18-01-1997 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మీ రూపం ద్వారా బాబా రూపాన్ని ప్రత్యక్షం చేయండి అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాఢా మ్రోగుతుంది.
ఈ రోజు బాప్ దాదా రెండు విశాల సభలను చూస్తున్నారు. 1. సాకారంలో మీరందరు ఎదురుగా ఉన్నారు మరియు 2. అవ్యక్త రూపం యొక్క విశాల సభను చూస్తున్నారు. నలువైపుల పిల్లలందరు ఈ సమయంలో అవ్యక్త రూపంలో బాబాని సన్ముఖంగా (ఎదురుగా) చూస్తున్నారు మరియు వింటున్నారు. రెండు సభలు ఒకదానికంటే ఒకటి ప్రియమైనవి. ఈ రోజు విశేషంగా అందరి మనస్సులో బ్రహ్మాబాబా యొక్క స్మృతి నిండి ఉంది. ఎందుకంటే బ్రహ్మాబాబాకి ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. అందరికి మనస్సులో బ్రహ్మాబాబాపై స్నేహం ఉంది. ఎందుకంటే బ్రహ్మాబాబాకి కూడా ఒక్కొక్క బిడ్డ అంటే చాలా ఇష్టం. ఎలా అయితే పిల్లలైన మీరు ఇక్కడ సాకారంలో బ్రహ్మాబాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యం స్మృతి చేస్తున్నారో అదేవిధంగా బ్రహ్మాబాబా కూడా పిల్లలైన మీ యొక్క విశేషతలు గురించి, సేవ గురించి మహిమ చేస్తున్నారు. కనుక బ్రహ్మాబాబా యొక్క అవ్యక్త ధ్వని మీ అందరికీ చేరుకుంటుందా? మీరందరు అమృతవేళ నుండి ఏవైతే మధురాతి మధురమైన విషయాలు లేక మధురమైన నిందలు కూడా ఇస్తున్నారు. అవన్నీ వింటూ బ్రహ్మాబాబా నవ్వుకుంటున్నారు మరియు ఏమి గుణాలు పాడుతున్నారు? ఓహో నా యొక్క ప్రియమైన, గారాభమైన పిల్లలూ! బాబాని ప్రత్యక్షం చేసే పిల్లలూ ఓహో!!. బ్రహ్మాబాబా ఇప్పుడు పిల్లలపై ఏమి శుభ ఆశలు పెట్టుకుంటున్నారో తెలుసా?
బాబా ఇదే కోరుకుంటున్నారు - నా యొక్క ప్రతి బిడ్డ తన యొక్క మూర్తి ద్వారా బాబా చిత్రాన్ని చూపించాలి. ఎవరు చూసినా, ఎవరు సంబంధంలోకి వచ్చినా వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి, బాబా కనిపించాలి. అప్పుడే సమయం సమాప్తి అవుతుంది. అందరి మనస్సు నుండి ఇదే ధ్వని కావాలి - మా బాబా వచ్చారు, మా తండ్రి అని. బ్రహ్మాకుమారీల బాబా కాదు, మా బాబా అని రావాలి. ఎప్పుడైతే అందరి మనస్సుల నుండి నా బాబా అనే మాట వస్తుందో ఈ ధ్వనియే నలువైపుల నగాఢా మ్రోగిస్తుంది. విజ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాల ద్వారా కూడా ఈ నగాఢా మ్రోగుతుంది - మా తండ్రి వచ్చారు అని. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో చాలా మంచిగా చేసారు మరియు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందరు కలిసి నగాఢా మ్రోగించాలి. ఎక్కడ ధ్వని వింటున్నా ఒకే ధ్వని వింటారు. రావలసిన వారు వచ్చేసారు అనే మాట రావటాన్నే బాబా యొక్క స్పష్ట ప్రత్యక్షత అని అంటారు. ఇప్పుడు పేరు ప్రత్యక్షం అయ్యింది. మొదటి అడుగు పేరు ప్రసిద్ధం అయ్యింది, బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులు మంచి పని చేస్తున్నారు అని. విద్యాలయం యొక్క లేదా కార్యం యొక్క జ్ఞానం యొక్క మహిమ ఇప్పుడు చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇలాంటి కార్యం ఎవరూ చేయలేరు అని భావిస్తున్నారు. ఇంతవరకు చేరుకున్నారు. ఈ విషయం స్పష్టం అయ్యింది. నలువైపుల ఈ విషయానికి మహిమ జరుగుతుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా పరదా తెరుచుకుంటుంది కానీ స్పష్టంగా తెరుచుకోలేదు. వీరి వెన్నెముకగా ఏదో శక్తి ఉంది అనుకుంటున్నారు, కానీ వారే బాప్ దాదా మరియు మనం కూడా బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అని ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకి రావాలి, ఇప్పుడు ఇది జరగాలి. ఒక అడుగు వేస్తున్నారు. ఆ ఒక అడుగు సహయోగం యొక్క అడుగు, సహయోగం ఇవ్వాలి అనే ప్రేరణ లోపల కలుగుతుంది. ఇప్పుడు రెండవ అడుగు - స్వయం వారసత్వం తీసుకోవడానికి ఉత్సాహంతో రావాలి. ఎప్పుడైతే ఈ రెండు అడుగులు కలుస్తాయో అప్పుడే నలువైపుల బాజాలు మ్రోగుతాయి. ఏమి బాజా మ్రోగుతుంది? - "నా బాబా”. మీ బాబా కాదు, నా బాబా అని. ఎలా అయితే కార్యం యొక్క మహిమ చేస్తారో అదేవిధంగా చేసి చేయించే బాబా యొక్క మహిమ పాడాలి. ఇది జరగనున్నదే. మీకు కూడా ఈ దృశ్యం కళ్ళ ఎదురుగా వస్తుందా? మనస్సులోకి, బుద్ధిలోకి కూడా వస్తుంది కదా! ఎందుకంటే పిల్లలందరికి వారసత్వం ఇవ్వడానికి బాబా మరియు దాదా వచ్చారు. ముక్తి అయినా, జీవన్ముక్తి అయినా వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఎవరు వంచితంగా ఉండరు ఎందుకంటే బాబా బేహద్ తండ్రి, బేహద్ యజమాని కనుక బేహద్ గా అందరూ వారసత్వం తీసుకోవలసిందే. యోగబలం ద్వారా తమ జన్మజన్మల పాపాలు తొలగించుకోలేకపోవచ్చు కానీ కేవలం బాబా వచ్చారు అని ఇంతవరకు అయితే తెలుసుకున్నారు కనుక ఇలా ఏదోక విధంగా తెలుసుకోవడం ద్వారా, గ్రహించటం ద్వారా వారసత్వానికి అధికారిగా అయిపోతారు. ఎలా అయితే బాబాకి బే హద్ వారసత్వం ఇవ్వాలనే సంకల్పం ఉంది మరియు నిశ్చితం కూడా అయిపోయింది. అదేవిధంగా మీ అందరి మనస్సులో మన యొక్క సోదరి సోదరులందరు బేహద్ వారసత్వానికి అధికారిగా కావాలనే శుభభావన, శుభకామన ఉత్పన్నం అవుతుందా? ఈ శుభభావన, శుభకామన ఎప్పటివరకు ప్రత్యక్షం చేస్తారు? దీని తారీఖు మొదట మీ మనస్సులో నిర్ణయించుకోండి. సంఘటన కంటే ముందు మనస్సులో నిర్ణయించుకోండి. తర్వాత సంఘటనలోకి తీసుకువస్తే వినాశనం యొక్క తారీఖు స్వతహాగానే స్పష్టం అయిపోతుంది. దీని గురించి చింతించకండి. దయ వస్తుందా లేక మేమైతే అధికారి అయిపోయాము అనే ఆనందంలో ఉంటున్నారా? ఆనందంలో ఉండండి, చాలా మంచిది కానీ దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలు కనుక బేహద్ ఆత్మలపై దయ చూపించండి. ఎప్పుడైతే ఇతరులపై దయ వస్తుందో అప్పుడు స్వయంపై స్వయానికి దయ మొదటే వస్తుంది. ఇక మరల చిన్న విషయం గురించి మీరు ఏదైతే పురుషార్ధం చేస్తున్నారో అది చేయవలసిన అవసరం ఉండదు. మాస్టర్ దయాహృదయులు అవ్వండి. ఈ గుణాన్ని ప్రత్యక్షం చేయండి. ఇతరులపై దయ చూపించటం ద్వారా స్వయంపై స్వతహాగానే దయ వచ్చేస్తుంది.
బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - బాప్ దాదాకి పిల్లల యొక్క ఒక విషయం మంచిగా అనిపించటం లేదు అని అది ఏమిటో తెలుసా? బాప్ దాదాకి పిల్లలు శ్రమ చేయటం లేదా మాటిమాటికి యుద్ధం చేయటం మంచిగా అనిపించటం లేదు. బాబా కూడా ఓ నా యొక్క యోగీ పిల్లలు అంటున్నారు కానీ యుద్ధం చేసే వీరులు అనటంలేదు. యోగి పిల్లల యొక్క పని ఏమిటి? యుద్ధం చేయటం మంచిగా అనిపిస్తుందా? అలజడి కూడా అయిపోతున్నారు మరియు మరలా యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు యుద్ధం చేయము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు మరియు మరలా యుద్ధం కూడా చేస్తున్నారు. ఈ రోజు యుద్ధం చేయము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు మరలా కొంచెం సమయం తర్వాత యోగికి బదులు యుద్ధవీరులుగా అయిపోతున్నారు. ఇది ఎందుకు? బాప్ దాదా చెప్తున్నారు, పిల్లలకి యోగంతో ప్రేమ తక్కువగా ఉంది, యుద్ధంతో ప్రేమ ఎక్కువగా ఉంది అని. కనుక ఈరోజు నుండి ఏమి చేస్తారు? వీరులుగా అవుతారా లేక నిరంతర యోగి అవుతారా?
బాప్ దాదా చూస్తున్నారు - జనవరి 18తారీఖులు ఎన్ని గడిచిపోయినవి! మరియు విశేషంగా బ్రహ్మాబాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు, నా యొక్క గారాభ పిల్లలూ, నా సమానంగా తయారయ్యి వతనానికి రండి అని. వతనం ఇష్టం అనిపించటం లేదా? యుద్ధం చేయడమే ఇష్టం అనిపిస్తుందా? యుద్ధం చేయకండి. ఈ రోజు నుండి యుద్ధం చేయటం సమాప్తి చేయండి. చేస్తారా? అలాగే అని చెప్పండి. మరలా అక్కడికి వెళ్ళి మాయ వచ్చేసింది, యుద్ధం చేసి ప్రారద్రోలాము అని ఉత్తరాలు వ్రాయకండి. కొంతమందికి స్వయం యొక్క మాయ వస్తుంది మరికొంతమంది ఇతరుల మాయ చూసి స్వయం కూడా మాయా ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. ఇది ఎందుకు, ఇది ఏమిటి..... ఇలా ఇతరుల మాయ తమలోకి తీసుకువస్తున్నారు. ఇది కూడా చేయకూడదు. మాయ నుండి విడిపించటం బాబా యొక్క పని, మీరు స్వ పురుషార్థంలో తీవ్రంగా అవ్వండి. మీ యొక్క తరంగాల ద్వారా, సంకల్పం ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ స్వతహాగానే పారిపోతుంది. ఒకవేళ ఎందుకు, ఏమిటి అనే విషయాలలోకి వెళ్తే మీ యొక్క మాయ తొలగదు మరియు ఇతరుల యొక్క మాయ కూడా తొలగదు. ఎలా అయితే ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చారు కదా! ఇప్పుడు 96 సంవత్సరం అనరు 97 అంటారు కదా! ఎవరైనా పొరపాటుగా 96 అని అన్నా కాదు 97 అంటారు కదా! అదేవిధంగా ఈరోజు ఎందుకు, ఏమిటి, ఇలా, అలా ఈ మాటలకు వీడ్కోలు ఇచ్చేయండి. ప్రశ్నార్థకం పెట్టకండి, బిందువు పెట్టండి. ప్రశ్నార్థకం పెట్టారు అంటే వ్యర్థ ఖాతా ప్రారంభం అవుతుంది మరియు ఎప్పుడైతే వ్యర్ధ ఖాతా ప్రారంభం అవుతుందో ఇక సమర్ధ ఖాతా సమాప్తి అయిపోతుంది. మరియు ఎక్కడ సమర్ధత సమాప్తి అయిపోతుందో అక్కడ రకరకాల రూపాల ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా మాయ తన యొక్క గ్రాహకులుగా తయారు చేస్తుంది. మరలా ఎలా అవుతున్నారు? యోగిగా అవుతున్నారా లేదా వీరులుగా అవుతున్నారా? వీరులుగా అవ్వకూడదు. పక్కా ప్రతిజ్ఞ చేసుకున్నారా? లేదా బాప్ దాదా చెప్తుంటే అవును అంటున్నారా? పక్కాగా చేసుకున్నారా? మరలా మీ దేశానికి వెళ్ళిన తర్వాత పచ్చిగా అయిపోతారా? శక్తులు ఏమి అంటున్నారు? అవుతారా లేక లేదా? అందరు అవును అనటం లేదు అంటే కొద్దిగా ఏదైనా ఉందా! (అందరు అలాగే అన్నారు) చూసుకోండి. టి.విలో ఫోటో వచ్చేస్తుంది. తర్వాత బాప్ దాదా టి.వి క్యాసెట్ పంపిస్తారు. ఎందుకంటే బాబా ప్రతి పిల్లవాడి వెంట ఉంటారు. క్రొత్తవారైనా, పాత వారైనా కానీ ఎవరైతే మనస్సుతో నా బాబా అంటున్నారో కేవలం వినటమే కాదు కానీ అంగీకరించారు మరియు అంగీకరించి నడుస్తున్నారో వారందరితో బాబాకి మనస్ఫూర్వక ప్రేమ ఉంది. కేవలం మాట మాత్రపు ప్రేమ కాదు. బాప్ దాదా పిల్లల యొక్క ఆటలు చాలా చూస్తూంటారు - ఈరోజు అంటారు, బాబా, ఓ నా బాబా, ఓ నా మధురమైన బాబా, ఏం చెప్పను, నీవే నా ప్రపంచం... ఇలా చాలా మధురాతి మధురమైన విషయాలు చెప్తున్నారు. మరియు మరలా రెండు నాలుగు గంటల తర్వాత ఏదైనా విషయం వస్తే భూతం వచ్చేస్తుంది. విషయం రావటం లేదు, భూతం వచ్చేస్తుంది. భూతాలతో ఉన్నప్పటి అందరి ఫోటోలు బాప్ దాదా దగ్గర ఉన్నాయి. చూడండి భూతనాధుని స్మృతిచిహ్నం కూడా ఉంది కదా! కనుక బాప్ దాదా భూతాలను కూడా చూస్తున్నారు - ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది మరియు ఎలా పారద్రోలుతున్నారు అని. ఈ ఆట కూడా ఆడుతున్నారు. కొంతమంది అయితే భయపడి బలహీనం కూడా అయిపోతున్నాడు. మరలా బాప్ దాదాకి ఇదే శుభసంకల్పం వస్తుంది - వీరికి ఎవరోకరి ద్వారా సంజీవని మూలిక తినిపించి బ్రతికించాలి అని. కానీ వారు ఏవిధంగా మూర్చపోతున్నారంటే ఆ సంజీవని మూలికను చూడను కూడా చూడటం లేదు. ఇలా అవ్వకండి. మొత్తం తెలివిని పోగొట్టుకోకూడదు. కొంచెం ఉంచుకోవాలి. కొద్దిగా తెలివి ఉన్నా రక్షించుకోగలరు.
ఈరోజు విశేషంగా ప్రతి బిడ్డ యొక్క ఫలితం చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు విశేషంగా స్మృతి దినోత్సవం నుండి సమర్ధ దినోత్సవం అంటారు. బ్రహ్మాబాబా చూస్తున్నారు - ఎన్నో సమర్ధదినోత్సవాలు జరుపుకుంటున్నారు కానీ సదాకాలిక సమర్ధత ఎంతవరకు వచ్చింది అని. ఏమి చూసారు? ఇప్పుడు ఫలితం అనుసరించి బాబా యొక్క జ్ఞానం ద్వారా జ్ఞానస్వరూపంగా ఎంతమంది ఉన్నారు అని! మాయ యొక్క జ్ఞానంలో కూడా జ్ఞానస్వరూపంగా అవ్వాలి అంటే మాయను దూరం నుంచే గ్రహించాలి. ఈ రోజు ఏదో పేపర్ వస్తుంది అని ముందే తెలుసుకోవటం ద్వారా సమర్థంగా అయిపోతారు. సమాచారంలో ఏమి వ్రాస్తారు? మాయ వచ్చింది, మాయను పారద్రోలాము, మరలా పారద్రోలాము కానీ ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు వస్తూ ఉండు అని మాయకి అవకాశం ఇస్తున్నారా? అవకాశం ఇవ్వకుండా ఎవరూ రారు. కనుక దానిని రానిస్తున్నారా? అర్థకల్పం నుంచి మాయ సహయోగి కదా అని ఆలోచించి దయ చూపించటం లేదు కదా? మాయపై దయ చూపించకూడదు. మొత్తం విశ్వంలో ఆత్మలపై దయ చూపించండి. కనుక ఫలితంలో మొదటి నెంబర్లో మరియు రెండవ నెంబర్లో 50 -50 శాతం చూసారు. కేవలం మొదటి నెంబర్లో కాదు, మొదటి నెంబర్ మరియు రెండవ నెంబర్ రెండూ కలిసి 50 శాతం చూసారు. కానీ బాప్ దాదాకి ఒక విషయం గురించి చాలా సంతోషంగా ఉంది, పిల్లలు బాబాపై స్నేహంతో విజయీగా అవ్వవలసిందే ఇప్పుడు అందరి మస్తకంలో విజయీ తిలకం ఎంత స్పష్టంగా కనిపించాలంటే ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి - వీరు విజయీరత్నాలు అని.
బాప్ దాదా ముందే చెప్పారు - ఈ అంతిమ చదువులో ప్రతి ఒక్కరు మూడు సర్టిఫికెట్లు తీసుకోవాలి. 1. స్వయం యొక్క సర్టిఫికెట్ అంటే స్వయం యొక్క సంతుష్టత 2. బాప్ దాదా ద్వారా సర్టిఫికెట్ మరియు 3. పరివారం ద్వారా, సంబంధ, సంపర్కంలోకి వచ్చేవారి ద్వారా సర్టిఫికెట్. ఈ మూడు సర్టిఫికెట్లు లభించినప్పుడే చదువు పూర్తి అయినట్లు. బాప్ దాదా అయితే మా గురించి సంతుష్టంగానే ఉన్నారు అనుకోకండి కానీ మూడు సర్టిఫికెట్లు కావాలి, ఒకటి సరిపోదు. కనుక 3 సరిఫికెట్లలో ఎన్ని సర్టిఫికెట్లు లభించాయి? అని పరిశీలించుకోండి. బాబా యొక్క సర్టిఫికెట్ లభించకుండా ఇక ఏమి లభించవు. కానీ పరివారం యొక్క సర్టిఫికెట్ ద్వారా కూడా చాలా లభిస్తుంది. ఎవరికైతే పరివారంలో ఎన్ని ఆత్మల ద్వారా సర్టిఫికెట్ లభిస్తుందో అంటే ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టం అవుతారో అంతగానే భక్తులు కూడా మీ యొక్క పూజ సంతుష్టతతో చేస్తారు, పైపైకి చూపించడానికి కాదు, మనస్సుతో చేస్తారు. ఇక్కడ బ్రాహ్మణ జీవితంలో ఎంతమంది బ్రాహ్మణులు మీ పట్ల స్నేహం, గౌరవం ఉంచుకుని మనస్సుతో సంతుష్టం అవుతారో అంతగానే పూజ్యులుగా అవుతారు. పూజ కొరకు స్నేహం మరియు గౌరవం కావాలి. ఎంతగా జడచిత్రాలకు పూజ జరుగుతుందో అంతగా స్నేహం మరియు గౌరవం లభిస్తాయి. మొత్తము కల్పం యొక్క ప్రాలబ్ధం ఇప్పుడు తయారుచేసుకోవాలి. కేవలం అర్ధ కల్పము యొక్క రాజ్య ప్రాలబ్డమే కాదు. పూజ యొక్క ప్రాలబ్దం కూడా ఇప్పుడు తయారవుతుంది. మా పని కేవలం బాబా ద్వారా జరిగిపోతుంది అనుకోకండి. కానీ బాబాకి పరివారంపై ఎంత ప్రేమ ఉంది! కనుక బాబాని ఫాలో చేయండి. బ్రహ్మాబాబాని చూడండి - ఎటువంటి బిడ్డ అయినా కానీ శిక్షాదాత అయ్యి శిక్షణ కూడా ఇచ్చేవారు మరియు శిక్షణతో పాటు మనస్సులో ప్రేమ కూడా పెట్టుకునేవారు. ప్రేమ అంటే కేవలం చేతులతో కాదు కానీ ప్రేమకి గుర్తు - తన యొక్క శుభభావన, శుభకామన ద్వారా ఎలాంటి మాయకి వశమైన ఆత్మనైనా పరివర్తన చేయాలి. ఎవరు ఎలా ఉన్నా అసహ్య భావన రాకూడదు. వీరు మారరు, వీరు ఇంతే అనకూడదు. ఇప్పుడు దయాహృదయులు అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు బలహీనంగా ఉన్న కారణంగా స్వయం యొక్క శక్తి ద్వారా ఏ పెద్ద సమస్యను దాటలేకపోతున్నారు. కనుక మీరు సహయోగి అవ్వండి. కేవలం శిక్షణ ద్వారా కాదు, ఈరోజుల్లో ప్రేమ లేదా శుభభావన లేకుండా శిక్షణరూపంలో చెప్తే ఎవరూ వినటం లేదు. ఇది అంతిమ ఫలితం. శిక్షణ పని చేయటం లేదు. కానీ శిక్షణతో పాటు శుభభావన కలిగి దయాహృదయులు అవ్వండి. ఇది సహజంగా పని చేస్తుంది. బ్రహ్మాబాబాని చూడండి - ఈరోజు ఫలానా బిడ్డ తప్పు చేసారని తెలుసు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డకి శిక్షణ కూడా పద్దతితో, యుక్తితో ఇచ్చేవారు మరియు వారికి చాలా ప్రేమ ఇచ్చేవారు. దాని ద్వారా బాబాకి మాపై ప్రేమ ఉంది అని అర్థంచేసుకుని మరియు ఆ ప్రేమలో పొరపాటుని అనుభవం చేసుకునే శక్తి కూడా వారిలో వస్తుంది. ఈ రోజు బ్రహ్మాబాబాని చాలా స్మృతి చేసారు కదా! కనుక బాబాని అనుసరించండి. బాబా సమానంగా అయ్యే ధైర్యం ఉందా? ధైర్యానికి శుభాకాంక్షలు. బాప్ దాదా మీ మనస్సు యొక్క చప్పట్లు మొదటినుండే వింటున్నారు. మీరు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు కానీ బాబాకి మనస్సు యొక్క చప్పట్లు మొదటే చేరుకుంటున్నాయి.
బాప్ దాదా కూడా నవ్వు వచ్చే విషయం వినిపిస్తున్నారు. బ్రహ్మాబాబా యొక్క ఆత్మికసంభాషణ జరిగింది. బ్రహ్మాబాబా చెప్తున్నారు - నాకు ఒక విషయంలో తారీఖు అభిమానం ఉంది అని. పిల్లలకు తారీఖు అభిమాని అవ్వకండి అని చెప్తున్నారు కానీ బ్రహ్మాబాబా ఒక విషయంలో తారీఖు అభిమానిగా ఉన్నారు ఏ తారీఖు? నా యొక్క ఒక్కొక్క పిల్లవాడు జీవన్ముక్తులుగా ఎప్పుడు అవుతారు అని. అంతిమంలో జీవన్ముక్తులుగా అవుతాము అని అనకండి. చాలాకాలం యొక్క జీవన్ముక్తి స్థితి యొక్క అభ్యాసం చాలాకాలం యొక్క జీవన్ముక్తి రాజ్యభాగ్యానికి అధికారిగా చేస్తుంది. దానికంటే ముందు మీరందరు ఎప్పుడైతే జీవన్ముక్తులుగా అయిపోతారో మీ జీవన్ముక్తి స్థితి యొక్క ప్రభావం జీవనబంధన ఆత్మల యొక్క బంధన సమాప్తి చేస్తుంది. ఈ సేవ చేయరా ఏమిటి? చేయాలి కదా! బ్రహ్మాబాబా యొక్క తారీఖుకు జవాబు ఇవ్వండి. అందరు జీవన్ముక్తులుగా అయ్యే తారీఖు ఎప్పుడు వస్తుంది? ఏ బంధన ఉండకూడదు. బంధనాల యొక్క లిస్ట్ వర్ణన చేస్తారు కదా! క్లాసులు కూడా చేస్తున్నారు. మరి ఆ బంధనాలను తొలగించుకుంటున్నారా? కానీ బాబా చెప్తున్నారు. అన్ని బంధనాలలో మొట్టమొదటి బంధన - దేహాభిమానం యొక్క బంధన. దాని నుండి ముక్తి అవ్వండి. దేహం లేకపోతే ఇతర బంధనాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. వర్తమాన సమయంలో మిమ్మల్ని మీరు నేను టీచరు, నేను విద్యార్థిని, నేను సేవాధారిని ఇలా భావించడానికి బదులు అమృతవేళ నుండి ఈ అభ్యాసం చేయండి - నేను శ్రేష్టాత్మను, పై నుండి ఈ పాత శరీరంలోకి, పాత ప్రపంచంలోకి సేవ కోసం వచ్చాను అని. నేను ఆత్మను ఈ పాఠం ఇప్పుడు ఇంకా గట్టిగా చేసుకోండి. మీరు ఆత్మ యొక్క అభిమానాన్ని ధారణ చేస్తే ఈ ఆత్మిక అభిమానం మాయ యొక్క అభిమానాన్ని సదాకాలికంగా సమాప్తి చేస్తుంది. కానీ ఈ ఆత్మాభిమాని స్థితి నడుస్తూ, తిరుగుతూ స్మృతిలో ఉండాలి. ఇప్పుడు ఇది ఇంకా ఉండాలి. బ్రహ్మాబాబా ఆది నుండి ఆత్మ యొక్క పాఠం ఎంత గట్టిగా చేసుకున్నారు! గోడలపై కూడా "నేను ఆత్మ” పరివారం వారు ఆత్మలు. ఒక్కొక్కరి పేరుతో గోడలపై ఈ పాఠం పక్కా చేసుకున్నారు. డైరీలు కూడా నింపారు. నేను ఆత్మను, వీరు కూడా ఆత్మ అని. ఆత్మ యొక్క పాఠాన్ని ఇంత గట్టిగా చేసుకున్నారా? నేను సేవాధారిని ఈ పాఠం పక్కా చేసుకుంటున్నారు కానీ నేను ఆత్మ సేవాధారిని ఇలా స్మృతి ఉంటే జీవన్ముక్తులుగా అయిపోతారు. రోజు శరీరంలోకి పై నుండి అవతరించిన "నేను అవతారాన్ని” ఈ శరీరంలో అవతరించిన ఆత్మను ఇలా భావించటం ద్వారా ఇక యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఆత్మ బిందువు కదా? కనుక అన్ని విషయాలలో బిందువు పెట్టగలరు. ఎటువంటి ఆత్మను? ఇలా రోజూ ఒక క్రొత్త క్రొత్త టైటిల్ స్మృతిలో ఉంచుకోండి - నేను ఈ విధమైన శ్రేష్ఠ ఆత్మను అని. సహజమా లేక కష్టమా? ఆత్మ బిందురూపంలో ఉంటుంది కదా? అప్పుడు డ్రామా బిందువు కూడా ఉపయోగపడుతుంది మరియు సమస్యలకు కూడా సెకనులో బిందువు పెట్టగలరు. మరియు బిందువు అయ్యి పరంధామంలోకి బిందువుగా వెళ్ళగలరు. పరంధామం వెళ్ళాలా లేదా డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారు? మొదట ఇంటికి వెళ్తారా లేదా రాజ్యంలోకి వెళ్ళిపోతారా? బాబాతో పాటు ఇంటి వరకు అయితే వెళ్ళాలి కదా లేదా డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతారా, బాబాని అడగవలసిన అవసరం లేదా! బిందువు బాబాతో పాటు బిందువు అయ్యి మొదట ఇంటికి వెళ్ళాలి లేకపోతే రాజ్యం యొక్క పాస్ పోర్ట్ లభించదు. పరంధామం నుండి రాజ్యంలోకి వెళ్ళే పాస్ పోర్ట్ స్వతహాగానే లభిస్తుంది. ఎవరూ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎంత సమీపంగా ఉంటారో అంత నెంబర్‌వార్‌గా పరంధామం నుండి రాజ్యంలోకి వస్తారు. పరంధామం నుండి మొదట ఏ ఆత్మ వెళ్తుంది? ఎవరితో వెళ్తారు? బ్రహ్మాబాబా వెంట వెళ్తారా? అందరు రాజ్యంలో కూడా వెంట వెళ్తారా లేక రెండవ జన్మలో, మూడవ జన్మలో వస్తారా? వెళ్ళాలి కదా? ప్రేమ ఉంది కదా? బ్రహ్మాబాబాని వదిలి పెట్టేయరు కదా? వెంట వెళ్తారా? కనుక బాప్ దాదాకి తారీఖు చెప్తారా లేక లేదా? (బాప్ వాదా చెప్పాలి) బాప్ దాదా అయితే చెప్తున్నారు - ఇప్పుడే తయారవ్వండి అని. బాబా కూడా ఆ తారీఖులోకి మారిపోతారు. చూడండి. బ్రహ్మాబాబా రేపటి గురించి చూసారా? తక్షణమే మహాదానం చేసారు. తీవ్ర పురుషార్ధం, మొదటి నెంబర్ పురుషార్ధం చేసారు. రేపటి గురించి చూడలేదు. రేపు ఏమౌతుంది! పరవారం ఎలా నడుస్తుంది! ఇలా ఆలోచించారా? ఈ రోజు ఏదైతే జరుగుతుందో అది మంచిది మరియు రేపు జరగబోయేది కూడా మంచిదే. ఇలా తక్షణమే దానం చేసి మహాపుణ్యాన్ని సంపాదించుకున్నారు మరియు మొదటి నెంబర్ యొక్క మహాన్ గా అయ్యారు. ఇప్పుడు పిల్లలు కూడా తక్షణమే దాని అవ్వాలి. సంకల్పం చేసి, తక్షణమే దానం చేసి మహాబలి అయ్యారు. మొదటి డివిజన్లోకి ఎవరు వస్తారు? అని చేతులు ఎత్తిస్తే అందరు చేతులు ఎత్తుతారు. ఇప్పుడు ఎత్తమన్నా అందరు ఎత్తుతారు. బాప్ దాదాకి తెలుసు ఎవరూ చేతులు కిందకి దించరు. మొదటి డివిజన్లోకి రావాలంటే మొదటి నెంబర్ ని అనుసరించండి. అనుసరించడం సహజం, కేవలం బ్రహ్మాబాబా యొక్క అడుగుపై అడుగు వేయండి కాపీ చేయండి. కాపీ చేయటం కూడా రావటం లేదు అనుసరించటం వస్తుందా? కనుక అనుసరించండి.ఇక ఏమి చేయాలి? విశాల సభను చూసి సంతోషిస్తున్నారు కదా! (అందరు గట్టిగా చప్పట్లు మ్రోగించారు). అందరికి ఒక చేతితో చప్పట్లు కొట్టడం నేర్పించండి. (అందరు ఒక చేతిని ఊపారు) ఇది బావుంది, మంచిది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో అందరు ఒక సెకనులో అశరీరి ఆత్మికస్థితిలో స్థితులవ్వండి. శరీరఅభిమానంలోకి రాకండి. ఆత్మ, పరమాత్మతో కలయిక జరుపుకుంటుంది అని అనుభవం చేసుకోండి. (బాప్ దాదా ఈ వ్యాయామం చేయించారు) ఈ అభ్యాసం మాటిమాటికి కర్మ చేస్తూ కూడా చేస్తూ ఉండండి. స్విచ్ ఆన్ చేయగానే సెకనులో అశరీరి అవ్వాలి. ఈ అభ్యాసం కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది.
నలువైపుల ఉన్నటువంటి సదా సమర్ధ ఆత్మలకు, సదా బాప్ దాదాను అనుసరించే సహజ పురుషార్ధి పిల్లలకు, సదా ఒకే బాబా, ఏకాగ్రబుద్ది, ఏకరస్థితిలో స్థితులు అయ్యేవారికి, బిందువు అయ్యి బాబా వెంట నడిచేవారికి, ఇలా బాబా యొక్క స్నేహి, సహయోగి, సేవాధారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment