15-02-2007 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సోమరితనం, నిర్లక్ష్యం మరియు సాకులు చెప్పే నిద్ర నుండి మేల్కొవటమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ.
ఈరోజు బాప్ దాదా విశేషంగా నలువైపుల ఉన్న అతి గారాభ, అతి ప్రియమైన మరియు పరమాత్మ ప్రేమకి పాత్రులైన పిల్లలను కలుసుకునేటందుకు మరియు విచిత్రుడైన తండ్రి పిల్లల యొక్క జన్మదినాన్ని జరుపుకునేటందుకు వచ్చారు. మీరందరు కూడా ఈ రోజు విచిత్ర జన్మదినోత్సవానికి వచ్చారు కదా! ఇటువంటి జన్మదినం కల్పమంతటిలో ఎవరికీ ఉండదు. తండ్రి మరియు పిల్లలు ఒకే రోజున జన్మించటం అనేది ఎప్పుడూ విని కూడా ఉండరు. మీరందరు తండ్రి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారా లేక పిల్లల యొక్క జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకునేటందుకు వచ్చారా? ఎందుకంటే కల్పమంతటిలో పరమాత్మ తండ్రి మరియు పిల్లల యొక్క ప్రేమ ఎంత అనంతమైనది అంటే జన్మ కూడా వెనువెంటనే తీసుకుంటారు. తండ్రి ఒక్కరే విశ్వపరివర్తనా కార్యాన్ని చేయరు, పిల్లలతో పాటు చేస్తారు. అలౌకికంగా ఇలా వెంట ఉండే ప్రేమ, తోడుగా అయ్యే ప్రేమ ఈ సంగమయుగంలోనే అనుభవం చేసుకుంటారు. తండ్రి మరియు పిల్లల ప్రేమ ఇంత లోతైనది. జన్మ కూడా కలిసే మరియు ఉన్నది కూడా ఎలా? ఒంటరిగా ఉన్నారా లేక కలిసే ఉన్నారా? మేము బాబాతో కంబైండ్ గా ఉన్నాము అని ప్రతి ఒక్క బిడ్డ ఉత్సాహ ఉల్లాసాలతో చెప్తారు. కలిసే ఉంటున్నారు కదా? ఒంటరిగా ఉండటం లేదు కదా? కలిసి జన్మించారు మరియు కలిసి ఉంటున్నారు ఇక ముందు కూడా ఎలా ఉంటారు? ప్రతిజ్ఞ ఏమిటి? వెంట ఉన్నాము, వెంటే ఉంటాము మరియు మధుర ఇంటికి కూడా వెంటే కలిసి వెళ్తాం. ఇంత ప్రేమ ఇతర ఏ తండ్రి పిల్లలకి అయినా ఉంటుందా? ఏ బిడ్డ అయినా ఎక్కడ ఉన్నా, ఏవిధంగా ఉన్నా కానీ వెంటే ఉన్నారు మరియు వెంటే వెళ్తారు. ఇటువంటి విచిత్రమైన ప్రియాతి ప్రియమైన జన్మదినోత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారు. సన్ముఖంగా జరుపుకుంటున్నా లేక దేశ విదేశాలలో నలువైపుల ఉన్న వారందరు ఒకే సమయంలో వెనువెంట జరుపుకుంటున్నారు.
బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలందరు ఉత్సాహ ఉల్లాసాలతో, మనస్సుతో ఓహో బాబా ఓహో! ఓహో జన్మదిన్సోవం ఓహో!! అని ఎలా పాటలు పాడుకుంటున్నారో అని చూస్తున్నారు. స్విచ్ ఆన్ చేయగానే నలువైపుల ఉన్న ధ్వని, మనస్సు యొక్క ధ్వని, ఉత్సాహ ఉల్లాసాల యొక్క ధ్వని బాప్ దాదా యొక్క చెవులకి వినిపిస్తూ ఉన్నాయి. బాప్ దాదా పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి పిల్లలకు కూడా తమ దివ్య జన్మ యొక్క కోటాను కోటా సుకోట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. వాస్తవానికి ఉత్సవం అంటేనే ఉత్సాహ ఉల్లాసాలతో ఉండటం. కనుక మీరందరు ఉత్సాహంతో ఈ ఉత్సావాన్ని జరుపుకుంటున్నారు. భక్తులు పేరు కూడా శివరాత్రి అని పెట్టారు. ఈరోజు బాప్ దాదా భక్తాత్మలకి కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరు ఈ విచిత్ర జన్మదినోత్సవాన్ని జ్ఞానం మరియు ప్రేమ రూపంలో జరుపుకుంటారు, భక్తాత్మలు భావన మరియు శ్రద్ధ రూపంలో జరుపుకోవటంలో మిమ్మల్నే మంచిగా కాఫీ చేసారు. అలా అనుసరించటంలో మంచి పాత్ర అభినయించారు అని బాప్ దాదా పిల్లలకి కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. చూడండి! ప్రతీ విషయాన్ని కాపీ చేశారు. కాపీ చేయడానికి కూడా తెలివి కావాలి కదా! ముఖ్యంగా ఈరోజు భక్తులు వ్రతం పెట్టుకుంటారు, ఆహారపానీయాల విషయంలో వ్రతం పెట్టుకుంటారు, వృత్తిని శ్రేష్ఠంగా చేసుకునేటందుకు భావనలో వ్రతం పెట్టుకుంటారు. వారు ప్రతి సంవత్సరం వ్రతం చేయవలసి ఉంటుంది, కానీ మీరు ఏ వ్రతం తీసుకున్నారు? ఒకేసారి వ్రతం తీసుకున్నారు, ఇక సంవత్సర సంవత్సరం తీసుకోవలసిన పని లేదు. పవిత్రత యొక్క వ్రతాన్ని ఒకేసారి తీసుకున్నారు. అందరు పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు, పక్కాగా తీసుకున్నారా? పక్కాగా తీసుకున్నాం అనేవారు చేతులెత్తండి. పక్కాయేనా? కొంచెం కూడా పచ్చిగా లేరు కదా? పక్కాయేనా? మంచిది. వ్రతం తీసుకున్నారు మంచిది, దానికి శుభాకాంక్షలు మరొక ప్రశ్న ఏమిటంటే అపవిత్రతకి ముఖ్య సహయోగులు అయిదుగురు, మరి అయిదింటి యొక్క వ్రతం తీసుకున్నారా? లేక రెండింటి యొక్క లేదా మూడింటి వ్రతం తీసుకున్నారా? ఎందుకంటే అంశమాత్రంగా అయినా అపవిత్రత ఉండే వారిని సంపూర్ణ పవిత్ర ఆత్మ అని అంటారా? బ్రాహ్మణాత్మలైన మీకు పవిత్రత అనేది మీ జన్మ యొక్క ఆస్తి, వ్యక్తిత్వం మరియు ఠీవి. కనుక పరిశీలించుకోండి - ముఖ్య పవిత్రతపై ధ్యాస ఉంది కానీ మిగిలిన సహయోగుల విషయంలో తేలికగా వదిలివేయలేదు కదా? పెద్దవాటిని సరి చేసుకుని చిన్న వాటిపై ప్రేమ ఉంచుకున్నారా? మిగిలిన నాల్గింటి గురించి బాబా మీకు ఆవకాశం ఇచ్చారా? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, బ్రహ్మాచారిగా కూడా అవ్వాలి. పవిత్రత యొక్క వ్రతాన్ని పాలన చేశారు. కానీ ఆత్మిక సంభాషణలో కొంతమంది పిల్లలు చెప్తున్నారు - చాలా మధురాతి మధుర విషయాలు చెప్తున్నారు. ఆత్మిక సంభాషణ అందరు చేస్తున్నారు కదా? బాబా ముఖ్యమైన విషయం అయితే బాగానే ఉంది కానీ చిన్న చిన్నవి అప్పుడప్పుడు మనస్సులో వస్తున్నాయి అంటున్నారు. వాచాలోకి రావటం లేదు, మనస్సులోకి వస్తున్నాయి, మనస్సుని అయితే ఎవరూ చూడరు కదా! చిన్న చిన్న పిల్లలతో ప్రేమ ఉంటుంది కదా అలాగే ఈ నాల్గింటితో ప్రేమ ఉంటుంది అంటున్నారు. క్రోధం వచ్చేస్తుంది లేదా మోహం వచ్చేస్తుంది, కావాలనుకోవటం లేదు కానీ వచ్చేస్తున్నాయి. కానీ బాప్ దాదా అంటున్నారు - ఎవరైనా కానీ మీరు తలుపు తెరిస్తేనే కదా రాగలిగేది. అదేవిధంగా బలహీనత యొక్క తలుపు తెరుస్తున్నారు. బలహీనత యొక్క ద్వారాన్ని తెరవటం అంటే వాటిని ఆహ్వానించటం. మరి ద్వారాన్ని ఎందుకు తెరుస్తున్నారు? ఈ రోజు తండ్రి యొక్క మరియు మీ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కానీ జన్మిస్తూనే వ్రతం గురించి ప్రతిజ్ఞ చేశారు. మొట్టమొదటి వరదానం బాప్ దాదా ఏమి ఇచ్చారో జ్ఞాపకం ఉందా? జన్మదినోత్సవం యొక్క వరదానం జ్ఞాపకం ఉందా? ఏ వరదానం ఇచ్చారు? పవిత్ర భవ! యోగి భవ! వరదానం అందరికీ జ్ఞాపకం ఉంది కదా? గుర్తు ఉందా, మర్చిపోలేదు కదా? పవిత్ర భవ అనే వరదానం కేవలం ఒక్కదాని గురించి కాదు, అయిదింటి గురించి ఇచ్చారు. కనుక ఈరోజు బాబా ఏమి కోరుకుంటున్నారు? జన్మదినోత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారు తండ్రి యొక్క జన్మదినోత్సవం జన్మదినోత్సవ కానుక ఏదైనా తీసుకువచ్చారా లేక ఖాళీ చేతులతో వచ్చారా? స్థాపన యొక్క 70 సం||లు సమాప్తి అవుతున్నాయి, గుర్తు ఉంది కదా! మీరు తర్వాత వచ్చినా కానీ స్థాపన యొక్క 70 సం||లు పూర్తి అయినవి. మీరు ఇప్పుడే వచ్చినా కానీ స్థాపన యొక్క కర్తవ్యంలో మీరందరు సహయోగులు కదా? సహయోగులే కదా! ఈరోజే మొదటిసారిగా వచ్చినా కానీ, మొదటిసారిగా వచ్చిన వారందరు చేతులెత్తండి? మొదటిసారిగా మధువనానికి వచ్చిన వారు చేతులెత్తండి. బాగా పైకి ఎత్తండి. మంచిది, మీరందరు వచ్చి ఒక సంవత్సరం అయినా లేక రెండు సంవత్సరాలు అయినా కానీ మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటున్నారు? బ్రహ్మాకుమారి లేదా బ్రహ్మాకుమారులు అనేనా లేక పురుషార్థ కుమారీ కుమారులు అనా? ఏమని పిలిపించుకుంటున్నారు? ఏవరైనా కానీ పురుషార్థి కుమారులుగా పిలిపించుకుంటున్నారా? బ్రహ్మాకుమార్ అని సంతకం పెడతారు కదా! అందరు బి.కె. (బ్రహ్మాకుమార్) అని వ్రాస్తారా లేక పి.కె. (పురుషార్థి కుమార్) అని వ్రాస్తారా? ప్రతిజ్ఞ ఏమిటి? వెంటే ఉంటాము, వెంటే వెళ్తాము, కంబైండ్ గా ఉంటాము అని. మరి అయితే కంబైండ్ గా ఉండాలంటే సమానత కావాలి కదా!
ఈనాటి 70 సం||ల ఉత్సవం జరుపుకుంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ జోన్ వారు 70 సం||ల ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాప్ దాదా చూశారు. సన్మాన సమారోహాలు జరుపుకుంటున్నారు. అందరు జరుపుకుంటున్నారు కదా? చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ ఈ రోజు జన్మదినోత్సవం ఒకటి మరియు 70 సం||ల సమాప్తి అవ్వటం మరొకటి. మరి జరుపుకునేటందుకు వచ్చారు కదా! పక్కాయేనా? మరి ఏమి ఇస్తారు? ట్రీ ఇస్తారా, శాలువా ఇస్తారా? ఏమి బహుమతి ఇస్తారు? వెండి గ్లాసు ఇస్తారా? తన ఆశాదీపాలైన పిల్లల పట్ల బాప్ దాదా యొక్క ఈనాటి శుభ ఆశ ఏమిటంటే, చెప్పమంటారా? మొదటి వరుసలోని వారు చెప్పండి, చెప్పమంటారా? చెప్పటం మరియు వినటం అంటే ఏమిటి? చెవితో వినాలి మరియు మనస్సులో నింపుకోవాలి, సరేనా? విని వదిలేయరు కదా! మనస్సులో నింపుకుంటారు కదా! ఈనాటి ఆశ ఏమిటో చెప్పమంటారా, మొదటి వరుసలోని వారు చెప్పండి, చేతులూపండి! టీచర్స్ చేతులూపండి! జెండా ఊపుతున్నారు, మంచిది. డబల్ విదేశీయులూ! చెప్పమంటారా? మీరు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. అప్పుడే చెప్పమని చెప్పండి, మామూలుగా చెప్పమని అనడం కాదు. ఈ 70 సంవత్సరాలు బాప్ దాదా సోమరితనం, నిర్లక్ష్యం మరియు సాకులు చెప్పే ఆటను చూశారు. పోనీ 70సం||లు కాకపోతే 50,40,30,20 సం||లు అనుకోండి. కానీ ఇంత సమయం పిల్లల యొక్క ఈ మూడింటి ఆట బాగా చూశారు బాప్ దాదా.
ఈరోజు భక్తులు జాగరణ చేస్తారు, నిద్రపోరు. మరి పిల్లలైన మీరు ఏ జాగరణ చేస్తారు? ఘడియ ఘడియకి ఏ నిద్రలో నిద్రపోతున్నారు? సోమరితనం, నిర్లక్ష్యం మరియు సాకులు చెప్పే నిద్రలో విశ్రాంతిగా నిద్రపోతున్నారు. కనుక బాప్ దాదా ఈ మూడు విషయాల యొక్క జాగరణ చెప్తున్నారు. ఎప్పుడైనా క్రోధం వచ్చింది, అభిమానం వచ్చింది, లోభం వస్తుంది అంటే కారణం ఏమి చెప్తారు? బాప్ దాదాకి ట్రేడ్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. ఏ విషయం జరిగినా ఏమంటారు? ఇది అయితే ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇది ఇలా అవుతూనే ఉంటుంది, ఇదేమైన కొత్త విషయమా! అంటారు. ఇది ఏమిటి? సోమరితనం కాదా? వారు ఇలా చేశారు, కనుక ఇలా అయ్యింది అని క్రోధం గురించి ఎక్కువ మంది అంటారు నేను తప్పుచేశాను అని అనరు. ఇలా అయ్యింది. అందువలనే అలా అయ్యింది అంటారు. ఇతరులపై దోషం పెట్టడం చాలా సహజం. వీరు చేయకపోతే ఇలా జరగదు అంటారు. అంతే కానీ బాబా యొక్క శ్రీమతానుసారంగా క్రోధాన్ని సమాప్తి చేసుకోలేరా? క్రోధం యొక్క సంతానం ఆవేశం. ఆవేశం కూడా రకరకాలుగా ఉంటుంది. మరి ఈరోజు నాలిగింటి గురించి వ్రతం తీసుకుంటారా? మొదటి విషయం గురించి మెజారిటీ ధృఢ సంకల్పం చేశారు, అదేవిధంగా నాలిగింటి గురించి చేయగలరా? వీరు ఇలా చేశారు కనుకనే నేడు ఇలా చేయవలసి వచ్చింది అని సాకులు చెప్పకండి. బాబా మాటిమాటికి చెప్తుంటే అది జ్ఞాపకం ఉండదు, వారు చేసింది మాత్రం జ్ఞాపకం వచ్చేస్తుంది, ఇది సాకులు చెప్పే ఆట కాదా? కనుక ఈరోజు బాప్ దాదా ఈ మూడు విషయాలను బహుమతిగా ఇవ్వమని చెప్తున్నారు. అప్పుడు నాలుగు వికారాల నుంచి కూడా ముక్తులవుతారు. సంస్కారాలను అయితే ఎదుర్కోవలసి ఉంటుంది. అది ఒక పరీక్ష. ఒక జన్మ యొక్క చదువు ద్వారా కల్పమంతటి ప్రాప్తి. అర్థకల్పం రాజ్యభాగ్యం అర్థకల్పం పూజ్యులుగా అవుతారు. ఒక్క జన్మలోనే కల్పమంతటి ప్రాప్తి, ఆ జన్మ కూడా చిన్నది. జన్మ అంతా కూడా కాదు, జన్మలో కొంచెం సమయం ద్వారా కల్పమంతటికి ప్రాప్తి. మరి ధైర్యం ఉందా? తప్పక ధైర్యం పెట్టుకుంటాం అనేవారు చెతులెత్తండి. పురుషార్థం చేస్తాం, ధ్యాస పెట్టుకుంటాం ...ఇలా చేస్తాము, చూస్తాము ము, ము అనకండి. మీరు చిన్నపిల్లలు కాదు. 70సం||లు పూర్తి కావస్తున్నాయి. మూడు, నాలుగు నెలల పిల్లలము, మూ అంటుంటారు. మీరు బాబాకి సహయోగులు, విశ్వకళ్యాణకారులు, 70||సం||లు పూర్తి అవుతున్నాయి. బాప్ దాదా చేతులు ఎత్తమని చెప్పడం లేదు, ఎందుకంటే బాప్ దాదా చూశారు. చేతులు ఎత్తి కూడా అప్పుడప్పుడు సోమరిగా అయిపోతున్నారు. ఏమైపోయినా కానీ పర్వతం లాంటి పరీక్ష వచ్చినా కానీ పర్వతాన్ని కూడా దూదిగా చేసుకుంటాం అనే దృఢసంకల్పం చేసేవారు ఎవరు? ఎందుకంటే సంకల్పం చాలా బాగా చేస్తున్నారు. దాని గురించి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. కానీ ఏమిటంటే 70 సం||లు తేలికగా వదిలేశాను. కానీ ప్రస్తుతం సమయంపై ఎటువంటి నమ్మకం లేదు. జ్ఞానం ఆధారంగా పురుషార్థం యొక్క ప్రతీ విషయంలో చాలా కాలం యొక్క లెక్క ఉండాలి. ఇప్పుడిప్పుడే చేసేస్తాం అనకండి, చాలా సమయం యొక్క లెక్క ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ప్రాప్తిని కోరుకుంటారు? రాముడు, సీతగా ఎవరైనా అవుతారా? ఇప్పుడు చేతుల ఎత్తండి. రాముడు, సీతగా అవ్వాలనుకునేవారు చేతులెత్తండి! రాజ్యం లభిస్తుంది. ఎవరో చేతులు ఎత్తుతున్నారు. సీతారాములుగా అవుతారా, లక్ష్మి నారాయణులుగా అవ్వరా? చేతులు ఎత్తుతున్నారా? చూడండి, మీరు చూడండి, ఎత్తుతున్నారా? విదేశీయులు చేతులెత్తారా? డబల్ విదేశీయులలో ఎవరైనా ఎత్తుతున్నారా? ప్రాప్తి అయితే చాలా కాలం కావాలనుకుంటున్నారు. లక్ష్మీనారాయణులుగా అవ్వటం అంటే చాలాకాలం యొక్క రాజ్య భాగ్యం పొందటం. చాలాకాలం యొక్క ప్రాప్తి కావలసినప్పుడు ప్రతి విషయం చాలాకాలం కావాలి కదా! 63 జన్మల చాలాకాలం యొక్క సంస్కారం అయితే ఇది మా భావం లేదా భావన కాదు, 63 జన్మల సంస్కారం అని అంటారు కదా! చాలాకాలం యొక్క లెక్క అయ్యింది కదా! అందువలన బాప్ దాదా కూడా కోరుకునేది ఏమిటంటే సంకల్పంలో ధృడత లోపంగా ఉంది. అయిపోతుంది.... నడుస్తున్నాం, నడవనివ్వండి, ఎవరు తయారయ్యారు అంటున్నారు. మరొక మంచి విషయం కూడా అంటున్నారు, ఆ విషయాలను బాప్ దాదా నోట్ చేసుకున్నారు. తమలో ధైర్యం లేక మహారథీలే అలా చేస్తున్నారు, ఇక మేం చేస్తే మహారథులు పొరపాటు చేశారో ఆ సమయంలో వారు మహారథీయా? మహారథీ అనే పేరుని ఎందుకు పాడు చేస్తారు? ఆ సమయంలో వారు మహారథీ కానే కాదు. మహారథీలే అలా చేస్తున్నారు అని స్వయాన్ని బలహీనం చేసుకోవటం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం. ఇతరులను చూడటం సహజం కానీ స్వయాన్ని చూసుకునేటందుకు కొంచెం ధైర్యం కావాలి.
ఈరోజు బాప్ దాదా లెక్క చూడడానికి వచ్చారు. కానీ లెక్కల ఖాతా పుస్తకాన్ని సమాప్తి చేసే బహుమతి తీసుకునేటందుకు వచ్చారు. బలహీనత మరియు సాకులు చెప్పే ఖాతా పుస్తకం చాలా పెద్దది, దానిని సమాప్తి చేయాలి. మేము చేసి చూపిస్తాం, చేయాల్సిందే, వంగవలసిందే, మారవలసిందే అని పరివర్తనా మహోత్సవాన్ని జరుపుకోవలసిందే అని సంకల్పం చేసేవారు చేతులెత్తండి. ధృడంగానా లేక తప్పించుకోవడానికా? తప్పించుకోవడానికి చేసే సంకల్పం కూడా ఉంటుంది మరియు ధృడ సంకల్పం కూడా ఉంటుంది. అయితే మీరందరు ధృడంగా చేశారా? ధృడంగా ఎత్తారా? మధువనం వారు చేయి పెద్దగా ఎత్తండి. కొద్దిగా కాదు. ఇక్కడ మధువనం వారు కూర్చుంటారు. చాలా సమీపంగా కూర్చునే అవకాశం వారికి ఉంది. మధువనం వారు ఎదురుగానే కూర్చున్నారు. మొదటి సీట్స్ మధువనం వారికి లభిస్తాయి, బాప్ దాదాకి సంతోషం. ముందు కూర్చున్నారు కనుక ముందే ఉండాలి. ఈ రోజు బహుమతి పెద్దది అయిపోయింది కదా! బాప్ దాదాకి కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు ఒకొక్కరు ఒకరు కాదు, మీ ఒకరి వెనుక మీ రాజధానిలో మీ ఉన్నత కుటుంబం, మీ ఉన్నత ప్రజలు, ద్వాపరయుగం నుండి వచ్చే మీ భక్తులు, సతో, రజో, తమో మూడు రకాలైన భక్తులు ఇలా మీ వెనుక చాలా పెద్ద వరుస ఉంది. మీరు ఏది చేస్తారో మీ వెనుక వారు అదే చేస్తారు. మీరు సాకులు చెప్తుంటే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు. ఇప్పుడు మీ బ్రాహ్మణ పరివారంలో కూడా మిమ్మల్ని చూసి వ్యతిరేక విషయాలను అనుసరించటంలో తెలివైనవారిగా ఉంటారు కదా! కనుక ఇప్పుడు ధృడ సంకల్పం చేయండి - సంస్కారాల ఘర్షణ ఉన్నా, స్వభావాలలో అభిప్రాయబేధం ఉన్నా, బలహీనత ఉన్నా కానీ అంటే ఎవరైనా ఎవరిపై అయినా అసత్య విషయం చెప్తే చాలా కోపం వస్తుంది మాకు అని కొందరు పిల్లలు అంటున్నారు. కానీ మీరు సత్యమైన తండ్రితో పరిశీలన చేయించారు, సత్యమైన బాబా మీ తోడుగా ఉన్నారు కనుక మొత్తం ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నారు, మీ వైపు ఒకే బాబా ఉన్నారు అయినా కానీ మీకు విజయం నిశ్చితం అయి ఉంది. ఎవరూ మిమ్మల్ని కదపలేరు. ఎందుకంటే బాబా మీ తోడుగా ఉన్నారు. అసత్యం అని అంటున్నారు. అసత్యాన్ని అసత్యం చేయండి, పెంచుతారు ఎందుకు? ఈరోజు బాబాకి సాకులు చెప్పటం ఇష్టమనిపించటం లేదు. ఇది ఇలా అయ్యింది, అలా అయ్యింది, అది అయ్యింది, ఇది అయ్యింది .... ఈ పాటలు సమాప్తి అవ్వాలి. మంచిగా అయ్యింది, మంచిగా అవుతుంది, మంచిగా ఉంటారు, అందరినీ మంచిగా చేస్తారు. మంచిది, మంచిది, మంచిది అనే పాట పాడండి. ఇష్టమేనా? సరేనా? సాకులన్నింటినీ సమాప్తి చేస్తారా? చేస్తారా? రెండు చేతులు ఎత్తండి! మంచిది, మంచిది, బాగా ఊపండి. చూసేవారు కూడా చేతులూపుతున్నారు. మంచిది. ఎక్కడి నుండి చూస్తున్నా కానీ చేతులూపండి. మంచిది, దించేయండి. ఇప్పుడు మీ పరివర్తన యొక్క చప్పట్లు కొట్టండి. మంచిది. ఈరోజు, ఈ సమయం, ఈ సంఘటన యొక్క చిత్రాన్ని మీ ఎదురుగా ఉంచుకోండి. ఎప్పుడైనా బలహీనత వచ్చినా కానీ రానివ్వకండి. ద్వారాన్ని మూసేయండి. ద్వారం ఏమిటో తెలుసు కదా! మూసేయండి. రెండు తాళాలు వేసి గట్టిగా మూసేయండి. ఈరోజుల్లో ఒక తాళం పని చేయదు. ఒకటి స్మృతి అనే తాళం, మరొకటి మనస్సుని సేవలో బిజీగా ఉంటే తాళం సర్వశక్తివంతమైన ఈ రెండు తాళాలను వేసేయండి. గాడ్రేజ్ తాళం కాదు, గాడ్లీ (ఈశ్వరీయ) తాళం వేసేయండి. జాగరణ మరియు వ్రతాన్ని పక్కాగా చేయాలి.
బాప్ దాదాకి అయితే ప్రతి బిడ్డపై అతి ప్రేమ ఉంటుంది. చివరి నెంబరు అయినా కానీ బాప్ దాదా ఆ బిడ్డపై కూడా అతి ప్రేమ ఉంటుంది. ఎందుకు? ఇటువంటి పిల్లలు ఏ తండ్రి అయినా దొరుకుతారా? బాప్ దాదా ఒక్కరికే బ్రాహ్మణ పిల్లలు లభిస్తారు. మహాత్మలైనా మహామండలేశ్వరులైనా, ధర్మపిత అయినా ఎవరికి అయినా ఇటువంటి పిల్లలు ఉన్నారా? ప్రతి బిడ్డ నా బాబా అంటారు. చరిత్రలో అటువంటి తండ్రి ఎవరైనా ఉన్నారా? అందువలన బాప్ దాదాకి ప్రతి బిడ్డ యొక్క గొప్పతనం తెలుసు. ఓహో బాబా ఓహో! అని పిల్లలు పాటలు పాడుకుంటారు, మీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఓహో పిల్లలూ ఓహో అని బాబా పాడుకుంటారు. సరేనా! ఓహో ఓహో!! కదా. మధువనం వారు ఓహోహో పిల్లలు కదా. వెనుక ఉన్న వారు కూడా ఓహో ఓహో పిల్లలే కదా! మంచిది.
ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ధృడ సంకల్ప స్వరూపంలో కూర్చోండి. సోమరితనం, నిర్లక్ష్యం, సాకులు చెప్పటాన్ని ప్రతి సమయం ధృడ సంకల్పం ద్వారా సమాప్తి చేసుకుని చాలాకాలం యొక్క లెక్కను జమ చేసుకోవాలి. ఏమైనా కానీ ఏదీ చూడకూడదు బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వవలసిందే మరియు విశ్వ సింహాసనాధికారిగా అవ్వవలసిందే. ఈ ధృడ సంకల్పం స్వరూపంలో అందరు కూర్చోండి. మంచిది.
నలువైపుల ఉన్న సదా ఉత్సాహ ఉల్లాసాల యొక్క అనుభవంలో ఉండేవారికి, సదా సఫలతకి తాళంచెవి అయిన ధృడతను కార్యంలో ఉపయోగించే వారికి, సదా బాబాని తోడుగా మరియు ప్రతి కార్యంలో తోడుగా ఉంచుకొనే వారికి, సదా ఒకే పేరుని ప్రసిద్ధం చేసేవారికి మరియు ఏకానమిగా ఉండే వారికి, ఏకాగ్రత స్వరూపంలో సదా మున్ముందుకి ఎగురుతూ ఉండేవారికి, బాప్ దాదా యొక్క అతి ప్రియ, గారాభ విశేష పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
బాప్ దాదా డైమండ్ హాల్ యొక్క వేదికపై స్వహస్తాలతో శివజెండా ఎగురవేశారు మరియు సర్వులకి శుభాకాంక్షలు తెలిపారు:- అందరు చాలా ప్రేమతో తండ్రి యొక్క జన్మదినోత్సవాన్ని మరియు తమ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. దానికి కోటానుకోట్ల, కోటానుకోట్ల, కోటానుకోట్ల శుభాకాంక్షలు మరియు స్వాగతం. చిహ్నరూపంగా ఈ జెండాను ఎగురవేశారు మరియు పూలవర్షం కురిసింది. అదేవిధంగా ప్రతి ఆత్మ మనస్సులో బాబా స్మృతి అనే జెండాను ఎగురవేయండి. మీ మనస్సు అయితే ఎగురవేయబడే ఉంది కానీ ఇప్పుడు సర్వుల మనస్సులో బాబా యొక్క అనగా స్మృతి జెండాను ఎగురవేయండి అప్పుడు విశ్వమంతా నందనవనం అయిపోతుంది. ముళ్ళ అడవి సమాప్తి అయిపోయి నందనవనం అయిపో తుంది. చేయాల్సిందే మరియు జరగవలసిందే, జరగవలసే ఉంది కానీ కేవలం నిమిత్తం అవ్వాలి అంతే ఈ సంకల్పాన్ని హృదయంలో పెట్టుకోండి. మంచిది.
Comments
Post a Comment