18-01-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
జ్ఞాన సరోవరం ప్రారంభ శుభ ముహూర్తంలో అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు (ఉదయం 11.00).
ఈ స్నేహసంపన్న రోజున స్నేహ సాగరుడైన బాప్ దాదా తన యొక్క అతి స్నేహి, స్నేహంలో లీనం అయిన లవలీన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. అందరి యొక్క స్నేహ గీతాలు బాప్ దాదా వింటున్నారు మరియు వింటూ ఉంటారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి యొక్క స్నేహాన్ని చూసి బాబా కూడా పాట పాడుచున్నారు - ఓహో నా స్నేహి పిల్లలు ఓహో అని. పిల్లలు కూడా ఈ సమర్ద రోజున సేవని సాకారం చేసారు మరియు చేస్తూ ఉంటారు. బ్రహ్మాబాబా కూడా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు. కానీ సాకారరూపం కంటే అవ్యక్త రూపంలో ఇంకా సమీపంగా మరియు తోడు యొక్క విశేష అనుభవం చేయిస్తున్నారు. బాబా మాతో లేరు అని పిల్లలకి అనిపిస్తుందా? అనిపిస్తుందా? బాబాతో జన్మ తీసుకున్నారు, సేవాధారిగా, సహయోగి ఉన్నారు మరియు ఇక ముందు కూడా వెంట ఉంటారు మరియు వెంట నడుస్తారు. బ్రహ్మాబాబాకి కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం అనిపించటం లేదు. మీరు ఒంటరిగా ఉన్నారు అని అనిపిస్తుందా? వెంటే ఉన్నారు, వెంటే ఉంటారు, వెంటే నడుస్తారు, వెంటే రాజ్యం చేస్తారు. శివబాబాకి అయితే విశ్రాంతి ఇచ్చేస్తారు మరియు మీతో పాటు బ్రహ్మాబాబా కూడా రాజ్యం చేస్తారు. మీ రాజ్యం స్మృతి ఉంది కదా? ఈరోజు సేవాధారులు మరియు రేపు రాజ్యాధికారులు. మీ రాజ్యం ఎదురుగా కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? మీ రాజ్యం యొక్క లేదా స్వర్గం యొక్క స్థానం. స్వర్గం యొక్క దివ్య శరీరం అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది కదా! ఈ దివ్య మీ రాజ్యం యొక్క ఆ స్వర్గ స్థానం, స్వర్గం యొక్క దివ్యశరీరరూపి వస్త్రం అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది కదా! కేవలం దానిని ధారణ చేయాలి. ధారణ చేసేసారు. ఇలా అనుభవం అవుతుంది కదా? మీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది కదా? ఈరోజు వర్తమానం మరియు రేపు భవిష్యత్తు కూడా వర్తమానం అయిపోతుంది. నిశ్చయం ఉంది కదా! నిశ్చయం ఉందా? పక్కాయేనా? అందరు పాతవారు. పక్కాయైనవారు వచ్చారు కదా! బాప్ దాదాకి కూడా మరియు విశేషంగా బ్రహ్మాబాబాకి కూడా సంతోషంగా ఉంది, ఒకవైపు ఆది సహయోగి రత్నాలు ఎదురుగా కూర్చున్నారు. రెండవవైపు వృద్ధి యొక్క శ్రేష్టరత్నాలు ఎదురుగా ఉన్నారు. అయితే ఈ సంఘటనలో బ్రహ్మాబాబా రెండు రకాలైన రత్నాలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహ, ఉల్లాసాలతో, శరీరం గురించి, సాధనాల గురించి కానీ ఆలోచించకుండా చల్లచల్లని గాలులలో కూడా చేరుకున్నారు. ఈ చల్లని గాలులు కూడా పిల్లలైన మీకు సమస్కారం చేయటానికి వస్తాయి. మీరు రాజ్య సింహాసనంపై కూర్చునప్పుడు వెనుక నుండి ఏం చేస్తారు? విసనకర్రతో విసురుతూ ఉంటారు. అప్పుడు దాని నుండి చల్లచల్లని గాలులు వస్తాయి. అయితే ఈ చల్లని గాలులు కూడా మీకు విసరడానికి వస్తున్నాయి. ఎందుకంటే మీరందరు కూడా ఉన్నతోన్నతమైన విశేష ఆత్మలు. నషా ఉంది కదా? ఈరోజు బ్రహ్మాబాబా విశేషంగా తన జన్మతో మరియు సేవలో సహయోగులు, (సేవకి నిమిత్తం అయిన మొదటి రత్నాలు మరియు జన్మ సమయంలో మొదటి రత్నాలు) ఇద్దరినీ చూస్తూ బాబా హర్షిస్తున్నారు.
మంచిది. ఈ హాలుని కూడా రాజ్యసభలా తయారుచేశారు. (జ్ఞానసరోవరం యొక్క ఆడిటోరియం హాల్) రాజ్యసభ జరుగుతూ ఉంటే గ్యాలరీలో కూర్చుంటారు. గ్యాలరీలోని వారు కూడా బావున్నారు. (హాలులో అన్నయ్యలు అందరు కూర్చున్నారు, మాతలు అందరు బయట కూర్చున్నారు). ఈ రోజు మాతలు చేసిన త్యాగానికి భాగ్యం వారికి ఇప్పుడే లభిస్తుంది. మంచిగా తపస్సు చేస్తున్నారు. తపస్యకి ఫలం లభిస్తుంది. చల్లచల్లని గాలులు కూడా వస్తున్నాయి మరియు ఎండ కూడా వస్తుంది. మంచిది.
దీనిని జ్ఞాన సరోవరం అంటారా లేక స్నేహ సరోవరం అంటారా? జ్ఞాన సరోవరంలో స్నేహ సరోవరం బావుంది. ఈ జ్ఞాన సరోవరం సేవ యొక్క విశేష లైట్ హౌస్ మరియు మైట్ హౌస్. ఈ భూమి నుండి అనేక ఆత్మల యొక్క భాగ్యసితార మెరుస్తుంది. అనేకాత్మలు వేరు అయిన తమ తండ్రితో కలుసుకుంటాయి. అనేకాత్మల యొక్క దు:ఖాన్ని దూరం చేసే భూమి. సరోవరంలోకి రాగానే సుఖం యొక్క అలలలో తేలియాడుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఈ జ్ఞాన సరోవరం ద్వారా మూడు రకాలైన వారు మూడు రకాలైన ప్రాప్తికి అధికారి అవుతారు - కొందరు వారసత్వానికి అధికారులు, కొందరు వరదానాలకు అధికారులు మరికొందరు ఆశీర్వాదాలకి అధికారిగా అవుతారు. మూడు రకాలైన ప్రాప్తికి సంపన్నులుగా చేసే శ్రేష్టసరోవరం ఇది. సాధారణాత్మలు వస్తాయి మరియు ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేసుకుని వెళ్తాయి. మరియు అనేక బ్రాహ్మణాత్మల తపస్సు యొక్క సూక్ష్మ అనుభూతుల ద్వారా అవ్యక్తపాలన మరియు సూక్ష్మ యోగం యొక్క సహజ అనుభవం మరియు ఇతర ప్రాప్తుల యొక్క లాభం పొందుతారు. కొందరి బ్రాహ్మణాత్మల యొక్క స్వఉన్నతి పట్ల ఉండే శ్రేష్ట ఆశలు పూర్తి అయ్యే సాధనాలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి. స్థానం అయితే సాధారణమైనదే కానీ స్థితిని శ్రేష్టంగా అనుభవం చేయిస్తుంది. విధి పూర్వకమైన జ్ఞానాన్ని విశ్వంలో ప్రత్యక్షం చేసే స్థానం మరియు అన్నింటికంటే మొదటి ప్రతిజ్ఞ - తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక. చూడండి డబల్ సంఖ్యలో కలుసుకుంటున్నారు కదా! బయట కూర్చున్నా లేక ఎక్కడ ఉన్నా కానీ డబల్ సంఖ్యలో ఉన్నారు కదా. అందువలన అన్నింటికంటే ప్రత్యక్షఫలం డబల్ సంఖ్యలో పిల్లల కలయిక జరుపుకుంటున్నారు. అర్ధమైందా? ఇటువంటి సరోవరంలో సరోవరాన్ని తయారు చేసేవారికి, సహయోగం ఇచ్చేవారికి, సంకల్పంతో ధైర్యాన్ని ఇచ్చేవారికి, దేశ, విదేశాల యొక్క స్నేహ చేతులతో సరోవరాన్ని సంపన్నం చేసినవారికి కోటానుకోట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇదే మొదటి స్థానం దీనిలో చిన్న పిల్లల నుండి ఎవరైతే బ్రహ్మణాత్మలు ఉన్నారో వారందరి యొక్క సహయోగం తనువు, మనసు, ధనాల ద్వారా చేశారు. తనువుతో ఇటుకలు మోయలేదు కానీ తనువుతో తమ సహయోగులను సహయోగిగా చేసారు, ఉల్లాసాన్ని ఇప్పించారు. ఇలా స్నేహం, సహయోగం, శక్తి యొక్క బిందువు, బిందువులతో అలంకరించబడిన సరోవరం శ్రేష్ఠ సఫలతను అనుభవం చేయిస్తూ ఉంటుంది. కనుక సహయోగులందరికీ, కోనకోనలలోని దేశ విదేశాల వారికి మరియు విశేషంగా ఎవరైతే చల్లచల్లని గాలులలో, వర్షం వస్తున్నా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు వారికి విశేషమైన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాప్ దాదా యొక్క కోటానుకోట్ల సహాయం ఉంటుంది. బాప్ దాదాకి తెలుసు పిల్లలకి కొంచెం కష్టం అనిపించినా దానిని ప్రేమతో స్వీకరించారు. ప్రేమలో శ్రమని అనుభవం చేసుకోలేదు. అందువలన బాప్ దాదా మసాజ్ చేస్తున్నారు మరియు చేస్తూనే ఉంటారు. మంచిది. ఇక్కడ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారు చేతులు ఎత్తండి! సమయానికి సంపన్నం చేసినందుకు చాలా చాలా అభినందనలు. మీరు కూర్చోవటానికి వీలుగా అయితే తయారు చేసి ఇచ్చారు కదా! బాబా అయితే వచ్చేశారు కదా. ఇదే ప్రతిజ్ఞ కదా. మీరందరూ కూడా వీరికి అభినందనలు ఇస్తున్నారు కదా! హాలుని అలంకిరించినవారు ఎక్కడ ఉన్నారు? (వారు మున్నీ పార్టీ) చూడండి, ఇది స్నేహ సరోవరం కదా అందువలనే కలకత్తా నుండి పువ్వులు వచ్చాయి. (కలకత్తా నుండి చాలా సుందరమైన రంగు రంగుల పువ్వులు వచ్చాయి వాటితో మొత్తం స్టేజ్ అలంకరించబడి ఉంది) మంచిది. మీ అందరికీ కూడా అభినందనలు మరియు మాతలకి కోటానుకోట్ల శుభాకాంక్షలు.
(జాల్ మిస్త్రీ, హాల్ లో సౌండ్ ఏర్పాటు చేసారు) చూడండి, ఇతను ధైర్యం చేయకపోతే మీరు మురళి వినలేరు. మురళి యొక్క సాధనం అన్నింటికంటే శ్రేష్టమైనది. ఎంత మంచిగా ఏర్పాటు చేసారు! విశ్రాంతిగా వినిపిస్తుంది. బయటికి కూడా వినిపిస్తుంది. ఇది చాలా బాగా ఏర్పాటు చేసారు. ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క పేరు చెప్పటం లేదు కానీ ప్రతి ఒక్కరు నాకు స్నేహ మరియు సహయోగం యొక్క శుభాకాంక్షలు ఇచ్చారు అని భావించండి. మంచిది, అందరి కంటే మొదటి శుభాకాంక్షలు ఎవరికి ఇవ్వను? దాదీకి. (బాప్ దాదాకి) బాప్ దాదా అయితే ఇచ్చేవారు కదా! బాప్ దాదా సదా అంటారు పిల్లలను నెంబర్ వన్ సేవాధారి అని. బాబా అయితే సదా సేవాధారి కానీ పిల్లలు కూడా సేవలో బాబా కంటే కూడా సహయోగులు. ఒక్కొక్కరి పేరు చెప్పటం లేదు కానీ మనస్సులో ఒక్కొక్కరి పేరు ఉంది మరియు ప్రియస్మృతులు ఇస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వారికి శుభాకాంక్షలు. లైట్ లేకుండా కూడా పని జరగదు, మైక్ లేకుండా కూడా పని జరుగదు. లైట్, మైట్, మైక్ ఏర్పాటు చేసిన వారందరికీ శుభాకాంక్షలు.
టీచర్స్ కూడా ఇక్కడ కూర్చున్నారా? మీరు లేకపోతే సెంటర్స్ తెరుచుకోవు. ఒక్కొక్కరు ఎన్ని సెంటర్స్ తెరిచారో చూడండి. ఇక్కడ సేవ యొక్క రాజధాని మరియు అక్కడ రాజ్యం యొక్క రాజధాని అవుతుంది. మంచిది పాండవులు కూడా చూస్తున్నారు. మంచి మంచి పాండవులు అందరూ వచ్చారు. పాండవులు లేకపోయినా కానీ గతి ఉండదు. కానీ పాండవులు శక్తులని ముందుంచారు. మీరు ఉంచారా లేక బాబా ఉంచారా? తండ్రిని అనుసరించారు. ఎలాగైనా కానీ మీరందరూ కూడా బాబాకి సమీపంగా కూర్చున్నారు. వీరే సమీపంగా ఉన్నారు అని అనుకోకండి కానీ ఎవరైతే ఎదురుగా ఉన్నారో వారు అతి సమీపంగా ఉన్నారు.
డబల్ విదేశీయులు కూడా వచ్చారు. వీరు కూడా అద్భుతం చేస్తున్నారు. దేశ విదేశాలలో బాబాని ప్రత్యక్షం చేసే సేవ చాలా మంచిగా చేస్తున్నారు. మరియు ఇక ముందు చేస్తారు. మంచిది. బయట కూర్చున్న వారు ఎదురుచూస్తున్నారు. (తర్వాత బాప్ దాదా జ్ఞానసరోవరం యొక్క విశాలస్టేజ్ పై నిల్చున్నారు, ఇంజనీర్స్ తో క్రొవ్వొత్తి వెలిగించారు మరియు ముఖ్య టీచర్స్ మరియు దాదీలతో కలిసి కేక్ కత్తిరించారు. తర్వాత ముఖ్య దాదీలు బాప్ దాదాతో పాటు హాలు పైకి వచ్చారు. అక్కడ బాప్ దాదా 2000 కంటే ఎక్కువ సంఖ్యలో కూర్చున్న మాతలకు చేయి ఊపుతూ పలకరించారు మరియు జెండా ఎగురవేశారు తర్వాత మహావాక్యాలను తెలియచేసారు) .
బాప్ దాదా మీ అందరి మనస్సులలో స్నేహం అనే జెండా ఎగరటం చూసి హర్షిస్తున్నారు. ఇది సేవ కోసం మరియు బాబా మరియు పిల్లల మధ్య మనస్సులో స్నేహ జెండా ఉంది. ఎలాగైతే జెండా ఆవిష్కరణ చేసేటప్పుడు జెండాని పైకి ఎగురవేస్తారు కదా! అలాగే సదా స్నేహంలో ఉన్నతోన్నతంగా ఎగురుతూ ఉండండి. ఈ జెండా కూడా బాబాని ప్రత్యక్షం చేసే జెండా. ఇది వస్త్రపు జెండా కానీ ఈ జెండాలో బాబా వచ్చేశారు అనే మీ అందరి ధ్వని నిండి ఉంది. ఇదే ప్రత్యక్షతా జెండా కోనకోనల్లో ఎగురవేయబడుతుంది. ఇది మీరు చూస్తారు, వింటారు, హర్షితం అవుతారు. ఈ రోజు జ్ఞాన సరోవరంలో ఈ ప్రత్యక్షతా జెండా ఎగిరింది. కానీ రేపు విశ్వంలో ఎగురుతుంది. మీరందరూ తపస్సు చేయాల్సి వచ్చింది దానికి శుభాకాంక్షలు కానీ చాలా విశ్రాంతిగా మంచిగా కూర్చున్నారు కానీ చూడటంలో మీకు ఎంత బాగా కనిపిస్తుందో అంతగా లోపల కూర్చున్న వారికి, వెనక వారికి కనిపించటం లేదు. మీరు బయట కూర్చోలేదు కానీ మనసులో ఉన్నారు. అందరు చాలా చాలా అదృష్టవంతులు అందువలన సదా సంతోషాన్ని పంచుతూ ఉండాలి. సంతోషంగా ఉండాలి మరియు సంతోషం పంచి పెడుతూ ఉండాలి. (తర్వాత బాప్ దాదా నలువైపులా తయారైన భవనాలను చూసారు. తిరిగి హాలులోకి వచ్చి ఇంజనీర్స్ అందరికి తన చేతులతో టోలీ ఇచ్చి వీడ్కోలు ఇచ్చారు).
Comments
Post a Comment