్సరం జరుపుకుంటారా? సత్యమైన మనస్సుతో చేతులు ఎత్తండి? దాదీలు మీకు అవకాశం ఇచ్చారు కదా! మరి వారికి ధన్యవాదాలు చెప్పారా? చెప్పారా, లేదా? చెప్తే మంచిదే లేకపోతే రేపు ప్రేమతో దాదీలకు ధన్యవాదాలు చెప్పండి, ఎందుకంటే దాదీలు అవకాశం ఇచ్చారు కదా! మేము కూడా ముక్తి సంవత్సరం జరుపుకుంటాము అని ప్రతిజ్ఞ చేయండి. దేబ్బలాడుకోకూడదు. ఆవేశంలోకి రాకూడదు. క్రోధంలోకి రాకూడదు. బాప్ దాదాకి తెలుసు - కొంతమంది చిన్న పిల్లలు ప్రతిజ్ఞలో పెద్దవారికంటే ముందుకి వెళ్ళిపోతారు. కనుక అందరు ముందుకు వెళ్ళి చూపించాలి. మంచిది, పిల్లల యొక్క సభ కూడా మంచిగా ఉంది.
2. కుమారీల గ్రూప్ - కుమారీలు చాలామంది ఉన్నారు. (2000 మంది కుమారీలు వచ్చారు) మంచిది కుమారీలు ధైర్యం పెట్టుకున్నారు, మంచిది. కుమారీల గురించి బాప్ దాదా ఎప్పుడూ అదృష్టవంత జీవితం అని అంటారు. చూడండి - కుమారులు అంటారు - కుమారీ టీచర్ అయితే సెంటర్ కి వెళ్ళగానే దీదీ - దీదీ అని పిలుస్తారు, కుమారులు ఎంత పాతవారైనా కానీ దాదా - దాదా అని అనరు అని. కుమారీలకు ట్రైనింగ్ అవ్వగానే సెంటర్లో ఉండే అవకాశం లభిస్తుంది, కానీ కుమారులు సెంటర్ సంభాళిస్తాం అంటే దాదీలు ఆలోచిస్తారు. అంటే కుమారీల భాగ్యం చాలా సహజంగా తయారై ఉంది. కుమారీ ట్రైనింగ్ చేయగానే, యోగ్యంగా అవ్వగానే కట్నంగా సెంటర్ లభిస్తుంది. కనుక కుమారీ జీవితం ఎంత శ్రేష్టమైనది. ఎంత స్వర్ణిమ అవకాశమో ఆలోచించండి. ఒకవేళ ఇప్పటినుండి సేవాధారిగా కాకపోతే భవిష్యత్తులో ఏమి అవుతారు? సేవాధారులు ఎవరితో కలుస్తారు?ఎవరైతే సేవ చేస్తారో వారితో కలుస్తారు. అందువలన కుమారీలు చాలా త్వరత్వరగా తమ జీవితాన్ని నిర్ణయించుకోవాలి. కానీ బాప్ దాదా కుమారీలకు ఒక విషయం సదా చెప్తారు - సత్యమైన సేవాధారి కుమారీ ఎవరు అంటే సదా శక్తిరూపంగా ఉండే కుమారి అని. ఒకవేళ నిమిత్త సేవాధారి శక్తిశాలిగా లేకపోతే ఇతరులను శక్తిశాలిగా చేయలేరు. కుమారీలు శక్తిశాలిగా ఉండాలి, కోమలంగా ఉండకూడదు. 1. కోమలత 2. ఎవరో ఒకరి ప్రభావంలోకి రావటం అంటే జ్ఞానం యొక్క ప్రభావం వేసేవారిగా కాకుండా ఇతరుల ప్రభావంలో ప్రభావితం అయిపోతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కుమారీల గురించి దాదీలకు భయం అనిపిస్తుంది. బాబాకి ప్రభావితం చేయడానికి నిమిత్తం అయ్యారు. కానీ స్వయమే ప్రభావితం అయిపోతే ఫలితం ఏమి వస్తుంది? బాప్ దాదా చెప్పగానే కుమారీలు అలాగే అంటున్నారు, వెళ్తాము అంటున్నారు, కానీ ఇప్పుడు సమయం అనుసరించి సెంటర్ ని నిర్విఘ్నంగా చేసే శక్తిశాలి కుమారీలు కావాలి. నిర్విఘ్నం అనే సర్టిఫికెట్ స్వయం నుండి తీసుకోవాలి మరియు సహయోగుల నుండి కూడా తీసుకోవాలి. ఇలాంటి కుమారీలేనా లేక కొద్దిగా వస్తువులకు లేదా వ్యక్తులకు ప్రభావితం అయ్యేవారా? ఎవరు, ఏమి ఆలోచిస్తున్నారు? నిర్వినిర్విఘ్న కుమారీ, విఘ్నవినాశకకుమారీ, బలహీనులను శక్తిశాలిగా చేసే కుమారీలు బాప్ దాదాకి కావాలి. అంతే కానీ బాప్ దాదా మరియు దాదీలు సహయోగులుగా పంపిస్తే మీరు సహయోగులకు బదులుగా తలనొప్పిగా (హ్యాండ్ - హెడేక్) తయారు కాకూడదు. అటువంటి కుమారీలుగా కాకూడదు. ఏమని భావిస్తున్నారు? మేము విఘ్నవినాశకులు అయ్యి ఉంటాము అని ఈ విధమైన కుమారీలు తయారేనా? ఎవరైతే ఇలా తయారు అవుతారో వారు చేతులు ఎత్తండి? మనస్సుతో ఎత్తుతున్నారా లేక సంఘటనలో సిగ్గుపడి ఎత్తడం లేదు కదా? ఇలా విఘ్నవినాశకులు అయ్యి సెంటర్ కి వెళ్తాము అంటారో వారు ఒకసారి లేచి నిల్చోండి, మిగిలినవారు కూర్చోండి. 18 సంవత్సరాలు దాటినవారు మేము విఘ్నవినాశకులు అయ్యి సెంటర్ కి వెళ్ళడానికి తయారుగా ఉన్నాము అన్నవారు లేచి నిలబడండి. వీరందరు విఘ్నవినాశక నిమిత్త సేవాధారులేనా? (అవును) ఫోటో తీయండి. మరలా దాదీలకు ఈ క్యాసెట్ ఇవ్వాలి. మరలా మీరు నోట్ చేసుకోవాలి - ఎవరెవరు? అని. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. కుమారీలకు బాప్ దాదా కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు, కానీ కుడిభుజంగా అవ్వాలి కానీ ఎడమభుజంగా కాదు. మంచిది!
3. గీతాపాఠశాలల వారి గ్రూప్ - గీతాపాఠశాలల వారు చేతులు ఎత్తండి! లేచి నిల్చుని చేతులు ఊపండి (సుమారు 4000 మంది అన్నయ్యలు, అక్కయ్యలు ఉన్నారు) చాలామంది ఉన్నారు. గీతాపాఠశాలలకు నిమిత్తమైన పిల్లలను కూడా బాప్ దాదా నిమిత్త సేవాధారులు అని అంటారు. మీ కుటుంబాన్ని కూడా సంభాళిస్తున్నారు మరియు అలౌకిక సేవ కూడా నిమిత్తం అవుతున్నారు అంటే రెండు పనులు చేస్తున్నారు. కానీ గీతా పాఠశాలలకు నిమిత్తమైన ఆత్మల యొక్క విశేషత ఏమిటంటే సదా స్వయాన్ని ప్రతి కార్యంలో నిమిత్తంగా భావించి నడవటం. ఎందుకంటే బాప్ దాదా చూసారు. గీతాపాఠశాలలు తెరిచేవారు రకరకాల సంకల్పాలతో తెరుస్తున్నారు లేక నడిపిస్తున్నారు. కొందరు సత్యమైన మనస్సుతో సేవ కోసం గీతా పాఠశాలలు తెరుస్తున్నారు కానీ కానీ వృద్ధి అయిన తర్వాత కొందరికి అక్కడక్కడ భావనలు కల్తీ అయిపోతున్నాయి. బాప్ వాదా చూస్తున్నారు - కొంతమంది గీతాపాఠశాలలను తమ కుటుంబ పాలన కోసం కూడా తెరుస్తున్నారు, కుటుంబ పాలన కూడా అవుతుంది మరియు నిమిత్తంగా సేవ కూడా జరుగుతుంది అని. కానీ గీతా పాఠశాల అంటే నిమిత్తంగా అయ్యి సేవ చేయటం. ఎందుకంటే ఏ ఆత్మలైనా కానీ బాబా స్నేహం కారణంగా వస్తారు అందువలన నిమిత్తులై కార్యవ్యవహారాన్ని నడిపించటం చాలా అవసరం. ఒకే ఒక నిస్వార్ధ సేవాభావనతో చేసేవారిదే సత్యమైన గీతాపాఠశాల. బాప్ దాదా ఇలా శుభభావనతో గీతాపాఠశాల నడిపించేవారిని చూసి తమ సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు అని చాలా సంతోషిస్తున్నారు. అదే శుద్ధ భావనతో డబల్ కార్యాన్ని సంభాళిస్తున్నారు, మరే భావన యొక్క కల్తీ వారిలో లేదు. పేరు యొక్క భావన, లౌకిక కుటుంబ పాలన యొక్క భావన ఏదీ ఉండదు. ఇటువంటి శుద్ధభావన, సేవా భావన గల నిమిత్త ఆత్మలకు బాప్ దాదా చాలా చాలా చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు - మంచిగా ఉన్నారు మరియు మంచిగానే ఉంటారు అని. కానీ పరిశీలించుకోండి - ఏ భావన కలవకూడదు. సేవా భావన తప్ప మరే భావన రానివ్వకూడదు. సేవ చేస్తున్నారు అంటే అనేకాత్మల కళ్యాణం చేస్తున్నారు. ఇంకా ఏమి చూశారంటే గీతాపాఠశాలల వారి విశేషత ఏమిటంటే కుటుంబంలో ఉండేవారిని చూసి కుటుంబంలో ఉండేవారు ధైర్యం చేస్తున్నారు. సెంటర్లో వారిని చూసి మేము కూడా ఇలా వదిలివేయాలేమో అనుకుంటున్నారు కానీ కుటుంబంలో ఉంటూ సేవకి నిమిత్తమైన పిల్లలను చూసి కుటుంబంలో ఉండేవారికి మరింత ధైర్యం, ఉత్సాహ, ఉల్లాసాలు వస్తున్నాయి. అందువలన బాప్ దా దా గీతాపాఠశాలల వారికి కూడా చాలా చాలా సేవ యొక్క శుభాకాంక్షలు, ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఒక చేయి యొక్క చప్పట్లు కొట్టండి. మంచిది!
4. సమర్పణ అయిన టీచర్స్ యొక్క గ్రూప్ - మంచిగా చేసారు, ధైర్యం పెట్టుకుని సేవకి నిమిత్తంగా అయ్యే ప్రత్యక్షత స్టేజ్ పైకి తీసుకువచ్చారు. బాబా వారిగా అవ్వటం మరియు బాబా చేతికి చేయి ఇచ్చే మహోత్సవం 5-6 సంవత్సరాల ముందే అయిపోయింది కానీ ఇప్పుడు చేతిలో ఉన్న చేతిని ఎవరూ విడిపించలేని విధంగా గట్టిగా పట్టుకోవాలి. అందువలనే బాప్ దాదా సమర్పణ అయిన టీచర్స్ కి శుభాకాంక్షలు ఇస్తున్నారు - సదా చేతిలో చేయి, తోడుగా వెనువెంట ఉంటూ విజయీమాల మెడలో వేసుకోండి. ఇప్పుడు ఏ స్థానంలో ఉంటున్నారో ఆ స్థానాన్ని మరియు స్వయాన్ని నిర్విఘ్నంగా తయారు చేసుకోవాలి. ఏ విఘ్నం యొక్క రిపోర్ట్ రాకూడదు. స్వ పురుషార్థంలో కూడా విఘ్నరూపంగా అవ్వకూడదు. కొన్నిసార్లు బాహ్యంగా ఏ విఘ్నాలు లేకపోయినా కానీ మనస్సులో అయితే వస్తాయి కదా! కనుక మనస్సు ద్వారా కూడా విఘ్నం రాకూడదు, సహయోగుల ద్వారా విఘ్నం ఉండకూడదు, విద్యార్థుల ద్వారా కూడా ఏ విఘ్నం ఉండకూడదు అంటే స్వయం నిర్విఘ్నం, సేవాకేంద్రం నిర్విఘ్నం, సహయోగులు నిర్విఘ్నం. ఈ మూడు సర్టిఫికెట్స్ ఈ ముక్తి సంవత్సరంలో తీసుకోవాలి. అంగీకారమేనా? ఇతరులు విఘ్నం వేస్తే ఏమి చేస్తారు? మీరయితే నిర్విఘ్నంగా ఉంటారు కానీ ఇతరులు ఎవరైనా విఘ్నం వేసేవారు ఉంటే ఏమి చేస్తారు? విఘ్నవినాశకులుగా అవుతారా? సమర్పణా సమారోహం అంటే సంపూర్ణతా సమారోహం. కేవలం సమర్పణా సమారోహాన్ని స్మృతి ఉంచుకోవడమే కాదు. అది కూడా స్మృతి ఉంచుకోవాలి. కానీ సమయప్రమాణంగా ఇప్పుడు సంపూర్ణతా మహోత్సవాన్ని జరుపుకోవాలి. ఇంత ధృఢనిశ్చయం యొక్క కంకణాన్ని కట్టుకుని వెళ్ళాలి. బాప్ దాదా టీచర్స్ అందరికీ చెప్తున్నారు - దేశం యొక్క విదేశాల యొక్క టీచర్స్ అందరూ చేతులు ఎత్తండి? మంచిది. ఈరోజు విదేశీయులు కూడా చాలా మంది ఉన్నారు. విదేశీ సెంటర్స్ వారికి సుస్వాగతం!
మంచిది - బాప్ దాదాకి టీచర్స్ పట్ల ఒక శుభభావన ఉంది, చెప్పనా? కేవలం వింటారా లేక చేస్తారా? కేవలం ఆలోచిస్తారా లేక స్వరూపంగా అవుతారా? వింటాము, చేస్తాము ... అంటే మంచిది, చాలా చిన్న శుభభావన. పెద్ద విషయం కూడా కాదు, చాలా చిన్న విషయం. దాదీ సందేశం పంపించారు కదా - ఇప్పుడు సేవాకేంద్రాలన్నీ నిర్విఘ్నంగా అయిపోవాలి దాని భాద్యులు టీచర్స్. ఇప్పటివరకు టీచర్స్ నుండి ఫిర్యాదులు వస్తున్నాయి, దాదీల దగ్గర ఆ ఫైల్ ఉంది కదా! ఆఫీసులో ఉండే ఈషు అక్కయ్య చెప్తున్నారు - సెంటర్స్ నుండి ఎన్ని పనికిరాని ఉత్తరాలు వస్తున్నాయి అంటే వాటితో చెత్తడబ్బా నిండిపోతుంది అని. అవును కదా? అవి చదవడానికి సమయం పడుతుంది, తర్వాత చించటంలో కూడా సమయం పడుతుంది. తిరిగి చెత్తడబ్బాలో వేయడంలో కూడా సమయం పడుతుంది. ఈ శ్రమ అంతా వ్యర్ధం కదా! అందువలన బాప్ దాదా యొక్క శుభభావన ఏమిటంటే టీచర్స్ అందరూ బాబాకి కుడిభుజాలు, ఎడమ భుజాలు కాదు. కుడిభుజాలు అయినటువంటి వారు ఉండే స్థానం నుండి లేదా సేవాకేంద్రం నుండి చెత్త డబ్బా నిండేవిధంగా సమాచారం వస్తే బావుంటుందా? బావుంటుందా, బావుండదో చెప్పండి? మేము ఈ సంవత్సరం ప్రతి ఒక్కరం స్వయం యొక్క విఘ్నవినాశకులుగా, సెంటర్ విఘ్నవినాశకులుగా, మరియు సహయోగులు విఘ్నవినాశకులుగా అయ్యే మూడు సర్టిఫికెట్స్ తీసుకుంటాం, ఈ మూడు సర్టిఫికెట్స్ తీసుకోవడానికి మేము తయారుగా ఉన్నాము అనే టీచర్స్ చేతులు ఎత్తండి! సెంటర్స్ లో ఉండే అన్నయ్యలు కూడా చేతులు ఎత్తండి? (అందరు చేతులు ఎత్తారు) కృతజ్ఞతలు.
ఇప్పుడు వేస్ట్ పేపర్ బాక్స్ ఖాళీగా ఉంటుంది. చదవవలసిన అవసరం ఉండదు. ఈషు అక్కయ్య చెప్తున్నారు - లెటర్స్ తెరిచి, తెరిచి చేతులు అలసిపోతున్నాయి అని. అందువలన ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ, విదేశంలో ఉండి వింటున్నా, దేశంలో వింటున్నా, మురళి వింటున్నా కానీ మొత్తం విశ్వంలో ఉన్న టీచర్స్ పట్ల బాప్ దాదాకి ఇదే శుభభావన ఉంది - ఈ సంవత్సరం ఏ కంప్లెట్స్ రాకూడదు అని. ఫిర్యాదుల ఫైల్ సమాప్తి అయిపోవాలి. బాప్ దాదా దగ్గర కూడా చాలా ఫైల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఫిర్యాదుల ఫైల్ సమాప్తి అయిపోవాలి. అందరూ శుద్ధంగా (ఫైన్) అయిపోవాలి. శుద్దం నుండి పరిశుద్ధం కూడా అయిపోవాలి (ఫైన్ - రిఫైన్) ఇష్టమే కదా? ఎవరు ఎలా ఉన్నా కానీ వారితో నడిచే విధిని నేర్చుకోండి. ఎవరు ఏమి చేస్తున్నా కానీ మాటిమాటికి విఘ్నరూపమై ఎదురుగా వస్తున్నా కానీ ఆ విఘ్నాలలో సమయం ఉపయోగించటం కూడా ఎంతవరకు? వీటికి యొక్క సమాప్తి సమారోహం కూడా జరగాలి కదా? కనుక వీరు ఇలా చేస్తున్నారు అని ఇతరులను చూడకూడదు. నేను ఏమి చేయాలి? అని అనుకోవాలి. వారు పర్వతం అయితే దాని నుండి మీరే తప్పుకోవాలి కానీ పర్వతం తప్పుకోదు. వీరు మారితే నేను మారతాను అని అనుకోవటం అంటే పర్వతం తొలగితే నేను ముందుకు వెళ్తాను అనటం. అప్పుడు పర్వతం తొలగదు, మీరు గమ్యానికి చేరుకోలేరు. ఒకవేళ ఆ ఆత్మ పట్ల మీకు శుభభావన ఉంటే వారికి సైగ చేసారు మరియు మనస్సు, బుద్దితో ఖాళీ అయిపోండి. స్వయం ఆ విఘ్న స్వరూపంగా అయిన వారి ఆలోచనల్లో పడకండి. నెంబర్‌వారీ కనుక స్థితి కూడా నెంబర్ వారీగానే ఉంటుంది. కానీ మనం నెంబర్ వన్ గా అవ్వాలి. ఇలా స్వయం పరివర్తన అయ్యి విఘ్నం లేదా వ్యర్థ సంకల్పాలు నడిపించే ఆత్మల పట్ల శుభ భావన పెట్టుకుంటూ నడవండి. కొద్దిగా సమయం పడుతుంది, కొద్దిగా శ్రమ అనిపిస్తుంది కానీ ఆఖరుకి స్వ పరివర్తన అయిన వారికి విజయీమాల మెడలో పడుతుంది. శుభభావనతో వారిని పరివర్తన చేయగలిగితే చేయండి లేకపోతే సైగ చేయండి, మీ భాధ్యత పూర్తి చేయండి మరియు స్వయం పరివర్తన అయ్యి ముందుకు ఎగిరిపోండి. ఈ విఘ్నరూపం కూడా తగుల్పాటు యొక్క బంగారు దారం. ఇది కూడా ఎగరనివ్వదు. ఇది చాలా లోతైన మరియు సత్యత అనే పరదాలో ఉన్న దారం. ఇది సత్యమైన విషయమే కదా అని అనుకుంటారు. ఇలా జరగకూడదు అనుకుంటారు. కానీ ఎప్పటివరకు చూస్తూ ఉంటారు, ఎప్పటి వరకు ఆగుతూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు లోతైన దారాల నుండి కూడా ముక్తి చేసుకోండి. ముక్తి సంవత్సరం జరుపుకోండి. అందువలన పిల్లల యొక్క ఆశలు, ఉత్సాహ,ఉల్లాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కార్యక్రమాలు జరిపి బాప్ దాదా పూర్తి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం యొక్క అంతిమ కార్యక్రమం - ముక్తి సంవత్సరం యొక్క కార్యక్రమం. ఫంక్షన్ లో దాదీలకు కూడా బహుమతి ఇస్తారు. బాప్ దాదాకి అయితే ఈ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో సంపూర్ణత అనే బహుమతి ఇవ్వాలి. మంచిది! బాప్ దాదా అన్ని సేవాకేంద్రాలకు సేవ కోసం డైరెక్షన్ ఇస్తున్నారు - సెప్టెంబరు మరియు అక్టోబర్ ఈ రెండు నెలలు పెద్ద, పెద్ద కార్యక్రమాలు చేయండి. ధ్వనిని ఎంతగా వ్యాపింప చేయగలరో అంతగా వ్యాపింపచేయండి. అన్ని మూలల ధ్వనిని వ్యాపింపచేయండి. ఏ మూల మిగిలిపోకూడదు. పెద్ద, పెద్ద ప్రోగ్రామ్స్ లో కూడా లక్ష్యం పెట్టుకోండి - వచ్చిన వారు కేవలం విని వెళ్ళిపోవటం కాదు, తయారవ్వాలనే శుభకోరికతో వెళ్ళాలి, ఇలాంటి విధిని తయారుచేయండి. ఏదోకటి అనుభవం చేసుకుని వెళ్ళాలి. వర్తమాన సమయంలో నలువైపుల వాయుమండలం కూడా సహయోగిగా ఉంది. కనుక సహజంగా సఫలత లభించే సమయం. కనుక ధ్వనిని బాగా వ్యాపింపచేయండి మరియు వెనువెంట ఏవైతే చిన్న, చిన్న స్థానాలు ఉన్నాయో, పెద్ద కార్యక్రమాలు చేసే ధైర్యం లేనటువంటి చోట చిన్న, చిన్న గ్రూప్స్ అంటే 10 - 12 మంది ఉన్నా కానీ యోగశిబిరం యొక్క కార్యక్రమం పెట్టండి. ఒకవేళ స్థానం లేకపోయినా కానీ దగ్గరలో ఉన్న ఏదోక స్థానం తీసుకోగలిగితే తీసుకోండి, ఒకవేళ అది కూడా లేకపోతే ఒకరోజు అయినా యోగశిబిరం పెట్టండి. శెలవు రోజు ఒక్కరోజు పెట్టినా కానీ వారికి మంచిగా అనుభవం అవుతుంది అప్పుడు తమకు తాముగానే రెండవ ఆదివారం కూడా వస్తాం అని అంటారు. యోగశిబిరం కూడా విద్యార్థులను తయారు చేస్తుంది. కాన్ఫరెన్స్ లు మరియు స్నేహ కలయిక, చిన్న, చిన్న స్నేహ కలయికలు కూడా ఆత్మలను సమీపంగా తీసుకువస్తాయి కానీ పెద్ద కార్యక్రమం ప్రభావితం చేస్తుంది. పేరు ప్రసిద్ది అవుతుంది. ప్రచారం కూడా బాగా అవుతుంది కనుక రెండూ అవసరమే. చిన్న స్థానాలు మరియు చిన్న సెంటర్స్ లో చిన్న, చిన్న స్నేహ కలయికలు పెట్టుకోండి లేక చిన్న యోగశిబిరం యొక్క కార్యక్రమం పెట్టుకోండి. దానితో పాటు సమయం సహజంగా లభించినప్పుడు అంటే వాతావరణం అనుసరించి, సౌకర్యాలను అనుసరించి సహజ సమయంలో ఒక నెల ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క స్వ ఉన్నతి గురించి, సర్వ ఖజానాలను జమ చేసుకునే అభ్యాసం యొక్క భట్టీ పెట్టుకోవాలి. ఒక నెల స్వ ఉన్నతి కోసం కేటాయించుకోవటం చాలా అవసరం. దీనిలో కొంచెం నవీనత ఉండాలి. ఇప్పటి వరకు జరిగిన భట్టీలు మంచిగానే జరిగాయి, కానీ ఇప్పుడు వాటిలో ఏదోక కొత్తదనాన్ని జోడించండి. కొంచెం సమయం అంతర్ముఖత యొక్క మౌనం, మనసు యొక్క మౌనం కూడా ఉండాలి. నోటి యొక్క మౌనం అయితే ప్రపంచం వారు కూడా పెట్టుకుంటున్నారు కానీ వ్యర్ధ సంకల్పాల నుండి మనస్సు మౌనంగా ఉండాలి. ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు వ్యర్థాన్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తున్నారో అదేవిధంగా మధ్యమధ్యలో ఒకరోజు మనస్సు యొక్క వ్యర్ధం యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయండి. జ్ఞాన మననంతో పాటు, శుభభావన, శుభకామన యొక్క సంకల్పాలు, శక్తి నిచ్చే అభ్యాసం ఈ మనస్సు యొక్క మౌనం లేదా ట్రాఫిక్ కంట్రోల్ మధ్యమధ్యలో ఒక రోజు విశేషంగా చేయండి. ఒకవేళ ఎవరికైనా సెలవు దొరకకపోయినా వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది కదా! దానిని అనుసరించి మీ మీ స్థానాలలో ప్రోగ్రామ్ నిర్ణయించుకోండి. కానీ ఒక నెల విశేషంగా ఏకాంతవాసి మరియు ఖజానాల పొదుపు యొక్క ప్రోగ్రామ్ తప్పక చేయండి. ఏక్ నామీ మరియు ఎకానమీ. బాప్ దాదా తన నియమ ప్రమాణంగా నవంబర్ నుండి వస్తారు. ఈ రథం యొక్క ధృఢసంకల్పం, దైర్యం మరియు సంభాళన ద్వారా ఈ సంవత్సరం నిర్విఘ్నంగా సమాప్తి అయిపోయింది మరియు ఇంకా అవుతుంది. ఇప్పుడు కూడా పిల్లలకు ఉత్సాహం ఉంది, రథం తయారుగా ఉంటే రథికుడు రావడానికి ఏమిటి! కానీ మధ్యమధ్యలో విశ్రాంతి కూడా తీసుకోవాలి. రథానికి విశ్రాంతి కూడా ఇవ్వాలి అంతే కానీ ఎక్కువ పనిలో ఉపయోగించకూడదు. విశ్రాంతి సమయంలో విశ్రాంతి, సేవ సమయంలో సేవ చేయాలి. అమృతవేళ ముఖ్యంగా ప్లానింగ్ బుద్ధి గల ఆత్మలను బాప్ దాదా కార్యానికి నిమిత్తం చేస్తారు, వారికి కొత్త, కొత్త సేవా విధులు టచ్ అవుతాయి. కేవలం మీ బుద్ధిని బాబాకి అర్పణ చేసి కూర్చోండి. బుద్దివాన్ అయిన బాబా మీ బుద్ధికి టచ్ చేస్తారు. ప్లానింగ్ బుద్ది ఆత్మలకు ఈ వరదానం లభించవలసిందే. కనుక నిమిత్తంగా అవ్వండి.
నలువైపుల ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతం యొక్క భాగ్యానికి అధికారులైన విశేష ఆత్మలకు, సదా ఆలోచించడం మరియు స్వరూపంగా అవ్వటం రెండింటినీ సమానంగా చేసే బాబా సమాన ఆత్మలకు, సదా పరమాత్మ యొక్క శక్తి ద్వారా స్వయంలో, సేవలో సహజ సఫలత పొందే నిమిత్త సేవాధారి పిల్లలకు, సదా బాబాని కంబైండ్ గా అనుభవం చేసుకునేవారికి, సదా తోడుని నిలుపుకునే సహచరి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment