16-11-2006 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
స్వమానం అనే ఆసనంపై ఆసీనులవ్వండి మరియు సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఎవర్ రెడీ అవ్వండి.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పరమాత్మ ప్రేమకి పాత్రులు, స్వమానం అనే ఆసనంపై ఆసీనులు అయిన తన పిల్లలను చూస్తున్నారు. స్వమానం అనే ఆసనంపై అయితే అందరూ ఆసీనులు అయి ఉన్నారు కానీ కొంతమంది పిల్లలు ఏకాగ్రంగా స్థితి అయి ఉన్నారు మరి కొంతమంది పిల్లలు సంకల్పంలో కొద్దికొద్దిగా అలజడి అవుతున్నారు. బాబా వర్తమాన సమయానుసారంగా ప్రతీ ఒక్క బిడ్డను ఏకాగ్ర రూపంలో స్వమానధారి స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. పిల్లలందరూ ఏకాగ్ర స్థితిలో స్థితులవ్వాలనుకుంటున్నారు. తమ యొక్క భిన్న భిన్న స్వమానాలు ఏమిటో తెలుసు మరియు అనుకుంటున్నారు కూడా కానీ ఏకాగ్రత చలిస్తుంది. సదా ఏకరస స్థితి తక్కువగా ఉంటుంది. పిల్లలకి అనుభవం అవుతుంది మరియు ఈ స్థితిని కావాలనుకుంటున్నారు కూడా కానీ ఆ స్థితి అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు ఉంటుంది? కారణం ఏమిటి? సదా ధ్యాస అనేది లోపంగా ఉంది. స్వమానాల జాబితా తీస్తే ఎంత పెద్దది ఉంటుంది? అన్నింటికంటే మొదటి స్వమానం - ఏ తండ్రిని అయితే స్మరిస్తూ ఉండేవారో ఆ తండ్రికి స్వయంగా పిల్లలు అయ్యారు. నెంబర్ వన్ సంతానం. బాప్ దాదా కోట్లలో కొద్దిమంది అయిన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎన్నుకుని తన వారిగా చేసుకున్నారు. అయిదు ఖండాల నుండి స్వయం బాబా తన పిల్లలను తన వారిగా చేసుకున్నారు. ఇది ఎంత గొప్ప స్వమానం! సృష్టి రచయిత యొక్క రచన మీరు. ఈ స్వమానం తెలుసు కదా! బాప్ దాదా తనతో పాటుగా పిల్లలైన మిమ్మల్ని మొత్తం విశ్వంలోని ఆత్మలకే పూర్వీకులుగా చేశారు. విశ్వం యొక్క పూర్వీకులు మరియు పూజ్యులు మీరు.
బాప్ దాదా ప్రతి బిడ్డను విశ్వానికి ఆధారమూర్తులుగా, ఉదాహరణ మూర్తులుగా చేశారు. నషా ఉందా? అప్పుడప్పుడు కొంచెం కొంచెం నషా తగ్గుతుందా? కల్పమంతటిలో ఎవరికీ లభించనటువంటి అమూల్య సింహాసనం, పరమాత్ముని సింహాసనం మీకు లభించింది. ప్రకాశ కిరీటం, స్మృతి తిలకం లభించాయి. నేనెవరు మరియు నా స్వమానం ఏమిటి అనేది స్మృతి వస్తుంది కదా! నషా వస్తూ ఉంది కదా! కల్పమంతటిలో సత్యయుగీ సింహాసనం కంటే అమూల్య పరమాత్మ హృదయ సింహాసనం పిల్లలైన మీకే లభిస్తుంది. బాప్ దాదా సదా ఆఖరి నెంబరు బిడ్డను కూడా ఫరిస్తా నుండి దేవత అనే స్వరూపంలో చూస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు, ఫరిస్తా నుండి దేవతగా కావలసిందే. మీ స్వమానం గురించి తెలుసా? ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు - స్వమానాన్ని మర్చిపోయిన కారణంగానే దేహభ్రాంతి లేదా దేహాభిమానం వస్తుంది. అలజడి కూడా అవుతున్నారు. దేహబ్రాంతి లేదా దేహాభిమానం వచ్చినప్పుడు ఎంత అలజడి అవుతున్నారో బాప్ దాదా చూస్తున్నారు. అందరూ అనుభవీలే కదా! స్వమానం యొక్క గౌరవంలో ఉండండి. స్వమానం ఉండటం మరియు అలజడి అవ్వటం రెండూ తెలుసు కదా! బాప్ దాదా చూస్తున్నారు మెజారిటీ పిల్లలు మంచి జ్ఞాన సాగరులుగా అయ్యారు, కానీ పూర్తి శక్తిశాలిగా లేరు. శాతంలో ఉన్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డను తన బిడ్డ నుండి సర్వ ఖజానాలకు యజమానిగా చేశారు, అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు. తక్కువ, ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే లెక్కపెట్టలేనంత ఖజానా, బేహద్ ఖజానా. అందువలన ప్రతి ఒక్కరినీ పిల్లల నుండి బేహద్ యజమానిగా చేశారు. తండ్రి బేహద్, హద్దులోని తండ్రి కాదు, బేహద్ తండ్రి మరియు బేహద్ ఖజానా మరి మీ దగ్గర కూడా ఖజానా బేహద్ గా ఉందా! మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఖజానా సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు దొంగతనం జరుగుతుందా? మాయం అయిపోతుందా? బాబా ధ్యాస ఎందుకు ఇప్పిస్తున్నారు? అలజడి కాకండి, స్వమానంలో స్థితులై ఉండండి. 63 జన్మల నుండి అలజడి యొక్క అనుభవీలే. ఇప్పుడు ఇంకా కావాలా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానంలో ఉండాలి అంటే మీ యొక్క ఉన్నతోన్నత గౌరవంలో ఉండాలి. ఎందువలన? ఎంత సమయం గడిచిపోయింది? 70 వ సం||రం జరుపుకుంటున్నారు. స్వయం యొక్క గ్రహింపు అనగా స్వమానాన్ని గ్రహించి స్వమానంలో ఉండాలి. సమయానుసారంగా సదా అనే మాటని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. మాటని అండర్‌లైన్ చేసుకోవటం కాదు, ప్రత్యక్ష జీవితంలో సదా అనే విషయంపై ధ్యాస పెట్టాలి. ఉండాలి.... ఉంటాము.... చేస్తూ ఉన్నాము.... చేసేస్తాం.... ఇవి బేహద్ పిల్లల నుండి యజమాని అయిన వారి మాటలు కావు. పొందవలసినదేదో పొందాము అనే బేహద్ మాట అందరి నోటి నుండి రావాలి. పొందుతూ ఉన్నాము..... అనే మాట బేహద్ తండ్రి యొక్క బేహద్ పిల్లలు అనకూడదు. పొందాము అనాలి. బాప్ దాదాని పొందారు, నా బాబా అన్నారు, అంగీకరించారు. తెలుసుకున్నారు మరియు అంగీకరించారు కూడా కనుక పొందాము అనే బేహద్ మాట అనాలి. ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు పిల్లలు స్వమానంలో అప్పుడప్పుడు ఉంటున్న కారణంగా సమయం యొక్క గొప్పతనాన్ని కూడా తక్కువగా స్మృతిలో ఉంచుకుంటున్నారు. 1. స్వమానం 2. సమయం యొక్క గొప్పతనం. మీరు సాధారణమైన వారు కాదు, పూర్వీకులు. మీ ఒక్కరిపై విశ్వంలోని ఆత్మలందరూ
ఆధారపడి ఉన్నారు. మరి మీరు అలజడిలోకి వస్తే విశ్వంలోని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది? మహారథిగా పిలవబడే వారిపైనే విశ్వం అంతా ఆధారపడి ఉంటుంది అని అనుకోకండి. ఈ రోజు క్రొత్త వారు చాలా మంది వచ్చారు. కొత్తవారైనా కానీ నా బాబా అని అంగీకరించారు కదా! అంగీకరించారా? వచ్చిన కొత్తవారు అంగీకరించారా? తెలుసుకోవటం కాదు, అంగీకరించాలి. అంగీకరించేవారు చేతులెత్తండి. బాగా పైకి ఎత్తండి. కొత్త కొత్త వారు చేతులెత్తుతున్నారు. పాత వారు అయితే పక్కాయే కదా! కనుక ఎవరైతే నా బాబా అని అంగీకరించారో మరియు బాబా ఎవరినైతే నా పిల్లలు అని అంగీకరించారో వారందరు విశ్వానికి బాధ్యులే. ఎందుకు? నేను బ్రహ్మాకుమార్ లేదా బ్రహ్మాకుమారిని అని భావిస్తున్నారు కదా! బ్రహ్మకుమారి, కుమారులా లేక శివకుమారి, కుమారులా? లేక ఇద్దరూనా? అయితే బందింపబడిపోయారు అంటే బాధ్యతా కిరీటం వచ్చేసింది. వచ్చేసిందా? బాధ్యతా కిరీటం ఉందా పాండవులు చెప్పండి. కిరీటం బరువుగా అనిపించటం లేదు కదా! తేలికే కదా! కిరీటమే ప్రకాశవంతమైనది. ప్రకాశం ఎంత తేలికైనది! సమయం యొక్క గొప్పతనం కూడా ధ్యాసలో ఉంచుకోండి. సమయం అనేది అడిగి రాదు. సమయం గురించి కొంచెం సుమారుగా తెలిస్తే బావుంటుంది అని ఇప్పటికీ కొంతమంది పిల్లలు అంటున్నారు లేదా ఆలోచిస్తున్నారు. 20 సం||లు ఉందా, 10 సం||లు ఉందా అనేది తెలియాలనుకుంటున్నారు.
కానీ బాప్ దాదా అంటున్నారు - సమయం యొక్క అంతిమ వినాశనం గురించి వదిలేయండి. మీ శరీరం యొక్క వినాశనం గురించి మీకు తెలుసా? నేను ఫలానా తారీఖున శరీరం వదిలేస్తాను అని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా తెలుసా? ఈ రోజుల్లో బ్రాహ్మణులు మరజీవ భోగ్ లు చాలా చేయించుకుంటున్నారు. నమ్మకం ఏదీ లేదు. కనుక సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఇది చిన్న యుగం. ఆయుషు చిన్నది కానీ చాలా ఉన్నతోన్నత ప్రాప్తి పొందే సమయం. ఎందుకంటే చాలా ఉన్నతోన్నతమైన తండ్రి ఈ చిన్న యుగంలోనే వస్తారు, ఇతర పెద్ద యుగాల్లో రారు. కల్పమంతటి ప్రాప్తి యొక్క బీజాన్ని వేసుకునే సమయం ఇదే. విశ్వరాజ్యం ప్రాప్తింపచేసుకోవాలన్నా, పూజ్యులుగా అవ్వాలన్నా ఇదే సమయం. కల్పమంతటి ప్రాప్తి యొక్క బీజాన్ని నాటే సమయం ఇదే. డబల్ ప్రాప్తిని పొందే సమయం ఇది. భక్తి యొక్క ఫలం కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు ప్రత్యక్షఫలం కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే పొందుతారు. ప్రత్యక్ష ఫలం లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. కల్పమంతా చూడండి, ఇటువంటి యుగం ఏదైనా ఉందా? ఎందుకంటే ఈ సమయంలోనే బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క అరచేతిలో చాలా పెద్ద బహుమతిని ఉంచారు. మీ కానుక మీకు జ్ఞాపకం ఉందా? స్వర్గ రాజ్య భాగ్యం. కొత్త ప్రపంచం యొక్క స్వర్గ బహుమతి ప్రతి ఒక్కరి చేతికి ఇచ్చారు. ఇంత గొప్ప బహుమతి ఎవ్వరూ, ఎప్పుడూ ఇవ్వరు మరియు ఇవ్వలేరు. ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అవుతారు, ఇతర యుగాలలో మాస్టర్ సర్వశక్తివాన్ పదవి లభించదు. స్వయం యొక్క స్వమానంలో కూడా ఏకాగ్రంగా ఉండండి మరియు సమయం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. స్వయం మరియు సమయం. స్వయం యొక్క స్వమానం మరియు సమయం యొక్క మహత్యం. సోమరిగా కాకండి. 70 సం||లు గడిచిపోయినవి. ఇప్పుడు కూడా సోమరిగా అయితే మిగిలి ఉన్న ప్రాప్తిని కూడా తక్కువ చేసుకుంటారు. ఎంత ముందుకి వెళ్తూ ఉంటారో అంతగా సోమరితనం వస్తూ ఉంటుంది. చాలా మంచిగా ఉన్నాము, చాలా మంచిగా వెళ్ళిపోతాం, చేరిపోతాం, వెనుక ఉండిపోము చూడండి, అయిపోతుంది ..... ఇదే సోమరితనం మరియు సూక్ష్మ నిర్లక్ష్యం. ఎప్పుడో అంటే అది సోమరితనం, ఇప్పుడే అంటే అది తక్షణదానం మహాపుణ్యం. ఈ రోజు ఇప్పుడు మొదటి అవకాశం కదా! కనుక బాప్ దాదా ధ్యాస ఇప్పిస్తున్నారు. ఈ సీజన్ అంతటిలో స్వమానం నుండి దిగిపోకూడదు, సమయం యొక్క గొప్పతనాన్ని మరువకూడదు. సంసిద్ధంగా, తెలివిగా, జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనవారు కదా! ఎవరితో ప్రేమ ఉంటుందో వారి బలహీనత లేదా చిన్న లోపాన్ని కూడా చూడలేరు. చెప్పాను కదా! ఆఖరి నెంబరు బిడ్డపై కూడా బాబాకి అతి ప్రేమ ఉంటుంది. ఆఖరి నెంబరు అయినా బిడ్డే కదా! సీజన్ భారతీయులది అయినా కానీ డబల్ విదేశీయులు తక్కువ కాదు. డబల్ విదేశీయులు లేకుండా ఏ మిలనం ఉండదు. అది వారి అద్భుతం. డబల్ విదేశీయులు చేతులెత్తండి. చూడండి, ఎంతమంది ఉన్నారో! స్పెషల్ సీజన్ అయిపోయింది, అయినా కానీ ఎంతమంది వచ్చారో చూడండి. శుభాకాంక్షలు. మంచిది, రండి, చాలా చాలా శుభాకాంక్షలు.
విన్నారా! ఇప్పుడు ఏమి చేయాలి? ఈ సీజన్ లో ఏమేమి చేయాలో హోమ్ వర్క్ ఇచ్చేశాను. స్వయం గురించి తెలుసుకోండి, ఇతరుల గురించి కాదు. స్వయాన్ని గ్రహించండి, సత్యమైన బంగారం అవ్వండి. ఎవరైతే నా బాబా అన్నారో వారందరు బాబా వెంట రావాలి అని బాప్ దాదా అనుకుంటున్నారు. గుంపులో వెళ్ళటం కాదు. బాప్ దాదా వెంట శ్రీమతం అనే చేయి పట్టుకుని వెళ్ళాలి ఆ తర్వాత బ్రహ్మాబాబాతో పాటు మొదటి రాజ్యంలోకి రావాలి. క్రొత్త ఇంటిలోనే మజాగా ఉంటుంది కదా! ఒక నెల గడిచినా కానీ పాతదే కదా! కొత్త ఇల్లు, కొత్త ప్రపంచం, కొత్త పద్ధతి, కొత్త ఆచార వ్యవహారాలు. ఇలా బ్రహ్మాబాబాతో పాటు వెంట రాజ్యంలోకి రావాలి. బ్రహ్మాబాబా అంటే మాకు చాలా ప్రేమ అని అందరూ అంటారు కదా! ప్రేమకి గుర్తు ఏమిటి? వెంట ఉండటం, వెంట నడవటం, వెంట రావటం. ఇదే ప్రేమకి రుజువు. ఇష్టమేనా? వెంటే ఉండాలి, వెంటే నడవాలి, వెంటే రావాలి ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమైన వస్తువుని ఎవరైనా వదిలేస్తారా? బాబాకి ప్రతి బిడ్డపై ఉండే ప్రేమ ఎలాంటిదంటే వెంటే రావాలి అని ఉంటుంది, వెనుక వెనుక రాకూడదు. ఖాతా ఏదైనా మిగిలిపోతే ధర్మరాజు శిక్షల కొరకు ఆగవలసి ఉంటుంది. చేతిలో చేయి వేసి రారు, వెనుక వస్తారు.. మజా దేనిలో ఉంటుంది. వెంట వెళ్ళటంలోనే మజా ఉంటుంది . అయితే పక్కా ప్రతిజ్ఞయే కదా! వెంటే వెళ్ళాలి అని పక్కా ప్రతిజ్ఞయేనా? లేక వెనుక వస్తారా? చేతులు అయితే బాగా ఎత్తుతారు. ఆ చేతులని చూసి బాప్ దాదా సంతోషపడతారు. కానీ శ్రీమతం అనే చేయి ఎత్తాలి. శివబాబాకి అయితే చేయి ఉండనే ఉండదు, బ్రహ్మాబాబాకి మరియు ఆత్మకి కూడా చేతులు ఉండవు. అంటే శ్రీమతం అనే చేయి పట్టుకుని వెళ్ళాలి. వస్తారు కదా! చేతులు ఊపండి. ఒక్కరు కూడా వెనుక ఉండకూడదు, అందరు వెనువెంట వెళ్ళాలి అని బాప్ దాదా అనుకుంటారు. కనుక సదా తయారుగా ఉండాలి. మంచిది. ఇప్పుడు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరి రిజిష్టర్ చూస్తూ ఉన్నారు. ప్రతిజ్ఞ చేశారు మరియు నిలుపుకున్నారు అంటే లాభం పొందారు. కనుక కేవలం ప్రతిజ్ఞ చేయటం కాదు, లాభం పొందాలి. మంచిది. ఇప్పుడు అందరు ధృడ సంకల్పం చేయండి. ధృడ సంకల్పం యొక్క స్థితిలో స్థితులై కూర్చోండి. చేయాల్సిందే మరియు నడవలసిందే. వెంట నడవాలి. ఇప్పుడు ఈ ధృడ సంకల్పం స్వయంతో చేయండి. ఈ స్థితిలో స్థితులైపోండి. చేస్తాం, చేస్తాం అనకూడదు, చేయాల్సిందే. మంచిది.
నలువైపుల ఉన్న డబల్ సేవాధారి పిల్లలకు, నలువైపుల ఉన్న సదా ఏకాగ్రంగా స్వమానం అనే సీట్ పై సెట్ అయి ఉండే బాప్ దాదా యొక్క మస్తక మణులకు, నలువైపుల ఉన్నటువంటి సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకుని తీవ్ర పురుషార్థం యొక్క ఉదాహరణ ఇచ్చే సుపుత్రులకి, నలువైపుల ఉన్న ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలతో సదా ఎగురుతూ మరియు ఎగిరింపచేసే డబల్ లైట్ ఫరిస్తా పిల్లలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment