16-03-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మ యొక్క గుర్తు సంతుష్టత మరియు ప్రసన్నత.
ఈ రోజు సర్వ ప్రాప్తులను ఇచ్చే బాప్ దాదా తన యొక్క నలువైపుల ఉన్న ప్రాప్తి సంపన్న పిల్లలను చూస్తున్నారు. సర్వ ప్రాప్తుల దాత సంపన్న మరియు సంపూర్ణుడైన బాబా యొక్క పిల్లలు కనుక ప్రతి ఒక్కరికి బాబా సర్వ ప్రాప్తుల యొక్క వారసత్వాన్ని ఇచ్చారు. కొందరికి 10, కొందరికి 20 ఇలా ఇవ్వలేదు. పిల్లలందరికి సర్వప్రాప్తుల యొక్క అధికారం ఇచ్చారు. పిల్లలందరు పూర్తి వారసత్వానికి అధికారులు. బాప్ దాదా చూస్తున్నారు ప్రతి ఒక్క అధికారి బిడ్డ తనలో ప్రాప్తుల యొక్క అధికారాన్ని ఎంత వరకు పొందాడు? అని. బాబా అయితే అన్నీ ఇచ్చారు. బాబాని సర్వశక్తివంతుడు లేదా సంపన్న సాగరుడు అని అంటారు కానీ పిల్లలు ఆ ప్రాప్తులను ఎంత వరకు తమ సొంతం చేసుకున్నారు? బాబా ఇచ్చిన వారసత్వం ఎంత సొంతం చేసుకుంటారో అంత నషా మరియు సంతోషం ఉంటుంది - నా ఖజానా అని. ఇచ్చింది బాబాయే కానీ వాటిని ధారణ చేసి మీ సొంతం చేసుకున్నారు. అయితే ఏం చూశారు? సొంతం చేసుకోవటంలో నెంబర్ వారిగా ఉన్నారు. బాబా నెంబర్ తయారు చేయలేదు కానీ తమ తమ ధారణ యొక్క శక్తి నెంబర్‌వారిగా తయారు చేసింది. సంపూర్ణ అధికారి లేదా సర్వప్రాప్తులతో సంపన్న ఆత్మ సదా అమృతవేళ నుండి రాత్రి వరకు సర్వప్రాప్తుల యొక్క నషాలో ఉంటుంది మరియు అనుభవంలో ఉంటుంది వారి గుర్తు ఏమి ఉంటుంది? ప్రాప్తులకు గుర్తు సంతుష్టత. వారు సదా సంతుష్టమణిగా అయ్యి ఇతరులకి కూడా సంతుష్టత మెరుపు యొక్క తరంగాలు వ్యాపింపజేస్తూ ఉంటారు. వారి ముఖం సదా ప్రసన్నంగా కనిపిస్తుంది. ప్రసన్నచిత్ అంటే అన్న ప్రశ్నల సుండి అతీతంగా ఉంటారు. ఏ ప్రశ్న ఉండదు, ప్రసన్నంగా ఉంటారు. ఎందుకు, ఏమిటి, ఎలా .... ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. ఇలా ప్రసన్నంగా అయ్యారా? లేక ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏవైనా ప్రశ్నలు వస్తున్నాయా - ఇది ఏమిటి, ఇది ఎందుకు, ఇది ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది? ఇలా ప్రశ్నలు ఉన్నాయా, వస్తున్నాయా? మనస్సులో కానీ, ఇతరులతో కానీ ఈ ప్రశ్నలు వస్తున్నాయా? ప్రశ్నచిత్తులుగా ఉన్నారా లేదా ప్రసన్నంగా ఉన్నారా? లేదా ఒక్కొక్కసారి ప్రశ్నలతో, ఒక్కొక్కసారి ప్రసన్నంగా ఉంటున్నారా? ఎలా ఉన్నారు? నవ్వుతున్నారు, అవును అనటం లేదు. లేకపోతే అందరు నషాగా చెప్తారు - అవును ప్రసన్నంగా ఉన్నాము అని. మంచిది. మహిమ ఉంది కదా - బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు అని ఇది ఎవరి మహిమ? బ్రాహ్మణాత్మలైన మీదేనా లేదా ఇంకా తర్వాత వచ్చేవారిదా? మీరే కదా! ఏదైనా అప్రాప్తి ఉందా, అప్రాప్తి అనేదే అసంతుష్టతకు కారణం. మీ అనుభవంలో కూడా చూడండి, ఎప్పుడైనా మనస్సు అసంతుష్టం అవుతుంది అంటే కారణం ఏమిటి? ఏదోక అప్రాప్తి అనుభవం చేసుకున్నప్పుడే అసంతుష్టత వస్తుంది. అప్రాప్తి వస్తువు ఏదీ లేదు అని మహిమ ఉంది కదా అది ఈ సమయం యొక్క మహిమయా లేదా వినాశన సమయానిదా? వినాశన సమయంలో సంపన్నం అవుతారా లేదా ఇప్పుడే సంపన్నం అవ్వాలా? లేదా అయిపోయారా? లేక ఇప్పుడు అవ్వాలా? ఇప్పుడేనా లేదా ఎప్పుడో అవుతారా? ఇప్పుడే అవ్వాలి. అవ్వాలా లేదా అయిపోయారా? పాండవులు అవ్వాలా లేదా అయిపోయారా? సదాయేనా? లేక అప్పుడప్పుడు కొంచెం కొంచెం ... మేము సదా ప్రసన్నంగా ఉంటున్నాము, ఎప్పుడూ కూడా ఏ విషయంలోను, స్వ సంబంధంలో, ఇతరుల సంబంధంలో కూడా ప్రశ్న రావటం లేదు సదా సంతుష్టంగా ఉంటున్నాము అని అనే సంతుష్ట ఆత్మలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. మంచిది. మేము సదా ప్రసన్నంగా ఉంటున్నాము, మాయ ఎంతగా కదిలించినా కానీ మేము కదలటం లేదు, మాయని చలింప చేస్తున్నాము, మాయ ఓడిపోతుంది కానీ మేము విజయీలము, మాయ మాకు నమస్కారం చేస్తుంది, మేము కదలటం లేదు, మేము అంగదులం, మాయ ఓడిపోతుంది కానీ మేము విజయీలం అనేవారు చేతులు ఎత్తండి! సదా అనే మాట జ్ఞాపకం ఉంచుకోవాలి అప్పుడప్పుడు ఉండేవారిగా కాదు. అలాంటివారు చాలా కొద్దిమంది ఉంటారు, కోట్లలో కొద్దిమంది ఉంటారు. టీచర్స్ ఉన్నారు కదా! ప్రశ్నార్ధకం వస్తుంది కదా! ప్రశ్నార్ధకం అనేది డిక్షనరి నుండి తొలగిపోవాలి. అలజడి కూడా ఉండకూడదు. కంప్యూటర్లో బిందువు వస్తుంది కదా! అలాగే మీ బుద్ధి రూపి కంప్యూటర్ లో సదా బిందువు యొక్క గుర్తె రావాలి. ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్ధకం సమాప్తి అయిపోవాలి. అటువంటి వారినే సదా ప్రసన్న చిత్తులు అని అంటారు.
ఇలా ప్రసన్నంగా ఉండేవారు ఇతరుల ప్రశ్నలను కూడా సమాప్తి చేస్తారు. ఒకవేళ స్వయంలోనే ప్రశ్నార్ధకం ఉంటే ఏదైనా విషయం వినినా లేదా చూసినా ఇది జరగకూడదు కానీ అయిపోతుంది, జరగకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను కానీ అయిపోతుంది ఇలా ప్రశ్నకి వారు అండర్లైన్ చేస్తారు. మొండిగా చెపుతారు అవును ఇది సరికాదు, ఇది అయిపోతుంది అని అంటే వారిని ప్రసన్నులని చేయకపోవడమే కాకుండా వారికి ఇంకా ప్రశ్నలు పెంచుతారు. ఇంకా ఎక్కువ అయిపోతాయి. నిజానికి ప్రశ్న ఒక్కటే అది ఒకటి నుండి రెండు, రెండు నుండి నాలుగు అయిపోతాయి. ఇలా ప్రసన్నంగా ఉండే తరంగాలకు బదులు ప్రశ్నల యొక్క తరంగాలు తొందరగా వ్యాపిస్తాయి. అవును, అలాగా.... అంటే వారికి ఇంకా ప్రోత్సాహం ఇచ్చినట్లు. అవునా అంటే ఆశ్చర్యార్ధకం యొక్క గుర్తు వచ్చింది కదా! బిందువు పెట్టినట్లు కాదు కదా? అలాగే స్వయం గురించి కూడా అంటే ఇది నా ద్వారా జరగకూడదు, ఇది నాకు లభించాలి, ఇది ఇతరులకి ఉండకూడదు, ఇలా కావాలి, కావాలి అనేది ప్రశ్నచిత్తులుగా తయారు చేస్తుంది. ప్రసన్నంగా ఉండనివ్వదు. అందరి లక్ష్యం ఏమిటి? సంతుష్ఠంగా మరియు ప్రసన్నంగా అవ్వాలి. ఎవరైతే ప్రసన్న చిత్తంగా ఉంటారో వారి మనస్సులో, బుద్ధిలో వ్యర్థం యొక్క వేగం ఎక్కువగా ఉండదు. సదా నిర్మలంగా, నిర్మానంగా ఉంటారు. నిర్మానంగా ఉన్న కారణంగా అందరికి తమ ప్రసన్నత యొక్క ఛాయలో శీతలతను ఇస్తారు. ఎటువంటి అగ్ని సమానమైన కాలిపోయే లేదా చాలా వేడైన బుద్ధి కలవారైనా కానీ ప్రసన్నత తరంగాల యొక్క ఛాయలో శీతలంగా అయిపోతారు. కాని ఏమి బలహీనత వస్తుంది? స్వయంతో మంచిగానే నడుస్తున్నారు, సరిగ్గానే ఉంటున్నారు కానీ సంబంధ సంపర్కాలలోకి వచ్చినప్పుడు ఇతరుల యొక్క బలహీనతలను చూస్తూ వింటూ, వర్ణన చేస్తూ వాటి ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. మరలా వీరు చేసారు కదా, అందువలన నా ద్వారా కూడా జరిగిపోయింది అంటున్నారు. వారు అన్నారు. అప్పుడే నేను అన్నాను అంటారు. వారు 50 సార్లు అన్నారు. నేను ఒకసారి అన్నాను అంటారు. మరలా బాబా ముందు కూడా చాలా మధురాతి మధురమైన విషయాలు చెప్తారు, బాబా నువ్వు అర్ధం చేసుకోవాలి, ఎంత వరకు సహిస్తాము, ఇంకా పురుషార్థులం కదా, ఎంతో కొంత వస్తుంది కదా! ఇలా బాబాకి కూడా అర్థం చేయించడం మొదలు పెడతారు. అలాగే నిమిత్తమైన వారికి కూడా చాలా కథలు వినిపిస్తారు. వినిపిస్తారు కదా! ఇలా కదా, ఇలా కదా, ఇలా కదా ..... అంటూ ఇలా ఇలా అనే మాల జపిస్తారు. బాప్ దాదా సదా సైగ చేస్తూ ఉంటారు, ఇటువంటి విషయాలను రెండు మాటలలో వర్ణన చేయండి, ఎక్కువగా వర్ణన చేయకండి. ఎందుకంటే ఇటువంటి వ్యర్థ విషయాలు చాలా రుచిగా ఉంటాయి. మజాగా అనిపిస్తాయి. తినటానికి పుల్లగా, తియ్యగా ఉండే పదార్థాలు బావుంటాయి కదా! రుచి లేకుండా, సాధారణంగా ఉంటే ఇవైతే తింటూనే ఉంటాం కదా! అంటారు. వ్యర్ధ విషయాలు అంటే వ్యర్ధం మాట్లాడటం, వినటం మరియు చేయటం వీటిలో ఉంటూ ఉంటూ ఆసక్తి పెరిగిపోతుంది. మరలా ఆలోచిస్తారు - నేను వినాలనుకోలేదు కానీ వారు చెప్పారు అని. మంచిది. వారు మీకు విన్పించి వారి మనస్సుని ఖాళీ చేసుకున్నారు. మరియు మీ మనస్సు నిండిపోయింది. ఇలా కొద్దికొద్దిగా మనస్సులో నింపుకుంటూ, నింపుకుంటూ సంస్కారంగా అయిపోతుంది, సంస్కారంగా అయిపోతే ఇది తప్పు అని కూడా అనుభవమే అవ్వదు. ఈ వ్యర్థ సంస్కారం బుద్ధి యొక్క నిర్ణయాన్ని సమాప్తి చేసేస్తుంది. అందువలన సదా సంతుష్టంగా ఉండటానికి అన్నింటికంటే సహజమైన విధి-సదా ఏదోక విశేష ప్రాప్తిని మీ ఎదురుగా ఉంచుకోండి. ఎందుకంటే ప్రాపినైతే మర్చిపోరు. జ్ఞానం యొక్క విషయాలు అయితే మర్చిపోవచ్చు కానీ ప్రాప్తినైతే మర్చిపోరు. బాబా ద్వారా ఏమేమి లభించాయి, ఎంత లభించిది, వెరైటీ అంటే ఇష్టం కదా! ఒకేవిధంగా ఉండేవి ఇష్టం అనిపించవు. కనుక మీరు మీ యొక్క ప్రాప్తులను చూసుకోండి - జ్ఞానఖజానా ఎంతగా లభించింది,యోగం ద్వారా శక్తుల యొక్క ప్రాప్తి ఎంతగా లభించింది, దివ్యగుణాల యొక్క ప్రాప్తి ఎంతగా లభించింది, ప్రత్యేకంగా నషాలో, సంతోషంలో ఉండటానికి ఎన్ని ప్రాప్తులు లభించాయి? చాలా జాబితా ఉంది కదా. ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం యొక్క ప్రాప్తిని ఎదురుగా ఉంచుకుని సంతుష్టంగా ఉండండి. ఎందుకంటే ఒక గుణాన్ని మీదిగా చేసుకుంటే వికారాలకు ఎలాగైతే పరస్పరం లోతైన సంబంధం ఉంటుందో, బయటికి కోపం ప్రత్యక్షం అవుతుంది. కానీ ఆంతరంగికంగా పరిశీలిస్తే క్రోధంతో పాటు లోభం, అహంకారం కూడా ఉంటాయి. ఇవన్నీ పరస్పర సహయోగులు. కొన్ని ప్రత్యక్ష రూపంలో ఉంటాయి, కొన్ని గుప్తంగా ఉంటాయి. అలాగే గుణాలకు కూడా పరస్పరం సంబంధం ఉంటుంది. ప్రత్యక్షంగా ఒక గుణాన్ని ఉంచుకోండి, మిగిలిన గుణాలు దానితో పాటు గుప్తంగా ఉంటాయి. రోజు ఏదోక ప్రాప్తి స్వరూపం యొక్క అనుభవాన్ని తప్పక చేసుకోండి. ప్రాప్తి ప్రత్యక్షంగా ఉంటే ప్రాప్తి ముందు అప్రాప్తి సమాప్తి అయిపోతుంది మరియు సదా సంతుష్టంగా ఉంటారు. ప్రపంచంలో కూడా అందరు ముఖ్యంగా ఏ ప్రాప్తి కోరుకుంటున్నారు?
1. ప్రతి ఒక్కరు మా పేరు మంచిగా ఉండాలి 2. గౌరవం 3. కీర్తి. పేరు - గౌరవం - కీర్తి (మర్యాద) కోరుకుంటారు కదా! మీరు కూడా ఏమి కోరుకుంటున్నారు? మీరు హద్దులోనివి కోరుకోవటం లేదు. బేహద్ గా కోరుకుంటున్నారు. ప్రపంచం వారు హద్దులోని పేరు వెనుక పరుగుపెడతారు కానీ మీ పేరు విశ్వంలో ఎంత ఉన్నతమైనది, ఇంత ఉన్నతమైన పేరు ఇంకెవరికి అయినా ఉంటుందా? మీరు మీ పేరుని చూసుకోండి. అందరి పేరు కంటే మీ పేరులో ఉన్న విశేషత ఏమిటంటే మీ పేరుని ఎవరు జపిస్తున్నారు? స్వయం భగవంతుడు మీ నామాన్ని జపిస్తున్నారు. మరి ఇంత కంటే గొప్ప పేరు ఇంకేమి ఉంటుంది? మీ పేరుతో ఈ అంతిమ జన్మలో కూడా అనేకాత్మలు తమ శరీర నిర్వహణ చేసుకుంటున్నారు. మీరు బ్రాహ్మణులు కదా, అయితే బ్రాహ్మణుల పేరుతో ఈ రోజు వరకు కూడా నామధారి బ్రాహ్మణులు ఎంత సంపాదించుకుంటున్నారు. ఇప్పటి వరకు నామధారి బ్రాహ్మణులు కూడా ఎంత ఉన్నతంగా కీర్తించబడుతున్నారు. కానీ పేరు అయితే మీదే కదా లేక వారిదా? మీ పేరే కదా! అయితే మీ పేరుకి ఎంత గొప్ప మహిమ ఉంది. ఇంత శ్రేష్టమైన పేరు మీకు ఉంది. అందువలన హద్దులోని పేరు వెనుక వెళ్ళకండి. నా పేరు ఎప్పుడు దేనిలోను తీసుకోవటం లేదు, నా పేరు ఎప్పుడు వెనుకే ఉంటుంది, సేవ నేను చేస్తున్నాను పేరు ఇంకొకరికి వస్తుంది, ఇలా హద్దులోని పేరు వెనుక వెళ్ళకండి. బాబా యొక్క హృదయంలో సదా మీ పేరు శ్రేష్టంగానే ఉంటుంది. బాబా హృదయంలో సదా మీ పేరు ఉన్నప్పుడు ఇక ఏ సేవలోనైనా, కార్యక్రమంలోనైనా, ఏవిషయంలోనైనా మీ పేరు లేకపోతే ఏమైంది? బాబా దగ్గర అయితే ఉంది కదా! భక్తిమార్గంలో హనుమంతుని చిత్రం చూపిస్తారు కదా! ఆయన హృదయంలో ఏమి ఉండేది? రాముడే ఉండేవాడు. అలాగే బాబా హృదయంలో ఎవరు ఉంటారు? (పిల్లలు) అయితే ఆ పిల్లలలో మీరు ఉన్నారా? లేరా? అందరు ఉన్నారా? అనువాదం చేసేవారు కూడా ఉన్నారు. మీ సేవ చేస్తున్నారు కదా. మంచిది. అందరి పేర్లు ఉన్నాయి. పక్కాగా చూసుకున్నారా? ఎక్కడా మిస్ అవ్వలేదు కదా మీ అందరి పేరు ఉంది. అయితే ఇక వేరే పేరు వెనుక ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే చాలామందిని ఈ పేరు, గౌరవం, మర్యాదలే పడవేస్తున్నాయి మరియు ఈ పేరు, గౌరవ మర్యాదలే నషాని కూడా ఎక్కిస్తున్నాయి. అయితే ప్రాప్తి రూపంలో చూడండి. ఒకవేళ ఏ కారణంగా అయినా మీ పేరు గుప్తంగా ఉంది, మీరు అనుకుంటారు నా పేరు ఉండాలి అని మీది యదార్ధమే అయినా కానీ ఏదోక ఆత్మతో కర్మల ఖాతా కారణంగా లేదా వారి సంస్కారాల కారణంగా మీ పేరు ఉండటం లేదు, మీరు సత్యం, వారు అసత్యం అయినా కానీ వారి పేరు ఉంది మీ పేరు లేదు అనుకోండి అయినా ఫర్వాలేదు. విజయీ మాలలో మీ పేరు నిశ్చితం అయిపోయి ఉంటుంది. అందువలన దీని గురించి కూడా చింతించకండి. ఈ రూపంలో మాయ ఎక్కువగా వస్తుంది. అందువలన ఇప్పుడు పొరపాటున మీ పేరు మిస్ అయిపోయినా ఏమీ పర్వాలేదు కానీ విజయీమాలలో మీ పేరు మిస్ అవ్వదు. ముందు మీ పేరే ఉంటుంది. ఇలా మీ పేరు యొక్క మహిమను జ్ఞాపకం ఉంచుకోండి - నా పేరు బాబా హృదయంలో ఉంది, విజయీమాలలో ఉంది, అంతిమం వరకు నా పేరు సేవ చేస్తుంది అని.
మీ యొక్క గౌరవం ఎంత గొప్పది? భగవంతుడు కూడా మిమ్మల్ని తన కంటే ముందు ఉంచారు. ముందు పిల్లలు అంటారా లేదా ముందు బాబా అంటారా? ముందు పిల్లలే అంటారు అంటే స్వయం భగవంతుడు మీకు గౌరవం ఇచ్చారు. మీకు ఎంత గౌరవం ఉంది అంటే దానికి రుజువు చూడండి అంతిమ జన్మ వరకు మీ జడచిత్రాలకి ఎంత గౌరవం ఉంటుంది! తెలిసినా, తెలియకపోయినా ఏదైనా దేవీ, దేవతా యొక్క చిత్రం ఉంటే ఎంత గౌరవంగా చూస్తారు! మీ జడచిత్రాలకు కూడా ఇప్పటివరకు అందరికంటే శ్రేష్ఠగౌరవం ఉంది. మీకు ఇదే రుజువు. మీ చిత్రాలే ఇంత గౌరవనీయంగా, పూజ్యనీయంగా ఉంటే గౌరవంగా ఉండేవారిని పూజ్యనీయంగా కూడా భావిస్తారు. పూజ్యులు అని అంటారు కదా! వీరు మా పూజ్యనీయులు, పూజ్యులు అని సదా అంటారు కదా! మీకు ప్రత్యక్ష రుజువు ఏమిటంటే, మీ చిత్రాలకి కూడా గౌరవం ఉంది అంటే చైతన్యంగా మీకు గౌరవం ఉంది కనుకే చిత్రాలకు కూడా గౌరవం ఉంటుంది. చైతన్యంలో మీ గౌరవం గురించి విన్నారా? ఒకవేళ చైతన్యంగా గౌరవం లేకపోతే చిత్రాలకు గౌరవం ఎలా ఉంటుంది? బాబా సదా అంటారు- పిల్లలు ముందు అని. పిల్లలకు డబల్ పూజ (రెండు రకాలుగా) జరుగుతుంది, బాబాకి సింగిల్ (ఒకేవిధంగా) పూజ జరుగుతుంది. అంటే మీ గౌరవం బాబా కంటే ఎక్కువ అయ్యింది కదా! అంటే ఇంత శ్రేష్టగౌరవం లభించింది. ఎప్పుడైనా హద్దులోని గౌరవం యొక్క విషయం వస్తే పరమాత్మ ద్వారా గౌరవం లభిస్తున్నప్పుడు ఆత్మల యొక్క గౌరవం దేనికి అని ఆలోచించుకోండి. మేము ఇంతగా చేస్తున్నాము కానీ గౌరవం ఇవ్వటం లేదు, అసలు అడగటం లేదు అని ఆలోచించకండి. ఇలా ఆలోచించటం వ్యర్ధం. ఎందుకంటే ఎంతగా మీరు హద్దులోని గౌరవం వెనుక పరుగెడతారో అంతగా ఈ హద్దులోని వస్తువులు ఏవైనా కానీ నీడతో సమానం. నీడను చూసారు కదా. నీడ వెనుక పడితే నీడ దొరుకుతుందా ఇంకా ముందుకి వెళ్ళిపోతుంది? అలాగే ఈ హద్దులోని గౌరవం, పేరు అనేవి నీడలాంటివి. ఇవి మాయ యొక్క ఎండలోనే కనిపిస్తాయి కానీ నిజానికి అది ఉండదు. మీకు పేరు కూడా మీకు లభించింది, గౌరవం కూడా లభించింది మరియు ఎంత మర్యాద లభించింది? ఒక్కొక్క మర్యాదని జ్ఞాపకం చేయండి మరియు మిమ్మల్ని మర్యాదలో కూర్చోపెట్టింది ఎవరు? బాబా కూర్చోపెట్టారు కదా! బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు అన్నింటికంటే గొప్ప మర్యాద ఏమిటి? రాజ్య పదవి కదా! అయితే మీకు సింహాసనం, కిరీటం లభించాయి కదా! పరమాత్మ హృదయ సింహాసనాధికారులు, దీని కంటే గొప్ప మర్యాద ఇంకేముంది?
అప్పుడప్పుడు నిర్ణయం చేయటంలో చిన్న పొరపాటు చేస్తున్నారు. నిజమైన మర్యాద మరియు ఆత్మిక మర్యాద ఎప్పుడూ అవమానం యొక్క అనుభూతి కలగనివ్వదు. అయితే అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? అభిమానం ఉంటుంది కానీ ఇది మర్యాద, ఈ మర్యాదలో ఉండాలి కదా అని భావిస్తున్నారు. మర్యాదలో ఉండటం మంచిదే కానీ అది మర్యాదేనా లేదా అభిమానమా అనేది బాగా పరిశీలన చేసుకోండి. అప్పుడప్పుడు అభిమానాన్ని మర్యాద అనుకుంటున్నారు మరియు నిర్మానంగా కాలేకపోతున్నారు. మీరు మర్యాదగా భావిస్తున్నారు కానీ ఇతరులు దానిని అభిమానంగా భావించి ఏదైనా కొంచెం అనే సరికి అవమానంగా అనిపిస్తుంది.. అభిమానం ఉన్నవారు తొందరగా అవమానాన్ని అనుభవం చేసుకుంటారు. కొద్దిగా ఎవరైనా నవ్వుతూ ఏదైనా అన్నా కూడా అవమానంగా అనిపిస్తుంది. ఇది అభిమానానికి గుర్తు. నేను ఇలాంటి వాడిని, ఇలా అనకూడదు అని అనుకుంటారు అయితే సరైన నిర్ణయం తీసుకోండి. ఆ సమయంలో నిర్ణయంలో లోపం వచ్చేస్తుంది. యదార్థానికి బదులు కల్తి అయిపోతుంది. మరలా దానిని మీరు యదార్థంగా భావిస్తున్నారు. మామూలుగా కూడా అంటారు కదా, వీరు చాలా మంచివారు కానీ వీరు మాట్లాడే పద్ధతి, లేవటం, కూర్చోవటం అభిమానంగా ఉంటాయి అని. ఇది కూడా ఎవరైనా చెప్తే అవమానం యొక్క ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. అందువలన స్వమానం మరియు అభిమానం యొక్క తేడాని కూడా పరిశీలించుకోండి. ఎంత గొప్ప స్వమానం, ఎంత గొప్ప మర్యాద ఇలా బేహద్ పేరు, గౌరవ, మర్యాదలను సదా ప్రత్యక్షంగా ఉంచుకోండి. గుప్తంగా కాదు, ప్రత్యక్షంగా ఉంచుకోండి. ఒక్కొక్కసారి స్మృతిలో సోమరితనం వచ్చినప్పుడు మేము బాబా వాళ్ళమే కదా, ఏం జ్ఞాపకం చేస్తాం..... అంటారు కానీ ప్రత్యక్షసంకల్పం ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం అవుతుంది. అలాగే ధారణలో కూడా సంసిద్ధంగా ఉండండి. సోమరిగా అవ్వదు. ఎందుకంటే సమయం సమీపంగా వస్తుంది, సమయం యొక్క సమీపత ఏమి సూచన ఇస్తుంది? సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి అని. సమయం యొక్క ప్రతిజ్ఞను చూడండి. మీకు ఏ అప్రాప్తి లేదు. మరియు ఏమి ప్రాప్తి లభిస్తుంది? స్థూలంగా చూస్తే ఆరోగ్యం కావాలి, ధనం కావాలి, సంబంధీకులు కావాలి అంటారు, ప్రాప్తిలో ఇవే కోరుకుంటారు కదా! అయితే మీ ఆత్మ ఎంత ఆరోగ్యవంతమైనది? ఆత్మ యొక్క రక్తప్రసరణ ఎక్కువ, తక్కువ ఉంటుందా? ఒక్కొక్కసారి ఉంటుందా? ఉండటం లేదు కదా! సదా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా! ఎందుకంటే అమృతవేళ ప్రతి రోజు బాప్ దాదా “సదా ఆరోగ్యభవ” అనే వరదానం ఇస్తారు. శరీరానికి కర్మలఖాతా ఉండవచ్చు కానీ ఆత్మ సదా ఆరోగ్యం ఉంది కదా! ఆత్మకి ఏ రోగం లేదు కదా? ఆత్మ ఆరోగ్యంగా ఉంది కదా! లేదా? అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుందా?
డబల్ విదేశీయులకి అనారోగ్యం వస్తుందా? కొద్దికొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నారా? డబల్ విదేశీయులు అంటే డబల్ ఆరోగ్య వంతులు. ఇటువంటి డబల్ ఆరోగ్యవంతులని చూసి రోగంతో ఉన్న వారు కూడా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. ఆరోగ్యం యొక్క ప్రాప్తి మీకు ఎంతగా లభించింది! మరియు సంబంధంలో కూడా చూడండి, ప్రపంచంలో వారికైతే కొన్ని సంబంధాలు ఉంటాయి, కొన్ని ఉండవు. ఉన్నా కానీ అప్పుడప్పుడు అవి సమాప్తి కూడా అయిపోతాయి కానీ మీకు సర్వసంబంధాలు ఒకే బాబాతో ఉన్నాయి. ఏ సంబంధం అయినా లోటుగా ఉందా? కేవలం బాబా తండ్రియే కానీ స్నేహితుడు కాదు అనుకోవటం లేదు కదా! సర్వసంబంధాలు బాబాతోనే ఉన్నాయి. బాబాను ఏ సంబంధంతో జ్ఞాపకం చేసినా సదా ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవటానికి బాబా హాజరు ఉంటూరు. బాబాకి ఆలస్యం అవుతుందా! ఒకే సమయంలో అందరితో సంబంధాన్ని నిలుపుకుంటారు. నేను స్నేహితుని సంబంధం కావాలనుకుంటున్నాను కానీ బాబా ఇంకొక సంబంధంతో బిజీగా ఉన్నారు అని అనుకోవటం లేదు కదా? ఏ సెకనులో ఏ సంబంధంతో జ్ఞాపకం చేసినా ఆ సంబంధంతో బాబా బాలక్ సో మాలిక్ పిల్లలూ అలాగే అని హాజరైపోతారు. యజమాని పిలిచినప్పుడు రాకపోవటం అనేది ఎలా జరుగుతుంది. అలాగే సంబంధాలలో కూడా చూడండి - సర్వసంబంధాలు లభించాయా? ఈ అనుభవం ఉందా లేదా కేవలం విన్నారా? అలా లేరు కదా? అవునా లేక కాదా? వెనుక వారు కూడా అవును అంటున్నారా లేక లేదా? వెనుక వారు ముందు కూర్చోవటాన్ని త్యాగం చేశారు కదా! అందువలన బాప్ దాదా కూడా మాటిమాటికి వెనుకకి చూస్తున్నారు.
ఎప్పుడైనా మీ స్థితిని అనుసరించి బిందువు జ్ఞాపకం రాలేదు అనుకోండి, బిందువు సూక్ష్మం కదా, మీ స్థితి బలహీనంగా ఉంది, స్థూలంలో ఉన్నప్పుడు సూక్ష్మ బిందువుని జ్ఞాపకం చేసినా కానీ జ్ఞాపకం రాలేదు, అటువంటి సమయంలో యుద్ధం చేయకండి, బిందువుగా అవ్వాలి, బిందువు రావాలి, రావాలి, రావాలి... అని. ఆ సమయంలో ప్రాప్తిని జ్ఞాపకం చేసుకోండి, సంబంధాలను జ్ఞాపకం చేసుకోండి, సాకార కలయికను జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క రకరకాల విచిత్ర అనుభవాలను జ్ఞాపకం చేసుకోండి. ఇదైతే సహజమే కదా! ఎవరికైనా ఉపన్యాసం చెప్పటం రాలేదు అప్పుడు వారు నేను ఉపన్యాసం చెప్పే విధంగా తయరుకాలేదు అనుకుంటారు. కానీ అన్నింటికంటే మంచి ఉపన్యాసం, అనుభవం వినిపించటం. ఇది అందరికి వస్తుంది కదా, లేదా? దీనికోసం ఏమైనా తయారవ్వాలా? ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదు? అని. అనుభవం యొక్క రూపంతో చెప్పండి అప్పుడు నెంబర్ వన్ అయిపోతారు. మీరు చేసుకున్న రకరకాల అనుభవాలను పంచి పెడుతూ వెళ్తే పెరుగుతూ ఉంటాయి. ఉపన్యాసం చెప్పటం అయితే అందరికీ వస్తుంది, 5 సంవత్సరాల పిల్లవానికి కూడా వస్తుంది. అందువలన యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఇదే ఉండాలి అని అనుకోకూడదు. ఏదోక విధితో వ్యర్థాన్ని సమాప్తి చేయండి మరియు సమర్థతను ప్రత్యక్షంలోకి తీసుకురండి. యుద్ధం చేస్తూ చేస్తూ ఏమి అవుతుంది? బలహీనత అనేది సంస్కారంగా అయిపోతుంది మరలా నాకు ఇది అవ్వటం లేదు, బాబా వికర్మలు వినాశనం చేయండి అంటున్నారు కానీ అది జరగటం లేదు అని. వికర్మలు వినాశనం అవ్వకపోతే సుకర్మలను తయారుచేసుకోండి అంతేకానీ వ్యర్ధంలో సమయం పోగొట్టుకోకండి. ఎంతెంతగా శ్రేష్ట కర్మల యొక్క ఖాతా పెరుగుతూ ఉంటుందో అంతంతగా వికర్మల యొక్క ఖాతా సమాప్తి అయిపోతుంది. అందువలన సమయాన్ని పోగొట్టుకోకండి. అన్నింటికంటే విలువైనది సమయం ఎందుకంటే ఈ సమయానికే మహిమ ఉంది, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అని. ఒకొక్క సెకను ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. కనుక సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తూ, తిరుగుతూ, దారిలో నడుస్తూ, రెండు విషయాలు విన్నాను, రెండు విషయాలు చేసాను అంటున్నారు అంటే దీనిలో కూడా సమయం వ్యర్ధంగా పోతుంది. ఎంతగా సమయాన్ని పోగొట్టుకుంటారో అంతగా వ్యర్థ సంస్కారం పక్కా అయిపోతుంది. ఏదైనా పెద్ద విషయం ఉంటే దానిని చిన్నది చేయండి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా - వ్యర్ధ విషయాల యొక్క వర్ణన చాలా పెద్దదిగా ఉంటుంది. వ్యర్థం నుండి రక్షించుకోండి. నేను ఏమీ చేయలేదు, వినలేదు, మాట్లాడలేదు కానీ నడుస్తూ, నడుస్తూ రెండు మాటలు నేను వారితో మాట్లాడాను, రెండు మాటలు నేను వారితో మాట్లాడాను అంటున్నారు. కానీ వ్యర్ధ ఖాతా జమ అయిపోతుంది. వినటం ద్వారా కూడా వ్యర్ధం జమ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా మీకు విన్పించినా దానిని కూడా తక్కువ చేయండి వారికి కూడా నేర్పించండి. ఇదే శుద్దసేవ మరియు దయ చూపించటం, దయా హృదయులు కదా!
నలువైపుల ఉన్న సదా సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మలకి, సదా సంతుష్టంగా, సదా ప్రసన్న చిత్తులుగా ఉండే శ్రేష్టాత్మలకు, సదా స్వయాన్ని శ్రేష్ట పేరు, గౌరవ, మర్యాదలకి అధికారిగా అనుభవం చేసుకునే సమీపాత్మలకు, సదా సర్వులకు సంతుష్టత యొక్క తరంగాల యొక్క ప్రకాశాన్ని, శక్తిని ఇచ్చే ప్రసన్నచిత్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment