16-11-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బాప్ దాదా యొక్క కోరిక - డైమండ్ జూబ్లీ సంవత్సరాన్ని తగుల్పాటు నుండి మక్తులుగా అయ్యే సంవత్సరంగా జరుపుకోండి.
ఈ రోజు బాప్ దాదా సదా మనస్సుతో బాబా యొక్క స్మృతిలో ఉండే తన స్నేహి, సహయోగి పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ఎంతగా పిల్లలకి స్నేహం ఉందో అంతగా బాబాకి కూడా పిల్లలతో స్నేహం ఉంది. బాబా పిల్లలందరికి ఒకేవిధమైన అతి స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ పిల్లలు తమ తమ శక్తిననుసరించి స్నేహాన్ని ధారణ చేస్తున్నారు. అందువలన బాబా కూడా నెంబర్ వారీగా ప్రియస్మృతులు ఇవ్వవలసి వస్తుంది. కానీ బాబా అయితే పిల్లలందరికి అమృతవేళ నుండి నెంబర్ వన్ హృదయపూర్వక ప్రేమ ఇస్తున్నారు. అందువలనే విశేషంగా పిల్లల కోసం అమృతవేళ నిర్ణయించబడి ఉంది. ఎందుకంటే అమృతవేళ మొత్తం రోజంతటికి ఆది సమయం. ఏ పిల్లలైతే ఆది సమయంలో బాబా స్నేహాన్ని హృదయంలో ధారణ చేస్తారో అటువంటి పిల్లల హృదయంలో పరమాత్మ స్నేహం నిండి ఉన్న కారణంగా ఇక ఏ స్నేహం వారిని ఆకర్షించదు. ఒకవేళ మీ స్థితి అనుసారంగా పూర్తిగా హృదయంలో స్నేహం ధారణ చేయలేదు, సగం నింపుకున్నారు, కొంచెం ఖాళీగా ఉంచారు అంటే హృదయంలో ఖాళీ ఉన్న కారణంగా మాయ రకరకాల రూపాల ద్వారా అనేక స్నేహాలు, అంటే వ్యక్తి, వైభవం ఈ రెండు రూపాల యొక్క స్నేహంలో ఆకర్షితం చేసేస్తుంది.
కొంతమంది పిల్లలు బాప్ దాదాతో అంటున్నారు - మా దగ్గరికి ఇప్పటికి మాయ ఎందుకు వస్తుంది? అని. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోయినప్పుడు మాయ వచ్చే ప్రశ్నే లేదు. కానీ కారణం ఏమిటంటే ఆది కాలం అయిన అమృతవేళ మీ హృదయంలో పరమాత్మ స్నేహాన్ని సంపూర్ణ రూపంతో ధారణ చేయటం లేదు. ఏదైనా వస్తువు సగం నిండి ఉండి కొంచెం ఖాళీగా ఉంటే అది కదులుతూ ఉంటుంది కదా! అలాగే కూర్చుంటున్నారు, మేల్కొంటున్నారు, లక్ష్యం కూడా ఉంది, నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు అని అంటున్నారు. కానీ ఇది హృదయంతో అంటున్నారా? లేదా నోటితో అంటున్నారా? అయినా కానీ మనస్సులో ఇతర ఆకర్షణలకి కారణం ఏమిటి? అంటే తప్పకుండా ఏదోక వ్యక్తి లేదా వైభవం వైపు స్నేహం వెళ్ళిపోతుంది, అందువలన అది ఆకర్షిస్తుంది. హృదయంలో పూర్తిగా పరమాత్మ స్నేహం నిండి ఉండటం లేదు. మీరే ఆలోచించండి, ఎవరైనా ఒక చేతికి వజ్రం, రెండవ చేతికి మట్టి ముద్ద ఇస్తే మీ ఆకర్షణ ఎటువైపు వెళ్తుంది? వజ్రం వైపుకి వెళ్తుందా? మట్టి వైపుకి వెళ్తుందా? మట్టితో ఆడుకోవటం కూడా బావుంటుంది కదా! అయితే వ్యర్ధ సంకల్పాలు అనేవి ఏమిటి? వజ్రమా లేక మట్టియా? మట్టితో ఆడుకుంటున్నారు కదా! అలవాటు అయిపోయింది అందువలన ఆడుకుంటున్నారు. వ్యక్తులు కూడా ఎవరు? మట్టి కదా! మట్టి (దేహం) మట్టిలోనే కలిసిపోతుంది. చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు, ముఖం ద్వారా కానీ, విశేషత ద్వారా కానీ, గుణం ద్వారా కానీ మంచిగా కనిపిస్తారు, నాకు తగుల్పాటు లేదు, స్నేహం లేదు కానీ వీరిలో ఈ గుణం మంచిగా అనిపిస్తుంది అంటున్నారు, అంటే కొంచెం గుణం యొక్క ప్రభావం పడుతుంది లేదా వీరిలో సేవ యొక్క విశేషత చాలా ఉంది, సేవ యొక్క విశేషత కారణంగా కొంచెం స్నేహం ఉంది అని అంటున్నారు. కానీ విశేషంగా ఏ వ్యక్తివైపు అయినా, వైభవం వైపు అయినా మాటిమాటికి సంకల్పం వచ్చింది అంటే - వీరు లేదా ఇది ఉంటే బావుంటుంది అని వచ్చినా అది కూడా ఆకర్షణ. ఆ వ్యక్తికి ఆ సేవ యొక్క విశేషత ఇచ్చిన దాత ఎవరు? ఆ వ్యక్తియా లేక బాబాయా? ఎవరు ఇచ్చారు? అయితే ఈ వ్యక్తి చాలా మంచివారు అంటున్నారు, మంచివారు అంటే మంచిదే కానీ ఎప్పుడైనా ఏదైనా విశేషత, గుణం లేదా సేవని చూస్తున్నప్పుడు ఆ విశేషత ఇచ్చిన దాతని మర్చిపోవద్దు. ఆ వ్యక్తి కూడా తీసుకునేవారే కానీ దాత కాదు. బాబా వారిగా అవ్వకుండా ఆ వ్యక్తిలో ఆ సేవ యొక్క గుణం లేదా విశేషత వస్తుందా? లేదా ఆ విశేషతని అజ్ఞానం నుండి తీసుకువచ్చారా? ఈశ్వరీయ సేవ యొక్క విశేషత అజ్ఞాన కాలంలో ఉండదు. ఒకవేళ అజ్ఞానంలో కూడా ఏదైనా విశేషత లేదా గుణం ఉన్నా కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆ గుణం లేదా విశేషతలో జ్ఞానం నింపుకోకపోతే ఆ విశేషత లేదా గుణం ద్వారా అంతగా సేవ జరగదు. మన సహజ గుణంలో కూడా జ్ఞానం నింపుకోవల్సిందే. అయితే జ్ఞానం నింపేవారు ఎవరు? బాబా. అంటే అది ఎవరు ఇచ్చినట్లు? దాత ఎవరు? మీకు తీసుకునేవారు ఇష్టమా లేదా దాత ఇష్టమా? అయితే తీసుకునేవారి వెనుక ఎందుకు పరుగు పెడుతున్నారు?
బాబా ముందు, దాదీల ముందు చాలా మధురాతి మధురంగా మాట్లాడుతున్నారు, దాదీతో చెప్తారు - దాదీ! నాకు తగుల్పాటు లేదు, అస్సలు లేదు కానీ సేవ కారణంగా కొంచెం ఉంది. కొంచెమే అంటూ తప్పించుకుంటారు. కానీ ఈ తగుల్పాటు గుణం యొక్క తగుల్పాటు లేదా సేవ కారణంగా తగుల్పాటు ఉంటే అది ఈరోజు కాకపోతే రేపు ఎక్కడికి తీసుకువెళ్తుంది? కొందరిని ఈ తగుల్పాటు అనేది పాత ప్రపంచం వరకు కూడా తీసుకువెళ్ళిపోతుంది కానీ ఎక్కువ మంది పాతప్రపంచం వరకు వెళ్ళటం లేదు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఎక్కువమందిని ఈ తగుల్పాటు అనేది పురుషార్ధంలో సోమరితనం వైపుకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ మాత్రం కొంచెం అందరికి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మరలా బాబాకి కూడా చెప్పటం ప్రారంభిస్తున్నారు, అంటున్నారు బాబా మీరైతే సాకారంలో లేరు, బ్రహ్మాబాబా కూడా అవ్యక్తం అయిపోయారు, నువ్వు అయితే బిందువు, జ్యోతి, కానీ మేము అయితే సాకారంలో ఉన్నాం ఇంత పెద్ద శరీరం ఉంది. శరీరంతో అన్నీ చేయాలి, నడవాలి అంటే మేము సాకారం మీరైతే ఆకారి మరియు నిరాకారి కనుక సాకారంలో మాకు ఎవరో ఒకరు కావాలి కదా! ఎక్కువమంది కాదు కానీ ఒకరైనా కావాలి కదా! అంటున్నారు. ఒకరు కూడా అవసరం లేదా? చూస్కోండి మరి, బాప్ దాదా అయితే ఒకరు అవసరం అంటున్నారు. అవసరం లేదా? (ఒకే బాబా కావాలి) బాబా అయితే ఉంటారు కానీ కొన్నిసార్లు మనస్సులో కొన్ని కొన్ని విషయాలు వస్తాయి అప్పుడు ఆ మనస్సు బలుపు అయిపోతుంది. అప్పుడు మనస్సుని తేలిక చేసుకోనంత వరకు యోగం కూడా కుదరదు. అప్పుడేమి చేస్తారు? బాబాకి కూడా ప్రశ్న వస్తుంది. అటువంటి సమయంలో ఏమి చేయాలి? మనస్సు భారంగా ఉంది, యోగం కుదరటంలేదు. ఏం చేస్తారు? దానిని వాంతి చేసుకోకపోతే లోపల తినేస్తూ ఉంటుంది. వైద్యులు ఏమి చెప్తారు? పొట్ట బరువుగా అయిపోతే వాంతి చేసి తొలగిస్తారు కదా లేక లోపలే ఉంచుకోమని చెప్తారా? ఏం చేస్తారు? వాంతి చేసుకోవాలి కదా? వైద్యులు కూడా వాంతి చేసుకోమని చెప్తారు.
వారు తనువుకి వైద్యులు, మీరందరు మనస్సుకి వైద్యులు. తనువుకి సంబంధించిన వైద్యులు సమాధానం చెప్పారు, ఇప్పుడు మనస్సుకి వైద్యులు అయిన మీరు చెప్పండి, ఒకవేళ మనస్సులో ఏదైనా అలజడి ఉంటే ఎక్కడ వాంతి చేసుకోవాలి? బాబా ముందు దానిని చెప్తారా? లేకపోతే ఎక్కడ వాంతి చేసుకుంటారు? (బాబా గదిలోకి వెళ్ళి చెప్తాం) ఆలోచించండి. బాబా ముందు చెప్తారా? లేకపోతే ఎక్కడ చెప్తారు? ఏదైనా స్థానం చెప్పండి. పిల్లల వైపు నుండి బాప్ దాదా చెప్తున్నారు, ఆ సమయంలో ఎవరో ఒకరు కావాలి కదా అని. (బాబాకి చెప్తాం) ఒకవేళ బాబా వినకపోతే ఏం చేస్తారు? కొంతమంది పిల్లల ఫిర్యాదు ఏమిటంటే మేము అయితే బాబాకి వినిపించాం కానీ బాబా విననే లేదు, జవాబు ఇవ్వలేదు. మేము ఏం చేయము? అని. వాస్తవానికి హృదయంలో పరమాత్మ ప్రేమ, శక్తులు, జ్ఞానం కొంచెం కూడా ఖాళీ లేకుండా నిండుగా ఉంటే ఎప్పుడు ఏ వైపు తగుల్పాటు లేదా స్నేహం అనేది వెళ్ళదు.
కొందరు తగుల్పాటు లేదు, కానీ కేవలం మంచిగా అనిపిస్తున్నారు అంటున్నారు అంటే దీనిని ఏ వరుస అంటారు? తగుల్పాటు లేదు కానీ మంచిగా అనిపిస్తున్నారు అంటే ఏమిటి? వారితో కూర్చోవటం, మాట్లాడటం, వారితో సేవ చేయటం మంచిగా అనిపిస్తుంది అంటారు. దీనికి అవకాశం ఇమ్మంటారా? కొంచెం కావాలి, ఇప్పుడింకా సంపూర్ణంగా అవ్వలేదు కదా, పురుషార్ధం చేస్తున్నాము కదా! కొంచెం అవకాశం కావాలి అనేవారు చేతులు ఎత్తండి! ఇప్పుడు ఎవరూ చేతులు ఎత్తరు. ఎందుకంటే సిగ్గుగా అనిపిస్తుంది కదా! ఒకవేళ మీకు కొద్దిగా అవకాశం కావాలంటే వ్యక్తిగతంగా దాదీకి చీటి వ్రాసి ఇవ్వండి. దాదీతో 5 నిమిషాలు మాట్లాడతాను అని అడగకండి. అలా అయితే దాని కొరకు సమయం కావాలి. చీటి వ్రాసి ఇవ్వండి. బాప్ దాదా వారిని మంచి సంఘటన చేస్తారు. అప్పుడింకా మంచిగా అయిపోతుంది కదా! ఇప్పుడు అందరు వద్దు అంటున్నారు, అందుకే వీడియో తీస్తున్నారు. ఇప్పుడు వద్దు అని తర్వాత చేస్తే అప్పుడు ఈ క్యాసెట్ పంపిస్తారు, మీరే కదా అన్నారు. మరలా ఎందుకు చేసారు అని లేదా రక్షణగా ఉంటారా? పక్కాయేనా? లేదా కొద్దికొద్దిగా పచ్చిగా కొద్దికొద్దిగా పక్కాగా ఉన్నారా?
ఈ సీజన్ లో మీరందరు కాన్ఫరెన్సులు, ఉపన్యాసాలు, మేళాలు యొక్క చాలా ప్రోగ్రామ్స్ తయారు చేసుకున్నారు. కానీ బాప్ దాదా విశేషంగా ఒక ప్రోగ్రామ్ తయారు చేయించాలని అనుకుంటున్నారు. తయారేనా? బాప్ దాదా అనుకుంటున్నారు - ఈ డైమండ్ జూబ్లీలో ఎవరిని చూసినా అంటే 2 సంవత్సరాల వారైనా, 60 సంవత్సరాల వారైనా, 2 నెలల వారైనా, టీచర్ అయినా, విద్యార్థి అయినా, సమర్పణ అయిన వారైనా, ప్రవృత్తిలో ఉండేవారైనా కానీ ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో బాబాతో పాటూ మీరందరు కూడా పవిత్రతతో ప్రకృతిని కూడా పావనం చేస్తాము అని పవిత్రతా వత్రం తీసుకున్నారు కదా! ఈ సంకల్పం ఉంది కదా! లేక బాబాయే పావనం చేయాలా? బాబాకి సహయోగులే కదా లేదా కొంచెం చేయి వెనుక పెట్టుకుని చతురత చూపిస్తున్నారా? అలా చేయకూడదు.
ప్రతీ ఒక్కరు సాధనాలు లేదా వ్యక్తుల యొక్క తగుల్పాటు నుండి ముక్తులు అవ్వాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. సాధనాలతో కూడా తగుల్పాటు ఉండకూడదు. ఉపయోగించుకోవటం వేరు, తగుల్పాటు వేరు. బాప్ దాదా మోహముక్త సంవత్సరం జరుపుకోవాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మీరు సహయోగి అవుతారా? మరలా ఏదోక కారణం చెప్పకూడదు. ఏ కారణం అయినా, హిమాలయ పర్వతాలు పడిపోయినా కానీ వాటిని దాటుకుని వచ్చేయాలి. అంత ధైర్యం ఉందా? మొదట టీచర్స్ చెప్పండి. బాప్ దాదా మా టీచర్కి చెప్తున్నారని అని విద్యార్థులు సంతోషపడుతున్నారు. టీచర్స్ అయితే సహయోగం ఇవ్వటానికి సదా వెంటే ఉంటారు కదా! ఎందుకంటే ఇక ముందు ముందు ఈనాటి ప్రపంచంలో ఎవరైతే ధర్మాత్మలు, మహానాత్మలు అని పిలవబడుతున్నారో వారి పవిత్రతా పునాది కూడా కదులుతుంది. ఆదిలో బ్రహ్మాబాబా స్థాపనకి నిమిత్తం అయినప్పుడు ఏ విషయం కారణంగా నిందపడ్డారు? పవిత్రత కారణంగానే కదా! లేకపోతే బ్రహ్మాబాబా యొక్క గత జీవితంలో ఎంత పెద్దవారైనా బ్రహ్మాబాబాని వ్రేలు ఎత్తి చూపే ధైర్యం ఎవ్వరికి ఉండేది కాదు. ఆయనది అటువంటి వ్యక్తిత్వం. కానీ పవిత్రత కారణంగా నిందలు పడ్డారు. ఈ పరమాత్మ జ్ఞానం యొక్క నవీనతయే - పవిత్రత. ప్రతిజ్ఞ చేశారు కదా! దంపతులు చేతులు ఎత్తండి! దంపతులందరు ఈ ప్రతిజ్ఞ చేశారు కదా లేక కొంచెం కొంచెం అగ్ని అంటుకుంటే ఆర్పుకుంటున్నారా? విశ్వానికి ప్రతిజ్ఞ చేశారు కదా! మీరు ఉపన్యాసాలలో చెప్తారు కదా, పవిత్రత లేకుండా జ్ఞానిగా, యోగిగా కాలేరు అని. ఇది మీ అందరి ప్రతిజ్ఞ కదా? మేము ఈ ప్రతిజ్ఞ చేసాం అనే దంపతులు చేతులు ఎత్తండి! మంచిది, ఒకే గ్రూప్లో చాలామంది సాతీలు ఉన్నారు. అయితే డైమండ్ జూబ్లీలో ఏం చేస్తారు? తగుల్పాటు నుండి ముక్తులుగా అవ్వాలి. క్రోధముక్తులుగా అయ్యారు కదా! కొంచెం, కొంచెం క్రోధం బాప్ దాదా ఇంకా కొందరిలో చూశారు. కానీ ఈసారి కొంచెం వదిలేశాను. అయినా కానీ దేశ, విదేశాలలోని పిల్లలు ధ్యాస పెట్టుకుని సంపూర్ణ రూపంలో క్రోధముక్త జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసుకుని చూపించిన వారికి బాప్ దాదా కోటానుకోట్ల కంటే ఎక్కువ రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేశీయులు అయినా విదేశీయులు అయినా అందరి బుద్ధి రూపి టెలిఫోన్ మధువనంలో ఉంది. అందరి కనెక్షన్ మధువనంలో ఉంది. మంచి ధృడ సంకల్పం చేసిన వారికి బాప్ దాదా నుండి ఎక్కువ సహాయం లభించినట్లు అందరు అనుభవం కూడా చేసుకున్నారు కదా! ఒక సంవత్సరం క్రోధముక్తులుగా అయిపోయాము, ఇప్పుడిక స్వేచ్చగా ఉండచ్చు అని అనుకోవద్దు. సంపూర్ణంగా తగుల్పాటు నుండి ముక్తులుగా అనుభవం చేసుకుంటే స్వతహాగానే క్రోధముక్తులుగా అయిపోతారు. ఎందువలన? క్రోధం కూడా ఎందుకు వస్తుంది? ఏ విషయాన్ని, ఏ వస్తువుని మీరు కోరుకుంటున్నారో అది పూర్తి కానప్పుడు, అది లభించనప్పుడు క్రోధం వస్తుంది కదా! క్రోధానికి కారణం - మన యొక్క సంకల్పాలు అంటే మంచి అయినా, చెడు అయినా ఆ సంకల్పం పూర్తి కాకపోతే క్రోధం వస్తుంది. ఉదాహరణకి కాన్ఫరెన్స్ లేదా ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే దానిలో మీరు కూడా పాల్గొనాలని అనుకుంటారు. చివరికి మాకు ఎప్పుడు అవకాశం లభిస్తుంది? అంటే మీకు అలక ఉంది. వారికి సైగ చేసినా కానీ అవకాశం లభించకపోతే ఆ సమయంలో చిటపటలు వస్తాయా, రావా? మహాక్రోధం రాదు కానీ ఎవరైతే వద్దు అన్నారో వారి గురించి వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి కదా! అయితే అది పవిత్రత కాదు కదా? అవకాశం కోరటం, మన ఆలోచన చెప్పటం మంచిదే కానీ ఆ ఆలోచన కోరికగా మారకూడదు. సంకల్పం కోరిక రూపంలో మారిపోతే చిటపటలు వస్తాయి, నోటి ద్వారా క్రోధం చూపిస్తారు, లేదా కాళ్ళు, చేతులు కూడా పని చేస్తాయి. అంటే అది మహాక్రోధం, కానీ నిస్వార్థంగా అయ్యి మీ ఆలోచన చెప్పండి, కానీ నేను చెప్పింది చేయవలసిందే అని స్వార్ధం పెట్టుకోకండి. అవకాశం కోరటం తప్పు కాదు. కానీ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలోకి వెళ్ళకండి. లేకపోతే ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఒకదానికొకటి తోడు ఇవన్నీ వచ్చేస్తాయి. అందువలన పవిత్రతా వ్రతాన్ని పక్కాగా పాటించి, తగుల్పాటు నుండి ముక్తులుగా అయిపోతే నేను చెప్పింది జరగాలి అనే తగుల్పాటు కూడా ఉండదు. జరగవలసిందే అని అనకూడదు. అవకాశం కోరారు మంచిదే, మీ నిస్వార్ధ కోరిక తొందరగా చేరుకుంటుంది. స్వార్థానికి లేదా ఈర్ష్యకి వశం అయ్యి కోరితే అది ఇంకా క్రోధాన్ని ఉత్పన్నం చేస్తుంది. టీచర్స్ ఏమి చేస్తారు? 100 శాతం తగుల్పాటు నుండి ముక్తులుగా అవ్వాలి. చేస్తారా? చేయరా? చెప్పండి. చేస్తాం అని విదేశీయులు చెప్పండి.
బాప్ దాదాకి అయితే టి.వి.లో చాలా క్రొత్త క్రొత్త విషయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 60 సం||లు పూర్తి అవుతున్నాయి ఇప్పటివరకు జరగని విషయాల యొక్క క్రొత్త క్రొత్త ఆటలు చాలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఒక్కొక్కటి వర్ణన చేస్తాను కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ ఎవరిపట్ల అయినా కలలో అయినా కానీ తగుల్పాటు, స్వార్ధం ఉంటే దానిని సమాప్తి చేయండి. కొందరు అంటున్నారు మేము కర్మలోకి రావటం లేదు కానీ కలలు వస్తున్నాయి అని కానీ ఒకవేళ వ్యర్ధం లేదా వికారీ స్వప్నాలు, తగుల్పాటు యొక్క స్వప్నాలు వస్తున్నాయి అంటే తప్పకుండా నిద్రపోయే సమయంలో మీరు సోమరితనంగా నిద్రపోయినట్లే. కొందరు అంటున్నారు రోజంతటిలో నాకు ఏ సంకల్పాలు నడవటం లేదు, ఏమి జరుగలేదు కూడా,అయినా కానీ కల వచ్చింది అని అంటే పరిశీలించుకోండి, నిద్రపోయే సమయంలో రోజంతటి యొక్క లెక్కాచారం అంతా బాబాకి ఇచ్చేసి బుద్ధిని ఖాళీ చేసుకుని పడుకున్నానా? అని. అంతే కానీ అలసిపోయి వచ్చి పడక మీదకి వెళ్ళి నిద్రపోతే అది సోమరితనం. మీరు వికర్మ చేయకపోవచ్చు, సంకల్పం కూడా చేయలేదు కానీ అది సోమరితనం యొక్క శిక్ష. ఎందుకంటే బాప్ దాదా యొక్క ఆజ్ఞ ఏమిటంటే నిద్రపోయే సమయంలో సదా మీ బుద్ధిని స్పష్టంగా చేసుకోండి, మంచి అయినా, చెడు అయినా అంతా బాబాకి అర్పించండి మరియు మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి. బాబాకి ఇచ్చేసారు. ఇక బాబాతో పాటు నిద్రపోండి, ఒంటరిగా కాదు. ఒంటరిగా నిద్రపోతేనే కలలు వస్తాయి. బాబాతో పాటు పడుకుంటే ఎప్పుడు అటువంటి కలలు రావు కానీ ఆజ్ఞని పాటించటం లేదు కనుక ఆజ్ఞకి బదులు ఆశ మిగులుతుంది. మరలా ఉదయం లేచిన తర్వాత నా పవిత్రత కలలో సమాప్తం అయిపోయింది అని అనుకుంటున్నారు. దీనికి కారణం సోమరితనం. సోమరిగా అవ్వకండి. ఎలా వచ్చారో అలా ఇక్కడి విషయాలు, అక్కడి విషయాలు చెప్పుకుంటూ, చెప్పుకుంటూ నిద్రపోతున్నారు. ఎందుకంటే సమాచారాలు చాలా ఉంటాయి మరియు వ్యర్ధమే మనసుకి ఇష్టమైన సమాచారం. కొందరు అంటున్నారు - సమయం దొరకటం లేదు అందువలన పడుకునే గదిలో చర్చించుకుంటున్నాము. కానీ ఎప్పుడు కూడా వ్యర్ధ విషయులు వర్ణన చేసుకుంటూ, చేసుకుంటూ నిద్రపోకూడదు. ఇది సోమరితనం. ఇది ఆజ్ఞని ఉల్లంఘించటం. సమయం లభించటం లేదు అంటున్నారు. కానీ అది ముఖ్యమైన విషయం అయితే నిద్రపోయే గదిలో కాకుండా ఆ గది బయటికి వెళ్ళి ఒకటి, రెండు సెకనులలో ఒకరికొకరు చెప్పుకోండి కానీ నిద్రపోతూ, నిద్రపోతూ మాత్రం చెప్పుకోకండి. కొంతమంది పిల్లలకి ఈ అలవాటు ఉంది. కనుక ఎలా నిద్రపోతున్నారు? అనేది కూడా బాప్ దాదా చూస్తారు. ఒక్క సెకనులో బాప్ దాదా మొత్తం విశ్వం అంతా తిరుగుతారు. ఎలా నిద్రపోతున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది టి.వి.లో చూస్తారు. బాప్ దాదా అన్నీ చూస్తారు. బాప్ దాదాకి అయితే చూడటానికి ఒక్క సెకనే పడుతుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు. ప్రతి ఒక్క సెంటర్, కుటుంబంలోని వారిని అంతా చూస్తారు. కేవలం సెంటర్‌నే చూస్తారు అని అనుకోకండి. మీ ఇల్లు గురించి కూడా టి.వి.లో వస్తుంది. ఎప్పుడైతే ఆది అంటే అమృతవేళ నుండి అంతం అంటే నిద్రపోయే వరకు మంచిగా ఉంటుందో అప్పుడు మధ్యస్థితి స్వతహాగానే మంచిగానే ఉంటుంది. అర్థమైందా? ఇతర మాటలు మాట్లాడుకుంటూ కొందరు 12 - 12.30 గం||ల వరకు కూడా ఉంటున్నారు. వాటిలో నిమగ్నం అయిపోతున్నారు, వారికి సమయం కూడా తెలియటం లేదు. మరలా అమృతవేళ లేచి కూర్చుంటున్నారు, సగం సమయం నిద్రా లోకంలో, సగం సమయం యోగంలో ఉంటున్నారు. ఎందుకంటే ఎవరైతే సోమరితనంగా నిద్రపోతారో వారు అమృతవేళ కూడా సోమరితనంగానే ఉంటారు కదా! మమ్మల్ని ఎవరూ చూడటం లేదు అని అనుకోవద్దు. బాప్ దాదా చూస్తున్నారు, నిద్ర కూడా చాలా శాంతిని, సుఖాన్ని ఇస్తుంది. అందువలన దానిని కూడా కలిపేస్తున్నారు. ఒకవేళ అడిగితే నేను నిద్రపోవటం లేదు, నేను చాలా శాంతిని అనుభవం చేసుకుంటున్నాను అంటారు. నిద్రని కూడా విశ్రాంతి అంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్తారు కదా! విశ్రాంతి అంటే ఏమి చేయాలి? విశ్రాంతి అంటే సమయానికి నిద్రపోవటం. నిద్ర కూడా విశ్రాంతిని ఇస్తుంది. అది కూడా తాజాగా చేస్తుంది. నిద్రతో తాజాగా అయిపోయి మేల్కొన్న తరువాత ఈరోజు (యోగంలో) చాలా తాజాగా ఉంది అంటున్నారు.
అందరు దూరదూరాల నుండి వచ్చారు కదా! ఈ గ్రూప్ లో మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. చిన్న పిల్లలు పెద్దవారికంటే ఎక్కువగా ప్రియంగా అనిపిస్తారు. కానీ క్రొత్తగా వచ్చిన వారు ఇప్పుడు అలంకరించుకోవాలి. పెద్దవారు 10 సంవత్సరాలలో చేసినది మీరు 10 రోజులలో చేయాలి, చేయగలరు. ఎందుకంటే బాప్ దాదా అనుకుంటున్నారు, క్రొత్తవారిగా ఉన్నప్పుడు ఉత్సాహ, ఉల్లాసాలు చాలా ఉంటాయి పాతవారిగా అయ్యే కొలదీ..... పాతవారు అర్ధం చేసేసుకున్నారు. అందువలన చెప్పవలసిన అవసరం లేదు. క్రొత్త వారందరు, కుమారీలైనా, కుమారులైనా, కుటుంబంలోని వారైనా, కుటుంబంలో ఉండేవారు మహాత్మలందరినీ చరణాలపై వంగింప చేసుకోవాలి. వీరు కుటుంబంలో ఉంటూ కూడా నిర్విఘ్నంగా పవిత్రత యొక్క బలంతో ముందుకు వెళ్తున్నారు అని అందరు గుణగానం చేస్తారు. మీ అందరి ముందు ఈ మహాత్మలందరు తలవంచే రోజు వస్తుంది. కానీ మీ ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉంచుకోవాలి, తగుల్పాటు నుండి ముక్తులుగా ఉండాలి.
నలువైపుల ఉన్న హృదయంలో లీనమయ్యే బాప్ దాదా యొక్క గారాభమైన శ్రేష్టాత్మలకు, సదా బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాటించటం ద్వారా స్వయం మరియు ఇతరుల యొక్క ఆశలు సమర్పితం చేయించేవారికి, సదా పవిత్రత యొక్క స్థంభాన్ని గట్టిగా చేసుకునేవారికి, మరియు పవిత్రత యొక్క లైట్ హౌస్ గా, మైట్ హౌస్ అయ్యి పవిత్రత యొక్క ప్రకాశాన్ని వెదజల్లే విశేషాత్మలకు, సదా స్వయాన్ని మోహముక్తులుగా చేసుకుని బాబాకి సమీపంగా వచ్చేవారికి, బాబాకు సమీపంగా ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment